విజయనగరం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవంగా దహనం అయిపోయాడు.
విజయనగరం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవంగా దహనం అయిపోయాడు. డెంకాడ మండలం నాతవలస గ్రామంలో తెల్లవారుజాము ప్రాంతంలో పశువుల పాకకు నిప్పంటుకుంది. దీంతో పాకలో ఉన్న చందక బంగారి (65) అనే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
ఈ సంఘటనలో మరో పశువుల పాక, రెండు గడ్డి వాములు, ఓ పశువు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం ఎలా సంభవించినదీ ఇంకా తెలియలేదు. సంఘటన స్థలాన్ని తహసిల్దార్ బి.బి. రమణి పరిశీలించారు.