వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నూతన కమిటీ లో ప్రకాశం జిల్లాకు పెద్ద పీట వేశారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నూతన కమిటీ లో ప్రకాశం జిల్లాకు పెద్ద పీట వేశారు. ఇటీవల ప్రకటించిన కమిటీల్లో కూడా జిల్లాకు ప్రాధాన్యత దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ప్రకటించిన కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శిగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.
రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, బాపట్ల మాజీ ఎంపీ, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమించారు. అధికార ప్రతినిధుల జాబితాలో ఆదిమూలపు సురేష్‌కు స్థానం దక్కింది. టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధిగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను నియమించారు. ఈ నియామకాల పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.