ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, May 18 2024 6:15 AM

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కల్వకుర్తి టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 8, 10వ తరగతి పాసై.. 14 ఏళ్లు పైబడిన విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్‌ లక్ష్మణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు గాను 10వ తరగతి మెమో, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, బోనోఫైడ్‌, కుల ధ్రువీకరణ, పాస్‌ ఫొటో జతచేసి www.iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో వచ్చేనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

బెస్ట్‌ అవైలబుల్‌

రెసిడెన్షియల్‌లో..

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను బెస్ట్‌ అవైలబుల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 1, 5 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రాంలాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను శనివారం నుంచి వచ్చే నెల 7వరకు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. పాఠశాలలో ప్రవేశానికి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్‌ నం.63039 64467ను సంప్రదించాలని కోరారు.

దోస్త్‌ ద్వారా డిగ్రీలో..

కొల్లాపూర్‌: దోస్త్‌ ద్వారా డిగ్రీలో అడ్మిషన్లు పొందాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రామరాజుయాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో చేరే విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారికి ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. న్యాక్‌ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలల్లో కొల్లాపూర్‌ డిగ్రీ కళాశాల ఒకటన్నారు. నిపుణులైన అధ్యాపకులు కళాశాలలో అందుబాటులో ఉన్నారన్నారు. అడ్మిషన్ల కోసం దోస్త్‌ కన్వీనర్‌ సి.రమేష్‌కుమార్‌ సెల్‌ నెం.85199 91419ను సంప్రదించాలని చెప్పారు.

బైక్‌ల వేలంలో పాల్గొనండి

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న 6 స్క్రాప్‌ ద్విచక్రవాహనాలను బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలంను ఈ నెల 28న నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.

మహిళలను వేధిస్తే చర్యలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆపద సమయంలో షీటీంను సంప్రదిస్తే రక్షణ కల్పిస్తామని ఏఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో షీటీం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే సెల్‌ నం.87126 57675ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం ఏఎస్‌ఐ విజయలక్ష్మి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement