
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది(పాత చిత్రం)
అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక సమస్యలు ఎదురైనా ఓటర్లు ఓపికగా ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. పోలింగ్ ప్రక్రియకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియలో సహకరించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేశారు.
94వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు సిఫార్సు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 94వ పోలింగ్ కేంద్రంతో పాటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని 244వ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను సీఈఓ ద్వివేదీ , కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.