
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 261వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వైఎస్ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాల్ జంక్షన్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్ మీదుగా అరిలోవ జంక్షన్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్ క్యాంప్ నుంచి చినగాదిలి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.