తెలంగాణ రాష్ట్రానికి ఏ పని కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే సీఎం కేసీఆర్ అహంకారం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందని...
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఏ పని కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే సీఎం కేసీఆర్ అహంకారం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందని నెహ్రూ యువకేంద్రం ఆల్ ఇండియా వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటి వరకు ప్రధానిని రాష్ట్రానికి పిలువకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. రాజులు, జమీందారి పాలన ముసుగు నుంచి కేసీఆర్ బయటకు రావాలని సూచించారు.
శనివారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో చంద్రశేఖర్‌రావు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల బడ్జెట్‌ను రైతులు, పేదలు, మధ్యతరగతి వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో 50 శాతం పంట నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చేవారని, ఇప్పుడు 30 శాతం పంటనష్ట పోయినా పరిహారం అందుతోందన్నారు.