Health
-
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్ఇన్లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు. వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్‌లో తెలిపారు మిశ్రా. "అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం. ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్‌ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్‌కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?) -
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం. టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ బుద్ధిమాంద్యం అనే అపోహ ఉందిఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిదిఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు. పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్ఓపికగా నేర్పాలిఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి3 స్థాయిల్లో ఆటిజమ్పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు. మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది. మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది. సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని.. » జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్పీడీ). » నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్డీ). » కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు. » కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు. ఎందుకుఇలాంటి సమస్యలు?ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి... » కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల.. » బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల.. ఆ అధ్యయనాల్లోదేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఏం చేయాలి మరి.. ?దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.ఎలాంటి మందులూ లేవు.. ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్...ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు.. » పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం » వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం » ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం » వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం » రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం » ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ. » ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు » రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. -
బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.డైరెక్ట్‌గా సిగ్నల్ ఇవ్వడమే..పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్‌ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్‌ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్‌మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.తేడా వస్తే ఊబకాయమే..!జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీఇది ‘సెట్’ అయ్యేదెట్లా?అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్‌ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి. -
Fake Hospitals ఆస్పత్రులపై నియంత్రణేదీ?
ఉభయ తెలుగు కాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆస్పత్రులు - ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకోవడమే ధ్యేయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో, 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 276 ఆస్పత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అనుమతులు లేని ఆస్ప త్రుల్లో అనుభవం లేని వైద్యులు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇటీవల రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల (మార్చి 29న) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ఆస్పత్రిని సీజ్ చేయడం, ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయడం ఈ సమస్య లోతును సూచిస్తోంది. ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా హైదరాబాదుకు వైద్యం కోసం ఎందరో వస్తూ ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.ప్రజల ఆరోగ్యం వ్యాపార సరుకుగా మారిన ఈ పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్పత్రుల దుఃస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లు బెడ్లు, సిబ్బంది లేకపోవడంతో సేవలు అందించడం సవాల్‌గా మారింది. దీనికితోడు, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేయడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ, దానికోసం సమర్థవంతమైన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది స్వాగతించదగిన ప్రతిపాదన. అయితే, ఈ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలతో అమలు జరగాలి. – ముద్దం నరసింహ స్వామి, సీనియర్ జర్నలిస్ట్ -
పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత..
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్‌గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్‌గా ఇలా చెక్పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్‌గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..నివారించాల్సిన ఆహారాలు..పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట. అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి. కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట. ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు. తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది. చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి. పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. View this post on Instagram A post shared by LogaPritika Srinivasan (@fitmom.club) (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025 -
ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్‌తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్ -
వేసవిలో డీ హైడ్రేషన్ కట్టడికి కొబ్బరి నీరే తప్పనిసరా..?
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్‌కి చెక్‌పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్‌గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్‌కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు. లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్‌గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్‌కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు. ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు. ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. -
7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్
అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి.వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కురీ్చలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి.స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి.స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి.ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి.ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.హై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి.లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.సైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్Œలోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. -
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్‌కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్‌కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్‌లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్‌ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?) -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్‌లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్‌కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్‌కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్‌కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్‌కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
అడినాయిడ్స్ వాపు ..?
అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి కాస్త వెనకన, నోటి లోపల అంగిటి పైభాగంలో ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా ఉంటాయి. రెండు రకాలుగా వీటి ఉనికి తెలుస్తుంది. మొదటిది... ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా... ఇక రెండోది తల ఎక్స్–రే తీసినప్పుడు, ఈ తల ఎక్స్–రేలో వాటి పరిమాణం కూడా తెలుస్తుంది. అడినాయిడ్స్ అన్నా, టాన్సిల్స్ అన్నా... ఈ రెండూ ఒకటేనని చాలామంది పొరబడుతుంటారుగానీ... ఈ రెండూ వేర్వేరు. నోరు బాగా తెరచినప్పుడు టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ... అడినాయిడ్స్ కనిపించవు. నిజానికి అడినాయిడ్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలను కాపాడుతుంటాయి. అయితే వాటికే ఇన్ఫెక్షన్స్ సోకడం కారణంగా అడినాయిడ్స్ వాచినప్పుడు వచ్చే సమస్య గురించి తెలుసుకుందాం. అడినాయిడ్స్‌లో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు దేహంలోకి ప్రవేశించగానే... వాటిని శత్రుకణాలుగా గుర్తించి, వాటితో ΄ోరాడుతాయి. ఇలా ΄ోరాటంలో వాటిని తుదముట్టించడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల వాళ్ల పసి దేహాలను కాపాడటానికి ప్రకృతి అడినాయిడ్స్ అనే ఏర్పాటు చేసింది. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ... వాళ్ల వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుండటం వల్ల కొంతకాలానికి ఇవి క్రమంగా సైజు తగ్గుతూపోతాయి. ఐదేళ్ల వయసులో దాదాపుగా ఇవి పూర్తిగా కృశించి΄ోతాయి. వారికి యుక్తవయసు వచ్చేనాటికి అవి పూర్తిగా మటుమాయమవుతాయి. అడినాయిడ్స్‌లో ఇన్ఫెక్షన్లతో వాపు ఇలా... కొందరు చిన్నారులపైకి బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వచ్చే అవకాశాలుంటాయి. అలా జరగడం వల్ల ఇక అవి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వాటి నుంచి దేహాన్ని కాపాడలేవు. దేహంపై బ్యాక్టీరియా, వైరస్ దాడి పెరిగిన కొద్దీ వాటిలో వాపు కూడా పెరుగుతూపోతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు పక్కనుండే టాన్సిల్స్‌కు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి, వాటిల్లో కూడా వాపు రావచ్చు. ఇలా వాపు వచ్చిన కొద్దీ పిల్లలు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. దాంతో చిన్నారుల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అవి... ముక్కురంధ్రాలు మూసుకు΄ోయి గాలి పీల్చడం ఇబ్బందిగా మారడంతో నోటితో గాలి పీల్చడం. ∙నిద్ర సమయంలో పిల్లలో గురక రావడం. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టం కావడం. ∙కొన్నిసార్లు మెడ్ర ప్రాంతంలోని గ్రంథులకూ వాపు రావడం. కొంతమందిలో వినికిడి సమస్యలూ లేదా దంత సమస్యలు కనిపించడం. ఊపిరి సరిగా అందక నిద్రాభంగమై లేచి ఏడ్వటం.చికిత్స...అడినాయిడ్స్‌లో వాపు వచ్చిన ప్లిలల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కారణంగా వారికి తరచూ జ్వరాలు వస్తుంటాయి. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు తొలుత యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. త్వరగా చికిత్స పొందని పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు అడినాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా డాక్టర్లు వాటిని తొలగించాల్సి వస్తుంది. డా. ఈసీ వినయ కుమార్, ఈఎన్టీ నిపుణుల (చదవండి: పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?) -
పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?
‘శతమానం భవతి’ అన్నారు మన పెద్దలు. నూరేళ్లు జీవించి పిల్ల పాపల ఆనందాలు చూసి వీడ్కోలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటారు. ఒకప్పుడు ఆయుఃప్రమాణం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానాల వల్ల ఆయుఃప్రమాణం పెరిగింది. అయితే వైద్య విధానం ఎంత ఆధునికంగా ఉన్నా అది పూర్తిగా జబ్బు నయం చేయలేనివే ఎక్కువ. యధాతథ స్థితిని కొనసాగించి ఆయుష్షును పొడిగించగలుగుతున్నాయి. ఇది ఒక రకంగా వరం. మరో రకంగా ఇబ్బందిగా మారుతోంది. పెద్దవాళ్లు జబ్బుపడి ఎక్కువ రోజులు సహాయం పొందే స్థితికి వస్తే ఇంటిలో సమస్యలు మొదలవుతున్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి?మన దేశంలో 70 ఏళ్ల వయసు దాటాక స్త్రీల కంటే పురుషులే ఎక్కువ జబ్బుల గురించి ఆందోళన చెందుతున్నారట. దానికి కారణం మంచాన పడితే ఎవరు చూడాలి అనేది ఒకటైతే పూర్తి కదలికలు నియంత్రణలోకి వెళితే జీవితం చాలా కష్టంగా మారుతుందనే భయం ఒకటి. స్త్రీలకు సేవ చేసే స్త్రీలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటే పురుషులకు సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 70లు 80లకు చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడితే బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయం మీద చాలా ఇళ్లల్లో ఒక అనిశ్చితి నెలకొంటోంది.స్పష్టత వచ్చే వీలు ఉందా?తల్లిదండ్రులు జబ్బుపడితే వారి బాగోగులు చూసే స్థితిలో ఇప్పుడు సంతానం ఉండటం లేదు. దానికి కారణం బిజీ బతుకుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సం΄ాదించాల్సి వస్తోంది. దానికితోడు పిల్లల కెరీర్లకు వారి అవసరాలకు సమయం చాలదు. మధ్య తరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా త్రీ బెడ్ నివాసాలు ఉండి జబ్బుపడ్డ తల్లిదండ్రులకు ఒక గది ఇచ్చే వీలు 90 శాతం ఇళ్లల్లో ఉండటం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని అంటీముట్టనట్టు తయారవుతున్న సంతానం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది తల్లిదండ్రులను మరింత బాధపెడుతోంది. ఇప్పుడే ఇలా వీరుంటే రేపెలా అనే చింత పట్టుకుంటోంది.కూర్చుని మాట్లాడుకోవాలిఅంతా బాగున్నప్పుడే తల్లిదండ్రులు, పిల్లలు కూచుని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల అనారోగ్యం కోసం వారు సొంతంగా దాచుకున్న నిధిని, పిల్లలు తమ వంతుగా ఇవ్వగలిగిన నిధిని కలిపి ఒకచోట ఉంచి దాని గురించి సమాచారం ఇచ్చుకోవాలి. చూసే వీలు లేకపోతే ఏజెన్సీల సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ హాస్పిటల్లో చేర్చాలో ముందే నిర్ణయించుకొని ఆ హాస్పిటల్లో తరచూ చెకప్‌లు చేయిస్తూ ఉంటే సమయానికి కొత్త పేషంట్‌గా మారే పరిస్థితి ఉండదు. బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఏయే అనారోగ్యాలకు ప్రభుత్వ/చారిటీ ఆస్పత్రులు అతి తక్కువ చార్జీలకు వైద్యసేవలు ఇవ్వగలవో తెలుసుకుని అందరూ ఆ సమాచారం పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాన్నే వెచ్చించి ఉంటారు కాబట్టి వారికి కచ్చితంగా సమయం ఇవ్వగలమని, బాధ్యతను పంచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించాలి. సాధారణంగా ఎవరో ఒకరి నెత్తి మీద ఈ బాధ్యతను తోసే ధోరణి కొందరిలో ఉంటుంది. అది సమస్యను తీవ్రంగా పెంచుతుంది.పంతాలు విడవాలితల్లిదండ్రులు పెద్దవయసు వచ్చే వేళకు జీవితంలో వారి వల్ల లేదా సంతానం వల్ల ఎన్నో తప్పొప్పులు జరిగి పంతాలు పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు. కాని తల్లిదండ్రులు అనారోగ్య స్థితికి చేరుకునేవేళకు అవి సమసే వాతావరణం కల్పించుకోవాలి. క్షమ చాలా సమస్యలు దూరం చేస్తుంది. మనుషులు దూరమయ్యాక చేయగలిగింది ఏమీ లేదు. అందుకే పెద్దవారు వారి చివరిదశను ప్రశాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఇందుకు సామరస్య వాతావరణంలో ఎంత మాట్లాడుకుంటే అంత స్పష్టత వస్తుంది. వాట్సప్‌లు, ఫోన్ కాల్స్ మాని ఎదురుబొదురు కూచుంటే తప్ప ఇలాంటి సందర్భాలలో పరిష్కారాలు దొరకవు. అసలే జబ్బుపడ్డ పెద్దవారికి ఆత్మీయమైన ఇంటి వాతావరణానికి దగ్గర చేయడం అతిఒక్క కుటుంబ సభ్యుని బాధ్యత.(చదవండి: కాన్పులో రక్తస్రావం కావడంతో ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?) -
వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్‌కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది. దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్‌తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.అధిక బరువు స్థూలకాయంశరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడంమితిమీరిన ఒత్తిడఇతరేతర ఆరోగ్య సమస్యలుజన్యు కారణాలుకొన్ని ఔషధాల దుష్ప్రభావంచికిత్స పద్ధతులుఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడంఅధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడంస్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడంస్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.మన దేశంలో స్థూలకాయం తీవ్రతమన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరంపొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. పిల్లల్లో స్థూలకాయం లక్షణాలుకొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. బీఎంఐ పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.ఇవీ లక్షణాలుఒక పట్టాన తగ్గని తలనొప్పిఅధిక రక్తపోటువిపరీతమైన దాహంతరచు మూత్రవిసర్జన చేయడంఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడంవయసుకు తగిన ఎదుగుదల లేకపోవడంపిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. (చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలుపిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.డాక్టర్ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడుస్థూలకాయంపై పోరాటందేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్ యాదవ్, ఒలింపిక్స్ విజేత, షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్‌లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..) -
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
నచ్చినట్లే ఉంటున్నారా..?
ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. మీ గుర్తింపును కాపాడుకోండిఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దుప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్ స్పేస్‌ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.పీస్ ఆఫ్ మైండ్ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్‌గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.నైతిక విలువలపై రాజీ వద్దుకొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిలబడండి.నో చెప్పడం నేర్చుకోండిఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.కలల్ని, ఆశయాల్ని వదులుకోకండిచాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.మీకు మీరే ముఖ్యంమన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. (చదవండి: పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి; ఈ పేస్ట్‌లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్‌గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్‌లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్‌కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్‌కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
చంటి పిల్లలతో జాగ్రత్త : నాటు వైద్యంతో ప్రమాదం!
వేసవి కాలం ప్రారంభమైతే చాలు చికెన్ ఫాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటి సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఈ సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకువస్తుంటే.. కొంతమంది పూర్వకాలం పద్ధతుల్లో నాటు వైద్యం చేయిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు సోకే అవకాశం ఉన్నా చిన్నారులకు త్వరగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా బిళ్లలు, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముందు జాగ్రత్తతోనే ఈ ప్రమాదకర అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, 15 ఏళ్లలోపు బాలబాలికలపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు. జాగ్రత్త వహించాలి రామచంద్రపురం నియోజకవర్గంలోని ఐదేళ్లలోపు చిన్నారులు కాజులూరు మండలంలో 3887 మంది, కె.గంగవరం మండలంలో 4922 మంది, రామచంద్రపురం మండలంలో 3890 మంది మొత్తం 12,699 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా వ్యాధి సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడంతో ఆహారం సరిగ్గా తీసుకోలేక బాగా నీరసించిపోతారు. చర్మంపై నీటి పొక్కులు, దురదలు వంటి లక్షణాలు వారం నుంచి పదిహేను రోజులకు పైగా బాధిస్తాయి. తొలుత జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు క్రమంగా వాటి ప్రభావం చూపుతాయి. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం వైపు వెళ్లరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, వేగంగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఆటలమ్మ... జాగ్రత్తలు సాధారణంగా ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆటలమ్మ అంటువ్యాధి కావడం వల్ల వ్యాధి సోకిన వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. ప్రతి రోజూ స్నానం చేయవచ్చు. జ్వరం ఉంటే వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. దురద రాకుండా పరిశుభ్రత పాటించాలి. చిన్నారులకు చేతి గోళ్లు తీసివేయడం మంచిది. మంచి పౌష్టికాహారం అందించాలి. ఆటలమ్మ వచ్చిన వారు కోరినవన్నీ ఇవ్వాలన్న అపోహతో అన్ని రకాల తినుబండారాలను ఇవ్వడం మంచిది కాదు. తేలికగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. గవదబిళ్లలు... జాగ్రత్తలు గవదబిళ్లల వ్యాధిలో తీవ్రంగా గొంతునొప్పి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం మంచిది. నాటువైద్యం ప్రమాదకరంచికెన్పాక్స్, గవద బిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వైద్యులను సంప్రదించాలి. చాలామంది మూఢనమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకుని అవసరమైన మందులకు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భిణులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటువైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. వైద్యులను సంప్రదించాలి అటలమ్మ, గవద బిళ్లలు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చిన్న పిల్లలు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి. – ఎన్.ప్రశాంతి, డివిజనల్ వైద్యాధికారి, రామచంద్రపురం -
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్‌ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్‌లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్‌ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్‌లు వస్తాయో తెలిపారు. స్లిమ్‌గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్‌ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్‌ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్‌గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్‌ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్‌తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్‌తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 (HCoV-HKU1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా నివేదికల ప్రకారం హెచ్ కేయూ1 వైరస్ కారణంగా బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. అసలు హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి? కరోనా అంత తీవ్రమైనదా? తెలుసుకుందాం ఈ కథనంలో.హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి?మానవ కరోనావైరస్ HKU1 (హాంకాంగ్ విశ్వవిద్యాలయం) 2004లో తొలుత గుర్తించారు.ఇది కరోనా వైరస్ జాతికి చెందినదే. కానీ అంత తీవ్రమైనదే. అయితే అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నివారించాలని వైద్యులు కోరుతున్నారు. బాధిత మహిళను ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. ఇది కోవిడ్-19 లాంటిది కాదని, కోవిడ్-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ తీవ్రమైనదని వారు స్పష్టం చేశారు.హ్యూమన్ కరోనావైరస్ HKU1ని బెటాకోరోనావైరస్ హాంగ్కోనెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల హ్యూమర్ కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 229E, NL63, OC43, HKU1.. ఈ వైవిధ్యాలు సాధారణంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి నుండి ఊపిరి ఆడకపోవడం లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.లక్షణాలు ఏమిటి?సీడీసీ (CDC), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలుంటాయి. నిజానికి చాలా సాధారణమైనవి, తేలికపాటివి, కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే బ్రోన్కియోలిటిస్ , న్యుమోనియాకు దారితీస్తుంది.ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్,, గొంతు నొప్పి, అలసట తలనొప్పిఎవరికి ప్రమాదం ఉంది?వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!ఎలా వ్యాపిస్తుంది?సాధారణంగా సోకిన వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములనుంచి తుంపర్ల ద్వారా, రోగి దగ్గరి సంబంధం ఉన్నవారికి సోకవచ్చు. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు లేదా టేబుల్స్ వంటి వస్తువులపై వైరస్ జీవించగలదు. రోగి తాకిన వాటిని తాకిన వస్తువులను తాకి శానిటైజ్ చేసుకోకుండా ముక్కు, నోరు లేదా కళ్ళను తాకిన వారు వ్యాధి బారిన పడవచ్చు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?సురక్షితంగా ఎలా ఉండాలిమానవ కరోనావైరస్లకు టీకా లేదా నిర్దిష్ట చికిత్స లేదు. చాలామంది తొందరగానే కోలుకుంటారు. అయితే, కొన్ని రోజుల్లో తగ్గకపోయినా, లక్షణాలు మరింత ముదిరినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. -
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్‌లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని చేశారు. ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.ఏంటీ టైటానియం బివాకర్..క్వీన్స్‌ల్యాండ్‌లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్‌లో రక్తం ప్రసరించేలా చేస్తుంది. ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్‌కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్‌లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే. ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్‌ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్‌తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
కీళ్ల నొప్పుల చికిత్సలోమరో అధ్యాయం
హైదరాబాద్,: శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులు మాయం చేసే కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరమనే చెప్పుకోవచ్చు. బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అవసరం లేకుండానే దీనిని రూపొందించారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా డిజైన్ చేశారు. అసౌకర్యం కలగకుండా, శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నొప్పులను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు.అన్ని వయస్సుల వారికీ ఉపయోగం...అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ... “జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యవంతంగా ఉండే చికిత్స. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అన్ని వయస్కుల వారికి ప్రయోజనం చేకూర్చేలా దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా టైలర్డ్ అడ్వైజ్, ట్రీట్మెంట్, థెరఫీస్, రీహాబిలిటేషన్ , పోషకాహారం, అవసరమైన ప్రత్యామ్నయ చికిత్సలు- '3 Ts' పై దృష్టి పెడుతుంది. బాధితులు కీళ్ల సమస్యల నుంచి బయటపడటంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలితో గడిపేందుకు ఇది ఉపయోగపడనుంది. కీళ్ల పనితీరు మెరుగుపరిచి బాధితులను శక్తివంతులను చేయాలనే కృతనిశ్చయంతో మేం పని చేస్తున్నాం” అని అన్నారు. "కీళ్ల నొప్పుల నుంచి కాపాడటానికి ఈ నూతన కార్యక్రమం ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను చికిత్సలతో అనుసంధానిస్తుంది. కీళ్ల పనితీరును మెరుగుపరచడం,పూర్తి కీలు మార్పిడి అవసరం లేకుండా సమస్య నివారించడంపై మేము దృష్టి సారించాం" అని అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి అన్నారు. ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార పద్దతులతో మిళితం చేసి సమగ్ర చికిత్స మార్గాన్ని అందిస్తుంది. తద్వారా కీళ్ల సమస్యలకు ముందుగానే ప్రభావవంతమైన చికిత్స అందేలా తోడ్పడుతుంది"అని అన్నారు. జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ & మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, జూబ్లీ హిల్స్- అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి , అపోలో హాస్పిటల్స్‌లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవి తేజ రుద్రరాజు, అపోలో హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్-ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కౌశిక్ రెడ్డి, షోల్డర్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్, ఫుట్ & యాంకిల్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి పాల్గొన్నారు. -
ఎండుద్రాక్ష రికార్డు అమ్మకాలు: ఒకేరోజు 17 టన్నులు
సోలాపూర్: పండరీపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనివారం రికార్డుస్థాయిలో 17 టన్నుల ఎండుద్రాక్ష విక్రయం జరిగింది. పండరీపురం తాలూకా నాణ్యమైన ఎండుద్రాక్ష ఉత్పత్తికి ప్రస్ధిద్ధి. అందుకే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి ఎండు ద్రాక్షను కొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఈ నేపథ్యంలో పండరీపురం మార్కెట్లోని స్వప్నిల్ కొటాడియా దుకాణంలో పండరీపురం తాలూకా, భారడీ గ్రామానికి చెందిన రైతు ఆకాష్ వసెకర్కు చెందిన ఎండుద్రాక్ష పంటను కిలోకు రూ. 511 చొప్పున 17 టన్నుల మేర కొనుగోలు చేశారు. సాధారణంగా కిలోకు 200–500 మాత్రమే పలికే ఎండుద్రాక్షను అధిక ధరకు, పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రైతు ఆకాష్ వసెకర్ను యూటోపియన్ కార్ఖానా చైర్మన్ ఉమేష్ పరిచారక్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరీష్ గైక్వాడ్ సన్మానించారు. ఎండు ద్రాక్షతోఉపయోగాలు : ఎండుద్రాక్షల వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి కనుక తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలుపుష్కలంగా లభిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మంపై మొటిమలు, ముడతలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుందిఎండుద్రాక్షలో ఇనుము ఉంటుంది, ఇదిచేయడానికి సహాయపడుతుంది.ఎలా ఉపయోగించాలి?మీరు ఎండుద్రాక్షను నేరుగా తినవచ్చు, ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తాగవచ్చు, ఎండుద్రాక్షను పాలలో కలిపి తాగవచ్చు, ఎండుద్రాక్షను వివిధ వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.చదవండి: వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలా? అడ్డంగా బుక్కైన ‘ఓర్రీ’60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్గమనిక: ఎండుద్రాక్షను మితంగా మాత్రమే తినాలి. గర్భవతి అయితే, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఎండుద్రాక్షను తినే ముందు మీ డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు. -
ఔషధ గుణాల సిరి ‘ఉసిరి : దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఉసిరిని ( Amla) ఔషధ గుణాల సిరి, ఆరోగ్య సిరి అని పిలుస్తారు. ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా లభించే వాటిలో ఉసిరి ఒకటి. ఇవి కూడా సీజన్ పరంగానే లభిస్తాయి. ఉసిరికాయలు బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. సన్న నిమ్మ, చీని, మామిడి, సపోటా, సీతాఫలం తరహాలోనే ఉసిరి కూడా రైతుకు కొన్నేళ్లపాటు ఆదాయాన్ని అందిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి ప్రయోజనాలు(Helath benifits) తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉసిరి(Indian gooseberry) ముసలితనాన్ని నిరోధించడంలోనూ, శక్తివంతులుగా చేయడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఎలర్జీతో సతమత మవుతుంటారు. కాలుష్య ప్రభావంతో 30% ఏదో రకమైన ఎలర్జీతో బాధపడుతుంటారు. ఈ ఎలర్జీ ఆస్త్మా రూపంలో ఉంటుంది. ఎలర్జీ నుండి రక్షణ కల్పించడంలో ఉసిరికాయ ఎంతో దోహదపడుతుంది. ఉసిరి ఫంగస్ నిరోధకంగా రక్తనాళాలలో కలిగే ఫ్లేక్ నిరోధకంగా, క్యాన్సర్ నిరోధకంగా జీవకణాల్లో డీఎన్ఏకు పెంచడం ద్వారా రోగ నిరోధకంగా పనిచేస్తుంది. మనకు లభించే ఆహార పదార్థాలన్నింటిలో అత్యద్భుతమైన యాంటీ యాక్సిడెంట్ గుణాలు పదార్థం కలిగి ఉంటుంది. శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతోపాటు కాలుష్యంవల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది. చదవండి: మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యంఅనారోగ్యాన్ని కలిగించే కణ విభజనను ఉసిరి నివారిస్తుంది. ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్ ఫుడ్‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు రెండు రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో దానిమ్మకాయ కంటే 60 రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ సి కలిగి ఉండి కమజాలాన్ని కలిపి ఉంచే పునరుత్పత్తి చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి, చర్మవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇలా ఉసిరికాయలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పచ్చళ్ళుగా( ఊరగాయ) తయారు చేసుకుని ఎంచక్కా ఆరగించే అవకాశం ఉంది. వీటిని నిల్వ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఉసిరి చెట్టును చాలామంది ఇంటి పెరటి భాగంలో పెంపకం చేపడుతారు. చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్‌లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాంహైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్‌ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది. -
బెడ్‌కు జై.. భాగస్వామికి బై..
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్‌లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్‌తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు.. నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్‌మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్లు/ బెడ్రూమ్లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి. అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.నిద్ర విడాకులకు కారణాలు జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.బలపడుతున్న బంధం.. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ.. మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు. -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్‌లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్‌తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్‌ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్‌కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే.. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్ రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్‌కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిరీ్వర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్‌కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్‌ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్‌ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్‌షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలుటైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లుమూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్‌కు గురైన వారికి జని్మంచే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు (చదవండి: మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!) -
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి? – రాధ, శ్రీకాకుళంప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్–డి సప్లమెంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్సీజీ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది.విటమిన్–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్–డి సప్లమెంట్స్ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్సీజీ టాబ్లెట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్–ఎ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్ ప్రాడెక్ట్స్‌లో హై విటమిన్–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్‌చేస్తే..) -
Yoga శక్తికీ, ఆత్మస్థైర్య సిద్ధికి చక్కటి ఆసనాలు
యోగా సాధన వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుంది. మనోధైర్యాన్నిస్తుంది. ప్రతికూలతలను దూరం చేసి, మనసును ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకోవడానికి సహకరించే ఐదు ఆసనాలు...తాడాసనం: ఇది పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. చేతులను, కాళ్లను కదల్చకుండా స్థిరంగా, నిటారుగా నిల్చోవడం అలవాట వుతుంది. చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!బాలాసన: చంటి పిల్లలు మోకాళ్లపై బోర్లాపడుకొని ఉన్న భంగిమ ఇది. ఈ ఆసనంలో మ్యాట్‌పైన మోకాళ్లపైన కూర్చుంటూ, ముందుకు వంగి, నుదుటిని నేలకు ఆనించాలి. తలమీదుగా రెండువైపులా చేతులను ముందుకు తీసుకుంటూ, అరచేతులను నేలమీద ఉంచాలి. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?వీరభద్రాసన: దీనిని వారియర్ పోజ్ అని కూడా అంటారు. నేలపైన నిల్చొని కుడిపాదాన్ని ముందుకు ఉంచాలి. రెండు చేతులను విశాలంగా భుజాలకు ఇరువైపులా చాపాలి. ఈ సమయంలో తల నిటారుగా ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదలాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు శక్తిమంతులుగా భావిస్తారు. ఆత్మగౌరవం, స్వీయ ప్రేమ మెరుగుపడుతుంది. అధోముఖస్వానాసన: మ్యాట్‌పైన బోర్లా పడుకొని, చేతులు, కాలివేళ్ల మీదుగా శరీరాన్ని ఉంచుతూ, హిప్ భాగాన్ని పైకి లేపాలి. దీనిని డాగ్ పోజ్ అని కూడా అంటారు. సాధన ప్రారంభంలో ఈ ఆసనం శరీరాన్ని వామప్ చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది.ఉష్ట్రాసన: మ్యాట్‌పైన మోకాళ్లను నేలకు ఆనిస్తూ కూర్చొని, రెండు చేతులతో కాలి మడమలను పట్టుకుంటూ, వెన్నెముకను వంపుగా,తలను వెనక్కి వంచాలి. దీంతో పొత్తికడుపు స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. -
ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం త్వరగా వస్తుందా..?
ఇటీవల కాలంలో అంతా స్లిమ మంత్ర.. అంటూ వివిధ రకాల డైట్లు పాటిస్తున్నారు. కొందరూ అవి తమ శరీర తత్వానికి సరిపోతాయా..? లేదా అని లేకుండా అనాలోచితం పాటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఒక టీనేజర్ అలానే ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే చాలావరకు అన్ని డైట్లలో చెప్పేది ఒకటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోమనే చెబుతాయి. అది మన శరీర తత్వం ఆధారంగా ఎంత మేర తీసుకుంటే మంచిది అనేది పోషకాహార నిపుణులను సంప్రదించి పాటిస్తే సత్వరగతిన మంచి ఫలితాలు పొందుతారు. అలా కాకుండా ప్రోటీన్ మంచిదని అధికంగా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అదేంటో పోషకార నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.మన రోజువారీ భోజనంలో ప్రోటీన్‌ను చేర్చుకోవడం ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఇది మన కణజాలాలను, కండరాలను నిర్మించడానికి, మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో మొత్తం శక్తిని ఇస్తుంది. అందుకోసం అని చాలామంది ప్రోటీన్ పౌడర్లు, షేక్‌లు, సప్లిమెంట్లపై ఆధారపడతారు. కానీ వాటికంటే గుడ్లు, మాంసం, పెరుగు, జున్ను వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తమ డైట్లో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా ప్రోటీన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పేనని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వృద్ధాప్యం ేవేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.ఈ మేరకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా దీని గురించి షేర్ చేశారు.ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందా? ఇటీవల పోషకాహార నిపుణుడు లోవ్నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని పంచుకున్నారు. ప్రోటీన్ పౌడర్లు,జంతు ఆధారిత ప్రోటీన్లపై ఎక్కువగా ఆధారపడితే గ్లైకేషన్ ప్రేరేపించబడుతుందట. ఇది కణజాలాలను గట్టిపరిచే ప్రక్రియ అట. దీంతో ముడతలు, కీళ్ల ధృడత్వం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. అంతేగాదు ఇది శరీరంలో ప్రోటీన్ అసమతుల్యతను ఏర్పరిచి జీవక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. ఫలితంగా ఇన్సులిన నిరోధకత, వాపు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే ఈ ప్రోటీన్ షేక్‌లలో ఉండే కృత్రిమ స్వీటెనర్ల ప్రిజర్వేటివ్‌లతో శరీరం లోడ్ అవుతుందనేది గ్రహించండి అని చెబుతున్నారు. కాబట్టి అధిక ప్రోటీన్ వినియోగం అనేది ఆరోగ్యానికి అన్ని విధాల హానికరమే అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ శరీరానికి అనుగుణంగా ప్రోటీన్ తీసుకోండి. అలాగే జంతు ఆధారిత ప్రోటీన్ కంటే ఆల్కలీన్ స్వభావం కలిగిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకువాలని అన్నారు. ముఖ్యంగా కాయధాన్యాలు, క్వినోవా, టోఫు, గింజలు, నట్స్, వంటివి ఉత్తమం అని చెప్పారు. అదనంగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలతో భర్తీ చేసుకోమని సూచించారు. అంటే విటమిన్లు సీ, ఈఅధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలతో సమతుల్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రోటీన్ పౌడర్ల కంటే సంపూర్ణ ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిదని నొక్కి చెప్పారు. అలాగే మన శరీరం ప్రోటీన్ లోపంతో బాధపడుతుందనేందుకు సంకేతంగా జుట్టు, చర్మం, గోర్లు కండరాల బలహీనత, అలసట, కొవ్వు కాలేయం కారణంగా పెరిగిన ఆకలి కోరికలు, గాయాలు త్వరగా నయం కాకపోవడం తదితర సమస్యలు చుట్టుముడతాయని వివరించారు లోవ్నీత్ బాత్రా. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!) -
World Sleep Day అదే మన కొంప ముంచుతోంది!
