సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు నియోజకవర్గంలో విష సర్పాలు సంచారం కలకలం రేపుతోంది. మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటు బాధితుల సంఖ్య సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ ఒక్క నెలలోనే 95 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొవ్వ పీహెచ్‌సీ వైద్యాధికారి శొంఠి శివ రామకృష్ణారావు మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే తొమ్మిది పాము కాటు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలం పొలంలో అధిక సంఖ్యలో పాములు సంచరిస్తుంటాయని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా పాముకాటుకు గురైతే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలలోనే ఇప్పటివరకు అత్యధికంగా 95 పాముకాట్లు కేసులు నమోదయ్యాయని, బాధితులకు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక‌్షన్లు ఇచ్చామని తెలిపారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఎంహెచ్‌వో రమేష్ ఆదేశాల మేరకు యాంటి స్నేక్ వెనమ్‌లను పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment