సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం పారాపురంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. ఒక గుడిసెకు నిప్పంటుకుని మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గుడిసెలో నివశించే జనాలు బయటకు పరిగెత్తారు. ప్రమాదవశాత్తు ఆ మంట్లలో చిక్కుకుని వృద్ధురాలు సజీవదహనం అయింది.