ప్రపంచ నిద్ర దినోత్సవం ప్రతీ ఏడాది మార్చి 14న జరుకుంటారు. ప్రపంచం ఆరోగ్యానికి అత్యంత నిర్లక్ష్యం చేయబడిన అంశంఏదైనా ఉందీ అంటే నిద్ర. అందుకే నిద్ర ఆవశ్యతక పై అవగాహనను పెంచుతూ ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరమని ప్రపంచ నిద్ర దినోత్సవం గుర్తుచేస్తుంది. పనికి, వినోదానికి ఇస్తున్న ప్రాధాన్యత నిద్రకు ఇవ్వకపోవడం అనేక రుగ్మతలకు దారితీస్తోంది.నిద్ర ముఖ్యమని మనలో చాలా మందికి తెలుసు, దురదృష్టవశాత్తు నిద్ర అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు. సరిగా నిద్ర పోకపోవడం వల్ల గుండె, నరాల సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బరువు పెరగడం వంటి సమస్యలొస్తాయనేవిషయాన్ని గుర్తించడం లేదు గుర్తించినా, నిర్లక్ష్యం, జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యం తదితర కారణాలరీత్యా నిద్రకు దూరమవుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతనిద్రలో మన నిష్క్రియాత్మకంగా ఉంటాం...కానీ మన శరీరానికి కావాల్సిన మరమత్తులన్నీ నిద్రలోనే జరుగుతాయి. ముఖ్యంగా రాత్రిపూట మనం పోయే నిద్ర మానసిక ఉల్లాసాన్నిస్తుంది. మెదడులాంటి కీలక అవయవాలకు విశ్రాంతి నిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది.కణజాలాల మరమ్మతు , కండరాల అభివృద్ధి జ్ఞాపకశక్తి పెరగడం ఇవన్నీ నిద్రలోనే జరుగుతాయి. మూడ్ మేనేజ్మెంట్కి నిద్ర చాలా అవసరం. ఆందోళన , నిరాశ దూరమవుతాయి. అంతెందుకు నిద్రలేమి ఒబెసీటీకి, మధుమేహం,ఇతర జీవక్రియ వ్యాధులకు దారి తీస్తుంది.ఎవరికెంత నిద్ర అవసరం?ప్రతి వయస్సు వారికి నిద్ర అవసరం ఉంటుంది. అయితే సాధారణ వ్యక్తి రాత్రిపూట 7 నుండి 9 గంటలు అవసరం.శిశువులు (4-12 నెలలు): 12-16 గంటలుపసిపిల్లలు (1-2 సంవత్సరాలు): 11-14 గంటలుప్రీ-స్కూలర్ (3-5 సంవత్సరాలు): 10-13 గంటలుచదువుకునే పిల్లలు (6-12 సంవత్సరాలు): 9-12 గంటలుటీనేజర్లు (13-18 సంవత్సరాలు): 8-10 గంటలుపెద్దలు (18+ సంవత్సరాలు): 7-9 గంటలు నిద్ర ఎందుకు రాదుస్క్రీన్ ఎక్స్పోజర్: రాత్రిపూట స్క్రీన్ సమయం ఎక్కువైతే నిద్ర పారిపోతుంది. నీలి కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్ (నిద్ర హార్మోన్) కు అంతరాయం కలిగిస్తుంది.పడుకునే ముందు , ఇమెయిల్స్, సోషల్‌మీడియా స్క్రోలింగ్ దూరంగా ఉండాలి. పనిలో ఒత్తిడి ఒక ప్రధానమైన సవాల్. పని ఒత్తిడితో సమయానికి నిద్రపోకపోవడం.కెఫిన్ , ఆల్కహాల్: ఆల్కహాల్ మత్తునిస్తుంది, కానీ అది స్లీప్ సైకిల్‌ను పాడు చేస్తుంది.నిద్రలేమి, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపడుతుందిచక్కటి శారీరక నిద్రను రారమ్మని పిలుస్తుంది. అలాగే మన స్లీప్ సైకిల్‌ను ఒకేలాగా మెయింటైన్ చేయాలి. ప్రతి రోజూ (వారాంతాల్లో కూడా) ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం వల్ల సహజ సిర్కాడియన్ సిస్టం బాగుపడుతుంది.నిద్రకు ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తే ఉత్తమం.బెడ్రూమ్ను చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండటం, నాణ్యమైన పరుపు, బ్లాక్అవుట్ కర్టెన్లను కూడా ఉపకరిస్తాయి.పగటిపూట నిద్రకు బై బై చెప్పేసి.. వాకింగ్ యోగా, ధ్యానం, జిమ్ లాంటికోసం రోజులోకనీసం అరగంట కేటాయిస్తే చక్కటి నిద్ర మీ సొంమవుతుంది. ‘కంటి నిండా కునుకు పడితే మనసు కుదుట పడుతుంద’ని ఊరికే అన్నారా మరి! ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిద్ర మిమ్మల్నిపలకరించకపోతే..మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం వచ్చిందని అర్థం. దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ ఫిట్నెస్ సీక్రెట్ వెపన్ ఇదే!
అందాల హీరోయిన్ త్రిప్తి దిమ్రి(Triptii Dimri) కేవలం బ్యూటీకే కాదు. ఫిట్‌నెస్‌కు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అద్భుతమైన నటనతో పాటు, టోన్డ్ ఫిగర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. తాజా తన ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మూవీతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ తన మంచి ఆహార ప్రియురాలు. అలాగే యోగా, ధ్యానం,జిమ్ వర్కౌట్స్‌ను అంతే శ్రద్ధగా ఆచరిస్తుంది. తాజాగా ఫిట్నెస్ ఫార్ములా గురించి ఇన్‌స్టా స్టోరీలో వివరించింది. స్వెట్ ఫస్ట్.. స్వీట్స్...స్వీట్స్ లేటర్ (Sweat Now...Sweets Later)అంటూ ఫోటోను షేర్ చేసింది. వింక్ ఎమోజీతో జిమ్ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. హోలీ పండుగ సీజన్లో అదనపు కేలరీలన్నింటినీ కోల్పోవడానికి ఆమె తన జిమ్ వర్కౌట్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రీ నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కూడా. ఫిట్‌గా ఉండేందుకు మూడు టిప్స్ స్క్వాట్ జంప్ : స్క్వాట్ జంప్‌లు లేదా జంపింగ్ స్క్వాట్లు. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో చాలా బాగా ఉపయోగ పడతాయి. జంప్ స్క్వాట్స్ లేదా జంపింగ్ స్క్వాట్స్ అని కూడా అంటారు. ప్రతి ఫిట్నెస్ క్లాస్‌లో ఏదో ఒక రకమైన స్క్వాట్ ఉంటుంది.దీని వల్ల కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఒకేసారి బహుళ కండరాలనుబలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా కాళ్లు, పిరుదులు . కోర్ కండరాలు బలోపేతమవుతాయి. బర్పీ: స్ట్రెంథ్ ట్రైనింగ్‌లో ఒకటిగా చెప్పుకునే బర్పీస్ , ఫుల్ బాడీ వర్కౌట్ అని చెప్పొచ్చు. వీని వల్ల మజిల్ స్ట్రెంథ్ పెరుగుతుంది. కేలరీలు కరుగుతాయి, చాలా బరువు తగ్గుతారు.బెల్లీ ఫ్యాట్, హిప్, థై ఫ్యాట్ తగ్గి టోన్డ్ బాడీ వస్తుంది. స్కిప్పింగ్: స్కిప్పింగ్ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటి. 10 నిమిషాలు లేదా దాదాపు 120 రౌండ్ల స్కిప్పింగ్ వల్ల 650 నుండి 1000 కేలరీలు ఖర్చవుతాయి. కేలరీలు బర్న్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు టోన్ అవుతాయి. జీవక్రియ పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. -
ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్
ప్రపంచీకరణతో మన దేశానికి ఏస్థాయిలో మేలు జరిగిందో అదే స్థాయిలో కీడూ జరుగుతోంది. ఇప్పటి వరకూ పాశ్చాత్యదేశాలను మాత్రమే పట్టి పీడిస్తూ వచ్చిన అధిక బరువు, ఊబకాయం(Obesity) లాంటి సమస్య అభివృద్ధి చెందుతున్న భారత్‌కు సైతం తలనొప్పిగా మారింది. ప్రధానంగా చిన్నారులలో అధిక బరువు, ఊబకాయాలు... ఫ్యాటీ లివర్ (Fatty Liver) వ్యాధికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనూహ్యంగా మార్పులకు లోనుకావటం, ఆడుకునే అవకాశం లేకపోవడం పిల్లల ఈ స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరమవుతున్న చిన్నారులు టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. బాల్యంలో ఓ ప్రధాన భాగమైన సంప్రదాయ (కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, కర్రాబిళ్ళా, బెచ్చాలు, గోళీలాంటి) ఆటలకు సైతం నోచుకోలేక పోతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రైవేటు భాగస్వామ్యం రాను రాను పెరిగిపోవడంతో ఆటలు అటకెక్కాయి. చదువే ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉన్నంతకాలం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో క్రీడలకు తగిన సదు పాయాలు ఉండేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకు సువిశాలమైన ఆటస్థలాలతో పాటు తగిన సంఖ్యలో వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ఉండటం ఒకప్పుడు సాధారణ విషయమైతే ఇప్పుడు అసాధారణ విషయంగా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలోసింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్ బెడ్ రూమ్ కళాశాలలు మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సదుపాయాలు, మైదానాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలంటే ఏమిటో తెలియకుండా అమూల్యమైన తమ బాల్యాన్నీ, విద్యార్థి దశనూ ముగించడాన్ని మించిన విషాదం (Tragedy) మరొకటి లేదు.చదవండి: ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియోపాఠశాల దశ నుంచే ఆటలకు, క్రీడాసంస్కృతికి దూరమైన చిన్నారులు ఆ తరువాతి కాలంలో శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన దేశంలో ఈమధ్య కాలంలో నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం ఆటపాటలకు దూరమైన చిన్నారులు అధిక బరు వుతో పాటు ఫ్యాటీ లివర్ (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్) వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. పిల్లలు బాల్యంలో ఆటలకు దూరం కావడం అంటే శారీరకంగా, మానసికంగా ఎదుగు దలకు దూరంకావటమేనని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం దేశ జనాభాలో 60 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటుంటే... అందులో 30 శాతం మంది ఊబకాయం సమస్యతో నానాపాట్లు పడుతున్నారు. బాలల్లో 40 శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సైతం హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో బాల్యంలో ఆటలూ అంతే ముఖ్యమని తల్లిదండ్రులూ... ఆరోగ్యవంతమైన, ఆహ్లాదభరితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత తమపైనే ఉందని పాలకులూ, పాఠశాలల యాజమాన్యాలు గ్రహించిన రోజే బాల్యం అమూల్యంగా, అపు రూపంగా మిగిలిపోగలుగుతుంది.– కృష్ణారావు చొప్పరపుసీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ -
కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్‌లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్‌లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్‌గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?) -
Lilavati Hospital రూ. 1,200 కోట్ల స్కామ్, చేతబడులు : సంచలన ఆరోపణలు
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఒకటి లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ . 1978లో నాలుగు దశాబ్దాల క్రితం ముంబైలో స్థాపించిన ఐకానిక్ హాస్పిటల్‌పై పెద్ద దుమారం రేగుతోంది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు బ్లాక్ మ్యాజిక్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌పై ట్రస్ట్‌లోని కొంతమంది . మాజీ ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం ఆరోపణలను గుప్పించారు అంతేకాదు రూ. 1,200 కోట్ల కుంభకోణం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణలలో మోసపూరిత ఆర్డర్లు, నిధుల దుర్వినియోగం నకిలీ సేకరణ లాంటివి ఉన్నాయి. ఫోర్జరీ, మోసం , పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి కొనుగోళ్లకు సంబంధించి థర్డ్-పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.1,200 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది ట్రస్ట్‌లో సుదీర్ఘ న్యాయ పోరాటంలో భాగంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడు విజయ్ మెహతా చేపట్టిన చర్యల్లో భాగంగా కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా నేతృత్వంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తృతమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని ఫిర్యాదు దారులు ఆరోపణ. ఈ విషయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి , బాంద్రా పోలీస్ స్టేషన్లో విడివిడిగా ఫిర్యాదులు చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో పూర్వపు ట్రస్టీలు చేతబడులు (black magic) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మానవ వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన ఎనిమిది కలశాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రశాంత్ మెహతా , అతని తల్లి చారు మెహతా కార్యాలయంలో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆరోపణలొచ్చాయని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు."మేము ఆడిట్లు చేపట్టాము మరియు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఐదు కంటే ఎక్కువ నివేదికలను సమర్పించారు, ఇది ఈ చట్టవిరుద్ధమైన ట్రస్టీల బృందం రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును స్వాహా చేసి దుర్వినియోగం చేసిందని స్పష్టంగా పేర్కొంది. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారు, వీరిలో ఎక్కువ మంది NRIలు మరియు దుబాయ్ మరియు బెల్జియం నివాసితులు," అని LKMMT శాశ్వత నివాసి ట్రస్టీ ప్రశాంత్ మెహతా విలేకరులకు తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లతో పాటు, గుజరాత్‌లోని లీలావతి ఆసుపత్రి నుండి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని మెహతా తెలిపారు .PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగంగా స్పందించి, తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు.ఇదిలా ఉండగా, ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురుపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై ముంబై పోలీసుల EOW దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు మంగళవారం తెలిపారు .LKMMT ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 30న బాంద్రా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు EOWకి బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.లీలావతి హాస్పిటల్లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం. 1997లో లీలావతి హాస్పిటల్ కేవలం 10 పడకలు , 22 మంది వైద్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో 323 పడకలు, అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICUలు) ఒకటి, 300 కంటే ఎక్కువ మంది కన్సల్టెంట్లు, సుమారు 1,800 ఉద్యోగుల బృందంతోపాటు, ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతతో 12 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఒకే రోజులో, లీలావతి హాస్పిటల్ దాదాపు 1,500 మంది అవుట్ పేషెంట్లు , 200 మంది ఇన్ పేషెంట్లకు హాజరవుతారు, "సర్వేత్ర సుఖినః: సంతు, సర్వే సంతు నిరామయా", అంటే "అందరూ ఆనందంగా ... ఆరోగ్యంగా ఉండాలి", అనే నినాదంతో సేవలందిస్తోంది.కీర్తిలాల్ మెహతా ,అతని భార్య లీలావతి మెహతా 1997లో ఈ ఆసుపత్రిని స్థాపించారు. 1978లో, కీర్తిలాల్ మెహతా లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను రూపొందించి,దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషోర్ మెహతా మరణం తరువాత, అతని భార్య చారు మెహతా ఈ ఆసుపత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఈ ట్రస్టీల మధ్య గత కొన్నేళ్లు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. -
మధుమేహం లేకపోయినా కిడ్నీ వ్యాధి వస్తుందా..?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్‌రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్‌రెడ్డికి జితేందర్‌రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.ఇదీ నేపథ్యం2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్‌ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.కిడ్నీల పనితీరు కీలకంమూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుమూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.గోదావరిఖని జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్‌పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దుఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి. – కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖనిలక్షణాలు తెలియడం లేదుచాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్‌లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు (చదవండి: డీహైడ్రేషన్‌కు రీహైడ్రేషన్‌తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..) -
Termin Injection : సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి.. లేదంటే ముప్పే!
డాక్టర్ గారూ, నేను డిగ్రీ చదివి కానిస్టేబుల్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం క్రితం మా ఊర్లో ఉన్న ఒక ఫేమస్ జిమ్‌లో చేరాను. తొందరగా బాడీ పెరగడం కోసం ‘టెర్మిన్’ అనే ఇంజక్షన్ ఉంటుంది అని, అక్కడ పని చేసే ట్రెయినర్ ఒకతను చెబితే అది తీసుకోవడం మొదలు పెట్టాను. మొదట్లో చాలా బాగా అనిపించింది. జిమ్‌లో ఎంతసేపు వర్కవుట్స్ చేసినా అలసట వచ్చేది కాదు. నిద్రలేకపోయినా చాలా హుషారుగా ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు ఇక ఇంజక్షన్ సరిపోయేది కాదు. రెండు నుంచి మూడు ఇంజక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. దానివల్లేనేమో, ఆకలి బాగా తగ్గిపోయింది. బరువు తగ్గాను. బాగా చికాకుగా ఉంటోంది. ఇంజక్షన్ తీసుకోకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. చెవిలో వింతవింత శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు, నన్ను చంపడం కోసం వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడెయ్యండి. – రమేష్, విశాఖపట్నంముందుగా మీ తప్పు మీరు తెలుసుకుని మారాలి అని అనుకుంటున్నందుకు మీకు నా అభినందనలు. మీరు పంచుకున్న ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. మన దేశంలో ఇటీవల చాలామంది యువత ఇలాంటి ఇంజెక్షన్స్కి అడిక్ట్ అయి బాధపడుతున్నారు. తమ అభిమాన నటుడు ఎవరో సిక్స్ ప్యాక్ శరీరం పెంచారని, తాము కూడా అలా పెంచుకోవాలి అనే యావలో లేదా ఎవరినయినా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో జిమ్‌లలో చేరడం తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశ్యంతో అడ్డదారులైన ఇలాంటి ఇంజెక్షన్లను ఎంచు కుంటున్నారు. మీరు తీసుకున్న టెర్మిన్ ఇంజక్షన్ సైకోస్టిమ్యులెంట్ డ్రగ్ కిందకు వస్తుంది. ఈ మందు మెదడులో సెరటోనిన్, డోపమైన్, నార్ అడ్రినలిన్ అనే రసాయనాలను ఎక్కువ మోతాదులో విడుదల అయ్యేలా చేస్తుంది. దానివల్ల వారికి అమితమైన బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఎంత పని చేసినా అలసట రాదు. దాంతో గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్ చేయగలుగుతారు. అయితే క్రమేణా కొంతకాలానికి శరీరం చల్లబడటం, బీపీ తగ్గిపోవడం, బాగా అలసటగా అనిపించడం జరుగుతుంది. బీపీ విపరీతంగా పెరగడం, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, వెంట్రుకలు ఊడిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనపడతాయి. ఒక్కోసారి గుండెలయలో మార్పులు వచ్చి ప్రాణం మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమందిలో చెవిలో మాటలు వినపడటం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ రావడం చూస్తుంటాము. దీనినే సైకోపిన్ అంటారు. మీరు వీలైనంత తొందరగా ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే ఈ సైకోసిస్ లక్షణాలను తగ్గించేలా సరైన వైద్యం చేసి తర్వాత అవసరమైతే కొంతకాలం పాటు మిమ్మల్ని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి కౌన్సెలింగ్, యోగ, ఇతరత్రా వైద్యవిధానాల ద్వారా పూర్తిగా ఈ అడిక్షన్ సమస్య నుంచి బయటకి తీసుకు రావచ్చు. ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదిస్తే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. గుడ్‌లక్. -డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మీ స్మార్ట్ వాచ్ మీకు నిజమే చెబుతోందా?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఓ రోజున అమర్ అనే యువకుడు నాకు అత్యవసరంగా ఫోన్ చేశాడు. ఆ సమయంలో తను జిమ్‌లో ఉన్నాడు. తన స్మార్ట్ వాచ్ గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 38 మాత్రమే చూపిస్తోందని చెప్పాడు. నిజానికి 60–100 మధ్యలో ఉండాలి.కానీ ఓసారి వాచ్ తీసి..మళ్లీ వేసుకునే సరికి అది100 చూపించింది. అదిఆ వాచ్ కచ్చితత్వంలో ఉన్న ఎర్రర్. కానీ ఆ సమయంలో నిజంగానే తనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమోఅన్నంతగా తను టెన్షన్ పడ్డాడు..స్మార్ట్ వాచ్‌లు.. ఇప్పుడు చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. తామెంత నడిచాం.. ఎంత సేపు పరిగెత్తాం.. ఎంత సేపు స్విమ్ చేశాం.. పడుకున్నాం.. ఎన్ని కాలరీలు బర్న్ చేశాం.. ఇవన్నీ ఉదయాన్నే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. స్టేటస్లు పెడుతున్నవాళ్లూ ఎక్కువయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు.. మరోవైపు చూస్తే.. నిజానికి ఇదో వ్యసనంలా మారుతోందా? స్మార్ట్ వాచ్‌లపై మనంఅతిగా ఆధారపడుతున్నామా? అసలు మన స్మార్ట్ వాచ్ నిజమే చెబుతోందా? హార్ట్ రేట్ స్మార్ట్ వాచ్‌కు సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో గుడ్డిగా నమ్మడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘యువకులు వీటిపై అతిగా ఆధారపడుతున్నారు. హార్ట్ రేట్ బాగా పెరిగిందనో.. లేదా బాగా తగ్గిందనో భయంతో మా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది’అని పుణేకు చెందిన కార్డియాలజిస్ట్ అభిజిత్ వైద్య తెలిపారు. నిజానికి స్మార్ట్ వాచ్‌లు పల్స్ రేట్‌ను మాత్రమే చూపిస్తాయని.. జనానికి ఈ రెండింటి మధ్య తేడా పెద్దగా తెలియదన్నారు. ‘ప్రతీ సారి గుండె కొట్టుకునేటప్పుడు రక్తప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా గుండె కొట్టుకునే రేటును గణించడానికి స్మార్ట్ వాచ్‌లు ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ)ని వాడతాయి. గుండె కొట్టుకునే రేటును కచి్చతంగా గణించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ఈసీజీ) బెస్ట్. పీపీజీ కూడా కొంత మొత్తంలో పనిచేస్తుంది గానీ.. ఈసీజీతో పోలిస్తే.. అది కచ్చితంగా లెక్కించలేదు’అని చెప్పారు. చాలా చిన్నచిన్న మార్పులు పల్స్ రేట్‌ను ప్రభావితం చేస్తుంటాయని.. దీనివల్ల స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్‌ను కచ్చితంగా చూపించలేదని చెప్పారు. ‘నేను చాలాసార్లు ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అదే పనిగా హార్ట్ రేట్, బీపీని స్మార్ట్ వాచ్‌లో చెక్ చేసుకోవడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే’ అని తెలిపారు. 2022లో ఫ్రాన్స్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు ఒక పాపులర్ స్మార్ట్ వాచ్‌లోని ఈసీజీ సదుపాయాన్ని పరీక్షించి చూడగా.. ఫాల్స్ పాజిటివ్‌లు(తప్పుడు ఫలితం) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘నిజంగానే గుండెకు సంబంధించి సమస్య ఉండి.. మీ ఖరీదైన స్మార్ట్ వాచ్ ఈసీజీలో అంతా నార్మల్ అని చూపిస్తే.. అప్పుడు ఆ రోగి వైద్యుడు వద్దకు వెళ్లడు. అది ప్రమాదకరం. హృదయ ధమనుల్లో ఏదైనా పూడికల్లాంటివి ఉంటే ఈసీజీలో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ అలాంటి వాటిని పట్టుకోదు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని నాణ్యమైన స్మార్ట్ వాచ్‌లు గుండె కొట్టుకోవడంలో తేడాలను(అరిర్థియా) సరిగానే గుర్తిస్తున్నాయని చెప్పారు. స్లీప్ ట్రాకర్స్లీప్ ట్రాకర్ల విషయానికొస్తే.. మన నిద్ర ఆధారంగా అవి 0–100 వరకూ మార్కులిస్తుంటాయి. ఎక్కువ వస్తే.. మనం మంచిగా నిద్రపోయినట్లు అన్నమాట. ‘స్మార్ట్ వాచ్‌లు సెన్సర్లను ఉపయోగిస్తాయి. ఆక్సిలరోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా.. అవి నిద్రలోని వివిధ దశలను గుర్తించలేవు. నిజమైన నిద్రను స్లీప్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్తో లెక్కించవచ్చు. అంతేకాదు.. స్మార్ట్ వాచ్‌లు మన కదలికలను బట్టి.. నిద్రను గణిస్తాయి. ఒకవేళ మీరు పడుకోకున్నా.. కదలకుండా ఉంటే.. అది నిద్ర కింద లెక్క తీసుకుంటుంది’అని డయాబెటాలజీ అండ్ స్లీప్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ స్మిత వివరించారు. సరైన స్లీప్ స్కోర్ రాలేదని టెన్షన్ పడే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగిందని చెప్పారు. ఖర్చు చేసే కేలరీలు కేలరీల ఖర్చు అంచనాల్లోనూ ఇదే పరిస్థితి. స్టాన్‌ఫోర్ట్ వర్సిటీ చేసిన పరిశోధనలో కేలరీలు ఎంత ఖర్చయ్యాయి అన్న విషయాన్ని స్మార్ట్ వాచ్‌లు సరిగా గణించలేకపోయినట్లు తేలింది. ‘ఇద్దరు 60 కేజీల బరువున్న వాళ్లను తీసుకుంటే.. ఒకరిలో 15 శాతం బాడీ ఫ్యాట్, రెండో వారిలో 45 శాతం బాడీ ఫ్యాట్ ఉంది అనుకుందాం. నిజానికి కేలరీల ఖర్చు అన్నది ఇద్దరిలో వేరువేరుగా జరుగుతుంది. స్మార్ట్ వాచ్‌లో మనం బరువు మాత్రమే నమోదు చేస్తాం కాబట్టి.. ఇద్దరికీ ఒకేలా కేలరీలు ఖర్చయినట్లు చెబుతుంది. కానీ శరీరతత్వం బట్టి.. కేలరీల ఖర్చు వేర్వేరుగా ఉంటుంది’అని న్యూట్రిషనిస్ట్ రాధిక తెలిపారు. స్టెప్ కౌంట్గతంలో 111 దేశాలకు చెందిన 7 లక్షలకు పైగా జనాన్ని శాంపిల్‌గా తీసుకుని అమెరికా, ఆ్రస్టేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం.. స్టెప్ కౌంట్ అనేది.. వాచీ స్థాయిని బట్టి 15–66 శాతం తేడా వస్తోందని తేలింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందింపజేసుకోవడానికి స్మార్ట్ వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. అదే సమయంలో ఆరోగ్యపరమైన అంశాల్లో వీటిపైనే అతిగా ఆధారపడటం మంచిది కాదని.. పైగా.. ఇది అనవసరమైన ఆందోళనకు తెర తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే..మీ స్మార్ట్ వాచ్ ఏం చెబుతోందోదాన్ని కాదు.. మీ శరీరం మీకుఏం చెబుతుందో దాన్ని వినండి..అని వైద్యులు సూచిస్తున్నారు. -
యూట్యూబ్ సలహా ప్రమాదం కావచ్చు...
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్‌లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు. ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.50 కిలోల నుంచి 24 కిలోలకుకన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్‌షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది. మూడునెలలుగా యూట్యూబర్‌ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.బాడీ షేమింగ్, వీడియోలుఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.గుడ్డిగా నమ్మవద్దుఅలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిపుణుల సలహా తప్పనిసరిబరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫామ్స్‌లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్‌వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్‌పర్ట్‌లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.– డా.వాణి కత్తి, ఫుడ్‌సైన్స్ ఎక్స్పర్ట్ -
బ్రెయిన్ ఇంజురీలను నివారించడం ఎలా? పోలీసులకు అవగాహనా కార్యక్రమం
ప్రముఖ ఆసుపత్రి ఆలివ్ పోలీసుల అధికారుల కోసం బ్రెయిన్ ఇంజురీ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రాంను నిర్వహించింది. ప్రమాదాలు చోటు చేసుకుని, మెదడు తీవ్రగాయాలైన వ్యక్తుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలిపే విధంగా హైదరాబాద్‌లోని పోలీసులకు అవగాహన కల్పించింది. మెదడు గాయాల గురించి అవగాహన పెంచడం, ప్రభావవంతమైన నివారణ చర్యలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలివ్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమం మెదడు గాయాల ప్రమాదాలు , ముందస్తు గుర్తింపు, నివారణ చర్యల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మెదడు గాయాల అవగాహన, నివారణపై నిపుణుల చర్చలు జరిగాయి. ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల మెదడు గాయాలు, వాటి దీర్ఘకాలిక ఆరోగ్య చిక్కులు, సరిగ్గా నయం కావడానికి ముందస్తు జాగ్రత్తలు, చికిత్స అవసరంపై సమాచారాన్ని అందించారు. ఈ గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి రహదారి భద్రత, హెల్మెట్లు ధరించడం, కార్యాలయ భద్రత వంటి నివారణ చర్యలను కూడా సెషన్ నొక్కి చెప్పింది. సమాజం మరియు పోలీసుల భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ, చట్ట అమలు అధికారులు మరియు స్థానిక ప్రభుత్వం భద్రతా ప్రోటోకాల్‌లను నిర్ధారించడంలో, అవగాహన పెంచడంలో ఎలా సహాయ పడతాయో ఈ కార్యక్రమం హైలైట్ చేసిందిహైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ నుండి ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరిలో DCP- చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అవగాహనను వ్యాప్తి చేయడంలో, భద్రతను నిర్ధారించడంలో చట్ట అమలు కీలక పాత్రను వారు గుర్తు చేశారు. బ్రెయిన్ ఇంజురీ, నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను ఆలివ్ నొక్కి చెబుతుంది. బ్రెయిన్ ఇంజురీలపై పెరుగుతున్న ఆందోళనల మధ్యఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మెదడు గాయాలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయనీ, అందుకే ముందస్తు వైద్యం ద్వారా ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆలివ్ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ రఘుర్కం తేజ తెలిపారు. మెదడు గాయాల బాధితులకు మరింత అవగాహన కల్పించడానికి , ఉత్తమ సంరక్షణను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్, DCP- చంద్ర మోహన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ఆసిఫ్ నగర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, గోల్కొండ ACP సయ్యద్ ఫియాజ్, ఘోషమల్ ట్రాఫిక్ CI బాలాజీ ధరావత్, గుడిమల్కాపూర్ CI రవి , టోలిచౌకి ట్రాఫిక్ CI సుధాకర్ ఉన్నారు. వైద్యుల సూచనలను స్వీకరించడంతోపాటు , వారి వ్యక్తిగత అధికార పరిధిలో ప్రజా భద్రతను ప్రోత్సహించడానికి దీన్ని ఆచరణలో చేర్చగల పద్ధతులను నేర్చుకున్నారు. భద్రతా ప్రోటోకాల్‌లు అమలుతోపాటు, మెదడు గాయం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేసే విధంగా తమ బృందాలకు, సంఘాలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో నేర్చుకున్న వాటిని వినియోగిస్తామని పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. -
కివిపండుని తొక్కతో సహా తింటున్నారా..?
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..ఆరోగ్య ప్రయోజనాలు..కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఉబ్బరం తగ్గిస్తుంది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి. ఏ సమయంలో తినాలి కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.ఎలా తింటే మంచిదంటే..కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. (చదవండి: బీట్రూట్ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!) -
బీట్రూట్ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?
మాములుగా బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్రూట్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్రూట్లో ఉండే కొన్ని రకాల ఐరన్లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. మంచి గట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్ పెప్టైడ్లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇలా బీట్రూట్ బట్టర్‌మిల్క్ మిక్సింగ్ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్ టానిక్‌లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!
మాతృత్వం మధురిమ మాటలకందనిది. అందుకోసం ప్రతి అమ్మాయి తపిస్తుంటుంది. ప్రస్తుత జీవనవిధానం ,పర్యావరణ కాలుష్యం కారణంగా "అమ్మ" అనే పిలుపు దూరమవుతున్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొందరూ 'ఎగ్ ఫ్రీజింగ్' బాటపడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గాన్నే టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, నటి మెహ్రీన్, మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా వంటి ప్రముఖులు ఎంచుకున్నారు. తాజాగా వారి సరసన చేరింది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. అసలు ఇంతకీ ఏంటి ఎగ్ ప్రీజింగ్..? ఈ వైద్య విధానం మంచిదేనా?.. అంటే..ప్రస్తుతం యువత కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు నవతరం ఈ ఎగ్ ఫ్రీజింగ్ బాట పడుతోంది. చెప్పాలంటే ఇది జెన్ జెడ్ ట్రెండ్‌గా మారింది. అసలు ప్రముఖులే కాగా సామాన్యులు సైతం ఈ పద్ధతికే మొగ్గుచూపిస్తాన్నారు. మరీ అసలు ఈ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి బాలీవుడ్ నటి తనీషా మాటల్లో చూద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే..ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ఎంచుకున్నామంటే అంతా తప్పుగా చూస్తారు. పైగా ఇది చాలా పెయిన్‌తో కూడిన విధానమని భయబ్రాంతులు గురిచేశారని చెప్పుకొచ్చింది 46 ఏళ్ల తనీషా. అయితే తానువైద్యుల సాయంతో దాని గురించి వివరంగా తెలుసుకున్నాకే ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పింది. వైద్య పర్యవేక్షణలో అండాలు భద్రపరుచుకునే విధానాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ పక్రియలో కడుపు ప్రాంతంలో ప్రొజెస్టెరాన్‌ని ఇంజెక్ట్ చేస్తారు. మొదట్లో తిమ్మిరితో కూడిన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఆరో రోజులు అందుకు బాడీ ఆటోమేటిగ్గా సిద్ధమైపోతుంది. ఇదంతా అరగంట ప్రక్రియ. అయితే వాళ్లు అండాలను సేకరించిన విధానం మనకు తెలియకుండానే జరిగిపోతుందంటూ..ఆ వైద్య విధానం గురించి వివరించింది సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ హర్మోన్లు ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో బరువు పెరగడం జరుగుతుంది. అయితే ఇంజెక్ట్ చేసిన హార్మోన్లను తొలగించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చారు తనీషా. వైద్యులు ఏమంటున్నారంటే..నిజానికి ఈ ఎగ్ ప్రీజింగ్ ప్రక్రియలో సాధారణంగా హార్మోన్ల ఇంజెక్షన్ల సాయంతో అండాలను సేకరించడం జరుగుతుంది. అయితే అందుకు పేషెంట్ శారీరకంగా మాససికంగా సంసిద్ధంగా ఉండటం అనేది అత్యంత కీలకం. అయితే ఈ హార్మోన్ల ఇంజెక్షన్లలో ప్రొజెస్టెరాన్ ఉండదని ప్రసూతి వైద్యులు చెబుతున్నారు. అండాశయాలను ఉత్తేజపరిచేందుకే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఉంటాయని అన్నారు. అయితే వీటి కారణంగా బరువు పెరగడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ తర్వాత సంభవించే ఆకలి మార్పులే లేదా శరీరంలో ద్రవాల నిలుపదల వంటి మార్పులను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయట. ఇక్కడ తగినంత నీరు తాగినట్లయితే అదనపు హార్మోన్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈ హార్మోన్లు శరీరం నుంచి బయటకు వెళ్లేలా తాజాపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తదితర పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ సమయంలో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు పెరగకుండా రక్షిస్తాయని అన్నారు. వాటన్నింటి తోపాటు ఎనిమిది గంటల నిద్ర, యోగా, ధ్యానం వంటి వాటితో ఈ అదనపు హార్మోన్లను సమతుల్యం చేయొచ్చని చెప్పారు. జస్ట్ రెండు రుతక్రమ సైకిల్స్ కల్లా సాధారణ స్థితికి మహిళలు తిరిగి వస్తారని వెల్లడించారు వైద్యులు..ఈ విధానాన్ని ఎంచుకోవడానికి రీజన్..కెరీర్లో ముందుండాలనే క్రమంలో వయసు దాటిపోతుంది. ఆ తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకున్న చాలామంది జంటలు ఎంతలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది తెలిసిందే. పోనీ ఏదోలా పిల్లలను కన్నా..వాళ్లు ఆరోగ్యంగా ఉండక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతున్నవాళ్లున్నారు. ఆ నేపథ్యంలోనే యువత ఇలా అండాలను భద్రపరుచకునే ఎగ్ ప్రీజింగ్ లేదా క్రయో ఫ్రిజర్వేషన్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ జంటలు లేదా యువత కెరీర్లో నిలదొక్కుకున్నాక హాయిగా పిల్లల్ని కనడం గురించి ప్లాన్ చేస్తున్నారు. (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్‌గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్‌గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్‌గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
మహిళలు.. మహారాణులు..!
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.సోలార్‌ప్లాంట్ ఆలోచనలో ఉన్నాంప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు.– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉందిమా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం. ప్రధాన ప్రభావం...వ్యాధి నిరోధక వ్యవస్థపైనే! మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది. నిజానికి ఎవరిలోనైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం. ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి.. ఆకలి లేకపోవడం బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి) మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్) తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట. ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు. స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు. మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అధిగమించడం మేలు...అది చేయాల్సిందిలా...మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి... ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి... బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్‌ను సంప్రదించాలి.డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్‌కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..) -
స్ట్రోక్ థ్రోంబోలిసిస్, థ్రోంబెక్టమీపై అపోలో హాస్పిటల్స్ సదస్సు
హైదరాబాద్, మార్చి 10, 2025: అపోలో హాస్పిటల్స్ మార్చి 8 ,9, తేదీలలో స్ట్రోక్ థ్రోంబోలిసిస్ అండ్ థ్రోంబెక్టమీపై ఎస్టీఏటీ-2025 సదస్సు విజయవంతంగా నిర్వహించింది. తీవ్రమైన స్ట్రోక్ నిర్వహణలో అత్యాధునిక పురోగతి, వినూత్న ఇమేజింగ్ పద్ధతులు , క్లిష్టమైన విధానపరమైన వ్యూహాలను చర్చించడానికి ప్రముఖ అంతర్జాతీయ , జాతీయ నిపుణులను సమావేశపరిచింది.ఈ సదస్సులను తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్స్ అసోసియేట్ డీఎంఎస్ డాక్టర్ సుబ్బారెడ్డి, అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ అలోక్ రంజన్, సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హాజరయ్యారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య నిపుణులలో బాసెల్, స్విట్జర్లాండ్ కు చెందిన డాక్టర్ మారియోస్ సైకోగియోస్, బార్సిలోనా, స్పెయిన్‌కు చెందిన డాక్టర్ మార్క్ రిబో, అల్బానీ, న్యూయార్క్, యుఎస్ఏకు చెందిన డాక్టర్ నబీల్ హెరియల్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ రీడ్ గూచ్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ ఉస్మాన్ కోజాక్ మరియు ఇస్తాంబుల్, టర్కీ కు చెందిన డాక్టర్ యిల్మాజ్ ఓనాల్ ఉన్నారు.ఈ సందర్భంగా అపోలో గ్రూప్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం , మరణాలకు ఒక ముఖ్యమైన కారణంగా తీవ్రమైన స్ట్రోక్ నిలుస్తుంది . ఎస్టీఏటీ-2025 వంటి సదస్సులు ప్రపంచ నాయకుల మధ్య విప్లవాత్మక ఆలోచనలు, పద్ధతులు, అనుభవాల మార్పిడిని సులభతరం చేయడం ద్వారా స్ట్రోక్ కేర్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అపోలో ఆస్పత్రిలో స్ట్రోక్ కేర్‌కు సంబంధించిన అన్నీ రకాల చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు.అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు మాట్లాడుతూ, "అపోలో హాస్పిటల్స్ వద్ద , ఆవిష్కరణ , నైపుణ్యం ద్వారా తీవ్రమైన స్ట్రోక్ కేర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము. స్ట్రోక్ థ్రోంబోలిసిస్ థ్రోంబెక్టమీలో విప్లవాత్మక పురోగతిని చర్చించడానికి ప్రపంచ, జాతీయ నిపుణులను ఒకచోట చేర్చడానికి ఎస్టీఏటీ-2025 సమావేశం కీలకమైన వేదికగా పనిచేస్తుంది. రోగికి మెరుగైన ఫలితాలను అందించటానికి తోడ్పడనుంది’ అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ.. స్ట్రోక్ నిర్వహణలో సకాలంలో తగిన వైద్య సేవలను అందించడం చాలా కీలకం. ఎస్టీఏటీ-2025 సమావేశం ఈ రంగంలో అవగాహన మరియు క్లినికల్ నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా చికిత్సలు , సాంకేతికతలపై చర్చలను ప్రోత్సహించడం ద్వారా, తీవ్రమైన స్ట్రోక్ కేర్‌లో కొత్త ప్రమాణాలను నిర్దేశించటానికి మరియు రోగులకు మెరుగైన ఫలితాలను నిర్ధారించడానికి మేము కృషి చేస్తున్నాము’ అని అన్నారు.ఎస్టీఏటీ-2025 సమావేశంలో యుఎస్ఏ , స్పెయిన్, స్విట్జర్లాండ్, సింగపూర్, టర్కీ వంటి దేశాల నుండి హాజరైన అంతర్జాతీయ అధ్యాపకులతో పాటు 650 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్‌లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్‌కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్‌కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్‌లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్‌కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్‌లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్‌తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్‌గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్‌తో బ్రెస్ట్ పంప్‌తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్‌గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
Breast Abscess బాధాకరమైన రొమ్ము గడ్డలకు కారణాలు, చికిత్స
రొమ్ము ఇన్ఫెక్షన్ అనేది స్త్రీ స్తనములలో చీముతో కూడిన బాధాకరమైన నొప్పిని రొమ్ము అబ్సెస్(Breast Abscesses) అంటారు. రొమ్ము గడ్డలు మాస్టిటిస్ యొక్క సాధారణ పరిణామం. మాస్టిటిస్ అనేది రొమ్ములలో వాపు మరియు నొప్పిని కలిగించే ఇన్ఫెక్షన్. పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఈ పరిస్థితికి గురౌతారు.రొమ్ము గడ్డలకు కారణంరొమ్ము గడ్డలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి:మాస్టిటిస్ అని పిలువబడే రొమ్ము ఇన్ఫెక్షన్లు రొమ్ము చీముకు అత్యంత సాధారణ కారణం. మాస్టిటిస్ అనేది రొమ్ము కణజాలాన్ని, ముఖ్యంగా పాల నాళాలు మరియు గ్రంథులను ప్రభావితం చేసే ఒక తాపజనక పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో సంభవిస్తుంది.చనుమొన నొప్పి లేదా పగిలిన చనుమొన ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఎక్కువగా తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గడ్డలుఏర్పడతాయి. ఏదైనా మచ్చల కారణంగా కూడా చనుమొన నాళాలు మూసుకుపోయినప్పుడు రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు.రొమ్ము అబ్సెసెస్ లక్షణాలుస్తనముల వాపు, బాధాకరమైన నొప్పి,వేడిగా ఉన్న రొమ్ము, చనుమొన నుండి చీము లేదా స్రావం కారడం,తలక్రిందులుగా ఉన్న చనుమొనలు, చలి,వికారం మరియు వాంతులు,అధిక శరీర ఉష్ణోగ్రత లేదా జ్వరం మొదలగునవి వుంటాయి.రొమ్ము అబ్సెసెస్ నిర్ధారణరోగి చరిత్రవైద్యులను సందర్శించి నపుడు సాధారణంగా లక్షణాలను రొమ్ము నొప్పి, వేడి, ఎరిథెమా (చర్మం ఎర్రగా మారడం) మరియు రొమ్ములలో వాపును కూడా డాక్టరుకు తెలియచేయాలి తల్లిపాలు ఇచ్చే సమాచారాన్ని తెలియచేయాలి.వైద్యుడు గతంలో ఏవైనా రొమ్ము ఇన్ఫెక్షన్లు మరియు వాటి చికిత్స గురించి కూడా విచారిస్తారు.మధుమేహం వంటి వైద్య చరిత్రను వైద్యుడికి తెలియజేయాలి.క్లినికల్ పరీక్షవైద్యుడు రోగ నిర్ధారణ చేయడానికి శారీరక పరీక్షను చేస్తారు. వైద్యుడు రొమ్ములో చీము ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి గడ్డ యొక్క ఆస్పిరేషన్ నిర్వహించబడుతుంది. అటువంటి సందర్భంలో, రొమ్ము గడ్డలు చీముతో నిండి ఉందో లేదో చూడటానికి వాపు ఉన్న ప్రదేశంలోకి ఒక సూదిని చొప్పించబడుతుంది.అసౌకర్యం మరియు వాపు చీము వల్ల సంభవిస్తాయో లేదో నిర్ధారించడానికి వైద్యుడు రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్‌ను కూడా సిఫారసు చేయవచ్చు.రొమ్ము అబ్సెసెస్ చికిత్సఇంటి నివారణలు: ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము కణజాలానికి వెచ్చని మరియు తేమతో కూడిన కంప్రెస్లను ఇవ్వవచ్చు.ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము నుండి చీము కారుతున్నట్లయితే, స్త్రీలు బ్రాను ధరించే ముందు చనుమొనను సున్నితంగా కడిగి, గాలికి ఆరనివ్వాలివాపు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రొమ్ములపై 10-15 నిమిషాలు ఐస్ లేదా కోల్డ్ ప్యాక్‌ను ఉంచవచ్చు. తల్లి పాలిస్తున్నటువంటి స్త్రీలైతే పాలు ఇచ్చే సమయం లో మధ్య విరామాలలో ఇలా చేయండి : పాలు తాగేటప్పుడు బయటి అంచు నుండి చనుమొన వరకు రొమ్మును మసాజ్ చేయండి, ఇది పాల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు అడ్డుపడే పాల నాళాలను తొలగించడానికి సహాయపడుతుంది.మందులుపారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులతో నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ మందులు పాలిచ్చే తల్లులు తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. రొమ్ము గడ్డలు నివారించడానికి ముందు లేదా తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చు.చికిత్సరొమ్ము చీముకు ప్రాథమిక చికిత్స ఏమిటంటే, రొమ్మును నుండి చీమును తొలగించడం.వైద్యుడు చీమును తొలగించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:సూది ద్వారా చిమును బయటకు తీయడం. ఈ పద్ధతిలో, లక్ష్య ప్రాంతంలోకి ఒక సూదిని చొప్పించి, చీమును బయటకు పీలుస్తారు.కోత ద్వారా చీమును బయటకు పంపడం: ఇందులో ద్రవంతో నిండిన గడ్డపై చిన్న కోత చేసి దానిని పూర్తిగా బయటకు వచ్చేలా చేయడం జరుగుతుంది.- L. ఉమాపతి MA PGDHE(Dr. MGR MU) Chennaiవిశ్రాంత డెమో వైద్య ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా -
Avoidable Fatalities నిజామాబాద్‌లో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ (SaveLIFE Foundation ) మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో, జీరో ఫెటాలిటీ కారిడార్ (Zero Fatality Corridor) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లో ఎమర్జెన్సీ కేర్ సౌకర్యాలను అందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) అధునాతన క్రాష్ డేటా విశ్లేషణ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, మెరుగైన ట్రామా కేర్ మరియు సామర్థ్య నిర్మాణాన్ని ఉపయోగించి అధిక-ప్రమాదకర రహదారులను సురక్షితమైన కారిడార్లుగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారం(మార్చి 6)న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్‌కి అధునాతన ట్రామా కేర్ పరికరాలను అందించారు. తద్వారా వైద్య సహాయంలో జాప్యాలను తగ్గించడంతోపాటు, రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే లోపు సంభవించే మరణాలను నివారించగల మరణాలను నివారిస్తుందని నిర్వహికులు ఒక ప్రకటనలో తెలిపారు. వాయుమార్గ నిర్వహణ కోసం పునరుజ్జీవన సాధనాలు, శ్వాసకోశ మద్దతు, షాక్ నివారణ, రక్తస్రావం నియంత్రణ, ఫ్రాక్చర్ నిర్వహణకు సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జికల్ సాధనాలతో సహా కీలకమైన ట్రామా కేర్‌ను అందిస్తుంది. ఇది రోగులను తదుపరి చికిత్స కోసం అధునాతన వైద్య కేంద్రాలకు తరలించేలోపు రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడతాయి. అత్యవసర వైద్య అందక సంభవించే మరణాలను తగ్గిస్తాయి.ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, “సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సంరక్షణ సేవలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం మన జిల్లాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. తద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, క్లిష్టమైన పరిస్థితుల్లో మనుగడ రేటును మెరుగు పడుతుందన్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రత్యేక అత్యవసర సంరక్షణ సేవలు కీలకమైనవని సేవ్‌లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో పియూష్ తివారీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ , ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృతం రెడ్డి; భీమ్‌గల్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్,సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా ది బెస్ట్ ఫార్ములా!
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు. -
మహిళలు అలాంటి డైట్‌ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్‌గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్‌గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్‌గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్‌ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్‌ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్‌ను గట్‌లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్‌లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్‌నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్‌తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
జిమ్ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!
జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యానికి మేలే.. కానీ జిమ్‌కి వెళ్లే ముందు మానసికంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నామా? లేదా! అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు తగిన మూల్యం తప్పదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్ చేసే క్రమంలో నియమావళిని తప్పక పాటించాలని, ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవల జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతి చెందిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పుడీ అంశాలు చెప్పుకోడానికి ఇదే ప్రధాన కారణం. సొంత ప్రయోగాలకు పోకుండా నిపుణుల సలహాల మేరకే వ్యాయామం చేయాలనేదే ఇందులోని ముఖ్య ఉద్దేశం. – సాక్షి, సిటీబ్యూరో ఈ మధ్యనే ఒక జాతీయ స్థాయి ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన యస్తిక (17) ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువును ఎత్తుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు వెయిట్స్ మెడపై పడి చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో.. షేర్ చేస్తున్నారు. కేవలం చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్, వ్యాయామ సమయాల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను సూచిస్తున్నారు. చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు జిమ్ పార్ట్నర్ తప్పనిసరి.. ప్రమాదకర వ్యాయామాలు చేస్తున్న సమయంలో జిమ్ పార్ట్నర్ను ఎంచుకోవడం తప్పనిసరి. ట్రైనర్ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విభిన్న వర్కవుట్లు చేసే క్రమంలో పార్ట్నర్ ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తారు. ముఖ్యంగా బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాల్లో, అధిక బరువులను ఎత్తుతూ వర్కవుట్లు చేసే సమయంలో భాగస్వామి సమన్వయం చేస్తారు. స్పాటర్ లిఫ్టింగ్ సమయంలో సహాయకారిగా ఉంటారు. టెక్నిక్స్‌తోనే సేఫ్.. వెయిట్ లిఫ్టింగ్ వంటి కఠిన వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం ప్రాథమిక నియమం. ఫామ్‌లో లేని సమయంలో ఎలాంటి బరువులూ ఎత్తే ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు జిమ్ టెక్నిక్స్ ప్రమాదాలు, గాయాల బారినుంచి సంరక్షిస్తాయి. శారీరక, మానసిక దృఢత్వమే హాస్పిటల్ బెడ్ పై కాకుండా వెయిట్ లిఫ్టింగ్ బెంచ్‌పై ఉండేందుకు ఉపకరిస్తుందని ఉమెన్ ఫిట్నెస్ ట్రైనర్ శ్వేత పేర్కొన్నారు. పరిసరాలను గమనించాలి.. వ్యాయామం చేస్తున్న సమయంలో చాలా మంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. వ్యాయామం చేసేటప్పుటు జిమ్ పరిసరాల్లో, ఇతరులు చేస్తున్న వ్యాయామ ప్రక్రియలను గమనిస్తుండాలి. లేదంటే పొరపాటున ఇతరులు చేసే వ్యాయామ పరికరాలు తగలడం, మీద పడటం, రాడ్స్ తగలడం వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రైనర్లు చెబుతున్నారు. ద్రవాలతో డీహైడ్రేషన్‌కు చెక్.. సాధారణంగా జిమ్ సెంటర్లన్నీ వెంటిలేషన్ తక్కువగా ఉండే పెద్ద పెద్ద హాల్స్‌లో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వ్యాయామం ద్వారా వచ్చే వేడి, మరో వైపు ఉబికివచ్చే చెమటలు. ఈ కారణాలతో శరీరం డీహైడ్రేట్ కావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అనువైన ద్రవాలు, పానీయాలు తీసుకోవడం కీలకం. లేదా ఇతర ప్రమాదాలకు డీహైడ్రేషన్ కూడా కారణమవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం.. జిమ్ కల్చర్‌లో క్రమశిక్షణ ప్రాథమిక నియమం. ఫిట్నెస్ వ్యాయామాల తరువాత జిమ్ ఎక్విప్మెంట్ వాటిని భద్రపరిచే ర్యాక్‌లో పెట్టడం ఇతరులను ప్రమాదాల నుంచి నివారిస్తుంది. జిమ్ ఫ్లోర్‌పై డంబెల్స్, వెయిటింగ్ బెల్స్ ఎక్కడివక్కడే ఉంచడం వల్ల కాలికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్కిప్ అయ్యి దానిపై పడితే తలకు బలమైన గాయాలు అయిన సందర్భాలూ కోకొల్లలు. జిమ్‌లో తగిలే గాయాలకు మరో ప్రధాన కారణం ‘వ్యాయామ క్రమశిక్షణ’ లేకపోవడమేనని ప్రముఖ ట్రైనర్ సంతోష్ హెన్రిక్ తెలిపారు. వార్మ్ అప్ తప్పనిసరి.. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. సమయం తప్పనిసరి.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆదరాబాదరా జిమ్‌కి వెళ్లడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరం. వ్యాయామాలు, ఫిట్నెస్ ప్రక్రియలను నిర్దేశిత సమయాల్లోనే చేయాలి. తక్కువ సమయంలో పూర్తి చేసి వెళ్లాలనే తొందరలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. జిమ్ పార్ట్నర్ కోసం త్వరగా ముగించడం, ఎక్కువ సేపు చేయడం కూడా ప్రమాదమే. మన స్థాయికి తగ్గట్టుగానే..వ్యాయామాల్లో ఎక్కువగా చేసే తప్పలు ‘సామర్థ్యానికి మించిన బరువులను ఎత్తడం’. అధిక బరువులను ఓ క్రమ పద్ధతిలో రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సూచన. ఎంత ఎత్తగలరో అంతే ఎత్తండి అని ప్రతి ట్రైనర్ చెబుతుంటారు. అనివార్యకారణాల వల్ల కొన్ని రోజులు జిమ్‌కు వెళ్లని పక్షంలో.. తిరిగి మునుపటి బరువులు ఎత్తడం సరికాదు. దీనివల్ల కండరాలకు గాయాలయ్యే ప్రమాదం ఉందని బంజారాహిల్స్‌లోని ఓ జిమ్ ట్రైనర్ రవి చెబుతున్నారు. వ్యాయామాలు చేసేవారు తమతోపాటు తప్పనిసరిగా టవల్ వెంట తీసుకెళ్లాలి. ఇది ఆరోగ్య రక్షణకు, ప్రమాదాల నివారణకు సహకరిస్తుంది. వ్యాయామాల సమయంలో పట్టే చెమట వల్ల బరువైన వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గాయాలు కావొచ్చు. టవల్‌తో చెమటను తుడుచుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు తొలగిపోయి చర్మానికి రక్షణ చేకూరుతుంది. -
'ఇ-నాలుక'..రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్‌పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది. సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు. ఎలా వర్క్ చేస్తుందంటే..ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్‌లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు. ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు) -
పనిప్రదేశాల్లో పాలివ్వడం తప్పేమి కాదు: సుప్రీం కోర్టు
పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే..మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది. అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్ జస్టిస్(పిల్లల సంరక్షణ )చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్‌లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని కూడా పేర్కొంది ధర్మాసనం. ఇది తల్లలు గోప్యత, శివువుల ప్రయోజనార్థం సూచించన సలహాగా పేర్కొంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్య తీసుకుంటే తల్లి బిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభతరమవుతుందని తెలిపింది. అందువల్ల, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆర్డర్ కాపీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి/నిర్వాహకుడికి రిమైండర్ కమ్యూనికేషన్ రూపంలో పైన పేర్కొన్న సలహాను చేర్చాలని సూచించింది. తద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఈ సలహాలను పాటిస్తాయిని పేర్కొంది ధర్మాసనం. దీంతోపాటు ప్రస్తుత ప్రజా ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న ఆదేశాలు అమలులోకి వచ్చేలా చూసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సలహాలు తెలియజేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది ధర్మాసనం. (చదవండి: జాతీయ భద్రతా దినోత్సవం: భద్రంగా ఉంటున్నామా..?) -
ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మీకోసమే!
పంజాగుట్టలోని ఆఫీస్‌లో కంప్యూటర్ సిస్టమ్ ముందు దీక్షగా పనిచేస్తున్న రవిరాజ్కి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.. నిలుచుంటే తూలి పడిపోతానేమో అని ఫీలింగ్, వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని వేళ్లు కదిపాడు. అంతే.. నిమిషాల వ్యవధిలోనే అతని శారీరక, మానసిక పరిస్థితుల స్టేటస్ చార్ట్ సిద్ధమవడం, వ్యక్తిగత వైద్యునికి చేరడం, జాగ్రత్తలు, మందుల జాబితా రవిరాజ్కి చేతికి రావడం జరిగిపోయింది. నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి నవీన్‌కి మూడేళ్ల బాబు.. ఉన్నట్లుండి అర్ధరాత్రి రెండు గంటలకు తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తింది.. అదే సమయంలో నవీన్ ఇంట్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఆయన భార్య మొబైల్ యాప్ సహాయంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించారు. డాక్టర్ సలహా మేరకు వెంటనే మందులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడంతో సమస్య నుంచి పరిష్కారం లభించింది. ఇలా ఇటీవల కాలంలో ఆన్లైన్లో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునేవారు అనేకం.. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. – సాక్షి, సిటీబ్యూరో రవిరాజ్ మాత్రమే కాదు పలువురు నగరవాసులు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో స్మార్ట్ ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పలువురు టెక్నాలజీని బాగానే ఔపోసన పట్టారు. అనంతర పరిణామాల క్రమంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన మొబైల్స్‌ని పలువురికి మెడికల్ అసిస్టెంట్లుగా మార్చేశాయి. తొలుత సకాలంలో వైద్యసేవలను మాత్రమే అందించిన మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా ఇప్పుడు విభిన్న రకాలుగా ఆరోగ్యరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రివెంటివ్..కేర్ అనారోగ్యాలకు చికిత్సతో పాటు కొన్ని యాప్‌లు ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై దృష్టి పెడుతున్నాయి. వైద్యులు, శిక్షకులను అందుబాటులోకి తెస్తున్నాయి. వ్యక్తి రోజువారీ ఫిట్నెస్ స్థాయిలు, రక్తపోటు హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర స్థాయిలు వగైరాలన్నీ పర్యవేక్షిస్తూ మార్పుచేర్పులపై హెచ్చరిస్తున్నాయి. వినియోగదారులతో వైద్యులకు రిమోట్ యాక్సెస్ అందించే యాప్స్ ద్వారా వ్యక్తులు తమ పరిస్థితిని డాక్టర్‌కు వివరించడానికి చాట్ చేసే సౌకర్యం, వీడియో కాల్స్ వంటివెన్నో అందుబాటులోకి తెచ్చాయి. యాప్స్ ద్వారా జెనెటిక్ వెల్నెస్.. డాక్టర్ దగ్గరకు వెళితే ప్రిస్కిప్షన్ రాస్తాడు. రోగం తగ్గిపోగానే ఆ ప్రిస్కిప్షన్ విసిరేస్తాం. కానీ వాటిని జాగ్రత్త చేయం. కానీ ఆ ప్రిస్కిప్షన్ చాలా అవసరం అనే విషయం గ్రహించం. భవిష్యత్తులో ఆరోగ్య చికిత్సలకు ఇది చాలా కీలకం. అందుకే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందుబాటులోకి తెచ్చాం’ అంటూ చెప్పారు నగరానికి చెందిన హెల్త్‌కేర్ సంస్థ ఆసియానా నిర్వాహకులు సత్యనారాయణ. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల విషయంలో జీన్స్ ప్రాధాన్యతను గుర్తిస్తూ సరికొత్త ఆన్లైన్ ఆరోగ్య వేదికను రూపకల్పన చేశారాయన. ప్రతి డయాబెటిక్ రోగికి తక్షణ చికిత్సగా వెట్ మార్పిన్ ఇస్తారని, కానీ వంశపారంపర్యంగా వచ్చిందా, జీవనశైలి ద్వారా వచ్చిందా? అని గుర్తించాకే ట్రీట్మెంట్ ఇవ్వాలనీ అంటున్నారాయన. దీనికి వ్యక్తి ఆరోగ్య చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ వంటివన్నీ డిజిటల్ రికార్డ్స్‌గా భద్రపరచి యాప్స్‌తో అనుసంధానిస్తే ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం లభిస్తుంది అంటున్నారాయన. వంశ ఆరోగ్య చరిత్ర తెలిస్తే.. జెనెటిక్ వెల్నెస్ కోసం జెనెటిక్ టెస్టులు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వంటివి సైతం గుర్తించవచ్చు. తద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఒక డాక్టర్ దగ్గరకి వెళ్లినప్పుడు అతని జీన్స్ ప్రకారం ఏ మెడిసిన్ ఇవ్వొచ్చు? ఇవ్వకూడదు? వంటివి కూడా సూచించగలుగుతున్నారు. అలాగే న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా నప్పే, నప్పని ఆహారంపైనా ముందస్తు సూచనలు అందించేలా ఈ యాప్స్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాయి. సరికొత్త సేవ ఫేస్స్కాన్.. ఎవరైనా తమ హెల్త్ ఎలా ఉంది? అని తెలుసుకోవాలి అనుకుంటే ఫేస్స్కాన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం 30 సెకన్లలోనే 25 రకాల పరిశీలనలను ఇది అందిస్తుంది. ఇది కూడా యాప్ ద్వారానే సాధ్యమవుతోంది. అలాగే ఒక వెల్నెస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? అనేది సమీక్షించుకునేందుకు కూడా ఈ ఫేస్ స్కాన్ ఉపకరిస్తోంది. హార్ట్ రేట్, థైరాయిడ్, కొలె్రస్టాల్ శాతం, వాసు్క్యలార్ రిస్క్, షుగర్ కంటెంట్, హైపర్ గ్లైసీమియా.. వంటివాటికి సంబంధించిన విశేషాలన్నీ స్కాన్ చేసి చెబుతుంది. ఈ ఫలితాలను బట్టి అవసరమైతే మరిన్ని వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. హెల్త్‌కేర్ వర్చువల్ కేర్‌పై అవగాహన.. కోవిడ్ తర్వాత వర్చువల్ కేర్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే రోగులకు వైద్యసేవలకు మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేశాం. డిజిటల్ కన్సల్టేషన్, ఫార్మసీ కన్సల్టేషన్స్, ల్యాబ్ కన్సల్టేషన్స్ అన్నీ అందిస్తున్నాం. ఫేస్ స్కాన్, జెనెటిక్ వెల్నెస్ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చాం. – సత్యనారాయణ వంటిపల్లి, ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్, ఆసియానా -
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్‌గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్‌లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్‌గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్‌కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్‌లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్‌ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్‌ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్..?) -
పరీక్షల్లో విజయం సాధించాలంటే..?
పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాళ్లు. చాలామంది విద్యార్థులు పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మెదడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? మన మనస్సు పరీక్షలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలు తెలుసుకోవడం అవసరం.మానసిక స్థిరత్వం, సమర్థమైన అధ్యయన పద్ధతులు, దృఢమైన ఆత్మవిశ్వాసం పరీక్ష విజయాన్ని నిర్దేశించే మూడు ప్రధాన అంశాలు. పరీక్షల సమయంలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం, మెదడును ఒత్తిడికి అలవాటు చేయడం, చదువును ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియగా మార్చుకోవడం ఎంతో అవసరం. పరీక్షలలో విజయం అనేది జ్ఞానం కన్నా మానసిక దారుఢ్యం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ వ్యాసంలో అందించే పద్ధతులను అనుసరిస్తే, పరీక్షలపై భయం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు.ఒత్తిడిలో మెదడు ఎలా స్పందిస్తుంది?పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు అమిగ్డాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది మన భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్డాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్‌లోకి వెళ్ళి, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిలో మూడు రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి:Fight Mode: పరీక్షను సవాలుగా తీసుకుని మరింత కృషి చేయడంFlight Mode: పరీక్షలంటే భయపడి చదవడంపై ఆసక్తి చూపలేకపోవడం, అంటే తప్పించుకుని పారిపోవడంFreeze Mode: పరీక్ష సమయంలో మెదడు పనిచేయకపోవడం, గుర్తొచ్చిన విషయాలు మర్చిపోవడం.ఇందులో ఫ్లైట్, ఫ్రీజ్ మోడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా మీ లెర్నింగ్‌ను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఫైట్ మోడ్‌లో ఉండటం పరీక్షల్లో విజయానికి కచ్చితంగా అవసరం. అందుకే మీరో ఫైటర్‌లా మారండి. పరీక్షలను చాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగండి. విజయానికి సానుకూల దృక్పథం పరీక్షలో విజయానికి ఆ మూడు గంటలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది అతి ముఖ్యమైన విషయం. నేనింతే సాధించగలననే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి నేను సాధించగలననే గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవాలి. అది మానసిక స్థితిని శక్తిమంతంగా మార్చి, ప్రతిభను మరింత పెంచుతుంది. అందుకోసం ఓ మూడు టెక్నిక్స్ తెలుసుకుందాం. ఆటో సజెషన్: ‘‘నేను ఈ పరీక్షను విజయవంతంగా రాయగలను’’అని ప్రతిరోజూ మనసులో అనుకోవడం. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉదాహరణలు చదవడం, ఆయా వీడియోలు చూడడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.విజువలైజేషన్: పరీక్ష హాలులో ప్రశాంతంగా సమాధానాలు రాస్తున్నట్లు మనసులో ఊహించడం. ఇలా చేయడం వల్ల ఊహించిన అనుభవాలను నిజంగా అనుభవించినట్లు మెదడు గుర్తుంచుకుంటుంది. దానికి ఊహకూ, నిజానికీ మధ్య తేడా తెలియదు. స్వీయ కరుణ: తప్పులు చేసినా, వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీతో మీరే పోటీ పడాలి. మీ ప్రగతిని చూసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తిచేయడం ద్వారా మనసుకు ఓవర్‌లోడ్ కాకుండా ఉంటుంది.ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకోసం పలు సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అలాగని జస్ట్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం: మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అదేమంత కష్టమైన పనికాదు. వెరీ సింపుల్. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకోవడం, ఏడు సెకన్లు శ్వాసను బంధించడం, ఆ తర్వాత ఎనిమిది సెకన్లు నెమ్మదిగా వదిలేయడం. దీనివల్ల మెదడులో ఆక్సిజన్ పెరిగి ప్రశాంతతను అందిస్తుంది.వ్యాయామం: రోజూ 20 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.దీంతో పాటు సరైన ఆహారం, నిద్ర అవసరం. గుడ్లు, కాయధాన్యాలు, ఉల్లిపాయలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పరీక్షల ముందు కనీసం 7 గంటలు నిద్రపోవడం అవసరం. రాత్రంతా మేల్కొని చదివితే మెదడు పనితీరు మందగిస్తుంది. ---సైకాలజిస్ట్ విశేష్, www.psyvisesh.com(చదవండి: 'గోచీ పండుగ': వినడానికి వింతగా ఉన్నా..పండుగలో మాత్రం..!) -
సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!
వ్యాయామాల అన్నింటిలోనూ అత్యుత్తమమైనది సైకిలింగ్. ఆరోగ్యానికీ ఇది ఎంతో మంచిది. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు పర్యావరణ కాలుష్యం పట్ల పెరుగుతున్న అవగాహన వెరసి హైదరాబాద్నగర వాసుల్లో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు వారాంతాల్లో గ్రూపులుగా మారి సైకిలింగ్ చేయడం ప్రస్తుతం హాబీగా మారింది. ఈ అలవాటు క్రమంగా విస్తరిస్తోంది. దీంతో విభిన్న రకాల సంస్థలు సైక్లిస్ట్ల కోసం రైడ్స్ నిర్వహిస్తుండడంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులు భాగ్యనగర వీధుల నుంచి విదేశీ విహారాల వరకూ రైయ్ రైయ్ మంటూ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు. ఎడా పెడా దూసుకొచ్చే బైక్స్, కార్స్, ఆటోల మధ్య తాదూరే సందు.. లేదు మెడకో డోలు అన్నట్టు ఉంది..భాగ్యనగరంలో సైకిల్ సవారీ. సరదా ఉంది కదా అని కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ప్రత్యేక ట్రాక్స్ వెతుక్కోవాల్సిందే తప్ప.. నగర రోడ్లపై పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలో సైకిల్ ట్రాక్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో సైక్లిస్ట్స్ రైడింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే సైకిల్‌పై లాంగ్ జర్నీ చేయాలనుకునే నగరవాసుల కోసం విభిన్న రకాల రైడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నైట్.. రైట్.. ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి వారాంతపు సెలవుదినాలను ఎంచుకుంటున్నారు ఎక్కువ మంది సైక్లిస్ట్‌లు. తమ హాబీని ఎంజాయ్ చేయడం కోసం.. మరింత సౌకర్యంగా వీధుల్లో విహరించాలని రాత్రి సమయాల్లో జాయ్ రైడ్స్‌కి జై కొడుతున్నారు. ‘పగలు ట్రాఫిక్ రద్దీతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట సైక్లింగ్ చేస్తా’ అని చెప్పారు ఐటీ ఉద్యోగి సౌరభ్. సాధారణంగా ఈ నైట్ రైడ్స్ రాత్రి 7గంటల ప్రాంతంలో మొదలై పరిస్థితులు, పాల్గొన్నవారి ఆసక్తిని బట్టి.. 10 నుంచి 12గంటల వరకూ కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రైడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రసిద్ధ క్రీడా పరికరాల ఉత్పత్తి కంపెనీ డెకథ్లాన్ ప్రతినిధి చరణ్ తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్ రైడ్స్ షురూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉండే ఉదయపు వేళల్లో బ్రేక్ ఫాస్ట్ రైడ్స్ షురూ అయ్యాయి. తెల్లవారుజామున మొదలై ఉదయం 8–9 గంటల లోపు ముగిసిపోయే ఈ తరహా రైడ్ పూర్తయిన అనంతరం ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్ లేదా దాబాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ‘ఒకప్పుడు జిమ్‌లో కార్డియో వ్యాయామంలో భాగంగా ఎక్కువ సైకిల్ తొక్కేదానిని. అయితే దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల సూచన మేరకు రోడ్స్ మీద సైక్లింగ్‌ను ఎంచుకున్నా’ అని సైక్లిస్ట్ నీలిమారాణి చెప్పారు. సుదూర ప్రాంతాలకూ రెడీ.. సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం నగరవాసులను దూరాభారం లెక్కజేయనీయడం లేదు. నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు లాంగ్రైడ్స్కూ వెనుకాడడం లేదు. ఈ విషయంలో బైకర్ క్లబ్స్‌తో వీరు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. ‘కనీసం 100 నుంచి 250 కి.మీ వరకూ దూరంలో ఉండే గమ్యాలను చేరుకోడానికి నగరంలోని సైక్లిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తరచూ లాంగ్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని బైక్ అఫైర్స్ నిర్వాహకులు వివరించారు. విదేశాల్లోనూ.. రయ్ రయ్.. నగరం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి రోడ్స్‌పై రైడ్స్ చేయాలనుకునే ఆసక్తి కలిగిన నగరవాసుల కోసం అక్కడ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘మల్టీ డే బైస్కిల్ రైడ్స్ పేరిట విదేశాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నార్తర్న్ థాయ్‌లాండ్‌లో గత ఫిబ్రవరిలో ఒక రైడ్ నిర్వహించాం. పలువురు సిటిజనులు అందులో పాల్గొన్నారు. త్వరలో స్పెయిన్‌లోనూ ఈ తరహా రైడ్ నిర్వహించనున్నాం’ అని చెప్పారు బార్నోల్ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు. పెడలింగ్.. ఈవెంట్స్.. నగరవాసుల్లో నైట్రైడ్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా డెకథ్లాన్, బైక్ అఫైర్స్ తదితర సంస్థలు ప్రత్యేక సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వాహనం ఉండి, సైక్లింగ్‌పై ఆసక్తి ప్రధాన అర్హతగా, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కూడా పాల్గొనేందుకు వీటిని నిర్వహిస్తున్నవారు సైక్లిస్ట్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తరహా రైడ్స్‌లో భాగంగా సైక్లిస్ట్‌లకు కొత్త కొత్త సైకిళ్ల గురించిన సమాచారం, వాహన నిర్వహణపై అవగాహన, ఆరోగ్యకరమైన అభిరుచిగా తీర్చిదిద్దుకోవడంపై మెళకువలు అందిస్తున్నారు. చిన్న చిన్న రైడ్స్ కోసం కెబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ఎంచుకునే వీరు.. రైడ్ ఈవెంట్స్‌కి శంకర్పల్లి నుంచి కోకాపేట్ టూ శంకర్పల్లి టౌన్, శంకర్ పల్లి నుంచి కంది రోడ్, మేడ్చల్ రోడ్/నాగ్‌పూర్ హైవే వంటివి ఎంచుకుంటున్నారు.బిగినర్స్.. సిగ్నేచర్.. ఆలోచనలు, ఆసక్తికి అనుగుణంగా విభిన్న రకాల ఈవెంట్ మేనేజర్స్ రైడ్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రారంభకుల కోసం 15 నుంచి 20 కి.మీ వేగం పరిమితితో బిగినర్స్ రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ తరహా రైడ్స్ కోసం 25 నుంచి 30 కి.మీ దూరాన్ని ఎంచుకుంటున్నారు. ఇటు ప్రారంభకులు అటు అలవాటైన వారు కాకుండా మధ్యస్థంగా ఉండే వారికి సిగ్నేచర్ రైడ్ నిర్వహిస్తారు. దీని కోసం సుమారు 70 కి.మీ దూరాన్ని నిర్ణయిస్తున్నారు. కనీసం 25 నుంచి 30 కి.మీ వేగంతో 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేసే రైడ్స్‌ని ఫాస్ట్ రైడ్స్గా పేర్కొంటున్నారు. ఇవి నైపుణ్యం కలిగిన వారికి ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే) -
ఒక 24 గంటలు నిద్రలేకుండా గడిపారో ఊబకాయం, కానీ!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేమి మధుమేహం, కేన్సర్ లాంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాదు తగినంత నిద్ర లేనపుడు మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 24 గంటలు నిద్ర పోకపోవడం వలన పెద్దల్లో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. కువైట్‌లోని దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (DDI) ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై స్వల్పకాలిక నిద్ర లేమి ప్రభావాన్ని అంచనా వేసింది. ఊబకాయం, మధుమేహం , గుండె జబ్బులు వంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలలో ఒక రాత్రి నిద్రను దాటవేయడం వల్ల దీర్ఘకాలిక మంట (chronic inflammation)తో ముడిపడి ఉన్న కణాల్లో పెరుగుదల నమోదైంది. ఇదే ఊబకాయానికి ముఖ్య లక్షణం. అయితే ఆసక్తికరవిషయం ఏమిటంటే, సాధారణ నిద్ర పునరుద్ధరించుకున్న తరువాత ఇది సాధారణ స్థితికి చేరింది. తమ పరిశోధన నిద్ర, రోగనిరోధక ఆరోగ్యం మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు.నిద్ర - బరువు మధ్య సంబంధంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. నిద్ర నియంత్రణ అనేది మెదడుకు మాత్రమే సంబంధించినది కాదు, మెదడు ,శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఆరోగ్యంపై నిద్ర లేమి ప్రభావం తెలిసినప్పటికీ, ఈ అనుబంధానికి అంతర్లీనంగా ఉన్న విధానం తక్కువగా అర్థం చేసుకున్నారు. 237 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ పరిశోధన జరిగింది. వీరిబాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా పీలగా ఉన్నవారు, అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో ఉన్నవారు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు , మూత్రపిండాల పనితీరు బావుందని నిర్ధారించుకున్నారు. అలాగే మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), అధిక రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్న వారు. గుండె సమస్యలు (గుండెపోటు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) శస్త్రచికిత్స, కరోనరీ యాంజియోప్లాస్టీ లేదా 'స్టెంట్లు') గుండె సంబంధిత కారణాల వల్ల అకాల మరణం (40 ఏళ్లకు ముందు) సంభవించిన కుటుంబ చరిత్ర ఉన్నవారిని, డిప్రెషన్, సంబంధిత మందులు తీసుకుంటున్న వారికి కూడా మినహాయించారు."నిద్ర లేమి, రోగనిరోధక కణాల డైనమిక్స్ మధ్య పరస్పర చర్యను పరిశీలించేందుకు ఐదుగురు 'సాధారణ బరువు' వ్యక్తులను - ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలను - 24 గంటల పాటు నిద్ర లేమికి గురిచేశారు. వారి నాన్-క్లాసికల్ మోనోసైట్లు (NCM) , ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను గమనించారు. ఇందులో ఎన్సీఎంలో తీవ్రమైన, గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే ఇది రెండు రోజుల తర్వాత అంటే వారు సాధారణంగా నిద్రపోయినపుడు ఇది సాధారణ స్థితికి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది. -
పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!
కొన్ని రకాల వ్యాధులు ఎలా ఉంటాయంటే..జీవితాంతం వాటితోనే బతకాల్సిందే. వాటికి నివారణ ఉండదు. అలాంటి వ్యాధి ఉన్నవాళ్లు ఎంతలా ఆత్మనూన్యత భావంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నాకే ఎందుకు ఇలాంటి సమస్య అని దిగులు చెందడం సహజం. కానీ ఈ అమ్మాయి. ఆ వ్యాధికే సవాలు విసిరేలా బతికి చూపిస్తోంది. ఇంతకీ మహిళ. ఎవరంటే..అహ్మదాబాద్‌కు చెందిన కింజల్ లాథి చిన్ననాటి నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి బారిన పడినవాళ్లు ప్రతి 15 రోజులకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల జీవితకాలం చాలా తక్కువ. ఎందుకంటే. జీవించినంత కాలం కనీస 50 వేలకు పైగా రక్తం ఎక్కించుకుంటారు. దీని కారణంగా శరీంలో ఐరన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వ్యాధితో బాధపడే యువతకు పెళ్లి అవ్వడం అనేది కష్టమే. కుటుంబసభ్యులకు కూడా ఈ విషయం తెలిసి జీవించినంత కాలం వారు ఆనందంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ కింజల్ తల్లిదండ్రలు కూడా అలానే ఆమెను అపురూపంగా చూసుకునేవారు. పెళ్లి అవ్వదనే బెంగతోనే ఉండేవారు. కింజల్ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉండి, సహృదయంతో అర్థం చేసుకుని ముందుకు వస్తే.. పెళ్లి చేయగలమని తల్లిదండ్రులకు తెలుసు. అందుకే పెళ్లి అనేది తమ కూతురుకి కలగా మిగిలిపోతుందేమో అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి అవ్వడమే గగనం అనుకుంటే.. అయితే కింజల్కి కామన్ ఫ్రెండ్ ద్వారా తన పక్కింటిలో ఉండే నవీన్ లాథితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. నవీన్ కింజల్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కింజల్తోనే నేరుగా చెప్పాడు నవీన్. అయితే తన ఆరోగ్య సమస్య గురించి నవీన్‌తో క్లియర్‌గా చెప్పి.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించింది. అయితే నవీన్ తననే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. అయితే నవీన్ నిర్ణయానికి ఆశ్చర్యపోవడం తోపాటు ఆమె హెల్త్ రిపోర్ట్‌లను నవీన్ చేతిలో పెట్టి..మంచి వైద్యుడిని సంప్రదించి తగు నిర్ణయం తీసుకోమని కోరారు. నవీన్ కూడా ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలసుకుని అర్థం చేసుకోవడమే గాక కింజల్‌ని పెళ్లి చేసువాలని ఫిక్స్ అయ్యాడు. నవీన్ తన తల్లిదండ్రులు వద్దన్నా.. కింజల్‌ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెళ్లి అవ్వదనుకున్న తన కూతురికి వివాహం కావడంతో కింజల్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. అక్కడితో కింజల్ ఆగలేదు. ఎలాగైనా తల్లిని కావాలనుకుంది. నిజానికి తలసేమియాతో బాధపడే వాళ్లు బిడ్డును కనేందుకు ప్లాన్ చేయడం కుదరదు. అందుకు వైద్యులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడే వాళ్లలో ఐరన్ లోపం తోపాటు ప్రతి 15 రోజులకు ఎక్కించే రక్తం కారణంగా.. బిడ్డకు సక్రమంగా ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. పైగా ప్రసవం సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి కూడా. కింజల్దే తొలి కేసు..అదీగాక ఇంతవరకు తలసేమియాతో బాధపడుతున్న ఏ మహిళా పిల్లలను కన్న కేసు ఒక్కటి కూడా లేదు. అలాంటిది కింజల్ పట్టుపట్టి..భర్తను ఒప్పించి మరీ బిడ్డను కనేందుకు సిద్ధమైంది. డాక్టర్లు కూడా ఆమె కోరికను కాదనలేక ఓ ఛాన్స్ తీసుకుంటే ఏమవుతుందని ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ అనిల్ ఖత్రి వైద్య బృందం. వాళ్లకు కూడా కింజల్దే తొలి కేసు. వాళ్లు అత్యంత జాగ్రత్తగా కింజల్‌ని పర్యవేక్షించారు. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా మూడు నెలల వరకు ఇంట్లో చెప్పొద్దన్నారు వైద్యులు. ఆ తర్వాత ఆమె కండిషన్ బాగానే ఉందని తెలిసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అలా ఆమె గర్భధరాణ సమయంలో ఏకంగా 36 సార్లు రక్త మార్పిడి చేయించుకుంది. అన్ని సార్లు చేయించుకుంటే..లోపల బిడ్డ బతకిబట్టకట్టడం కష్టం అనేది వైద్యుల ఆందోళన. కానీ కింజల్ ఆ అనారోగ్య సమస్యను సవాలు చేసేలా అధిగమించి మరీ పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి తలసేమియా బారినపడలేదు. అలా 2019 జూలై 12న ఆరోగ్యకరమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది కింజల్. ఓ పక్క రక్తం ఎక్కించుకుంటూనే బిడ్డకు పాలిచ్చింది కూడా. ఇప్పుడు ఆ చిన్నారికి ఆరేళ్లు. చాలా ఆరోగ్యంగా ఉంది కూడా. ఇక్కడ అనారోగ్యం ఎంత పెద్దదైనా..మనలో ధైర్యం, బాగుండాలనే ఆశ బలంగా ఉంటే సమస్య కూడా ఉఫ్‌మని ఎగిరిపోతుందని నిరూపించింది కింజల్. ఎలాంటి స్థితిలోనైనా ధైర్యాన్ని వివడకండి ఆనందకరమమైన జీవితాన్ని వదులోకకండి అని చెబుతున్నట్లుగా ఉంది కదా కింజల్ కథ..!. (చదవండి: యూట్యూబర్ ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..) -
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!) -
ఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్
పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యదాయకమైనవని మనకు తెలుసు. రక్తహీనతకు ఐరన్ లోపం పెద్ద సమస్య. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, యుక్తవయసు బాలికలు అధిక శాతంలో రక్త హీనతతో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు బెంగళూరులోని (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి– ఐసిఎఆర్– అనుబంధ సంస్థ) భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అధిక పాళ్లలో ఐరన్ కలిగి ఉండే పుట్టగొడుగులను రూపొందించింది. ఐరన్ ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్‌ను ఉత్పత్తి చేసి, దానితో రసం పొడిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో సాధారణంగా ఐరన్ 135.60 పిపిఎం స్థాయిలో ఉంటుంది. ఫార్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని 338.15 పిపిఎంకు ఐఐహెచ్ఆర్ పెంపొందించింది. అంటే 149.37% పెంచిందన్నమాట. తినే ఆహారంలో ఉన్న పోషకాన్ని కూడా మన దేహం వంట పట్టించుకోగలిగేది తక్కువే ఉంటుంది. సాధారణంగా మొక్కల ఆహారం ద్వారా మనం తీసుకోగలిగే ఐరన్ 5–8% మాత్రమే. అదే ఇన్ఆర్గానిక్ ఐరన్ టాబ్లెట్లు వంటి సప్లిమెంట్ల ద్వారా 10–12% ఐరన్‌ను మాత్రమే మన దేహం తీసుకోగలదు. అయితే, ఐఐహెచ్ఆర్ రూపొందించిన ఆర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ పొడితో రసం తయారు చేసుకొని రోజువారీ భోజనంలో తీసుకుంటే 21.68% ఐరన్‌ను తీసుకోగలుగుతామని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. ఐరన్‌తో ఫార్టిఫై చేసిన పుట్టగొడుగుల పొడిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటీర పరిశ్రమగా ఉత్పత్తి చేసి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనShivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి? ఇతర వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349. mushroomiihr@gmail.com -
ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం? ఎలాంటి జబ్బులొస్తాయి? సాధారణంగా ఇలాంటి సందేహాలు ఎపుడో ఒకపుడు అందరికీ వస్తాయి. అందులోనూ ఏ కాస్త అనారోగ్యం బారిన పడినా ఇలాంటి అనుమానాలు పట్టిపీడిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటిదాకా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. మరిపుడు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా, ఒక వ్యక్తికి కేన్సర్ లేదా మతిమరపు వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని, ఏ అవయవాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, గుర్తించవచ్చని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. రానున్న పదేళ్లలో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో కూడా తెలుస్తుందట. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ కథనం సాంతం చదవాల్సిందే.యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు, ప్రారంభంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రానున్న 20 ఏళ్లలో అవయవాలు దెబ్బతినే తీరును, 30 వేర్వేరు వ్యాధుల ప్రమాదాన్ని గుర్తించ గలిగారు కేవలం ఒక రక్తపరీక్ష ద్వారా. ఈ పరీక్ష ద్వారా నిర్దిష్ట అవయవాలకు సంబంధించిన భవిష్యత్తు సమస్యలను మాత్రమే కాకుండా, అవి శరీరంలోని మరొక భాగంలో సమస్యలను ఎలా సృష్టిస్తాయో కూడా తెలుసుకోవచ్చుస్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో,యూసీఎల్ పరిశోధనా బృందం, బ్రిటిష్ వైట్హాల్ II అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. తొమ్మిది అవయవాల (గుండె, రక్త నాళాలు, కాలేయం, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు మెదడు) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.తాజా పరిశోధనల ప్రకారం ఒక్క రక్త పరీక్షతో మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి; ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చదవండి: ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?ఉదాహరణకు గుండె వయసు వేగంగా పెరిగినవారిలో గుండె జబ్బుల ప్రమాదం, ఊపిరితిత్తుల వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు తరువాతి కాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD) , ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాదు ఒక మనిషికి ఈ ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ ద్వారా, అతని శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్ర పిండాలు లాంటి ముఖ్యమైన భాగాల ఏజింగ్ ప్రాసెస్‌ను అంచనా వేయవచ్చు. మధ్య వయసులో మెదడు వయసు పెరుగుతున్నవారితో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్న వారిలో చిత్తవైకల్యం (dementia) ప్రమాదం ఎక్కువ అని కనుగొన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తుల్లో ఈవ ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.అలాగే మూత్రపిండాల ఆరోగ్యం ఇతర అవయవాలతో ముడిపడి ఉందని కూడా గుర్తించారు. మూత్రపిండాల వృద్ధాప్యం వేగవంతం అయిన వ్యక్తులు తరువాతి కాలంలో వాస్కులర్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్ ,కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అవయవాల జీవసంబంధమైన వృద్ధాప్యం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేసింది. వ్యక్తికి వయసుకు తగ్గట్టే అవయవాల వయసు ఉండాలి. కానీ జీవనశైలి, తినే ఆహారం, కాలుష్యం, శారీర శ్రమలేని కారణంగా అవయవాల వయస్సు మనిషి వయసుకు మించి శరీరంలోని అవయవాల వయస్సు త్వరగా పెరుగుతోందని తేల్చారు. యూసీఎల్ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధిలో శోథ ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన మరింత సూచిస్తుందని యూసీఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి చెప్పారు. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి.ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, “ఆరోగ్య సంరక్షణ యస్సు సంబంధిత వ్యాధుల నివారణ చాలా ముందుగానే ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని ఆయన అన్నారు. -
Father of Gynecology: ప్రయోగాల వెనుక దారుణ నిజాలు..!
ప్రస్తుతం గైనకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గానీ పూర్వం రోజుల్లో ఇవి లేక మహిళలు చాలా ఇబ్బందిపడేవారు. తమ సమస్యలను మరొకరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేవారు. అలాంటి పరిస్థితుల్లో వారుపడే అంతర్గత గైనకాలజీ సమస్యలు చికిత్స లేనివిగా ఉండేవి. ఆ దిశగా ప్రయోగాలు చేసేవాళ్లు కూడా తక్కువే. అందులోనూ స్త్రీ శరీర ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిపై ధైర్యంగా ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి జేమ్స్ మారియన్ సిమ్స్. అతని వల్లే స్త్రీల ప్రసూతి సమస్యలకు నివారణోపాయాలు కనిపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆ నేపథ్యంలో అతడు ఒడిగట్టిన దారుణలు తెలిస్తే వామ్మో అని విస్తుపోతారు. 'గైనాకాలజీ' అనే అంశం వస్తే అతడికే ధన్యవాదాలు చెప్పుకొవాలి. అంతేగాదు అతడిని "ఆధునిక గైనకాలజీ పితామహుడు"గా అభివర్ణిస్తారు కూడా. అయితే ఈ గైనకాలజీ సమస్యలను నివారించే క్రమంలో అతడు చేసిన దారుణ ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. గైనకాలజీ నిపుణులు జేమ్స్ మారియన్ సిమ్స్ 1813లో అమెరికా సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో జన్మించాడు. అతడు జెఫెర్సన్ మెడికల్ కాలేజీలో మూడు నెలల కోర్సు పూర్తి చేసుకుని ఒక వైద్యుడి వద్ద ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సాధారణంగా కొన్నేళ్లు హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆ కాలంలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయకుండానే నేరుగా వైద్య వృత్తిని కొనసాగించేవారు. ఆ నేపథ్యంలోనే ఆయన వల్ల ఇద్దరు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత జేమ్స్ అలబామాలోని మోంట్‌గోమెరీకి మకాం మార్చాడు. అక్కడ జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో వైద్య మానవీయ శాస్త్రాల ప్రొఫెసర్ వెనెస్సా గాంబుల్ ఆధ్వర్యంలో డాక్టర్‌గా పనిచేసేవాడు. అక్కడ ఉండే ఎనిమిది మంది వ్యక్తుల ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించేవాడు. కొందరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై ప్రయోగాలు చేసేవాడు. అయితే ఆరోజుల్లో మహిళల ప్రసూతికి సబంధించిన సమస్యలను పరిశీలించడానకి సరైన పరికరాలు ఉండేవి కాదు. దీంతో వారి సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రత్యత్పత్తి అవయవాల్లోకి వేళ్లను చొప్పించి గానీ తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు. అలాగే వారికి చికిత్స చేసేందుకు అనువైన బెడ్ కూడా ఉండేది కాదు. అవమానీయ పద్ధతుల్లో మహిళలకు ట్రీట్మెంట్ చేయకతప్పని పరిస్థితి అంటూ జేమ్స్ తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకంలో రాశారు. ఆ క్రమంలో కొందరి పేషెంట్ల పరిస్థితి రీత్యా తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయోగాలు చేసేవాడట. అందుకోసం అతడు నల్లజాతి పేషెంట్లనే వినయోగించానని ఆ పుస్తకంలో తెలిపాడు. అందరు అనుకున్నట్లు నల్లజాతీయల శరీరాలు మందంగా ఉంటాయి కాబట్టి బాధ తక్కువగా ఉంటుందనేది అపోహేనని పేర్కొన్నాడు. తాను వారిపై అనస్థీషియా ఇవ్వకుండానే ప్రయోగాలు చేసేవాడినని, ఎందుకంటే సమస్యను, స్త్రీ దేహ నిర్మాణాన్ని అర్థంచేసుకునేందుకు అలా చేయక తప్పేది కాదని పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఒక రోగి కేసు గైనకాలజీ సమస్యను పరిష్కరించడానకి దారతీసిందని తెలిపాడు. ఒకామెకు ఫిస్టులా సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకు మూత్రం తెలియకుండానే వెళ్లిపోతుంది. అందుకు చికిత్స లేదని తెలిసి ఆమెపై పలు ప్రయోగాలు చేశానని, ఆ విధంగానే మహిళల ప్రసూతి సమస్యలకు నివారణ మార్గాలను కనిపెట్టగలిగానని తన తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్‌లో రాసుకొచ్చాడు. తాను చేసిన ప్రయోగాలు చాలామంది మహిళలను బాధపెట్టి ఉండొచ్చు గానీ, వాళ్లంతా ఎదుర్కొనే గైనకాలజీ సమస్యలను నివారించడానికి మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ కేవలం నల్లజాతీయుల మహిళలపై ప్రయోగాలు చేయడం అనేది చూస్తే జేమ్స్‌కి ఉన్న జాత్యాహంకారం తేటతెల్లమవ్వగా, మరోవైపు ఆ నల్లజాతీయ మహిళలను యావత్తు స్త్రీల సమస్యలకు నివారించడంలో సహాయపడిన వారిగా కీర్తించవచ్చు కూడా కదూ..!. (చదవండి: మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు) -
మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు
అనంతపురం నగరంలో బీకాం చదువుతున్న ఓ యువకుడికి వారం రోజుల క్రితం మతి మరుపు సమస్య వచ్చింది. తల్లిదండ్రులు అతడిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా.. తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. మొబైల్ ఫోన్‌కు బానిసై అన్నీ మరచిపోయాడని తెలిపారు. ఇటీవల గుంతకల్లుకు చెందిన ఓ యువతి మూడు దఫాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లగా.. మానసికంగా కుంగిపోయి ఉందని ఆయన తెలిపారు. చదువులో ఒత్తిడి భరించలేక ఇలా అయిందని చెప్పారు. వీరిద్దరే కాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా పెరిగింది. గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాల్లో ఎన్హెచ్ఎం (జాతీయ హెల్త్ మిషన్) అధికారులు చేపట్టిన పరిశీలనలో ‘మతి’పోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా జబ్బులకు అడ్డాగా మారుతున్నట్టు తేలింది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మూడో యముడు అన్నట్టు మానసిక రుగ్మతలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకూ పట్టణాలకే పరిమితమైన మానసిక రుగ్మతలు పల్లెటూళ్లకూ పాకాయి. ఈ జబ్బు బారిన పడుతున్న వారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. 15 వేల మంది బాధితులు.. బీపీ, మధుమేహం కంటే కూడా మానసిక రుగ్మతను అత్యంత ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటి తీవ్ర మానసిక రుగ్మత బాధితులు ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉన్నట్టు అంచనా. మరో లక్ష మంది వరకూ సాధారణ, మోస్తరు మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే కౌన్సెలింగ్ లేదా మందులు ఇప్పిస్తే తీవ్ర రుగ్మతగా మారే అవకాశం ఉండదు. కానీ బాధితులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకూ వైద్యులను సంప్రదించకపోవడం గమనార్హం. 15 వేల మందికి మందులే లేవు.. గతంలో ‘వైఎస్సార్ ఆరోగ్య సురక్ష’, ఏఎన్ఎంల ఇంటింటి సర్వే, 104 వాహనాల్లో పరీక్షలు తదితర కార్యక్రమాల వల్ల వ్యాధుల బాధితులను వేగంగా గుర్తించేవారు. ఇంటి వద్దే ఉచితంగా మందులిచ్చే వారు. అయితే, గత ఆరు మాసాల నుంచి మెంటల్ హెల్త్ పేషెంట్లకు ఒక్క మాత్ర కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులు మందులు వాడక, జబ్బు ముదిరి పూర్తి మానసిక వైకల్యానికి గురవుతున్నారు. రుగ్మతలకు కారణాలివే.. మితిమీరిన ఒత్తిడి కారణంగా చాలామంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కావడంతో ప్రపంచమే అదే అనుకుని దాని మత్తులోకి వెళ్లిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల రీల్స్, న్యూస్ చూస్తూ తమలో తామే ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నారు. కొంతమంది విద్యార్థులు చదువుల ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి జారుకుంటున్నారు. రకరకాల బెట్టింగ్‌లు, ఆర్థిక కారణాలతో తీవ్ర మానసిక రోగానికి గురవుతున్నారు.ఇటీవల కాలంలో లోన్‌యాప్‌ల ఒత్తిళ్లతో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.చాలా మందికి అవగాహన లేదు వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. కానీ చాలామందిలో అవగాహన లేక జబ్బు ముదిరే వరకూ జాగ్రత్త పడటం లేదు. ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిసలవుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఇటీవల ఎక్కువయ్యారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎన్హెచ్ఎం (చదవండి: ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..) -
ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..
ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్‌లోని భాగల్పూర్లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో సత్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్ ఫుడ్ ప్రీతికరమైన ఆహారమని హైలెట్ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.భారతదేశంలో మఖాన్ ఉత్పత్తిలో బిహార్ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్‌ఫుడ్ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిహార్‌లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్‌కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.మఖానా అంటే..?మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ. సూపర్ ఫుడ్‌గా ఎందుకు పరిగణిస్తారంటే..ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాబరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఐటెంశాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిశరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ ఇదిజీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందిఅలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ఖోబార్ కళ: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..) -
బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?
ఇంగ్లిష్‌లో బీపీ అని సంక్షిప్తంగా చెప్పే ఓ ఆరోగ్య సమస్య అసలు రూపం బ్లడ్ ప్రెషర్. కానీ నిజానికి దీన్ని హైబీపీగా చె΄్పాలి. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడమని అర్థం. తెలుగులో దీన్నే రక్తపోటు అంటారు. దీని నార్మల్ విలువ 140/90. ఉండాల్సిన విలువకంటే ఎక్కువ ఒత్తిడితోరక్తం ప్రవహిస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. ఒకప్పుడు కాస్త పెద్ద వయసు వచ్చాకే బీపీ, డయాబెటిస్ కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో అప్పుడే తమ కౌమార దశ దాటి అప్పుడప్పుడే యువకులు/యువతులుగా మారుతున్న వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ హైబీపీ సమస్య గురించి విపులంగా తెలుసుకోవడం కోసమే ఈ కథనం. బీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం లాంటి అనర్థాలతోనూ, అలాగే కిడ్నీల వంటి ఎండ్ ఆర్గాన్స్ వైఫల్యంతో ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. ఇది ఉన్న విషయమే బయటకు తెలియకపోవడం, అది దెబ్బతీసే అవయవాలైన కిడ్నీ వంటివి పూర్తిగా చెడిపోయేవరకు వాటి లక్షణాలేమీ బయటకు కనిపించకపోవడంతో ఇది నిశ్శబ్దంగా అనర్థాలను తెచ్చిపెట్టి, కొన్నిసార్లు మరణాలకు కారణమవుతుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీ తెచ్చిపెట్టే సమస్యలేమిటి, ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలా వంటి అనేక విషయాలను తెలుసుకుందాం. హై–బీపీ అంటే ఏమిటి?కొంతమంది తాము అతిగా ఉద్రేకపడ్డా లేదా బాగా కోపం ఫీలయినప్పుడు తమకు బీపీ పెరిగిందంటుంటారు. అలాగే మరికొందరు తమకు బాగా తలనొప్పిగా ఉండటం, చెమటలు పడుతుండటం, నర్వస్‌గా ఉండటం, నిద్రపట్టకపోవడం, బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఫీలయినప్పుడు ఆ టైమ్‌లో బీపీ పెరిగిందని చెబుతుంటారు. అయితే అలా జరిగినప్పడు బీపీ పెరిగి ఉండవచ్చు. కానీ కొందరిలో బీపీ పెరిగాక అది అలాగే కంటిన్యూవస్‌గా ఉండటాన్నే హైబీపీగా చెప్పవచ్చు. ఇక కొంతమందిలో తాము హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. ఇంటిదగ్గర రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరగడం, అలాగే తమలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు రక్తపోటు కొంతమేరకు పెరగడం జరగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరిగినప్పటికీ దాన్ని హైబీపీగా పరిగణించడం జరగదు. అయితే ఓ వ్యక్తిలో అనేక పర్యాయాలు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు (సిస్టోల్ / డయాస్టోల్) విలువలు 140/90 అనే కొలతకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. హైబీపీ ఎన్ని రకాలు... హైబీపీని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్. అంటే ఇది మామూలుగా వచ్చే బీపీ అనుకోవచ్చు. ఇతరత్రా ఎలాంటి కారణం లేకుండా వచ్చే బీపీ ఇది. ఇది చాలా సాధారణంగా కనిపించే హైపర్‌టెన్షన్. ఇక రెండోదాన్ని సెకండరీ హైపర్‌టెన్షన్‌గా చెప్పవచ్చు. ఇది శరీరంలో ఏదో ఇతరత్రా కారణాల వల్ల వస్తుంది. అంటే బాధితులకు ఒంట్లో థైరాయిడ్ సమస్య ఉండటం వల్లనో, లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఇతర సమస్యల కారణంగా రక్త΄ోటు పెరిగిపోవడం జరుగుతుంది. అందుకే ఒంట్లో బీపీ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు థైరాయిడ్, కిడ్నీ వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయా అంటూ చెక్ చేయించుకుని, వాటికి మందులు వాడాలి. ఈ సెకండరీ కారణాలు చక్కబడితే అప్పుడు బీపీ తగ్గుతుంది. కానీ మొదటిదైన ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అలా కాదు. ఆ సమస్యకు డాక్టర్ల సూచన మేరకు బీపీని నియంత్రణలో ఉంచే మాత్రలు వాడటం అవసరం. చిన్నపిల్లల్లోనూ హైబీపీ ఉండవచ్చా?చిన్నపిల్లల్లో లేదా అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న యువకుల్లో హైబీపీ ఉండక΄ోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వాళ్లలోనూ, కౌమారం (టీనేజ్)లో ఉన్న పిల్లలు... అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణకు దాన్ని చాలా జాగ్రత్త (మెటిక్యులస్)గా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే చార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల తాలూకు నార్మల్ విలువలు... వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. పెద్దవాళ్లలో నార్మల్స్ వాళ్లలో నార్మల్ విలువకు సమానం కాదు. ఉదాహరణకు వారిలో డయాస్టోల్ బీపీ కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? లక్షణాలేమీ బయటకు కనిపించక΄ోయినప్పటికీ చాలామందికి హైబీపీ ఉండే అవకాశముంది. నిజానికి చాలామందిలోనూ తమకు హైబీపీ ఉన్న విషయమే తెలియకుండా చాలాకాలంగా వాళ్లలో హైబీపీ ఉండే అవకాశం ఉంది. ఇలా చాలాకాలంగా హైబీపీ ఉండటం వల్ల మానవ దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అవి పూర్తిగా పాడైపోయాకగానీ ఆ అవయవాలు దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలు బయటపడవు. ఈలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగి΄ోవచ్చు. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. కేవలం లక్షణాలు కనిపించనంత మాత్రాన హై–బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకుని హైబీపీ లేదన్న నిర్ధారణ జరిగాకే నిశ్చింతగా ఉండాలి. హైబీపీ మందులు చాలాకాలంపాటు వాడుతుంటే, వాటికే అలవాటు పడి... ఇక మున్ముందు బీపీ తగ్గదేమో?ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తుంటారు. వారిలోని బీపీ తీవ్రతను బట్టి కొందరికి రెండు, మరికొంతమందికి మూడు, ఇంకొందరిలో నాలుగు... ఇలా మందులను వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. బీపీ కొలతలను తరచూ చూస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందుల సంఖ్యా, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... మందులకు అలవాటు పడి... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం అనే అంశాలకు ఆస్కారం లేదు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చాక మందులు మానేయవచ్చా?ఒకసారి హైబీపీ నిర్ధారణ జరిగి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ అదుపులోనే ఉంది కదా అని చాలామంది మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియనే తెలియదు. అందుకే ఒకవేళ హై–బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మళ్లీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పెరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించి, ఉన్న హై–బీపీ విలువకు తగినట్లుగా తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు కోసం మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. అందుకే బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. అలాగే తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం కూడా తప్పనిసరి. బీపీ పెరుగుతూ, తగ్గుతూ ఉండటం తరచూ జరగవచ్చంటారు కదా... కాబట్టి హైబీపీ లేకపోయినా, ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడవచ్చు కదా?హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. హై–బీపీ తాలూకు లక్షణాలు అని పేర్కొనే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలను బట్టే బీపీ ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశమే ఉండదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గనూవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హై΄ోటెన్షన్’ అంటారు. అప్పుడు తల తిరగడం గానీ లేదా కొందరిలో ముందుకు తూలిపడిపోతామనే భావన కలగవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక సందర్భాల్లో అనేక మార్లు అలాగే రకరకాల వేళల్లో కొలిచి చూశాకే... హైబీపీని నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి ఐదు రోజుల పాటు రోజుకు మూడు సార్ల చొప్పున కొలతలు తీశాకే నిర్ధారణ చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు కొలతలతో హైబీపీ నిర్ధారణ చేయరు కాబట్టి డాక్టర్లు పొరబడే అవకాశమే ఉండదు.హైబీపీకి బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి మందులు అవసరం లేదు కదా?హైబీపీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నవారు... అంటే హైబీపీ విలువలు మరీ ఎక్కువగా కాకుండా బార్డర్‌లైన్‌లో ఉన్నవాళ్లు మందులు వాడనక్కర్లేదనీ, వాళ్లు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ ఉంటే చాలని చెబుతుంటారు. అంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారన్నది కొందరి వాదన. ఇక చాలామంది తాము మందులు వాడబోమనీ, మంచి క్రమశిక్షణతో వ్యాయామం, ఆహారనియమాలు పాటించడం వంటి జీవనశైలిని అనుసరిస్తూ, హైబీపీని అదుపు చేయగలమని మొదట్లో ప్రతిఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఒకటి రెండు రోజులు పాటించినప్పటికీ... చాలామంది ఈ జీవనశైలి నియమాలను సరిగా పాటించ(లే)రు. ఇలాంటి వాళ్లలో తమ కీలకమైన అవయవాలపైన హై–బీపీ తన దుష్ప్రభావం చూపినప్పుడు జరిగే నష్టం... అప్పుడు అవసరమైన వైద్యపరీక్షలకూ, చికిత్సకూ అవసరమైన ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి డిసీజ్ బర్డెన్ను విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు... కుటుంబ సభ్యులపైనా ఆర్థిక, భావోద్వేగపరమైన ఒత్తిడీ చాలా ఎక్కువగా పడుతుంది. ఆ భారంతో పోలిస్తే... అసలు మనపై ఎలాంటి బరువూ పడకుండా చాలా చవగ్గా దొరికే మందుల్ని రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం వల్ల చాలాకాలం పాటు కీలకమైన అవయవాలను సంరక్షించుకుంటూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో వేదనాభరితమైన జబ్బులను తప్పించుకోవచ్చు. పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హైబీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.హై–బీపీ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా?హై–బీపీ ఉన్నవాళ్లలో ఉప్పు వల్ల రక్త΄ోటు మరింత పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముందుజాగ్రత్తగా ఉప్పు మానేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే మానవ దేహంలోని కీలకమైన జీవక్రియలకు ఉప్పు / లవణాలు అవసరం. ఉదాహరణకు మెదడు నుంచి నాడుల (నర్వ్స్) ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలన్నీ ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేస్తే హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి అది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం సరికాదు. దానికి బదులుగా ఇంతకుముందు వాడుతున్న మోతాదులో సగం లేదా సగానికంటే తక్కువగా వాడటం మంచిదని గుర్తుంచుకోవాలి. మనం వాడే రోజువారీ ఆహారాల్లో మనకు తెలియకుండానే ఉప్పు ఉంటుంది. మనం తీసుకునే చిప్స్ వంటివీ లేదా బేకరీ పదార్థాల్లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉప్పుకూ బీపీ పెరుగుదలకు నేరుగా సంబంధముంటుంది. అంతేకాదు... ఆకుకూరల్లోనూ లవణాల రూపంలో ఉప్పు ఉంటుంది. ఉప్పును చాలాపరిమితంగా తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే హైబీపీ ఉన్నవాళ్లలో ఒక వ్యక్తికి కేవలం రోజుకు రెండు గ్రాముల ఉప్పు అనే మోతాదు సరిపోతుంది.మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలోకి రాలేదంటే... ఆ పేషెంట్ మందులకు రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్లనేనా? కొంతమంది బీపీ నిర్ధారణ సమయంలో ... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరి΄ోతోందా, లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. అలాగే మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా సరికాదు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి హై–బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాల సమయం పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే వాస్తవం, అదే నిజమనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది కూడా సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వెళ్తుండాలి. తరచూ పరీక్ష చేయిస్తూ తమలో రక్త΄ోటు అదుపులో ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ, ఒకవేళ బీపీ ఇంకా పెరిగితే దాన్ని బట్టి మందులు మార్చడం లేదా మోతాదు మార్చడం జరుగుతుంది. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతే...బీపీ అకస్మాత్తుగా పెరగడం చాలా ప్రమాదమని గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ... బీపీ విలువ నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా! ఈ అపోహ చాలామందిలో ఉంది. ఇది చాలాకాలం పాటు రాజ్యమేలింది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ హైబీపీ వస్తుందా?తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చేలాంటి జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడావచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. (చదవండి: -
అతడి వెయిట్‌లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..) -
మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ పాట్లు..! ఈసారి ఏకంగా..
మిలియనీర్ బ్రయాన్ జాన్స(Bryan Johnson)న్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచారు. అందుకోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్(Hyperbaric oxygen chamber)గా మార్చేశారు. అసలేంటిదీ అంటే..?మిలియనీర్ బ్రయాన్ జాన్సన తన కార్యాలయాన్ని హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్లోకి మార్చిన తాజా వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోలో బ్రయాన్ తన నోరు, ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ధరించి కంప్యూటర్‌పై పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. చూడటానికి ఆయన ఒక ఆక్సిజన్ చాంబర్ లోపల బంధించబడినట్లుగా ఆ వీడియోలో కనబడుతుంది. మరో ట్వీట్లో బ్రయాన్ ఆ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) అంటే ఏంటో సవిరంగా వివరించారు. ఆ ట్వీట్లో హెచ్‌బీఓటీ( HBOT ) అనేది ఒత్తిడితో కూడిన గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకునే వైద్య చికిత్స అట. ఈ థెరపీ ప్రకారం ఒత్తిడితో కూడిన గదిలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ని గ్రహించే సార్థ్యాన్ని పెంచుతుందట. ఫలితంగా శరీరమంత ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. ఈ చికిత్సలో కణజాలాల్లో ఆక్సిజన్ సాంద్రత పెంచడం, సెల్యులార్, వాస్కులరైజేషన్లకి మద్దతు ఇచ్చి, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని ట్వీట్లో బ్రయాన్ రాసుకొచ్చారు. అయితే నెటిజన్లల్లో ఈ థెరపీపై ఒక ఉత్సుకత తోపాటు అనేక రకాల సందేహాలను లేవెనెత్తింది. ఎందుకంటే అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ఈ హైపర్బారిక్ చాంబర్లలో ఎలక్ట్రానిక్స్(కంప్యూటర్) అనుమతించే అవకాశం లేదనే సందేహం వెలిబుచ్చగా, మరొకరు వాస్తవాన్ని స్వీకరించి ఆనందంగా బతకడం బెటర్ కదా బ్రో అని మరోకరు సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నిజానికి బ్రయాన్ ఈ ప్రయోగాల్లో ఎంతవరకు సఫలం అవుతాడో లేదో తెలియదు గానీ..ఒకరకంగా హాయిగా అందిరిలా జీవించే స్వేచ్ఛయుత జీవనాన్ని కోల్పుతున్నాడనేది జగమేరిగిన సత్యం కదూ..!.Moved my office into my hyperbaric oxygen chamber. pic.twitter.com/8TXfpPpICh— Bryan Johnson /dd (@bryan_johnson) February 21, 2025 (చదవండి: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్‌బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!) -
ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్‌ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్‌వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ భోజ్‌పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.! -
సంతానోత్పత్తికి పోషకాహారం కీలకం.. గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్
సంతానోత్పత్తి విషయంలో సమతుల ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్ పేర్కొన్నారు. పోషకాలతో నిండిన ఆహారం గర్భధారణ అవకాశాలను పెంచుతుందని వివరించారు. అదేవిధంగా మెరుగైన ఆరోగ్యం కూడా సంతానోత్పత్తికి అవసరమని, గర్భధారణకు ముందు, ఆరోగ్యకరమైన గర్భధారణ సమయంలో శరీరాన్ని సిద్ధం చేయడంలో పోషకాహార పద్ధతులను పాటించాలన్నారు. కొన్ని పోషకాలు తల్లి, పిండం ఆరోగ్యానికి ఎంతో కీలకమని చెప్పారు. !సంతానోత్పత్తికి పోషకాహారం అంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదనీ, పునరుత్పత్తి జీవక్రియలను కూడా మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదలకు తోడ్పడుతుందన్నారు.గర్భిణీ స్త్రీలకు పోషక అవసరాలు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, స్థూల పోషకాలను కలిగి ఉంటాయని తెలిపారు. వీటిలో ముఖ్యమైన అంశాలలో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం మరియు ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని, ఇవి తల్లి, బిడ్డ శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.ఫోలిక్ ఆమ్లం: న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో ముఖ్యమైనది.ఇనుము: ఆక్సిజన్ రవాణాకు అవసరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తుంది.కాల్షియం: ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరం.ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు: మెదడు మరియు కళ్ళు ఏర్పడటానికి సహాయపడుతుంది.గర్భధారణ ఫలితాలను మెరుగుపరచడానికి అలాగే సాధారణ తల్లి శ్రేయస్సును నిర్ధారించడానికి ఈ పోషకాల సమతుల్య వినియోగం ముఖ్యం.పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్, హార్మోన్ల రుగ్మతలతోపాటు, పోషకాహారం కూడా ముఖ్యమైన అంశం. మహిళల్లో, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల పీరియడ్స్ సజావుగా సాగుతాయని, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడానికి సహాయపడుతుందన్నారు.ఎన్డోడోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో, ఆకుకూరలు, బెర్రీలు, గింజలను ఆహారంగా తీసుకోవాలన్నారు.సంతానోత్పత్తిలో ఆహారం యొక్క ప్రాముక్యతను ప్రముఖ నిపుణురాలు గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్ వివరించారు. ప్రణాళికాబద్దంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు మీ శరీరానికి పునరుత్పత్తి ప్రక్రియలను పెంచడానికి, ఎండోమెట్రియోసిస్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడం ద్వారా సంతాన ఉత్పత్తి ఫలితాలు మెరుగుపడతాయి. సరైన పోషకాలతో ఆరోగ్యకరమైన గర్భధారణ, ఆరోగ్యకరమైన శిశువు అభివృద్ధికి దారితీస్తుందన్నారు.సంతానోత్పత్తికి పోషకాహారం పునాది వంటిదని, ఇది గర్భధారణ, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే వరకు దోహదపడుతుందన్నారు. విటమిన్లు, ఖనిజాలు, మైక్రోన్యూట్రియెంట్స్ వంటి కీలకమైన పోషకాలను సమతుల్యంగా తీసుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా, మహిళలు సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. శిశువు అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు. అలాగే, ఎండోమెట్రియోసిస్, హార్మోన్ల రుగ్మతలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఆలివ్ హాస్పిటల్ గురించి:తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ అధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో . 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్థులైన వైద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత యొక్క బంగారు ప్రమాణం అయిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ – హెల్త్‌కేర్ నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. -
మెనోపాజ్-నిద్రలేమికి లింకప్ ఏమిటి..?
నిద్ర సమస్యలు చాలామందికి సర్వసాధారణమే అయినా, మెనోపాజ్ కాలంలోను, ఆ తర్వాత తరచుగా నిద్ర సమస్యలను ఎదుర్కొనే మహిళలకు గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెనోపాజ్‌కు కొద్దిరోజుల ముందు, మెనోపాజ్ తర్వాత సరిగా నిద్రపట్టక ఇబ్బందిపడే మహిళల గుండె పనితీరుపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ఇటీవల అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన సారాంశాన్ని ఒక జర్నల్‌లో ప్రచురించారు. మెనోపాజ్ కాలంలో మహిళలు తమ నిద్ర తీరు తెన్నులపై దృష్టి ఉంచాలని, నిద్రపోయే వేళలు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాలని వారు సూచించారు. నిద్ర మధ్యలో తరచుగా మెలకువ వస్తూ, తిరిగి నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతున్నా, తరచుగా కలతనిద్రతో సతమతం అవుతున్నా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్రూక్ అగర్వాల్ సూచిస్తున్నారు. మెనోపాజ్ కాలంలో ఎదురయ్యే నిద్ర సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలు జటిలంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.(చదవండి: 'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!) -
'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!
ఒక మహిళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఆమె మేని చాయ, నిగారింపు లాంటి అంశాలు పట్టి చూపుతాయి. ఆమె వయసుకూ, హార్మోన్ల సమతౌల్యతకూ, ఆరోగ్యకరమైన జీవనశైలికీ ఆమె చర్మం ప్రతిబింబం. కౌమార దశ నుంచి మెనోపాజ్ వచ్చేవరకు ప్రతి దశనూ ఆమె చర్మం ఓ అద్దంలా చూపిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ల చర్మమూ ప్రధానంగా (బ్రాడ్‌గా) జిడ్డు చర్మం, నార్మల్ లేదా పొడి చర్మం అనే మూడింట్లో ఏదో ఒకటిగా ఉంటుంది. ఓ మహిళది ఆయిలీ స్కిన్ అయితే... వయసు పెరుగుతున్న కొద్దీ అది క్రమంగా ఆయిలీ నుంచి నార్మల్కు మారవచ్చు. అదే... మరొకరి విషయంలో నార్మల్ స్కిన్ అయితే... అది నార్మల్ నుంచి పొడి చర్మానికి మారవచ్చు. ఆయా వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులేమిటి, ప్రతికూల మార్పుల నుంచి రక్షణ పొందడమెలా, సుదీర్ఘకాలం పాటు చర్మ రక్షణ ఎలాగో తెలుసుకుందాం. వేర్వేరు వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులెలా ఉంటాయో, వాటిని అధిగమించి మేనిని ఆరోగ్యంగా ఉంచుకునే రక్షణ చర్యలేమిటో చూద్దాం. టీనేజ్‌లో (అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసు వరకు)...ఈ వయసులోనే అమ్మాయిల్లో రుతుక్రమం మొదలవుతుంది. ఈ టైమ్‌లో వాళ్లలో ఈస్ట్రోజెన్, యాండ్రోజెన్ హార్మోన్ల మోతాదులు మారిపోతాయి. దాంతో చర్మం కాస్తంత జిడ్డుగా (ఆయిలీగా) మారుతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్ కనిపిస్తాయి. కొందరిలో ఆ మొటిమలు పగిలిపోతాయి. ఇవి ముఖ్యంగా ముఖంలోని నుదురు, ముక్కు, చుబుకం వంటి టీ–జోన్లో ఇవి వస్తుంటాయి.రక్షణ ఇలా: ఇలాంటి మొటిమల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం... జిడ్డు తొలగి΄ోయేలా మైల్డ్ సోప్‌తో ముఖం కడుక్కుంటూ ఉండటం, అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం, కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుండటం, వీలైతే డాక్టర్ సలహాతో జిడ్డు తొలగేందుకు తగిన క్లెన్సింగ్ ఉత్పాదనలు వాడటం చేయాలి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు... హార్మోన్లలో సమతౌల్యత ఏర్పడే వయసు ఇది. ఈ సమయంలో జిడ్డు చర్మం చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశముంది. అయితే ఈ వయసులో కొన్ని రకాల ఒత్తిడులు పెరగడం జరుగుతుంది. మొదట్లో అంతగా క్రమబద్ధంగా లేని రుతుక్రమం కాస్త ఓ గాడిన పడి, క్రమం తప్పకుండా రావడం మొదలవుతున్నప్పటికీ అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు క్రమం తప్పడమూ కనిపిస్తుంది. ఈ వయసులోనే మహిళల గర్భధారణ జరగడం మామూలు. అలాంటి సందర్భాల్లో కొందరిలో ముఖం మీద నల్లమచ్చల్లా వచ్చే ‘క్లోయాస్మా’ అనే పిగ్మెంటేషన్ (మెలాస్మా లాంటిదే) గోధుమరంగులో ముఖం మీద కనిపిస్తుంది. రక్షణ ఇలా: ప్రధానంగా ఈ వయసులో ఉండే ఒత్తిడిని రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో అధిగ మించి ప్రశాంతంగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో కనిపించే పిగ్మెంటేషన్ గురించి అంతగా ఆందోళన కూడా అక్కర్లేదు. ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. ఒంటికి తగినంత ద్రవాహారం అందేలా మంచినీళ్లు, కొబ్బరినీళ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ ప్రతి రెండు మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. 40వ పడిలో... మహిళల్లో తమ నలభైల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించే మోతాదు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ అనే ప్రోటీన్ తగ్గడం వల్ల చర్మం తమ బిగువు కోల్పోవడం మొదలై వదులుగా కనిపించడం ప్రారంభమవుతుంటుంది. ఈ కొలాజెన్, అలాగే దేహంలో ఉండే తేమ తగ్గుతుండటం వల్ల ముఖంలో, చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో సన్నటి గీతలుగా కనిపించడం మొదలవుతుంది. ఆ గీతలు క్రమంగా లోతుగా మారడం, చర్మం బాగా వదులయ్యాక ముడతలుగా కనిపిస్తుంది.రక్షణ ఇలా: అందుకే ఇలా చర్మం డల్‌గా, వేలాడటం మొదలవ్వడానికి ముందే దేహానికి కొలాజెన్ అందించే మంచి ఆహారం, వేలడకుండా మంచి వ్యాయామం అందించాలి. తాము తీసుకునే పోషకాల్లో కొలాజెన్ అందించే ఆహారాలైన చేపలు, నట్స్, విటమిన్–సి పుష్కలంగా ఉండే తాజాపండ్లు తీసుకోవాలి. దీంతో చర్మం ఈ వయసులోనూ బిగుతుగా, మేనిలో మంచి మెరుపుతో ఉంటుంది. మరికొంతకాలం చర్మం యౌవనంతో కనిపిస్తుంటుంది. 50వ పడి మొదలుకొని... ఆ పైన...ఈ వయసులో మెనోపాజ్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. దాంతో దేహంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదు తగ్గుతుంది. చర్మం పలుచబారడం, పారదర్శకంగా మారుతుండటం దాంతో లోపలి రక్తనాళాలు కనిపిస్తున్నట్లుగా ఉండటం, చర్మం పొడిబారడం జరుగుతుంది. చర్మంపైన గీతలు మరింత లోతుగా మారుతూ, క్రమంగా ముడుతలు కనిపిస్తుంటాయి. ఫలితంగా ఏజింగ్ వల్ల వచ్చే మార్పులు మరింత స్పష్టమవుతుంటాయి. వయసు పైబడటం వల్ల కనిపించే అన్ని మార్పులూ వ్యక్తమవుతుంటాయి. ఈ వయసు రాగానే చర్మం తనంతట తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గడం మొదలువుతుంది. రక్షణ ఇలా: ఈ ముడతలు కనిపించడం మరింత ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు అవసరమైన కొన్ని ప్రక్రియలను అనుసరించాలి. ఇందులో భాగంగా... ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరికే చేపల వంటి ఆహారాలు, అన్ని పోషకాలు అందే సమతులాహారం అవసరం. ఈ వయసులో తేమ తగ్గి చర్మం పొడిగా మారడం వల్ల గీతలు మరింత లోతుగా మారడం, ముడుతలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంటాయి కాబట్టి దేహానికి అవసరమైన తేమను అందించేలా మాయిశ్చరైజర్ క్రీములు వాడాలి. ఇక చర్మం బిగుతుగా మారడానికీ, కొలాజెన్ తగ్గే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడానికి బాగా తోడ్పడేది తగినంత వ్యాయామం. ఈ అన్ని వయసుల్లోనూ... ఆ వయసుకు తగినంత తీవ్రతతో శరీరానికి తగనంత శ్రమ తెలిసేలా వ్యాయామం చేయడం వల్ల చర్మం మరింత కాలం నిగారింపుతో, మరింత మెరుపుతో కనిపిస్తుంటుంది. వీటితోపాటు కాస్త ఏజింగ్ ఛాయలు కనిపిస్తుండగానే వాటిని ఆలస్యం చేయడానికి, చర్మం ఆరోగ్యంగా మంచి నిగారింపుతో కనిపించడానికి డర్మటాలజిస్టుల సలహా మేరకు వారికి సరిపడే కెమికల్ పీల్స్, మైక్రోనీడిలింగ్స్, ఆర్ఎఫ్, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి పలు చికిత్సలు చేయించుకోవచ్చు.డా. విజయశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్) -
యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?! -
జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..
ఎన్నో రకాల డైట్లు గురించి విని ఉంటారు. కానీ ఇదేంటీ జనరల్ మోటార్స్ డైట్..?.పేరే ఇలా ఉంది. ఆహార నియమాలు ఎలా ఉంటాయిరా బాబు అనిపిస్తోంది కదూ. కంగారు పడకండి మనం చూసే డైట్ మాదిరిగానే ఉంటుంది కానీ దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గిపోతారట. అయితే ఇది ఆరోగ్యకరమైన రీతీలోనే ఉంటుంది. కానీ ఈ డైట్ ప్లాన్ నియమాలను తుచా తప్పకుండా సరిగా అనుసరిస్తే వారంలోనే బరువు తగ్గడంలో మంచి మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది మంచేదేనా అంటే..?..బాలీవుడ్ నటి సురభి చంద్నా తాను జనరల్ మోటార్స్ డైట్‌గా పిలిచే జీఎం డైట్‌ని ఫాలో అయ్యేదానిని అని చెబుతోంది. దీని వల్ల ఫిట్‌గా బాడీ ఉంచుకోగలిగానని అంటోంది. ఆమె బాలీవుడ్ బుల్లి తెర షో ఖుబూల్ హైలో విలక్షణమైన నటనతో మెప్పించిన నటి. నటి సురభి తనకు ఈ డైట్ అంటే మహా ఇష్టమని, ఇట్టే బరువు తగ్గిపోతామని చెబుతోంది.ఈ డైట్లో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మనకిష్టమైన వాటిని తింటూ హ్యాపీగా బరువు తగ్గించే బెస్ట్ డైట్ అని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ డైట్ నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదా..?. నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రముఖ డైటీషియన్ అండ్ డయాబెటిస్ నిపుణురాలు కనిక మల్హోత్రా ఇది బరువు తగ్గేందుకు ఉపకరించే ఏడు రోజుల జీఎం డైట్ అని చెప్పారు. దీన్ని ఎఫ్‌డీఏ, యూఎస్డీఏ సహాకారంతో రూపొందించిన డైట్‌ని అని వాదనలు ఉన్నాయి.అందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ డైట్ ప్రకారం నిర్థిష్ట ఆహార పదార్థాలనే తీసుకోవడం జరుగుతుంది. దానిలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లపై దృష్టి పెట్టి.. కొవ్వులు, కార్బోహైడ్రేట్లను తగ్గించడంపై దృష్టి పెడుతుంది అని మల్హోత్రా వివరించారు.ఎలా పనిచేస్తుందంటే..ఆహారంలో పరిమిత కేలరీలు తీసుకోవడం అనే సూత్రంపై ఆధారంగా ఉంటుంది ఈ డైట్ ప్లాన్. ప్రతి రోజు పరిమిత పరిధిలో ఒకరకమైన ఆహారమే తీసుకోవాల్సి ఉంటుంది.అదెలా అంటే..మొదటి రోజు: పండ్లు మాత్రమే (అరటిపండ్లు తప్ప)రెండో రోజు: కూరగాయలు మాత్రమే (పచ్చి లేదా వండినవి)మూడవ రోజు: పండ్లు, కూరగాయల మిశ్రమంనాల్గవ రోజు: అరటిపండ్లు, పాలుఐదో రోజు: టమోటాలు, లీన్ ప్రోటీన్లు ఉండే మాంసం (లేదా ప్రత్యామ్నాయాలు)ఆరో రోజు: మరిన్ని కూరగాయలు, మాంసంఏడవ రోజు: బ్రౌన్ రైస్, పండ్ల రసాలు, కూరగాయలుఅలాగే ఈ డైట్‌ని అనుసరించేవారు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీరు తాగాల్సి ఉంటుంది. ఈ డైట్‌ని ప్రయత్నించిన వారందరూ గణనీయమైన బరువు తగ్గుతారనేది నిజమేనని అన్నారు. ఎందువల్ల అంటే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలే ఉండటంతో శరీరానికి కావల్సిన ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, కేలరీలు మాత్రం తక్కువగానే ఉంటాయి.దీంతో సులభంగా బరువు కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ డైట్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు లేకపోవడం వల్ల ఆరోగ్యకరంగానే సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. అలాగే ఈ డైట్ వల్ల చక్కెరను తీసుకోవడం చాలామటుకు తగ్గిపోతుందని కూడా చెప్పారు.ప్రతికూలతలు..ఇందులో మంచి కొవ్వులు, విటమిన్ బీ12, డీ, ఇనుము, కాల్షియం వంటి పోషకాల లోపిస్తాయిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణరాలు మల్హోత్రా. కాలక్రమేణ ఈ డైట్‌ని ఫాలో అయితే విటమిన్ డెఫిషెన్సీకి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తీవ్రమైన కేలరీల పరిమితి వల్ల ఆకలి భావన ఎక్కువగా ఉంటే ప్రమాదం లేకపోలేదు.దీర్ఘకాలికంగా ఇది అంత ఆచరణీయమైనది కాదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వుకు బదులుగా ఎక్కువగా కోల్పోయిన నీటి బరువే ఉంటుందని చెబుతున్నారు మల్హోత్రా. అయితే ఎప్పుడైన ఈ డైట్ స్కిప్ చేసి నార్మల్‌గా తినేస్తే మాత్రం ఎంత స్పీడ్‌గా అయితే బరువు తగ్గామో అంతే మాదిరి పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరగ్యో నిపుణురాలు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 'ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
హైదరాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజన్ థెరపీ ఛాంబర్
హైదరాబాద్: నగరంలోని వైద్య చికిత్సలలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ) సాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది.హెచ్‌బీఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్‌ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.సయ్యద్ ఖలీల్, ఫిజికల్ థెరపిస్ట్: "మేము హైదరాబాద్‌లో మొట్టమొదటి హెచ్‌బిఒటి (హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ) ఛాంబర్‌ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి గా, ఆరోగ్య పునరుద్ధరణ మరియు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతోంది. ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోషణను పెంచి, మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి పెంచిన ఛాంబర్లో 100% శుద్ధ ఆక్సిజన్ శ్వాసించడం ద్వారా కణాల పునరుద్ధరణ మెరుగుపడి, వాపు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత ఆరోగ్యం, మెటాబాలిక్ ఆరోగ్యం, మరియు జీవనశైలి పునరుద్ధరణ వంటి అనేక ప్రయోజనాలతో, హెచ్‌బిఒటి ఆధునిక ఆరోగ్య సంరక్షణలో గేమ్-చేంజర్‌గా మారింది.రుజువైన ప్రయోజనాలు- యాంటీ ఏజింగ్, రికవరీ విషయంలో సమూల మార్పులు రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్‌ను ప్రారంభించినప్పటి నుంచి రోగులు వేగంగా కోలుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు పలు విభాగాల్లో అసాధారణ ఫలితాలు సాధించింది. వాటిలో ప్రధానమైనది యాంటీ ఏజింగ్, చర్మ పునరుజ్జీవనం.వయసుతో వచ్చే సమస్యలకు సరైన పరిష్కారంహెచ్బీఓటీ చికిత్స వల్ల చర్మం మీద అసాధారణ ప్రభావాలు కనిపిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. బయటి వాతావరణంలో మనం గాలి పీల్చుకునేటప్పుడు అందులో 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని మనం పీల్చుకుని, మళ్లీ 15% బయటకు వదిలేస్తాం. అంటే, 5 శాతం ఆక్సిజన్ మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది. కానీ, అదే హెచ్‌బీఓటీ ఛాంబర్లో అయితే మొత్తం నూరుశాతం ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దాన్ని మన శరీరం పూర్తిగా పీల్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుంది. చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. దానివల్ల శరీరం మీద ఉండే గీతలు తగ్గిపోతాయి. మన కణజాలం కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎముకలు, కండరాలకు వయసుతో పాటే వాటిల్లే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనివల్ల గుండె కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడుతుంది. గతంలో మధుమేహ బాధితులకు ఏవైనా గాయాలు అయినప్పుడు, లేదా శస్త్రచికిత్సలు చేసినప్పుడు వారి చర్మం త్వరగా కోలుకునేందుకు వీలుగా ఇలాంటి చికిత్సలు సూచించేవారు. కానీ, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఈ చికిత్స వల్ల చర్మంతో పాటు శరీరంలోని కణాలన్నింటికీ కూడా ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అవన్నీ ఆరోగ్యవంతం కావడంతో వయసు ప్రభావం వల్ల కనిపించే చర్మం ముడతలు, ఇతర సమస్యలన్నీ తగ్గిపోతాయి.ఇది కాక ఇంకా...దీర్ఘకాలిక అలసట, శక్తి బూస్ట్: ఈ చికిత్స ఆక్సిజన్ డెలివరీని పెంచి, అలసటను తగ్గిస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుందిడయాబెటిస్, జీవక్రియపరమైన ఆరోగ్యం: రక్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది. గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది, రక్తంలో చక్కెరశాతాన్ని సరిగ్గా నిర్వహించేలా చూస్తుంది. క్యాన్సర్ చికిత్సలు: రేడియేషన్ తర్వాత కణజాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. క్యాన్సర్ బాధితులకు రోగనిరోధకశక్తి మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది. నాడీ సమస్యలు: స్ట్రోక్, మెదడుకు అయ్యే గాయాలు, రోగులలో న్యూరోడీజెనరేటివ్ సమస్యలకు, జ్ఞాపకశక్తి పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఒత్తిడి, జీవనశైలి పునరుద్ధరణ: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుందిఆధునిక వైద్యం, చికిత్సలలో గేమ్ ఛేంజర్అసలు తొలినాళ్లలో దీన్ని కనుక్కున్నప్పుడు.. డ్రైవర్లలో డీకంప్రెషన్ సిక్నెస్కు చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. కానీ తర్వాత ఇప్పుడు దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. యాంటీ ఏజింగ్, జీవితకాలాన్ని పెంచడం, క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ముఖ్యంగా రేడియేషన్ వల్ల కలిగే నష్టాల నుంచి కోలుకునేలా చేయడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి జీవనశైలి సమస్యలను పరిష్కరించడం, అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచి, కండరాలు కోలుకునేలా చేయడం లాంటి అనేక ప్రయోజనాలు దీంతో సిద్ధిస్తున్నాయి.రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ గురించి: రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అనేది హైదరాబాద్ నగరంలోని ఒక ప్రధాన వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ. వ్యాధుల నుంచి కోలుకుఓవడం, సమగ్ర ఆరోగ్యం, పనితీరు విషయాలకు సంబంధించి శాస్త్రీయ చికిత్సలను అత్యాధునిక విధానాల్లో అందించేందుకు ఇది అంకితమైంది. సంపూర్ణ వైద్యం, వినూత్న చికిత్సలపై దృష్టి సారించిన రాస్ సంస్థ.. హెచ్‌బీఓటీ, ఇతర పునరుత్పత్తి చికిత్సలతో చికిత్సల భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది -
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!
బరువు తగ్గడం అనేది అనుకున్నంత సులువు కాదు. అలాగని అంత కష్టమూ కాదు. కావాల్సిందల్లా పట్టుదల. దృఢమైన నిశ్చయం ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే దీనికి ముందు బరువు పెరగడానికి గల కారణాలను విశ్లేషించు కోవాలి. బీఎంస్ ఇండెక్స్ ఆధారంగా ఎంత బరువున్నదీ లెక్కించు కోవాలి. దాని ప్రకారం ఎంత తగ్గాలి నిర్ణయించు కుని, జీవనశైలి మార్పులను చేసుకొని ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది.బరువు తగ్గాలనుకునేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, నిద్ర, తగినన్ని నీళ్లు లాంటివి చాలా అవసరం. కొన్ని ఆహార నియమాలుకీరదోసకాయ, బీర, సొరలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువున్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పైగా వేసవిలో శరీరాన్నిహైడ్రేటెడ్గా ఉంచుతాయి కూడా.తాజా ఆకు కూరల్లోని విటమిన్ సీ, విటమిన్ కే ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా కూడాచాలామంచిది.తక్కువ కేలరీలు ఉండే బీట్రూట్, కేరట్లలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు. (వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు)లో కేలరీ పండ్లల్లో యాపిల్ చాలా ముఖ్యమైనది. ఇందులోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ద్రాక్షతో పాటు జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.రోజుకు 800 కేలరీల తక్కువ తింటే వారానికి 1.5-2 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా సూప్‌లు, షేక్‌లు, బార్లు వంటివి ఉపయోగపడతాయి. రోజుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి.సాధారణంగా మహిళలకు రోజుకు 1,200 నుండి 1,500 కేలరీలు ,పురుషులకు 1,500 నుండి 1,800 కేలరీలు తీసుకోవచ్చు. మిల్లెట్స్, ఓట్స్, మొలకలొచ్చిన గింజలు, నూనెకు బదులుగా నెయ్యి, బాదం, అవకాడో లాంటివి కూడా చాలా మంచిది. ఇదీ చదవండి : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?అడపాదడపా ఉపవాసంఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. వీలును బట్టి ఈ 16 గంటలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బరువు ఎంత తగ్గాము అనేదిచూసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం వేగంగా బరువు తగ్గడం అంటే వ్యాయామం ద్వారా ఎక్కువ తగ్గించుకోవడమే. ఏ రకమైన డైట్ పాటించినా, వ్యాయామం మాత్రం తప్పనిసరి. అరగంట నుంచి గంటదాకా నడక, యోగా లాంటివి తప్పకుండా చేయాలి. నోట్: అయితే కొన్ని జెనెటిక్ కారణాలు, అనారోగ్య పరిస్థితులుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు పాటించాలి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సలహా తీసుకోవాలి. కొంతమంది స్వయంగా వేగంగా బరువు తగ్గడం సురక్షితం కాకపోవచ్చు అని గమనించుకోవాలి. అలాగే తీవ్రమైన ఆహార మార్పులు, శారీరక శ్రమ ద్వారా నెమ్మదిగా బరువు తగ్గే వ్యక్తుల కంటే చాలా త్వరగా బరువు తగ్గే వ్యక్తులు కాలక్రమేణా బరువును తిరిగి పొందే అవకాశం చాలా ఎక్కువ. -
శంబాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్.. ఆ లుక్ కోసం ఏం చేశాడంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్‌కి వేలాది మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇటీవల విడుదలైన 'ఛావా'మూవీతో తనలో ఉన్న అసాధారణమైన నటుడిని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఈ మూవీ బాక్స్‌ఫిస్ వద్ద కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతోంది. ఆ మూవీలో చత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. అచ్చం మహారాజు మాదిరి అతడి ఆహార్యం అందర్నీ కట్టిపడేసింది. మరాఠా రాజుల కాలంలోకి వెళ్లిపోయేలా అతడి ఆహార్యం నటన ఉన్నాయి. ఇందుకోసం 80 కిలోల మేర బరువున్న అతడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకున్నాడని తెలుస్తోంది. విక్కీ ఇలా యోధుడిలా శరీరాన్ని మార్చుకునేందుకు ఎలాంటి ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్ ప్లాన్లు అనుసరించాడంటే..హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల ఫిట్నెస్ గురువు క్రిస్ గెథిన్.. విక్కీ కౌశల్‌కి తన శరీరాన్ని మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చాడు. మహారాజు మాదిరిగా ఎగువ శరీరం బలోపేతంగా ఉండేలా కండలు తిరిగిన దేహం కోసం విక్కీ చేత కార్డియో వంటి వ్యాయామాలు చేయించాడు. భారీ బరువులు ఎత్తించి మంచి విశాలమైన ఛాతీతో రాజు మాదిరి ధీరుడిలా కనిపించేలా చేశాడు. ఆయను విక్కీకి ఇచ్చిన ఫిట్నెస్ శిక్షణలేంటంటే..ఫంక్షనల్ వ్యాయామాలు: యుద్ధ తాళ్లు, స్లెడ్ పుష్‌లు, టైర్ ఫ్లిప్‌లు.కార్డియో: స్టామినా కోసం హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT).ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ: గాయాలను నివారించడానికి స్ట్రెచింగ్ మొబిలిటీ డ్రిల్స్.ఈ ఫిట్నెస్ శిక్షణలన్నీ బాడీ నిర్మాణానికి సరిపోతుంది అంతే.. మంచి అందమైన లుక్ కోసం కీలంగా ఉండేది డైట్ ప్లాన్ మాత్రమే. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) అవేంటంటే..ప్రోటీన్ పవర్: సోయా ముక్కలు, పనీర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులు.శక్తిని పెంచేవి: బీట్రూట్ టిక్కీలు, చిలగడదుంపలు.క్లీన్ ఈటింగ్: కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సమతుల్య మాక్రోలు. చీట్ మీల్స్ వంటివి దరిచేరనీయలేదు. ఇలాంటి కఠినతరమైన ఫిటెనెస్ శిక్షణతో మహారాజు మాదిరి లుక్‌తో ఆకట్టుకున్నాడు విక్కీ. ఇక ఒక ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ..అవిశ్రాంత శిక్షణ, క్రమ శిక్షణతో కూడిన ఆహారం తదితరాలే శంభాజీ మహారాజ్ మాదిరి బలాన్ని ప్రతిబింబించడానికి సహాయపడిందని చెప్పారు. ఇంతలా కష్టపడటం వల్లే చక్కటి శరీరాకృతితో తెరపై కనిపించే శంభాజీ మాహారాజు పాత్రకు ప్రాణం పోశాడు విక్కీ. గమనిక: ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం, స్లిమ్‌గా అవ్వడం వంటివి సెలబ్రిటీలు చేస్తుంటారు. వాటిని వాళ్లు ప్రత్యేక నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుని ప్రయ్నత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి దుష్ఫ్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల అనుకరించే మందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులు సలహాలు సూచనలతో అనుసరించడం ఉత్తమం.(చదవండి: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ Vs ఎలోన్ మస్క్: ఒకరిది పోరాటం మరొకరిది..!) -
అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!
డాక్టర్ గారూ నేను గత ఏడెనిమిది ఏళ్లుగా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకో కారణం తెలియదు. దానివల్ల నా స్టడీస్ కూడా దెబ్బతిన్నాయి. అయినా మా అమ్మానాన్న కోసమైనా బతకాలనుకుని ఇంతవరకు ఉన్నాను. కానీ మళ్లీ ఒక సంవత్సరం నుంచి భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా మైండ్‌లో రోజూ విచిత్రమైన ఆలోచనలు నిరంతరం వస్తూ నన్ను బాధపెడుతున్నాయి. ఈ చెట్లు ఎలా వచ్చాయి? భూమ్మీదకు మనుషులు ఎలా వచ్చారు? గాలిని చూడగలమా? ఆత్మలు ఉన్నాయా? నీళ్లు ఎందుకు తాగాలి, అన్నం ఎందుకు తినాలి... ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వచ్చి నరకయాతను అనుభవిస్తున్నాను. ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఇలా రాకూడదని నేనెంత ప్రయత్నం చేసినా అవి ఆగడం లేదు. మాది చాలా బీదకుటుంబం. నన్ను ఎలాగైనా ఇందులోంచి బయట పడేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. - విక్రం, పులివెందులమీ మెయిల్ చదివాను. మీరు ఎన్నో అనవసరమైన ఆలోచనలతో సతమతం అవుతూ, వాటినుంచి బయట పడలేక మనోవేదనకు గురవుతున్నట్లు అర్థం అయింది. మీకున్న లక్షణాలను ఎగ్జిస్టెన్షియల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువగా ఫిలసాఫికల్ డౌట్స్ వస్తాయి. భూమి గుంఢ్రంగా ఎందుకు ఉంది, మనుషులు ఎలా పుట్టారు, సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి.. లాంటి తాత్వికమైన ప్రశ్నలు వస్తాయి. అయితే సాధారణంగా అందరిలో ఏదో ఒక సమయంలో ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు తలెత్తినా కొంతసేపు ఉండి తగ్గిపోతాయి. మీ విషయంలో మీకు ఇవి ఇష్టం లేకున్నా మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా వస్తున్నాయి. వాటికి సమాధానాలు వెతకలేక మీరు తీవ్రమైన మానసిక క్షోభకు, డిప్రెషన్‌కూ గురవుతున్నారు. దీనికి మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.మంచి మందులతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ జబ్బు లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. మీరు మీ ఉత్తరంలో చికిత్స తీసుకుంటున్నారో లేదో తెలపలేదు. ఒకవేళ మీరు చికిత్సలో లేనట్లయితే మీకు దగ్గరలో కడప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే మందులు, కౌన్సెలింగ్‌తో తగ్గిస్తారు. క్రమం తప్పకుండా మందులు వాడి కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీ సమస్య వీలైనంత తొందరలో తగ్గి΄ోతుంది. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా, సమస్య తగ్గకుంటే మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వస్తే మీకు తగిన చికిత్స చేసి, మీ సమస్య నుంచి పూర్తిగా బయట పడేలా చేయగలం. మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న కారణంగా చికిత్స ఆపవద్దు. మీ పరిస్థితిని బట్టి మీకు అవసరమైన సహాయం చేసి, చికిత్స చేయగలం. వెంటనే మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లండి. అన్నీ మంచిగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్
కేన్సర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహిళలను ప్రభావితం చేసే కేన్సర్లను ఎదుర్కోవడానికి టీకా ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని, 9-16 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు టీకాలు తీసుకోవడానికి అర్హులని కేంద్ర మంత్రిప్రకటించారు. ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందన్నారు.దేశంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది, ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు కేంద్రంమంత్రి తెలిపారు.. 30 ఏండ్ల పైబడిన మహిళలకు ఆ సుపత్రిల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి డే కేర్ కేన్సర్ కేంద్రాలను నెలకొల్పుతామని కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. . ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలున్నాయని.. ప్రజలు వాటిని వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పెంచుతోందని ఆయన అన్నారు. కాగా మన దేశంలో మహిళల్లో రొమ్ము కేన్సర్ బాగా కనిపిస్తోంది. అదే పురుషుల్లో అయితే ఊపిరితిత్తుల అత్యధికంగా విస్తరిస్తోంది. చిన్నపిల్లలో లింఫోయిడ్ లుకేమియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. స్త్రీ జననేంద్రియ కేన్సర్‌లో ప్రధానంగా ఐదు కాలుఉన్నాయి. గర్భాశయ ముఖద్వార, అండాశయ, గర్భాశయ, యోని అండ్ వల్వార్. ఆరవది చాలా అరుదైనది ఫెలోపియన్ ట్యూబ్ కేన్సర్ . చదవండి: ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్ -
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్‌తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్‌కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్‌లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
ఫిష్.. నగర వాసుల దిల్ ఖుష్
నాంపల్లి: ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనలో భాగంగా మత్స్యశాఖ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘మన తెలంగాణ–మన చేపలు’ నినాదంతో విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపలను నగరంలో విరివిగా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదివరకే నగరంలో పలు చోట్ల చేపల విక్రయ కేంద్రాలు (ఫిష్ స్టాల్స్), సంచార విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు విభిన్న రుచులను పరిచయం చేసేందుకు ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మాసబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో ప్రయోగాత్మకంగా ఫిష్ క్యాంటీన్‌ను నడిపిస్తున్నారు. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి చేపల రుచులను ఆస్వాదించడానికి శాంతినగర్ ఫిష్ క్యాంటీన్‌కు వస్తున్నారు. రోజుకు 500 కేజీల చేపలను వినియోగిస్తున్నారు. ఆదివారం వెయ్యి కేజీలు వివిధ రకాల రెసిపీలకు వాడుతున్నారు. వివిధ రకాలు.. బోన్‌లెస్ చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, చేపల పులుసు, అపోలో ఫిష్, ఫిష్ ఫింగర్స్, క్రిస్పీ రొయ్యలతో వంటకాలను తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ (పండుగ రోజు మినహా) మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్యాంటీన్ పనిచేస్తుంది. చేప దమ్ బిర్యానీ రూ.250, బోన్‌లెస్ ఫిష్ బిర్యానీ రూ.300 లకు అమ్ముతున్నారు.రెడీ టు కుక్.. మత్స్య శాఖ రెడీ టు కుక్ పేరుతో ఆర్డర్లు కూడా బుక్ చేసుకుంటోంది. శుభకార్యాలు, వివిధ రకాల ఫంక్షన్లకు చేప వంటకాలను అందిస్తోంది. అలాగే చేపల పులుసు, రొయ్యలు, పీతల పులుసుకు కావాల్సిన చేపలను కూడా శుద్ధి చేసి సప్లయ్ చేస్తోంది. మత్స్య శాఖ డీజీఎం సుజాత 7989196259 ఫోన్ నంబరులో సంప్రదించి ఆర్డర్ చేసుకోవచ్చు.ఐదు కొత్త క్యాంటీన్లు.. నగరంలో ఐదు కొత్త ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. గచి్చ»ౌలి, దిల్సుఖ్నగర్, శంషాబాద్, నాంపల్లి, ఎస్ఆర్ నగర్లో త్వరలో ప్రారంభిస్తాం. చేప బిర్యానీ, చేప పులుసు, ఫ్రై వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభించే ఆలోచన చేస్తాం. – మెట్టు సాయి కుమార్ -
ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
తెలంగాణాలో హైకోర్టులో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి సీనియర్ న్యాయవాది ప్రాణాలు కోల్పోయిన వైనం ఆందోళన రేపింది. ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం ఏమైనా సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.గుండెపోటు అంటే? గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలువాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు.గుండెల్లో మంట లేదా అజీర్ణంగొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడంఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందితల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసంనాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసంఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలిలక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటేమహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.గుండెపోటు రావడానికి కారణంవృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడంచిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడంకాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడంశక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడంగుండెపోటు రాకుండా ఏం చేయాలి?క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడంప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక, లేదా ఇతర వ్యాయామం చేయడం.ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడంనోట్: కొన్ని అనుమానాస్పద లక్షణాలున్నవారందరూగుండెజబ్బు వచ్చేసినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..
అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ సీక్రెట్ల గురించి నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటంటే..టొరంటోలో నివసించే గురిష్క్ కౌర్ అనే బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది. బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్. అలాగే తన డైట్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టింది. బరువు తగ్గేలా చేసిన డైట్ ట్రిక్..ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి. లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నట్స్, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండిచిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలిదీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి80/20 రూల్ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్‌ని. డైట్ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్ ప్లాన్ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్. అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!) -
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!
అధిక బరువును తగ్గించుకోవడం ఒక ఛాలెంజ్. అందులోనూ కొండలా పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం పెద్ద సమస్య. పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వు (ఆడవాళ్లైనా, మగవాళ్లైనా) లుక్‌ను మార్చేయ డమే కాదు, అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం అంత కష్టమేమీ కాదు. మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ముఖ్యంగా కొన్ని యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దామా..!యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్యాట్ రిడక్షన్ కోసం అనేక యోగాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యోగాసనాలు ఉదర కండరాలను దృఢం చేస్తాయి. హృదయ స్పందన రేటును పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే బెల్లీఫ్యాట్‌కు కారణమైన ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరచడం, కోర్ కండరాలను బలోపేతం చేయడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఒక విధంగా ఇది ఉదరం చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ఇవే ప్రధాన కారణం. బెల్లీ ఫ్యాట్ కరిగించేలా మధ్యాహ్నం పూట వేసే కొన్ని ఆసనాలను చూద్దాం.భుజంగాసనం : ఇది పొత్తికడుపును సాగదీస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది.నేలపై పడుకుని, ముఖం నేలకు సమానంగా నిలపాలి. అరచేతులను రెండు వైపులా ఉంచి నెమ్మదిగా మీ మొండెం ఎత్తాలి. అరచేతులు, దిగువ శరీరం మాత్రమే నేలను తాకేలా ఉండాలి.ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. తిరిగి యథాస్థితికా రావాలి.ఇలా 3-4 సార్లు చేయాలి. ధనురాసనం : ఇది ఉదర కండరాలను బలోపేతం చేసి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ధనురాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. అలా పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి.ఇదీ చదవండి: ‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్పశ్చిమోత్తనాసనం: పశ్చిమోత్తనాసన ఆసనం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తుంది. ఉదర కొవ్వును తగ్గిస్తుందిమొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి. అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి. వెన్నుపూసను వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా ఉండేదుకు ప్రయత్నించాలి.ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.సేతు బంధాసనముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి, పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు ఆధారంగా చేసుకొని, నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపైనే ఉండాలి. ఈ పొజిషన్లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.ఉస్ట్రాసన : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి సంబంధించిన కొవ్వును కరిగిస్తుందిముందుగా ఓ చోటు మోకాళ్లపై కూర్చోవాలి.శ్వాస తీసుకొని చేతులు పైకి ఎత్తాలి. ఆ తర్వాత నడుమును వెనక్కి వంచాలి.నడుము వెనక్కి వంచి.. అరచేతులతో అరికాళ్లను పట్టుకోవాలి.ఆ భంగిమకు చేరాక శ్వాస వదలాలి. ఆ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఉస్ట్రాసన్నాన్ని ఒంటె ఆసనం అని కూడా అంటారు.నోట్: వీటిని క్రమం తప్పకుండా, ఓపికగా ఆచరించడంతోపాటు, తాజా పళ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతీ రోజు కనీసం 7 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. యోగాసనాలను నిపుణుల సలహా, పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. -
చెప్పుకోలేని బాధ, సిగ్గుపడితే ముప్పే..!
కొందరికి మల విసర్జన ద్వారం వద్ద సన్నటి పగులు ఏర్పడుతుంది. ఈ పగులునే ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధిసాధారణంగా 15 నుంచి 40 ఏళ్ల స్త్రీ, పురుషుల్లో కనిపిస్తుంది. ఇది చెప్పలేనంత నొప్పితో తీవ్రంగా బాధిస్తుంది. తమ బాధను ఎవరితోనైనా చెప్పుకోడానికీ, ఆ పగులును ఎవరికైనా చూపించడానికీ, బిడియం అడ్డువస్తుంది. తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకు΄ోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ గురించి తెలుసుకుందాం...నిజానికి మలద్వారమిలా చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి కారణాలేమిటన్నది ఇంకా పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే మలవిసర్జన సమయంలో ఈ చీలిక మరింతగా ఒరుసుకు΄ోయేలా మలం బయటికి వస్తుండటం వల్ల తీవ్రమైన నొప్పి కలగడం వల్ల దీని ఉనికి తెలుస్తుంది. తాము తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, తాజాపండ్ల వంటి పీచు (ఫైబర్)ను పుష్కలంగా కలిగి ఉంటే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.మలద్వారం వద్ద ఉండే కండరాలు కొన్ని సందర్భాల్లో మందంగా, గట్టిగా మారడం వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ క్రమంలో మలం మందంగా, గట్టిగా మారిన కండరాలను బలంగా ఒరుసుకుంటూ బయటకు వస్తుంది. అలా ఒత్తిడితో బలంగా బయటకు వచ్చే క్రమంలో మొదట చిన్న చిరుగు, ఆ తర్వాత చీలిక ఏర్పడటం, ఆ తర్వాత అది మరింత విస్తరించడం వల్ల యానల్ ఫిషర్ రావచ్చు. మలబద్దకం కారణంగా కొందరు ముక్కుతూ ముక్కుతూ మల విసర్జన చేస్తుంటారు. మలబద్ధకం కారణంగా మలాశయం దగ్గర మలం చాలా గట్టిగా (ఫీకోలిథ్గా) మారడం వల్ల ఇలా ముక్కాల్సి వస్తుంటుంది. ఇలా మలం గట్టిగా రాయిలా మారడం వల్ల కూడా మల విసర్జన సమయంలో ఆప్రాంతం చీరుకుపోవచ్చు. మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... చాలాకాలం పాటు ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటంతో ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గడం వల్ల కూడా ఫిషర్ ఏర్పడవచ్చు. మల విసర్జన జరిగిన తర్వాత... ఇక అక్కడి నుంచి మలం మళ్లీ లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు మలద్వారం చుట్టూతా ఉంటాయి. ఈ స్ఫింక్టర్ కండరాల వల్లనే... మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకోసారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల కొందరిలో మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడి పోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలా జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బుల కారణంగా దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడటం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు. సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి కొంతకాలం తర్వాత ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడంతో ఫిషర్ ఏర్పడవచ్చు. గర్భవతులైన మహిళల్లో ప్రసవం సమయంలో మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు. కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడంతో (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్ ఏర్పడవచ్చు.లక్షణాలు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి మల విసర్జన తర్వాత కూడా కొద్ది గంటల సేపు బాధిస్తూనే ఉంటుంది. ఈ నొప్పి మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే బాధితులు తీవ్రమైన ఆందోళనకు గురై, మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతారు. దాంతో మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన ప్రక్రియ మరింత బాధాకరంగా మారుతుంది.చాలా మంది బాధితుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు రక్తం అంటుకుంటుంది. అయితే ఫిషర్ విషయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడా స్రావాలూ కనిపించవచ్చు.కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. కొందరిలోనైతే ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమే కష్టంగా అనిపించవచ్చు. యానల్ ఫిషర్ అంటే... మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే యానల్ ఫిషర్...తన తొలి దశలో మలద్వారం అంచున చిన్న చిరుగులా కనిపిస్తుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం తాలూకు పై పొరకు (ఎపిథీలియమ్కు) మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది అక్కడి మృదువైన లోపలి పొరల్లోకి (మ్యూకస్ మెంబ్రేన్లలోకి) పగుళ్లు ఏర్పడేలా చీరుకు΄ోయే ప్రమాదం ఉంది. ఫిషర్‌లలో రకాలు... ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్.ఆక్యూట్ ఫిషర్ ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకు΄ోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూ పొందవచ్చు.క్రానిక్ ఫిషర్ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ఫిషర్. ఇలా చాలాకాలంపాటు కొనసాగే క్రానిక్ ఫిషర్లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తుంటాయి.ఉదాహరణకు మలద్వారాన్నిగట్టిగా, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. నిర్ధారణ: క్లినికల్‌గా తెలుసుకునే ప్రక్రియలో... బాధితుల వ్యాధి చరిత్రను (డిసీజ్ హిస్టరీని) అడిగి తెలుసుకోవడం, విసర్జన ద్వారం ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి ఆ ప్రాంతంలో నిశితంగా చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని మత్తుమందును (లోకల్‌గా ఇచ్చే టాపికల్ అనస్థీషియా) అక్కడ పూసి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆప్రాంతంలో సిగ్మాయిడోస్కోపీతో పరీక్షించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సాధారణంగా బాధితులు 50 ఏళ్లలోపు వారైతే ఈ పరీక్ష అవసరమవుతుంది. యాభై ఏళ్లు దాటిన కొందరిలో ఒకవేళ వాళ్ల కుటుంబాల్లో మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారి పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ అనే పరీక్షను చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ వెంటనే కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించడాన్ని బట్టి అవసరమైతే పైన పేర్కొన్న పరీక్షలను చేయాల్సి రావచ్చు. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకు΄ోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు ‘యానోరెక్టల్ మ్యానోమెట్రీ’ అనే పరీక్షనూ చేయాల్సి రావచ్చు. ఫిషర్నునివారించడంఇలా... ఫిషర్ కేవలం నొప్పిని కలిగించేదే కాదు... అది సామాజికంగానూ చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. ఎవరికైనా చూపించుకోవాలన్నా, నలుగురితో బాధ పంచుకోవాలన్నా చాలా కష్టం. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం చాలా మంచిది. ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా.నివారణ మార్గాలివి...ఆహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే పీచు (సొల్యుబుల్ ఫైబర్) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండటం.మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్లను బాగా తగ్గించుకోవడం.మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం.మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించడం.మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటినే ఉపయోగించడం.ఒకవేళ అప్పటికే చిన్న పాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్మెంట్స్ వాడటం... లాంటి నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. చికిత్స అక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు... నేరుగా ఫిషర్కే చికిత్స అందించడం కాకుండా... దాదాపు 80 శాతం సందర్భాల్లో... అసలు ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికే చికిత్స చేస్తుంటారు. ఇందుకోసం తొలుత మలబద్దకాన్ని నివారించే మందుల్ని సూచించడం, మలాన్ని మృదువుగా మార్చే మందులు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని తగ్గించే మందులు ఇవ్వడం లాంటి చికిత్సలు అందిస్తారు. అలాగే మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూసే మందులిస్తారు.శస్త్ర చికిత్స ప్రక్రియలు అక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా పెద్దగా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా మారినప్పుడు శస్త్రచికిత్స (సర్జరీ) అవసరం పడవచ్చు. ఆ సర్జరీ విధానాలివి... ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండర ప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్‌ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్మెంట్ వంటి పూతమందులు కూడా బాగానే పనిచేస్తాయి. స్ఫింక్టర్ డయలేషన్ : ఈ సమస్యకు చేసే శస్త్రచికిత్సలో దేహానికంతటికీ మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి సర్జరీ నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. నిజానికి ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్‌కు చాలా మంచి నైపుణ్యం ఉండాలి.ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండర్ర ప్రాతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్‌ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) :ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా తెలుసుకోవడం మంచిది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, ఆ ప్రాంతమంతా గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావమూ కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకుతూ... ‘ఫిస్టులా అనే కండిషన్కూ దారితీయవచ్చు. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఫీకల్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం. కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్ల ఆధ్వర్యంలోనే ఈ శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిషర్ సర్జరీ విషయంలో మరో ముప్పు... ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే ఎలాంటి ఇబ్బందీ ఉండదుగానీ... ఆరు శాతం కేసుల్లో మాత్రం శస్త్రచికిత్స తర్వాత కూడా ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. ఈ ముప్పును గుర్తుంచుకోవడం మంచిది. ఫిషర్ అనేది ఇటు వ్యక్తిగతంగానూ, అటు సామాజికంగా నలుగురితో కలుస్తుండాన్ని నిరోధిస్తూ... ఇలా అన్ని విధాలా ఇబ్బంది కలిగించే సమస్య. శస్త్రచికిత్స తో నయం చేసుకోవాలనుకున్నా అప్రయత్నంగా, శస్త్రచికిత్సకుల ప్రమేయం లేకుండా కూడా మళ్లీ మళ్లీ తిరగబెట్టేందుకు ఎక్కువ అవకాశమున్న ఇబ్బంది ఇది. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూక్తి అన్నిటికంటే ఈ సమస్యకే ఎక్కువగా వర్తిస్తుంది. పైగా చికిత్స కంటే నివారణ చాలా సులువు కూడా. కాబట్టి తేలిగ్గా నివారించే మార్గాలైన... వేళకు భోజనం చేయడం, పీచు (ఫైబర్) పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి మంచి ఆహారపు అలవాట్లతోనూ, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)పాటించడం వంటి మంచి టాయిలెట్ అలవాట్లతోనే ఈ సమస్య నివారణ చాలా తేలిగ్గా జరుగుతుంది. కాబట్టి ఈ మార్గాలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలితో (ఆహారపు అలవాట్లూ, కొద్దిగా తేలికపాటి వ్యాయామాలతో) అసలు ఫిషర్ అనే సమస్యే దరిచేరకుండా నివారించవచ్చని తెలుసుకోవడం మేలు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కేవలం ఫిషర్నే కాదు... అనేక ఇతర ఆరోగ్యసమస్యలనూ నివారిస్తుందని గుర్తుంచుకోవడం మరీ మంచిది. -
వేసవిలో వేధించేది ఇదే : జాగ్రత్తలు పాటించండి, లేదంటే:
వేసవి కాలంలో వచ్చే సమస్యలో ప్రధానమైంది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు (UTIs). ఈ సమస్య ఉన్నవారికి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కొందరికి నొప్పి, మంట కూడా ఉంటాయి. అయితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సహజమే అనే నిర్లక్ష్యం పనికిరాదు. అప్రమత్తంగా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మూత్రాశ్రయ ఇన్ఫెక్షన్లను ఎలా గుర్తించాలి? వేసవిలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?అసలేఈ ఏడాది సూర్యుడి భగభగలు మరింత మండించనున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిలి. అధిక ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్ ప్రమాదాన్ని, వడదెబ్బ లాంటివి యూటీఐ ప్రమాదాన్ని పెంచుతాయి. వేసవిలో తగ్గినన్ని నీళ్లు తాగడంపోవడం, డీహైడ్రేషన్ మూత్ర సమస్యలను పెంచుతుంది. యూటీఐని సాధారణంగా మూత్ర విసర్జనలో మంట లేదా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన , మూత్ర విసర్జన అత్యవసరం, మూత్రంలో రక్తం (హెమటూరియా) ద్వారా గుర్తించవచ్చు. ఇదీ చదవండి: ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!మూత్రం విసర్జనలో నొప్పి సహజమే అనుకోవడం అపోహ. ఒక్కోసారి అనేక ఇతర వ్యాధుల ముప్పు ఈ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో మొదలవుతుంది. అందుకే దీన్ని నిర్ధారించు కోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. యూరిన్ కల్చర్ అవసరం యూరినాలిసిస్ లేదా డిప్‌స్టిక్ పరీక్ష సరిపోదు. క్రాన్బెర్రీ జ్యూస్ తో చికిత్స చేయవచ్చు అనేది మరో అపోహ అంటున్నారు వైద్యులు. ఒక రోగికి సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ UTIలు నిర్ధారణ అయితే, యూరాలజిస్ట్‌ని సంప్రదించి కారణాలను విశ్లేషించుకోవాలి.వేసవిలో మూత్రాశయ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, బాక్టీరియా సోకడం వల్ల సాధారణంగా మూత్రాశయ సమస్యలొస్తాయి.ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల ద్రవం తాగాలి. తద్వారా శరీరానని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి. తరచుగా మూత్ర విసర్జన చేయాలి. కనీసం ప్రతి మూడు గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. మల విసర్జన తరువాత శుభ్రం చేసుకొనే విధానం.. ముందు నుంచి వెనుకకు ఉండాలి. అంతేకానీ, వెనుక నుంచి ముందుకు ఉండకూడదు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయాలి. విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లుతీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా పుచ్చ, పైనాపిల్, తర్బూజ కీవీ,నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి క్రాన్ బెర్రీ పండ్ల రసం కొంతమేరకు ఉపయోగపడుతుంది. క్రాన్బెర్రీ సప్లిమెంట్లు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించగలవు కానీ, పూర్తిగా కాదు అంటున్నారు. బాడీ వాష్, బబుల్ బాత్ , కొన్ని రకాల సబ్బులు UTI కి కారణమవుతాయి. సున్నితమైన సబ్బులు వాడాలి.వేసవి కాలంలో మెన్స్ట్రువల్ కప్పులు, టాంపాన్లు, ప్యాడ్లను క్రమం తప్పకుండా మార్చుకోవాలి. టైట్ దుస్తులు వేసుకోకూడదు.ప్రమాద సంకేతాలు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రం రంగుమారడంతో పాటు, దుర్వాసన,, పొత్తి కడుపు తీవ్రమైన నొప్ప, లేదా వెన్నునొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యంగా అనిపిస్తే అప్రమత్తం కావాలి.అలాగే చలి జ్వరం, వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి లక్షణాలుకనిపిస్తే వెంటనే సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవాలి. -
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదయం వాకింగ్ ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం పూట వాకింగ్సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాకింగ్‌తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చుగాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు. -
మసాజ్ రోలర్: వయసు పైబడినట్లు కనిపడనివ్వదు..!
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్‌లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్‌కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్‌తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్‌తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్‌ను, కంటైనర్‌ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్‌తో ట్రాన్స్పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్‌కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
సార్కోమాను ఎదుర్కోలేమా!
దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్కూ, టెండన్స్కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్ కనెక్టివ్ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్టైప్స్ ఉంటాయి. ఈ కేన్సర్ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్టైప్స్గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్ సార్కోమా’. రిస్క్ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)... ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం... హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్ క్లోరైడ్ లేదా డయాక్సిన్స్ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా బాధితులు ఎక్కువ. ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్’ వంటి సిండ్రోములు, జెనెటిక్ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. నిర్ధారణ... సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్ ఉపకరణాలు సహాయపడతాయి. మృదు కణజాలంలో (సాఫ్ట్ టిష్యూల్లో) వచ్చే కేన్సర్ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, రేడియోషన్ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్ అయిన అలారా (ఏజ్ లో ఏజ్ రీజనబ్లీ అచీవబుల్) టెక్నిక్‌తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. ఇక పెట్–సీటీ, రేడియోమిక్స్ వంటి అధునాతన టెక్నిక్స్‌తో అవి హానికరం కాని బినైన్ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్ స్పేరింగ్ సర్జరీస్), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్ స్పెసిఫిక్ ఇం΄్లాంట్స్)తో... ఆ తొలగించిన చోట ఇంప్లాంట్స్ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్లిప్పుడు అందుబాటులో అత్యంత ఆధునికమైన ప్రోటాన్ థెరపీ, ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా చేసే రేడియోథెరపీ. రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. ఇవేకాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్–టీ సెల్ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. --డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్, మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
రైట్.. రైట్.. మిల్లెట్ డైట్
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం నుంచి తాము స్ఫూర్తి పొంది మిల్లెట్స్ నేషనల్ పోర్టల్(డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.మిల్లెట్ న్యూస్ డాట్‌కామ్) ఏర్పాటు చేశామని, దీనిని నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి అధికారికంగా ప్రారంభించారని పోర్టల్ నిర్వాహకులు బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సరకదం తెలిపారు. ఏకకాలంలో 100 మిల్లెట్ స్టోర్లను నగరం వేదికగా ప్రారంభించిన సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తమ కార్యక్రమం వివరాలను ఇలా వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..ఆరోగ్య అవగాహన కోసం.. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి? ఏ వ్యాధులను దూరం చేస్తాయి? తదితర విషయాలు తెలియజేసేందుకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్స్(హెచ్‌ఎన్‌ఏ) కౌన్సిల్‌ను స్థాపించాం.. ఇది ప్రస్తుతం 50 మంది వైద్యులను కలిగి ఉంది. ఈ సంవత్సరాంతానికి వెయ్యి మంది సభ్యులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కౌన్సిల్ మిల్లెట్ స్టోర్ యజమానులతో కలిసి పని చేస్తుంది. సహకారంలో భాగంగా.. మిల్లెట్ స్టోర్ యజమానులు పోషకాహార నిపుణులు వైద్యుల నుంచి నిరంతర మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. అలాగే.. స్టోర్ యజమానులకు అవసరమైన శిక్షణ, మద్దతు నిరంతరం అందిస్తాం. బీపీ, డయాబెటిస్, బీఎమ్ఐ అసెస్మెంట్లను కవర్ చేసే బేసిక్ హెల్త్ చెకప్ ట్రైనింగ్ సెషన్లను శనివారం నిర్వహించాం. ఈ సెషన్లను పోషకాహార నిపుణుడు ఓ.మనోజ ప్రకృతి వైద్యురాలు డాక్టర్ మోనికా స్రవంతి సారథ్యం వహించారు. కొత్త చిరుధాన్యాల గుర్తింపు.. దేశంలోని 50 అధిక–నాణ్యత గల మిల్లెట్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. పెద్దగా పెట్టుబడి పెట్టలేని వారు సైతం వ్యాపారులుగా మారడానికి వీలుగా, మిల్లెట్ స్టోర్ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడిని తగ్గించగలిగాం. తమ వ్యాపారాన్ని కనీస పెట్టుబడి రూ.85 వేలతోనే ప్రారంభించవచ్చు. ఇందులో 50 మిల్లెట్ ఉత్పత్తులు, బిల్లింగ్ మెషిన్, ఆరోగ్య అవగాహన కంటెంట్‌ను ప్రదర్శించడానికి టీవీ సెటప్, బ్యానర్లు, బ్రోచర్లు, వెబ్సైట్, హెల్త్ చెకప్ కిట్ బ్రాండింగ్ మెటీరియల్ సైతం అందిస్తాం. 100 మిల్లెట్ స్టోర్ల ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన 100 మిల్లెట్ స్టోర్లను మాదాపూర్‌లోని మినర్వా హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వర్ధమాన తారలు వేది్వక, వాన్యా అగర్వాల్‌లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక వ్యాపారులు 100 మంది పాల్గొన్నారు. మిల్లెట్ పోర్టల్‌తో కలిసి పనిచేస్తున్న వైద్యులు, రైతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కొత్త మిల్లెట్ ఉత్పత్తులను విడుదల చేశారు. -
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. జీబీ సిండ్రోమ్ లక్షణాలు» ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్. »మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనమవుతాయి.» మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు. »ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. » గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. »శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు.తక్కువ ఖర్చుతో చికిత్స ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు. –డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!
ఆహార పథ్యాలు, వ్యాయామాలతోనే కాకుండా కొన్ని రకాల చిట్కాలని అనుసరించడం ద్వారా కూడా సన్నగా, నాజూకుగా కనపడవచ్చు. అదెలాగంటే ఫ్యాషన్ అనేది స్టైల్’గా మాత్రమే కాకుండా నాజూగ్గా... అందంగా కనపడేలా కూడా చేస్తుంది. ఇందుకోసం చేయవలసిందల్లా శరీరంలో మీకు సమస్యగా అనిపించే ప్రాంతాలను గుర్తించడమే– అది మీ నడుము భాగమా లేదా మీ తొడలలో లేదా మీ పిరుదులలో సమస్యగా ఉందా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం మీ గదిలో ఏకాంతంగా అద్దం ముందు నిల్చుని ప్రతి శరీర భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని, లోపాలను దాచి పెట్టుకోటానికి ప్రయత్నించాలి. లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. శరీరంలోని ఈ భాగాలు శరీరం కన్నా పెద్దగా కనపడకుండా చూసుకోవాలి.మనం తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలకే కాదు, మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మనసును నిరుత్సాహంగా మార్చితే, కొన్నిరకాల ఆహారాలు మనసును ఉత్తేజపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి.క్యారట్ శరీరంలో రక్తాన్నే కాదు... ఆ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని కూడగడితే, బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర ΄ోషకాలు పుష్కలంగా అందుతాయి. ΄ోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది. అయితే, తినమన్నారు కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకూడదు. చిన్న ముక్క తింటే చాలు. (చదవండి: సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!) -
ముఖంలోని డల్‌నెస్‌ని తరిమేద్దామిలా..!
పర్యావరణ కాలుష్యం కారణంగా పెద్దవాళ్లకైన, యువతకి చర్మం డల్‌గా మారి అందవిహీనంగా కనిపిస్తోంది. దీంతోపాటు ముడతలు, కళ్లకింద నలుపు మరింత అసహ్యంగా మారిపోతుంది స్కిన్. అలాంటి డల్‌నెస్ చర్మాన్ని మిల మిల మెరిసేలా యవ్వనపు కాంతిని సంతరించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి మరి...కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. నిస్తేజంగా మారిన ముఖ చర్మం జీవకళతో తొణికిసలాడుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది. ఉప్పు కంటెంట్ లేని టేబుల్ స్పూన్ బటర్ని బ్లెండ్ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..) -
నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్‌లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..డైట్ ప్లాన్..తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్‌గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది. తాను హైడ్రేషన్‌గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది. ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్‌గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! ) -
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడు నెలలకు ట్విస్ట్!
నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది. గంటలు గంటలు మేకప్ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.– ఆదినారాయణ, హైదరాబాద్ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్‌లైన్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అరవై రోజుల అద్భుతం 'నవార'!
నవార.. కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2 వేల ఏళ్ల క్రితం నుంచే సాగులో ఉన్న అద్భుతమైన ఔషధ విలువలున్న ధాన్యపు పంట. ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశిష్ట వంగడం నవార (Navara). ఆహారంగా, ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లనే ఇది ఔషధ పంటగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందింది. 60 రోజుల పంటదక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ, పురాతన వ్యవసాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది నవార. ఇది స్వల్పకాలిక పంట. విత్తిన 60 రోజుల్లోనే ధాన్యం చేతికొస్తుంది. అందుకే దీనికి ‘షస్తిక శాలి’ అనే పేరు వచ్చింది. నవార బియ్యం (Navara Rice) ఎరుపు + నలుపు రంగుల కలగలుపుతో విలక్షణంగా కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, కండరాలు, జీర్ణకోశం ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.జిఐ గుర్తింపు జన్యుపరంగా విశిష్ట గుణాలు కలిగి ఉన్నందున 2008లో నవార వంగడానికి కేంద్ర ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందిన నవార వంగడాలు రెండు. నలుపు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం ఒకటి. లేత బంగారు రంగు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం రెండోది. కేరళలోని కరుకమనికళంలో గల నవార రైస్ ఫార్మర్స్ సొసైటీ ఈ రెండు వంగడాలకు జిఐ గుర్తింపును పొందింది. ఈ రెండు రకాల నవార బియ్యానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. సులువుగా జీర్ణమవుతాయి. అందువల్ల అన్ని వయసుల వారూ తినటానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా నవార బియ్యాన్ని పిండి పట్టించి పాలలో కలుపుకొని తాగుతారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆథ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. ఆలయ క్రతువుల్లోనూ వాడుతారు.9.5% మాంసకృత్తులు.. నవార బియ్యం పోషకాల గని. 73% పిండి పదార్థం, 9.5% మాంసకృత్తులు, 2.5% కొవ్వు, 389 కేలరీల శక్తి ఉంటాయి. అంతేకాదు, చక్కని పీచు పదార్థానికి, యాంటీఆక్సిడెంట్ల తోపాటు జింక్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలకు నిలయం. ఈ పోషకాలు కలిగి ఉన్నందునే ఆరోగ్యప్రదాయినిగా ప్రఖ్యాతి పొందింది.ఆయుర్వేదంలో నవారఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో నవార బియ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉంది. రక్తప్రసరణ, శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో నవార పాత్ర ఎంతో ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కీళ్లనొప్పులు, కండరాల క్షీణత, కొన్ని రకాల చర్మ సమస్యలకు చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఈ బియ్యాన్ని వాడుతున్నారు. నవార బియ్యంతోపాటు తౌడు, నూక, ఊక, గడ్డిని కూడా ఔషధ విలువలతో కూడిన ఆహారోత్పత్తుల తయారీలో పరిశ్రమదారులు ఉపయోగిస్తున్నారు. నవార తౌడు, ఊకలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నవార సాగులో సవాళ్లునవార వంటి పాత పంటల సాగులో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే కేరళలో రైతులు అనుసరిస్తున్నారు. ప్రకృతి వనరులతో కూడిన ఎరువులు, కషాయాలు వాడుతూ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూస్తున్నారు. పొలాల్లో పర్యావరణ సమతుల్యానికి మిత్ర పురుగుల పాత్ర కీలకం.వాటిని రక్షించుకోవటం కోసం కషాయాలను మాత్రమే వాడుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పశువుల పేడ, పంచగవ్యలను రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్నారు. బలమైన గాలులు, భారీ వర్షాలను నవార వరి పంట అంతగా తట్టుకోలేదు, పడిపోయే గుణం ఉంది. తీవ్రమైన మంచుతో కూడా ఇబ్బంది పడే సున్నితమైన పంట ఇది. చలిని తట్టుకోలేదు. కాండం అడుగునే వంగి పడి΄ోతుంది. కాబట్టి శీతాకాలంలో దీన్ని సాగు చేయకూడదు. ఈ కారణాల వల్ల నవార పంటకాలం 60 రోజులే అయినప్పటికీ ఏడాదికి కేవలం ఒకే పంట సాగు అవుతోంది. నవార వరి పంటను మనుషులతోనే కోయించాలి. కూలీల కొరతతో ΄ాటు అధిక ఖర్చుతో కూడిన పని కావటం వల్ల రైతులకు ఇది కూడా పెద్ద సమస్యే అవుతోంది.నిజంగా బంగారమే!నవార ధాన్యం దిగుబడి కూడా ఎకరానికి 300 కిలోలు మాత్రమే. ఇతర వరి రకాలతో ΄ోల్చితే చాలా తక్కువ. అయినా, దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల కోసం ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నవార బియ్యానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. రైతులకూ మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. నవారకున్న అరుదైన ఔషధగుణాల వల్ల ‘బంగారం’ అని కూడా పేరొచ్చింది. నవార బియ్యాన్ని మీ కుటుంబం ఆహారంగా తీసుకుంటే ఎన్నెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర గల అద్భుత వంగడాన్ని పరిరక్షించుకున్నట్లు కూడా అవుతుంది. షుగర్ నియంత్రణ...నవార బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల బియ్యంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అంటే.. గ్లూకోజ్‌ను రక్తంలోకి తెల్ల బియ్యం మాదిరిగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అనువైన మూలాహారం అయ్యింది. ఇందులోని పీచు వల్ల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది. ఎముక పుష్టి... కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి నవార బియ్యం తిన్న వారికి ఎముక పుష్టి కలుగుతుంది. రెగ్యులర్‌గా తినే వారికి ఎముకలు గుల్లబారటం వంటి సమస్య రాదు. బ్లడ్ క్లాట్ కావటం, మజిల్ కంట్రాక్షన్ వంటి సమస్యలను అధిగమించడానికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.చర్మ సౌందర్యం... యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవార ఆహారం దోహదం చేస్తుంది. ముడతలను పోగొట్టడానికి, చర్మంలో మెరుపును పెంపొందించటానికి దోహదం చేస్తుంది. నవార బియ్యపు పిండిని పాలలో లేదా నీటిలో కలిపి ముఖవర్చస్సు మెరుగవడానికి, మచ్చలు పోవటానికి లేపనంగా వాడుతూ ఉంటారు. నవార బియ్యంలోని మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచటానికి.. మొత్తంగా నాడీ వ్యవస్థను, కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోడపడుతుంది.గుండెకు మేలు... నవార బియ్యంలోని అధిక పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికను నివారించడానికి తద్వారా గుండెపోటు ముప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సీ ఉండటం వల్ల కణజాలానికి మరమ్మతు చేస్తే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడటం ద్వారా నవార రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ... ఇందులోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్టలోని సూక్ష్మజీవరాశిని పెంపొందించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించి, పోషకాల మెరుగైన శోషణకు, మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది.శిశు ఆహారం... కేరళలో నవార బియ్యాన్ని శిశువులకు ఆహారంగా పెడుతుంటారు. నవార పిండి, అరటి పండు ఒరుగులతో కలిపి తయారు చేసే ‘అంగ్రి’ అనే వంటకాన్ని పిల్లలకు తినిపించటం కేరళవాసులకు అనాదిగా అలవాటు. డబ్బాల్లో అమ్మే ప్రాసెస్డ్ ఆహారం కన్నా ఇది పిల్లలకు చాలా సహజమైన, బలవర్ధకమైన ఆహారం. పిల్లలు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుంది.కేన్సర్ నిరోధకం... నవార బియ్యంలో ప్రోయాంథోశ్యానిడిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయ. డిఎన్ఎకి నష్టం కలగకుండా నివారించడటం, హానికారక ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేయటం ద్వారా కేన్సర్ ముప్పును తగ్గించడానికి నవార బియ్యం ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.చదవండి: ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!రక్తహీనతకు చెక్... నవార బియ్యంలో పుష్కలంగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారించగలదు. నిస్సత్తువ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను రూపుమాపగలదు. గర్భవతులకు ఈ బియ్యం ఉపయుక్తమైనవి. పీచు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మపోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. గర్భవతులు సాధారణంగా ఎదుర్కొనే మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంతో పాటు గర్భస్థ శిశువు పెరుగుదలకు చాలా ఉపయోగకరం.నవార నారాయణన్!కేరళ సంప్రదాయ ఆహారంలోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ కీలక ΄పాత్ర పోషిస్తున్న నవార సాగుకు పాల్ఘాట్ ప్రాంతంలో 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్నా గత 50 ఏళ్లుగా దీనికి సాగు తగ్గిపోయి, అంతరించిపోయే దశకు చేరింది. అక్కడక్కడా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం నవారను గత 115 ఏళ్లుగా విడవ కుండా తమ 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నిరంతరాయంగా సాగు చేస్తూనే ఉంది. అద్భుత వ్యవసాయ, సాంస్కృతిక వారసత్వ సంపద అయిన నవారను ఈ కుటుంబం కాపాడుకుంటోంది. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం రైతు పి. నారాయణన్ ఉన్ని ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నారు. నవార ఎకో ఫార్మ్ అని ఈయన క్షేత్రానికి పేరు పెట్టారు. ‘నవార నారాయణన్’గా ఆయన పేరుగాంచారు. ఆయన కృషి దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంటుంది. పరిరక్షించటంతో పాటు నవార ఫార్మర్స్ సొసైటీ పేరిట నవారకు జిఐ గుర్తింపు తేవటంలోనూ నారాయణన్ విశేష కృషి చేశారు. నవార ఉత్పత్తులను ఆయన సేంద్రియంగా పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (చదవండి: చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!)న్యూఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ)కి చెందిన ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టాస్) నవారపై ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురించింది. నారాయణన్ ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో 2011లో నవార ఉత్సవ్‌ను నిర్వహించారు. నవార పునరుజ్జీవనానికి కృషి చేసిన నారాయణన్‌కు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ రికగ్నిషన్ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఎకరానికి 3 క్వింటాళ్ల నవార ధాన్యాన్ని ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. మిల్లు పట్టిస్తే 180 కిలోల బియ్యం వస్తున్నాయి. బియ్యంతో పాటు అటుకులు, పిండిని తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది ‘టాస్’ ప్రచురించిన వివరాల ప్రకారం నారాయణన్ ఎకరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్‌లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. (చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా -
Priyanka Chopra: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..!
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి ఇలా ఎందకంటే..సున్నితమైన భావ్వోద్వేగం..అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట. ఒత్తిడి కారణంగా..ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. హార్మోన్ల వల్ల...హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.నిద్ర లేమి, మానసిక ఆరోగ్యంనిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు. (చదవండి: -
PM Modi: రైతు మాదిరిగా ఆహారపు అలవాట్లు ఉండాలి..!
పరీక్ష పై చర్చ(పీపీసీ(Pariksha Pe Charcha 2025) ఎనిమిదవ ఎడిషన్ గత సోమవారం(ఫిబ్రవరి 10, 2025న) న్యూఢిల్లీలో జరిగింది. ఆ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి సంభాషించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో మార్గదర్శకత్వం చేయడమే. అయితే ఈ కార్యక్రమంలో మోదీ ఆహారపు అలవాట్లు, ఎలా తినాలి వంటి వాటి గురించి కూడా విద్యార్థులకు చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..ఇక మోదీ ఈ సెషన్లో మంచి ఆరోగ్యం, జ్ఞాపక శక్తికోసం పోషకాహారం ప్రాముఖ్యత గురించి హైలెట్ చేశారు. శరీరానికి చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలు వంటివి ఎంత ముఖ్యమో వివరించారు. అంతేగాదు ఆ సెషన్లో మోదీ విద్యార్థులకు తిల లడ్డూ(నువ్వుల లడ్డూ)లను ఇస్తూ..వీటిని శీతాకాలంలో ఎందుకు తినాలో తెలుసా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థులు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని బదులిచ్చారు. ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం గురించి కూడా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిందని, అలాగే భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రోత్సహించిందో వివరించారు. మన దేశంలో సహజసిద్ధంగా లభించే వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ఎలా ఆసక్తి కనబరుస్తుందో కూడా ప్రస్తావించారు. అలాగే వాటికి పలు రకాల వ్యాధులను నివారించే శక్తి ఉండటమేగాక రాకుండా నివారించే శక్తి ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే..ఆ కార్యక్రమంలో పరీక్షల ప్రిపరేషన్‌కి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తోపాటు సకాలంలో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. అంతేగాదు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి వంటి ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. అయితే విద్యార్థులకు పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశంలోని రైతులు(farmers) ఉదయాన్నే నిద్రలేచి భోజనం చేస్తారు, రోజంతా పని చేస్తారు మళ్లా ఇంటికి వచ్చి సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం(dinner) చేస్తారు. నిజంగా ఇది వేళ్లకు భోజనం చేసే మంచి అలవాటుగా పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియకు మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేయడమే గాక దీర్ఘాయువుని అందిస్తుందని అన్నారు. నిపుణలు అభిప్రాయం ప్రకారం..ప్రధాని మోదీ చెప్పినట్లుగా సాయంత్రం ఏడు గంటలకు ముందు తినడం వల్ల ఆయుష్షు సుమారు 35% పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతంలో నిర్వహించిన మరో పరిశోధనలో సెంచరీ దాటిన చాలమంది వ్యక్తుల్లో సైతం వృద్ధాప్య లక్షణాలు తక్కువుగా ఉన్నట్లు చెప్పారు. వారంతా మెక్కలు ఆధారిత ఆహార పదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉన్న భోజనమే తీసుకున్నట్లు కూడా పరిశోధన పేర్కొంది. కాబట్టి అందరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే యత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!:.Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha. #PPC2025. https://t.co/WE6Y0GCmm7— Narendra Modi (@narendramodi) February 10, 2025(చదవండి: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు: హర్ష్ గోయెంకా ఫైర్) -
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!
ఈ రోజుల్లో మధుమేహం (డయాబెటిస్) చాలా సాధారణం. మామూలుగానే నియంత్రణలేని డయాబెటిస్ ఆరోగ్యపరంగా ఎన్నోఅనర్థాలు తెచ్చిపెడుతుంది. అదే ఒకవేళ గర్భిణిలో ఆ సమస్య ఉండి, వాళ్లకు చక్కెర నియంత్రణలో లేకపోతే అదికాబోయే తల్లికీ, కడుపులోనిబిడ్డకూ చేటు తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. మామూలుగా కొందరు మహిళలకు గర్భధారణకు ముందునుంచే డయాబెటిస్ ఉండి ఉండవచ్చు. మరికొందరికి గర్భం వచ్చాక కనిపించవచ్చు. దీన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రక్తంలోచక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికీ, అటు బిడ్డకూ...అలాగే ఇటు కాన్పు సమయంలో, అటు కాన్పు తర్వాతా... ఇలా ఎవరిలోనైనా, ఏ దశలోనైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆ సమస్యలేమిటీ, వాటి పరిష్కారాలేమిటి వంటి అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.మహిళకు... తనకు గర్భం రాకముందునుంచే డయాబెటిస్ ఉండి, గర్భం వచ్చాక రక్తంలోని చక్కెర నియంత్రణలో లేకుండా తీవ్రత ఎక్కువైతే దాన్ని ‘ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. మళ్లీ ఇందులోనూ ఆమెకు ‘టైప్–1 డయాబెటిస్’, ‘టైప్–2 డయాబెటిస్’ అనే రెండు రకాల డయాబెటిస్‌లలో ఏదో ఒకటి ఉండే అవకాశముంది.‘టైప్–1 డయాబెటిస్’ చిన్నవయసులోనే వస్తుంది. ఇందులో సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రాంక్రియాస్ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల, ఆ గ్రంథిలోంచి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ స్రవించడం ఆగిపోవడం వల్ల వచ్చేదే టైప్–1 డయాబెటిస్. దీని ప్రభావం ఇతర అవయవాలపైనా ఉంటుంది. ఇక ‘టైప్–2 డయాబెటిస్’ అనేది పెద్దయ్యాక వచ్చే మధుమేహం. మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో; సాధారణంగా 35 ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ఇన్సులిన్ ప్రభావానికిలోనై శరీరంలోని కణాలు స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర నియంత్రణ జరగదు. దాంతో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తుంది. ఇది చాలామందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక జెస్టేషనల్ డయాబెటిస్ అంటే... ఈ కండిషన్ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే కనిపించి, కాన్పు తర్వాత డయాబెటిస్ కనిపించకుండా పోతుంది. (అయితే ఇలాంటి కొందరిలో ఆ తర్వాత కొంతకాలానికి డయాబెటిస్ కనిపించే అవకాశాలుంటాయి.) డయాబెటిస్‌కు కారణాలుప్రాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోను... రక్తంలోని చక్కెరను నియంత్రిస్తూ అవసరమైనప్పుడు శక్తి కోసం చక్కెర విడుదలయ్యేలా, అవసరం లేనప్పుడు తగ్గి΄ోయేలా... ఎప్పుడూ ఓ నార్మల్ విలువ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. ఇలా జరగనప్పుడు డయాబెటిస్ కనిపిస్తుంది. ఆ కారణాలేమిటంటే... ∙గర్భిణుల్లో విడుదలయ్యే కార్టిసా ప్రొజెస్టరాన్, ప్రోలాక్టిన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజెన్ లాంటి హార్మోన్లు ఇన్సులిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ∙కొందరు గర్భిణుల్లో బరువు ఎక్కువగా పెరిగేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు, శరీర తత్వాన్ని బట్టి నెలలు నిండే కొద్దీ ఒక్కోసారి ఇన్సులిన్ పని తీరు క్రమంగా తగ్గుతుండటం వల్ల, రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలో లేక΄ోవడంతో డయాబెటిస్ కనిపిస్తుంది. కాన్పు తర్వాత మళ్లీ హార్మోన్లు సాధారణ స్థాయికి రావడంతో ఇన్సులిన్ పనితీరు మళ్లీ మునుపటిలాగానే ఉండి, చక్కెరను నియంత్రిస్తుండటం వల్ల కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గుతుంది. గర్భవతి కాకముందునుంచే డయాబెటిస్ ఉండేవారిలో గర్భంతో ఉన్నప్పుడు చక్కెర మోతాదులు పెరుగుతాయి. కాన్పు తర్వాత ఆ చక్కెర మోతాదులు మళ్లీ గర్భంరాకముందు ఉన్న స్థాయికి పడిపోతాయి. గర్భిణుల్లో డయాబెటిస్ముప్పు ఎవరిలో ఎక్కువంటే... గర్భధారణ 30 ఏళ్లు పైబడిన తర్వాత జరిగిన వారిలో తమ ఎత్తుకంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉన్న చరిత్ర ఉన్నవారిలో. ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో క్రితం కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉన్నవారిలో ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉన్న సందర్భాల్లో.నిర్ధారణ...ఇక్కడ చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్‌కు తమకు సంబంధించిన ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా విషయాలను దాపరికం లేకుండా చెప్పి, రక్తంలో చక్కెర మోతాదు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో మళ్లీ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. మొదట రాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకోవాలి. అందులో విలువలు 150 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్ విలువలు 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) చేయించాలి. ఇందులో తిండితో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్ తాగిస్తారు. ఒక గంట తర్వాత రక్తంలో షుగర్ మోతాదులు ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్ అవకాశాలు ఎక్కువ అని అర్థం. వ్యాధి పూర్తి నిర్ధారణ కోసం ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) చేయించాలి. ఇందులో ఏమీ తినకుండా ఒకసారి, మొదట 100 గ్రా. గ్లూకోజ్ తాగించి గంట తర్వాత ఒకసారీ, రెండు గంటల తర్వాత మరోసారీ, మూడు గంటల తర్వాత ఇంకోసారీ... ఇలా నాలుగుసార్లు రక్తపరీక్ష చేస్తారు. ఈ కొలతలు 95, 180, 155, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. డయాబెటిస్ ఉన్నప్పుడు వచ్చే సమస్యలివి...తల్లిలో...గర్భస్రావాలు : ముందునుంచే డయాబెటిస్ ఉన్నవారిలో, చక్కెర అదుపులో లేనివాళ్లలో అబార్షన్లు అయ్యే అవకాశాలెక్కువ. హైబీపీ : డయాబెటిస్ ఉన్న గర్భిణుల్లో సాధారణ గర్భిణుల కంటే హైబీపీకి అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి నెలలు నిండకముందే కాన్పు చేయాల్సి రావచ్చు. గర్భిణుల్లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, ఉమ్మనీరు ఎక్కువగా ఊరుతుంది. ఉమ్మనీరు అధికంగా ఉండటం వల్ల పొట్ట పెద్దగా కనిపిస్తూ, తల్లికి ఆయాసంగా ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు ΄ోవడం, నెలలు నిండకముందే కాన్పు అయ్యే ప్రమాదాలు ఉండవచ్చు వీళ్లలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ ∙గర్భిణులూ ఎక్కువ బరువుండటం, అలాగే కడుపులో బిడ్డకూడా అధిక బరువు ఉండటం వల్ల ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాల్సి రావచ్చు ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారిలో కొన్నిసార్లు చక్కెర మరీ అధికం అయి΄ోయి కీటో ఎసిడోసిస్ అనే కండిషన్‌కు వెళ్లవచ్చు కొంతమందిలో డయాబెటిస్ కోసం తీసుకునే మందుల మోతాదు ఎక్కువై, చక్కెర మరీ తగ్గడం వల్ల కళ్లు తిరిగి పడి΄ోవచ్చు ∙రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా సరిగా జరగక΄ోవడంతో కళ్లు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. గర్భంలోని శిశువుకి... అవయవ లోపాలు : గర్భధారణలోని మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రైమిస్టర్లో) తల్లిలో చక్కెర ఎక్కువగా ఉండటం, చక్కెర మోతాదులు అదుపులో లేనప్పుడు అవి గర్భంలోని పిండంలోకి ప్రవేశించి, శిశువులో అవయవలో΄ాలు (ముఖ్యంగా వెన్నుపూస, గుండెకు సంబంధించినవి) కలిగించే ముప్పు.బిడ్డ సైజు విషయంలో అనర్థాలు... తల్లిలో ఎక్కువగా ఉండే ఆ గ్లూకోజ్ మోతాదులు మాయ (ప్లాసెంటా) ద్వారా బిడ్డకు చేరుతాయి. దాంతో బిడ్డలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. బిడ్డ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడం వల్ల బిడ్డ నార్మల్ కంటే పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల పుట్టబోయే చిన్నారులు నార్మల్ కంటే పెద్దగా, ఎక్కువ బరువుతో నీరుపట్టినట్లుగా, ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. తల్లికీ ప్రసవం కష్టమయ్యే అవకాశాలెక్కువ. గర్భంలో చనిపోవడం : బిడ్డ మరీ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఎనిమిది, తొమ్మిది నెలల్లో బిడ్డకు సరిపడ ఆక్సిజన్ అందక కడుపులోనే చనిపోయే అవకాశం.జాగ్రత్తలు / చికిత్సలుడయాబెటిస్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత గర్భిణులు తమ గైనకాలజిస్ట్, ఫిజీషియన్ లేదా డయాబెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ వంటి నిపుణుల పర్యవేక్షణలో వారు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. తల్లి రక్తంలో చక్కెరను తరచూ గమనించుకుంటూ / పరీక్షిస్తూ ఉండాలి. శిశువు ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. డాక్టర్లు సూచించిన విధంగా సరైన సమయంలో ప్రసవం చేయించాలి. బిడ్డ పుట్టాక... చిన్నారిని కొద్ది రోజులపాటు పిల్లల డాక్టర్ (పీడియాట్రీషన్) పర్యవేక్షణలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండాలి. పుట్టిన బిడ్డకు గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ (ప్లాసెంటా) నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోతాయి. ఫలితంగా బిడ్డ కండరాలలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోవడం, చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలెక్కువ. కొన్నిసార్లు నెలలు నిండకుండా అయ్యే కాన్పు వల్ల బిడ్డకి ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందక΄ోవడం, దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి పిల్లల్లో క్యాల్షియమ్, మెగ్నిషియం వంటివి తక్కువ మోతాదులో ఉండటం వల్ల కండరాలు బలహీనత రావచ్చు ఇలాంటి పిల్లలకు కామెర్లు వచ్చే అవకాశాలెక్కువ ∙బిడ్డ గుండె గోడలు అవసరమైనదానికంటే ఎక్కువగా పెరగవచ్చు. (కార్డియోమయోపతి) ∙బిడ్డ పెద్దయ్యాక స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశాలెక్కువ. డయాబెటిస్ లేని గర్భవతితో పోలిస్తే... ఈ సమస్య ఉన్న గర్భిణికి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 2–5 శాతం ఎక్కువ.మరికొన్ని వైద్య పరీక్షలుగర్భిణికి వ్యాధి నిర్ధారణ జరిగాక, షుగర్ మోతాదులను బట్టి వారానికోసారి లేదా రెండు వారాలకొకసారి, తినకుండా ఒకసారి, భోజనం చేశాక, రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇందులో మొదటిది 105 ఎండీడీఎల్. కంటే తక్కువగానూ, రెండోది 120 ఎంజీడీఎల్ కంటే తక్కువగానూ ఉందేమో చూసుకుంటూ ఉండాలి. అలా ఉండేలా డాక్టర్లు ప్లాన్ చేస్తారు. మూత్రపరీక్ష : గర్భిణుల్లో సాధారణంగా కిడ్నీ పనితీరులో మార్పు వల్ల మూత్రంలో చక్కెర పోతూ ఉంటుంది. దీన్నిబట్టి డయాబెటిస్ ఉందని నిర్ధారణకు రావడం సరికాదు. ఇది చాలా సాధారణం. ఇంకా ఈ పరీక్షలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, ప్రోటీన్లు ఏమైనాపోతున్నాయేమో తెలుసుకొని, ఆ సమస్యలకు చికిత్స అందించాల్సి రావచ్చు. హెచ్‌బీఏ1సీ: ఈ పరీక్ష ద్వారా మూడు నెలల సగటు చక్కెర మోతాదులు తెలుస్తాయి. దీంతో గత మూడు నెలల వ్యవధిలో చక్కెర నియంత్రణలో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంగర్భిణుల రక్తంలో చక్కెర మోతాదులు కొద్దిగానే ఎక్కువ ఉంటే, డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుని షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలతో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాక΄ోయినా లేదా షుగర్ మరీ ఎక్కువగా ఉన్నా... మందులు, లేదా ఇన్సులిన్ ద్వారా చికిత్స అందించాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు... గర్భిణుల బరువును బట్టి, వారు చేసే పనిని బట్టి, వారి రక్తంలోని షుగర్ మోతాదులను బట్టి ఎన్ని క్యాలరీల ఆహారం, ఎలా తీసుకోవాలనే విషయాలను వారి ఫిజీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ నిర్ణయిస్తారు. వీరు ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.చక్కెర మోతాదులు తక్కువగానూ, కొవ్వు తక్కువగానూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే అన్నం తక్కువగా తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతవరకు చక్కెర, తేనె, బెల్లం, స్వీట్స్, బేకరీ ఫుడ్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, పనస, నెయ్యి, డ్రైఫ్రూట్స్, నూనె వస్తువులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మిగతా పండ్లను కూడా జ్యూస్‌గా కంటే పండ్ల రూపంలోనే కొరికి తింటుండటం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తీసుకున్నా, అందులో చక్కెర కలుపుకోకుండా తాగడం మేలు. వ్యాయామాలు : గర్భిణులు అంతగా శ్రమ కలిగించని, నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండటం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. దాంతో చక్కెర కారణంగా కనిపించే దుష్పరిణామాలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉపయోగం ఎప్పుడంటే... ఆహార నియమాలు, వ్యాయామాలతో రక్తంలో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ద్వారా చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. ఇది ఇంజెక్షన్ ద్వారా చర్మం కిందనుండే కొవ్వు పొరల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఇన్సులిన్ నేరుగా రక్తంలో కలిసి వృథా అయి΄ోకుండా, మెల్లమెల్లగా రక్తంలో కలుస్తూ, అందులోని చక్కెర మోతాదులను ఓ క్రమపద్ధతిలో నియంత్రిస్తుంది. ఈ ఇన్సులిన్ ఎంత మోతాదులో, ఎన్నిసార్లు ఇవ్వాలన్నది వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. మెట్ఫార్మిన్ మాత్రలు : ఇటీవలి కొన్ని పరిశోధనలలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బదులు మెట్ఫార్మిన్ మాత్రలు గర్భిణుల్లో సురక్షితంగా వాడవచ్చని తేలింది.గర్భం దాల్చిన రెండు మూడు నెలల్లో స్కానింగ్ చేయించడం వల్ల గర్భంలో ఒకే శిశువు ఉందా, లేదా రెండు ఉన్నాయా, పిండానికి ఎన్ని వారాల వయసు, గుండె స్పందనలు సరిగా ఉన్నాయా వంటి విషయాలు తెలుస్తాయి ఐదు, ఆరు నెలల మధ్యన టిఫా స్కానింగ్, అవసరముంటే ఫీటల్ టూ–డీ ఎకో పరీక్ష చేయించడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది ఏడో నెల తర్వాత అవసరాన్ని బట్టి నెలనెలా చేయిస్తే, బిడ్డ సైజు మరీ ఎక్కువగా ఉందా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉందా... వంటి విషయాలు తెలుస్తాయి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉండేవాళ్లు మధ్యమధ్య కంటి రెటీనా పరీక్ష, కిడ్నీ పనితీరు (క్రియాటినిన్) పరీక్ష చేయించుకోవాలి. కాన్పు సమయంకాన్పు ఎప్పుడు, ఎలా చేయాలి అనే అంశాలను... డయాబెటిస్ ఎంత నియంత్రణలో ఉంది, తల్లిలో, బిడ్డలో ఏవైనా అనర్థాలు కనిపిస్తున్నాయా లాంటి అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. చక్కెర నియంత్రణలోకి రాకపోయినా, గర్భధారణను కొనసాగించడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే కాన్పు చేయాల్సి రావచ్చు సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, నొప్పుల వల్ల తల్లిలోని షుగర్ మోతాదులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ, అవసరాన్ని బట్టి ఇన్సులిన్ మోతాదును సెలైన్లలో వేసి ఎక్కిస్తూ కాన్పును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గర్భంలోని శిశువుకు అపాయం కలిగే అవకాశాలక్కువ. సిజేరియన్ : సాధారణ కాన్పు ప్రయత్నం విఫలమైనా, కడుపులోని బిడ్డ సైజు 3.5 కేజీల నుంచి 4 కేజీల కంటే ఎక్కువ బరువున్నా, డయాబెటిస్ నియంత్రణలో లేకపోయినా, బీపీ బాగా పెరుగుతూ ఉన్నా, మునుపు గర్భధారణలో శిశువు చనిపోయిన సందర్భాలున్నా... తల్లికి సిజేరియన్ చేయాల్సి రావచ్చు. కాన్పు తర్వాతపుట్టిన వెంటనే బిడ్డ పరిస్థితిని బట్టి తల్లి పాలను పట్టించాలి. కడుపులో ఉన్నంత కాలం బిడ్డకు చక్కెర ఎక్కువగా అందుతూ, కాన్పు అయిన వెంటనే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది పరీక్ష చేసి, అవసరమైతే బయటి పాలు లేదా సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఎక్కించాలి కాన్పు తర్వాత నాలుగు గంటలకు ఒకసారి చొప్పున 48 గంటల పాటు షుగర్ మోతాదులను పరీక్షిస్తూ ఉండాలి. తల్లికి జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు కాన్పు తర్వాత చక్కెర మోతాదులు మామూలు స్థాయికి వస్తాయి. కాబట్టి తల్లికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే తల్లికి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే కాన్పుకు ముందు తల్లికి ఉన్న స్థాయికి చక్కెరపాళ్లు వస్తాయి. ఈఅంశాలను బట్టి ఇన్సులిన్‌ను గర్భం రాకముందు ఇస్తున్న మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం (జెస్టీషనల్ డయాబెటిస్) వచ్చిన మహిళలు... ఆ టైమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం లేదా బరువు ఎక్కువగా పెరగడం వంటివి జరిగితే... వాళ్లకు 15–20 ఏళ్ల తర్వాత మళ్లీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా మహిళలతో ΄ోలిస్తే వాళ్లలో ఈ ముప్పు ఎక్కువ. గర్భం రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... డయాబెటిస్ ఉన్నవాళ్లు తమకు గర్భం రాకముందే... అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే సమయంలోనే తాము వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. ముందునుంచే తమ రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాల పరిస్థితి ఎలా ఉందో వైద్యపరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఉండాల్సిన దానికంటే తాము ఎక్కువ బరువు ఉంటే... తమ ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.వీలైతే బరువు తగ్గాకే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించడం మంచిది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత గర్భధారణకు మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం వల్ల బిడ్డలో స్పైనా బైఫిడా వంటి వెన్నెముక సరిగా పెరగక΄ోవడం లాంటి చాలా రకాల వైకల్యాలను నివారించవచ్చు. డాక్టర్ శ్రీనిత్య పున్నంరాజు సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ (చదవండి: Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!) -
Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో గ్లామర్‌గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు. 59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు. ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి. నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!) -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్‌గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్‌ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
ప్రెగ్నెన్సీ టైంలో మార్పులు ఉంటాయా..?
నేను ఇప్పుడు ఐదునెలల గర్భవతిని. రొమ్ముల్లో చాలా నొప్పి ఉంటోంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక రొమ్ముల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏవి నార్మల్ అనేది తెలియజేయండి?– బిందు, విజయవాడ. బ్రెస్ట్ టిష్యూలో కొవ్వు ఉంటుంది. లోబ్యూల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసేవి. డక్ట్స్ అంటే పాలను క్యారీ చేసేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ లోబ్యూల్స్, డక్ట్స్ పాలను ఉత్పత్తి చేయటానికి సిద్ధమవుతుంటాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. సాధారణ మార్పులు అంటే రెండు రొమ్ముల ఆకారం, పరిమాణం మారుతాయి. నిపుల్స్, ఆరియోలా డార్క్‌గా మారుతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా డార్క్ అవుతుంది. కనిపించే రొమ్ము సిరల మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. రొమ్ములు సున్నితంగా అవుతాయి. బ్రెస్ట్ అవేర్నేస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. త్వరగా కేన్సర్‌ని డిటెక్ట్ చేయవచ్చు. ప్రతి మూడు వందల్లో ఒకరికి ప్రెగ్నెన్సీలో కూడా కేన్సర్ రావచ్చు. అందుకే బ్రెస్ట్ మీద చర్మం ముడతలు పడటం, నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వచ్చినా, గడ్డలు తగిలినా అల్ట్రాసౌండ్ టెస్ట్స్ ప్రెగ్నెన్సీలో చేస్తాం. ఏ సందేహం ఉన్నా బయాప్సీకి పంపిస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో రొమ్ము కేన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన అరగంటలోపు చేయాలని అందుకే ఎంకరేజ్ చేస్తాం. ఎంత ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే అంత మంచిది. కేన్సర్ రిస్క్ అంత తక్కువ చేస్తుంది. ఫీడింగ్ ఇచ్చే సమయంలో బ్రెస్ట్ గట్టిగా అవటం, ఫ్యూయర్ రావటం, నొప్పి ఉండటం చూస్తాం. దీనిని ఎంగేజ్మెంట్ అంటాం, పాల డక్ట్స్ బ్లాక్ అయినందున ఇలా అవుతుంది. ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్ట్రా మిల్క్‌ను తొలగించటంలాంటి వాటితో ఎంగేజ్‌మెంట్‌ను ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ స్పెషలిస్ట్‌ని సంప్రదించటం మంచిది. ప్రసవం అయి, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రొమ్ముల్లో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా వరకు ఫీడింగ్ ఆపిన తరువాత నార్మల్ బ్రెస్ట్లాగా అవుతాయి.రొటీన్ చెకప్స్ చాలా అవసరం. ప్రతి నెలా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ స్కిన్ టెక్స్చర్ మారుతుందా, ఆర్మ్పిట్లో ఏవైనా లంబ్స్ వచ్చాయా, నిపుల్ డిశ్చార్జ్లోను అకస్మాత్తుగా ఆకార పరిమాణాల్లోను మార్పులు వచ్చినా, నిపుల్ ఇన్వెన్షన్, డిసెక్షన్స్లో మార్పులు అయినా, దురద ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) -
ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) -
తల్లి పాలతో మెదడు మెరుగ్గా!
తమ నెలల వయసులో పూర్తిగా తల్లిపాలపైనే ఆధారపడటంతోపాటు... చాలాకాలం పాటు అలా తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భాషలు నేర్చుకునే సామర్థ్యం, ప్రతిభ (లాంగ్వేజ్ స్కిల్స్) చాలా ఎక్కువని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు... ఇలా తల్లిపాలపై దీర్ఘకాలం పెరిగే పిల్లల్లో మెదడు వికాసం బాగా జరగడం వల్ల వాళ్లకు సహజమైన తెలివితేటలూ, తార్కికంగా ఆలోచించే శక్తియుక్తులు (లాజికల్ స్కిల్స్) కూడా బాగా పెరుగుతాయంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం దాదాపు 1500 మంది తల్లులను ఎంపిక చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనంలో చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలూ, కేవలం కొద్దికాలం పాటు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న పిల్లల తెలివితేటలనూ, ఐక్యూను పరీక్షించారు. ఈ అధ్యయనంతో తేలిన అంశాలను బట్టి... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలు వారి మంచి సామర్థ్యాలను కనబరిచారు. సుదీర్ఘకాలం పాటు తల్లిపాలను తాగిన పిల్లలు ఎక్కువ వకాబు్యలరీని కలిగి ఉండటంతోపాటు, భాషపై మంచి పట్టు సాధించినట్లు తేలింది. హార్వర్డ్ పరిశోధకుల పరిశోధన వివరాలు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (చదవండి: నిద్రపోకపోతే బాసూ... మెమరీ లాసూ! -
నిద్రలేమితో నా'ఢీలా'!
నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది. అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు. పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్‌పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... పెద్దవాళ్ల విషయంలో... అల్జిజమర్స్ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్ ప్యాక్ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్ వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. స్లీప్ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్ ఆప్నియా’ అని పిలిచే ఇది... చాలా ప్రమాదకరమైన వ్యాధి. గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే... గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్ డెఫిసిట్‌తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్‌గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్‌గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్ ఎబిలిటీస్) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్ కండిషన్స్)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్ టర్మ్ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.నిద్రతోనే పిల్లలు ఎత్తు పెరిగే సామర్థ్యం: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. మంచి నిద్ర కోసం... ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడానికి దూరంగా ఉండటం పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడంపడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం సమకూరుతుంది. డా. విక్రమ్ కిశోర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్ (చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!) -
ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?
నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రమాదం ఉంటుందా?– మమత, జమ్మలమడుగు.శిశువు చుట్టూ గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు కొంతమందిలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజైనా లేదా సర్విక్స్ బలహీనమైనా, ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు సంచి పలుచనైయి, చిట్లుతుంది. అప్పుడు నొప్పులు లేకుండానే ఉమ్మనీరు పోవటం వలన లోపల శిశువుకు, తల్లికి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. 24 వారాల నుంచి 37 వారాల లోపల ఉమ్మనీరు పోతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. ఇది తెలుసుకోవటం కొందరికి తెలియక పోవచ్చు. అకస్మాత్తుగా నీరు వెజైనా నుంచి పోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, ధారగా ఉండటం, యూరిన్ వాసన లేకపోవటం లాంటివి ఉంటే, ఇంట్లోనే తెలుసుకోవచ్చు. లేదా వెంటనే డాక్టర్ని కలిస్తే, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా చెక్ చెస్తారు. అమోనిసోర్ అనే టెస్ట్ ద్వారా కూడా డాక్టర్ చెక్ చేస్తారు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇది 99 శాతం సెన్సిటివ్ టెస్ట్. మీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ పరీక్షతో పాటు, మీ పల్స్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లీకింగ్ ఉందని తెలిస్తే, అడ్మిట్ చేసి 24–48 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఈ సమయంలో బేబీ వెల్ బీయింగ్ స్కాన్ చేస్తారు. యాంటీబయోటిక్స్ ఇస్తారు. నెలలు నిండలేదు కాబట్టి శిశువుకు లంగ్ మెచ్యూరిటీ కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నియో నాటాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేసి ప్రీమెచ్యుర్ బేబీ రిస్క్స్, కాంప్లికేషన్స్, కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు నొప్పులు వచ్చి, ప్రసవం అవుతుంటే సురక్షితంగా, ఎలా కాన్పు చెయ్యాలి అని చూస్తారు. ఒకవేళ నొప్పులు రాకపోతే, పైన చెప్పినట్లు యాంటీబయోటిక్స్ ఇచ్చి, అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలో వివరిస్తారు. వారానికి రెండుసార్లు ఉమ్మనీరు, బేబీ బ్లడ్ ఫ్లో స్టడీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ 37 వారాల వరకు పొడిగించడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారు. రెగ్యులర్ చెకప్స్, ఫాలో అప్స్లో ఏ సమస్య లేకుండా డాక్టర్ సలహాలను పాటించాలి. (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?
ప్రస్తుంతం అందరూ ఆరోగ్య స్ప్రుహతో బ్రకోలిని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. అస్సలు కాలీఫ్లవర్ వైపుకి చూడనివాళ్లు సైతం బ్రకోలి ప్రయోజనాలు తెలిసి మిస్ చేయకుండా కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివని కొనేముందు తాజాగా ఉందా లేదా అనేది గమనించాలి. ఏమరపాటుతో కొంటే మాత్రం ఆరోగ్యదాయకమైనవి కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. ఇలాంటివి కొనేటప్పడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన అధికారులు. ఎందుకంటే..?..యూఎస్‌లోని సుమారు 20 రాష్ట్రాల్లోని ప్రజలు కొన్ని దుకాణాల నుంచి ప్యాక్ చేసి ఉన్న బ్రకోలి(Broccoli)ని కొనుగోలు చేశారు. వెంటనే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food and Drug Administration (FDA)) అప్రమత్తమై తినొద్దని హెచ్చరించింది. వాటిని వెనక్కి ఇచ్చేయండి లేదా ఉపయోగిచకండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అధికారులు ఓ దుకాణంలో యాదృచ్ఛికంగా బ్రకోలిని టెస్ట్ చేయగా దానిలో ప్రాణాంతక లిస్టెరియా మోనోసైటోజీన్ బ్యాక్టీరియాలు(Listeria monocytogenes) ఉన్నట్లు గుర్తించారు. దీంతో డిసెంబర్ 2024 తొలివారంలో ఎవరైతే ఈ బ్రకోలిని కొన్నారో వారు.. డిసెంబర్ 10 కల్లా ఉపయోగిస్తే పర్లేదని అలాకాని పక్షంలో తక్షణమే వినియోగించటం మానేయాలని సూచించింది. ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు నిల్వ తక్కువ ఉండే ఆహార పదార్ధాల్లో ఆటోమేటిగ్గా ఇలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందట. అందువల్ల దయచేసి ఇలాంటి కూరగాయాలను ప్యాకింగ్ కవర్‌పై ఉండే డేట్ ఆధారంగా కొనడం, ఉపయోగించడం వంటివి చేయండి అని చెబుతున్నారు. ఇలాంటి కలుషితమైన బ్రకోలి తింటే ఆరోగ్యవంతుడైన వ్యక్తులలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి స్వల్పకాలిక లక్షణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. అదే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఏంటీ లిస్టెరియా మోనోసైటోజీన్లు:లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనేది వ్యాధికారక బాక్టీరియం. ఇది మానవులకు జంతువులకు సోకుతుంది. అనేక ఇతర బాక్టీరియాలా కాకుండా లిస్టెరియా రిఫ్రిజిరేటెడ్ పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆహర ఉత్పత్తి నిల్వలో ఈబ్యాక్టీరియా ఉత్ఫన్నమవుతుంది. అందువల్ల కొన్ని ఆహార పదార్థాలు అంటే.. మహా అయితే ఐదు రోజులకి మించి నిల్వ చేయలేని కూరగాయల్లో ఇది ఫామ్ అవుతుంది. తాజా కూరగాయాలు ఆరోగ్యానికి మంచివి. అది కూడా రైతులు కోసుకొచ్చిన.. రెండు మూడు రోజులకి మించి నిల్వ లేనివి అయితేనే మంచివనే విషయం గ్రహించాలి. నిజానికి బ్రకోలి సూపర్ ఫుడ్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుంది. కానీ అన్నింటికంటే ఇది ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది నిర్థారించి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..) -
Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .!
వెయిట్‌లాస్ జర్నీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్నెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!నటుడు రామ్ కపూర్(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్2 డయాబెటిస్(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా చేసేలా మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్ చేయగలిగానని అన్నారు. నిపుణుల ఏమంటున్నారంటే..నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్ఫ్యాట్లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్ మీల్స్ ఉండొచ్చు. అయినా దాన్ని బర్న్ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చర్మంపై దద్దుర్లు, కండరాలు బలహీనత, కీళ్ల వాపు ఇలా శరీరంలోని ఏదో ఒక సమస్యకు గురి చేస్తుంది. అసలు లూపస్ లక్షణాలు ఏంటి? ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో ఒకరు ల్యూపస్ వ్యాధితో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 3.2 మంది ల్యూపస్ బారిన పడ్డారని అంచనా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చర్మసంబంధమైన లూపస్: చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు రియాక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.నియోనాటల్ లూపస్ : ఇది శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం లూపస్ వ్యాధికి సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే నయమయ్యే అవకాశాలున్నాయి. ల్యూపస్ - లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటి ల్యూపస్. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సందర్బంలో ఏ అవయవాన్నైనా ల్యూపస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, ఎముకలు దీనివల్ల ప్రభావితమవుతాయి. అందుకే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవడం, కీళ్లలో వాపులు, ఎముకల నొప్పులు, కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది. ముఖంమీద బటర్ ఫ్లై ఆకారంలో ర్యాషెస్, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది. ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమైతే ఆటో ఇమ్యూన్ కణాలు మెదడు పొరలపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్లమేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూపస్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి. అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్రభావితమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.నిర్ధారణ ఎలా?క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే పరీక్ష ద్వారా లూపస్ వ్యాధిని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు, ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు. చికిత్స ఏంటి?నిజం చెప్పాలంటే ల్యూపస్ వ్యాధికి శాశ్వత చికిత్స అంటూ ఏమీ లేదు. ఉపశమన చికిత్స మాత్రమే. సోకిన అవయవం,లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఉంటుంది ఏయే అవయవాలపై వ్యాధి ప్రభావం ఉందనే దాన్ని బట్టి రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు) ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు, సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం. -
కొత్త ‘వెపన్స్’తో కేన్సర్‌పై ‘వార్’
ప్రస్తుతం మానవాళిని వణికిస్తోన్న అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. దీనికి సంబంధించిన చికిత్సలతో పాటు కొత్త కొత్త కేన్సర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 4) కేన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు అందిస్తున్న కొన్ని కొత్త చికిత్సా విధానాలు ఒకసారి చూద్దాం.అందుబాటులోకి అత్యాధునిక చికిత్సలు..ఓ వైపు కేన్సర్ వ్యాధి విజృంభణతో పాటు మరోవైపు ఆ వ్యాధి చికిత్సకు సంబంధించి అనేక కొత్త కొత్త పద్ధతులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని కేన్సర్లకు సంబంధించి ఇటీవల ట్రీట్మెంట్ అడ్వాన్స్ చికిత్సా విధానాలు బాగా ఎక్కువయ్యాయి. రోగుల క్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు ఆయా చికిత్సలను మేం అందిపుచ్చుకోవాల్సిందే.. అనుసరించాల్సిందే. ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ ఎక్కువ ఉపయోగించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించి సెంటినల్ లింఫ్ మోడ్ బయాప్సీ అనే కాన్సెప్ట్ ఒకటి. దీని ద్వారా సంక భాగంలో సర్జరీ అసవరాన్ని నివారించవచ్చు. ఇదే విధంగా రేడియేషన్స్లో కూడా కేవలం కేన్సర్ సోకిన ప్రదేశంలోని గడ్డ వరకే రేడియేషన్ చేసే టెక్నిక్స్ వచ్చాయి. దీని వల్ల సైడ్ అఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా రీ కన్స్ట్రక్షన్స్... అంటే సర్జరీ తర్వాత కాస్మెటిక్ సర్జరీ బాగా ఎక్కువైంది. కొంత మంది పేషెంట్స్‌కి బ్రెస్ట్ కేన్సర్‌కి రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నాం. థైరాయిడ్ కేన్సర్ చికిత్సలో ‘స్కార్ లెస్ నెక్ సర్జరీ విత్ రోబోటిక్’ వంటివి వచ్చాయి. అంటే మెడ మీద మచ్చ లేకుండానే సర్జరీ చేసే ఛాన్సుంది.ఇక పాంక్రియాటిక్ కేన్సర్ చికిత్సలో రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది దీని వల్ల అతి తక్కువగా లేదా అసలు ఐసీయూలో ఉండాల్సిన అవసరం లేకుండా, అలాగే హాస్పిటల్లో ఉండాల్సిన సమయం బాగా తగ్గించేస్తూ రికవరీ త్వరగా అవుతుంది. అలాగే హైటెక్ అనే కొత్త కాన్సెప్ట్‌ను కూడా అండాశయ కేన్సర్లకు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగిస్తున్నారు. అవయవాన్ని కాపాడుతూ కేన్సర్ చికిత్స చేసే ఆర్గాన్ కన్సర్వేషన్ కూడా కొత్తగా వచ్చిందే. వ్యాధి రాక ముందే పోగొట్టవచ్చు...అంతేకాకుండా కేన్సర్ చికిత్సలో జెనెటిక్ రీసెర్చ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల కేన్సర్‌ని రాక ముందుగానే గుర్తించి తగిన చికిత్స ఇవ్వొచ్చు తద్వారా . కేన్సర్ డెవలప్ రాకుండానే సర్జరీ చేసేస్తారు. అదే విధంగా పెట్ స్కాన్ లాగే పెట్ ఎంఆర్ అనే కొత్త డయాగ్నసిస్ కూడా ఒకటి.–డా.మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్రోబొటిక్ సర్జన్, కిమ్స్ ఆసుపత్రి. -
కోటీశ్వరుడు అవ్వడమే శాపమైంది..!
డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్ ఆఫ్ సింబల్. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశ్శాంతిని దూరం చేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్ డ్రాపౌట్ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్‌కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు. మిలియనీర్‌గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్‌అప్‌లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి. అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యంత అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు. డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్ చానెల్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్‌కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు. ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."(చదవండి: ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!) -
World Cancer Day: గట్ బయోమ్లాగే... క్యాన్సర్ బయోమ్ ట్యూమరమ్మతు
మానవుల జీర్ణవ్యవస్థ (గట్) లో ప్రతి చదరపు సెంటీమీటరుకు కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. మనిషి దేహం మొత్తంలో 30 ట్రిలియన్ కణాలుంటాయని అంచనా వేస్తే గట్‌లో నివాసముండే సూక్ష్మజీవుల సంఖ్య 38 ట్రిలియన్లు! ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని డాక్టర్లు ‘మైక్రోబియమ్’ గా చెబుతుంటారు. ఈ సూక్ష్మ జీవజాలపు సమతౌల్యతే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సమర్థంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మానవుల మూడ్స్‌ను సైతం ఈ మైక్రోబయోమ్ ప్రభావితం చేస్తుంది. అలాంటి సూక్ష్మజీవుల సముదాయమే క్యాన్సర్ గడ్డ (ట్యూమర్)లోనూ ఉంటుందని తెలుసుకున్నారు పరిశోధకులు. గట్‌లో ఉండేవి ‘గట్ బయోమ్’ అయితే ట్యూమర్లో ఉండేవి ‘ట్యూమర్ బయోమ్’!! ట్యూమర్ పెరుగుదలనూ, చికిత్స సమయంలో ట్యూమర్ ప్రతిస్పందించే తీరునూ ఈ ‘ట్యూమర్ బయోమ్’ ప్రభావితం చేస్తుంది. నేడు (ఫిబ్రవరి 4న) ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా చికిత్సతో పాటు అనేక అంశాలను ప్రభావితం చేసే ఈ ‘ట్యూమర్ సూక్ష్మక్రిముల’ గురించి తెలుసుకుందాం.ఆరోగ్య స్పృహ ఉన్న వర్గాల్లో గట్ బయోమ్ గురించి బాగానే తెలుసు. కానీ అదే తరహాలో క్యాన్సర్ గడ్డలోనూ సూక్ష్మజీవుల సముదాయాలుంటాయన్న విషయం చాలామందికి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఇది వాస్తవం. నిజానికి ఈ ‘బయోమ్’ ఎంత ప్రభావశీలమైనదంటే... క్యాన్సర్ కణం ఎలా ప్రవర్తించాలన్న అంశాన్నీ ఇది ప్రభావితం చేస్తుంది. ట్యూమర్ ఇన్ఫ్లమేషన్ను ఇది పెంచనూవచ్చు, తగ్గించనూవచ్చు.జెనెటిక్స్‌తో మరింత తోడ్పాటు... ట్యూమర్ మైక్రోబయోమ్ సహాయంతో క్యాన్సర్ చికిత్సలను మరింత ప్రభావవంతంగా అందించడానికి జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) మంచి తోడ్పాటును అందిస్తుంది. జన్యుశాస్త్ర సహాయంతో ట్యూమర్‌లోని మైక్రోబయోమ్ మనకు అనుకూలంగా పనిచేస్తోందా లేక ప్రతికూలంగా ఉందా, దాని బట్టి ఎలాంటి చికిత్స అందిస్తే మంచి ఫలితాలొస్తాయి వంటి అంశాలను అధ్యయనం చేస్తూ, మైక్రోబయోమ్నూ జెనెటిక్ ప్రోఫైలింగ్నూ సమన్వయం చేసుకోవడం వల్ల మరింత ప్రభావవంతమైన చికిత్సను అందించవచ్చు. ఇలా చేయడం వల్ల వచ్చే ఫలితాలూ అద్భుతంగా ఉంటాయి. అక్కడి సూక్ష్మజీవుల జన్యుపటలాల అధ్యయన విశ్లేషణలతో అవెలా మనుగడ సాగిస్తున్నాయీ, వాటిని ఎదుర్కొనేలా బాధితులకు సరిగ్గా సరిపడేలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పన ఎలా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. దాంతో క్యాన్సర్ చికిత్సలను మరింత సమర్థంగా జరిగేలా చూడవచ్చు. ఫలితంగా బాధితుల్లో వ్యాధిని పూర్తిగా నయం చేయడానికీ, వారు కోలుకుని మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికీ ఈ అధ్యయనాలు తోడ్పడతాయి.జీవక్రియలు ఓ సింఫనీ అనుకుంటే... జీవనశైలీ, ఆహారాలతో ప్రయోజనాలివి... మానవ జీవితంలోని జీవక్రియలను ఓ సింఫనీతో పోల్చవచ్చు. సింఫనీ అంటే అనేక మంది గాయకులు ఒకే స్వరంతో స్వరం కలిపి ఒకే లయలో పాడటం. అప్పుడు ఓ అద్భుత సంగీతం (మెలొడీ) ఆవిష్కృతమవుతుంది. ఇందులో కణాలన్నీ మంచి గాయకులనుకుంటే మంచి మైక్రోబియమంతా లయాత్మకంగా వాద్యాలను వాయించే అద్భుత సంగీతకారులు (మ్యూజీషియన్స్). అప్పుడు వినిపించేదంతా హాయినిగొలిపే ‘ఆరోగ్య’కరమైన సంగీతం. ఈ హెల్దీ సంగీత లహరి అలా హాయిగా సాగిపోతుండగా మనం తీసుకునే అనారోగ్యకరమైన, పోషకరహితమైన ఆహారం కారణంగా వినిపించే కొన్ని అనారోగ్యల అపస్వరాల ఆలాపాల వల్ల కలిగే అనర్థాలు! ఇక ఈ పోలికలో ట్యూమర్ అనేది చక్కగా సాగే సింఫనీని చెడగొట్టేలా అన్నీ అపస్వరాలతో గట్టిగా గానాన్ని వినిపించే సోలో గాయకుడూ, అలాగే ‘ట్యూమర్’లోనూ ఉన్న మైక్రో బయోమ్ కూడా వినిపించే అందరూ సమన్వయంతో పాడుతుండగా వినిపించే ఈ అపస్వరాల అనారోగ్యం కర్ణ కఠోరంగా వినిపించే ‘రుగ్మత’.ఇలాంటి సమయాల్లో మనం తీసుకునే పోషకాలతో కూడిన మంచి ఆహారంలోని ఫైబర్ పుష్కలంగా ఉండే న్యూట్రిషన్, ప్రొబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఇవన్నీ ఆ అపస్వరాలను అధిగమిస్తూ, వాటిని కప్పేస్తూ గట్టిగా వినిపించే సుస్వరాలు. అనుసరించే అద్భుతారోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్) కూడా అదనంగా వినిపిస్తుండే ఆర్కెస్ట్రైజేషన్! ఇలా చేస్తున్నప్పుడు సమన్వయంతో సాగే సింఫనీలో పూర్తిగా అపస్వరాలే పైచేయి సాధించకుండా కనీసం వాటిని కప్పేస్తూ తప్పులను దొర్లనివ్వకుండా, దొరకనివ్వకుండా చేసే ‘కోకఫోనీ’! అంటే... ఈ పోలికను క్యాన్సర్ జబ్బుతో అన్వయించినప్పుడు... మంచి చికిత్స, మంచి ఆహారం, మంచి లైఫ్‌స్టైల్‌తో జబ్బు మరింత పెరగదు. అనర్థాలు కనిపించవు. అపస్వరాలను డామినేట్ చేసేలా చికిత్స, ఆహారనియమాలూ, జీవనశైలి సాగితే క్రమంగా అపస్వరాలే వినిపించనివ్వకుండా చేసేలా మనకు మేలు చేసే మంచి మైక్రోబియమ్ పెరుగుతుంది. ఆ చెడు మైక్రోబియమ్ను అది డామినేట్ చేసి మరీ చికిత్సతో క్యాన్సర్ నయం చేయడానికి సహాయపడుతుందని ఈ పోలిక చెబుతోంది. ఈ ఏడాది థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వచ్చే రెండేళ్ల పాటు (అంటే 2025 నుంచి 2027 వరకు) అమల్లో ఉండే ‘థీమ్’... ‘యునైటెడ్ బై యునీక్’! ప్రతి క్యాన్సర్ బాధితుడూ ఓ ప్రత్యేక వ్యక్తి. ఈ బయోమ్ కారణంగా అతడిలోని జబ్బు అతడికే ప్రత్యేకం. అందుకే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగతంగా అతడికే ప్రత్యేకమైన మందుల రూపకల్పనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఎంతోమంది ప్రత్యేక వ్యక్తులంతా ఐక్యంగా కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలన్నదే ఈ థీమ్ అర్థం. తెలుగులో చెప్పుకోవాలంటే... ఇది ‘ప్రత్యేకుల ఐక్యత’! అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాలన్నీ ఏకమై క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు ప్రయత్నించాలంటూ ఈ ప్రత్యేకమైన థీమ్ పిలుపునిస్తోంది. కొన్ని ట్యూమర్ బయోమ్తో సమర్థమైన ఇమ్యూనో చికిత్స సాధ్యం...క్యాన్సర్‌కు అందించే చికిత్సల్లో కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సలతో పాటు ఇమ్యూనో థెరపీ అన్నది కూడా ఓ ప్రభావవంతమైన చికిత్స. ప్రతి వ్యక్తిలో ప్రతిరోజూ 200 నుంచి 1000 క్యాన్సర్ కణాలు పుడుతుంటాయి. మనందరిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) వాటిని తుదముట్టిస్తుంది. ఆ వ్యవస్థ విఫలమైనప్పుడు అలా తుదముట్టించే ప్రక్రియలో ఒక్క క్యాన్సర్ కణమైనా తప్పించుకుని బతికితే అప్పుడు బాధితులకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ ఇమ్యూనో థెరపీలో బాధితుల వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తారు. ఫలితంగా క్యాన్సర్ రాకముందు వ్యాధినిరోధక వ్యవస్థ రోజూ పుట్టే క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే ప్రక్రియే ఈ ఇమ్యూనోథెరపీలోనూ జరుగుతుంది. ఈ థెరపీ సమయంలో క్యాన్సర్ ట్యూమర్లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉండే సూక్ష్మజీవుల సముదాయం మానవులకు మేలు చేసేదైతే ఈ చికిత్సకు ఆ బయోమ్ మరింత దోహదపడి ట్యూమర్‌ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.ట్యూమర్‌కు కీడు చేసే బయోమ్తో బాధితుడికి మేలు...గట్ బ్యాక్టీరియమ్లో మేలు చేసేవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మంచి ఆరోగ్యాన్నిస్తూ, చెడు బయోమ్ పెరిగినప్పుడు ఆరోగ్యం చెడిపోయినట్టే... క్యాన్సర్ ట్యూమర్లోనూ... ఆ గడ్డకు సహాయం చేసే బయోమ్ పెరిగితే అది చికిత్సను అడ్డుకుంటుంది. ట్రీట్మెంట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే... ఇక దానికి చేటు చేసే బయోమ్ పెరిగినప్పుడు... ఆ సూక్ష్మజీవుల సముదాయం క్యాన్సర్ గడ్డ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. ట్యూమర్ చుట్టూ అలాంటి బయోమ్ ఉన్నప్పుడు పేషెంట్స్‌కు అందించే చికిత్సకు... ముఖ్యంగా ‘కీమో’ చికిత్సకు బాధితులు సానుకూలంగా స్పందిస్తుంటారు. అలా ట్యూమర్ మైక్రోబయోమ్కూ క్యాన్సర్ చికిత్సకూ మధ్య పరస్పరం ప్రతిస్పందనలు కొనసాగుతుంటాయి.క్యాన్సర్ ‘ఏ టు జడ్’ స్క్రీనింగ్స్ ఇలా! చాప కింది నీరులా వ్యాపిస్తున్నప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా రెండోదశలోనైనా కనుక్కోగలిగితే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం కష్టమేం కాదు. అయితే క్యాన్సర్స్‌ను ముందుగానే గుర్తించడమెలా, మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లేమిటి... ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనాన్ని సాక్షి హెల్త్ ప్లస్‌లో చూడవచ్చు.ట్యూమర్ బయోమ్తో ఉపయోగాలు→ ఈ బయోమ్ కనుగొనడంతో క్యాన్సర్‌కు మరింత సమర్థమైన చికిత్సలు సాధ్యం → మైక్రోబయోమ్ ప్రతిస్పందనలకు అనుగుణంగా కొత్త మందుల రూపకల్పన→ జన్యుశాస్త్ర, బయోమ్‌ల సమన్వయాలతో సరికొత్త థెరపీలు కనుగొనే వీలుడా‘‘ ఏవీఎస్ సురేశ్,సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
రోజంతా కూర్చొనే ఉంటే ఎంత సేపు వ్యాయమం చేయాలో తెలుసా..!
ప్రస్తుతం చాలామటుకు కూర్చొని చేసే డెస్క్ జాబులే. దీంతో గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొండిపోవడంతో చాలామంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో ఎక్కువమంది బాధపడటానికి కూడా కారణం ఇదే అని చెప్పొచ్చు. అలా ఎక్కువసేపు కూర్చొవడంతో పిరుదుల వద్ద కండరాలు బిగిసుకుపోయి ఉండిపోతాయి. దీంతోపాటు కాళ్లు, తొడలు, పొత్తుకడుపులో ఫ్యాట్ కూడా పేరుకుపోతుంటుంది. దీంతో ఊబకాయం, గుండెజబ్బులు, అకాల మరణం వంటి అనారోగ్యం బారినపడుతున్నారు చాలామంది. అయితే ఈసమస్యను అధిగమించడానికి ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో తాజా అధయనాల్లో పరిశోధకులు వెల్లడించారు. ఎంత వ్యవధి వ్యాయమాలు మనకు హెల్ప్ అవుతాయో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను భర్తీ చేయడానికి సరైన వ్యాయామం వ్యవధి జస్ట్ 40 నిమిషాలేనట. ప్రతిరోజూ '40 నిమిషాల వరకు సాధారణమైన వ్యాయమాల నుంచి శక్తిమంతమైన వ్యాయమాలు చేస్తే సరిపోతుందట. పదిగంటలు నిశ్చలంగా ఒకే చోట కూర్చోనేవారు ఇలా జస్ట్ 40 నిమిషాలు వ్యాయమానికి కేటాయిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని ధీమాగా చెబుతున్నారు పరిశోధకులు. దీనికోసం నాలుగు వేర్వేరు దేశాల్లో మొత్తం 40 వేల మందికి పైగా వ్యక్తులపై ఫిట్నెస్ ట్రాక్‌ని విశ్లేషించారు. వారిలో సూమారు 30 నుంచి 40 నిమిషాలు సాధారణ వ్యాయమాలతో మొదలై అధిక తీవ్రత వ్యాయమాలతో పూర్తి చేసిన వ్యక్తుల్లో ఎలాంటి అనారోగ్య ప్రమాదాలు ఉండవని తేలింది. వారిపై దుష్ర్పభావాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైందని అన్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తుల ముఖ్యంగా సైక్లింగ్, వాకింగ్, తోటపని వంటివి చేస్తే వారిపై ఎలాంటి అనారోగ్యం ప్రభావం ఉండదని అన్నారు.తప్పనిసరిగా చేయవల్సినవి.. ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం. అలాగే తుంటి, నడుమ భాగాలను సాగదీయడం వంటివి చేస్తే ఎక్కువసేపు కూర్చొవడం వల్ల ఎముకలు పట్టేసినట్లు అనిపించవట.అలాగే బరువు వ్యాయామాలు చేయడం వల్ల బాడీ తేలికగా ఉంటుందట. స్క్వాట్లు, పుష్ అప్లు కండరాలను సక్రియం చేస్తాయి, జీవక్రియనున పెంచుతాయి. సాధ్యమైనంత వరకు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువసేపు కూర్చొవడాన్ని నిరోధించొచ్చుమెట్టు ఎక్కడం వంటివి కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయట. ఈ కొత్త పరిశోధన బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను మనకున్న పరిమితుల్లోనే సులభంగా అధిగమిద్దాం ఆరోగ్యంగా ఉందాం.(చదవండి: రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!) -
బోసు బాల్‌తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్‌ర్‌సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్‌లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్‌మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్‌పై ఎలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్‌ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్‌తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్‌కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్‌లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్‌చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్‌ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్‌గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్‌లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్‌తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్‌ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్‌ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్‌వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్‌ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్‌తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్