వరుసగా ఎనిమిదోసారీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాలను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు బుధవారం కూడా లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన చేపట్టడంతో సభ సజావుగా లేదంటూ స్పీకర్ అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అనుమ తి ఇవ్వలేదు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సభాపతి ఈ అవిశ్వాస తీర్మానాలను ప్రస్తావించారు.