Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Act Supreme Court hearing LIVE updates1
వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్‌ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి

Ysrcp Leader Malladi Vishnu Fires On Chandrababu2
వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్‌ డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్‌ జగన్‌పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Trump administration announced new tariff on Chinese imports3
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు

చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్‌ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్‌ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్‌ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్‌టైల్‌ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

Panchvati Express Becomes Indias First Train With ATM4
జర్నీ చేస్తూ కూడా నగదు పొందొచ్చు..! ఎలాగంటే..

ప్రస్తుతం ప్రజలంతా నగదు రహిత లావాదేవీలే చేస్తున్నారు. డిటిటల్‌ పేమెంట్లకు అలవాటుపడ్డారు కూడా. ఇది వరకటిలా నగదు కోసం బ్యాంక్‌ల వద్ద బార్లు తీరాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే వీధికో ఏటీఏం ఉండటంతో క్షణాల్లో పనైపోతుంది. ఈ సదుపాయం బస్సు, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఉంది. కానీ జర్నీ చేస్తున్నప్పుడూ..ముఖ్యంగా లాంగ్‌ జర్నీ చేసే సమయంలో నగదు పొందాలంటే మాత్రం కష్టమే. ఆయా స్టేషన్‌లలో ఆగితేగానీ సాధ్యం కాదు. అయితే ఆ ఇబ్బంది కూడా లేకుండా జర్నీ టైంలో కూడా ఈజీగా డబ్బుని పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. ఆ సౌకర్యాన్ని అందిస్తోంది ఇండియన్ రైల్వే సంస్థ. ఏ రైలులో ప్రారంభించారంటే.. ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్‌ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (INFRIS)లో భాగంగా ఈ సదుపాయన్ని అందిస్తోంది. రైలు కదులుతున్నప్పుడూ ప్రయాణికులు నగుదు పొందేలా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని పంచవటి ఎక్స్‌ప్రెస్ ఎయిర్ కండిషన్డ్‌ కోచ్‌లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది భారతదేశంలోనే తొలి ఏటీఎం రైలుగా మారింది. అది ఎలా పనిచేస్తుందనే ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతమైంది. ఈ ఏటీఎం నుంచి రైలు కదులుతున్నప్పుడూ నగదు పొందే వెసులుబాటు ఉంది. ఇదంతా ఇండియన్ రైల్వేస్ భూసావల్ డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో విజయవంతమైనట్లు రైల్వే అదికారుల తెలిపారు. ఈ సరికొత్త రైల్వే ఏటీఎం జర్నీ అంతటా సజావుగానే పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఇగత్పురి, కసారా ​​ప్రాంతాల మధ్య సొరంగాలు, తగిన నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండదు కాబట్టి ఆప్రాంతాల్లో నగదు పొందడం కాస్త సమస్యాత్మకంగా ఉండొచ్చని అన్నారు. అలాగే యంత్రం పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంటామని అన్నారు భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పాండే. తాము ఈ ఆలోచనను INFRIS సమావేశంలో ప్రతిపాదించామని అన్నారు. ఆ తర్వాత అదెలా కార్యరూపంలోకి తీసుకురావాలనే దానిపై తమ బృందం పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏటీఎం పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని 22 కోచ్‌ల ప్రయాణికులకు మాత్రమే కాదు ముంబై-హింగోలి జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు కూడా అందుబాటులో ఉంటుందట. ఎందుకంటే ఈ రైలు ఒక బోగిని పంచవటి ఎక్సప్రెస్‌ పంచుకుంటుందట. అలాగే ఈ ఏటీఎం భద్రతను నిర్థారించేలా ప్రత్యేక షట్టర్ సిస్టమ్‌ తోపాటు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ తదితరాలు ఉంటాయన్నారు. అయితే ప్రయాణికులు ఈ సేవను ఆదరిస్తే గనుక త్వరలో మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించే అవకాశం ఉంటుందని రైల్వే అదికారులు వెల్లడించారు. (చదవండి: టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్‌గా పైలట్‌ అనౌన్స్‌మెంట్‌)

What Congress and RJD Discussed At Key Meet Ahead Of Bihar Polls5
ముందే జాగ్ర‌త్త ప‌డుతున్న యువ‌నేత‌

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న బిహార్‌ శాసనసభ ఎన్నికలపై విపక్షాల ‘ఇండియా’ కూటమి ఇప్పటికే తమ వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. జనతాదళ్‌(యూ) నేతృత్వంలోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న కసితో ఉన్న రాష్ట్రీయ‌ జనతాదళ్‌(ఆర్‌జేడీ) తన మిత్రపక్షాలనైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో తొలిదశ చర్చలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు బిహార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేష్‌ కుమార్, ఆర్జేడీ నాయకులు మనోజ్‌ ఝా, సంజయ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో పొత్తులు, సీట్ల పంపకాలు, ఎన్నికల అజెండా తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారమే లక్ష్యంగా.. గత 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ–జేడీయూలు ఎన్డీఏ కూటమిగా, ఆర్‌జేడీ–కాంగ్రెస్‌లు మహాఘట్‌బంధన్‌ కూటమిగా బరిలో దిగాయి. 243 స్థానాలున్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలను కైవలం చేసుకుంది. మహాఘట్‌బంధన్‌ కూటమి 110 స్థానాలను దక్కించుకుంది. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) 2022లో బీజేపీతో విభేదించి మహాఘట్‌బంధన్‌లో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం మళ్లీ 2024లో మహాఘట్‌బంధన్‌తో బంధం తెంచుకుని తిరిగి బీజేపీ చెంతనచేరారు. కమలదళం దన్నుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తాను కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమిలో చేరి అతిపెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోనని వ్యాఖ్యానించారు. నితీశ్‌ అంత మోసకారి మరొకరు లేరని, ఆయన విశ్వాస ఘాతకుడంటూ కాంగ్రెస్, ఆర్‌జేడీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. నితీశ్‌ అవకాశ వాదానికి గట్టిగా బదులివ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న రెండు పార్టీలు ఆయన్ను బలంగా ఢీకొట్టాలని భావిస్తున్నాయి. చ‌ద‌వండి: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లుప్రస్తుతం అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ బీజేపీకి 78, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్‌జేడీకి 75, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70 స్థానాల్లో పోటీ చేయగా, ఈసారి దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఆర్‌జేడీ గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ పడగా, ఈ సారి 150కి పైగా స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతోంది. మిత్రపక్షాలైన లెఫ్ట్‌ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంసిద్ధతను మొదలుపెట్టి సీట్ల పంపకాలు, ఎన్నికల ప్రచార అంశాలపై ఆర్జేడీ తొలి దశ చర్చలకు శ్రీకారం చుట్టింది. నితీశ్‌ను బీజేపీ హైజాక్‌ చేసిందన్న తేజస్వి ఈ భేటీ అనంతరం తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, ఏప్రిల్‌ 17న పట్నాలో కాంగ్రెస్‌ నాయకులతో జరిగే తదుపరి సమావేశంలో మరిన్ని వివరాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను బీజేపీ హైజాక్‌ చేసిందని, ఎన్‌డీఏ పాలనలో ఎటువంటి అర్థవంతమైన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో కూడిన మహాఘటబంధన్‌ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ చర్చించి ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఊహాగానాలకు తావివ్వరాదని అన్నారు.

China issues over 85k visas to Indians in 2025 amid push to boost bilateral exchanges6
గుడ్‌ న్యూస్‌ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు

ఆంక్షలు, టారిఫ్‌లు అంటూ ప్రపంచ దేశాలను ముఖ్యంగా చైనాకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో చైనా ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో తాజాగా చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు, భార‌తీయులకు 85 వేల వీసాల‌(China Visas)ను జారీ చేసిన‌ట్లు చెప్పింది. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది.ఇండియా-చైనా దేశాల మ‌ధ్య ఏర్పడుతున్న దృఢ‌మైన బంధానికి ఇది నిదర్ణమని స్పష్టం చేసింది. చైనాకు వస్తున్నన్న 85 వేల ఇండియ‌న్ల‌కు వీసాలు ఇచ్చిన‌ట్లు జూ ఫీహంగ్ తెలిపారు. తమన దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భార‌తీయ మిత్రులను కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్‌, చైనా మ‌ద్య ట్రావెల్‌ను ఈజీ చేసేందుకు అనేక స‌దుపాయాలు క‌ల్పించిన‌ట్లు చైనీస్ ప్ర‌భుత్వం చెప్పింది.చదవండి: అపుడు స్టార్ యాక్టర్‌.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!అంతేకాదు వీసాకోసం దరఖాస్తుదారులు ఇకపై ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవలసిన అవసరం లేదనీ, ఇప్పుడు పని దినాలలో వీసా కేంద్రాలలోకి నేరుగా తమ దరఖాస్తులను అందచేయ వచ్చని కూడా చైనా ప్రకటించింది. చాలా త‌క్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బ‌యోమెట్రిక్ డేటాను స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదు. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌కే చైనా వీసాను అందిస్తున్న‌ట్లు చెప్పారు. కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సాంస్కృతిక, వ్యాపార విద్యా సంబంధాలను విస్తృతం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!

Tollywood Hero Raj Tarun and Lavanya Issue In Tollywood7
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్‌ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్‌ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

Ysrcp Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson8
ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Zaheer Khan Sagarika Ghatge Blessed with baby boy Reveals Name Pic Viral9
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్‌ ఖాన్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్‌ దంపతులు బుధవారం సోషల్‌ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్‌ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేయగా.. జహీర్‌- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, కేఎల్‌ రాహుల్‌ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్‌ సింబల్‌తో విషెస్‌ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్‌ ఖాన్‌.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్‌ ఖాన్‌.. లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్‌లో కొనసాగిన జహీర్‌ ఖాన్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్‌ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి

National Herald Case BJP Slams Gandhi Family Congress Counter10
National Herald: సోనియా, రాహుల్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్‌ కౌంటర్‌

ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్‌ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్ ప్రసాద్.నేషనల్‌ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్‌ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్‌ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్‌ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌’ (ఏజేఎల్‌)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.మరోవైపు.. రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పవన్‌ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement