![Elon Musk Affair With Google Sergey Brin Wife Claims Reports - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/25/Elon_Musk_Affair_Sergey.jpg.webp?itok=OwVK1WXg)
వాషింగ్టన్: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సంచలనాలకే కాదు.. వివాదాలకు కూడా కేరాఫ్. రహస్య డేటింగ్, ఇల్లీగల్ ఎఫైర్‌లు, రాసలీలలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాంటి వ్యక్తి తాజాగా ట్విటర్ డీల్-బ్రేక్.. లీగల్ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఆయన మీద మరో సంచలన కథనం.. సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడు. అంతేకాదు తన సలహాదారులకు, అనుచరులకు ఎలన్ మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. అంతెందుకు ఎలన్ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసింది సర్జీనే. అలాంటిది సర్జీ, మస్క్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో..
సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్‌హన్Nicole Shanahanతో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్‌లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం.
సరిదిద్దలేని విభేధాలంటూ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టు కెక్కాడు సర్జీ బ్రిన్. 2021 డిసెంబర్ నుంచి తాను, తన భార్య విడిగా ఉంటున్నామని ఆయన ప్రకటించాడు కూడా. కూతురిని ఇద్దరి సంరక్షణలో చూసుకుంటామని, అయితే ఏ విషయంలోనూ నికోల్ షన్‌హన్ నుంచి తనకు మద్దతు అవసరం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సర్జీ. ఈ సంచలనాత్మక కథనంపై సర్జీ, నికోల్, మస్క్.. ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్‌బై!
Comments
Please login to add a commentAdd a comment