
సీఎం రేవంత్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు
తాండూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తాండూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కొడంగల్‌కు వచ్చిన సీఎంను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కలిశారు. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, నాగేష్ తదితరులు ఉన్నారు.
సీఎంను కలిసిన టీఆర్‌ఆర్
పరిగి: కొడంగల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని అయినన్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశం(39) మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి గొడవ జరగడంతో బయటకు వెళ్లిపోయాడు. అయినన్‌పల్లి గేటు సమీపంలోని వెంచర్‌లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి చిన్నాన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ –2 సత్యనారాయణరాజు తెలిపారు. మృతుడికి భార్య లలితమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సబితారెడ్డిని కలిసిన ఆనంద్
అనంతగిరి: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితారెడ్డిని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
తాండూరు: తాగిన మైకంలో తాగునీటి మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పాత తాండూరు అంబేడ్కర్ పార్కులో తాగునీటి మ్యాన్ హోల్ ఉంది. ఇదే కాలనీకి చెందిన మాసయ్య(50) తాగిన మైకంలో అందులో పడి మృతి చెందాడు. పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు మ్యాన్‌హోల్‌లో మనిషి ఉన్నట్లు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు మాసయ్య మృతదేహాన్ని బయటికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు