Sergey Brin Ex-wife Nicole Shanahan Gives Clarity About Allegations On Affair With Elon Musk - Sakshi
Sakshi News home page

Elon Musk And Nicole Shanahan: బిలియనీర్‌ విడాకుల కేసు.. అందుకు ఎలాన్‌ మస్కే కారణమా!

Published Fri, Jul 7 2023 12:04 PM | Last Updated on Fri, Jul 7 2023 1:47 PM

Sergey Brin Ex-wife Nicole Shanahan Clear About Her Alleged Affair With Elon Musk - Sakshi

డబ్బుల కోసమే ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై నికోల్‌ షనన్ స్పందించారు. ప్రస్తుతం ఈ అంశం వ్యాపార వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. 

గత ఏడాది గూగుల్ సహ-వ్యవస్థాపకుడు, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్న సెర్గీ బ్రిన్ భార్య.. నికోల్ షనన్ నుంచి విడాకులు కోరుతూ..దరఖాస్తు చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న మూడో మెగా బిలియనియర్ గా సెర్గీ బ్రిన్ నిలిచారు.

అయితే సెర్గీ బ్రిన్‌ తన భార్య నికోల్‌ నుంచి విడిపోవడానికి ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్కే కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో డబ్బు కోసమే (గోల్డ్‌ డిగ్గర్‌) మస్క్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో ‘పీపుల్స్‌ మ్యాగజైన్‌’తో జరిపిన ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌తో తనకున్న బంధాన్ని నికోల్‌ షనన్‌ ఖండించారు. మస్క్‌కు తనకు మధ్య ఉన్న బంధంపై వచ్చిన నివేదికలతో తానెంత మనోవేధనకు గురైనట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలాన్‌ మస్క్‌ను ఓ స్నేహితుడుగానే భావించానని, తన కుమార్తె ఆటిజం చికిత్స గురించి చర్చించానని అన్నారు. ఆ ఆటిజం సమస్యను తీర్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ను ఆశ్రయించించినట్లు తెలిపారు. అంతే తప్పా వేరే కారణాలు లేవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌కు సెర్గీ బ్రిన్‌కు మధ్య ఉన్న స‍్నేహాన్ని నికోల్‌ షనన్‌ గుర్తు చేశారు. 2008లో టెస్లాకు తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా 5 లక్షల డాలర్లను మస్క్‌కు బ్రిన్ సాయం చేసినట్లు తెలిపారు.  

అటు ఎలాన్‌ మస్క్‌ సైతం నికోల్‌తో ముడిపెడుతూ వచ్చిన నివేదికల్ని కొట్టిపారేశారు. సెర్గీ బ్రిన్, తాను మంచి మిత్రులమని. రాత్రి జరిగిన పార్టీ హజరైనట్లు మస్క్ చెప్పారు.  సెర్గీ భార్య నికోల్‌ మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశా. ఆ సమయంలో తమ చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. తమది రొమాంటికి బంధం కాదని, స్నేహితులమని తెలిపే ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

చదవండి : ఎలాన్‌ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement