Sergey Brin
-
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం ఉందని.. ఆ కారణంగానే సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.సెర్గీబ్రిన్, ఎలోన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. కాబట్టే మస్క్ ఎదుర్కొన్న అనేక ఆర్ధిక ఇబ్బందుల నుంచి సెర్గీబ్రిన్ బయటపడేసినట్లు మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అయితే, ఇంతటి ప్రాణ స్నేహితులు విడిపోవడానికి నికోల్ షానన్‌తో మస్క్‌కు ఉన్న సాన్నిహిత్యమేనేని నిర్ధారించారు.షానహన్ -సెర్గీ బ్రిన్లు 2018లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం బయటపడడంతో సెర్గీ-నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారు. సెటిల్ మెంట్ కింద నికోల్‌కు సెర్గీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎనిమిది మంది వ్యక్తులు సాక్షులు ,కీలక డాక్యుమెంట్లను న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. ‘ఏ రన్నింగ్ మేట్స్ హిస్టరీ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షానహన్-సెర్గీ బ్రిన్లు ఖండించారు. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
స్నేహితుడి కాపురం కూల్చిన ఎలన్ మస్క్!
న్యూయార్క్: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వ్యక్తిగత కారణాలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మస్క్ కారణంగా మాజీ స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్గీ బ్రిన్ వైవాహిక జీవితం కుదేలు అయ్యింది. తన భార్య నికోల్ షన్‌హన్ నుంచి బ్రిన్ గప్‌చుప్‌గా విడాకులు తీసేసుకున్నాడు. మస్క్‌తో అఫైర్ నడిపిందనే కారణంతోనే ఈ ఏడాది మే నెలలో సర్గీ.. షన్హన్కు విడాకులు మంజూరు అయినట్లు తాజాగా పేజ్6 ఓ కథనం ప్రచురించింది. ‘‘అంతా గప్‌చుప్‌గా జరిగిపోయింది. మే 26వ తేదీనే విడాకులు మంజూరు అయ్యాయి. లీగల్‌గా ఆ జంట విడిపోయింది. నాలుగేళ్ల కూతురి సంరక్షణపైనా స్పష్టమైన ఒప్పందం జరిగింది. షన్‌హన్ విడాకుల పట్ల సుముఖంగా లేకపోవడమే కాదు.. తన భర్త నుంచి సపోర్ట్ కూడా కోరింది. కానీ, ఏ విషయంలోనూ నికోల్ షన్‌హన్ నుంచి తనకు మద్దతు అవసరం లేదని సర్గీ పిటిషన్లో పేర్కొన్నారు’’ అని కోర్టు విడాకుల ఉత్తర్వుల సారాంశాన్ని పేజ్6 కథనం ప్రచురించింది. 2015లో సర్గీ బ్రిన్ తన మొదటి భార్య అన్నె వోజ్సిస్కి నుంచి విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో షెహనన్తో సర్గీకి పరిచయం అయ్యింది. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే 2021 నుంచి ఆ ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఆ మరుసటి ఏడాదిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. సరిదిద్దలేని మనస్పర్థలు తమ మధ్య చోటుచేసుకున్నాయంటూ విడాకుల కారణంగా పేర్కొన్నారు బ్రిన్. అయితే.. షెహనన్కు మరో వ్యాపారవేత్త, సర్గీ బ్రిన్ స్నేహితుడైన ఎలన్ మస్క్‌తో శారీరక సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిన వెంటనే బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని అప్పట్లో న్యూయార్క్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. కానీ, ఈ ఆరోపణలపై ఎలన్ మస్క్, షెహనన్ ఖండిస్తూ వస్తున్నారు. అయితే బ్రిన్ మాత్రం ఈ పరిణామంపై మీడియా ముందు మాట్లాడటానికి ఏనాడూ ఇష్టపడలేదు. అప్పటి నుంచే.. ఎలన్ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసింది సర్గీనే. అలాంటిది.. బ్రిన్, ఎలన్ మస్క్ గురించి చెడుగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. అప్పట్లో ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ బ్రిన్ అమ్మేసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు తన సలహాదారులకు, అనుచరులకు ఎలన్ మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇవ్వడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. This is total bs. Sergey and I are friends and were at a party together last night! I’ve only seen Nicole twice in three years, both times with many other people around. Nothing romantic. — Elon Musk (@elonmusk) July 25, 2022 అయితే అటు ఎలన్ మస్క్, ఇటు నికోల్.. ఇద్దరూ తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదంటూ చెబుతూనే వస్తున్నారు. నికోల్ అయితే ఓ అడుగు ముందుకేసి ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ల ద్వారా తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదంటూ వివరణ ఇచ్చుకుంది. -
బిలియనీర్ విడాకుల కేసు.. అందుకు ఎలాన్ మస్కే కారణమా!
డబ్బుల కోసమే ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై నికోల్ షనన్ స్పందించారు. ప్రస్తుతం ఈ అంశం వ్యాపార వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. గత ఏడాది గూగుల్ సహ-వ్యవస్థాపకుడు, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్న సెర్గీ బ్రిన్ భార్య.. నికోల్ షనన్ నుంచి విడాకులు కోరుతూ..దరఖాస్తు చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న మూడో మెగా బిలియనియర్ గా సెర్గీ బ్రిన్ నిలిచారు. అయితే సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ నుంచి విడిపోవడానికి ట్విటర్ అధినేత ఎలాన్ మస్కే కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో డబ్బు కోసమే (గోల్డ్ డిగ్గర్) మస్క్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘పీపుల్స్ మ్యాగజైన్’తో జరిపిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్‌తో తనకున్న బంధాన్ని నికోల్ షనన్ ఖండించారు. మస్క్‌కు తనకు మధ్య ఉన్న బంధంపై వచ్చిన నివేదికలతో తానెంత మనోవేధనకు గురైనట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలాన్ మస్క్‌ను ఓ స్నేహితుడుగానే భావించానని, తన కుమార్తె ఆటిజం చికిత్స గురించి చర్చించానని అన్నారు. ఆ ఆటిజం సమస్యను తీర్చేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ను ఆశ్రయించించినట్లు తెలిపారు. అంతే తప్పా వేరే కారణాలు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్‌కు సెర్గీ బ్రిన్కు మధ్య ఉన్న స్నేహాన్ని నికోల్ షనన్ గుర్తు చేశారు. 2008లో టెస్లాకు తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా 5 లక్షల డాలర్లను మస్క్‌కు బ్రిన్ సాయం చేసినట్లు తెలిపారు. This is total bs. Sergey and I are friends and were at a party together last night! I’ve only seen Nicole twice in three years, both times with many other people around. Nothing romantic. — Elon Musk (@elonmusk) July 25, 2022 అటు ఎలాన్ మస్క్ సైతం నికోల్తో ముడిపెడుతూ వచ్చిన నివేదికల్ని కొట్టిపారేశారు. సెర్గీ బ్రిన్, తాను మంచి మిత్రులమని. రాత్రి జరిగిన పార్టీ హజరైనట్లు మస్క్ చెప్పారు. సెర్గీ భార్య నికోల్ మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశా. ఆ సమయంలో తమ చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. తమది రొమాంటికి బంధం కాదని, స్నేహితులమని తెలిపే ఆ ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి : ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
Elon Musk: అతని కాపురంలో ఎలన్ మస్క్ చిచ్చు!
వాషింగ్టన్: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సంచలనాలకే కాదు.. వివాదాలకు కూడా కేరాఫ్. రహస్య డేటింగ్, ఇల్లీగల్ ఎఫైర్లు, రాసలీలలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాంటి వ్యక్తి తాజాగా ట్విటర్ డీల్-బ్రేక్.. లీగల్ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఆయన మీద మరో సంచలన కథనం.. సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడు. అంతేకాదు తన సలహాదారులకు, అనుచరులకు ఎలన్ మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. అంతెందుకు ఎలన్ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసింది సర్జీనే. అలాంటిది సర్జీ, మస్క్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్‌హన్Nicole Shanahanతో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం. సరిదిద్దలేని విభేధాలంటూ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టు కెక్కాడు సర్జీ బ్రిన్. 2021 డిసెంబర్ నుంచి తాను, తన భార్య విడిగా ఉంటున్నామని ఆయన ప్రకటించాడు కూడా. కూతురిని ఇద్దరి సంరక్షణలో చూసుకుంటామని, అయితే ఏ విషయంలోనూ నికోల్ షన్‌హన్ నుంచి తనకు మద్దతు అవసరం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సర్జీ. ఈ సంచలనాత్మక కథనంపై సర్జీ, నికోల్, మస్క్.. ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్‌బై! -
నీతోని నాకు కుదరదు, గుడ్‌బై!
వివాహా బంధం విచ్చినమైతే చివరకు తీసుకునేది విడాకులే. అయితే సెలబ్రిటీల విడాకుల వ్యవహరం ఎప్పుడూ చర్చనీయాంశమే. బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న వ్యక్తి విడాకులకు సిద్ధమయ్యాడు. దీంతో భరణం ఎంత చెల్లించవ్చు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే అంశం చర్చకు వస్తోంది. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జెబ్రిన్ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తు చేశారు. తన భార్య నికోల్ షెనహాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. తమిద్దరి మధ్య పరిష్కరించుకోలేనంతగా భేదాభిప్రాయాలు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉండగా.. కోర్టును జాయింట్ కస్టడికి ఇవ్వాలని కోరారు. సెర్జెబ్రిన్, నికోల్ షనహాన్లు 2015 నుంచి డేటింగ్లో ఉన్నారు. చివరకు 2018 నవంబరులో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే కాపురం నాలుగేళ్లకు మించి పటిష్టంగా ఉండలేక పోయింది. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో వ్యవహరాం విడాకులకు దారి తీసింది. న్యాయవాదిగా పని చేసిన నికోల్ షెనహాన్ ఎంట్రప్యూనర్గానూ పలు ప్రాజెక్టులు చేపట్టారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం సెర్జెబ్రిన్ ఆస్తుల విలువ 96 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో భరణంగా సెర్జెకు భారీ మొత్తం దక్కవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఈ దంపతులు భారీగా ఉమ్మడి ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని సైతం చెరి సమానంగా పంచాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఆస్తుల పంపకం వివరాలు ఇంకా బహిర్గం కాలేదు. ఇటీవల కాలంలో జెఫ్‌బేజోస్ - మెకెంజీ స్కాట్, బిల్‌గేట్స్ - మిలిందా , ఎలాన్‌మస్క్ - రైలీ దంపతుల విడాకులు కాస్ట్లీ వ్యవహారంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుటు వాటి జాబితాలో సెర్జెబ్రిన్ - నికోల్ షెనహాన్ చేరవచ్చని అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!
హోదాల బదలాయింపుతో అల్ఫాబెట్ సంస్థాగత స్వరూపంలో గానీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ పెద్ద మార్పులేమీ ఉండబోవు. ఎప్పట్లాగే ఇకపైనా గూగుల్‌ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తా. కంప్యూటింగ్ హద్దులు చెరిపేసేందుకు, అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా గూగుల్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయి. పెను సవాళ్లను టెక్నాలజీతో పరిష్కరించే దిశగా అల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా కొనసాగుతుంది. – సుందర్ పిచాయ్ వాషింగ్టన్: టెక్నాలజీ ప్రపంచంలో మనోళ్ల హవా కొనసాగుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్ (47)... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ లేఖ రాశారు. అల్ఫాబెట్ ప్రస్తుతం గట్టిగా నిలదొక్కుకుందని, గూగుల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలూ స్వతంత్రంగా రాణిస్తున్నాయని... మేనేజ్మెంట్ వ్యవస్థను సరళీకరించేందుకు ఇదే సరైన తరుణమని వారు పేర్కొన్నారు. ‘కంపెనీని మరింత మెరుగ్గా నడిపించగలిగే మార్గాలున్నప్పుడు.. మేము మేనేజ్మెంట్ హోదాలకు అతుక్కుని ఉండదల్చుకోలేదు. అల్ఫాబెట్, గూగుల్ సంస్థలకిక ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ అవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందరే సీఈవోగా ఉంటారు. గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ–వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ డైరెక్టరుగా సుందర్ పిచాయ్ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్ తెలిపారు. సెర్చికి పర్యాయపదంగా గూగుల్... ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ 1998లో ఆరంభించారు. పేజ్ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్ ష్మిట్ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు. సింపుల్.. సుందర్ ఐఐటీలో చదివేటప్పుడు తనకు ఒక దశలో సీ గ్రేడ్ రావడం.. మళ్లీ మెరుగుపడటానికి తాను కిందా మీదా పడటం లాంటి ఆసక్తికరమైన విషయాలను కొన్నాళ్ల కిందట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా పిచాయ్ చెప్పారు. చిన్నప్పటి సాదా సీదా జీవితాన్ని ఒక పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మా జీవితం సింపుల్‌గా, హాయిగా ఉండేది. ఒక మోస్తరు అద్దింట్లో ఉంటూ లివింగ్ రూమ్‌లో హాయిగా కింద పడుకునేవాళ్లం. ఒకసారి తీవ్ర కరువొచ్చింది. అదెంత భయపెట్టిందంటే.. ఇప్పటికీ నేను పడుకునేటప్పుడు మంచం పక్కన మంచినీటి బాటిల్ పెట్టుకుంటాను. మేం ఫ్రిజ్ కొనుక్కోవడం అప్పట్లో మాకో గొప్ప విశేషం‘ అని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్‌లో టీమ్‌ను ముందుండి నడిపించగలిగే సత్తాతో టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డారు. మృదు భాషిగా, ఎవర్నీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తిగా సుందర్ గురించి ఆయన సన్ని హితులు చెబుతారు. విభిన్న ఉత్పత్తులపై, టెక్నాలజీపై పరిజ్ఞానంతో పాటు ఈ సామర్థ్యాలే ఆయన్ను గూగుల్‌లో కీలక వ్యక్తిగా నిలిపాయి. మదురై టు సిలికాన్ వ్యాలీ... సుందర్ పిచాయ్ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. భార్య అంజలితో సుందర్ పిచాయ్ -
గూగుల్ దేవోభవ!
సెప్టెంబర్ 4 గూగుల్ వార్షికోత్సవం, సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం సందర్భంగా... ఆవకాయను ఎలా తయారు చేయాలి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సచిత్ర పాఠం క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది. అంతరిక్ష విజ్ఞానంలో తాజా పరిణామాలేంటి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సమస్త సమాచారమూ సమగ్రంగా చిటికెలో ప్రత్యక్షమవుతుంది. కొరుకుడు పడని పాఠాలేవైనా కావచ్చు, కోరుకున్న విద్యలేవైనా కావచ్చు.. ‘గూగుల్’ను అడిగితే చాలు... యమ ఓపికగా పండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరిస్తుంది. బెత్తం పట్టుకోదు, గుంజీలు తీయించదు, గోడ కుర్చీలు వేయించదు... ఎలాంటి పాఠాలనైనా ఏమాత్రం కసురుకోకుండా ఫ్రెండ్లీగా బోధిస్తుంది. ఎలాంటి సందేహాన్నైనా ఏమాత్రం విసుక్కోకుండా చిటికెలో తీర్చేస్తుంది. ఈ-తరానికి గురువూ, దైవం గూగుల్. ఈ-తరానికి ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గూగుల్. గూగుల్ ఒక జ్ఞాన నిధి, ఒక విజ్ఞాన ఖని. పద్దెనిమిదేళ్ల కిందట సాదాసీదా సెర్చ్ ఇంజన్‌గా ‘గూగుల్’ మొదలైనప్పుడు అది నిరంతర సమాచార ఖనిగా పరిణమించగలదని, అంచెలంచెలుగా విస్తరించి విశ్వవ్యాప్తమై అధునాతన ప్రపంచంలో అనేకానేక ఏకలవ్య శిష్యులకు జగద్గురువుగా అవతరించగలదని ఎవరూ ఊహించలేదు. గూగుల్ ప్రస్థానం అభూత కల్పనల కంటే విడ్డూరమైనది. గూగుల్ సాధించిన విజయాలు ఇంటర్నెట్ ప్రపంచంలోని ఇతరేతర శతకోటి విజయాల కంటే ఘనమైనవి. ‘ఆచార్య దేవో భవ’ అని గురువులను గౌరవించడం మన సంస్కృతి. దాదాపు ఇంటింటికీ ఇంటర్నెట్ విస్తరించడంతో సమాచార విప్లవంలో ‘గూగుల్’ గురుతర పాత్ర పోషిస్తోంది. శాస్త్ర సాంకేతికాలకు మాత్రమే పరిమితం కాకుండా వంటా వార్పు వంటి సామాన్య విషయాలపైనా పాఠాలు బోధిస్తోంది. ఈ-తరానికి గురువుగా మారిన గూగులాచార్యుల కథా కమామిషూ... చదువులెంత సులభం! చదువుల తీరుతెన్నుల చరిత్రను ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఆ చరిత్రను గూగుల్ పూర్వయుగం, గూగుల్ అనంతర యుగంగా విభజించుకోవడం అనివార్యం. ఇంటర్నెట్ అనేది ఊహకందని కాలంలో, గూగుల్ అనే సమాచార ఖని అందుబాటులోకి రాని కాలంలో చదువులు బహు కష్టంగా ఉండేవి. పాఠాలు నేర్చుకునే విద్యార్థులకే కాదు, పాఠాలు నేర్పే గురువులకు కూడా! పొల్లు పోకుండా పాఠాలను వల్లె వేయాల్సి వచ్చేది. పరీక్షలకు ముందు అవే పాఠాలను పదే పదే బట్టీ పట్టాల్సి వచ్చేది. అయినా ఒక పట్టాన గుర్తుండి చచ్చేవి కాదు. చాలా అంశాల్లో ఏమిటి? ఎందుకు? ఎలా? అనే మౌలికమైన ప్రశ్నలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాధానాలు అర్థమయ్యీ కానట్లు ఉండేవి. రకరకాల సందేహాలు తలెత్తేవి. వెనువెంటనే వాటిని నివృత్తి చేసుకునే మార్గమే అందుబాటులో ఉండేది కాదు. కొత్త పదాలు వేటికైనా అర్థాలు తెలుసుకోవాలంటే దిండు సైజులో కొండలా ఉండే నిఘంటువుల్లో పేజీలకు పేజీలు ఓపికగా తిరగేస్తూ వెదుక్కోవాల్సి వచ్చేది. కొరుకుడుపడని సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు తలెత్తినా, టీచర్లను అడగాలంటే భయ సంకోచాలు వెంటాడేవి. ఓపికగా సందేహాలను నివృత్తి చేసే టీచర్లు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. చాలామంది టీచర్లు కోపతాపాలను ప్రదర్శించేవారు. ఇవన్నీ విద్యార్థుల కష్టాలు. అయితే, టీచర్ల కష్టాలు టీచర్లకూ ఉండేవి. తమకే తెలియని విషయాలపై సందేహాలతో నిత్యం విసిగించే విద్యార్థులతో వేగడం అగ్నిపరీక్షలా ఉండేది. అపర చండామార్కుల వంటి టీచర్లు అలాంటి గడ్డు పరిస్థితులను దండోపాయంతో నెట్టుకొచ్చేసేవారు. అయితే, టీచర్లందరూ దండోపాయ దురంధరులగు చండామార్కుల వారసులు కాదు కదా! వాళ్లల్లోనూ అమాయకపు పరమానందయ్యలు ఉంటారు. పాపం అలాంటి వాళ్లకే కష్టాలన్నీ... పైగా విద్యార్థులకు కూడా పరమానందయ్యల వంటి టీచర్ల దగ్గరే కాస్త చనువెక్కువ. అందుకే వాళ్లనే పదే పదే సందేహాలతో సతాయిస్తూ ఉంటారు. ‘గూగుల్’ పుట్టుకకు మునుపు గడచిన సత్తెకాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చదువులు సవాలుగా ఉండేవి. ‘గూగుల్’ ఆవిర్భావం తర్వాత చాలావరకు కష్టాలు తీరిపోయాయి. చదువులు సులభమయ్యాయి. ఎలాంటి సందేహమైనా సరే, నివృత్తి చేసుకోవడం ఒక క్లిక్కుతో జరిగే పనిగా మారింది. ఇద్దరు మిత్రుల కథ పాతికేళ్ల కిందట ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ టిమ్ బెరర్స్ లీ తొలిసారిగా 1989 మార్చి 12న ‘వరల్డ్ వైడ్ వెబ్’ ప్రతిపాదన చేశారు. మొదటి సెర్చ్ ఇంజన్ ‘ఆర్చీ’ 1990లో ఏర్పాటైంది. ఆ తర్వాత 1991 ఆగస్టులో మొట్టమొదటి వెబ్సైట్ ‘ఇన్ఫో.సెర్న్.సీహెచ్’ ఏర్పడింది. కంప్యూటర్ల నుంచి కంప్యూటర్లకు సమాచార మార్పిడి తేలికైంది. ఈ-మెయిల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెబ్సైట్లు ఒక్కొక్కటే ఏర్పడసాగాయి. విద్యారంగంలో నెమ్మదిగా హైటెక్కు టమారాలన్నీ మొదలవసాగాయి. అలాంటి కాలంలో... 1996లో ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే అమెరికన్ కుర్రాళ్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరూ పీహెచ్డీ స్కాలర్లే! పాపం అప్పటికి అబ్దుల్ కలాం వాళ్లకేమీ చెప్పలేదు గాని, వాళిద్దరూ ఒక పెద్ద కల కన్నారు. ఇంటర్నెట్లోని సమస్త సమాచారాన్నీ ఒకేచోట అందుబాటులోకి తేవాలన్నదే వారి కల. దానిని సాకారం చేసుకోవడానికి 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఏడాది గడవకుండానే... 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేశారు. తమ తోటి పీహెచ్డీ సహాధ్యాయి క్రెయిగ్ సిల్వర్స్టీన్ను తొలి ఉద్యోగిగా చేర్చుకున్నారు. అప్పట్లో వాళ్లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్కు ప్రాంతంలో సూసాన్ వోజ్సికి అనే స్నేహితురాలి ఇంటి గ్యారేజీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా మొదలైన ప్రస్థానం రెండు దశాబ్దాలైనా గడవక ముందే అనేకానేక మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే పరిమితమైపోకుండా, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ‘గూగుల్ ఎర్త్’ వంటి వినూత్నమైన సేవలను ప్రారంభించింది. అనూహ్యంగా అసంఖ్యాక ఘనవిజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో గూగుల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ‘గూగుల్’ సంస్థ నికర విలువ ఇప్పుడు 49,800 కోట్ల డాలర్లకు పైమాటే. తాజా లెక్కల ప్రకారం ‘గూగుల్’లో 57,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐటీ విద్యార్థులందరి కలల లక్ష్యం ‘గూగుల్’లో ఉద్యోగమేనంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్’లో ఉద్యోగమంటే రాజ వైభోగమేనని చెబుతారు. గూగుల్ నీడలో విద్యా వేదికలు ‘బ్లాగర్’, ‘యూట్యూబ్’ వంటివి ‘గూగుల్’ నీడలోనివే. ఇవి అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. అంతేనా! చదువు సంధ్యల్లోనూ ఇవి తమదైన ముద్ర వేస్తున్నాయి. ‘గూగుల్’ దెబ్బతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారింది. చదువుకోదలచిన వాళ్లకు చదువుకునేంత సమాచారం అందుబాటులో ఉంటోంది. ఔత్సాహిక రచయితలకు ‘బ్లాగర్’ అద్భుతమైన వేదికగా మారింది. తమకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడానికి, తమ సృజనాత్మకతను లోకానికి చాటుకోవడానికి ‘బ్లాగర్’ చక్కని వెసులుబాటు కల్పిస్తోంది. నిజానికి ‘బ్లాగర్’ను 1999లో పైరా ల్యాబ్స్ ప్రారంభించగా, దీనిని 2003లో ‘గూగుల్’ సొంతం చేసుకుంది. ఇక ‘యూట్యూబ్’ వినోద, విజ్ఞానాల సమ్మేళనంగా ఉపయోగపడుతోంది. వీడియో షేరింగ్ వెబ్సైట్ ‘యూట్యూబ్’ను 2005లో ‘పేపాల్’ ఉద్యోగులు కొందరు ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే ‘గూగుల్’ దీనిని సొంతం చేసుకుంది. ‘యూట్యూబ్’లో సినిమాలు, టీవీ సీరియల్ ఎపిసోడ్లు, క్రీడలు, పాటలు వంటివే కాదు, పలు విషయాలకు సంబంధించిన పాఠాల వీడియోలూ రోజూ అసంఖ్యాకంగా చేరుతూనే ఉంటాయి. వినోదం కోసం ‘యూట్యూబ్’ను వినియోగించుకునే వారి సంగతి సరే, చాలామంది ‘యూట్యూబ్’ ద్వారా విలువైన పాఠాలను వ్యయప్రయాసలేవీ లేకుండానే నేర్చుకోగలుగుతున్నారు. గృహాలంకరణ వస్తువుల తయారీ, మొక్కల పెంపకం, వంటల తయారీ మొదలుకొని భౌతిక, రసాయనిక శాస్త్రాల ప్రయోగాలు, శస్త్రచికిత్సా ప్రక్రియల వరకు వివిధ అంశాల్లో పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు లక్షలాది మంది ‘యూట్యూబ్’పై ఆధారపడుతున్నారు. ఈ-లెర్నింగ్... ‘గూగుల్’తో ఎలాంటి సంబంధాలు లేని ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ రకరకాల విషయాలను కూలంకషంగా బోధిస్తున్నాయి. ఇంటర్నెట్ మొదలైన కొద్దికాలంలోనే ఈ-లెర్నింగ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 1999 నుంచే ఈ-లెర్నింగ్‌కు జనాదరణ పుంజుకుంది. అయితే,‘గూగుల్’ లేకుంటే... ఏయే వెబ్సైట్లు ఈ-లెర్నింగ్ సేవవలను అందిస్తున్నాయో, ఏ సబ్జెక్టులను ఏయే వెబ్సైట్లు బోధిస్తున్నాయో జనాలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ‘గూగుల్’ పుణ్యాన చాలా ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు జనాలకు చేరువయ్యాయి. మనకు నచ్చిన అంశాన్ని ఎన్నుకుని, ఆన్లైన్లో ఆ అంశాన్ని బోధిస్తున్న సంస్థలేవేవి ఉన్నాయో ‘గూగుల్’ను అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది. అప్పటి వరకు మనం కనీవినీ ఎరుగని వందలాది వెబ్సైట్లను చిటికెలో పరిచయం చేస్తుంది. ఈ-లెర్నింగ్ ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడంలో గూగుల్ గురుతర పాత్ర పోషిస్తోంది. గూగుల్ సారథిగా భారతీయుడు ఇద్దరు అమెరికన్ కుర్రాళ్లు ప్రారంభించగా, అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘గూగుల్’ కంపెనీకి సారథిగా సుందర్ పిచయ్ గత ఏడాది బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది చేపట్టిన కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘అల్ఫాబెట్’కు ‘గూగుల్’ అనుబంధ సంస్థగా మారింది. ‘గూగుల్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ ‘అల్ఫాబెట్’కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, మరో వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ ‘అల్ఫాబెట్’ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచయ్ని నియమించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ పట్టభద్రుడైన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యలు పూర్తి చేసుకున్న సుందర్ పిచయ్ 2004లో ‘గూగుల్’లో చేరి, వివిధ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఈవోగా ఆయన ‘గూగుల్’ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్ గురించి అవీ... ఇవీ... ♦ తొలినాళ్లలో గూగుల్ సెకనుకు 30-40 పేజీలను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. ఇప్పుడు ఏకంగా కొన్ని మిలియన్ల పేజీలను ప్రాసెస్ చేయగలుగుతోంది. పద్దెనిమిదేళ్ల వ్యవధిలోనే ‘గూగుల్’ తన వేగాన్ని అపరిమితంగా పెంచుకుంది. ♦ ఇంటర్నెట్లో గూగుల్ కంటే ‘యాహూ’ నాలుగేళ్ల సీనియర్ సంస్థ. ‘గూగుల్’ శరవేగంగా ఎదుగుతుండటంతో, దానిని కొనుగోలు చేయాలని ‘యాహూ’ భావించింది. ‘గూగుల్’ కొనుగోలుకు 2002లో 300 కోట్ల డాలర్లు ఇవ్వజూపింది కూడా. అయితే, ‘గూగుల్’ వ్యవస్థాపకులు ఆ ఆఫర్‌ను తోసిపుచ్చారు. ♦ ‘గూగుల్’ స్పెల్లింగ్ ఒక అచ్చుతప్పు. ‘గూగుల్’ అసలు స్పెల్లింగ్ ‘జీఓఓజీఓఎల్’. అంటే, ఒకటి తర్వాత వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. ♦ ‘గూగుల్’ తొలిదశలో రూపొందించిన అల్గొరిథమ్ ‘పేజ్‌ర్యాంక్’ పేటెంట్ ఇప్పటికీ స్టాన్ఫోర్డ్ వర్సిటీ అధీనంలోనే ఉంది. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో ఇప్పుడైతే వివిధ సందర్భాల్లో డూడుల్స్ కనిపించడం మామూలైంది గాని, తొలి రోజుల్లో ‘గూగుల్’ లోగో యథాతథంగానే కనిపించేది. అయితే, గూగుల్ వ్యవస్థాపకులు ల్యారే పేజ్, సెర్జీ బ్రిన్లు నెవడాలో జరిగే ‘బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్’ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. తాము కార్యాలయంలో ఉండటం లేదనే సమాచారాన్ని యూజర్లకు తెలియజేసేందుకు తొలిసారిగా అప్పుడు ‘బర్నింగ్ మ్యాన్’ డూడుల్‌ను హోమ్‌పేజీలో పెట్టారు. దానికి స్పందన బాగుండటంతో ప్రత్యేక సందర్భాల్లో డూడుల్స్ పెట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో లోగో, సెర్చ్ బాక్స్ తప్ప మిగిలిన భాగమంతా తెల్లగా ఖాళీగానే ఉంటుంది. మిగిలిన వెబ్సైట్ల హోమ్పేజీల మాదిరిగా అందులో ఎలాంటి రంగులు, చమక్కులు, డిజైన్లు కనిపించవు. ఎందుకంటే, ‘గూగుల్’ వ్యవస్థాపకులిద్దరికీ వెబ్‌పేజీ డిజైనింగ్‌కు అత్యవసరమైన హెచ్‌టీఎంఎల్‌లో పరిజ్ఞానం అంతంత మాత్రమే. ♦ ‘గూగుల్’ భాషపై కూడా తనదైన ముద్ర వేసింది. ఆక్స్ఫర్డ్, వెబ్‌స్టర్ డిక్షనరీలో 2006లో ముద్రించిన ఎడిషన్లలో ‘గూగుల్’ పదాన్ని క్రియాపదంగా గుర్తించాయి. ఇంటర్నెట్లో సమాచారాన్ని వెదుకులాడటానికి ‘గూగులింగ్’ అనడం ఏకపద ప్రత్యామ్నాయంగా మారింది. గూగుల్ పరిమితులు... ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే కాలం పోయి ‘అన్నీ గూగుల్లోనే ఉన్నాయష’ అనుకునే కాలం వచ్చిపడింది. పిడికిట్లోకి ప్రపంచం ఇమిడిపోయే దశలో దూసుకొచ్చిన గూగుల్ చాలామందికి గురువుగా మారింది సరే, గురువులకు పరిమితులు ఉన్నట్లే, గూగుల్ పరిమితులు గూగుల్కూ ఉన్నాయి. వాటిని గుర్తించకుండా గూగుల్ చెప్పిందే వేదమనే భ్రమలో పడితే మాత్రం తంటాలు తప్పవు. అందువల్ల గూగుల్ పరిమితుల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా... * గూగుల్ సెర్చ్‌లో ఏదైనా పదం కొడితే, ఆ పదానికి సంబంధించిన సమస్త లింకులూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఒక్కో లింకు ఒక్కో వెబ్‌పేజీకి దారితీస్తుంది. కొన్ని వెబ్‌పేజీలలో ఇక్ష్వాకులం నాటి సమాచారం ఉంటుంది. పేజీని ప్రారంభించిన తర్వాత అప్డేట్ చేయకుండా ఏళ్ల తరబడి వదిలేసిన పేజీలు ఉంటాయి. అలాంటి సమాచారాన్ని నమ్ముకోలేం. * వెబ్పేజీల్లో పొందుపరచిన విషయాలలోని నాణ్యతను, కచ్చితత్వాన్ని గుర్తించడం గూగుల్‌కే కాదు, ఏ సెర్చ్ ఇంజన్‌కూ సాధ్యం కాదు. వివిధ విషయాల రచనా నాణ్యతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడం మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యం. * సాంకేతిక పురోగతి ఫలితంగా గూగుల్‌తో పాటు చాలా సెర్చ్ ఇంజన్లు హెచ్‌టీఎంఎల్‌లో లేని అంశాలను కూడా చాలావరకు చదవగలుగుతున్నాయి. అయినప్పటికీ తగిన వ్యాఖ్య, సమాచారం లేకుండా అప్లోడ్ చేసిన ఫొటోలు, ఆడియో, వీడియో సమాచారాన్ని విశ్లేషించడం ఇప్పటికీ వీటికి దుస్సాధ్యంగానే ఉంటోంది. * వివిధ సాంకేతిక కారణాల వల్ల సెర్చ్ ఇంజన్లకు అందని వెబ్‌పేజీలు కూడా చాలానే ఉంటాయి. అలాంటి వెబ్‌పేజీలలో ఏదైనా విలువైన సమాచారం ఉన్నా, వాటి యూఆర్ఎల్ మనకు కచ్చితంగా తెలిస్తే తప్ప వాటిని చూడటం సాధ్యం కాదు. వాటిని వెదుకులాడటానికి సెర్చ్ ఇంజన్లపై ఆధారపడటం కష్టమే. - పన్యాల జగన్నాథదాసు -
గూగుల్ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన పిచాయ్
శాన్ హోసె: ఆన్ లైన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో సంప్రదాయాన్ని సీఈవో సుందర్ పిచాయ్ బ్రేక్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ ఇన్వెస్టర్లకు ఆ సంస్థ నుంచి లేఖలు వెళ్లాయి. అయితే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ లేఖలు రాయలేదు. సంప్రదాయానికి భిన్నంగా సీఈవో పిచాయ్ లేఖలు రాశారు. నిజానికి పిచాయ్ గూగుల్ వ్యవస్థాపకుడు కాదు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం దక్కిందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంతేకాదు పిచాయ్ పనితీరు పట్ల లారీ పేజ్, సెర్జీ బ్రిన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖలో పిచాయ్ ను పరిచయం చేస్తూ లారీ పేజ్ రాసిన ఇంట్రడక్షన్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. పిచాయ్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిచాయ్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ప్రారంభమైన కొత్తలో సమాచారం అందించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించిందని తర్వాత ప్రాధాన్యాలు మారాయన్నారు. 'టెక్నాలజీ అంటే డివైసెస్ లేదా ప్రొడక్టులను తయారు చేయడమే కాదు. లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. టెక్నాలజీ అనేది ప్రజాస్వామ్యీకరణ శక్తి. సమాచారం ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించాల'ని పిచాయ్ పేర్కొన్నారు. ప్రజలు విభిన్న తరహాలో సమాచారం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ, స్మార్ట్ ఫోన్ సంబంధిత టెక్నాలజీలో గూగుల్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. తన లేఖను గూగుల్ ప్లస్, ట్విటర్, పేస్ బుక్ లో షేర్ చేశారు.