మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Oct 4 2025 6:20 AM | Updated on Oct 4 2025 6:20 AM

మృత్య

మృత్యువులోనూ వీడని స్నేహం

సరదాగా చెరువు చూసేందుకు వెళ్లిన 20 మంది బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరి దుర్మరణం దుద్యాల్‌ మండలం అల్లిఖాన్‌పల్లిలో ఘటన

దుద్యాల్‌: చెరువు అలుగు పారుతుండటంతో తోటి స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి దుర్మరణం చెందారు. ఈ ఘటన దుద్యాల్‌ మండలం, అల్లిఖా న్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని చింతల్‌ చెరువు అలుగు పారుతోంది. దసరా సెలవులు శుక్రవారంతో ముగియనుండటంతో గ్రా మానికి చెందిన 20 మంది స్నేహితులు(బాలికలు) ఉదయం సైకిళ్లపై చెరువు చూడటానికి వెళ్లారు. కొద్దిసేపు నీటిలో సరదాగా గడిపారు. గ్రామానికి చెందిన ఊదరి రాములు, లక్ష్మి దంపతుల కూతురు ప్రణతి(13), కొత్తపల్లి పాండు, అరుణ దంపతుల కూతురు వృక్షిత(12) అలుగు దాటి నీటిలో కొంత దూరం వెళ్లారు. అక్కడి గుంతలో పడి మునిగిపోయారు. అక్కడే ఉన్న ప్రణతి అక్క నందిని తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ ఏడవడం మొదలు పెట్టారు. కొద్ది దూరంలో బట్టలు ఉతుకుతున్న మహిళలు చెరువు వద్దకు వచ్చారు. వారికి కూడా ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు. చెల్లెలు ప్రణతి, మరో బాలిక వృక్షితను కాపాడుకోవాలనే తపనతో నందిని అల్లిఖాన్‌పల్లి రోడ్డు వద్దకు పరుగులు పెట్టింది. అటుగా వెళ్తున్న యువకులకు విషయం చెప్పింది. వారు చెరువు వద్దకు చెరుకొని నీట మునిగిన ప్రణతి, వృక్షితను బయటకు తీశారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. దీంతో స్నేహితులు బోరున విలపించారు. విషయం బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. దుద్యాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రణతి 9వ తరగతి, వృక్షిత 8వ తరగతి చదువుతున్నారు.

నిత్యం కలిసి పాఠశాలకు..

ప్రణతి, వృక్షిత నిత్యం కలిసి పాఠశాలకు వెళ్లే వారు. కలిసే భోజనం చేసేవారు. వీరిద్దరూ మంచి స్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. తరగతులు వేరైనా ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, వారు చనిపోవడం చాలా బాధేస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ విజయరామారావు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంఈఓ తన వంతుకు రెండు కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బాగా చదువుకునే విద్యార్థులను కోల్పోవడం దురదృష్టకరమని ఉపాధ్యాయులు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, హకీంపేట్‌నర్సింహరెడ్డి తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

మృత్యువులోనూ వీడని స్నేహం 1
1/3

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం 2
2/3

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం 3
3/3

మృత్యువులోనూ వీడని స్నేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement