Top Stories
ప్రధాన వార్తలు

కంచ గచ్చిబౌలిలో నిషేధాజ్ఞలు
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/రాయదుర్గం: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. సుప్రీంకోర్టు, కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల మేరకు ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశానికి అనుమతులు లేవని తెలిపారు.నిషేధాజ్ఞలు శుక్రవారం నుంచి ఈనెల 16 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెంట్రల్ వర్సిటీతో పాటు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గురువారం నాటి సుప్రీంకోర్టు స్టేతో ధర్నాలు, ఆందోళనలు ఆగిపోయాయి.సదరు 400 ఎకరాల్లో పనులను నిలిపివేశారు. క్యాంపస్‌తో పాటు వివాదాస్పద భూముల్లో పోలీసు లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను తనిఖీలు చేసి, ఐడీ కార్డులున్న సిబ్బంది, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థుల భారీ ర్యాలీ శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హెచ్‌సీయూలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ‘ప్రతిఘటన, విజయోత్సవ ర్యాలీ’పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీచర్స్ అసోసియేసన్, వర్కర్స్ అసోసియేషన్ సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఫ్యాకలీ్ట, నాన్‌టీచింగ్, వర్కర్స్ ఐక్యత వర్ధిల్లాలి, హెచ్‌సీయూ భూములను కాపాడుతాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టయిన, కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, సివిల్ సొసైటీ గ్రూప్‌లు, ఇతరులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, క్యాంపస్ నుంచి పోలీస్ క్యాంప్‌లను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కుక్కల దాడిలో గాయపడి.. దుప్పి మృతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి (మచ్చల జింక).. మృగవనికి తరలిస్తుండగా మృతిచెందింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హెచ్‌సీయూ క్యాంపస్‌లో చెట్లు, పొదలను తొలగించడంతో స్థావరాలను కోల్పోయిన వన్యప్రాణులు క్యాంపస్‌లోని హాస్టళ్ల వైపు వస్తున్నాయి.శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక దుప్పి రాగా కుక్కలు వెంటపడి గాయపరిచాయి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది కుక్కలను తరిమివేసి గాయపడిన దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని మృగవనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో మృగవనిలో పోస్టుమార్టమ్ నిర్వహించి అక్కడే ఖననం చేశారు. గోపన్‌పల్లిలో ఇళ్ల మధ్య జింక పరుగులు.. శుక్రవారం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం సమీపంలోని గోప న్‌పల్లి ఎన్టీఆర్నగర్లో ఓ జింక రోడ్లపై పరుగులు తీసింది. అటూఇటూ తిరుగుతూ ఓ ఇంట్లోకి వెళ్లగా, స్థానికులు గమ నించి తలుపులు మూసివేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి జింకను పట్టుకుని జూపార్కుకు తరలించారు.అవన్నీ ఏఐ చిత్రాలే సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పరిధిలో చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న రీతిలో.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమంతా కల్పితమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని జేసీబీలతో చెట్లను నరికివేయడం వల్ల అక్కడున్న నెమళ్లు, జింకలు పరుగెత్తుకుంటూ పారిపోతున్న రీతిలో రూపొందించిన చిత్రం పూర్తిగా ఏఐ(ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారితమని తేల్చిచెప్పింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో క్రిషాంక్ ఎక్స్ ఖాతాలో జింక కాళ్లు కట్టేసి చంపినట్లు చూపిన చిత్రం కూడా తప్పుడు చిత్రమని తేల్చింది. ఈ చిత్రం ఓ సోషల్ మీడియా జర్నలిస్టు పొరపాటున పోస్టు చేశారని, ఆ తర్వాత సదరు రిపోర్టర్ తన తప్పిదాన్ని ఒప్పుకుని తొలగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారని వివరించింది.

ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి

ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.అష్టమి రా.12.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.10.28 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.13 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.34 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 6.10.మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశ.మిథునం: కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. కళాకారులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.కన్య: పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. పారిశ్రామికవేత్తల యత్నాలు మందగిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం: శ్రమ ఫలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కుంభం: అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

బంగ్లా తీరు మారాల్సిందే!
ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్‌తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్‌కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.యూనస్ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్‌కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్‌కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్‌తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.బంగ్లాదేశ్‌కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

ఇంట గెలిచిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్‌తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్‌తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. పంత్ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్‌తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్‌ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్‌లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్‌వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్‌దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్‌వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్‌దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0 రోహిత్ శర్మ దూరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది. ఐపీఎల్లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X రాజస్తాన్‌వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

టారిఫ్‌పై మళ్లీ తూచ్
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది.

బిమ్స్టెక్ బలోపేతానికి 21 సూత్రాలు
బ్యాంకాక్: భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్టెక్ సభ్యదేశాల చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా వ్యాపారం, వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ‘బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ మేరకు 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన తెరపైకి తెచ్చారు. శుక్రవారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం(బిమ్స్టెక్) సదస్సులో మోదీ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అన్నారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, అనుబంధం బలపడాలి. ఇందుకు 21 సూత్రాల ప్రణాళికను అమలు చేద్దాం. అందులో భాగంగా బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ (బోధి) ఏర్పాటు చేద్దాం. దీనికింద ఏటా సభ్యదేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్‌లో శిక్షణ ఇస్తాం. సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా మన కూటమికి ఉంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ ఎదుగుదాం. డిజిటల్ ప్రజా సదుపాయాల (డీపీఐ) విషయంలో అనుభవాలు పంచుకుందాం. ఐటీ రంగ శక్తిసామర్థ్యాల సాయంతో బిమ్స్‌టెన్‌ను సాంకేతికంగా బలోపేతం చేసుకుందాం. బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏటా వ్యాపార సదస్సులు నిర్వహిద్దాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. సదస్సులో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. బంగాళాఖాతంలో శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరతే లక్ష్యంగా ‘బ్యాంకాక్ విజన్–2030’ను ఆమోదించారు.బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇటీవలి భూకంపంలో మయన్మార్, థాయ్‌లాండ్ ల్లో వేలాది మంది మరణించడం పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘విపత్తుల నిర్వహణ విషయంలో అంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత్‌లో బిమ్స్టెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు సెంటర్ నెలకొల్పుదాం. బిమ్స్టెక్ దేశాలకు మానవ వనరుల శిక్షణ నిమిత్తం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేద్దాం. ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు నలందా యూనివర్సిటీలో బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్íÙప్లు ఇస్తాం. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ పనులను వేగవంతం చేద్దాం. ఈ ఏడాది బిమ్స్టెక్ యూత్ లీడర్ల సదస్సు నిర్వహించనున్నాం. 2027లో తొలి బిమ్స్టెక్ క్రీడలు నిర్వహిద్దాం’’ అని సూచించారు.నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఓలీతో ఫలవంతమైన చర్చ జరిగిందని మోదీ వెల్లడించారు. నేపాల్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ ఆంగ్ లైంగ్‌తో మోదీ భేటీ అయ్యారు. భూకంపం నుంచి కోలుకోవడానికి సాయమందిస్తామని చెప్పారు. మయన్మార్‌లో సంఘర్షణలకు తెరపడాలంటే ప్రజాస్వామిక విధానంలో సజావుగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. థాయ్‌లాండ్ రాజు మహా వాజిరాలాంగ్‌కాన్ దంపతులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకోవడంపై చర్చించారు. సారనాథ్ బౌద్ధ స్థూపం నమూనాను థాయ్‌లాండ్ రాజుకు మోదీ అందజేశారు. మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభం థాయ్‌లాండ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మూడు రోజులపాటు పర్యటిస్తారు. అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకేతో సమావేశమవుతారు. మోదీ చివరిసారిగా 2019లో శ్రీలంకలో పర్యటించారు. 2015 తర్వాత ఆయన శ్రీలంకలో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి.వాట్ ఫో ఆలయాన్ని దర్శించుకున్న మోదీ ప్రధాని మోదీ బ్యాంకాక్‌లో వాట్ ఫో బౌద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు. 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్ర సైతం ఉన్నారు. అశోక స్తంభం నమూనాను మోదీ వాట్ ఫో ఆలయానికి బహూకరించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.

మళ్లీ టెండర్లు.. మళ్లీ కమీషన్లు
అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టిస్తారా? లేక తొలుత తాత్కాలికంగా ఒక ఇల్లు కట్టించి.. ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టిస్తారా? ఎవరైనా అన్నీ సరిచూసుకుని ఒకేసారి ఇల్లు కట్టిస్తారు. ఘనత వహించిన మన సీఎం చంద్రబాబు మాత్రం రెండు సార్లు కడతానంటున్నారు. తొలుత రూ.353 కోట్లు అప్పు చేసి తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఏకంగా రూ.1,649.33 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమై పోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఈ పెద్దమనిషి నిర్వాకమిది. రేపు ఇదే అమరావతిలో ఆయన సొంతంగా నిర్మించుకునే ఇంటిని కూడా ఇలా రెండు మార్లు కడతారా.. అని మాత్రం అడగొద్దు! సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా సర్కారు పెద్దలు అడుగులు ముందుకు వేస్తున్నారు. 2016–18 మధ్య అప్పుగా తెచ్చిన రూ.353 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి కమీషన్లు దండుకున్న ఇదే చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెస్తున్న అప్పులో రూ.1,649.33 కోట్లతో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పూనుకుంది. ఇలా నిధులు దుబారా చేస్తూ.. నచ్చిన సంస్థలకు ఏకపక్షంగా టెండర్లను కట్టబెడుతూ మళ్లీ కమీషన్లు కొట్టేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా ముందే రూపొందించిన స్కెచ్ మేరకు రెండు టెండర్లలో తనకు నచ్చిన రెండు సంస్థలే పాల్గొని అధిక ధరలకు బిడ్లు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఆపై ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టి అనుకున్న మేరకు నిధులు దోచుకోవడానికి రూట్ క్లియర్ చేసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేశాయి. హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లతో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లతో ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది. తద్వారా హైకోర్టు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు రెండు సంస్థలు కోట్ చేయడంతో ప్రభుత్వ ఖజానాపై రూ.వందల కోట్ల మేర భారం పడింది. మొత్తంగా రెండు భవనాల కాంట్రాక్టు విలువ రూ.1,649.33 కోట్లు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ సమావేశంలో ఈ రెండు టెండర్లను ఆమోదించి, కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో 2015లో వెలగపూడి వద్ద 45.12 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చదరపు అడుగుకు రూ.17,183 చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన ఇప్పుడు చేపట్టిన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చు. 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు » హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం (కాంప్లెక్స్)లోని ‘ఎఫ్’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో.. బేస్మెంట్, గ్రౌండ్ ప్లోర్, ఏడు అంతస్తుల్లో (బీ+జీ+7) 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్‌ను రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలనే షరతుతో మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ అంచనా వ్యయం రూ.924.64 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. చేస్తోంది అప్పు.. ఆపై దుబారా ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమేనని.. ఇలా దుబారా చేయడం సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 11,21,975 చదరపు అడుగుల్లో అసెంబ్లీ » అసెంబ్లీ శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం(కాంప్లెక్స్)లో ‘ఈ’ బ్లాక్‌లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తులు(బీ+జీ+3)లో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన డిజైన్‌ను ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈనెల 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ పనులను రూ.724.69 కోట్లకు ఎల్ అండ్ టీ దక్కించుకుంది.

వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం!
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్ సీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్ సీపీపై సోషల్ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ సీపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సీఎం నితీష్ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ర్యాంకింగ్ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్ అబ్బాస్ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

టారిఫ్‌ల భారంపై బేరసారాలు
న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ చెప్పారు. అమెరికాలోని లెదర్ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ కపూర్ తెలిపారు. కార్పెట్లు, హోమ్ ఫరి్న షింగ్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు. బియ్యంపై ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గర్గ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు. మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.టారిఫ్‌ల ఎఫెక్ట్ స్వల్పమే నితి ఆయోగ్ సభ్యులు విర్మాణీ న్యూఢిల్లీ: యూఎస్ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్ సభ్యులు అరవింద్ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్ భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు.
బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు
ప్రీ వెడ్డింగ్ షూట్.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..
గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలు విడుదల
ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు
కలెక్టర్ వీపు బద్దలు కొడతాం!
టారిఫ్‌ల భారంపై బేరసారాలు
మల్లన్న సన్నిధిలో.. సీతారాముల కల్యాణం
పచ్చరంగు పిచ్చి పీక్స్‌కు..
బలైపోయిన అంజలి
యూన్ అభిశంసన సరైనదే
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
సాక్షి కార్టూన్ 04-04-2025
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్ఎస్ ఎంపీ
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
డేట్ ఫిక్స్
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్ చేశారు: బుట్టబొమ్మ
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
ఊరంతా చేపల కూరే...!
అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
'భరోసా'.. మెల్లమెల్లగా!
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం..
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్‌తో రోహిత్ శర్మ
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్..
Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...
అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
పీలేరులో భారీ చోరీ
అద్భుతమైన నల్లేరు పచ్చడి : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే?
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
నోబెల్ గ్రహీత వీసా రద్దు
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
ఆర్థికానికి కుంభమేళా బూస్ట్
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు
ప్రీ వెడ్డింగ్ షూట్.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..
గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలు విడుదల
ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు
కలెక్టర్ వీపు బద్దలు కొడతాం!
టారిఫ్‌ల భారంపై బేరసారాలు
మల్లన్న సన్నిధిలో.. సీతారాముల కల్యాణం
పచ్చరంగు పిచ్చి పీక్స్‌కు..
బలైపోయిన అంజలి
యూన్ అభిశంసన సరైనదే
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
సాక్షి కార్టూన్ 04-04-2025
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్ఎస్ ఎంపీ
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
డేట్ ఫిక్స్
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్ చేశారు: బుట్టబొమ్మ
ఊరంతా చేపల కూరే...!
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
'భరోసా'.. మెల్లమెల్లగా!
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం..
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్‌తో రోహిత్ శర్మ
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్..
Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...
కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
పీలేరులో భారీ చోరీ
అద్భుతమైన నల్లేరు పచ్చడి : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే?
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
నోబెల్ గ్రహీత వీసా రద్దు
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
ఆర్థికానికి కుంభమేళా బూస్ట్
సినిమా

బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
బెంగాలీ బ్యూటీలో ముస్తాబైన యాంకర్ అనసూయఒమన్ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న రష్మికహాట్ పోజులతో రెచ్చిగొట్టేస్తున్న జాన్వీ కపూర్చీరలో కిర్రెక్కిపోయే అందంతో కావ్య కల్యాణ్ రామ్పచ్చనిచెట్ల మధ్య తృప్తి దిమ్రి సోయగాల విందుఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుపమహాలీవుడ్ అందగత్తెలా కనిపిస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by ForeverNew India (@forevernew_india) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya)

మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్ చేశారు: బుట్టబొమ్మ
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించిన ముద్దుగుమ్మ.. ఇటీవలే దేవా మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బుట్టబొమ్మకు అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెట్రో, జన నాయగన్ లాంటి సినిమాల్లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో సరసన హై జవానీ తో ఇష్క్ హోనా హైలో కూడా పూజా నటించనుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ఇటీవల ఓ తమిళ చిత్రం కోసం ఆడిషన్‌కు వెళ్లగా తనను తిరస్కరించారని బుట్టబొమ్మ తెలిపింది. అయితే తనను ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా వివరించింది. ఆ పాత్రకు నా వయస్సు సరిపోదని.. అందువల్లే తిరస్కరించినట్లు పూజా వెల్లడించింది. నా కంటే కాస్తా ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఎంపిక చేశారని పూజా చెప్పుకొచ్చింది.ఇలా ఆడిషన్స్‌కు వెళ్లడం వల్ల ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సహాయపడుతుందని పూజా హెగ్డే పేర్కొంది. తాను ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం మేకర్స్‌కు కలిగించడమే నా ఉద్దేశమని చెప్పింది. తాను కష్టపడి పని చేయడానికి వెనకాడనని.. ఆడిషన్స్‌కు వెళ్లేందుకు అహంకారం ప్రదర్శించనని తెలిపింది. అ ఏదేమైనా ఒక నటిగా ఆడిషన్స్‌కు వెళ్లడానికి తాను ఎప్పుడు సిగ్గుపడనని అంటోంది మన బుట్టబొమ్మ.కాగా.. పూజా హెగ్డే ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న రెట్రో మూవీలో కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ సూర్య సరసన నటిస్తోంది. అంతేకాకుండా దళపతి విజయ్ మూవీ జన నాయగన్లో హీరోయిన్గా మెప్పించనుంది. బీస్ట్ తర్వాత విజయ్‌తో కలిసి పనిచేయనుంది.

అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ
కొన్నిరోజుల నుంచి అనుకున్నదే జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' (Coolie Movie).. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు పోటీగా నిలిచింది. సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడని సమాచారం. ఇదివరకే షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. ఆగస్టు అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి అన్ని పనులు అంతలోపు పూర్తి చేస్తారు.మరోవైపు ఆగస్టు 14నే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2 Movie) రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. నార్త్ లో దీనికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు గానీ దక్షిణాదిలో మాత్రం 'కూలీ' పోటీ గ్యారంటీ. తొలుత కూలీ వారం లేటుగా రావొచ్చేమో అన్నారు కానీ లాంగ్ వీకెండ్ దృష్ట్యా ఆగస్టు 14నే వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రజినీ vs తారక్ ఖరారైంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/KU0rH8kBH7— Sun Pictures (@sunpictures) April 4, 2025

‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
క్రీడలు

ఇంట గెలిచిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్‌తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్‌తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. పంత్ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్‌తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్‌ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్‌లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్‌వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్‌దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్‌వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్‌దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0 రోహిత్ శర్మ దూరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది. ఐపీఎల్లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X రాజస్తాన్‌వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అవేష్ సూపర్ బౌలింగ్.. ఉత్కంఠపోరులో ముంబై ఓటమి
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో తొలి బంతినే హార్దిక్ పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత అవేష్ ఖాన్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆఖరి 5 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే అవేష్ ఇచ్చాడు.ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.

చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మిగితా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి హార్దిక్ మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్లో ఇది తొలి ఫైవ్ హాల్ వికెట్ కావడం గమానార్హం. ఐపీఎల్లో కాదు టీ20ల్లోనే అతడికి మొదటి ఐదు వికెట్ల హాల్. తద్వారా పలు అరుదైన రికార్డులను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.తొలి కెప్టెన్‌గా..ఐపీఎల్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరికి సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా హార్దిక్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వికెట్ల సాధించిన రెండో కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే రికార్డును పాండ్యా సమం చేశాడు. కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్‌గా 30 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా ఇప్పటివరకు సారథిగా 30 వికెట్లు సాధించాడు.ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు వీరే..5/36- హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/17- JP డుమిని (ఢిల్లీ డేర్‌డేవిల్స్)4/21- షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్)ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే:57 - షేన్ వార్న్30 - హార్దిక్ పాండ్యా30 - అనిల్ కుంబ్లే25 - రవిచంద్రన్ అశ్విన్21 - పాట్ కమ్మిన్స్మార్ష్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యాతో పాటు.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?

IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
ఐపీఎల్-2025లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు అప్పటి నుంచి నెట్‌ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. తాజాగా రుతురాజ్ అందుబాటుపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ రుతురాజ్ దూరమైతే అతడి స్ధానంలో ఎంఎస్ ధోని సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని హస్సీ తెలిపాడు."రేపటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ఎంపిక అనేది కోలుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా అతడు నొప్పితో బాధపడుతున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను ఆడకపోతే, ఎవరు నాయకత్వం వహిస్తారో మేము ఇంకా నిర్ణయించలేదు. కానీ యువ వికెట్ కీపర్ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు" అని హస్సీ పేర్కొన్నాడు. కాగా రుతురాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్‌పై ఓటమి పాలైనప్పటికి రుతు 61 పరుగులతో రాణించాడు.కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌కు సీఎస్కే చాలా కీలకం.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, షేక్రన్ కాన్వే, షేక్రాన్ కాన్వే, సమ్కో కాన్వే శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి, దీపక్ హుడాచదవండి: IPL 2025: ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
బిజినెస్

రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2025 జనవరి–మార్చిలో 31 శాతం జంప్ చేసినట్లు రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా పేర్కొంది. ప్రధానంగా రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు పుంజుకోవడంతో 1.3 బిలియన్ డాలర్లను తాకినట్లు ఒక నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం వీటిలో 60 శాతం వాటాతో దేశీ ఇన్వెస్టర్లు ప్రధాన పాత్ర పోషించారు. వార్షికంగా 75 శాతం వృద్ధితో 0.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్, ఆఫీస్ విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.హౌసింగ్ విభాగంలో నిధులు 3 రెట్లు ఎగసి 30.29 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది ఇదే కాలంలో 10.26 కోట్ల డాలర్లు మాత్రమే లభించాయి. ఆఫీస్ కాంప్లెక్సులలో సంస్థాగత పెట్టుబడులు 23 శాతం క్షీణించి 43.42 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత జనవరి–మార్చిలో 56.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్
చదువుకుని డిగ్రీలు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే.. ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన ఉద్యోగాలు దొరక్క కొందరు సతమవుతుంటే.. అసలు ఉద్యోగాలే లభించనివారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.బెంగళూరుకు చెందిన 'ప్రశాంత్ హరిదాస్' అనే వ్యక్తి.. మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగెత్తిపోయి.. తనకు తానే లింక్డ్ఇన్లో 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. మేమున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు.పరిశ్రమ నాయకులారా, నన్ను దెయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఎంత మంచి వాడిని అయినా.. ఎన్ని రెకమెండేషన్స్ పెట్టినా.. ఈ పోస్ట్ పెట్టిన తరువాత నాకు జాబ్ ఇవ్వరని తెలుసు. నేను ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రుచి చూడాల్సిన వంటకాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే సుమారు మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం అని ప్రశాంత్ పోస్ట్ చేసాడు.ఈ పోస్టుపై పలువురు స్పందించారు. నేను మీ మాటలు విన్నాను, మీ ప్రయాణం ఎంత కఠినంగా ఉందో ఊహించగలను. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయి. కానీ మీ ప్రయత్నాలు వృధా కాదు. పట్టు వదలకుండా శ్రమించండి, అని ఒకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, మీ పట్ల సానుభూతి ఉంది. కరోనా మహమ్మారి మనందరినీ ఒంటరిని చేసింది. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మునుపటిలా లేదు. తల పైకెత్తి చూడండి. నా నెట్వర్క్.. అనుభవం మీకు సహాయం చేయగలితే సంతోషిస్తాను అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో.. వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల తర్వాత భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 75,364.69 వద్ద స్థిరపడింది. సూచీ 76,258.12 నుంచి 75,240.55 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 345.65 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 22,904.45 వద్ద స్థిరపడింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 8.36 శాతం వరకు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 3.56 శాతం క్షీణించడంతో స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.91 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో స్థిరపడగా, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియల్టీలు 2-6.5 శాతానికి పైగా నష్టపోయాయి.

ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో 'సుందర్ పిచాయ్' ఒకరు. ఈయన నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక సలహా అని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య 'అంజలి పిచాయ్' అని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో అంజలి పిచాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.రాజస్థాన్‌లో జన్మించిన అంజలి, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలో సుందర్ పిచాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.ఆ తరువాత సుందర్ పిచాయ్, అంజలి పెళ్లి చేసుకున్నారు. మొదట అంజలి తన కెరీర్‌ను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా ప్రారంభించింది. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్న తరువాత.. ప్రముఖ ఆర్థిక సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్‌కు మారింది, ప్రస్తుతం ఆమె అక్కడ కీలక నిర్వహణ పాత్రను పోషిస్తోంది. అంజలి పిచాయ్.. ఇంట్యూట్‌లో కెమికల్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారు. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా మంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది.మైక్రోసాఫ్ట్, ట్విటర్ కంపెనీలలో జాబ్ ఆఫర్ రావడంతో.. సుందర్ పిచాయ్ గూగుల్ జాబ్ వదిలేయాలకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య అంజలికి చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరిగా ఎదగడానికి అంజలి మద్దతుగా నిలిచారు. సుందర్ తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు చాలా కాలం విడిపోయిన తర్వాత కూడా.. అంజలికి అతనిపై ఉన్న దృఢమైన నమ్మకం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: రతన్ టాటా వీలునామా.. ఎవరికి ఎంత కేటాయించారంటే?సుందర్ పిచాయ్, అంజలి.. ఇప్పుడు కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్‌లో వారి ఇద్దరు పిల్లలు కావ్య, కిరణ్‌లతో నివసిస్తున్నారు. 2023లో ఆమె వృత్తిపరమైన విజయాలు.. సహకారాలకు గాను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆమెను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అంజలి మొత్తం సంపద రూ.830 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.
ఫ్యామిలీ

సగం మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు
సర్వే వివరాల ప్రకారం.సర్వే చేసిన కుటుంబాలు: 6,36,699పాల్గొన మహిళలు: 7,24,115వయసు: 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లుపురుషులు: 1,01,839వయసు: 15 ఏళ్ల నుంచి 54 ఏళ్లుసాక్షి, సిటీబ్యూరో: మెట్రోపాలిటిన్ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందనే నివేదికలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఒక్కటైన నూతన జంట తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తీరా చూసే్త పిల్లల కోసం చేసిన ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యమవుతోందనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. దేశంలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం మంది మగవారిని ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తోంది. మునుపటితో పోల్చితే 20 ఏళ్ల నుచి 40 ఏళ్ల వయసుగల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాతంల్లో సమస్య అధికంగా ఉందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.ప్రభావం చూపే అంశాలు..నగర యువతలో మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, వాతావరణ కాలుష్యం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, రేడియేషన్, భారీ స్థాయిలో లోహాలు, టాక్సిన్స్, బిస్ఫెనాల్-ఎ (బీపీఏ), థాలేట్స్, రసాయినాలు, ప్లాస్టిక్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వస్తువులు, తదితరాలు హార్మోన్ల స్థాయిలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే పునరుత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సైంటిఫిక్ చికిత్సలతో లోపాలను సులభంగా గుర్తించవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం, పురుషుల్లో పునరుత్పత్తి సామర్థా్యన్ని పెంచడానికి ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి అత్యాధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనగరాల్లో అధిక సమస్యలు..దేశంలో ప్రధానమైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటిన్ నగరాల్లో పురుషుల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిలో స్త్రీ, పురుషులిద్దరూ సమాన పాత్ర ఉంటుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే గనర యువతలోనే ఈ సమస్య అధికంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ కాన్ఫరెన్స్ పరిశోధనలో 1970 తర్వాత జన్మించిన పురుషులలో మునుపటి తరాలతో పోలిస్తే, ముఖ్యంగా 25-40 సంవత్సరాల వయస్సులో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉందని తేలింది.మానసికంగా కుంగిపోతున్నారు.పెళ్లైన తరువాత ఏడాది, ఎండేళ్లయినా పిల్లలు కలగకపోయే సరికి పురుషులు మానసికంగా కుండిపోతున్నారు. ఒంటరితనం, విచారంగా ఉండటం, ఎవరికి చెప్పుకోవాలో తెలీక, ఎదుటి వ్యక్తుల మాటలకు లోలోన బాధపడుతున్నారు. ఈ భావోద్వేగ సమస్యలని పరిష్కరించడానికి సహచరులతో చర్చించుకోవడం, నిపుణల సూచనలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.గాంధీ ఆసుపత్రికి నెలకు సుమారు 500 మంది ఫెర్టిలిటీ సమస్యలతో వస్తున్నారు. ఒత్తిడి, లైఫ్ స్టైల్, స్మోకింగ్, రక్తప్రసరణ తగ్గడం వంటివి ఫెర్టిలిటీ సమస్యలకు దారితీస్తాయి. మిల్లీలీటరు స్పెర్మ్‌లో 15 నుంచి 16 లక్షల కౌంట్ ఉండాలి. కొంత మందిలో కనీసం లక్ష కూడా ఉండటంలేదు. ఇక్సీ వంటి చాలా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అవగాహనతో తొలుత పరీక్షలు నిర్వహించుకుంటే సమస్యలను అధిగమించొచ్చు. -వి.జానకి, గాంధీ ఆసుపత్రి ఇన్ఫెర్టిలిటీ విభాగం ఇన్చార్జి.వివాహం అయి ఏడాది దాటినా పిల్లలు పుట్టడంలేదంటే భర్య, భర్తలిద్దరూ సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడం మంచిది. కారణాలు త్వరితగతిన గుర్తిస్తే, మెరుగైన చికిత్సా విధానాలను అందించే అవకాశం ఉంటుంది. మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలపై ఎన్ఎఫ్హెచ్ఎస్ వంటి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ధూమపానం, మధ్యంకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, వయస్సు, జీవన శైలి, పర్యావరణం, వంటి అంశాలు మగవారిలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. - డా.కె.రఘువీర్, ఆండ్రాలజిస్టు, ఒయాసిస్ ఫెర్టిలిటీ

Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. గుజరాత్‌లోని సువర్ద గ్రామంలో జామ్‌నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్‌ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు.

పెళ్లి చీరలు కార్చోబీ సొబగులు : ఈ వివరాలు తెలుసా మీకు?
పెళ్లి చీరలు, ఫ్యాషన్, పంజాబీ సూట్స్, ఫ్యాన్సీ, మహిళల సూట్స్‌కు జిగేల్మనిపించేలా చేసే వర్క్‌నే కార్చోబీ వర్క్ అంటారు. నగరంలోని పలువురు మహిళలు దశాబ్దాలుగా ఈ కళనే ఉపాధిగా ఎంచుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వర్క్ చేసేవారిని కార్చోబీ కళాకారులు అంటారు. వీరు వివిధ రకాల వ్రస్తాలకు జిగేల్ మనిపించే రీతిలో అల్లికలు, డిజైన్లను అద్దుతారు. – గోల్కొండ వ్రస్తాలకు కళాకారుల సృజన నగరంలో కుటీర పరిశ్రమగా ఉపాధి అవకాశాలు కార్చోబీ అల్లికలతో మహిళలకు చేతినిండా పని సూట్లు, చీరలకు జిగేల్మనే మెరుపులు తగ్గుతున్న ఆదాయం.. ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు. తగ్గుతున్న ఆదాయం.. ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు. గిట్టుబాటు ధరతో సరి.. వస్త్ర వ్యాపారులు నేరుగా పని ఇస్తుండడంతో గిట్టుబాటు ధర వస్తుందని, గతంలో కార్చోబీ పనిలో దళారులదే ఇష్టారాజ్యంగా ఉండేదని, ఇచ్చిందే తీసుకోవాలన్నట్లు ఉండేదని, అయితే ప్రస్తుతం ఒక్కో కార్మికుడు హాఫ్ శారీకి రూ.1500, చీర కొంగుకు వెయ్యి లభిస్తున్నాయి అని చెబుతున్నారు. అదే ఫ్యాన్సీ సూట్ అయితే ఫుల్ సూట్‌కు రూ.2వేలు, త్రీపీస్ సూట్‌కు మూడు వేలు లభిస్తున్నాయి. ఇక కార్చోబీ పనికి అవసరమయ్యే చంకీలు, దారాలు, ఇతర వస్తువులను వ్యాపారులే సరఫరా చేస్తారు. షోరూమ్‌లలో, షోకేజీలలో జిగేల్ మనిపించే సూట్లు, చీరల అందం వెనుక కార్చోబీ కళాకారుల పనితనం అద్భుతమైందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..!
తాతగారు తన మనవళ్లు, మనవరాళ్లను దగ్గర కూర్చోబెట్టుకొని సరదాగా ముచ్చటించేవాడు. చందమామ కథలు చెప్పేవాడు. హాయిగా నవ్వించేవాడు.ఇప్పటి దృశ్యం.....తాతయ్య ఎప్పుడూ ఒంటరిగానే కనిపిస్తాడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. పిల్లలు హోంవర్క్ అనే ప్రపంచం నుంచి ఎప్పుడోగానీ బయటికి రారు. బయటికి వచ్చినా తాతయ్యతో పొడి పొడి మాటలే ఉంటాయి. ఈ నేపథ్యంలో అలనాటి బంగారు కాలాన్ని గుర్తుకు తెచ్చే వీడియో నెటిజనులలో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. 96 ఏళ్ల తాతయ్య తన ముని మనవరాలితో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చిన్నారి నవ్యతో బొమ్మలాట ఆడుకుంటున్నప్పుడు తాతయ్య కనులలో కోటి పండగల కళ కనిపించింది. ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ చాలామంది తమ బాల్యంలోకి వెళ్లి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను గుర్తు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Navya Patel (Pihu) (@navyapatel_02) (చదవండి: రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!)
ఫొటోలు


దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ ఫోటో షూట్.. (ఫోటోలు)


చైత్ర నవరాత్రి: పోచమ్మతల్లిని దర్శించుకున్న సమంత బెస్ట్ ఫ్రెండ్ (ఫోటోలు)


సిల్క్ చీరలో బెంగాలీ బ్యూటీలా అనసూయ (ఫొటోలు)


బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సురేఖావాణి కూతురు సుప్రీత..నెక్స్ట్ లెవల్ ఫోటోస్


కుమారుడితో సానియా మీర్జా.. కొత్త భార్యతో షోయబ్ మాలిక్ సెలబ్రేషన్స్ చూశారా? (ఫొటోలు)


రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? పంత్‌కు గోయెంకా క్లాస్? (ఫోటోలు)


బ్లూ శారీలో మెరిసిపోతున్న అనసూయ (ఫోటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే (ఫోటోలు)


Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి


అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు
న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్‌తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెర తీశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బుధవారం సంతకం చేశారు. భారత్‌ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్ టారిఫ్ విధించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు! ట్రంప్ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. ట్రంప్ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్‌కు అమెరికా ఫస్ట్ అయితే మోదీకి భారతే ఫస్ట్. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. ట్రంప్ వలలో మోదీ: కాంగ్రెస్ భారత్‌పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్‌సభలో వి పక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్ చేశారు.మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని ట్రూత్‌సోషల్‌లో కామెంట్ చేశారు.ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్‌తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్‌లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్‌తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్‌లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్‌పైనా సుంకం ఒక శాతం పెరిగింది. దాన్ని 26 శాతంగా ట్రంప్ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్‌తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కెనడా, మెక్సికోలకు మినహాయింపుఐఈఈపీఏ స్టాండింగ్ ఆర్డరే కారణంఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడుడొనాల్డ్ ట్రంప్ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్‌ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్‌లు వర్తించవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు.

బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్‌లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్‌గా భావిస్తున్నాం’అని నార్త్‌వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్‌ను రూపొందించామని నార్త్‌వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్‌లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్‌కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్

డోజ్ నుంచి వైదొలగను: మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే. ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు.

నోబెల్ గ్రహీత వీసా రద్దు
శాన్‌జోస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ అరియాస్ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్ జోస్‌లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు. ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును రోమన్ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్కు 1987లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్‌కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది.
జాతీయం

గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
వాళ్లంతా ఒకే ఏరియాలో ఉండే స్నేహితులు. సరదా ట్రిప్పు కోసం కారులో కొద్ది దూరం వెళ్లారు. కానీ, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వాళ్లలో ఇద్దరిని కబళించింది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు.. ఇదంతా గూగుల్ మ్యాప్(Google Map) చేసిన నిర్వాకమనే విషయం తెలిసి కంగుతిన్నారు.ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన కారు-ట్రక్కు ప్రమాదంలో విస్తుపోయే విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా ముందుకెళ్లిన కారు.. అనూహ్యంగా ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని ఎన్డీటీవీ ఒక కథనం ఇచ్చింది.హర్యానా రోహ్తక్కు చెందిన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజూలు నైనిటాల్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమ్‌కు వెళ్లి తిరిగొస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి టైంలో బైపాస్ గుండా వెళ్లాల్సిన కారు.. అనూహ్యాంగా ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. అంతలో రామ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ దిమ్మెలతో కూడిన ట్రక్కు వీళ్ల కారును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ట్రక్కు బోల్తా పడగా.. కారు నుజ్జు అయ్యి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్షగాతత్రులు సాయం కోసం కేకలు వేశారు.సుమారు 15 మంది(ట్రక్కు డ్రైవర్‌తో సహా).. దాదాపు గంట సేపు అతికష్టం మీద శ్రమించి కారులో ఉన్న నలుగురు క్షతగాత్రులను బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన శివాని, సిమ్రాన్‌లు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంలో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉంది. బహుశా ఆ రాంగ్ టర్నే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి అదే విషయాన్ని ధృవీకరించుకున్నారు.

వైరల్.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది!
గాంధీనగర్ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అమ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్ఫోన్లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు.

Neet Row: డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్‌ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్‌లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్‌లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్‌ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట.
ఎన్ఆర్ఐ

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది. అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది.

పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు.

ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి

బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే. వివరాల్లోకి వెళితే.. 10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు. నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్ నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు.
వీడియోలు


చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: అంబటి రాంబాబు


తొలిసారి స్పందించిన అన్నామలై


చినరాజప్ప ఇంటిని ముట్టడించిన కల్లుగీత కార్మికులు


టీడీపీ నేతలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్


Merugu Nagarjuna: మైనార్టీలకు తీరని అన్యాయం


ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్నిప్రమాదం


ప్రపంచం నెత్తిన ట్రంప్ బాంబు ఇక కోలుకోలేమా..!


L2: ఎంపురన్ చిత్ర నిర్మాత ఆఫీసుల్లో ఈడీ సోదాలు


వక్ఫ్ సవరణ బిల్లుపై న్యాయ పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్


రౌడీ మూకలతో మంత్రి నిమ్మల ఫ్యాక్షన్ పాలిటిక్స్