ప్రజలందరికీ కృతజ్ఞతలు: చల్లా | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ కృతజ్ఞతలు: చల్లా

Published Wed, May 15 2024 1:20 AM

ప్రజలందరికీ కృతజ్ఞతలు: చల్లా

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా తమ అమూల్యమైన సమయాన్ని పాలమూరు ప్రాంతానికి కేటాయించి ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులతోపాటు గత కొన్ని నెలలుగా శక్తివంచన లేకుండా కాంగ్రెస్‌ పార్టీ విజయతీరాల వైపు నడిపించడానికి ఎత్తి జెండాను దించకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎప్పటికప్పుడూ పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించి పోలింగ్‌ను శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, పోలీస్‌ యంత్రాంగానికి ఆయన అభినందనలు చెప్పారు.

● గత నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొన్న చల్లా వంశీచంద్‌రెడ్డి పోలింగ్‌ ముగిసిన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లోని తాను ఉంటున్న అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలు మహాక్షరెడ్డి, కృష్ణదేవారెడ్డితో కలిసి బొమ్మలతో ఆటలాడుకుంటూ సరదాగా ముచ్చటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement