Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati1
భూమన గోశాలకు వెళ్లకుండా అడ్డగింత.. తిరుపతిలో ఉద్రికత్త

సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.మరోవైపు.. భూమన హౌస​్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని అన్నారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

No Police Protection for Marrying Against Parents Wishes says Allahabad High Court2
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం.. హైకోర్టు తీర్పుతో దంపతులకు షాక్!

లక్నో: ‘మీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. అలాంటప్పుడు మీకెందుకు పోలీస్‌ భద్రత ఇవ్వాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్‌ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేం. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేం భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు’ అంటూ అలహాబాద్‌ హైకోర్టు (allahabad high court) కీలక తీర్పును వెలువరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పును వెలువరించింది. ‘తాము ప్రేమవివాహం చేసుకున్నామని, తల్లిదండ్రుల నుంచి భయాందోళనలు ఉన్నాయంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి తమకు పోలీసు రక్షణ కల్పించాలని’ కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. విచారణలో.. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పించవచ్చు. అలాంటి బెదిరింపులు లేకుండా, కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి రక్షణ కోరడం తగదని స్పష్టం చేసింది.దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన అనంతరం, దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.అలాగే, తమకు బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొని, పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలి’ అని కోర్టు సూచించింది.అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు న్యాయస్థానాలు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే లేవు’ అంటూ గతంలో ఈ తరహా పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (supreme court of india) చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించింది.

Rasi Phalalu: Daily Horoscope On 17-04-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.చవితి ప.12.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.5.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.9.14 నుండి 10.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు,అమృత ఘడియలు: రా.7.30 నుండి 9.15 వరకు.సూర్యోదయం : 5.48సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మిథునం.... మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కర్కాటకం.... నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.సింహం.... పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.కన్య.... బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.తుల.... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు..వృశ్చికం.... పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు.ధనుస్సు... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.మకరం... చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొంత గందరగోళం.కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం... భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి.

Chandrababu TDP Govt Power Charges increased by more than 50 percent4
గుండె గు‘బిల్లు’

‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్‌ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్‌ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్‌ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్‌ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్‌ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తు­న్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటు­న్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతే­డాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భా­రాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదా­రులపై ఎలాంటి విద్యుత్‌ చార్జీల భారం లేకుండా టారిఫ్‌ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాడు వైఎస్‌ జగన్‌ టారిఫ్‌ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్‌ పరిధిలో నివసించే ఎస్‌.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్‌ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్‌ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్‌ ఉన్నాయి. కరెంట్‌ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్‌ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతు­బట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్‌ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్‌)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్‌ వినియోగా­నికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్‌ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్‌ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్‌ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్‌ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్‌ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్‌ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్‌ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్‌ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్‌) పవర్‌ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్‌ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్‌ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్‌ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్‌ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా.

Actress Abhinaya Get Married With Sunny Varma5
ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా?

కర్ణాటకు చెందిన నటి అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏప్రిల్‌ 16న ఈ వేడుకు ఘనంగా జరిగింది. మార్చి 9న నిశ్చితార్థం జరిగింది. చాలా రోజులుగా ఆమె పెళ్లిపై ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన వారినే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ రూమర్స్‌ వరకే పరిమితం అయ్యాయి. 15 ఏ‍ళ్ల పాటు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సన్నీ వర్మను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ నెల 20న రిసెప్షన్‌ నిర్వహించనున్నారు'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

Gold price record new high Rs 1650 rally in a single day6
పసిడి మరో కొత్త రికార్డు.. ఒకే రోజు రూ.1,650 ర్యాలీ

న్యూఢిల్లీ: పసిడి మరోసారి కొత్త గరిష్ట రికార్డును నమోదు చేసింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9% స్వచ్ఛత) రూ.1,650 పెరగడంతో రూ.98,100 స్థాయికి చేరింది. క్రితం రికార్డు రూ.96,450ను చెరిపేసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది.బంగారం ఈ నెల 11న ఒక్క రోజే 10 గ్రాములకు రూ.6,250 పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.56 శాతం ర్యాలీ చేసింది. జనవరి 1న రూ.79,390 స్థాయి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.18,710 లాభపడింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,900 పెరిగి రూ.99,400కు చేరింది.‘‘బంగారం మళ్లీ భారీ ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌లో రూ.95,000 స్థాయిని చేరింది. సురక్షిత సాధనానికి ఉన్న బలమైన డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.భౌగోళిక అనిశ్చితులకుతోడు అమెరికా–చైనా మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు చల్లారనంత వరకు బంగారం ర్యాలీకి అవకాశాలున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 105 డాలర్లు పెరిగి 3,349 డాలర్ల సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది.

Mamata Banerjee launches attack on home ministry, BSF over Murshidabad7
అల్లర్ల కుట్రలో బీఎస్‌ఎఫ్, నిఘా సంస్థలు

కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో కొనసాగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనల వెనుక కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు భద్రతా బలగం(బీఎస్‌ఎఫ్‌), నిఘా వర్గాల హస్తముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం కోల్‌కతాలో ముస్లిం మతాధికారులతో సమావేశం సందర్భంగా మమత మాట్లాడారు. ‘‘ అరాచక, సమాఖ్య వ్యతిరేక వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని ప్రధాని మోదీ అమలుచేయొద్దు. దీని అమలు కొనసాగితే అది దేశాన్ని ముక్కలుచేస్తుంది. సొంత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి తప్పించాలి. ఓవైపు బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు రాజ్యమేలుతుంటే బీజేపీ సర్కార్‌ హడావుడిగా వక్ఫ్‌ చట్టం తెచ్చింది. బెంగాల్‌లో హింసకు కేంద్ర హోం శాఖ పథకరచన చేసింది. ఈ కుట్రలో బీఎస్‌ఎఫ్‌ పాత్రపై విచారణ జరిపించాలి. సరిహద్దును పరిరక్షించాల్సిన బాధ్యత బీఎస్‌ఎఫ్‌ది కాదా?. అంతర్జాతీయ సరిహద్దును మా(టీఎంసీ) ప్రభుత్వం పరిరక్షించదు. ఈ విషయంలో కేంద్రం తన బాధ్యతలను విస్మరించకూడదు. బెంగాల్‌ అల్లర్లలో మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తున్నా. సరిహద్దు దాటి బెంగాల్‌లోకి బంగ్లాదేశీయులు చొరబడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్న బీఎస్‌ఎఫ్‌ వైఖరిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా’’ అని మమత అన్నారు. ‘‘అమిత్‌ షా ఎన్నటికీ ప్రధాని కాలేరు. మోదీజీ ప్రధాని పీఠం నుంచి దిగిపోయాక అమిత్‌ షా ఏం చేస్తారు?. కేంద్ర నిఘా సంస్థలను అమిత్‌ షా దుర్వినియోగం చేస్తున్నారు. అమిత్‌ షా కార్యకలాపాలపై మోదీ ఓ కన్నేసి ఉంచాలి. మోదీ అమిత్‌కు అడ్డుకట్టవేయాల్సిందే’’ అని మమత అభ్యర్థించారు. స్థానిక కాంగ్రెస్‌ నిర్లక్ష్యమూ దాగి ఉందిఘర్షణల వెనుక టీఎంసీ ఉందన్న ఆరోపణలను మమత ఖండించారు. ‘‘ ఘర్షణలు జరిగిన ధులియాన్, షంషేర్‌గంజ్‌లు మాల్డా దక్షిణ్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్‌ నేత ఇషా ఖాన్‌ చౌదరి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ క్రియాశీలకంగా ఉంది. ఈ ఘర్షణల వెనుక నిజంగా టీఎంసీ ఉంటే మా ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు ఎందుకు దాడులు చేస్తారు?. మా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? అని మమత ఎదురు ప్రశ్నించారు. ముస్లిం మతాధికారులు వక్ఫ్‌ అంశంలో నేరుగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలను కలిసి తమ ఆందోళనను తెలియజేయాలి. వక్ఫ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి తుదికంటా పోరాడుతుంది’’ అని అన్నారు.ఆయన యోగి కాదు భోగితనపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మమత ప్రతివిమర్శలు చేశారు. ‘‘యోగి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన యోగి కాదు పెద్ద భోగి. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?. మీ రాష్ట్రంలో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లలో ఎంత మందిని చంపేశారు?. రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను కూడా యోగి అనుమతించట్లేదు. బెంగాల్‌లో మాత్రం ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు’’ అని అన్నారు. హిందువులను బాధితులుగా మారుస్తున్న మమత సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ విమర్శించింది.

Interesting Twist In UP Woman And Daughter Fiance Episode8
కాబోయే అల్లుడితో అత్త జంప్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఎందుకిలా చేసిందంటే..

లక్నో: తన కూతురికి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకున్న పరారీ అయిన అత్త ఘటన వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని సప్న తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. మరోవైపు.. తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కునవేలేసుకున్నారు.అయితే, తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. ఈ తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే, తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది.మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.Aligarh's absconding 'mother-in-law and son-in-law' were caught, what did the mother-in-law say, watch the video#Aligarh #Nepalborder #Bihar #saas #damad #Breaking #Lateat pic.twitter.com/yTOu6qXwig— Indian Observer (@ag_Journalist) April 16, 2025

Delhi Capitals beat Rajasthan Royals in thrilling match 9
ఢిల్లీ ‘సూపర్‌’ విక్టరీ

న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌... ఆఖరికి ‘సూపర్‌ ఓవర్‌’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ పొరెల్‌ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... కేఎల్‌ రాహుల్‌ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్‌ (18 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్‌ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్‌ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్‌ జురెల్‌ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (15 నాటౌట్‌; 1 ఫోర్‌) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్‌ ఓవర్‌’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెక్‌గుర్క్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆర్చర్‌ 9; పొరెల్‌ (సి) పరాగ్‌ (బి) హసరంగ 49; కరుణ్‌ (రనౌట్‌) 0; రాహుల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) ఆర్చర్‌ 38; స్టబ్స్‌ (నాటౌట్‌) 34; అక్షర్‌ (సి) జురెల్‌ (బి) తీక్షణ 34; అశుతోష్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–32–2; తుషార్‌ 3–0–38–0; సందీప్‌ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్‌ 1–0–6–0. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 51; సామ్సన్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 31; పరాగ్‌ (బి) అక్షర్‌ 8; నితీశ్‌ రాణా (ఎల్బీ) స్టార్క్‌ 51; జురేల్‌ (రనౌట్‌) 26; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–36–1; ముకేశ్‌ 3–0–31–0; మోహిత్‌ 4–0– 38–0; విప్రాజ్‌ 1–0–13–0; అక్షర్‌ 3–0–23–1; కుల్దీప్‌ 4–0–33–1; స్టబ్స్‌ 1–0–12–0. సూపర్‌ ఓవర్‌ సాగిందిలా...సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ తరఫున బౌలింగ్‌ చేసిన స్టార్క్‌... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్‌ ఫోర్‌ కొట్టాడు. మూడో బంతికి సింగిల్‌ రాగా... నాలుగో బంతికి పరాగ్‌ ఫోర్‌ కొట్టాడు. ఆ బంతి నోబాల్‌ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్‌ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్‌ రనౌటవడంతో రాయల్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్‌... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్‌ రాగా... నాలుగో బంతికి స్టబ్స్‌ సిక్స్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్‌లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sakshi Editorial On Harvard University10
హార్వర్డ్‌ ప్రతిఘటనా స్వరం!

అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది. అది తెలిసి కూడా హార్వర్డ్‌ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్‌ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్‌ నిర్భయంగా నిలబడింది. ‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్‌ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్‌ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్‌ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది. ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్‌) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.కానీ ట్రంప్‌ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది. మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది. ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్‌ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్‌ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement