
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలుఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ న్యాయపోరాటంలో న్యాయవాదుల సంఖ్య తెలిస్తే నోరు వెళ్లబెట్టక తప్పదు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 97మంది న్యాయవాదులు ఈ జాబితాలో ఉన్నారు.
జర్నలిస్టు ప్రియా రమణి లైంగిక ఆరోపణల నేపపధ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను 97మంది న్యాయవాదులు వాదించనున్నారు. ప్రముఖ సంస్థ కరంజావాలాకు చెందిన లాయర్లు ప్రియా రమణికి వ్యతిరేకంగా వాదించనున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై నేరపూరిత ఆరోపణ కేసును సోమవారం నమోదు చేసిన సంగతి తెలిసిందే.