
బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు
సాక్షి, ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. అంతే కాకుండా కేసీఆర్ సొంత జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఫసల్ భీమా యోజన, ఇన్ పుట్ సబ్సిడీ పధకాలను సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ రైతు జపం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై రైతులు తిరగబడటం ఖాయమని.. 2019 లో కేసీఆర్‌కు రైతులు బుద్ధి చెబుతారన్నారు.