ఆలయంలో దొంగలు పడి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఆలయంలో దొంగలు పడి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక శివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు హుండీలను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ. 60 వేలను ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినయ్ విచారణ చేపడుతున్నారు.