విశాఖ నగరంలో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.
పెద్ద వాల్తేర్ : విశాఖ నగరంలో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సిరిపురం బాలాజీ నగర్‌లోని రైల్వే ఇంజనీర్ బి.శ్రీరామమూర్తి నివాసంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో దొంగలు ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటి లోపల బీరువాలోని 35 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు.
చోరీ సమయంలో శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లారు. 1.30 గంటల సమయంలో వారు తిరిగి ఇంటికి రాగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.