డీజిల్‌ కుంభకోణంపై రీజినల్‌ డైరెక్టర్‌ విచారణ | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కుంభకోణంపై రీజినల్‌ డైరెక్టర్‌ విచారణ

Published Sun, May 19 2024 7:40 AM

డీజిల

వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో 2022లో డీజిల్‌ కుంభకోణానికి పాల్పడిన అప్పటి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నగేశ్‌పై మున్సిపల్‌ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ షాహిద్‌ మసూద్‌ శనివారం విచారణ చేపట్టారు. డీజిల్‌ కుంభకోణానికి పాల్పడిన నగేశ్‌ను ఆ సమయంలో కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగా రీజినల్‌ డైరెక్టర్‌ విచారణకు వచ్చారు.

శతాధిక వృద్ధుడి మృతి

కోనరావుపేట(వేములవాడ): మండలం మల్కపేటకు చెందిన గెంటె రామయ్య(103) వృద్ధాప్య కారణాలతో శనివారం మృతిచెందాడు. ఆయనకు నాలుగు తరాల కుటుంబసభ్యులు ఉన్నారు. రామయ్య భార్య గత కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం.

8 నుంచి జిల్లాస్థాయి శిక్షణ తరగతులు

వేములవాడ: సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు వేములవాడలో జూన్‌ 8 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముష్కం రమేశ్‌ తెలిపారు. వేములవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ఎంపిక చేసిన 100 మంది ముఖ్య నాయకులకు రాష్ట్ర పార్టీ నాయకులు శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్‌, గురిజాల శ్రీధర్‌, నాయకులు గణేష్‌, అశోక్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

డీజిల్‌ కుంభకోణంపై రీజినల్‌ డైరెక్టర్‌ విచారణ
1/1

డీజిల్‌ కుంభకోణంపై రీజినల్‌ డైరెక్టర్‌ విచారణ

Advertisement
 
Advertisement
 
Advertisement