టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం ఉందని.. ఆ కారణంగానే సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
సెర్గీబ్రిన్, ఎలోన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. కాబట్టే మస్క్ ఎదుర్కొన్న అనేక ఆర్ధిక ఇబ్బందుల నుంచి సెర్గీబ్రిన్ బయటపడేసినట్లు మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అయితే, ఇంతటి ప్రాణ స్నేహితులు విడిపోవడానికి నికోల్ షానన్‌తో మస్క్‌కు ఉన్న సాన్నిహిత్యమేనేని నిర్ధారించారు.
షానహన్ -సెర్గీ బ్రిన్‌లు 2018లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం బయటపడడంతో సెర్గీ-నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారు.
సెటిల్ మెంట్ కింద నికోల్‌కు సెర్గీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎనిమిది మంది వ్యక్తులు సాక్షులు ,కీలక డాక్యుమెంట్లను న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. ‘ఏ రన్నింగ్ మేట్స్ హిస్టరీ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షానహన్-సెర్గీ బ్రిన్‌లు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment