ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగులు ప్రతి రోజు 8 నుంచి 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి 9 కాస్త..12 గంటలు కూడా అవుతుంది. కానీ రోజుకి రెండు గంటలే పనిచేస్తూ నెలకు లక్షకు పైగా జీతం తీసుకుంటే ఎలా ఉంటుందో? ఒక్కసారి ఊహించుకోండి. ఇదిగో ఇప్పుడు ఇదే అంశం బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ట్విటర్ యూజర్ నెరసియాన్ (nearcyan) తాను మరో ఇద్దరు గూగుల్ ఉద్యోగులతో కలిసి డిన్నర్ చేసే సమయంలో జరిగిన సంభాషణను నెటిజన్లతో పంచుకుంది. ఆ సమయంలో ఒకరంటే ఒకరు రోజుకి రెండు గంటలే పనిచేస్తున్నాం’ అంటూ గొప్పగా చెప్పుకున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
వారిలో ఒకరు రోజుకి రెండు గంటల పని చేసి నెలకు 5లక్షల డాలర్లు ( సుమారు రూ.45 లక్షలు). అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ తన స్టైల్‌లో ‘వావ్’ అంటూ రిప్లయి ఇచ్చారు.
had dinner with two google employees and they got into a bragging competition about who works fewer hours, the guy @ 2 hrs/day for 500k tc won
— near (@nearcyan) July 18, 2023
ఈ పోస్ట్‌పై.. ‘గూగుల్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చాలా తెలివిగా పనిచేస్తారు. రోజు వారి పనిని పూర్తి చేసేందుకు రెండు గంటలు మాత్రమే అవసరం అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. అయితే, తక్కువ పని గంటలతో వర్క్ విషయంలో ఆకట్టుకోలేరు. ఒక వ్యక్తి చేసే పనిని బట్టి అతని పాత్ర తెలుస్తుంది’ అంటూ మరో యూజర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి👉 అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
Comments
Please login to add a commentAdd a comment