ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం విష్ణు సినిమా థియేటర్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం విష్ణు సినిమా థియేటర్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్టివాను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య(50) అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.