
కాల్పుల్లో గాయపడిన నమ్మి అప్పల రాజు
విజయనగరం జిల్లా: విజయనగరం పట్టణంలో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య వివాదం చోటేచేసుకోవడంతో కాల్పులకు దారి తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజుపై పాత నేరస్తుడు బొత్స మోహన్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తేలింది. గాయపడిన అప్పల రాజును విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.