అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు | Sakshi
Sakshi News home page

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

Published Mon, May 6 2024 7:40 AM

అంజన్

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని ఆదివారం జిల్లా అడిషనల్‌ జడ్జి నారాయణ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆయన గోత్రనామాలపై ప్రత్యేక మంత్రాలు చదివి, అనంతరం తీర్థప్రసాదాలు ఆశీర్వచనం అందించారు.

మోహన్‌రావుపేటలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి చాయ్‌పే చర్చ

కోరుట్ల రూరల్‌: మండలంలోని మోహన్‌రావుపేటలో బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆదివారం చాయ్‌పే చర్చ నిర్వహించారు. గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్‌ వద్ద ఆగి చాయ్‌ తాగుతూ యువకులతో మాట్లాడారు. స్థానిక సమస్యలు, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లపై అడిగి తెలుసుకున్నారు. గోవర్ధన్‌ వెంట మాజీ ఎంపీటీసి దుంపెట రమేశ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు బండ మల్లేశ్‌ యాదవ్‌, తదితరులున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన

కథలాపూర్‌(వేములవాడ): కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని, వాటి ఆధారంగా దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మండలంలోని పోసానిపేట, దుంపేట, దూలూర్‌, బొమ్మెన, తక్కళ్లపెల్లిలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ డీసీసీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ అజీమ్‌, పులి హరిప్రసాద్‌, కారపు గంగాధర్‌, అల్లూరి దేవా రెడ్డి, రాజారెడ్డి, జీవన్‌రెడ్డి, కల్లెడ గంగాధర్‌, గడ్డం చిన్నారెడ్డి, వంగ మహేశ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు అండగా నిలవాలి

మెట్‌పల్లి: లోక్‌సభ ఎన్నికల్లో కుల సంఘాలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆది శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం మున్నూరు కాపుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నాయకులు కొమొరెడ్డి కరం, విజయ్‌అజాద్‌, పట్టణాధ్యక్షుడు జెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి

పెగడపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌.. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్‌, బతికపల్లిలో గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ప్రజల ను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు మరో సారి ఓటేస్తే నీళ్లు, కరెంటు రాదని ఎద్దెవా చేశా రు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల గొంతుకనై పార్లమెంట్‌లో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించారు. తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ శోభ, పార్టీ రాష్ట్ర నాయకుడు రమణారావు, పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచి అంజ మ్మ, మల్లేశం, గంగాధర్‌, షకీల్‌, తిరుపతి, వెంకటేశం, రవి, రాజశేఖర్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
1/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
2/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
3/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
4/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
5/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

అంజన్న సన్నిధిలో   జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు
6/6

అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్‌ జడ్జి పూజలు

Advertisement
 
Advertisement