పవన్ కు తిక్కే ఉంది.. లెక్క లేదు: కవిత
పవన్ కళ్యాణ్ కు తిక్కే ఉందిగాని లెక్క లేదని తెలంగాణ జాగృతి సంస్థ కవిత వ్యాఖ్యానించింది
నిజామాబాద్: పవన్ కళ్యాణ్ కు తిక్కే ఉందిగాని లెక్క లేదని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించింది. నిజమాబాద్ లోకసభ అభ్యర్ధిగా టీఆర్ఎస్ నుంచి పోటి చేస్తున్న కవిత... పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై మండిపడ్డారు.
నరేంద్రమోడీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఆయన పక్కన పవన్ చేరారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సినిమా కాదు.. రీటేకులు ఉండటానికి అని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలను ప్రజలు నమ్మరని కవిత అన్నారు. కమెడియన్లు, విలన్లు చిరంజీవి, పవన్ లేనని కవిత ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్న సొమ్ములో పవన్ కు ఎంత వాటా దక్కిందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.