breaking news
Yash Thakur
-
భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..!
ఇరానీ కప్ 2025 (Irani Cup 2025) చివరి రోజు (అక్టోబర్ 5) హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ దశలో ఇరువురు కొట్టుకున్నంత పని చేశారు. ఈ ఘర్షణ గతంలో (2013) గంభీర్-కోహ్లి (Gambhir-Kohli) మధ్య జరిగిన ఫైట్‌ను గుర్తు చేసింది. తాజా ఘటన సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.పూర్తి వివరాల్లో వెళితే.. రంజీ ఛాంపియన్ విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు ఇరానీ కప్ 2025 కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచి గ్రాండ్ డబుల్ (రంజీ, ఇరానీ ట్రోఫీలు) సాధించింది.అయితే ఆట చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్ యశ్ ధుల్ (Yash Dhull), విదర్భ బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) గొడవపడ్డారు. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మ్యాచ్ 63వ ఓవర్లో యశ్ ఠాకూర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని యశ్ ధుల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, అథర్వ తైడే అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. ఆ సమయానికి ధుల్ 92 పరుగుల వద్ద ఆడుతూ మ్యాచ్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. సెంచరీ ముందు ఔట్ కావడమే కాకుండా తన జట్టును గట్టెక్కించలేకపోయానన్న బాధలో ధుల్ ఉండగా.. యశ్ ఠాకూర్ అత్యుత్సాహంతో సంబురాలు చేసుకున్నాడు.ఈ క్రమంలో యశ్ ఠాకూర్ ధుల్‌ను ఉద్దేశిస్తూ ఏదో అన్నాడు. అప్పటికే ఔటైన అసహనంలో ఉన్న ధుల్ యశ్ ఠాకూర్పైకి తిరగబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. ధుల్, ఠాకూర్ ఒకరిపైకి ఒకరు దూసుకుపోయారు. అంపైర్లు అడ్డుపడకుంటే ఖచ్చితంగా కొట్టుకునే వారు. అంతిమంగా అంపైర్లు, సహచరులు వారించడంతో ఇరువురు తగ్గారు. దీంతో గొడవ సద్దుమణిగింది.pic.twitter.com/LwuqQrd4IA— Nihari Korma (@NihariVsKorma) October 5, 2025ధుల్ ఔటయ్యాక లయ తప్పిన రెస్ట్ ఆఫ్ ఇండియా 30 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ధుల్‌కు చేదోడుగా ఉండిన మానవ్ సుతార్ అర్ద సెంచరీ పూర్తి చేసి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసి విదర్భ గెలుపుకు ప్రధాన కారకుడైన అథర్వ తైడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
224 పరుగుల ఆధిక్యంలో...
నాగ్‌పూర్ వేదికగా ఇరానీ కప్ (Irani Cup 2025) మ్యాచ్‌పై విదర్భ జట్టు పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India)తో జరుగుతున్న ఈ పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. సెంచరీ హీరో ఈసారి ఫెయిల్దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఇరానీ కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అథర్వ తైడె (15), అమన్ (37) అవుట్ కాగా... ధ్రువ్ షోరె (Dhruv Shorey- 60 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్), దానిశ్ మాలేవర్ (37 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. లక్ష్యం ఎంతో?రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మూడో రోజు కూడా ఆటకు ఆటంకం వాటిల్లింది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... 8 వికెట్లు చేతిలో ఉన్న విదర్భ జట్టు... ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. అంతకుముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 69.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రజత్ పాటీదార్ (125 బంతుల్లో 66; 10 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (112 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1), మానవ్ సుతార్ (1) విఫలమవడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... హర్ష్ దూబే, పార్థ్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 342; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: అభిమన్యు (ఎల్బీ) (బి) పార్థ్ 52; ఆర్యాన్ జుయెల్ (ఎల్బీ) (బి) దర్శన్ 23; యశ్ ధుల్ (స్టంప్డ్) వాడ్కర్ (బి) హర్శ్ దూబే 11; రజత్ పాటీదార్ (సి) రాథోడ్ (బి) హర్శ్ దూబే 66; రుతురాజ్ గైక్వాడ్ (సి) రాథోడ్ (బి) యశ్ ఠాకూర్ 9; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) పార్థ్ 1; మానవ్ సుతార్ (ఎల్బీ) (బి) యశ్ ఠాకూక్ 10; ఆకాశ్‌దీప్ (సి) అథర్వ (బి) యశ్ ఠాకూర్ 14; అన్షుల్ కంబోజ్ (నాటౌట్) 10; గుర్నూర్ బ్రార్ (సి) దూబే (బి) యశ్ ఠాకూర్ 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (69.5 ఓవర్లలో ఆలౌట్) 214.వికెట్ల పతనం: 1–52, 2–73, 3–105, 4–119, 5–124, 6–142, 7–175, 8–191, 9–191, 10–214. బౌలింగ్: హర్శ్ దూబే 22–5–58–2; ఆదిత్య ఠాకరే 11–1–40–1; దర్శన్ నల్కండే 8–1–26–1; యశ్ ఠాకూర్ 16.5–3–66–4; పార్థ్ రెఖడే 12–3–24–2. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్నూర్ బ్రార్ 37; ధ్రువ్ షోరె (బ్యాటింగ్) 24; దానిశ్ మాలేవార్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–42, 2–64. బౌలింగ్: సారాంశ్ జైన్ 9–0–28–0; ఆకాశ్‌దీప్ 3–1–4–0; మానవ్ సుతార్ 14–1–35–1; అన్షుల్ కంబోజ్ 4–0–14–0; గుర్నూర్ బ్రార్ 6–2–11–1. చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్.. -
నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రంజీ ఛాంపియన్ విదర్భ జట్టు (Vidarbha) బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడతాడు) చెలరేగిపోయాడు. 16.5 ఓవర్లలో 66 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. యశ్ ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) 214 పరుగులకే ఆలౌటైంది.ఆట మూడో రోజైన ఇవాళ (అక్టోబర్ 3) రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు (124/5) మరో 90 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రజత్ పాటిదార్ (66) పోరాడినంత సేపు పోరాడి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇవాల్టి ఆటలోనే యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. ఆట ప్రారంభం నుంచే యశ్ నిప్పులు చెరిగాడు. ఇవాళ హర్ష్ దూబే, ఆదిత్య ఠాకరే తలో వికెట్ తీశారు.మొత్తంగా యశ్ ఠాకూర్ 4, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే చెరో 2, ఆదిత్య ఠాకరే, దర్శన్ నల్కండే తలో వికెట్ తీశారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే రాణించాడు. ఈ జట్టులో ఉన్న టీమిండియా ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 342 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు.అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు.రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్‌దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.చదవండి: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ -
మయాంక్‌కు గాయం.. లక్నో హీరోగా యశ్! ఎవరీ యంగ్ పేసర్?
ఒకరి దురదృష్టం.. మరొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో! అరంగేట్రంలోనే సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించి.. రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ పదిహేడేళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్పీడ్‌గన్. బుల్లెట్ వేగంతో బంతులు సంధించే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ లక్నోను గెలిపించి.. హ్యాట్రిక్ అందుకుంటాడని అభిమానులు భావించారు. కానీ దురదృష్టవవాత్తూ పక్కటెముల నొప్పి కారణంగా మయాంక్ యాదవ్ ఒక్క ఓవర్ మాత్రమే పూర్తి చేసి.. ఆ తర్వాత మైదానం వీడాడు. అతడి స్థానంలో వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం దక్కించుకున్న యశ్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్-2024లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి శుబ్‌మన్ గిల్(19), విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12), రాహుల్ తెవాటియా(30), రషీద్ ఖాన్(0) వికెట్లు దక్కించుకున్నాడు. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఎవరీ యశ్ ఠాకూర్? కోల్‌కతాలో 1998లో జన్మించిన యశ్ ఠాకూర్.. దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రైటార్మ్ మీడియం పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు. రూ. 45 లక్షలకు కొనుగోలు ఐపీఎల్-2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యశ్ ఠాకూర్‌ను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి యశ్ 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇది నీ రోజు అని చెప్పాడు ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి యశ్ ఠాకూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. గిల్‌ను అవుట్ చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కేఎల్ రాహుల్ సర్ సలహాలతో వ్యూహాలను సరిగ్గా అమలు చేయగలిగాను. దురదృష్టవశాత్తూ మయాంక్ గాయపడ్డాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ నా దగ్గరికి వచ్చి ఇది నీ రోజు.. ఉపయోగించుకో అని మోటివేట్ చేశాడు’’ అని యశ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు. 5️⃣-fer ✅ Victory ✅ Celebration 🥳✅#LSGvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/21U2dH6t2H — JioCinema (@JioCinema) April 7, 2024 లక్నో వర్సెస్ గుజరాత్ స్కోర్లు: ►వేదిక: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 163/5 (20) ►గుజరాత్ స్కోరు: 130 (18.5). ►ఫలితం: 33 పరుగుల తేడాతో లక్నో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశ్ ఠాకూర్(5/30). చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్