Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

Serial Actor Chandu: డిప్రెషన్‌లో నటుడు... తన చివరి వాట్సాప్‌ చాట్‌ వైరల్‌.. వెళ్లిపోతేనే కరెక్ట్‌ అంటూ..

Published Sat, May 18 2024 4:53 PM

Serial Actor Chandrakanth Last Whatsapp Chat Goes Viral

తెలుగు సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 

ఐదేళ్లుగా నటితో సహజీవనం
తల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్‌ చాట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.

ఈ జన్మకు చాలు
నేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్‌. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్‌ చేశాడు. ఈ చాట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి

Advertisement
 
Advertisement
 
Advertisement