Snake Bite
-
అమ్మా.. పాము కాటేసింది
కర్ణాటక: బహిర్భూమికి వెళ్లిన బాలున్ని పాము కాటు వేయడంతో చనిపోయిన సంఘటన జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. పవిష్ (4) మృతబాలుడు. ఆరేళ్ల కిందట గాయత్రిని తమిళనాడుకు చెందిన రమేష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించారు. గాయత్రి రెండవ కాన్పు కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. సోమవారం పవిష్ బహిర్భూమి కోసం ఇంటి పక్కన స్థలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏదో పాము చిన్నారిని కరిచింది. వెంటనే బాలుడు వచ్చి నన్ను పాము కొరికింది అని తల్లికి చెప్పాడు. కానీ వారు ఊరికే అలా చెబుతున్నాడని పట్టించుకోలేదు. అర్ధగంట తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు. -
అమ్మో... కాటు!.. 600 మంది మృతి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది. పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతివైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలుపాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
పార్వతీపురం మన్యం: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్‌ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటరీ్మడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. నీలగిరి తోటలు దగ్ధంవేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్‌స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
పెద్దాపూర్ గురుకులంలో మరో విద్యార్థికి పాముకాటు
కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు మరోసారి కలకలం రేపింది. 3 నెలల క్రితం వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురికాగా, అందులో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమి దో తర గతి చదు వుతున్న మెట్పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ రవి–రుచిత దంపతుల కుమా రుడు అఖిల్ (14) పాము కాటుకు గుర య్యాడు. బుధవారం ఉదయం ఆరుగంటల సమయంలో అఖిల్ తన చేయి తిమ్మిరిగా ఉందని విధుల్లో ఉన్న నర్స్‌కు చూపించు కు న్నాడు. పరిశీలించిన నర్స్ ఏమీ కాలే దని సర్దిచెప్పింది. 9 గంటల సమయంలో అఖిల్ చేయి పూర్తిగా చతికిలపడటంతో వెంటనే ప్రిన్సిపాల్ మాధ వీలత దృష్టికి తీసు కెళ్లారు. చేతిపై పాముకాటు గాట్లు ఉండటంతో తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. అఖిల్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్ కోచ్‌లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్‌లో అధికారులు రైలును నిలిపివేసి, బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన 30 ఏళ్ల భగవాన్‌దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్‌లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్‌దాస్‌ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ మార్క్.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలి
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. -
Snake bite: ఇంటి పామే కాటు వేసింది!
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెకు చెందిన అరుగుల గంగమ్మ (65)మంగళవారం పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాముల పుట్ట ఉంది. పలుమార్లు పుట్టలోంచి బయటకు వచ్చిన పాము పరిసరాల్లో సంచరిస్తూ ఉండేది. సోమవారం ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పుట్టవద్ద శుభ్రం చేస్తుండగా నాగుపాము బయటకు వచ్చి వృద్ధురాలిని కాటువేసింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమార్తె రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. -
India: పాముకాటుతో ఏటా 50 వేల మంది మృతి.. ప్రపంచంలోనే అత్యధికం
న్యూఢిల్లీ: భారత్‌లో పాము కాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బిహార్ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’అని పేర్కొన్నారు. అదే విధంగా బిహార్ చాలా పేద రాష్ట్రమని, పేదరికంతోపాటు సహజంగా వాతారవణ మార్పులు సైతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారుమరోవైపు వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ .. బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలని కేంద్రాన్ని కోరారు. -
విషమంగానే ‘నాగరాజు’ పరిస్థితి
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు. పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. … pic.twitter.com/cV7yv0iQ2v— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024 -
Snake Bite: 40 రోజుల్లో ఏడుసార్లు పాముకాటు
ఉత్తరప్రదేశ్: ఫతేపూర్ జిల్లాలో నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడో యువకుడు. ఇంకా రెండు సార్లు సైతం పాము తనను కాటు వేస్తుందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే యువకుణ్ని 40 రోజుల వ్యవధిలోనే వేర్వేరు పాములు ఏడుసార్లు కాటు వేశాయి.ప్రస్తుతం వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 12 నుంచి 14 గంటల్లో వికాస్ స్పృహలోకి రాకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యుడు జవహర్ లాల్ తెలిపారు. ఆరోసారి పాము కాటుకు గురైన సమయంలో వికాస్ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు. అతడికి ఓ కల వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కలలో తనను ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వివరించాడు. ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతి సారి ఆడ పాము కాటు వేస్తోందని అది కూడా శని లేదా ఆదివారాల్లో మాత్రమే ఇలా జరుగుతోందని చెప్పాడు. వరుస పాము కాటుల నేపథ్యంలో వికాస్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వికాస్ దూబే చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.సబౌర్‌లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
ఇద్దరు బాలికలకు పాముకాటు..
మహబూబ్‌నగర్: వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలను పాముకాటు వేయగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం ఖిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్య సిబ్బంది పాముకాటు మందులు, అంబులెన్స్ లేవు అని చెప్పడంతో చావుబతుకుల మధ్య బాలికను ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు తరలించారు.ఈ ఘటనలు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఆయా కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన ముడావత్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి రోజులానే ఇంట్లో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కూతురు ఇందు (10)ను ఓ పాము కాటు వేసింది.వెంటనే నిద్రలేచిన ఇందు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇళ్లంతా వెతకగా కట్లపాము కనిపించింది. దానిని చంపి పాపను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.షాపురం ఊరంచు తండాలో..ఇదిలాఉండగా, మండలంలోని షాపురం ఊరంచు తండాకు చెందిన రెడ్యానాయక్ కూతురు లలిత తిమ్మాజిపేట గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తండాకు వచ్చిన లలిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. పొలంలో నడుస్తున్న క్రమంలో ఓ పాము బాలిక లలితను కాటువేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. కాట్లు గుర్తించి చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పాముకాటుతో బాలుడి దుర్మరణం
రాయగడ: నిద్రస్తున్న సమయంలో ఒక పాము కాటు వేయడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి గొంటిఖాల్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన రబి సరక కొడుకు వివేక్ సరకగా గుర్తించారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఆరుబయట పడుకున్న వివేక్‌కు పొదల నుంచి వచ్చిన ఒక పాము కాటు వేసింది. దీంతో ఏడ్చిన వివేక్‌ను చూసిన తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిశీలించగా, ఒక పాము అటువైపుగా వెళ్తుండడం గమనించి వెంటనే చికిత్స కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కాటువేసిన పామును గ్రామస్తులు కొట్టి చంపారు. -
కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. -
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్‌లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్‌ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏ పాము కరిచిందని అడుగుతారని..
రాయపర్తి(వరంగల్): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వృద్ధురాలు మేరుగు ఎల్లమ్మ వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.దీంతో ఆమె కేకలువేయడంతో రమేశ్ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
పాముకాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
తాండూరు రూరల్: పాముకాటుతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఓగిపూర్ సమీపంలోని నాపరాతి క్వారీల వద్ద నివాసముంటున్నారు. అక్కడే పాలిషింగ్ యూనిట్లో కార్మికుడిగా పని చేస్తున్నారు. రవి కూతురు పూజ(16), జినుగుర్తి సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది.సెలవులు ఉండటంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి 1 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పూజ కుడికాలును పాము కాటేసింది. వెంటనే పూజ ఆరవడంతో తల్లిదండ్రులు లేచి చూడగా పాము కనిపించింది. పూజను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూజ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
snake bite: పట్టిన పామే కాటేసింది
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని బిబి రోడ్డులో ఓ కారులో పాము దూరింది అని కాల్ చేయడంతో పాముల నిపుణుడు పృథ్వీరాజ్ వచ్చి పట్టుకొన్నాడు, ఈ సమయంలో ఏమరుపాటుగా ఉండగా పాము కాటేసింది. కారులో పాము దూరిందని తెలిసి ఆయన వచ్చారు. పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసి బైక్‌లో సంచి కోసం వెతకసాగారు. ఈ సమయంలో జన సందోహం చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా పాము గిరుక్కున తిరిగి పృథి్వరాజ్ను తొడ పట్టుకుంది. కష్టమ్మీద పామును విడిపించి, దానిని సంచిలో వేశారు. కాగా, ఇది ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిసింది. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. -
పాముకాటుతో యువతి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీ డబలగూడ గ్రామంలో ఒక యువతి పాముకాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి గ్రామంలో రాందాస్ హంతాల్ కుమార్తె షకీల(20) ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో తనను ఏదో జంతువు కాటువేసినట్లు తెలియడంతో పెద్దగా కేకలు వేస్తూ లేచింది. వెంటనే చుట్టుపక్కల చూడగా ఒకపాము పక్కనే ఉన్నటువంటి గోతిలోకి వెళ్లడం గమనించారు. దీంతో హుటాహుటిన జోడాంబ్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జోడాంబ్ పోలీసులు కేసు నమోద్ చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి శనివారం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
అసలేంటి ఈ స్నేక్ వెనమ్: సెలబ్రిటీలకు అంత మోజు ఎందుకు?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్‌గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్‌లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం! ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్‌గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్‌లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది? కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. -
షూటింగ్ సమయంలో నిజంగానే పాము కరిచింది: ప్రేమ
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా, వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై నేటికి(మార్చి 12, 1999న రిలీజ్) సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి. రిస్క్ చేసి మరి ‘దేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సీన్ సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయించేవాడు. ఓక్కో సీన్‌కి 50 టేకులపైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు. గెటప్ వేశాక నా హావభావాలు ఆటోమెటిక్‌గా మారిపోయేవి. టీమ్ అంతా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. షూటింగ్ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా బతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్‌ని నిలిపివేశాం. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూటింగ్ చేయడం సవాల్‌గా మారింది. సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీలయ్యాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్లో ‘దేవి’ స్పెషల్ మూవీ’ అని ప్రేమ చెప్పుకొచ్చింది. 25 years for Blockbuster #Devi 🔥🔥 A supernatural phenomenon film which attracted the audience to theaters for a long time. 🙌 Directed by #KodiRamakrishna Produced by @MSRajuOfficial A Rockstar @ThisIsDSP musical 🎶#Prema #Shiju @Actor_Mahendran #25YearsForDevi pic.twitter.com/Xr6V5BKl0J — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 12, 2024 -
పాముకాటుతో బాలిక మృతి
వాంకిడి(ఆసిఫాబాద్): పదేళ్ల బాలికకు పాముకాటుతో నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన శుక్రవారం కుమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండల కేంద్రంలోని మజీద్‌వాడలో నివాసం ఉంటున్న బావునె సునీత, విలాస్ దంపతులకు కుమారుడు, కుమార్తె కల్పన(10) ఉన్నారు. కల్పన స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. శుక్రవారం విలాస్ చౌపన్‌గూడకు పని కోసం వెళ్లగా, తల్లితో కలిసి బాలిక ఇంట్లోనే ఉంది. బెడ్‌పై పడుకుని ఇంటి గోడ సెల్ఫ్‌లపై కాళ్లు పెట్టి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ విషసర్పం కల్పన ఎడమ కాలు బొటన వేలి కింద కాటేసింది. దీంతో కాలును గట్టిగా కదపడంతో బెడ్ బలంగా తాకి తీవ్ర రక్తస్రావమైంది. ఇంట్లోనే ఉన్న తల్లి గమనించినా కాలుపై రక్తం ఎక్కువగా ఉండటంతో పాముకాటు పసిగట్టలేకపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అనంతరం ఆసిఫాబాద్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్పన తండ్రి విలాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాముకాటుతోవ్యక్తి మృతి.. ఇంకా..
హన్వాడ: పాముకాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం మండలంలోని వేపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొత్త చెన్నయ్య (45) మూడురోజుల కిందట రోజులాగే పొలానికి వెళ్లగా గట్టుపై పాము కాటువేసింది. వెంటనే కుటుంబసభ్యులు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూర్‌లోని నాటువైద్యుడికి చూపించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కొత్త చెన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలోమరొకరు.. గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తెలుగు కృష్ణ (48) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే దౌదర్‌పల్లికాలనీకి చెందిన వెంకటలక్ష్మితో 25ఏళ్ల క్రితం వివాహమైంది. ఇరువురి మధ్య కొన్నేళ్ల క్రితమే కుటుంబ సమస్యల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో కృష్ణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లోకి వెళ్లి కృష్ణ ఆదివారం ఉదయం 10గంటలైన బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికిలో నుంచి చూడగా ఉరేసుకుని ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మందిపల్లిలో యువకుడు.. మరికల్: పెళ్లి జరిగిన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన విష్ణువర్ధన్(30)కు ఆరు నెలల కిందట వివాహమైంది. రెండు రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరే ముందు, గొర్రెల వద్దకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆదివారం సొంత పొలం వద్దకు వెళ్లిన తండ్రికి నీటి గుంత గట్టుపై కుమారుడి దుస్తులు, చెప్పులు, ఫోన్ కనిపించింది. ఆయన నీటి గుంతలో పరిశీలించగా.. కుమారుడి మృతదేహం కనిపించింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. రైలు కిందపడి మహిళ ఆత్మహత్య మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని మహిళ(35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
పాన్‌గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది. మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పాము కాటుతో మహిళ మృతి నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..! -
పుట్టలో పాలుపోసి వచ్చాక.. ఇలా జరగడంతో.. భయాందోళనలో స్థానికులు!
సాక్షి, కరీంనగర్: నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులను సల్లంగా చూడాలని వేడుకుంది. నాగదేవతకు పూజలుచేసింది. ఆ రాత్రే ఆమె అనూహ్యంగా పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొడ్డెల భారతి(40) శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో కింద వేసుకున్న దుప్పట్లలో దూరిన పాము భారతినికాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా ఉండడంతో నిద్రలేచేసరికి పాము కనిపించిందని, శరరంపై గాట్లు కూడా ఉండడంతో వెంటనే స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. గోదావరిఖనికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించిన సదరు మహిళ.. పాముకాటుకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా.. -
అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది. సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది. నాగ్‌పుర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్‌లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది. నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు. చంద్రయాన్ 3 విజయం భారత్‌కు గర్వకారణం అని అన్నారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..
సాక్షి, మహబూబాబాద్: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని.. -
పాముకాటుతో కాంగ్రెస్ నాయకురాలి మృతి
అనంతపురం: పాముకాటుతో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ (50) శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. జానకమ్మ కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి దేవాల యం వద్ద పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తోంది. వారి కుటుంబం సభ్యులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువజామున జానకమ్మను పాము కాటేయడంతో గమనించిన భర్త ఆంజనేయులు పామును చంపేశాడు. తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. వైద్య సిబ్బంది సూచన మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానకమ్మ సాయంత్రం మృతి చెందింది. -
పాముకాటుతో అటెండర్ మానస మృతి
వరంగల్ :పాముకాటుతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బండి మానస (30) నర్సంపేట మిషన్‌భగీరథ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన సాయంత్రం ఇంట్లో పని చేస్తున్న క్రమంలో మానసను పాము కాటు వేసింది. దీంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు. -
ఈ పాములు కరిస్తే సెకన్లలోనే ప్రాణం పోతుంది..
మార్కాపురం: పొలాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు కురవడంతో పాములు పుట్టల్లో నుంచి పొలాల్లోకి వచ్చి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలాంటి పాము వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప పొలాల్లోనే పాముల సంచారం అధికంగా ఉంది. వారం రోజుల క్రితం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామచంద్రాపురం రైతు పాముకాటుకు గురయ్యారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణానికి ప్రమాదం తప్పింది. హలో.. సార్.. పాము! పాముల్లో అత్యంత విషపూరితమైన పాముల్లో మొదటిది రక్తపింజర, రెండోది తాచు, మూడోది కట్ల పాము. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా రక్తపింజరలు సంచరిస్తుండటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యుడైన నిరంజన్ 20 రోజుల వ్యవధిలో 10 పాములను పట్టుకున్నారు. రామచంద్రాపురం, రాయవరం, కొండేపల్లి, నికరంపల్లి బడేఖాన్‌పేట, బుడ్డపల్లి, మాల్యవంతునిపాడు, సీతానాగులవరం తదితర గ్రామ పొలాల్లో పాములను గుర్తించిన రైతులు సకాలంలో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో బంధించి అటవీ ప్రాంతంలో వదిలారు. వీటిలో ఎక్కువగా రక్తపింజర, తాచు, కట్లపాములు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ ‘సాక్షి’కి వివరించారు. రక్తపింజర యమా డేంజర్ ఐదు అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే ప్రాణానికి ప్రమాదం. కాలుకు గురైన వారి శ్యాస వ్వవస్థ దెబ్బతినడంతోపాటు శరీరమంతా చెమటలు పడతాయి. రక్తపింజర విషం రక్తాన్ని వేగంగా పలుచన చేస్తుంది. తద్వారా గుండె బలహీనపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లోకి కొండచిలువలు మార్కాపురం ప్రాంతంలో కొండచిలువలు జనావాసాల మధ్యకు వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు పొలాల్లో రైతులను భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో 3 ప్రాంతాల్లో భారీ కొండచిలువలు పట్టుకుని అడవుల్లో వదిలేశారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి వస్తున్న కొండచిలువలు కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను భుజిస్తున్నాయి. భారీ కొండచిలువలు మనిషిని చుట్టేస్తే దాని పట్టు నుంచి బయటపడటం చాలా కష్టం -
పాములుంటాయ్..! జాగ్రత్త..!!
నిర్మల్: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాము కాటును ఇలా గుర్తించాలి.. పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఇవీ.. జాగ్రత్తలు పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్స ఇలా.. పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి. మందులు అందుబాటులో ఉంచాం అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -
బోడకాకరకాయలకు వెళ్లి.. పాముకాటుకు గురైన మహిళ !
మహబూబబాద్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగమణి (40) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మరో ఇద్దరు మహిళలతో కలిసి సమీప అడవిలోకి బోడకాకరకాయలకు వెళ్లింది. కాయలు కోస్తుండగా పాముకాటు వేసింది. ఇది గమనించి ఇద్దరు మహిళలు.. నాగమణిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ములుగు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని భర్త మల్లయ్య తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. -
తెలంగాణ: 200 ఏళ్లకు ఆ పాము దర్శనం
మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో బుధవారం అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు. ఆయన బయోలజి ఉపాధ్యాయు డు దేవిలాల్‌కు చెప్పడంతో వెళ్లి పామును పట్టుకుని ఫొటోలను సదాశివయ్యకు పంపించారు. పట్టుకున్న పాము అరుదైనదిగా గుర్తించారు. విషరహిత పాము కావటం వల్ల దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేయాలని సూచించటంతో దేవిలాల్ దానిని గుట్టపై ఉన్న అటవీప్రాంతంలో వదిలేశారు. సదాశివయ్య మాట్లాడుతూ నల్లటిరంగులో తెల్లటి పట్టీలు కలిగి అందంగా కనిపించే పామును శాసీ్త్రయంగా డ్రయోకలామస్ నింఫా అని పిలువబడే కోలుబ్రీడే కుటుంబానికి చెందినదిగా వివరించారు. 50సెం.మీ. వరకు పాము పొడవు అవుతుందన్నారు. ఈ పామును మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరు సమీపంలో 1803లో గుర్తించారని తెలిపారు. దీనిమెడపైన ఉన్న తెల్లని మచ్చ పెళ్లికూతురు మెడమీద ఉన్న ఓణిలా ఉండటం మూలాన వెల్లూర్ బ్రైడల్ స్నేక్ అని పిలుస్తారన్నారు. కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దీనిని గుర్తించినా ఇప్పటి వరకు పాముకు సంబంధించిన అనేక విషయాలు ప్రపంచానికి తెలియవన్నారు. ఎన్నిగుడ్లు పెడుతుంది, ఎన్ని రోజులకు పిల్లలుగా మారుతాయి, ప్రత్యుత్పత్తి వివరాలు తెలియవన్నారు. ఎలాంటి గోడలైనా సునాయాసంగా ఎక్కగలదని, ఎలుకలు, బల్లులు ప్రధాన ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
చల్లారని పాము పగ?.. 3 నెలల్లో తొమ్మిదిసార్లు కాటు!
కర్ణాటక: పాము పగ 12 ఏళ్లు అనే నానుడి ఉంది, అది నిజమో, అబద్ధమో తెలియదు కానీ ఒక సర్పం బాలున్ని పదే పదే కాటేస్తూనే ఉంది. వివరాలు.. కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమారు మూడు నెలల వ్యవధిలో 9 సార్లు కాటు వేసిందంటే అశ్చర్యం కలగకమానదు. జూలై 3న మొదటిసారిగా బాలున్ని నాగుపాము కాటు వేయడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందించారు. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన మూడు రోజులకే మళ్లీ పాము కరిచింది. ఇలా తొమ్మిదిసార్లు కాటు వేయగా ఆరుసార్లు ఆస్పత్రిలోను, మూడుసార్లు నాటు ఔషధంతో చికిత్సలు చేయించారు. చివరకు కుటుంబసభ్యులు పాముకు భయపడి సొంతూరు హలకర్ణి గ్రామం వదిలి వాడి అనే ఊరుకు వలసపోయారు. అక్కడ కూడా బాలున్ని పాము కాటు వేసింది. అయితే కరిచిన పాము తల్లిదండ్రులకు గానీ, స్థానికులకు గానీ కనిపించడం లేదని చెబుతున్నారు. -
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే.. చిన్న వయసులోనే!
మునగపాక : కుటుంబానికి పెద్దదిక్కుగా నిలుస్తాడని ఆశించిన కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. అందరితో సరదాగా ఉండే ఆ యువకుడు పాముకాటుకు గురై మృతి చెందాడు. దీంతో మూలపేటలో విషాదం అలముకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మూలపేటకు చెందిన మొల్లేటి పరమేష్–మాణిక్యం దంపతులకు ముగ్గురు కుమారులు. పరమేష్ ఇటుకబట్టీ నిర్వహిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. పరమేష్ పెద్ద కుమారుడు శంకర్ గణేష్(21) తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ట్రాక్టర్ నిర్వహణ చేస్తున్నాడు. సాయంత్రం ట్రాక్టర్‌కు డీజిల్ తీసుకువెళ్లే క్రమంలో తన బైక్‌పై గంగాలమ్మ తల్లి గుడి వరకు వెళ్లి అక్కడ బైక్‌ను వదిలేసి కొంతదూరం నడుచుకొని వెళ్లాడు. ఈ క్రమంలో గణేష్‌ను పాము కాటు వేసింది. డీజిల్ పట్టుకెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ తండ్రి పరమేష్ ఇతరులకు సమాచారం అందించారు. కుమారుడు గణేష్ ఫోన్ నంబరుకు ఎంత డయల్ చేసినా స్పందన రాకపోవడంతో బైక్ వదిలిన ప్రదేశం నుంచి కొంతదూరం వెళుతుండగా మార్గమధ్యంలో గణేష్ కిందపడి ఉండడాన్ని గమనించారు. అప్పటికే పాము కాటుకు గురై గణేష్ మృతిచెందడాన్ని గుర్తించి మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం గణేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గణేష్ అంత్యక్రియలు మూలపేటలో గురువారం మద్యాహ్నం జరిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి వెళ్లి పంచనామా వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. గణేష్ తండ్రి పరమేష్‌ను ఓదార్చారు. -
పాము కాటుతో మహిళా పోలీసు మృతి
శ్రీకాకుళం: మండలంలోని తర్లిపేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్)గా పనిచేస్తున్న తామాడ జ్యోతికుమారి (36) పాముకాటుతో మృతిచెందారు. సంత»ొ మ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన తామాడ జ్యోతికుమారి తన తండ్రి రిటైర్డ్ వీఆర్ఓ తామాడ రామారావు ఇంటిలో ఉంటున్నారు. శుక్రవారం బాత్రూమ్ నుంచి బయటకు వ స్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కు టుంబ సభ్యులు ఆమెను ఆటోపై కోట»ొ మ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా జ్యోతికుమారి మార్గం మధ్యలోనే మృతి చెందారు. ఆమెకు భర్త జయరాజ్, కుమారుడు రఘునాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై తర్లిపేట సచివాలయ సిబ్బంది వి.రమే‹Ù, డి.అప్పన్న, ఎం.మాధురి, టి.రాము, వై.సింహాద్రి, హెచ్.మహందాత, బి.భాను తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
పాముకాటుతో యువకుడి మృతి
హన్మకొండ: పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఇబ్ర హీంపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన దొరగొల్ల ఎల్లయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు మహేష్ (27), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు చేదోడువాడుగా ఉండే మహేష్ మంగళవారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. గ్రామ పెద్ద చెరువు కట్ట చివరన గొర్రెలను మేపుతుండగా మహేష్‌కు పాము కాటువేసింది. తనకు పాము కాటువేసినట్లు స్నేహితులకు ఫోన్ చేసి తెలిపాడు. ఘటనా స్థలిలోనే అస్వస్థతకు గురైన మహేష్‌ను స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. కాగా, అందరితో కలివిడిగా ఉండే మహేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పాముకాటుతో నర్సింగ్ విద్యార్థిని షఫీనా మృతి
వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎంపీ షేక్ యాకూబ్ కుమార్తె నర్సింగ్ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్‌తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్ వెంటనే మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్ యానాల గంగాధర్‌రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య, సత్యనారాయణ, సైదులు, రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. -
పాముకాటుకు తల్లీకొడుకుల బలి
ఒడిశా: జిల్లాలొని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీ సిపిలిజొల్ గ్రామంలో పాముకాటుతో తల్లీకుమారులు మృతిచెందారు. బృందాబిసి(32), ఆమె కొడుకు బిజయ్ బిసి (9) ఎప్పట్లాగే శుక్రవారం వారు రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో విష సర్పం ఇంటిలోకి ప్రవేశించి ముందుగా బిజయ్‌ను. పక్కనే ఉన్న బృందాను కాటువేసింది. మెలకువ తెచ్చుకున్న బృందా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. పాము కాటువేసినట్టు గమనించి చంద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబంలొ ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
పాముకాటుకు గురైన రైతు మృతి
శ్రీ సత్యసాయి: పాముకాటుకు గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సుద్దకుంటపల్లి తండాకు చెందిన నాగేశ్‌నాయక్(40) తన పొలంలో వేరుశనగ పంట సాగు చేస్తున్నాడు. భార్య సాలమ్మతో కలసి సోమవారం పంటకు నీరందించేందుకు వెళ్లాడు. స్ప్రింక్లర్ పైపులు మార్చుతున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లగా, అక్కడి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమారులు నితిన్‌నాయక్, నిరంజన్ నాయక్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జనార్దన్‌నాయుడు పేర్కొన్నారు. -
ఇంటి సామగ్రి కడుగుతుండగా.. మహిళను కాటేసిన అరుదైన పాము..
వరంగల్: ఇంటి సామగ్రి కడుగుతుండగా పాము కాటు వేసింది. దీంతో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం నగరంలోని పలువేల్పులలో జరిగింది. పలివేల్పులకు చెందిన సల్లా పద్మ(38) ఉదయం ఇంటి ఆవరణలో సామగ్రి (బోళ్లు) కడుగుతుండగా పాము కాటు వేసింది. వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. -
పాము కాటుతో బాలిక మృతి
తుమకూరు: పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకా పంచవటి తండాలో జరిగింది. చైతన్య బాయి (10) శనివారం ఉదయం తండ్రితో కలిసి పొలం పనుల్లో ఉండగా పాము కాటేసింది. హుటాహుటిన బాలికను కుణిగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది. -
పాముకాటుతో విద్యార్థి మృతి
అన్నమయ్య: పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని సోంపల్లె పంచాయతీ తంబళ్లవారిపల్లెకు చెందిన బి.చంద్రశేఖర్ కుమారుడు బి.యువరాజు (15) ఇంటి ఆవరణంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయాడు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో నుంచి వచ్చిన పాము కాటు వేసింది. దీనితో అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం ఎంతసేపటికి యువరాజ్ నిద్ర లేవకపోవడంతో గమనించిన తండ్రి లేపించాడు. విద్యార్థి పక్కలోనే పాము ఉండడాన్ని చూసి చంపేశారు. అప్పటికే తీవ్ర అస్వస్థతో ఉన్న బిడ్డను చూసి పాముకాటు వేసినట్లు గుర్తించి ములకలచెరువు పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కోడి కోసం.. కొండచిలువ..! అంతలోనే..
భద్రాద్రి: మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న ఇర్ఫాన్ చికెన్ షాపులోకి ఓ కొండ చిలువ చొరబడి కలకలం సృష్టించింది. షాపు యజమాని సయ్యద్ ఇర్ఫాన్ బుధవారం ఉదయాన్నే షాపు తెరిచి కోళ్లు ఉన్న ఫారమ్‌లోకి వెళ్లగా, కొండ చిలువ కోళ్లను మింగుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది సుమారు 12 అడుగుల కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
వెళ్లిపోయావా తమ్ముడూ.. ఇంట్లోకి వెళ్లి కాటు వేసిన కట్లపాము
శ్రీకాకుళం: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లి తీవ్ర అనారోగ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రి తాపీ పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. అక్క, తమ్ముడు కలిసి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కట్లపాము కాటు వేయడంతో తమ్ముడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన పొందూరు మండలం తోలాపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రావాడ చిన్నయ్య, నీలవేణికి కుమార్తె రమ్య, కుమారుడు లవకుమార్(14) ఉన్నారు. లవకుమార్ తోలాపి జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నయ్య, నీలవేణి రోజువారీ కూలీలు. నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ పోషణ కోసం చిన్నయ్య రెండు రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. దీంతో అక్క రమ్యతో కలిసి లవకుమార్ ఇంటిలో ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గాలి తగలడం లేదని తలుపుతీసి పడుకున్నారు. ఆ సమయంలో కట్లపాము లవకుమార్‌ను కాటువేసింది. మెలకువ రావడంతో ఏదో పురుగు కుట్టిందనుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పాము మెడకు చుట్టినట్లు అనిపించడంతో ఒక్కసారిగా నిద్రలేచి పామును గుర్తించాడు. పామును విసిరేస్తే అక్కకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి భయపడకుండా చేతితో తీసి నేలకు గట్టిగా కొట్టాడు. తర్వాత పామును కొట్టి చంపాడు. అలికిడి కావడంతో అక్క నిద్రలోనుంచి లేచింది. అప్పటికే పాము కరిచి చాలాసేపు కావడం, తమ్ముడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు లవకుమార్‌ను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అప్పటి వరకు తనతో ఉన్న తమ్ముడు పాముకాటుకు బలికావడంతో అక్క కన్నీటిపర్యంతమైంది. తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది. వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ముందు రోజు వరకు రోజూ పాఠశాలకు వస్తున్న విద్యార్థి ఇక లేడని తెలిసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మృదేహానికి పోస్టుమార్టం చేయించారు. -
కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది...
సంగారెడ్డి: పొలంగట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్కలతో నిండిన పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, గృహాల ఎదుట పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకొచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి. పాములకు శరీరం కింది భాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్దం గ్రహిస్తాయి. వేడిరక్తం ప్రసవించే, జంతువులు, మనుషులు సమిపిస్తే వెంటనే గుర్తిస్తాయి. కదులుతున్న ప్రాణులను గుర్తించి కాటేస్తాయి. నాగుపాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటి కాటుకు గురైనా బాధితులకు వెంటనే వైద్యమందక ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పంట పొలాలు, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. సర్పాలకు ప్రాణభయం ఉన్నప్పుడు ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు కాటేస్తాయి. అన్ని ప్రమాదం కాదు.. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు. కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతుల్లోనే ప్రమాదముంటోంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం, ప్రమాదంలేని మాములు గాయాలే. చికిత్స తీసుకుంటే నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వారు. ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులుగా ఏడుపులు ప్రారంభిస్తే బాధితులు భయాంతోళనకు గురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. పాములు వాటి విషప్రభావం కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతోంది. రక్తపింజర: ఇది కాటేసిన 2 గంటల తర్వాత విషం ఎక్కుతోంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇవి కాటేసిన విషం ఉండదు. కాటు వేసిన చోట చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఉత్తమం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాత్రివేళల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవాళ్లు టార్చ్‌లైట్‌ను వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు పరిసరాలల్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి పాముకాటుకు గురై వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెబుతుండాలి. పాముకాటేసిన పైభాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటేసిన చోట బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. నోటిలో పుండ్లు, గాట్లు లేకుంటే రక్తం పీల్చి ఉమ్మివేయాలి. పాముకాటుకు గురైనా వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. – డాక్టర్ శాలిని, పీహెచ్సీ టేక్మాల్ -
బాలుడిని కాటేసిన రెండు పాములు...
నిజామాబాద్: పాము కాటుకు గురైన మూడేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులకు రుద్రాన్ష్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో పక్కనున్న మరో గదిలో వీరంతా శుక్రవారం నిద్రించారు. ఈ క్రమంలో రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి. బాలుడు గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి వెళ్తున్న పాములను తండ్రి భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
పాము కాటు వేసిన ఐదు నిమిషాల్లో మృతి..
‘గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి గత ఏడాది సెప్టెంబర్ 8న పొలంలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా పాము కాటువేసింది. కాలికి ఏదో విషపురుగు కరిచినట్టు గుర్తించి నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిముషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. ఆయనకు కరిచింది చంద్రపొడి (రెసెల్స్‌వైపర్) జాతికి చెందిన విషసర్పమని, సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాలు నిలిచేవని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.’ కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 7న పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన ఎటువంటి భయానికి గురికాకుండా దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడి వైద్యులు స్నేక్‌యాంటీ వీనం వ్యాక్సిన్ వే శారు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్‌చేశారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. పార్వతీపురం టౌన్: వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలం పనిలో నిమగ్నమైన సమయంలో, గట్లపై వెళ్తున్న సమయంలో రైతులు పాముకాటు బారిన పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు సంవత్సరంలో 498 మంది పాముకాటుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. సరైన అవగాహనలేకపోవడం, సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని వైద్యులు తేల్చారు. అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. ఏమరపాటు తగదు... ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకోవడాని కి అనేక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి. పొ లం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతో పాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకొంటాయి.అప్రమత్తంగా ఉండి పరిసరాల ను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాల కు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచు కోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవడం మంచి దని వైద్యులు సలహా ఇస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని చెబుతున్నారు. పాము కాటుకు అందుబాటులో చికిత్స పాముకాటు బారిన పడిన వ్యక్తికి పీహెచ్సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్‌వీనం వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా కరిచిన వెంటనే ముందుగా గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవా లి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్‌వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. భయపడకుండా నిర్భయంగా ఉండాలి. – డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం పాము కాటు లక్షణాలు పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావ డంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. ప్రథమ చికిత్స ఇలా.. పాము కాటుకు గురైన వ్యక్తిని నిదానపరచాలి. కంగారు పడకుండా చూడాలి. ఆందోళనకు గురైతే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి. వేగంగా యాంటీ–వీనమ్‌ను అందించగల ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి. గాయం కడగకూడదు. గాయం మీద ఐస్‌ను పెట్టకూడదు. గాయం నుంచి విషాన్ని పీల్చేందుకు ప్రత్నించరాదు. -
విషాదం.. పాము కాటుతో తండ్రీకొడుకు మృతి
రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు. వివరాల ప్రకారం.. రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత, తనయుడి మృతి -
పాము కాటుతో తండ్రీకొడుకులు మృతి
రాజంపేట: పాము కాటుకు తండ్రీకొడుకులు బల య్యారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తె లిపాడు. దీంతో భార్యాభర్త లు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధ రాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతు లు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగు తున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కొడుక్కి పాము కాటు.. చంపబోయిన తండ్రికి కూడా.. నాటు వైద్యాన్ని నమ్ముకుని ఇద్దరి మృతి!
కామారెడ్డి జిల్లా: రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్‌ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే వినోద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు. -
పాము కాటుకు మరో కార్మికుడు మృతి
వేలూరు: అల్లేరి గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో పాము కాటుకు మరో కార్మికుడు మృతిచెందిన సంఘటన గ్రామస్తులను కలచివేసింది. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని జవ్యాది కొండ, అల్లేరు వంటి 30కి పైగా గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రసవ నొప్పులు వచ్చినా డోలి కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులు తమ గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల వద్ద వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. ఇదిలా ఉండగా అల్లేరి గ్రామానికి చెందిన ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి ప్రియ రెండు నెలల క్రితం పాము కాటుకు గురై రోడ్డు వసతి లేక ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని పది కిలోమీటర్ల దూరం తల్లి భుజంపై వేసుకుని వెళ్లిన విషయం సోషల్ మీడియాలో రావడంతో అఽధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులను ప్రారంభించారు. ఇదిలాఉండగా అల్లేరి గ్రామానికి చెందిన శంకర్(38) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా శంకర్ పాము కాటుకు గురయ్యాడు. అనంతరం అంబులెన్స్, వైద్య బృందానికి సమాచారం అందజేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే శంకర్ మృతిచెందాడు. -
పాముకాటుకు గురైన ఆమంచి..
-
నిద్రిస్తున్న బాలికను కాటు వేసిన నాగుపాము
దుర్గి/చిలకలూరిపేట టౌన్: పాముకాటులో బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అడిగొప్పల యానాది కాలనీకి చెందిన కొమరగిరి అనిల్ బాబు, పూజ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనిక స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో కూలీ పనులు కోసం వెళ్లారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో శనివారం బంధువులతో తల్లిదండ్రుల వద్దకు పోతవరం వెళ్లింది. తల్లిదండ్రులతో ఆటపాటలతో సంతోషంగా గడిపి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో తల్లిదండ్రులు పాము కాటు అని గుర్తించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న క్రమంలో బాలిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న సర్పంచి నలబోతు చిన్నబ్బాయి మృతి చెందిన బాలిక కుటుంబానికి మట్టి ఖర్చులు కోసం రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను వైస్ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్ హుసేన్ పరామర్శించారు. -
బూటులో దూరిన పాము.. విద్యార్థికి పాముకాటు
అనంతపురం: పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కోనాపురం గ్రామానికి చెందిన హరినాథ్... నగరూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న హరినాథ్... ఆవరణలో బూట్లు వదిలి తన హోం వర్క్ చేసుకున్నాడు. ఇంతలో బెల్ మోగడంతో హడావుడిగా బూట్లు ధరించి ప్రేయర్‌కు హాజరయ్యాడు. ఇంతలో తన కాలుకు ఏదో కుట్టిందంటూ గట్టిగా అరవడంతో హరినాథ్‌ను పీడీ మహబూబ్‌బాషా పక్కకు పిలుచుకెళ్లి బూట్లు విప్పించి చూడగా, లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చింది. వెంటనే పామును చంపేసి, బాధిత విద్యార్థిని తన ద్విచక్ర వాహనంపై తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి పీడీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత విద్యార్థిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో విద్యార్థిని ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలపడంతో అక్కడే ఉన్న పీడీ మహబూబ్‌బాషాను ఎమ్మెల్యే అభినందించారు. -
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకులంలో బాలికకు పాముకాటు
-
పాఠశాలలో పాము కాట్లు.. రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థినిలను..
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినిలు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చుని చదువుకుంటున్న నాలుగో తరగితి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో నాలుగు పాములు చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా.. గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో రెండు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం మరో విద్యార్థినిని పోతంగల్ మండలం జల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినిని పాటు కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయట పడటంతో తీసుకోవడానికి వెనకవైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటేసింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల ఘటనలతో పాఠశాల, గురుకల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూల్ ఆవరణలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి పాముల వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థిని పాము కాటుకు గురికావటంపై చిన్నారుల తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రయడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి -
నాలుగుసార్లు పాము కాటు వామ్మో.. చితిపై లేచి కూర్చున్నాడు!
కర్ణాటక: పాముకాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే అతను చనిపోతాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే బాధితుడు చితిపై లేచి కూర్చున్నాడు. ఈఘటన హుబ్లీలో జరిగింది. గదగ్ జిల్లా నరగుంద తాలూకా హిరేకొప్ప గ్రామంలోని ఓ ఇంటిలో పాము చొరబడగా అదేగ్రామానికి చెందిన సిద్ధప్ప బళగనూరు మద్యం మత్తులో అక్కడకు వెళ్లాడు. ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండా పామును పట్టేశాడు. అనంతరం దానిని రోడ్డుపై వదిలాడు. మళ్లీ పట్టుకునేందుకు వెళ్లగా పాము నాలుగుసార్లు కాటు వేసింది. దీంతో అతన్ని హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సిద్ధప్ప ప్రాణాలు ఉండవని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయాలని గ్రామంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సిద్ధప్ప చితిపై లేచి కూర్చున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కాగా బాధితుడికి వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
మెదక్: పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని అనంతరావుపల్లి గ్రామానికి చెందిన గద్ద విజయ్–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంజయ్‌కుమార్(16) ఉన్నారు. సంజయ్ అల్వాల్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి పశువులకు మేత వేసి వస్తున్న క్రమంలో సంజయ్ కాలికి పాముకాటు వేసింది. దీంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తకు పాము కాటు... పామును తొక్కి చంపేశారు...
కర్నూలు: రాత్రి మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తలను పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలోని పాత బీసీ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిన్న భాస్కర్, లక్ష్మి (38) దంపతులు సోమవారం రాత్రి భోజనం అనంతరం మిద్దైపె నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11 గంటల అనంతరం గొల్ల చిన్న భాస్కర్‌ను పాము కాటువేయడంతో విదిల్చి పడేయగా పక్కనే ఉన్న లక్ష్మి కాలికి కాటు వేసింది. ఆమె కాలిని వదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పామును తొక్కి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేని లక్ష్మి మృతిచెందగా చిన్న భాస్కర్ కోలుకుంటున్నాడు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
బాలుడిని హత్య చేశారా.. పాము కరిచిందా?
విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇంటిలో నుంచి ఆడుకునేందుకు వెళ్లిన కొడుకు నిర్జీవంగా కనిపించడంతో అతని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. బాలుడిని ఎవరైనా హత్య చేశారా? లేదా పాము కాటుకు గురయ్యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో పల్లా కనకరాజు, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కొడుకు తేజ(5) ఉన్నారు. కనకరాజు లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా నారాయణమ్మ గృహిణి. తేజ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటుంటాడు. చుట్టు పక్కల వాళ్ల ఇంటికి కూడా వెళ్తుంటాడు. ఈ తరుణంలోనే గురువారం సాయంత్రం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకునేందుకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. తేజ ఎక్కువగా ఎక్కడెక్కడికి వెళ్తుంటాడో ఆ ప్రదేశాల్లో వెతికినప్పటికీ.. చిన్నారి జాడ కనిపించలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఆర్పురం వచ్చిన లా అండ్ ఆర్డర్ ఎస్ఐ అసిరితాత గ్రామస్తులతో కలిసి బాలుడి జాడ కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. కాగా.. శుక్రవారం ఉదయం ఇంటికి సమీపంలోనే లారీ షెడ్ పక్కన తేజ విగతజీవిగా ఉండటాన్ని గ్రామస్తులు, తల్లిదండ్రులు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్త్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఇన్చార్జి సీఐ నరసింహారావు అక్కడ పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తేజ మృతిపై అనుమానాలు తలెత్తడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించారు. ఇదిలా ఉండగా తన కుమారుడిని ఎవరో చంపేశారని తేజ తల్లి నారాయణమ్మ ఆరోపించారు. జరిగిన ఘటనపై ఏసీపీ నరసింహ మూర్తి మాట్లాడుతూ తేజ నోటి వెంట నురగ వచ్చి ఉందని, చేతికి రెండు గాట్లు ఉన్నాయని, పాము కరిచి ఉండవచ్చనే అనుమానం ఉందన్నారు. లేదా తేజ కుటుంబంతో పడనివారెవరైనా గత కారణాలను దృష్టిలో ఉంచుకుని హత్య చేసి ఉంటారా అన్న అనుమానం కూడా కలగుతోందన్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం తేజ మృతదేహం కనిపించిన లారీ షెడ్ వద్ద.. గురువారం రాత్రి కూడా పోలీసులు, గ్రామస్తులు వెతికినట్లు చెబుతున్నారు. అప్పుడు కనిపించని తేజ మృతదేహం.. ఉదయానికి కనిపించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
పామును చూయింగ్ గమ్‌లా నమిలేశాడు..!
ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు(3) పాముని చూయింగ్ గమ్‌లా నమిలి చంపేశాడు. ఈ ఘటన ఫరూకాబాద్‌లో జరిగింది. బాలుడు తన నానమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆరుబయట ఆడుకుంటుండగా.. పొదలలో నుంచి ఓ పాము అతని వద్దకు వచ్చింది. బాలుడు దాన్ని చేతితో పట్టుకుని నోటితో నమిలేశాడు. ఆ తర్వాత ఆరవడం మొదలుపెట్టాడు. బయటకు వచ్చిన అతని నానమ్మ ఒక్కసారిగా బయపడింది.పామును బాలుని నోటి నుంచి బయటకు లాగి విసిరేసింది. అప్పటికే బాలుడు సృహతప్పి పడిపోయాడు. బాధితుని నానమ్మ బంధువుల సహాయంతో బాలున్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు తక్షణం స్పందించి చికిత్స అందించారు. బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి:బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు.. -
dangerous snake: పాముకాటుతో యువకుడి మృతి
సరుబుజ్జిలి: మండలంలోని బురిడివలస కాలనీకి చెందిన కొల్ల దుర్గారావు(25) సోమవారం అర్థరాత్రి నాగు పాముకాటుకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. దుర్గారావు సవళాపురం జంక్షన్ బ్రిడ్జి వద్ద చల్లగాలికి కూర్చొని, నిద్రించేందుకు తన ఇంటికి వెళుతుండగా చీకట్లో నాగు పాముకాటు వేసింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. దుర్గారావుకు తండ్రి కొల్ల సింహాచలం, వీరమ్మ ఉన్నారు. -
పాతికేళ్ల అనుభవం.. పాముకాటుకే బలి
సాక్షి, బెంగళూరు: కాఫీనాడు చిక్కమగళూరులో వందలాది పాములను పట్టుకుని ప్రజలకు సహాయకారిగా ఉండే స్నేక్ నరేశ్ (55) చివరికి పాము కాటుకే మరణించాడు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా స్నేక్ నరేశ్‌గా పేరు గడించారు. ప్రత్యేకించి భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను ఆయన అలవోకగా పట్టుకుని బంధించేవాడు. వృత్తిపరంగా టైలర్ అయినప్పటికీ పాములను పట్టుకోవడంలో నేర్పరి అయ్యాడు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. జిల్లావ్యాప్తంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాముల సంరక్షణపై అవగాహన కల్పించేవాడు. పాములు మన స్నేహితులని, వాటిని చంపరాదని బోధించేవాడు. ఏం జరిగిందంటే కొద్దిరోజుల క్రితం చిక్కమగళూరులో హౌసింగ్ బోర్డులో ఒక నాగుపామును పట్టుకుని స్కూటీ వాహనంలో పెట్టి మరో పామును పట్టుకునేందుకు వెళ్లాడు. ఈ సమయంలో స్కూటీ సీటు తెరిచి పామును సంచి లోపలికి వేస్తుండగా చేతిపై నాగుపాము కాటు వేసింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. అయితే పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూశాడు. -
పాముకాటుతో చిన్నారి మృతి
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని అల్లేరి కొండపై ఉన్న అత్తిమరత్తూరు గ్రామానికి చెందిన విజయ్ ఇతని భార్య ప్రియ దంపతుల కుమార్తె ధనుష్క(2). ఇంటి సమీపంలో ఆటలాడుతున్న ధనుష్కను పాము కరవడంతో చిన్నారి కేకలు వేసింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనకట్టు ప్రాంతంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే రోడ్డు వసతి లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లడానికి ఆలస్యమైంది. దీంతో చిన్నారి ఆసుపత్రికి వెళ్లే సరికే చిన్నారి మృతి చెందింది. స్థానిక పోలీసు లు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్ అల్లేరి కొండ కిందనే నిలిపి వేయడంతో సుమారు 10 కిలో మీటరు దూరం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భుజంపై మోసుకొని కన్నీరు, మున్నీరుగా రోదిస్తూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పాముకాటుతో కానిస్టేబుల్ మృతి.. ఎస్సై కావాలన్న ఆశ తీరకుండానే
ప్రకాశం: తుళ్లూరు మండలం అనంతవరం ఆర్–5 జోన్లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇరిగిపోయిన పవన్‌కుమార్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండు రోజులుగా గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డయాలసిస్ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా పవన్‌కుమార్ మృతి చెండటం పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీస్ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు నిరంతర పర్యవేక్షణ చేసినా సరే పవన్‌కుమార్‌ను దక్కించుకోక పోయారు. పవన్‌కుమార్‌ది చీమకుర్తి పట్టణం. 2012 జవవరి 19లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తాళ్లూరు, ఒంగోలు వన్ టౌన్, ముండ్లమూరులలో పనిచేసి మళ్లీ 2020 జనవరి 2న తాళ్లూరు పోలీస్ స్టేషన్లలో జాయిన్ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికై నా ఎంపిక కావాలన్న ఆశయంతో ఉంటూ అంకితభావంతో పనిచేసే పవన్ ఇక లేక పోవటం దురదృష్టకరమని స్నేహితులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. పవన్‌కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఇద్దరు ఉపాధి వేతనదారులకు పాముకాటు
రణస్థలం: ఇద్దరు ఉపాధి హామీ పథకం వేతనదారులు పాముకాటుకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని వెంకటరావుపేట, నెలివాడ గ్రామాల్లో బుధవారం చోటుచేసుకుంది. ఎన్ఆర్జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేట గ్రామంలో కొత్తకోట్ల లక్ష్మి చెరువులో పని చేస్తుండగా పాము కాటుకు గురికావడంతో హుటాహుటీనా రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రం తరలించి చికిత్స అందించారు. అలాగే నెలివాడలో చెరువు పనులు చేస్తుండగా నౌకట్ల సూర్యకాంతం పాము కాటుకు గురికావడంతో ఆమెను కూడా సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేశామని చెప్పారు. ప్రమాదకరమైన విషసర్పాలు కాకపోవడంతో ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పారు. మహిళలిద్దరిని 24 గంటల ప్రత్యేక పరిశీలనలో ఉంచుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.వి.ప్రసాద్‌రావు తెలిపారు. ఇద్దరూ కోలుకుంటున్నారన్నారు. వేతనదారులను ఎంపీడీవో వి.ధనుంజయరావు పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. -
ఇల్లు కాదు పాముల పుట్ట, సామాను సర్దేలోగా.. సంతోషం ఆవిరి
ఒకటి కాదు, రెండు కాదు.. పదేళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కొంది ఓ మహిళ. తన కలల సౌధం ఎలా ఉండాలన్నదానిపై అన్ని జాగ్రత్తలు చెప్పింది. తీరా ఇంట్లోకి వెళ్లిన తర్వాత సీన్ రివర్సయింది. అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్ హాల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్ మదర్ కావడంతో ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంటి కోసం ప్రయత్నించింది. నాలుగు బెడ్ రూంలు, ఓ చిన్న లాన్, అవసరాలకు సరిపడా కాసింత చోటు.. వీటి కోసం గాలించగా.. చివరికి ఓ ఇల్లు దొరికింది. ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్ కుక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఫర్నీచర్ కూడా సెట్ చేయలేదు. అంతలోనే కుక్కలు మొరగడంతో అనుమానం వచ్చింది అంబర్ హాల్‌కు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. ఓ పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ గోడ తవ్వినా పామే. ఏ మూల చూసినా పామే. చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని. కొంత ధైర్యం చేసి స్నేక్ క్యాచర్లను పిలవగా ఇప్పటివరకు దాదాపు 40 పాములను పట్టుకెళ్లారు. ఇంకో చోటికి వెళదామంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురయినా అదే ఇంట్లో ఉంటోంది అంబర్ హాల్. A first-time homeowner was shocked when she found as many as 30 snakes "coming out of every hole and crevice" of her new house. pic.twitter.com/dthRHno5n6 — CNN (@CNN) May 14, 2023 ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంది. ఇంట్లో రోజూ పాములను పట్టడం దగ్గరున్న అడవిలో వదిలేయడం జరుగుతోంది. ఈ ఇంటికి సమీపంలో ఒకప్పుడు చిన్నపాటి మడుగు ఉండేదట. అక్కడ బోలెడు పాములుండేవట. బహుశా అవే పాములు ఈ ఇంటికి వరుస కట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. తన దీనస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని అంబర్ హాల్ కోరుతున్నారు. కనీసం ఆ మడుగుపై కాంక్రీట్ స్లాబ్ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందన్నది అంబర్ ఆశ. -
పాముకాటుతో బాలుడి మృతి
మెదక్: ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ బాలుడిని పాము కాటేసింది. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గబ్బర్ సింగ్–సునీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. గబ్బర్సింగ్ది మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి తండా స్వస్థలం కాగా, భార్యపిల్లలను వారి పుట్టినిల్లయిన జలాలార్పూర్ తండాలో ఉంచి బతుకుదెరువుకు వలస వెళ్లాడు. సునీత తండ్రి చందర్ ఇటీవల ఇంటినిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో పక్కనే ఉన్న మరో ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం అర్ధరాత్రి కరెంటుపోయింది. ఉక్కపోతగా ఉండడంతో తల్లితోపాటు చిన్నకుమారుడు అక్షయ్(5) ఇంటి వరండాలో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల ప్రాంతంలో అక్షయ్‌ని పాముకాటు వేసింది. గమనించిన కుటుంబసభ్యులు ముందుగా అంసాన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడి ఆర్ఎంపీ సూచన మేరకు మెదక్ తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. -
పాముకాటుకు బాలుడు బలి
అనంతపురం: స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పాముకాటుకు గురై మదన్‌కుమార్ (4) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లచెరువు ఎస్సీ కాలనీకి చెందిన శంకర్ రెండు రోజుల క్రితం తన భార్య సుమిత్రను కాన్పు కోసం తనకల్లులోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాడు. బుధవారం ఉదయం తన భార్యను చూసేందుకు శంకర్ తన నాలుగేళ్ల కుమారుడైన మదన్‌కుమార్‌ను తీసుకొని ఆస్పత్రికి వచ్చాడు. భార్య సుమిత్రతో మాట్లాడిన అనంతరం కుమారుడితో కలిసి ఆస్పత్రి బయటకు వచ్చి బంధువులతో మాట్లాడుతుండగా, మదన్‌కుమార్ ఆడుకుంటూ కుళాయి వద్దకు వెళ్లాడు. నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లోకి చెయ్యి పెట్టాడు. ఆ పైప్‌లో ఉన్న నాగుపాము బాలుడి చేతిపై కాటు వేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. నోటి నుంచి నురగ వస్తుండటంతో పాముకాటు వేసినట్లు గుర్తించిన వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మదన్‌కుమార్ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు పాముకాటుతో కళ్లముందే ప్రాణాలు వదలడంతో శంకర్, సుమిత్ర దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాంభూపాల్, ఏఎస్ఐ నరసింహులు ఆస్పత్రి వద్దకు వచ్చి బాలుడి మృతిపై విచారణ చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు. -
భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు
ఒక మహిళ పాము కాటుకి గురయ్యింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భర్త ఆమెను చూసేందుకు ఆస్పత్రికి రాకపోగా ..పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉన్నావ్ జిల్లా సఫీపూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి భార్య కుస్మను పాము కాటేసింది. ఆ మహిళ వంట చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుంది. అయితే అతను భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లకుండా.. నేరుగా ఇంటికి వెళ్లి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించి ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వైద్యులు కంగుతిన్నారు. ఎందుకిలా చేశావ్ అని అడిగితే.. ఏ పాము కాటేసిందో తెలిసుకుని వైద్యం చేయలని ఆ వ్యక్తి కోరడంతో.. వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఐతే సదరు మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. వాస్తవానికి ఆ వ్యక్తి భార్యను చూసేందుకు ఆస్పత్రికి ఒక్కసారి కూడా రాకపోవడం గమనార్హం. బదులుగా ఇంటికి వెళ్లి పాముని పట్టుకుని ఆస్పత్రికి తీసుకురావడం విశేషం. (చదవండి: స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం.. ముఖంపై!) -
పంచాంగం చూస్తుండగా కాటేసిన నాగుపాము
కరీంనగర్: మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ ఎరబాటి భాస్కర్‌రావు సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు సీనియర్ సిటిజన్ హరిహర ఆలయం నిర్మాణకర్త రాజేశ్వర్‌రావును కాల్వశ్రీరాంపూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం నాగుపాము కాటువేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాగం చూస్తుండగా పెరట్లో నుంచి పామువచ్చి కాలుపై కాటువేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. గమనించిన రాజేశ్వర్‌రావు అప్రమత్తమై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఫోన్‌చేయగా హూటాముటిన కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యానికి 108లో కరీంనగర్‌కు తరలించారు. రాజేశ్వర్‌రావు కుమారుడు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రఘుపతిరావు, తదితరులు ఉన్నారు. -
పాము కాటేస్తే విషం పీల్చి ప్రాణరక్షణ
యశవంతపుర: కంటే కూతుర్నే కనాలి అనే మాటకు ఆ బాలిక నిదర్శనంగా నిలిచింది. తల్లికి పాము కాటు వేయగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కెయ్యూరు గ్రామంలో జరిగింది. సతీశ్ రై భార్య మమత వారం రోజుల క్రితం పొలంలో పనిచేస్తుండగా ఒక నాగుపాము కాటు వేసింది. ఆమె పరుగున ఇంటికి వెళ్లింది. కూతురు శ్రమ్య తల్లికి పాము కాటేసిన చోట నోటితో మూడుసార్లు విషం లాగి ఉమ్మేసింది. తరువాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స చేయడంతో మమత కోలుకుంది. విషం శరీరంలోకి చేరని కారణంగా ప్రమాదం నుండి బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, శ్రమ్యను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. శ్రమ్య బీసీఎ చదువుతోంది. -
పాము కరిస్తే మంత్రం వేశారు!
ఎడపల్లి (బోధన్): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢ నమ్మకాలు విశ్వసిస్తున్నారు. పాము కరిస్తే వైద్యుడిని సంప్రదించకుండా మంత్రం వేయించుకోవడంతో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుర్నాపల్లికి చెందిన గంగారెడ్డి (51)కి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద బాత్రూంలో పాముకాటు వేసింది. దీంతో స్థానికంగా ఉన్న పాము మంత్రం వేసే వారి వద్దకు వెళ్లి మంత్రం వేయించుకున్నాడు. అయితే గంటపాటు పాము మంత్రం వేసే వారి వద్ద ఉంచడంతో పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో గంగారెడ్డిని ఆటోలో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో మల్లాపూర్ గండి వద్ద ఆటోలో డీజిల్ అయిపోయింది. మరో ఆటోలోకి ఎక్కించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగారెడ్డి మృతి చెందాడ -
ఈనెలాఖరున పెళ్లి.. అంతలోనే షాకింగ్ ఘటన
సి.బెళగల్(కర్నూలు జిల్లా): ఈనెలాఖరులో పెళ్లి జరగాల్సిన యువతి పాముకాటుకు గురై ప్రాణాలొదిలింది. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలో సోమవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న నారాయణ, వెంకటమ్మ దంపతులకు కుమారుడు బడేసావ్, కూతురు సరస్వతి (18) ఉన్నారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి సరస్వతి పొలం పనులకు వెళ్లగా అక్కడ పాము కరిచింది. వెంటనే కుటుంబసభ్యులు ఆ యువతిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్య లోనే మృతిచెందింది. ఈ యువతికి సి.బెళగల్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఈ తరుణంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. చదవండి: పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా -
భార్య కళ్లముందే పాముకాటుకు గురయ్యిన వ్యక్తి..ఆ తర్వాత..
ఒక్కోసారి కొన్ని విషాద ఘటనలు మన కళ్లముందే జరుగుతుంటాయి. మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. కానీ ఆ విషాదాన్ని అంత తేలికగా మర్చిపోలేం. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని ఇక్కడొక మహిళ ఎదుర్కొంది. వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌లో ఒక 60 ఏళ్ల వ్యక్తి తన భార్య ముందే విషపూరితమైన పాము కాటుకు గురై మరణించాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటినా హెలికాప్టర్, నాలుగు అంబులెన్స్‌లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది పాములు బయటకు వచ్చే సీజన్ అని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల సమయం ఉష్ణోగ్రతలు మార్పురావడంతో వేడికి బయటకు వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయిని చెబుతున్నారు నివాసితులు. ఇక్కడ మృతుడు భార్య ఈ అనుకోని ఘటన జరిగిన వెంటనే సహాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అతను ఒక విషపూరితమైన గోధుమ రంగు పాము కాటుకు గురైనట్లు సమాచారం. (చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!..పిల్లలను కనండి అంటున్న చైనా!) -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
పామును చంపినందుకు పోలీసు కేసు.. పరారీలో నిందితుడు
లఖ్‌నవూ: పాము, తేలు వంటి విషపురుగులు కనిపిస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. చాలా వరకు గ్రామాల్లో పాములు, తేళ్లు కనిపిస్తే చంపేస్తారు. అవి కాటు వేస్తే ప్రమాదం కనుక చంపటం తప్పేమి కాదని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. అలాగే ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందని పామును చంపేశాడు. పోలీసులు కేసు పెట్టడంతో అవాక్కయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లాలో జరిగింది. ఛప్రౌలి ప్రాంతంలోని షాబ్గా గ్రామంలో ఆదివారం రాత్రి రామ్ చరణ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడారు. స్వలీన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి పామును చంపేశాడు. ఈ విషయంపై సోమవారం ఉదయం అటవీ శాఖకు సమాచారం అందింది. ఫారెస్ట్ గార్డ్ సంజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వలీన్‌పై అటవీ జంతువుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. పెద్ద వస్తువుతో పామును నుజ్జు నుజ్జు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, పాము మృతికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
సర్పం.. ప్రకృతి నేస్తం! పాములు కాటు ఎందుకు వేస్తాయంటే?
తిరుపతి అలిపిరి: సర్పం (పాము) అంటేనే హడలిపోతారు. పేరు విన్నా.. చూసినా వణికిపోతారు. భయంతో పరుగులు తీస్తారు. పాము కనబడిందంటే రాళ్లు, కర్రలతో కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్ని కాటేయడం.. మనుషులు చనిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ప్రకృతికి పాములు జీవన నేస్తాలని నిపుణులు చెబుతున్నారు. పాముల వల్ల భూమికి, రైతులకు, అటవీ జంతువులకు ఎంతో ఉపయోగకరమని అంటున్నారు. అది ఎలా.. ఎందుకో.. మీరే చదవండి.. విషపూరితం నాలుగే ప్రపంచంలో మూడు వేల రకాల సర్పజాతులుండగా.. అందులో 300 జాతులు భారతదేశంలో ఉన్నాయి. వీటిలో 90శాతం కన్నా ఎక్కువ విషరహిత సర్పాలే. పాముకాటు మరణాలు కలిగించే అతి సాధారణమైన విషపూరిత జాతులు నాలుగు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. భయంతోనే కాటు ► మానవునికి పాములంటే ఎంత భయమో పాములకు కూడా అంతే భయం ఉంటుంది. ► పాము తారసపడినప్పుడు భయంతో పరుగులు తీయకుండా ఆ ప్రదేశం నుంచి మెల్లగా వచ్చేయాలని, భయం కలిగించడానికో.. తరమడానికో ప్రయత్నం చేస్తే కాటువేయడం ఖాయం. ► దాక్కున్న పాములను మాత్రమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ► పామును చంపడం వంటివి చేయకూడదు. కనిపించేవన్నీ విషపూరితం కాదు మనకు కనిపించే ప్రతి పాము విషపూరితం కాదు. సాధారణంగా మన ప్రాంతంలో నాగుపాము, రాచనాగు, కట్లపాము, సా స్కేల్ వైపర్ (పోడపాము), రక్తపింజరి, బాంబు పిట్ వైపర్(పోడపాము), స్లేన్డర్ కోరల్ స్నేక్, కామన్ సీ స్నేక్ (సముద్రపు సర్పం)లు మాత్రమే విషపూరితమైనవి. బ్యాండెడ్ రేసర్, బ్లైండ్ స్నేక్, ఇలియాట్ షీల్డ్ టెయిల్, రెండు తలల పాము, కొండచిలువ, జెర్రిపోతు, రుసుల్స్ కుక్రి, రేడియేటెడ్ ర్యాట్ స్నేక్, ట్రింకెట్ పాము, కేట్ స్నేక్, బ్లాక్ హెడెడ్ స్నేక్, పసరిక పాము, నూనె పలుగుడు, జెర్రికట్ట పాము, మాను పాము, కడ్డీల సర్పము, నీటిపాము, కీల్‌బ్యాక్ వంటివి విషరహితమని నిపుణులు చెబుతున్నారు. బయోలాజికల్ పెస్ట్ కంట్రోలర్లుగా.. ప్రకృతిలో పాములు ఎలుకలను చంపి తినడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రైతులకు ఎలుకల వల్ల పంట నష్టం కలగకుండా తోడ్పడతాయి. విషరహిత సర్పమైన జెర్రిపోతు ఏడాదికి సుమారు 400 ఎలుకలను వేటాడి తింటుంది. అంతే కాకుండా పాములను తినే ప్రాణులు అడవిలో ఉంటాయి. వాటి ఆహారం కోసమైనా పాములను రక్షించాలి. పాములు రాకుండా జాగ్రత్తలు ఇలా.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యర్థ పదార్థాలను దిబ్బలుగా ఉంచరాదు. తద్వారా కప్పలు, బల్లులు, ఎలుకలు వచ్చి చేరుతాయి. వాటి కోసం పాములు వచ్చే అవకాశం ఉంది. పెరట్లో, ఇంటి ముందు నాటిన మొక్కలను ట్రిమ్ చేసి ఉంచితే పాములను కనిపెట్డానికి సులువుగా ఉంటుంది. గ్రామాలలో, పంట పొలాల్లో నేలపై పడుకొనేవారు తప్పనిసరిగా దోమతెరవంటివి వాడడం మంచిది. రాత్రిల్లో నడిచేటప్పుడు దివిటీ తప్పనిసరి. తుప్పు, ఎండు ఆకులలో అజాగ్రత్తగా చేతులు పెట్టరాదు. పాములపట్టడంపై అవగాహన పాములు కాపాడుకోవాల్సిన ఆవశ్యకంపై సోమవారం తిరుపతి శ్రీవేంకటేశ్వర జూ పార్క్‌లో విశాఖపట్టణం నుంచి వచ్చిన ఈస్టర్ణ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ డైరెక్టర్ కేఎల్ఎన్ మూర్తి అవగాహన కల్పించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అటవీశాఖాధికారులతో పాటు పలువురు విద్యార్థులకు క్యురేటర్ సెల్వం నేతృత్వంలో అవగాహన కల్పించారు. నాగుపామును పట్టుకొని అడవిలో ఎలా విడిచి పెట్టాలి అనే అంశంపై వివరించడంతో పాటు సాధారణంగా కనిపించే జెర్రిపోతును పట్టుకొనే విధానాలను ఆయన వివరించారు. ఆ మేరకు కొంతమంది అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పాములను రక్షించాలి పాములు సాధారణంగా భయంతోనే కాటేస్తాయి. పాములు అడవిలో మరొక జంతువులకు ఆహారంగా ఉంటాయి. ఆంధ్రాలో నమోదవుతున్న పాముకాట్ల నేపథ్యంలో పాములపై అవగాహన కల్పించేందుకు ఈస్టర్ట్ ఘాట్ సొసైటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సున్నితంగా, సులువుగా పామును పట్టుకొని ఎంపిక చేసుకున్న ప్రాంతంలో వాటిని వదిలిపెట్టేలా కొంతమందికి శిక్షణ ఇస్తున్నాం. అటవీశాఖ సహకారంతో యువకులకు శిక్షణ ఇస్తాం. – కె.ఎల్.ఎన్ మూర్తి ఈస్టర్న్ ఘాట్స్ సొసైటీ డైరెక్టర్ స్నేక్ క్యార్స్ వద్ద శిక్షణ యువకులు ముందుకు వస్తే నిష్ణాతులైన స్నేక్ క్యాచర్స్ వద్దకు పంపించి శిక్షణ ఇప్పిస్తాం. అటవీశాఖలో ఉన్న సిబ్బందిలో కొంతమందికి స్నేక్ క్యాచింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలకు అవగాహనతో పాటు పాములను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లుగా నియమించి పాములు పట్టించే కార్యక్రమం జరుగుతుంది. దానికి కావలసిన వస్తు సామాగ్రిని అటవీశాఖ నుంచే సమకూరుస్తాం. – సెల్వం, క్యూరేటర్, జూపార్క్, తిరుపతి -
ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్..
Inland Taipan: ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. పేరు ఇన్లాండ్ టైపాన్.. ఇది ఎంత విషపూరితమైనది అంటే.. ఒక్క కాటు విషంతో వంద మంది మనుషులు ఖతమేనట. అదే ఎలుకల లెక్క తీసుకుంటే.. 2,50,000 మూషికాలు ఫసాక్. దాని ఒక్క కాటులో 110 మిల్లీగ్రాముల విషం వెలువడుతుందని బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మన అదృష్టమేంటి అంటే.. ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది. అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి. పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయి. ఇవి కాలాన్ని అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయి. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయి. చదవండి: యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం -
అయ్యో నాగరాజా! జ్యోతిష్యుడు చెప్పాడని..
క్రైమ్: దైవ భక్తి మంచిదే. కానీ, ఆ భక్తి ముసుగులో మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేవాళ్లను నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. పైగా బాగా చదువుకున్న వాళ్లు కూడా ఆ మత్తులో మోసపోతుండడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి మోసపోయి జేబు గుల్లజేసుకోవడంతోనే ఆగిపోలేదు. గుడ్డిగా జ్యోతిష్యుడు చెప్పింది చేసి వారంపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తమిళనాడు ఈరోడ్ జిల్లా, కోపిచెట్టిపాళయం సత్తి రోడ్డు నివాసి రాజా(54) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన కలలో పాములు కనిపిస్తున్నాయట. ఆ దెబ్బకి ఆయన నిద్రపోవడమే మానేశాడు. నిద్రలేమితో ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వచ్చింది. ఈ క్రమంలో.. ఓ జ్యోతిష్యుడ్ని కలిశాడు. తనకు నాగదోషం ఉందని చెప్పాడు. అదే అదను అనుకున్నాడేమో.. దోష పరిహారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఏర్పాట్ల కోసం గట్టిగా డబ్బులు తీసుకున్నాడు. సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి.. నాగదోష పరిహార పూజలు చేయించాడు. ఆఖరి ఘట్టంగా.. తన వెంట బోనులో తెచ్చిన ఓ రస్సెల్ వైపర్ పామును రాజా ముందు ఉంచి.. మూడుసార్లు పాములా నాలుక ఆడించమన్నాడు. ఆయన నాలుక ఆడిస్తుండగా.. జ్యోతిష్యుడు ఏవో మంత్రాలు వల్లించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి నాలుక ఆడించడగా.. బోనులోంచి సర్రుమని తల బయట పెట్టిన పాము, రాజా నాలుక మీద కాటేసింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిపోయాడు ఆయన. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి.. రాజాను రక్షించే ఉద్దేశంతో ఓ కత్తితో నాలుక కత్తిరించాడు. ఆలస్యం జరగకపోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి. కానీ, నాలుక పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాము విషానికి అతని నాలుక కణజాలం దెబ్బతింది. అయినప్పటికీ.. నాలుకను తిరిగి విజయవంతంగా సర్జరీ ద్వారా అతికించారు. వాపు తగ్గిన తర్వాత ఆయన ఇప్పుడు సాధారణంగా మాట్లాడగలిగే స్థితికి చేరడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్‌ను కలిగి ఉండడం, అంతకు మించి మోసం చేయడం తదితర నేరాల కింద ఆ జ్యోతిష్యుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. -
జస్ట్ మిస్.. క్షణం ఆలస్యం అయ్యుంటే ఎంత ఘోరం జరిగుండేదో
సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటి పాములు ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి ఎగబడుతున్నాయి. రోడ్లు, ఇళ్లు, బస్సు.. ఇలా ఎక్కడ చూసినా అనుకోని అతిథుల్లా ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఎక్కువ శాతం పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇలా ప్రమాదకరమైన పాములు కంటపడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థి సెకన్ల వ్యవధిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొల్లా జిల్లాలోని కూన్నతుర్లో జరిగింది. స్కూల్ యూనిఫాం ధరించి ఉన్న ఓ విద్యార్తి ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నిల్చొని ఉంటాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి గేట్ మూసేస్తుండగా.. పక్కనే పాము ఉండటాన్ని గమనించాడు. పాముని చూసి భయంతో వెంటనే అడుగు ముందుకు వేయగా.. పాము ఒక్కసారిగా అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి లోపలికి పరుగెత్తుకెళ్లాడు. అనంతరం తన తల్లిని తీసుకొచ్చి పామును చూపిస్తుండగా అది మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. చదవండి: చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. అబ్బాయి అదృష్టం బాగుంది. జస్ట్ మిస్.. క్షణం ఆలప్యం అయ్యుంటే పాము కాటుకు గురయ్యేవాడు. ఈ మధ్య పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సూచిస్తున్నారు. -
ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా!
ప్రపంచములో చాలా ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా(నల్లత్రాచు) ఒకటి. ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 15- 20 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా మనిషిని కాటేసి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని తెలిపాడు. వైద్యులను నమ్మించేందకు ఆ వ్యక్తి చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్లో వేసి తన వెంట హాస్పిటల్‌కు తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. దీంతో పామును చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shivam Kashyap (@kashyap_memer) -
నాగుపాము నుదుట ముద్దు! రివర్స్‌లో..
వైరల్: విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు ఆ వ్యక్తి. కానీ, ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో!. అందుకే ఒక్కపెట్టున మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్లో తిప్పి కొట్టింది. పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసి ఓ వ్యక్తి.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే.. అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంలో అతగాడు.. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. దీంతో అతగాడు పామును వదిలేశాడు. ఆపై ఒకతను ఆ పామును పట్టే యత్నం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. కాటేయించుకున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. పాము చిన్నది కావడం, విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ లిప్ టు లిప్ ఘాటు ముద్దుపై సోషల్ మీడియాలోనూ అంతే రేంజ్లో ‘అలా జరగాల్సిందే..’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి. -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
విషనాగుకే బలైన ‘స్నేక్‌మ్యాన్’ వినోద్
జైపూర్: ఆయన అనుభవం అలాంటిది ఇలాంటిది కాదు. ఏకంగా 20 ఏళ్లుగా పాములు పట్టే పని చేశారు. ఊరుకాదు.. ఏకంగా జిల్లాలో ఏ ఇంట్లో, దుకాణాల్లో పాములు దూరినా పట్టేసి అడవిలో భద్రంగా వదిలి వచ్చేవారు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. అలాంటి వ్యక్తి చివరకు.. పాముకాటుతో విషం ఒంటికెక్కి నిమిషాల్లోనే కుప్పకూలి మరణించాడు. రాజస్థాన్ చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ(45)కి ‘స్నేక్ మ్యాన్’గా పేరుంది. చురు జిల్లాలో ఎక్కడై.. ఏమూల అయినా ‘పాము’ అనే పిలుపు అందుకుంటే చాలు.. వెళ్లి తన పని చేసేవాడు. ఈ క్రమంలో.. శనివారం సాయంత్రం గోగమెడి ప్రాంతంలో ఓ నాగుపామును పట్టేశాడు. అయితే దానిని పట్టే క్రమంలో అది వేలిని కాటేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో.. ఆయన ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ముందు పామును దూరంగా వదిలొచ్చి.. ట్రీట్మెంట్కు వెళ్లాలని భావించారు. ఓ సంచిలో దానిని వేసుకుంటూ కాస్త ముందుకు వెళ్లగానే.. అలాగే కుప్పకూలిపోయారు. స్థానికులు అది గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాటేసిన నాగులో విషం మోతాదు అధికంగా ఉండడంతో ఆయన వెంటనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను గ్రామస్తులు దగ్గరుండి నిర్వహించారు. ప్రస్తుతం వినోద్ పామును పట్టి గాయపడిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. #Rajasthan | चुरु में सांप को पकड़ने आए विनोद तिवाड़ी को कोबरा ने काटा, कुछ ही मिनटों में हुई मौत, घटना हुई CCTV में कैद.#Snakeman #CobraBite #SnakeBite #ChuruDistrict #CCTVFootage #SardarShaharTown #Trending #abcnewsmedia #राजस्थान pic.twitter.com/HDjtJDsZMD — Abcnews.media (@abcnewsmedia) September 13, 2022 -
విషాదం... పాముకాటుతో మహిళ మృతి
శ్రీకాకుళం: మూఢ నమ్మకం మరో ప్రాణాన్ని బలికొంది. సకాలంలో వైద్యం చేయించకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఓ గిరిజన మహిళ కన్నుమూసింది. మందస మండలంలోని గిరిజన ప్రాంతమైన బసవసాయి గ్రామానికి చెందిన సవర సుజాత(30) పాముకాటుకు బలైంది. ఆమె ఆదివారం రా త్రి కుటుంబ సభ్యులతో ఇంటిలో నిద్రిస్తుండ గా అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఇంటిలో దూరి సుజాతను కరిచింది. సుజాత కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పాముకాటు ను గుర్తించారు. చుట్టుపక్కల వారు వచ్చి పా మును చంపేశారు. రాత్రి సమయం కావడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. దీని వల్ల సమయం వృథా అయ్యింది. పరిస్థితి విషమించడంతో 108కు సమాచారం అందించారు. సోమవారం ఉదయం ఐదు గంట ల సమయంలో 108 వాహనంలో ఆమెను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సూర్యనారాయణ, ఐదేళ్ల సుధీర్, మూడేళ్ల సౌజన్య ఉన్నారు. సుజాత మరణంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మందస జెడ్పీటీసీ సవర చంద్రమ్మబాలకృష్ణతో పాటు పలువురు గిరిజన నాయకులు సుజాత కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. -
నిద్రిస్తున్న అన్న,చెల్లికి పాముకాటు
ఇంద్రవెల్లి: ఒకే కుటుంబంలోని ఇద్దరు పిల్లలు పాముకాటుకు బలయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమకా పంచాయతీ పరిధి పాటగూడ(మారుతీగూడ) కోలాం గ్రామంలో చోటుచేసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దనోర పంచాయతీ పరిధి అక్షాపూర్ కోలం గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం రాజు–కవితాబాయి దంపతులకు భీంబాయి, భీంరావ్(14), దేవ్‌రావ్, దుర్గ, రాము, దీప(4)తోపాటు ఏడాది పాప ఉంది. కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితం కవితాబాయి తన పిల్లలతో కలిసి ఇంద్రవెల్లి మండలం సమకా పంచాయతీ పరిధి పాటగూడ(మారుతీగూడ)లోని పుట్టింటికి వెళ్లింది. అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివసిస్తోంది. కూలీపనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తోంది. శనివారంరాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో దీప ఏడుస్తూ నిద్ర లేచింది. కవితాబాయి ఆందోళన చెంది ఇరుగుపొరుగు వారిని పిలువగా అప్పటికే దీప స్పృహ కోల్పోయింది. అంతలో నిద్రలేచిన కొడుకు భీంరావ్ తన కుడి చెవిపై పాముకాటు వేసిందని తెలిపాడు. దీప శరీరంపై కూడా పాముకాటు కనిపించడంతో గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపే పరిస్థితి విషమించి దీప మృతి చెందింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో భీంరావు మృతి చెందాడు. -
పాముకాటుతో హాస్టల్ విద్యార్థి మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ)/ బాన్సువాడటౌన్: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ వసతి గృహంలో విద్యార్థి పాముకాటుతో మృతిచెందాడు. నస్రు ల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బీర్కూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ఐదో తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో నిద్రలేచి మిగతా విద్యార్థులను అప్రమత్తం చేశాడు. అక్కడే ఓ పాము కనిపించడంతో అందరూ కలిసి దానిని చంపేశారు. సాయిరాజ్‌కు వాంతులు కావడంతో వెంటనే అతడిని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే, ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు పరిశీలించి లక్షణాల్లేవని చెప్పి, ప్రాథమిక చికిత్స చేయకుండానే విద్యార్థిని వెనక్కి పంపించేశారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయిరాజ్ నోటి నుంచి నురుగులు రావడంతో భయానికి గురైన తోటి విద్యార్థులు నైట్ వాచ్‌మన్, వార్డెన్, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్‌కు వచ్చేసరికి సాయిరాజ్ మృతి చెందాడు. వార్డెన్ వచ్చి సాయిరాజ్ మృతికి కారణం చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన గురించి తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ జితేష్‌వి పాటిల్‌తో మాట్లాడారు. దీంతో కలెక్టర్ వెంటనే వార్డెన్ ను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని స్పీకర్ ఫోన్లో బాధితులకు హామీనిచ్చారు. సాయిరాజ్ తల్లిదండ్రులు గంగామణి, మురళి కూలీలు. వీరికి మరో మూడేళ్ల పాప ఉంది. పారిశుధ్య కార్మికురాలికీ పాముకాటు విద్యార్థి మృతి అనంతరం అధికారుల ఆదేశాలతో శనివారం పరిసరాలను శుభ్రంచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు జ్యోతినీ ఓ పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను బాన్సువా డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్షణాలు కనిపించలేదు: స్టాఫ్ నర్స్ వినోద, బీర్కూర్ పీహెచ్సీ సాయిరాజ్ అస్వస్థతకు గురై రాత్రి ఒంటి గంట సమయంలో పీహెచ్‌సీకి వచ్చాడు. ఎటువంటి లక్షణాలు కనబడకపోవడంతో వైద్యం చేయలేదు. వసతిగృహంలోకి పాము వచ్చిందని తెలపడంతో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో పంపిస్తానన్నాను. అయితే, తనను పాము కరవలేదని, అక్కడికి వెళ్లబోనని సాయిరాజ్ చెప్పడంతో తిరిగి పంపించేశాను. -
కామారెడ్డి జిల్లాలో విషాదం
-
వర్షాకాలంలో పాముల బెడద.. అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి బుధవారం పొలం పనికి వెళ్లాడు. కాలుకి ఏదో విష పురుగు కరిచిందని గుర్తించాడు. నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిమిషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనకు కరిచింది విషపురుగు కాదని, చంద్రపొడి (రెసెల్స్‌వైపర్) జాతికి చెందిన విష సర్పం కాటువేసిందని గమనించి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. కేవలం అవగాహన లోపంవల్ల రైతు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ మంగళవారం పొలంపని నిమిత్తం తన పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన తక్షణమే ఎటువంటి భయానికి గురికాకుండా తన దగ్గరలోవున్న పీహెచ్‌సీకి వెళ్లి స్నేక్‌యాంటీ వీనం వ్యాక్సిన్‌ను చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండేళ్లలో 493 మంది పాముకాటుకు గురయ్యారు. చాలామంది సకాలంలో ఆస్పత్రికి చేరడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే మృతిచెందారు. అవగాహన ఉంటే పాముకరిచినా ప్రమాదం కాదని, సకాలంలో వైద్యసేవలు అందితే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తతే ప్రధానం.. వర్షా కాలం ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకో వటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకుంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచుకోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు. విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాము కాటు లక్షణాలు, చికిత్స.. ► పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావడంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. ► పాము కాటుకు గురైన వ్యక్తిని కంగారుపెట్టరాదు. ఆందోళనకు గురయితే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తిచెందే అవకాశంఉంటుంది. ► పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి. ► వేగంగా యాంటీ వీనమ్‌ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకెళ్లాలి. ► కాటుకు దగ్గరగా గుడ్డను/వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది. ► గాయం కడగరాదు. గాయం మీద ఐస్‌ను పెట్టరాదు. ► గాయం నుంచి విషాన్ని బయటకు పీల్చడానికి ప్రత్నించరాదు. మెరుగైన వైద్యం పాముకాటు బారిన పడి న వ్యక్తికి పీహెచ్సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు సిద్ధం చేశాం. పాముకాటుకు గురైన వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవాలి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్‌వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రధానంగా భయపడకుండా నిర్భయంగా ఉండాలి. – డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం -
పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..
సాక్షి, భువనేశ్వర్: మనిషి పగతో పాము కథ ముగిసింది. మనిషి కాటుతో పాము మృతి చెందింది. ఇది కథ కాదు వాస్తవం. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. భోళా శంకరుడి తరహాలో కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసంతా నిండిన ఉక్రోషంతో పాము పట్ల పగ తీర్చుకున్నాడు. ఈ దృశ్యం గ్రామస్తులు, చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ తన పొలంలో బుధవారం ఉదయం తిరుగాడుతుండగా కాలిపై నాగుపాము కాటేసింది. అక్కడి నుంచి పారిపోతున్న సర్పాన్ని.. వెంబడించి పట్టుకున్నాడు. తనకు కాటేసినట్లే తాను కూడా పాముని కాటేసి చంపేయాలనుకున్నాడు. పాము రెండు చివర్లు తల, తోక పట్టుకుని మిగిలిన భాగం అంతా ఎక్కడికక్కడ కొరికేశాడు. మాంసం బయట పడేంత వరకు పట్టు వదలకుండా కొరికి, శాంతించాడు. బాధ తాళలేని పాము.. తన నోటితో తానే కాటేశాలా చేశాడు. దీంతో చనిపోయిన సర్పాన్ని మెడలో చుట్టుకుని ఊరిలో ఊరేగాడు. ఇది చూసిన వారి నోటమాట రాకుండా నివ్వెర పోయారు. అయితే పాము కాటుకు మాత్రం ఎటువంటి వైద్యం చేసుకోలేదు. పాము మంత్రం తెలిసిన తాంత్రికునిగా చెప్పుకొని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పాముని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వివరించాడు. ఈ ఘటన పట్ల వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు ఇంతవరకు స్పందించ లేదు. చదవండి: బొగ్గు కుంభకోణం, బెంగాల్ న్యాయమంత్రిపై సీబీఐ -
మహిళపై పడగవిప్పిన నాగు పాము.. ఆమె ఏం చేసిందంటే?
బెంగళూరు: పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఆమెపైకి ఎక్కిన నాగుపాము పడగవిప్పి కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్ గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలను స్థానికుడు ఒకరు ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెపై మహిళ నిద్రపోగా.. నాగుపాము ఆమెపైకి ఎక్కి పడగవిప్పింది. పాము కదలికలతో మేల్కొన్న మహిళ పడగవిప్పిన నాగును చూసి.. కదలకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రమాదం నుంచి కాపాడు దేవుడా అంటూ వేడుకుంది. కొద్దిసేపు అలాగే పడగవిప్పుకొని ఉన్న పాము మహిళకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. An incident of a cobra ascending on the body of a woman who was sleeping in her field at Mallabad village of Afzalpur taluk on Friday afternoon has come to light on Saturday. However the snake moved out from her body without harming her after few minutes.@XpressBengaluru pic.twitter.com/YJdvwzAfI6 — Ramkrishna Badseshi (@Ramkrishna_TNIE) August 27, 2022 ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్.. అధికారులే షాక్! -
ఒకే కుటుంబంలో ఐదుగురిని కాటేసిన పాము
తుమకూరు: ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు. పాముకాటు బాధిత కుటుంబం గత బుధవారం రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాట్లకు గురయ్యారు. ధర్మణ్ణ ఒక రోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నపళంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాత కాలంలో మళ్లీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు. -
మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!
లక్నో: పాములు పట్టేవాడు.. ఏదో ఒకనాడు దాని కాటుకే బలవుతాడంటారు. ఇది నిజమని నిరూపించింది ఇక్కడో ఘటన. ఊరిలో పాములు పట్టి వాటిని కాపాడే యత్నం చేసే ఓ వ్యక్తి.. తన ‘అతి’ చేష్టలతో, నిర్లక్ష్యంతో దాని కాటుకే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా పరిధిలోని జైతీపూర్ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఆ విష సర్పాన్ని ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకుని.. దానితో ఊరంతా కలియదిరిగాడు. అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ప్రదర్శించి.. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది. వెంటనే దానిని మళ్లీ బంధించి.. ఓ కుండలో బంధించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో గాయానికి చికిత్స చేసుకున్నాడు అతను. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు. ఇదీ చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు -
పాముపై పగ తీర్చుకున్న 2 ఏళ్ల చిన్నారి.. ఏం జరిగింది?
ఇస్తాంబుల్: పాములు పగ తీర్చుకునే సంఘటనలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలోనూ అక్కడక్కడ జరిగినట్లు తెలుసు. కానీ, పాముపై పగ తీర్చుకున్న సంఘటన ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుంది. దానిని నోటితో ముక్కలు ముక్కలు చేసింది. ఈ సంఘటన టర్కీలోని కంతార్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని తన ఇంటి వెనకాల పెరటిలో చిన్నారి ఆడుకుంటోంది. ఒక్కసారిగా పెద్దగా అరిచింది. దీంతో ఏదో జరిగిందని ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు పరుగున పెరట్లోకి వెళ్లారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాప నోట్లో పాము ఉంది. మరోవైపు.. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే చిన్నారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక బింగోల్ మెటర్నిటీ, చిల్డ్రెన్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ‘మా పాప చేతిలో పాము ఉన్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు నాకు చెప్పారు. దాంతో ఆమె ఆడుకుంటుండగా కాటు వేసింది. ఆ కోపంతో ఆమె పామును కొరికేసింది.’ అని పాప తండ్రి మెహ్మెట్ ఎర్కాన్ పేర్కొన్నారు. మరోవైపు.. పాము కాటుకు గురైన ఓ 8 ఏళ్ల బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన టర్కీలోని మరో ప్రాంతంలో జరిగింది. చేతిపై కాటు వేయటంతో సాదారణ సైజ్‌తో పోలిస్తే ఐదింతలు ఉబ్బిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి -
సర్పగండం: 20 ఏళ్లలో 12 లక్షల మంది పాముకాట్లకు బలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు అంటే 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో మృతిచెందారని తెలిపింది. అంటే ఏటా సరాసరి 58 వేల మంది చనిపోయారని, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగానే ఈ లెక్కలు వేసినట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. కానీ కేంద్ర, రాష్ట్రాలు మాత్రం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నాయని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో 1,068 మంది, 2018లో 1,060 మంది, 2018లో 885 మంది పాముకాటుతో చనిపోయారని.. కానీ కేంద్రం లెక్కిస్తున్న దానికన్నా పాముకాటు మృతుల సంఖ్య 60 రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది. విరుగుడుకు కొరత... దేశంలో కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజరల వల్ల ఎక్కువగా పాముకాట్లు, మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే నాలుగు కంపెనీలే ఆ నాలుగు రకాల పాముల విషానికి విరుగుడు (యాంటీవీనం) తయారు చేస్తున్నాయని, కానీ వాటి తయారీ ప్రక్రియలో నాణ్యత ఉండటం లేదని వ్యాఖ్యానించింది. దేశంలో ఏటా 15 లక్షల వయల్స్ యాంటీవీనం ఉత్పత్తి అవుతుండగా ఒక్కో పాముకాటు బాధితుడికి అవసరాన్ని బట్టి 10 నుంచి 20 వయల్స్ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంటే ఏటా కేవలం లక్ష మంది పాముకాటు బాధితులకే విరుగుడు మందు అందుబాటులో ఉందని వివరించింది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏటా సరాసరి 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. కానీ లక్ష మంది బాధితులకు సరిపోయే వయల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో మందు దొరకడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చదవండి: (ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి) జూన్–సెప్టెంబర్ మధ్యే 80% పాముకాట్లు... ►90% పాముకాట్లు కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజర వల్ల జరుగుతున్నాయి. ►పాముకాటు మరణాలకు 10 రెట్లు ఎక్కువగా బాధితులు అంగవైకల్యానికి గురువుతున్నారు. ►పాముకాటు కేసుల్లో 30% పూర్తిస్థాయిలో విషం మనిషి శరీరంలోకి వెళ్తోంది. ప్రపంచ సగటు కంటే ఇది ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్రామాల నుంచి సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సౌకర్యం లేకపోవడం, పాముకాటు వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే. ►పాము కాటేశాక పల్లెల్లో చాలా మంది పసర వైద్యం తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ►80% పాము కాట్లు జూన్–సెప్టెంబర్ మధ్యనే జరుగుతుంటాయి. వానాకాలం కావడం, రైతులు, కూలీలు పొలాలకు వెళ్తుండటమే దీనికి కారణం. ►14% పాముకాటు కేసుల్లో పాము కరిచిన జాడలు కనిపించడంలేదు. ►10–19 ఏళ్ల వయసు వారే ఎక్కువగా పాముకాటుకు గురవుతున్నారు. ►67% పాటుకాట్లు కాళ్లపైనే జరుగుతున్నాయి. ►40% పాముకాట్లు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే చోటుచేసుకుంటున్నాయి. ►60% పాముకాట్లు ఇంట్లో లేదా ఇంటికి దగ్గరలో జరుగుతుంటాయి. 8% పాముకాట్లు మల విసర్జనకు వెళ్లినప్పుడు సంభవిస్తున్నాయి. 10% పాముకాట్లు నిద్రపోయే సమయంలో జరుగుతున్నాయి. ►పాముకాటు మరణాల్లో 90% గ్రామాల్లోనే సంభవిస్తున్నాయి. ►పాముకాటు మరణాల్లో 77% ఆసుపత్రి బయటే జరుగుతున్నాయి. ►దేశంలో సంభవించే మరణాల్లో 0.5% పాముకాటుతోనే జరుగుతున్నాయి. దోమతెరలతో రక్షణ పొందొచ్చు.. నేలపై పడుకున్నప్పుడు పాము కాటుకు గురైతే విషం సాధారణంకంటే 6 రెట్లు వేగంగా ఒంట్లోకి వ్యాపిస్తుంది. దోమతెరలు వాడితే పాముకాటు నుంచి బయటపడొచ్చు. అలాగే ఎలుకలు ఎక్కువగా తిరిగే ధాన్యం నిల్వ ఉంచిన గదులు, వంటింటి దగ్గర్లోనే పాములు వాటిని తినేందుకు వస్తుంటాయి కాబట్టి అక్కడ పడుకోవద్దు. ఇంటి చుట్టపక్కల వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి
ఓ పాము కారణంగా వారి ఇంట విషాదం నెలకొంది. పాము కాటు కారణంగా అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బలరాంపూర్ జిల్లాలోని భవానీపూర్ గ్రామానికి చెందిన అరవింద్ మిశ్రా మంగళవారం పాము కాటు కారణంగా మృతిచెందాడు. ఈ క్రమంలో పంజాబ్‌లోని లూధియానాలో నివాసం ఉంటున్న తన తమ్ముడు గోవింద్ మిశ్రాకు ఈ విషయం తెలిసింది. దీంతో, అన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులతో కలిసి తన స్వగ్రామానికి వచ్చాడు. అయితే, అంత్యక్రియల అనంతరం రాత్రి వారి ఇంట్లో నిద్రపోతున్న గోవింద్ మిశ్రా, అతడి బంధువు చంద్రశేఖర్ పాండేను మరో పాము కాటు వేసింది. కాగా, పాము కాటు కారణంగా గోవింద్ మిశ్రా అక్కడికక్కడే మృతిచెందగా.. చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, పాము కాటు కారణంగా రెండు రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. పాములు వారి కుటుంబ సభ్యులను పగపట్టాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. Too many snakes in UP. Uttar Pradesh: Snakebite victim's brother visits village for funeral, gets killed by another snake https://t.co/6Tgb0hTTUO — Crime Reports India (@AsianDigest) August 4, 2022 ఇది కూడా చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ -
పాము కాటుకు విద్యార్థి మృతి
చిత్తూరు: పాటముకాటుకు ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన సదుం మండలంలో మంగళవారం జరిగింది. 108 సిబ్బంది కథనం మేరకు.. నడిగడ్డ పంచాయతీ కశిరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు సుదర్శనకుమార్(17) సదుం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సాయంత్రం గ్రామంలో ఇంటి వద్ద స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా తొట్టి వద్ద పడిన బాల్ తీసుకొచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. అతనిని 108లో సదుం సీహెచ్‌సీకి తీసుకొచ్చి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీలేరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
ఆ విద్యార్థికి మూడుసార్లు పాముకాటు
పెద్దకొడప్గల్ (జుక్కల్): ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు ఒక విద్యార్థి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణకు శుక్రవారం ఉదయం పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్గల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. -
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్‌పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
ఒకేసారి రెండు పాములు.. విద్యార్థినిని కాటేసి..
నంద్యాల (నందవరం): ఒకేసారి రెండు పాములు కాటేసి ఓ విద్యార్ధిని ప్రాణాలు తీశాయి. నందవరం మండలం నదికైరవాడి గ్రామం యానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చాకలి నాగరాజు, నరసమ్మ దంపతుల మూడవ కుమార్తె మల్లేశ్వరి (15)మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రేకుల కొట్టంలో పడుకుంది. సుమారు 11 గంటల సమయంలో తన చేతికి, కాలికి ఏదో కరిచిందని మల్లేశ్వరి నిద్రలేచి తండ్రికి చెప్పింది. అతను లైట్లు వేసి చూడగా మల్లేశ్వరి చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద మరో పాము కనపడ్డాయి. వాటిని చంపి వెంటనే కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుతున్న కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అత్యంత ప్రమాదకరమైన ఈ మూడు పాముల గురించి తెలుసా?
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): వర్షాకాలం మొదలైంది. పాములు ఎక్కడపడితే కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకుని ఉంటాడు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో గత మూడు రోజుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అన్ని ఆస్పత్రుల్లో యాంటివీనమ్ పాముల నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తత అవసరం. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – జె. సురేష్, వైద్యుడు, పులిరామన్నగూడెం -
పాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి..
అసలే తాచుపాము. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పాము రోడ్డు దాటుతోంది. ఇంతలో పామును పట్టుకొని, ఓ తాగుబోతు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నవరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి జాంబగుడ వద్ద జాతీయ రహదారిపైకి శుక్రవారం తాచుపాము వచ్చింది. ఎటువెళ్లాలో తెలియక రోడ్డు మధ్య భయంతో బుసలు కొడుతోంది. గమనించిన వాహనదారులు ప్రాణభయంతో దూరంగానే ఉండిపోయారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన మాధవ గౌడ మద్యం మత్తులో అక్కడకు చేరాడు. వెంటనే పాముని పట్టుకున్నాడు. తాగిన మైకంలో విన్యాసాలు ప్రారంభించాడు. హద్దు మీరి ముద్దు పెట్టడంతో పాము మరింత కోపంతో అతని నోటిపై కాటు వేసింది. ఇది చూసిన జనం ఆందోళనతో పామును వదలమని కేకలు వేశారు. మరికొందరు పాముని వదిలితే డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు విసిరారు. కానీ.. ఎవరూ అతని వద్దకు వెళ్లేందుకు సాహసించలేదు. కొంతసేపటికి అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. చివరకు పాముని వదలినా, దాని వెంట పడటం ప్రారంభించాడు. మళ్లీ పాము పడగ ఎత్తి, పలుమార్లు కాలిపై కాటువేసి, అడవిలోకి పారిపోయింది. వెంటనే వాహనదారులు అంబులైన్స్ సమాయంతో మాధవ్‌ను నవరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి.. -
పాముకాటుకు తల్లడిల్లి తనువు చాలించిన చిట్టితల్లి
కర్నూలు (వెల్దుర్తి) : తనకేం జరిగిందో తెలీదు. ఊపిరాడని స్థితిలో తీవ్ర బాధను అనుభవించింది. చెప్పేందుకు నోరురాక, శరీరం సహకరించక.. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించిందో చిట్టితల్లి. పదకొండేళ్ల ఆ బాలిక పేరు అంజలి. వెల్దుర్తి మండలంలో జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే... పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవిలకు నలుగురు కుమార్తెలు సంతానం. మూడవ కుమార్తె అంజలి. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి తన ఆఖరు కూతురుతో కలిసి రెండేళ్ల నుంచి పుట్టిల్లు బలపాలపల్లెలో ఉంటోంది. తండ్రి బ్రహ్మయ్య ఆ సమయం నుంచే పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు కుమార్తెలు కుటుంబ భారం మోస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. మూడవ కుమార్తె అంజలి స్థానిక ఎంపీపీ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసుకుంది. సెలవులు కావడంతో తన అక్కలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఆదివారం రాత్రి రోజూ మాదిరిగానే ఇంట్లో (రేకుల షెడ్డు) నిద్రించింది అంజలి. 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో కాలికి ఏదో కరిచినట్లు గుర్తించింది. అబ్బా అనుకుంటూనే వెళ్లి పడుకుంది. రెండు గంటల సమయానికి గొంతు, మొహం వాచిపోయి, శరీరంలోను, కాలి వద్ద తీవ్ర నొప్పి మొదలైంది. చెప్పుకోవడానికి తల్లి లేకపాయె. తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. అక్కలు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాగోలాగ తడబడుతూ బయటకు వచ్చి పక్క ఇంట్లో నివాసముంటున్న జేజినాయన చిన్నమారెన్న వద్దకు వెళ్లింది. అక్కడ జేజినాయన, జేజి, చిన్నాన్నకు విషయం తెలుపలేక అప్పటికే మూగబోతున్న గొంతుతో కొద్దికొద్దిగా చెబుతూ, చివరకు సైగలు చేసింది. నోరు మెదపలేని స్థితిలో, ఊపిరి ఎగదోసుకుంటూ వచ్చిన బాలికను చూసి వారు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలీదు, బాలిక చెప్పలేకపోతోంది. చివరకు అచేతనావస్థకు చేరుకుంటోంది. పాముకాటు వేసినట్లు నిర్ధారించుకుని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాముకాటుకు తగిన చికిత్స అందించేలోగా సోమవారం తెల్లవారుజామున అంజలి కన్నుమూసింది. -
భార్యకు పాము కాటు.. కాటేసిన పామునూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు
లక్నో: యస్.. భార్యను పాము కాటేసింది. నొప్పితో ఆమె విలవిలలాడుతోంది. స్థానికులంతా చేరి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ భర్త మాత్రం భార్యను పట్టించుకోలేదు. నానా హంగామా చేసి ఆ పామును పట్టేసుకున్నాడు. పాము కాటుకి గురైన భార్యతో పాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకుపోయాడు. అది చూసి డాక్టర్లు భయపడిపోయారు.. ఆ తర్వాత ఏమైందంటే.. చిత్రమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ అఫ్జల్ నగర్ ఏరియాలో జరిగింది. భార్యను పాము కాటేయడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త రమేంద్ర యాదవ్. అయితే.. భార్యను కాటేసిన పామును సైతం ఓ బాటిల్లో బంధించి.. దానికి గాలి ఆడేలా ఆ బాటిల్‌కు చిన్నచిన్న రంధ్రాలు చేసి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ‘ఎందుకు తెచ్చావయ్యా!’ అని వైద్య సిబ్బంది అడిగితే.. ‘‘నీ భార్యను ఏ పాము కాటేసిందని అడిగితే.. ఏమని చెప్పేది. అందుకే.. ఆ పామునే తెచ్చా! అని సమాధానం ఇచ్చాడు రమేంద్ర. ఆ సమాధానం విని డాక్టర్లు తెగ నవ్వుకున్నారట. చికిత్స తర్వాత కోలుకున్న భార్యను ఇంటికి తీసుకెళ్లే క్రమంలోనే.. అడవిలో ఆ పామును వదిలేశానని రమేంద్ర మీడియాకు వెల్లడించాడు. -
బాలుడిని కాటేసి అక్కడే చనిపోయిన పాము.. షాక్‌లో పేరెంట్స్
మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ చేసిన వినయ విధేయ రామ సినిమాలో విలన్‌ను పాము కాటు వేశాక.. ఆ పాము చనిపోవడం చూశాము కదా.. అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. కాగా, అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కోట్లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్ ఇంటి ముందు ఆడుకుంటుడగా.. ఓ పాము(విష సర్పం)ను బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే పాము చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు.. అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: నదీస్నానంలో భార్యకు ముద్దు.. బయటకు లాగి చితకబాదిన జనం -
ఉడుము అనుకొని పామును లాగాడు
నిజామాబాద్ : ఉడుము అనుకొని పామును లాగగా అది కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని లింగాపూర్‌కు చెందిన కోరె లింగన్న(53) శనివారం నారుమడికి నీరు పెట్టెందుకు పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం గట్టుకు ఉన్న రంధ్రంలో తోక కనిపించగా ఉడుము అనుకొని లాగాడు. అది రక్త పింజర కావడంతో బయటకు లాగగానే కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. -
తీరని విషాదం: కొట్టి విసిరేస్తే కుమారున్ని కాటేసింది
తాంసి: ఇంట్లో దూరిన విషసర్పాన్ని కర్రతో కొట్టి విసిరేస్తే.. అది సరాసరి ఆ ఇంటి యజమాని ఏకైక కుమారుడి పక్కనే పడి కాటేసింది..ప్రాణాలు వదులుతూ అభం శుభం తెలియని పసివాడిని బలి తీసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాం గ్రామంలో గురువారం జరిగింది. రెండేళ్లకే నూరేళ్లు గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన దంపతులకు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత రెండేళ్ల క్రితం బాబు నైతిక్ (2) జన్మించాడు. ఇన్నేళ్లకు కలిగిన సంతానాన్ని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. చనిపోయిందనుకుని.. బైరెడ్డి సంతోష్ ఇంటి ఆవరణలోకి మధ్యాహ్నం రక్తపింజర పాము ప్రవేశించింది. అది గుర్తించిన సంతోష్ స్థానికుల సాయంతో దాన్ని కొట్టారు. పాము చనిపోయిందనుకుని స్థానికులు కర్రతో బయటకు విసిరేయగా అది సంతోష్ కుమారుడు నైతిక్ పక్కన పడింది. అది బాలుని కాలిపై కాటేయడంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అప్పటికే విషం శరీరమంతా పాకడంతో వైద్యులు చికిత్స అంది స్తుండగానే చిన్నారి మృతి చెందాడు. పెళ్లయిన ఎన్నో ఏళ్ల తరవాత పుట్టిన బిడ్డను పాము బలి తీసుకోవడంతో సంతోష్, అర్చన దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే?
తిరువొత్తియూరు(చెన్నై): భార్యను కొరికిన కొండచిలువను భర్త ప్రాణంతో పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంఘటన పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. వివరాలు.. జిల్లాలోని తిరుమయం సమీపంలోని మేల దూర్వాసపురానికి చెందిన పాండియన్ (37) భార్య అలగు (33) బుధవారం తన ఇంటి సమీపంలో ఉన్న కట్టెలను పేరుస్తుండగా ఓ పాము ఆమెను కాటు వేసింది. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త పాండియన్‌కు తెలిపింది. అతను ఆ పామును పట్టుకుని గోనె సంచిలో వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి తన భార్యకు చికిత్స చేయమని కోరాడు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువ కాటు వల్ల అలగుకు ప్రమాదం ఉండదని తెలిపారు. అనంతరం కొండచిలువను అడవిలో వదిలిపెట్టారు. చదవండి: Karnataka Heavy Rains: ఇదేందయ్యా.. నెల వర్షం ఒక్క రోజులోనే! -
ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది
Girl Holds & Plays With Snake: పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు చూశాం. పాములతో డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, రబ్బరు బ్యాండ్‌లా పాముని తలకు చుట్టుకున్న వీడియోలు చూశాం. కొంతమంది అత్యంత విషపూరితమైన పాములను సైతం చాకచక్యంగా హ్యాండిల్ చేసే సాహసపూరితమైన ఫీట్లు కూడా చూశాం. కానీ వాటన్నింటిని చూసినప్పుడూ కలగని భయం ఈ వీడియో చూస్తే కచ్చితంగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఆ పాము ఆమెకు అసలు సహకరించకుండా ఏం చేసిందో తెలుసా! వివరాల్లోకెళ్తే....ఒక అమ్మాయి ప్రమాదకరమైన పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఐతే ఆ పాము ఆమెకు సహకరించడం లేదో దాని మూడ్ బాగోలేదో గానీ అది అసలు ఆమెకు సహకరించదు. ఆమెను పదే పదే కాటేసేందుకు ప్రయత్నించడమ కాకుండా చాలా సార్లు ఆమె చేతిపై కాటు వేసింది. ఆమె ఆ పాముని కంట్రోల్ చేసేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అది అసలు సహకరించదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగవైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) (చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్) -
పామునాడించి.. ప్రాణాలు కోల్పోయి
మణుగూరు టౌన్: ఎక్కడ పాము కనిపించినా చాకచక్యంగా బంధించే వ్యక్తి.. అదే పాము కాటుతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన షరీఫ్ (31) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూనే పాములను పడుతుంటాడు. దీంతో ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా స్థానికులు ఆయనకు సమాచారం ఇస్తారు. ఇదే క్రమంలో రిక్షా కాలనీకి చెందిన బానోత్ వెంకట్రావ్ ఇంట్లోని బావిలో మంగళవారం తాచు పాము కనిపించగా, షరీఫ్ దాన్ని బయటికి తీసుకొచ్చి సుమారు గంట పాటు రోడ్డుపై సరదాగా ఆడించాడు. ఈ సమయంలోనే అతని చేతిపై పాము కాటు వేసింది. అదేమీ పట్టించుకోని షరీఫ్ పామును బస్తాలో వేసుకుని తీసుకెళ్లి అడవిలో వదిలివేసి తిరిగి వస్తుండగా సురక్షా బస్టాండ్ వద్ద కింద పడిపోయాడు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తల్లి కమరున్నీసా బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు. పాములను అత్యంత చాకచక్యంగా బంధించే షరీఫ్ అదే పాముకాటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పాము కాటు వేయగానే ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా షరీఫ్ పట్టించుకోలేదని సమాచారం. -
పాములు పగబడతాయా.. అందులో నిజమెంత..?
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ సందర్భంగా పాముల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అవసరం. అన్ని పాములూ విషం కలిగి ఉండవు. కేవలం నాలుగయిదు రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్నిచోట్లా డాక్టర్లు ఉండరు కాబట్టి కరిచినా విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది. పాము కరిచిన తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఆ పాము మనిషిని కరవక ముందు, ఏదైనా జంతు వును కరచినట్లయితే, ఆ తరువాత మనిషిని కరచినా కూడా ప్రమాద ముండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కోరల్లో ఉండదు. ఇది తెలియక కూడా భయపడతాం. కొంతమంది తమపై పాము పగబట్టిందనీ, అందుకే కాటేసిందనీ లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నదనీ భయపడుతుంటారు. పాము పగ బట్టడం అబద్ధం. మనకి పాముని చూస్తే, ఎలా భయమేస్తుందో, పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటేనే కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలే కానీ మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాముకాటుకు గురైనా బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. – నార్నె వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు, ఏపీ హేతువాద సంఘం -
వెంటాడిన మృత్యువు.. ఏడు నెలల్లో మూడుసార్లు పాము కాటు
ఆదిలాబాద్ (బేల) : మండలంలోని బెదోడకు చెందిన విద్యార్థిని పాము కాటేయడంతో మృతి చెందింది. వివరాలు ఇలా.. బాలేరావు సుభాష్–రంజన దంపతుల కుమార్తె ప్రణాళి (18) ఇంటి వద్ద శుక్రవారం పాముకాటుకు గురైంది. హోలీ పండుగ రోజు తన స్నేహితులతో ఆనందోత్సవాల మధ్యన ఉండగా, తన కాలేజీ బ్యాగ్‌లో ఉన్న రంగులు తీద్దామని ప్రయత్నించింది. అందులో ఉన్న పాము కాటేసింది. కుటుంబసభ్యులు ఆమెను రిమ్స్‌కు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందింది. గతంలో ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఆమె పాము కాటుకు గురైంది. మూడోసారి పాముకాటుతో మృత్యువు ఒడిలోకి వెళ్లింది. -
మూడు పాములతో యువకుడి స్టంట్.. చివరకు ఏమైందో చూడండి..
పాములతో వ్యవహరించే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిలో అవి వెళ్తుంటే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుద్ది. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటకు చెందిన మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్. అతని యూట్యూబ్ ఛానల్లో పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. అయితే ఓసారి అతను పాముల ముందు కూర్చొని వాటితో సహాసాలు చేశాడు. పాముల తోకలను పట్టుకొని లాగడం, వాటిని కదిలించడం చేశాడు. చేతులు, కాళ్లతో పాములను భయపెడుతుండగా ఊహించని విధంగా అందులోని ఓ పాము అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి చేసింది. వ్యక్తి మీదకు జంప్ చేసి అతని మోకాలిని కొరికి పట్టుకుంది. దీంతో షాక్‌కు గురైన వ్యక్తి పామును లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకీ విడిచి పెట్టలేదు. చదవండి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన కేసులో ట్విస్ట్ This is just horrific way of handling cobras… The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc — Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022 ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్లో పోస్టు చేశారు. ‘పాములను ఇలా హ్యండ్లింగ్ చేయడం భయంకరమైనది. వ్యక్తి చేసిన కదలికలను పాము బెదిరింపుగా భావిస్తుంది, వాటిని అనుసరిస్తుంది. కొన్నిసార్లు పాముల ప్రతిస్పందన ప్రాణాంతకం కావచ్చు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో చూసి నెజటిన్లు భయంకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. పాములతో అలా స్టంట్స్ చేయోద్దని హితవు పలుకున్నారు. చదవండి: వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! -
విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్‌కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. (చదవండి: విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. ) -
విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..
కురుపాం/విజయనగరం ఫోర్ట్: రాత్రి 10 గంటల వరకు అందరూ ఒక్కచోటే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు... 8వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించారు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కట్ల పాము రూపంలో మృత్యువు గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి గదిలోకి ప్రవేశించింది. వరుసగా నిద్రపోతున్న విద్యార్థుల్లో ముగ్గురిని కాటేసింది. విద్యార్థులు వెంటనే మేల్కొన్నారు. పామును గమనించారు. కేకలు వేయడంతో మిగిలిన విద్యార్థులు కర్రతో దానిని హతమార్చారు. వసతిగృహ సిబ్బంది సహాయంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నా ఒక విద్యార్థి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలో ఉన్న మహా త్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్‌కుమార్, సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడు పేటకు చెందిన వంగపండు నవీన్‌లతో పాటు మరో 9 మంది వసతిగృహం డార్మిటరీ గదిలో నిద్రపోతున్నారు. అర్ధారాత్రి తర్వాత కట్లపాము వరుసగా నిద్రపోతున్న రంజిత్‌కుమార్, వంశీ, నవీన్‌ల ముక్కు, కంటి, వీపుమీద కాటేసింది. వారు వసతిగృహంలో ఉన్న ప్రిన్సిపాల్ బిర్లంగి సీతరామ్, ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేశారు. వసతిగృహ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనంపై కురు పాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్ (13) మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. మహాశివరాత్రికి ఇంటికి వచ్చావు.. అందరితో కలిసి సరదాగా గడిపావు.. పామునోట పడేందుకే వసతిగృహానికి వెళ్లావా అంటూ రంజిత్‌కుమార్ తల్లి సన్యాసమ్మ విలపిస్తున్న తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. నా ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకున్నాను.. నాకు దేవుడు అన్యాయం చేశాడు.. మంచి వాళ్లనే తీసుకుపోతాడంటూ బోరున విలపిస్తోంది. విద్యార్థి తండ్రి కృష్ణ ఆస్పత్రి వద్దే కుప్పకూలిపోయారు. రంజిత్ మృతితో వసతిగృహంతో పాటు స్వగ్రామం దళాయిపేటలో విషాదం అలముకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా: కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేలా సేవలందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి మృతి బాధాకరం పాముకాటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఒక విద్యార్థి మృతిచెందడం బాధాకరమన్నారు. రంజిత్‌కుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. పాముకరిచిందని విద్యార్థులు తెలిపిన వెంటనే ప్రిన్సిపాల్ స్పందించారన్నారు. విద్యార్థులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బీసీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిందని, అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సదుపాయాలతో కూడిన శాశ్వత వసతి కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు. -
విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ముగ్గురిలో రంజిత్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా.. రంజిత్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం!
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): పాముకాటుకు గురై ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్(30) నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్‌ఫోన్ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి ఇంట్లోనే.. -
పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!
ఇటీవలకాలంలో పాములకు సంబంధించి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. పాములను ముద్దు పెట్టుకోవడం, రబ్బర్ బ్యాండ్‌లా చ్టుటుకున్న వైరల్ వీడియోలు చూశాం. అయితే ఆ పాములు ఏం చేయనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గాయని పాముల ఒంటి మీద వేసుకుంటు మ్యూజిక్ షూటింగ్ చేస్తే ఏమయ్యేందో చూడండి. (చదవండి: అప్పడు అత్యంత పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే!!) అసలు విషయంలోకెళ్లితే....జే-జెడ్ లేబుల్ రోక్ నేషన్ సంస్థ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియోని షూట్ చేసింది. అయితే షూటింగ్లో గాయని నేల మీద పడుకుని పాములు మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో ఏమైదో ఏమో గానీ ఒక నల్లపాము అమాంతం ఆమె ముఖం మీదే కాటే వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగి బిత్తరపోయి వాటిని పక్కకు నెట్టి అక్కడ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆ గాయని ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు "మీ అందరి కోసం మ్యూజిక్ వీడియోలు షూటింగ్ చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా! " అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) View this post on Instagram A post shared by Maeta (@maetasworld) -
సల్మాన్ ఖాన్ని కాటేసిన పాము.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం వీకెండ్ విడిది కోసం శనివారం ఫామ్ హౌస్‌కి వెళ్లాడు. అర్థరాత్రి దాటక అతని కాలుపై పాము కాటేసింది. దీంతో అతని వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే సల్లూ భాయ్‌ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్ తిరిగి తన ఫామ్ హౌస్‌కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. (Salman Khan 56th birthday: సల్లూ భాయ్‌కి హ్యాపీ బర్త్‌డే) -
పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని బోనకల్ మండలం కలకోట గ్రామంలో పాము కాటు గురైన వారు నాటు కోడి వైద్యం చేయించుకోవడం తాజాగా వైరల్‌గా మారింది. కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి సురేష్ పదేళ్ల నుంచి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాము కాటు గురైన 300 మందికి నాటు కోడి వైద్యం చేశాడు. అయితే పాముకాటుకి కోడి వైద్యం చేయడం వల్ల ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన చెబుతున్నారు. పాము కాటు గురైన వారు గంటన్నరలోపు వస్తేనే లాభం ఉంటుందని అంటున్నారు. కాగా పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగిపోయినట్లు లెక్కిస్తారు. కాటు వేసిన పాము తీవ్రతను బట్టి 5 నుంచి 15 కోళ్ల వరకు విషం తీయడానికి ఉపయోగిస్తుంటారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పాము కాటు గురైన వారు నాటుకోడి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. చదవండి: నార్సింగిలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి వైద్యుల హెచ్చరిక మరోవైపు వైద్యులు మాత్రం నాటు వైద్యాన్ని విశ్వసించరాదని సూచిస్తున్నారు. నాటు కోడి వైద్యంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాలమీదకు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాము కాటుకి గురైతే బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్తున్నారు. చదవండి: కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా.. -
ఒక ఇంట్లో ఇద్దరు చిన్నారులకు పాము కాటు
గద్వాల (గట్టు): వ్యవసాయ పనులు చేసి అలసిపోయారు. పూరిగుడిసెలో నిద్రకుపక్రమించారు. అప్పటికే దుప్పట్లో దూరిన విష సర్పాన్ని గమనించలేకపోయారు. ఇద్దరు బిడ్డల్ని పాము కాటేసిన విషయం తెలిసి గుండెలు బాదుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు. కానీ ఇద్దరిలో బాబు కన్నుమూయగా.. పాప ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన నర్సమ్మ అలియాస్ సరోజమ్మ, నాగరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి తమ పూరిగుడిసెలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే దుప్ప ట్లో పాము దూరిఉంది. ఆదివారం తెల్లవారుజాము న వారి కుమారుడు సూర్యప్రకాష్ (4), కూతురు సురక్షిత (5) పాటుకాటుకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరినీ గట్టు పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఉదయం బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయస్థితిలో ఉంది. -
పరుపులో దాగి.. పసికందును కాటేసి...
మహబూబాబాద్ రూరల్: పాము కాటుతో చిన్నారి మృతిచెందగా.. అదే పాము ఆమె తండ్రిని కాటు వేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వేర్పుల క్రాంతి–మమత దంపతులకు మూడు నెలలు పసిపాప సంతానం. చిన్నారి కొద్ది రోజులుగా అనారో గ్యంతో ఉండటంతో వరంగల్, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. శనివారం రాత్రి ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంట్లోని బల్లపై ఉన్న పిల్లల పరుపులో పడుకోబెట్టారు. అప్పటికే అందులో ఉన్న పామును వీరు గుర్తించలేదు. కాసేపు పాలుతాగిన చిన్నా రి అంతలోనే బాగా ఏడుస్తుండటంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్‌లోని పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరుపులో నుంచి చిన్నారిని వైద్యుడికి చూపిస్తుండగానే.. అందులో నుంచి కట్ల పాము కిందపడింది. అది మమత కాలిపై నుంచి వెళుతుండగా పక్కనే ఉన్న క్రాంతి ఎడ మ కాలితో తొక్కాడు. దీంతో పాము అతడిని కాటు వేసింది. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు పామును చంపేశారు. పాప కూడా పాముకాటుతోనే మృతిచెందిందని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెం టనే క్రాంతి ఏరియా ఆస్పత్రికి చేరుకుని పాముకాటు వికటించే ఇంజక్షన్ వేయించుకున్నాడు. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులో పాము చిన్నారిని ఎడమ తుంటి భాగంలో కాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు. -
ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఓ కుటుంబపై పాము పగబట్టింది. భార్యభర్తలతో పాటు చిన్నారిని కాటేసింది. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోగా, భార్యభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్రాంతి, మమత దంపతులతో పాటు వారి 3 నెలల చిన్నారిని పాము కాటేసింది. స్థానికులు పామును పట్టుకుని చంపేసి, పాముకాటుకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి తల్లితండ్రులు చికిత్స పొందుతున్నారు. కాటేసిన పాము విషపూరితమైన నీలిత్రాచని స్థానికులు తెలిపారు. పాముకాటుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: (Anantapur: కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..) -
కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు సంచనశ్రీ (5) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆటలాడుతుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికెళ్లారు. పామును వైద్యులకు చూపించడంతో అక్కడివారు భయపడ్డారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు. చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..) -
ఏంటీ....స్నేక్ కేక్ ఆ!
న్యూఢిల్లీ: కేక్‌లంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందరూ రకరకాల కేకులను ఆస్వాదిస్తుంటారు. అంతేందుకు పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యానంతా రంగరించి మరి సరొకొత్త కేకులను సృష్టించడం మనం చూశాం. అదేవిధంగా వారు వివిధ రకాల ప్లేవర్లతో మనకు రకరకాల కేక్‌లను అందిచారు. ఆ ఖరికి వెజ్ కేక్ అంటూ కూడా చాలా వైరైటీలను ఆస్వాదించాం కానీ. (చదవండి: విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ) స్నేక్ కేక్ గురించి ఎప్పుడైన వ్నిన్నారా ? బాబాయో ఏంటి ఇది అని అనుకోకండి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ చెఫ్ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్. ఆమె చేసే కేక్‌లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయి అంటారు. బార్బీ బ్మొలాంటివి, సీనరీస్, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనింపించేలాంటి కేక్ తయారు చేసింది నటాలీ. పైగా దాన్ని చూస్తే ఎప్పుడూ అటాక్ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన 'పాము' లా ఉందే తప్ప కేక్‌లా లేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్ కేక్‌ని కట్ చేసేంత వరకు కూడా అది చూడంగానే వెన్నలో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్ష్లల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అమ్మో...... 48 బీర్ గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకెళ్లాడు) View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
పాము రాసిన విషాద గీతం
సాక్షి, రొద్దం: విషపురుగు ఓ రైతు కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. 9 ఏళ్ల క్రితం భార్యను బలితీసుకుని విషాదం నింపిన సర్పం.. తాజాగా భర్తనూ చంపేసింది. వివరాలు.. మండలంలోని ఆర్.కుర్లపల్లికి చెందిన రైతు గొల్ల రాము (33) శుక్రవారం రాత్రి పొలంలో మొక్క జొన్న పంటకు కాపలాగా వెళ్లాడు. ఈ క్రమంలోనే పాము కాటు వేయగా, ఏదో ముల్లు గుచ్చుకుందనుకుని తేలిగ్గా తీసుకున్న రైతు కొద్దిసేపటికే ఇంటికి వచ్చేశాడు. అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) 9 ఏళ్ల క్రితం భార్యా ఇలాగే.. రాము మొదటి భార్య నాగమణి కూడా పాముకాటుకు గురై 9 ఏళ్ల క్రితం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో సర్పం కాటువేయగా, ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పేర్కొన్నారు. నాగమణి మృతి తర్వాత రాము సుజాతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు బాలికలు. కుటుంబ పెద్ద మరణించడంతో భార్యాబిడ్డలు గుండెలవిసేలా రోదించారు. ఎంపీపీ చంద్రశేఖర్, మండల కో ఆప్షన్ మెంబర్ షఫీవుల్లా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, తదితరులు రాము మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. -
పాము కాటుతో మహిళ హత్య.. ట్విస్ట్‌లతో పోలీసుల మైండ్ బ్లాక్!
కొచ్చి: ఆస్తి కోసం భార్యను కడతేర్చిన ఓ భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరజ్ తన భార్య ఉతరా ఆస్తి కోసం ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఎవరికీ తనపై అనుమానం రాకుండా పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే హత్య చేసినా సహజమైన మరణంగా ఉండేలా నాగుపామును ఎంచుకున్నాడు. మొదటి ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో సారి మాత్రం భార్యని పథకం ప్రకారం హత మార్చాడు. కాగా ఉతరా గతేడాది మే 7న ఉత్రా ఆంచల్‌లోని తన ఇంట్లో పాముకాటుతో మరణించింది. ఉతరా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త సూరజ్ తన ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో మహిళ తల్లిదండ్రులు, ఉతారా మరణంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకి అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. సూరజ్ తన భార్య అడ్డు తొలగించుకుని ఆమె డబ్బు, బంగారం తీసుకొని మరొకరిని వివాహం చేసుకోవాలనే ప్లాన్‌తోనే ఆమెను పాముకాటుతో హత్య చేసినట్లు తేలిందని పోలీసులు తెలపారు. ఈ కేసు కొంచెం క్లిష్టంగా ఉండడంతో పక్కాగా అన్ని సాక్ష్యాధారాలతో కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. సందర్భానుసార సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారించిన అరుదైన కేసులలో ఇది ఒకటని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు. ఒక హత్య కేసును శాస్త్రీయంగా, వృత్తిపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎలా పరిశోధించాలో అనేదానికి ఇది ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. చదవండి: వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆపై లైంగికదాడి -
2 గంటలపాటు చిన్నారి మెడకు చుట్టుకున్న పాము..!
ముంబై: పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది పాము ఏకంగా మెడకు చుట్టుకుంఏట.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా. కానీ ఈ సంఘటన వాస్తంగా చోటు చేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఓ చిన్నారి మెడకు చుట్టుకుని ఉండిపోయింది పాము. తీరా వెళ్లే ముందు చిన్నారిని కాటేసి వెళ్లింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని వార్ధా తాలూకా బోర్ఖేడీ-కాలా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బోర్ఖేడీ గ్రామానికి చెందిన గడ్కరీ కుటుంబం ప్రతిరోజులాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. చిన్నారి పూర్వ తన తల్లితో కలిసి నిద్రపోయింది. పడుకున్న కాసేపటికి చిన్నారి తల్లికి ఏదో వెచ్చగా తగిలినట్టుగా అన్పించడంతో నిద్రలోనుంచి మేలుకుంది. వెంటనే లేచిన ఆమె తమ కుమార్తె పూర్వ సమీపంలో పామును గమనించి పక్కకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది. చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్ పాము చిన్నారి పూర్వ దగ్గర పడగ విప్పి ఉండిపోయింది. అలా ఐదు, పది నిమిషాలు కాకుండా ఏకంగా రెండు గంటలపాటు పాము చిన్నారి వద్దే ఉంది. పూర్వ కూడా మెలకువగానే ఉంది. అయితే ఏ మాత్రం కదిలినా పాము కాటు వేసే ప్రమాదం ఉండటంతో ఆమె అలానే పడుకుని ఉంది. చుట్టుపక్కల వారు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. పాము దానంతట అదే వెళ్లిపోయేంత వరకు నిశబ్దంగా ఉండాలని అనుకున్నారు. పాము సుమారు రెండు గంటలపాటు చిన్నారి పూర్వ వద్దే ఉంది. చివరికి పాము వెళ్తూ వెళ్తూ పూర్వను కాటు వేసింది. పాము బయటకు వెళ్లగానే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని సేవాగ్రామ్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? -
పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, రంగారెడ్డి: చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు వచ్చినట్లు.. పాములున్న పుట్టల్లోకి నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రవేశించారు. చెట్టు, పుట్టా, గుట్ట తేడా లేకుండా కనిపించిన ఖాళీ భూమినల్లా చదును చేస్తున్నారు. వెంచర్లు చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇంతకాలం మనుషులకు, నివాసాలకు దూరంగా జీవించిన పాములు ప్రస్తుతం ఇళ్ల చుట్టు చేరుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో ఆయా ప్రాంతాల్లోని పాములు పంట పొలాల్లోకి చేరాయి. దీంతో రైతులు సహా వెంచర్లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాల వద్ద పహారా కాసే వాచ్మెన్లు, కూలీలను కాటేస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో పాముకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఆమనగల్ మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన ఓ రైతు పాముకాటుతో మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. చదవండి: భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య శివారు మున్సిపాలిటీల్లో వెలగని వీధిదీపాలు.. రంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ భూభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం సహా, ఐటీ అనుబంధ సంస్థలు అనేకం జిల్లాలో వెలిశాయి. దీంతో ఇక్కడ భూములకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న చెరువులు, కుంటలే కాదు అనేక వ్యవసాయ భూములు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బహుళజాతి కంపెనీల రాకతో వాటికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అనేక నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. పట్టణాలకు, పల్లెలకు తేడా లేకుండా పోయింది. శివారులో ఆదిబట్ల, ఆమన్‌గల్, బడంగ్పేట్, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, మణికొండ, మీర్పేట్, నార్సింగ్, పెద్ద అంబర్పేట్, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తుక్కుగూడ, తుర్కయాంజాల్ మన్సిపాలిటీలు సహా మండల కేంద్రాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన అనేక కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. అపార్ట్మెంట్ల ముందు కాపాల ఉన్న వాచ్మెన్లు అర్థరాత్రి మూత్ర విసర్జన కోసం బయటికి వస్తే పాము కాటుకు బలవుతున్నారు. చదవండి: అమెరికా వెళ్లాకే పెళ్లి ...22 లక్షలకు టోకరా ఆస్పత్రుల్లో సదుపాయాలు కరువు పాముకాటుకు గురైన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన వైద్యులు సహా యాంటి స్నేక్‌బైట్ మందులు జిల్లాలోని శంషాబాద్, వనస్థలిపురం, కొండాపూర్ ఆస్పత్రుల్లో లేకపోవడంతో ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. దీంతో అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఇటీవల వరదలకు ఖాళీ స్థలాలు, చెట్ల పొదల నుంచి పాములు బయటికి వచ్చి ఇళ్లల్లోకి చేరుతుండటంతో భయంతో సిటిజనులు స్నేక్ సొసైటీ సభ్యులను ఆశ్రయిస్తుండటం, వారు వాటిని చంపకుండా పట్టుకుని వెంట తీసుకెళ్లి.. నల్లమల, ఇతర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులు రోజుకు సగటున 30 పాములను పట్టుకెళ్తుండటం కొసమెరుపు. పాము కాటుతో రైతు మృతి ఆమనగల్లు: మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన రైతు నేనావత్ గోర్యానాయక్ (55) బుధవారం పాముకాటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం తండా సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుడిసెలో పనిముట్లు తీస్తుండగా పాముకాటు వేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోర్యానాయక్ను కుటుంబ సభ్యులు ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకటి రెండు కాట్లు ఉంటే విషపూరితమైనది: డాక్టర్ శ్రవణ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్ ►కాటు వేసిన పాము విషపూరితమైనదా? కాదా? అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ►ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విష పూరితమైందని, మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా భావించాలి. ► నిజానికి పాము కోరల్లో 0.5 ఎంఎల్ నుంచి 2 ఎంఎల్ విషం ఉంటుంది. ►పాము కాటు వేసిన 3 గంటల్లోపే చికిత్సను ప్రారంభించాలి. ►లేదంటే విషం శరీరమంతా విస్తరించి చనిపోయే ప్రమాదం ఉంది. ► విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపైన అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. ►ప్రతి పది నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. ►సూదిలేని సిరంజిని తీసుకొని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. ► మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. ►దాన్ని విషతుల్యమైన రక్తమని భావించి ఆ మేరకు వేగంగా ఆస్పత్రికి చేరుకుని చికిత్స చేయించుకోవాలి. ►పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు. ►ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. -
చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో తన సోదరితో పాములకు రాఖీ కట్టించే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లోని సరన్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే 25 ఏళ్ల మన్మోహన్ తన సోదరితో పాముల జంటకు రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను రెండు పాముల తోకలను పట్టుకున్నాడు. ఇంతలో ఒక పాము ఏమరుపాటుగా ఉన్న మన్మోహన్ కాలి బొటన వేలుపై కాటు వేసింది. बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N — Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021 ఊహించని హఠాత్పరిణామంతో షాక్ తిన్న మన్మోహన్.. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్లుగా పాముల సంరక్షణకు పాటుపడిన మన్మోహన్ పాము కాటు వల్లే మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మన్మోహన్ పాములకు రాఖీ కట్టించే ప్రయత్నం మొత్తాన్ని సెల్ఫోన్లలో బంధించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: పట్టాలపై సెల్ఫోన్లో బిజీ.. నలుగురిని చిదిమేసిన రైలు -
అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్): మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ పేర్కొన్నారు. చదవండి: Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత -
పాము కాటేసిందని... కోపంతో దాన్ని కొరికి చంపేశాడు
భువనేశ్వర్: పాములు మనుషులను కరవడం సాధరణంగా జరుగుతునే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం మనిషి పామును ‘కరవడం’ వంటి వింత ఘటనలు గురించి వింటున్నాం. ఒడిశా రాష్ట్రంలో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పాము కాటేసిందిని కోపంతో ఆ పామునే కరిచి చంపాడు ఓ ప్రబుద్దుడు. వివరాలు.. జాజ్‌పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45)అనే గిరిజన రైతు బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కాలిని ఏదో కరిచింది. తన చేతిలో టార్చ్‌లైట్ వేసి చూడగా తనను కరిచింది.. విషపూరితమైన సర్పంగా గుర్తించాడు. వెంటనే కోపంతో ప్రతీకారం తీర్చుకునేందకు పామును పట్టి పదే పదే కొరికాడు. దాంతో ఆ పాము వెంటనే ప్రాణాలు వదిలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పామును కరిచిన కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరణించిన పామును తీసుకుని తన గ్రామానికి వచ్చిన బద్ర.. జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతడి నిర్వాకం ఆ గ్రామంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
పాము కాటేసిందన్న కోపంతో.. కస కస కొరికాడు.. ఆ తర్వాత..
పట్నా: బిహర్లో ఓ వృద్ధుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. తనను కాటువేసిందన్న కోపంతో ఆ పాము పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాన్ని పట్టుకుని విచక్షణ రహితంగా కొరికాడు. అంతటితో ఆగకుండా పాముని అక్కడే ఉన్న చెట్టుపై వేలాడ దీశాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. నలంద జిల్లాలోని మాధోపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని ఆదివారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. వెంటపడి మరీ పామును పట్టుకుని కసితిరా కొరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. పాముపట్ల వింతగా ప్రవర్తించిన వృద్ధుని తీరు చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, మహతో ఎవరిమాట పట్టించుకోలేదు. పాముని చంపేశాను...నాకేం కాదు అని మొండిగా ప్రవర్తించాడు. కాగా, రాత్రి మహతో భోజనం చేసి పడుకున్నాడు. ఆ తర్వాత మహతో నిద్రలోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఎంత పిలిచిన లేవకపోయేసరికి.. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహతోను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కాటేసిన విషసర్పాన్ని చంపి.. ఆస్పత్రికి పట్టుకెళ్లిన బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పాము కాటేసినా ఏ మాత్రం భయపడలేదు. వెంటపడి చంపేశాడు. చచ్చిన పామును చేతబూని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ఈ సాహసం చేసింది ఏడేళ్ల బాలుడు కావడం విశేషం. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్లు గ్రహించాడు. ఆ బాలుడు వెంటనే అక్కడ వెతకగా రక్తపింజరి జాతి విషనాగు పాకుతూ వెళుతుండగా చూశాడు. పొలంలోని మొక్కల మధ్య దానిని వెంటాడి వేటాడి పట్టుకుని రాళ్లతో కొట్టి హతమార్చాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో ‘ఆస్పత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావు’ అని వైద్యులు ప్రశ్నించగా ‘నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది’ అని బదులివ్వడంతో బిత్తరపోయారు. వైద్య బృందం అంతా కలిసి బాలుడి సాహసాన్ని, సమయోచిత తెలివితేటలను అభినందించారు. -
పచ్చిక మాటున విష సర్పాలు
నిడదవోలు: ఖరీఫ్, రబీ సీజన్లు ప్రారంభంకాగానే రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు వర్షాలు ప్రారంభం కాగానే అంతవరకూ కనిపించని విష సర్పాలు బయటకొచ్చి పొలాల్లో యథేచ్ఛగా తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పొలాల్లో తిరిగే రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పాము కాటుకు గురైనా ధైర్యంగా ఉంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో 2020 జనవరి నుంచి 2021 జూన్ 30 వరకు 1,686 మంది పాము కాటుకు గురయ్యారు. ఇవి అధికారికంగా నమోదైన వివరాలు మాత్రమే. జిల్లాలో సార్వా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం, వర్షాలు కురవడంతో పొలాల్లోని బొరియల్లో ఉన్న విష పురుగులు, పాములు బయటకు వస్తుంటాయి. రైతులు ఆదమరిస్తే పాము కాటుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. పొలాల్లో పాముకాటు వల్ల రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పొతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. పాము కాటేస్తే సకాలంలో వైద్యం అందించపోతే మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పాము కాటుకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలనే అంశాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరం. ప్రతీ ఏటా దాళ్వా పంట ముగిశాక పొలాలకు రైతులు తక్కువగా వెళ్తుంటారు. తిరిగి రెండు నెలలు పొలాల్లో అలికిడి లేకపోవడంతో పాములు పాగావేస్తాయి. పొలాల నుంచి పాములు ఇళ్ళల్లోకి వచ్చి పెరట్లో నక్కుతాయి. పాములను గుర్తించండిలా పొడపాముని రక్త పింజరని పిలుస్తారు. ఇది గోధుమ రంగులో ఉండి ఒంటిపై డైమండ్ ఆకారంలో గుర్తులు మూడు వరుసల్లో ఉంటాయి. తలపై బాణం గుర్తు ఉంటుంది. ఇది కాటేసిన భాగం ఉబ్బెత్తుగా ఉండి నొప్పి కలిగిస్తుంది. అరగంట లోపే చెవులు, నోటి వెంట రక్తస్రావమవుతుంది. నాగు పాము ముదురు గోధమ రంగులో ఉంటుంది. దీనిలో విష ప్రభావం అధికంగా ఉంటుంది. కట్లపాము నలుపు రంగులో ఉండి ఒంటిపై నలుపు, తెలుపు చారలు ఉంటాయి. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్వం రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు శబ్దం వచ్చే చెప్పులు వేసుకోనేవారు. ఆ శబ్దాలకు పాములు పారిపోయేవి. ఇప్పుడు అలాంటి చెప్పులు వేసుకోకపోయినా.. పొలాల్లో తిరిగేటప్పుడు తప్పనిసరిగా పాద రక్షలు ధరించాలి. కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు వెళ్ళిపోతాయి. ధాన్యపు గాదెలు, గడ్డి వాములు, తడిగా ఉంటే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి. దుంగలు, కట్టెలు, పచ్చిక బయళ్ళలో పాములు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు తప్పకుండా టార్చిలైట్ తీసుకెళ్ళాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం, ముళ్ళ పొదలు లేకుండా చూసుకోవాలి. గోడల వారన, కట్టెల్లో పాములు నక్కే అవకాశమున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. పాము కరిచిన వెంటనే ఏం చేయాలి సాధారణంగా విషం ఉన్న పాము కాటు వేసిన చోట రెండు కొరల గాయం కనిపిస్తుంది. నొప్పి తట్టుకోలేం. నొప్పి క్రమంగా పైకి వ్యాపించి తిమ్మిరిగా అనిపిస్తుంది. గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, నాటుక మందమైనట్లు, గొంతులో ఏది దిగనట్లు అనిపిస్తుంది. చొంగ కారడంతో పాటు శరీరం మత్తుగా ఉంటుంది. పాము విషం కన్నా చాలా మంది పాము కాటేసిందన్న భయంతోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. పాము కాటుకు గురైనా వ్యక్తికి ధైర్యం చెప్పాలి. కొన్ని పాములే విషపూరితం. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచుపాము, కట్లపాము, పొడపాము వంటి 15 సర్ప జాతులు ప్రమాదకరమైనవి. పాము కాటు వేస్తే మంత్రాలు, నాటు వైద్యమంటూ ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని ఎట్టిపరిస్థితిలో నడిపించరాదు. సాధ్యమైనంత వరకు ఎత్తుకుని వాహనంలో కుర్చోపెట్టి తీసుకెళ్ళాలి. యాంటీ వీనమ్ ఇంజెక్షన్ వేయించాలి పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. చాలా వరకు విషం లేని పాములు కరుస్తుంటాయి. విషం ఉంటే మంత్రాలకు తగ్గదు. విషానికి యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తాచుపాము వంటివి కరిస్తే రెండు గాట్లు పడతాయి. పాము కాటుకి గురైన వ్యక్తులు చాలా మంది భయంతో గుండె ఆగి చనిపోతున్నారు. సాధారణంగా 70 శాతం పాముల్లో విషం ఉండదు. పాము కరచిన వ్యక్తికి ధైర్యం చెప్పి వైద్యుని దగ్గరకు తీసుకువచ్చి ఇంజెక్షన్ ఇప్పించాలి. – డాక్టర్ అమరేంద్ర, వైద్యుడు, సమిశ్రగూడెం పీహెచ్సీ -
పాపం.. ఎలుక తప్పించుకుంది.. మహిళ దొరికింది..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్) : ఎలుకను మింగేందుకు యత్నించిన పాము అది తప్పించుకోవడంతో అక్కడే ఓ మహిళపై కాటు వేయగా ఆమె మృతి చెందింది. హన్మకొండ 65వ డివిజన్ చింతగట్టులోని సుభాష్‌నగర్‌కు చెందిన పుల్లా కమలమ్మ(55) మరికొందరితో కలిసి మంగళవారం ఉదయం బయట కూర్చుని మాట్లాడుతోంది. కాగా, కమలమ్మ వెనుక వైపు నుంచి ఎలుక వెళ్తుండగా.. దానిని పట్టుకునేందుకు పాము వచ్చింది. అయితే, ఎలుక క్షణంలో తప్పించుకోవడంతో పాము కింద కూర్చోని ఉన్న కమలమ్మ చేతిపై కాటు వేసింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
పాముకాటుకు మృతి.. అక్కడకు వెళ్తే బతుకుతాడని
రఘునాథపల్లి: పాముకాటుతో ఒకరు మృతి చెందగా.. ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్తే బతికిస్తారనే సూచన ప్రకారం అక్కడకు బయలుదేరారు.. అయితే, పోలీసులు హెచ్చరించడంతో తిరుగుపయనమయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పతేషాపూనకు చెందిన శివరాత్రి శ్రీనివాస్ (42)కు ప్రొక్లెయినర్ ఉంది. ఆయన ఆదివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి నేలపై నిద్రించారు. అర్ధరాత్రి దాటాక కాలుకు ఏదో కుట్టినట్టు అనిపించడంతో శ్రీనివాస్ మేల్కొన్నాడు. కట్ల పాము కాటు వేసినట్టు గుర్తించి పామును చంపారు. అనంతరం చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, ఆపై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీçసుకెళ్తుండగా శ్రీనివాస్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ (ఉత్తరప్రదేశ్) అక్కడికి వచ్చాడు. ఆయన మృతదేహం చేయి పట్టుకుని నాడి కొట్టుకుంటున్నదని చెబుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. వెంటనే తీసుకొస్తే బతికిస్తానని అవతలి వ్యక్తి చెప్పడంతో కుటుంబసభ్యులు వాహనంలో బయలుదేరారు. ఇంతలోనే విషయం పోలీసులకు తెలిసి శ్రీనివాస్ మృతదేహం వెంట ఉన్న వారికి ఫోన్‌చేసి మరణించిన వ్యక్తిని ఎక్కడకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వారు వెనక్కి బయలుదేరారు. చదవండి: Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు.. -
Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు..
సాక్షి, కంప్లి(కర్ణాటక) : మెట్రి పంచాయతీ పరిధిలోని ఉప్పారహళ్లి గ్రామంలో కాడప్ప అనే యువకుడికి ఆదివారం నాగుపాము కాటేసింది. దీంతో కంగారు పడకుండా కాడప్ప చాకచక్యంగా పామును పట్టుకుని మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడి సాయంతో ద్విచక్ర వాహనంలో కంప్లి ఆస్పత్రికి చేరుకున్నాడు. పాము చేతపట్టుకుని ఆస్పత్రికి వస్తున్న కాడప్పను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు భయపడ్డారు. వైద్యులు హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేసి బళ్లారి విమ్స్‌కు తరలించారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
పాముతో చెలగాటం.. వ్యక్తి మృతి
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): పామును పట్టుకుని ఆటలాడిన ఓ వ్యక్తి.. అదే పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లె మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ జ్యువెలరీ షాపులోకి సోమవారం మధ్యాహ్నం ఓ నాగుపాము చొరబడింది. షాపు యజమాని ఏమీ చేయలేని పరిస్థితిలో నిమ్మకుండిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అసాదుల్లా (52) దుకాణంలో ఉన్న నాగుపామును చూసి చేతిలోకి తీసుకుని దాంతో కొంతసేపు ఆటలాడాడు. పామును తల వద్ద పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో అది అతని చేతిపై కాటు వేసింది. దీంతో పామును చితకబాది చంపేశాడు. అయితే, అదే రోజు సాయంత్రం అసాదుల్లా పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరుకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. -
పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..
-
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాము కాటేసిందని ఆసుపత్రికి వస్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే భరత్ రెడ్డి అనే యువకుడు ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిపక్షన్‌ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు. అయితే ప్రిస్క్రిపక్షన్‌ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు. సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్ ఇస్తారు కదా అని నిలదీశాడు. దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు. పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు. బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
భయంగొలిపే దృశ్యాలు.. క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే..
బెంగళూరు: భయంకరమైన దృశ్యం.. కొద్దిపాటిలో కోబ్రా కాటు నుంచి తప్పించుకున్న స్నేక్ క్యాచర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును కాపాడబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఈ వీడియోను న్యూస్ ఎజెన్సీ ఏఎన్ఐ బుధవారం షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకుపైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఆ కోబ్రా బుస్సు మంటు వారి మీదకు లేచిన దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోయినంత పనైంది. ఇక విషపూరితమైన కోబ్రాతో ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడిని స్నేక్ క్యాచర్, మరో వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘నిజంగా వీరిద్దరి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఆ సమయంలో వారిద్దరు బయపడి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రకారం... కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని ఓ అడవిలో పెద్ద చెట్టు బెరడులో కోబ్రా ఇరుక్కుపోయింది. అది చూసిన ఓ స్నేక్ క్యాచర్ దానిని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో మరో వ్యక్తి వెనక నుంచి వచ్చి పాము తోక పట్టుకున్నాడు. దీంతో వెంటనే కోబ్రా కోపంతో స్నేక్ క్యాచర్ మీదకు లేచింది. చెట్టు బెరడుపై నిలుచున్నఅతడిపైకి లేచి బుస్సుమంటు మోకాలుపై కాటు వేయబోయింది. అయితే స్నేక్ క్యాచర్ దానిని వెంటనే చేతితో నీళ్లలోకి దూరంగా కొట్టాడు. ఆ ప్రయత్నంలో తూలి కిందపడిపోగా పాము అతడి మీదకు మరోసారి వెళ్లి కాటు వేయబోయింది. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి వెంటనే దాని తలను పట్టుకునే ప్రయత్నం చేయగా మళ్లీ తప్పించుకుంది. అప్రమత్తమైన స్నేక్ క్యాచర్ వెంటనే పాము తలను గట్టిగా చేతితో పట్టుకున్నాడు. దానిని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. -
37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు!
సాక్షి, బైరెడ్డిపల్లె(చిత్తూరు జిల్లా): ఎవరినైనా ఒకసారో.. రెండుసార్లో పాము కాటేయడం సహజం.. అయితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(42)ను ఏకంగా 37 సార్లు కాటేయడం విచిత్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది. అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓ సారి కాటేస్తున్నాయి. 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం. ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని వాపోతున్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని సుబ్రమణ్యంను నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో శంకర్రాయలపేటలోని జేఎంజే ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన దీనావస్థను గుర్తించి దాతలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. (విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..) -
కృష్ణా జిల్లాలో విష సర్పాల కలకలం..
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు నియోజకవర్గంలో విష సర్పాలు సంచారం కలకలం రేపుతోంది. మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటు బాధితుల సంఖ్య సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ ఒక్క నెలలోనే 95 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొవ్వ పీహెచ్సీ వైద్యాధికారి శొంఠి శివ రామకృష్ణారావు మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే తొమ్మిది పాము కాటు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలం పొలంలో అధిక సంఖ్యలో పాములు సంచరిస్తుంటాయని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా పాముకాటుకు గురైతే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలలోనే ఇప్పటివరకు అత్యధికంగా 95 పాముకాట్లు కేసులు నమోదయ్యాయని, బాధితులకు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఎంహెచ్‌వో రమేష్ ఆదేశాల మేరకు యాంటి స్నేక్ వెనమ్‌లను పీహెచ్సీలో అందుబాటులో ఉంచామని తెలిపారు.