శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Published Sun, May 5 2024 7:20 AM

-

డీఎస్పీ జీవన్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎల్‌ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్రాంతినగర్‌లో అనుమతి లేకుండా రోడ్డు పక్కన ఒక మతానికి సంబంధించిన జెండా గద్దెను నిర్మించారన్నారు. వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి లేవని మున్సిపల్‌ అధికారులు రోడ్డుకు ప్రమాదకరంగా ఉందని తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘటనలో ఓ వర్గం వ్యక్తులు గుమిగూడి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. ప్రతి చర్యగా మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు నినాదాలు చేయగా ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి జెండాలైనా, విగ్రహాల ఏర్పాటుకై నా సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా గుమిగూడినా, ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement