'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు' | Shobha Nagi Reddy takes on kiran kumar reddy, Chandra babu and Nadendla Manohar | Sakshi
Sakshi News home page

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'

Published Tue, Jan 7 2014 11:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు' - Sakshi

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'

విభజన బిల్లు అంకాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరాటపడుతున్నారని శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆరోపించారు.

విభజన బిల్లు అంకాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరాటపడుతున్నారని శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆరోపించారు.  సీమాంధ్ర నేతలైయుండి ఆ ముగ్గురి నేతలకు ఎందుకింత ఆత్రుత అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టే విషయంలో మాత్రం ఆ ముగ్గురు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

వారంతా సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్లోర్ లీడర్లు మాత్రమే బీఏసీకి రావాలనేది తమ డిమాండ్ అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఏసీలో పార్టీ విధానం చెప్పాలి, కానీ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకుండా స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని శోభానాగిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement