Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting1
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రనజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ చేస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులును అరెస్ట్‌ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల పట​ ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్‌ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్‌ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్‌ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్‌ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్‌ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్‌ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

Telangana Intermediate 2025 Results Direct Link Click Here2
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్‌తో క్షణాల్లో రిజల్ట్స్‌ ఇలా..

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. జస్ట్‌ ఒకే ఒక్క క్లిక్‌తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.గతం కన్నా మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని మంత్రి భట్టి తెలిపారు. పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారయన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్‌ సెకండర్‌ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి అడ్వాన​్స్‌డ్‌ పరీక్షలు ఉండనున్నాయి. రీకౌంటింగ్‌, వెరిఫికేషన్‌కు వారం గడువు ఇచ్చింది ఇంటర్‌ బోర్డు.

IPL 2025: KL Rahul, Kuldeep Yadav Eyes On Huge Milestone In Today's LSG, DC Clash3
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్‌, కుల్దీప్‌

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 22) ఓ రసవత్తర మ్యాచ్‌ జరుగనుంది. టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ లక్నో సొంత మైదానమైన అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ క్రికెట్‌ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 51 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్‌ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.రాహుల్‌కు ముందు విరాట్‌ కోహ్లి (8326), రోహిత్‌ శర్మ (6786), శిఖర్‌ ధవన్‌ (6769), డేవిడ్‌ వార్నర్‌ (6565), సురేశ్‌ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్‌ (5162) ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్‌ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ చైనామన్‌ బౌలర్‌ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో ఓ వికెట్‌ తీస్తే.. ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. చహల్‌ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో చహల్‌ మినహా మరే బౌలర్‌ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్‌-5లో పియూశ్‌ చావ్లా (192), భువనేశ్వర్‌ కుమార్‌ (189), సునీల్‌ నరైన్‌(187), రవిచంద్రన్‌ అశ్విన్‌ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్‌లో రాహుల్‌, కుల్దీప్‌ల ఫామ్‌ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో రాహుల్‌ 6 మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అశుతోష్‌ శర్మ (66 నాటౌట్‌), విప్రాజ్‌ నిగమ్‌ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అశుతోష్‌ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్‌తో లక్నో ఎక్స్‌ప్రెస్‌ మయాంక్‌ యాదవ్‌ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో లక్నో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్‌ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా

vizianagaram Student Slap Lecturer With Slipper Video Viral4
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని

విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్‌ అడ్డుకుని ఫోన్‌ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్‌ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్‌ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్‌ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్‌ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్‌ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025

Bachao Karreguttalu: CRPF Huge Operation at Mulugu April 22nd 2025 Updates5
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్‌.. భారీ ఎన్‌కౌంటర్‌!

ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Alternative Investments of Gold in India6
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..

భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..రియల్ ఎస్టేట్బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.గోల్డ్ ఈటీఎఫ్‌లు & సావరిన్ గోల్డ్ బాండ్‌లుబంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటుస్టాక్‌లు & మ్యూచువల్ ఫండ్‌లుబ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఫిక్స్‌డ్ డిపాజిట్లు & బాండ్లుకార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.డిజిటల్ గోల్డ్ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు.

Actor Saif Ali Khan buys second home in Qatar7
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్‌ అలీఖాన్‌, కారణం ఏంటో తెలుసా?

విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్‌ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్‌ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో,పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్‌లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్‌ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్‌.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్‌ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్‌, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్‌ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్‌ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్‌ ఎస్‌ క్లాస్‌కు చెందిన ఎస్‌350డీ, ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 110, ఆడీ క్యూ7, జీప్‌ రాంగ్లర్‌ వింటికి సైఫ్‌ కార్లు. పర్ఫ్యూమ్స్‌, ఫుట్‌వేర్‌, హోమ్‌ డెకార్‌ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్‌ రెమ్యూనరేషన్‌ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్‌ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు.

Kommineni Comments On Chandrababu False Allegations8
చంద్రబాబు.. మరీ ఇంతగానా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్‌ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్‌ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్‌ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్‌, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్‌, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్‌ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్‌ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్‌ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్‌ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Ex Karnataka DGP Case: Wife Internet Searches Reveal Disturbing Details9
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..

బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్‌ కొడుకు కార్తీక్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్‌ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్‌ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్‌ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్‌ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్‌ తనయుడు కార్తీక్‌ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

ED Notice Issued To Actor Mahesh Babu10
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు(Mahesh Babu) కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గతవారంలో రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్‌, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్‌ ప్రచార కర్తగా వ్యవహరించారు. వీటి ప్రచారానికి గానూ ఆయన భారీగా పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్‌కు చేసిన ప్రచారానికిగానూ రూ.5.9 కోట్లు మహేష్‌ అందుకున్నారు. ఈ ప్రమోషన్‌ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్‌ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత 27వ తేదీన ఆయన్ని విచారణకు ఈడీ నోటీసులు పంపింది. అయితే.. ఆరోజు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఆ మరుసటిరోజు (28వ తేదీన) ఉదయం 11గం. విచారణకు రావాలని కోరింది. సంబంధిత గ్రూపులతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement