
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ను మంగళవారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం సీఐడీ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం రీజనల్ సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు. ఐపీసీ 50బి, 5బి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.