కృష్ణా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ వెల్లడించారు.
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ వెల్లడించారు. పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్కు నీళ్లు చేరుతాయని అన్నారు.
ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంఘమం వరకు పుష్కర శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పుష్కరాలలో రోజుకు 11 లక్షల మందికి ఉచిత భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలలో లక్షమంది ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని రాజశేఖర్ పేర్కొన్నారు.