కొండ చిలువ, నాగుపాముల భీకర పోరు | King cobra, python deadliest fought | Sakshi

కొండ చిలువ, నాగుపాముల భీకర పోరు

Published Thu, Feb 8 2018 11:59 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

King cobra, python deadliest fought - Sakshi

కొండ చిలువ ఎంత పెద్ద‌గా ఉంటుందో తెలుసు క‌దా. దాన్ని చూస్తేనే మ‌న‌కు వ‌ణుకు పుడుతుంది. ఇక కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది క‌రిచిందంటే క్ష‌ణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది ఈ రెండిటి మధ్య హోరా హోరి పోరు జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. అయితే ఇటీవలే  కొండ చిలువకు నాగుపాముకు మధ్య జరిగిన భీకర పోరులో రెండు సర్పాలు మత్యుఒడికి చేరాయి.
 
కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ తన బలంతో నాగుపామును చుట్టి హత మారిస్తే, నాగుపాము తన చివరి క్షణాల్లో వేసిన కాటుకు కొండ చిలువ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే విషయంలో ఓ క్లారిటీ లేకపోయినా.. కచ్చితంగా ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement