Journalist
-
White House: ముందే లీక్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
వాషింగ్టన్: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్‌లోకి ఓ యూఎస్ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్‌లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్‌పై యుద్ధానికి సమాచారం పోస్ట్ చేశారు. ‘ద అట్లాంటిక్’ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్‌పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్‌లో యాడ్ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్‌హౌజ్ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్‌ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి. -
Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే..
నోయిడా: కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్టు, క్యాబ్ డ్రైవర్ వాదించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే, నెటిజన్లంతా క్యాబ్ డ్రైవర్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈ వాగ్విదానికి సంబంధించిన వీడియోను దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించగా, ఆమె తనను బెదిరించి టాక్సీ ఛార్జీ చెల్లించడానికి నిరాకరించిందని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. కాగా, తాను జర్నలిస్టునని సదరు మహిళా జర్నలిస్టు క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.మిగతా 95 పైసలు కూడా చెల్లిస్తే పోయేదానికి ఈగోకు పోయి ఆ మహిళా గొడవకు దిగిందని ఓ నెటిజన్.. కేవలం 95 పైసల కోసం క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించడం అవసరమా..? అంటూ మరో నెటిజన్ ప్రశ్నలు గుప్పించారు. క్యాబ్ డ్రైవర్‌ది తప్పులేకపోయినా మహిళా కార్డు ఉపయోగించి అతడిని బెదిరించడం కరెక్టు కాదు. చేతిలో డబ్బులు లేకపోతే బస్సులో వెళ్లొచ్చుగా క్యాబ్‌లో వెళ్లి గొడవపడటం ఎందుకు..?’’ అంటూ యూజర్లు ఆ మహిళను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై మహిళా జర్నలిస్టు శివంగి శుక్లా వివరణ ఇస్తూ.. తాను క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించలేదని, అతడే తనతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. లోకేషన్‌కు దూరంగా క్యాబ్‌ను ఆపేశాడని, లోకేషన్‌కు తీసుకెళ్లమంటే కుదరదని దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో తాను క్యాబ్ దిగి రూ.129 పేమెంట్ చేశానని, తొందరలో పైన ఉన్న 95 పైసలు చూసుకోలేదు. ఇంతలోనే 95 పైసలు ఎందుకు కొట్టలేదంటూ క్యాబ్ డ్రైవర్‌కు గొడవ దిగాడని, దాంతో తాను జర్నలిస్టునని, దబాయించవద్దని వార్నింగ్ ఇచ్చానని ఆ మహిళా జర్నలిస్టు తెలిపారు.Who is this Journalist threatening @Uber_India driver of police action just because he asked her to pay the fare ? Plz identify her & ask her to travel in bus if she doesn't want to payAlso - in public interest, please ask every cab driver you meet to install cameras pic.twitter.com/PA9qqdBluJ— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 21, 2025 -
హద్దు మీరితే ఖబడ్దార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్‌గానే చూస్తాం. క్రిమినల్స్‌కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్‌ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్‌దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్‌కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’ -
అసెంబ్లీకి రమ్మంటారు వస్తే భయపడతారు: YS Jagan
-
నలుగురు బందీల మృతదేహాలు అప్పగింత
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ గురువారం విడుదల చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగర సమీపంలో రెడ్ క్రాస్ సంస్థకు అందజేసింది. అనంతరం రెడ్‌క్రాస్ వాహనంలో ఉంచారు. ఆ పేటికల్లో షిరి బిబాస్(32), ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్ బిబాస్(4), కెఫిర్ బిబాస్, రిటైర్డ్ జర్నలిస్ట్ ఓడెడ్ లిఫ్ షిట్జ్గా గుర్తించారు. వీరందరూ హమాస్ 2023 అక్టోబర్ ఏడో తేదీన దాడిలో అపహరించిన వారు. అయితే ఈ నలుగురు గతేడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించారని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ క్రూరమైన నిరంతర బాంబు దాడుల వల్ల అపహరణకు గురైనవారందరినీ రక్షించలేకపోయామని హమాస్ తెలిపింది. చనిపోయినవారు... పిల్లల ప్రాణాలనూ లెక్కచేయని నాయకత్వ తీరుకు బలైపోయారని హమాస్ బాధితుల కుటుంబాలకు తెలిపింది. మృతదేహాల పేటికలు తమకు అందాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. మరణించినవారి వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించలేదు. అప్పగింత సమయంలో.. ఖాన్ యూనిస్ శివార్లలో వేలాది మంది గుమిగూడారు. శవపేటికలను ఉంచడానికి ఏర్పాటు చేసిన వేదికపై ముసుగులు ధరించిన సాయుధులు... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును రక్త పిశాచిగా చిత్రీకరించిన పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఒక పెద్ద స్క్రీన్‌లో లిఫ్షిట్జ్, బిబాస్ కుటుంబం ఫొటోలను, వీడియోలను ప్రదర్శించారు. అత్యంత చిన్నవయస్కుడైన కెఫిర్.. బాట్మాన్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో అందరినీ కదిలించింది. -
జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్యలో విస్తుగొలిపే విషయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కక్షగట్టి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను చంపేసిన ఉదంతంలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పోస్ట్‌మార్టమ్ నివేదికలో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముకేశ్‌ను చిత్రవధ చేసి అంతంచేశారని, చంపేశాక మృతదేహంపైనా తమ పట్టరాని ఆవేశాన్ని చూపించారని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొంది. ముకేశ్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చఠాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం హంతకులు మృతదేహం నుంచి గుండెను వేరేచేసి, కాలేయాన్ని నాలుగు ముక్కలుచేశారు. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. ఐదు పక్కటెముకలు, మెడ ఎముకలు విరిగిపోయాయి. చేయి విరిచేశారు. తల, ఛాతి, వీపు, పొట్టపై తీవ్రమైన గాయాలున్నాయి. ఇనుప రాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులున్నాయి. చేతిపై ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముకేశ్‌దే అని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్‌మార్టమ్ కెరీర్లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు రితేశ్ చంద్రకర్, దినేశ్ చంద్రకర్, మహేంద్రలను అరెస్ట్‌చేశారు. ప్రధాన నిందితుడు సురేశ్ సైతం మృతుడికి దూరపు బంధువుకావడం గమనార్హం. బీజాపూర్ రోడ్డు పనులపై నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేశ్ సోదరుడు రితేశ్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యాక ముకేశ్ కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని ముకేశ్ అన్న యుకేశ్ డిసెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేయగా హత్య విషయం బయటికొచ్చింది.ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్‌చేసింది. హత్య జరిగిన జనవరి ఒకటో తేదీ నుంచి తప్పించుకు తిరుగుతున్న సురేశ్‌ను అతని డ్రైవర్‌కు చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్చేశామని సిట్ ఇన్చార్జ్ పోలీసు అధికారి మయాంక్ గుర్జార్ సోమవారం వెల్లడించారు. సురేశ్‌ను బీజాపూర్‌కు తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ చెప్పారు. నిందితులు రితేశ్, దినేశ్‌లు హతుడు ముకేశ్‌కు వరసకు సోదరులుకాగా మహేంద్ర రామ్‌టెకె సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఈ ముగ్గురూ చంపేశారని తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి సిమెంట్‌తో కప్పేశారు.సొంత యూట్యూబ్ చానల్బీజాపూర్లో దాదాపు రూ.120 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఎన్డీటీవీ టీవీఛానెల్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా చేసే 33 ఏళ్ల ముకేశ్ సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. 2021లో బీజాపూర్‌లో తకల్గూడలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాను, కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను బంధించి మావోలు తీసుకెళ్లగా చర్చలు జరిపే ఏప్రిల్‌లో విడిపించడంలో ముకేశ్ కీలకపాత్ర పోషించారు. ముకేశ్ మరణవార్త తెల్సి మహర్ వర్గీయులు సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్ష అమలుచేయాలని డిమాండ్‌చేశారు. రాయ్‌పూర్ ప్రెస్‌క్లబ్‌లో వందలాది పాత్రికేయులు ధర్నాచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కేసు వివరాలను నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని పీసీఐ ఛైర్పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆదేశించారు. ది ప్రెస్ అసోసియేషన్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సైతం పారదర్శక దర్యాప్తునకు డిమాండ్‌చేశాయి. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్‌తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. -
జర్నలిస్ట్ దారుణ హత్య
-
సంచలనంగా జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ కేసు.. ముగ్గురి అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పనుల్లో అవినీతి జరిగిందని ఈమధ్య ఆయన స్టోరీ చేశారు. అందుకే ఆయన్ని హతమార్చి ఉంటారనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు. బీజాపూర్‌కు చెందిన ముఖేశ్ చంద్రాకర్(mukesh chandrakar) గతంలో పలు పత్రికలు, చానెళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో ముఖేశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్‌లోని చట్టాన్పారా(Chattanpara) ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. సదరు ఇల్లు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్దిగా తేలింది. సురేష్‌ను హైదరాబాద్‌లో బీజాపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.మధ్యవర్తిగా వార్తల్లో.. ఛత్తీస్‌గఢ్‌లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే ముఖేశ్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు తెర్రెం సమీపాన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చి సీఆర్పీఎఫ్(CRPF) కానిస్టేబుల్ రాకేశ్సింగ్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, జవాన్ కుటుంబీలకు వినతితో మావోయిస్టులతో చర్చలు జరిపి జవాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందు బీజాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఏఈని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే సహచర జర్నలిస్టులతో కలిసి ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించారు. -
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారని ఎన్క్లేవ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సెంట్రల్ గాజాలోని నుసిరత్‌లో ఉన్న అల్-అవ్దా ఆసుపత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు. వీరంతా అల్-ఖుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మీడియా కథనాల ప్రకారం.. జర్నలిస్టులు ఆసుపత్రి లోపల నుంచి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో, వారు చనిపోయారు అని తెలిపింది. ఇక, మరణించిన జర్నలిస్టులను ఫాది హస్సౌనా, ఇబ్రహీం అల్-షేక్ అలీ, మహ్మద్ అల్-లదా, ఫైసల్ అబూ అల్-కుమ్సన్, అయ్మాన్ అల్-జాదీగా గుర్తించినట్లు అల్ జజీరా నివేదించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని జైటౌన్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సందర్భంగా వీరంతా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.Overnight, the IAF conducted an airstrike on a vehicle belonging to the TV news channel "Al Quds Today" in the Nuseirat refugee camp near the Al Awda hospital in central Gaza. The IDF later released a statement claiming that it targeted a Palestinian Islamic Jihad (PIJ)… pic.twitter.com/M7BIA8BTz0— AMK Mapping 🇺🇦🇳🇿 (@AMK_Mapping_) December 26, 2024 -
మరణిస్తూ మరికొందరికి ప్రాణం పోసి..
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు. 22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడిప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. -
జర్నలిస్ట్ రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ (ఫొటోలు)
-
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
సాక్షి జర్నలిస్టులపై దాడిని ఖండించిన APUWJ
-
టీడీపీ గూండాలపై పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
-
మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈయన కుటుంబంలో ఆస్తి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి ఇంటికెళ్లిన మనోజ్.. గేట్లు బద్ధలు కొట్టుకుని లోపలికెళ్లాడు. అయితే రీసెంట్గా మోహన్ బాబు ఇంటి దగ్గరకెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై ఈయన దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సి పొందిన మోహన్ బాబు.. గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై క్షమాపణ చెప్పారు. తాను ఈ విషయమై పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)'అనారోగ్య కారణాల దృష్ట్యా.. ఈ సంఘటనపై తక్షణమే స్పందించలేకపోయాను. ఆ టైంలో నా ఇంటి గేటు విరిగిపోయింది. 30-50 మంది మనుషులు తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. నేను నియంత్రణ కోల్పోయాను. ఇదంతా జరుగుతున్న టైంలో మీడియా అక్కడికొచ్చింది. అప్పటికే నేను అలసిపోయి ఉన్నాను. దీంతో అనుకోని పరిస్థితుల్లో మీడియా ప్రతినిధికి నా వల్ల గాయమైంది. ఈ విషయమై పశ్చాత్తపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన ఇబ్బందికి తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మోహన్ బాబు ఆడియో సందేశం ఒకటి రిలీజ్ చేశాడు. మీడియాపై దాడి జరిగినందుకు ఎంతో చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని, తన కొడుకులతో కలిసి సమస్యని తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ')pic.twitter.com/PxcuHTxzbB— Mohan Babu M (@themohanbabu) December 13, 2024 -
జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు
కుటుంబ వివాదంలో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబుకి మరో షాక్ తగిలింది. మోహన్ బాబు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం రాత్రి పలువురు జర్నలిస్టులు జల్పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ప్రశ్న అడిగేందుకు ఓ రిపోర్టర్ ప్రయత్నించగా.. అతడి దగ్గరున్న మైక్ లాక్కొని సదరు జర్నలిస్టుపైనే మోహన్ బాబు దాడి చేశాడు.(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలపై కాస్త గట్టిగానే గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని.. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ దాడి విషయమై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద.. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.118 బీఎన్ఎస్ యాక్ట్ విషయానికొస్తే.. 2023 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి ప్రతిగా మూడేళ్ల జైలుశిక్ష లేదంటే రూ.20 వేల జరిమానా విధించొచ్చు. కొన్నిసార్లు రెండింటిని కూడా విధించే అవకాశముంది.మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా.. తమ దగ్గరున్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలని పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్లని ఆదేశించారు. అలానే బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!) -
ఫ్యూచర్ సిటీకి జర్నలిస్టుల విజిట్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) సభ్యులు వందలాది మంది ఆదివారం ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డీజేహెచ్ఎస్ సభ్యులు అక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.నేడు ఫోర్త్ సిటీని సందర్శించిన జర్నలిస్టులు అక్కడి వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమకు ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు. ఆరు నెలల్లోగా ఇచ్చేలా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రికి డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి సూచించారు. హైదరాబాద్‌కు ఇది నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉందన్నారు.అలాగే.. స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయన్నారు. నెట్ జీరో వల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా ఇది అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అందువల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. అందుకోసం చొరవ చూపిన సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
విమర్శలు చేస్తే.. క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు. ఈ సందర్భంగా.. ‘‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.జర్నలిస్టులు రాసిన ప్రచురించిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి.. సదరు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని సుప్రీం సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని పేర్కొంది. సాధారణ పరిపాలనలోని కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ మంజూరు చేసింది.చదవండి: బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి -
ఎందుకీ సుద్దపూస కబుర్లు.. ఆ విషయం మర్చిపోయావా రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా ఉంది. ఆయన కొంతమంది జర్నలిస్టులను ఉన్మాదులుగా పోల్చడం బాగోలేదు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలలో పనిచేస్తున్నకొందరు పాత్రికేయులు ఉన్మాదంగా మారి ప్రెస్ మీట్లలో లేదా జరుగుతున్న కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలలో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్ని చోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాలలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా కొందరు పాత్రికేయులు అడిగే ప్రశ్నలు, ఇచ్చే కథనాలు ఆయనకు నచ్చకపోవచ్చు. లేదా కొన్ని పత్రికలపట్ల ఆయనకు వ్యతిరేకత ఉండవచ్చు. అంతమాత్రాన వారిని ఉన్మాదులతో ఎలా పోల్చారో అర్ధం కాదు.రాజకీయ నేతల భాష గురించి పక్కనబెట్టి, పాత్రికేయుల భాష గురించి హితవు చెప్పిన రేవంత్ ఇలా మాట్లాడడం సమంజసమేనా అన్నది చూడాలి. అలా అని మీడియా అంతా వృత్తి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పడం లేదు. ఏ రంగంలో అయినా అన్ని రకాలవారు ఉంటారు. అలాగే జర్నలిజంలో కూడా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు పత్రికలు స్థాపించడం గురించి రేవంత్ ప్రస్తావించారు. గతంలో వామపక్షాలు పత్రికలు పెట్టుకున్న విషయాన్ని చెప్పి వాటిలో పనిచేసే జర్నలిస్టులను గౌరవంగానే మాట్లాడారు. బహుశా ఒక వామపక్షం తమకు మిత్రపక్షంగా ఉన్నందున ఆయన జాగ్రత్తపడి ఉండవచ్చు. పైగా ఒక సిపిఐ నేతకు పదవి కూడా ఇచ్చారు.మిగిలిన మీడియా సంస్థలలో ఏవి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నవో ఆయన వివరించలేదు కాని, ప్రధానంగా ఆయన ఆగ్రహం అంతా బీఆర్ఎస్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక గురించి అయి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్ల గురించి అయి ఉండాలి.బీజేపీ మీద కంటే ఆయన దృష్టి అధికంగా బీఆర్ఎస్ మీదే ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. రాజకీయ నాయకులకు సహజంగానే తమపై నెగిటివ్ వార్తలు రాసే పత్రికలన్నా, సంబంధిత జర్నలిస్టులన్నా కాస్త కోపమే ఉంటుంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ మీడియానే లేదనట్లుగా ఆయన మాట్లాడడం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధిక మీడియా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లే లెక్క. వెలుగు దినపత్రిక యజమాని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేనే. ఆ యజమాని కుటుంబం తొలుత కాంగ్రెస్ తదుపరి బీఆర్ఎస్, ఆ పిమ్మట బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. వారు ఎటు ఉంటే దానికి అనుగుణంగా మీడియాలో కొంతవరకు వార్తలు ఇచ్చే మాట నిజమే.అలాగే ఇతర పార్టీలకు కొంత వ్యతిరేకం అనిపించే స్టోరీలు ఇస్తుండవచ్చు. అంతమాత్రాన అది ఉన్మాదం అయిపోతుందా?. ఏ మీడియా అయినా వాస్తవాలు రాయాలని చెప్పాలి. ఒకవేళ పనికట్టుకుని అసత్యాలు రాస్తే ఖండనలు ఇస్తారు. మరీ తీవ్రమైన స్థాయిలో కల్పిత గాధలు రాస్తే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవడం కొత్త కాదు. కొందరు మీడియా యజమానులు కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం, ఆ పార్టీల ద్వారా ప్రయోజనాలు పొందడం, వారు ఆశించిన పని జరగకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇదీ చదవండి: మరకే మంచిదంటున్న చంద్రబాబు!వారిలో ఒకరిద్దరితో ఈయనకు సత్సంబంధాలే ఉన్నాయని అంటారు. అందరూ అలా చేస్తున్నారని కాదు. మీడియా రంగంలో ఒకప్పుడు కొంతైనా నిష్పక్షపాతంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కాని రానురాను, అవి తమకు నచ్చిన పార్టీలను భుజాన వేసుకుంటుండంతో రాజకీయ పార్టీలు, లేదా నేతలు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. వామపక్షాలైన సిపిఐ, సిపిఎం లకు ఎప్పటి నుంచో పత్రికలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. తెలుగులో కూడా కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి కొన్ని పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ మాజీ ఎంపీ కెఎల్ ఎన్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి పత్రికను స్థాపించారు. మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.చంద్రశేఖరరెడ్డి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలను నిర్వహించారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రికకు సారధ్యం వహిస్తున్నారు. ఉదయం పత్రికను స్థాపించిన దాసరి నారాయణరావు తదుపరి కాంగ్రెస్ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. "వార్త పత్రిక యజమాని గిరీష్ సంఘీ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఈనాడు దినపత్రికను జలగం వెంగళరావు సహకారంతో ఆరంభించారు. ఆ తర్వాత కాలంలో ఆయన తనది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పడం విశేషం. తొలుత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాక చంద్రబాబును భుజాన వేసుకున్నారు.దీనితో పాటు మరో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా కొత్త యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు అనుకూల పత్రికగా మారింది. ఈ రెండు పత్రికల ఎజెండాను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు కూడా పత్రిక ఉండాలని భావించి తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, టివిలను ఆరంభించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ బొమ్మను సాక్షి పత్రిక, టివిలలో ప్రముఖంగా వేసుకుని నడుపుతున్నారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగు దేశం జెండా గుర్తు వేసుకోకుండా లేదా చంద్రబాబు మద్దతు దారులమని ప్రకటించకుండా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టు ఇస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులపై ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై నీచమైన స్థాయిలో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుంటాయి.చంద్రబాబుకు భజన చేసుకుంటే పర్వాలేదు కాని వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్మాదంగా వైఎస్సార్సీపీపై అధికారంలో ఉన్నప్పుడే కాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా అదే ధోరణిలో వెళుతున్నాయి. చిత్రం ఏమిటంటే ఈ రెండు మీడియాలు మరికొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్‌కు, ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమిని భుజాన వేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఈ మీడియాల యజమానులతో రేవంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియా అధిపతి వద్దకు స్వయంగా రేవంత్ వెళ్లి వినయంగా వ్యవహరించిన ఘట్టం విమర్శలకు గురి అయ్యింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక టివి, చానల్ రేవంత్ అనుచరుడిది అని చెబుతారు. నిజానికి రేవంత్ పైకి వచ్చింది మీడియా సహకారంతో అన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆయన మీడియాకు సుద్దులు చెప్పే దశకు చేరుకున్నారు .ఆలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక యూ ట్యూబ్ చానల్ లు నిర్వహించడం ...అప్పట్లో కేసిఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కధనాలు నడపించడంతో పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు .ప్రధాన మీడియా అయినా, యూ ట్యూబ్ చానల్ లు అయినా తమ పరిధులలో ఉండాలని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కాని చంద్రబాబు ,రేవంత్ రెడ్డి వంటి నేతలు తాము అధికారంలో ఉంటే మీడియా ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండాలని కోరుకోవడంతోనే సమస్యలు వస్తాయి.గత కేసిఆర్ ప్రభుత్వం సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టిన మాట నిజమే. అందువల్ల ఆయనకు అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు రేవంత్ అలాంటి అంక్షలు లేవని అనడం ఆహ్వనించదగ్గదే. కాని కొంత మంది జర్నలిస్టులపై ఉన్మాద ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్మాద పత్రికల యజమానులతో ఆయన స్నేహ సంబంధాలు నడుపుతున్న విషయం మర్చిపోవద్దు.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేను దర్శకుడిని కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా..
-
ఇటలీ ప్రధాని పొడవుపై కామెంట్స్.. జర్నలిస్టుకు జరిమానా
రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్‌కు కోర్టు రూ.4.5లక్షల(5వేల యూరోలు) జరిమానా విధించింది. ప్రధాని జార్జియా మెలోని పొడవుపై మూడేళ్ల క్రితం ఎక్స్(ట్విటర్)లో కోర్టిస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెలోని కోర్టులో దావా వేశారు. ఈ దావాపై విచారణ పూర్తి చేసిన కోర్టు జర్నలిస్టు కోర్టిస్‌కు ఫైన్ వేసింది. ఫైన్ మొత్తాన్ని మెలోనికి చెల్లించాలని ఆదేశించింది. తనకు జరిమానా విధించడంపై కోర్టిస్ స్పందించారు. ఇటీవలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర జర్నలిస్టులకు ఇటలీలో కష్టకాలం కొనసాగుతోందన్నారు. కోర్టు ద్వారా వచ్చే మొత్తాన్ని మెలోని చారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తారని ఆమె న్యాయవాది తెలిపారు. -
లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్
బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్న నటి రోహణి తాజాగా ఓ జర్నలిస్ట్‌పై ఫైర్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది.అసలేం జరిగింది?రోహిణి తాజాగా ‘బర్త్‌డే బాయ్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రేవ్ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్త నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఇది కేవలం ప్రమోషన్స్ కోసమే చేసినట్లు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కానీ కొంతమంది రోహిణి నిజంగానే రేవ్ పార్టీలో దొరికిపోయిందని ట్రోల్ చేశారు. ఇక ఇదే వీడియోపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ చానల్లో మాట్లాడుతూ..రోహిణి లాంటి వాళ్లు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్‌పై కూడా కామెంట్ చేయడం పట్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను బర్త్ డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకొని మీడియా కూడా దానిని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ, సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు కూడా తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా?. ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావు గా ఉంటే పెళ్లి కాదా.? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’అని రోహిణి సీరియస్ అయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
నీట్ పేపర్ లీక్: జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసింది. ఓ హింది న్యూస్ పేపర్లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.అదేవిధంగా గుజరాత్‌లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు. -
‘ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ వ్యాఖ్యలు సరికాదు’
సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా తనను దేశం విడిచి వెళ్లమని భారత హోంశాఖ చెప్పినట్లు ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ చేసిన ఆరోపణలపై భారత్ శనివారం స్పందించింది. భారత దేశం వదలి వెళ్లాల్సి వచ్చిందని సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ పునరుద్ధరణ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.‘ఫ్రాన్సిస్ ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అయితే జర్నలిజం కవరేజీకి సంబంధించి కొన్ని నిబంధనలకు అనుమతి కలిగి ఉండాలి. 2024 మేలో ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును తాము పరిశీలిస్తున్నాం. ఇక దేశం బయట ఆయన చేసే ప్రయాణానికి సంబంధి పూర్తి హక్కులు ఉన్నాయి ’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.‘2024 సార్వత్రిక ఎన్నికల కవరేజీ చేయకుండా బలవంతంగా నేను భారత్ వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 17న భారత్ నుంచి వెళ్లిపోయాను. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన జర్నలిస్ట్ అనుమతిని పునరుద్దరించడానికి నిరాకరించింది. సాధారణ ఎన్నికలను కవర్ చేసేందుకు తిరస్కరించింది. 2011 నుంచి నేను జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నా. నేను భారతీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ప్రభావితం అవుతుంది’ అని సెబాస్టియన్ ఫ్రాన్సిస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.2023వ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్‌మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. -
Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్‌ఫేక్‌ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్‌ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్‌ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్‌ఫేక్‌లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్‌లో నడుస్తుంటే బీచ్‌లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్‌ఫేక్‌లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్‌ఫేక్‌తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్‌గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్‌గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్‌ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్‌ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునీత వ్యాఖ్యల పై దేవులపల్లి అమర్ విశ్లేషణ
-
జర్నలిస్ట్ శంకర్‌పై దాడి
నాగోలు(హైదరాబాద్): జర్నలిస్టు శంకర్‌పై కొందరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ సీరిస్ రోడ్డులో చెలమల శంకర్ అలియాస్ జర్నలిస్ట్ శంకర్ న్యూస్‌లైన్ తెలుగు చానల్‌తోపాటు ‘తెలంగాణం’పేపర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. గురువారం రాత్రి తన కార్యాలయం మూసివేసి రాత్రి 10:40 గంటల సమయంలో తోటి జర్నలిస్టులు దండిగ నర్సింహ, పుల్కారం శివతో కలసి తుర్కయాంజాల్‌కు కారులో బయలుదేరారు. కొద్దిదూరం ప్రయాణించగానే ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో శంకర్ తన కారును స్లో చేశాడు. యాక్టివాపై ఇద్దరు యువతులు వస్తూ వెనుక నుంచి ఆ కారు ఢీకొట్టారు. వెంటనే శంకర్ కారులో నుంచి దిగి యువతులను ప్రశ్నిస్తుండగానే, వారు అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. తప్పు చేసింది మీరే కదా అని అంటుండగానే ఆ యువతులకు తెలిసిన కొందరు యువకులు బైకులపై అక్కడకు చేరుకొని శంకర్‌ను చేతులు, రాళ్లతో కొట్టారు. వారిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన దండిగ నర్సింహ, శివపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న శివను ఆ యువకులు అడ్డుకుని సెల్‌ఫోన్ పగులగొట్టారు. ఈ క్రమంలోనే శంకర్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు తీసుకొని, మూకుమ్మడి దాడి చేయడంతో అక్కడినుంచి ప్రాణభయంతో శంకర్ ఓ ఇంట్లోకి వెళ్లాడు. రోడ్డుపై గొడవ పెద్దది కావడంతో స్థానికులు 100 సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు దండిగ నర్సింహ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కాలనీలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించి జర్నలిస్ట్‌లు శంకర్, శివపై దాడి చేసిన కవాడిగూడకు చెందిన ప్రవీణ్, హయత్‌నగర్‌లోని ఎల్లారెడ్డి కాలనీకి చెందిన మహేష్, ఎల్బీనగర్ హాస్టల్లో ఉండే శ్రీదుర్గ, హేమలతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. దాడికి పాల్పడిన మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులే తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ నల్లగొండలోని ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ చెందిన శ్రీదుర్గ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది జర్నలిస్టు శంకర్, శివతో పాటు తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని, జర్నలిస్టు దండిగ నర్సింహ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచకాలు, తప్పిదాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో కాపు కాసి దాడి చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొండగల్‌లో పేదల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారనే విషయంపై ఇటీవల తాము ప్రసారం చేశామని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పారీ్టకి చెందిన వారే తమపై దాడులకు పాల్పడ్డారని, ఇందుకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి: కేటీఆర్ తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి మొదలైందని, మీడియాపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపైనే దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శంకర్‌పై దాడి ఘటనను ‘ఎక్స్’వేదికగా ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే దాడులా: హరీశ్‌రావు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడటం హేయ మైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అన్నారు. -
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం ఈ జన్మకు ఇది చాలు
-
నాడు జర్నలిస్ట్ నేడు ప్రధాన కార్యదర్శిగా..!
ఐఏఎస్ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించేంత వరకు ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే.. 1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినస్ట్రేటివ సర్వీస్(ఐఏఎస్ ) అధికారి ఉత్తరాఖండ్ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్బీర్ సింగ్ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్ రాట్రూయ్ నవంబర్ 2020లో ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) నుంచి ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక ఆమె తండ్రి కూడా సివిల్ సర్వెంట్‌గా పనిచేయడం విశేషం. ఆమె ఎడ్యుకేషన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బొంబాయి ఎడిషన్‌లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్ సర్వీస్ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆపీసర్ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్‌ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్‌లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్‌లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. యూపీ కేడర్‌కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్ గుజరాత్‌లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్ అధికారిగా కెరియర్ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్‌గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు. (చదవండి: ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!) -
ఓ తెనాలి – తత్ దిన పత్రిక
ఆ పత్రిక కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది. ఇన్చార్జి క్యాబిన్లో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి.బయట డెస్క్‌లో జర్నలిస్టు ధర్మారావు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. అతని సహచరుడు లోకనాథం అతని దగ్గరకు వచ్చి, ‘ఏం బ్రదర్ డల్‌గా ఉన్నావ్? క్యాబిన్ నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. బాస్ ఏమైనా తిట్టాడా?’ అని అడిగాడు.‘అంతేగా?’ అన్నాడు.‘ఎందుకయ్యా! రోజూ ఇలా. ఒకప్పుడు నువ్వు రాసే ఐటమ్స్ అంటే ఇటు పత్రికలోను అటు జనంలోనూ ఎంత హాట్ హాట్‌గా ఉండేవి? అంత చేయి తిరిగిన జర్నలిస్టువి, కాస్త మనసు కూడా చంపుకొని మసాలా వార్తలు రాశా వనుకో! నీ అనుభవానికి ఆ మసాలా తోడైతే వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా ఉండవా నీ ఐటమ్స్? ఎందుకయ్యా! జర్నలిజం విలువలు, తొక్కా అంటూ నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటావు? మనకు కావలసింది జీతం, ప్రశాంతంగా ఉండటం. సమాజం, నైతికత, బాధ్యత అంటూ పనికి మాలిన బిల్డప్పులు ఎందుకు? నేను రోజూ ఇలా చెబుతూనే ఉంటాను, నువ్వు మాత్రం మనసు మార్చుకోక తిట్లుతింటూనే ఉంటావు. ఇంతకీ అసలు ఏం జరిగింది?’ అడిగాడు లోకనాథం. ‘గాంధీనగర్‌లో ఒక మానవీయ కోణానికి సంబంధించి మంచి స్టోరీ రాశాను. అది తీసుకెళ్లి ఇస్తే నా మొహం మీద విసిరేసి, ఇప్పుడు ఈ స్టోరీలు ఎవడికి కావాలి? ఆ రోజులు పోయాయని ఎన్నిసార్లు చెప్పను? ఇప్పుడు కావాల్సిందంతా స్పైసీ... ‘సాగర సంగమం’ సినిమాలో స్టెప్పులు కావాలి... ఆవృతాలు, ఆవులు, గేదెలు ఎవడికి కావాలి అన్నట్టుగా, నామీద ఇంత ఎత్తున ఎగిరేడు’ గద్గద స్వరంతో చెప్పాడు ధర్మారావు. ‘మరి నేను చెప్పేది అదే. తెలివితేటలు ఉండ గానే సరిపోదు. కాస్తంత లౌక్యం కూడా కావాలి బతకాలంటే. సరే సరే నాకు టైం అయిపోతుంది’ అంటూ లోకనాథం కేబిన్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. పొగలు సెగలు కక్కుతున్న ఇన్చార్జి చింపిరి జుత్తుతో సిగ రెట్ల మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడు. ‘రావయ్యా రా! నీ కోసమే చూస్తున్నా. బ్యానర్ స్టోరీ రెడీ అయిపోయింది. సెకండ్ ఐటమ్ ఏం వేద్దామా అని చూస్తున్నాను. టైం అయిపోతూ ఉంది. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వే మైనా వండుకొచ్చావా?’ ఆత్రంగా అడిగాడు ఇన్చార్జి. ‘మీరేం కంగారు పడకండి సార్! నేను ఉన్నాగా? చిల్లీస్ చికెన్, చికెన్ 65, చైనీస్ నూడుల్స్... ఏమైనా సరే అరగంటలో వండి వార్చేస్తా? ఇప్పుడు మన పత్రికతో ఏ డ్రైనేజీ గానీ, మూసీ నది గానీ పోటీ పడలేవు. మీకెందుకుకంగారు? ఇదిగోండి ఇది చూడండి. ఇది నా వంటకం కాదు గాని ఒక తెనాలి అవాకులు చవాకులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి ఆరోపణలు’ అంటూ చేతిలో ఉన్న ప్రింట్ అవుట్ అందించాడు.సీరియస్‌గా ఐటెం చదవడం మొదలు పెట్టాడుఇన్చార్జి. హెడ్డింగ్ చూశాడు: ‘సజ్జలకే 140 కోట్లు.’ ♦ ‘ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్లు వ్యయం. ♦ 89 మంది సలహాదారులకు అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? ♦ నాదెండ్ల మనోహర్ ధ్వజం ఇన్చార్జి ముఖంలో టెన్షన్ చెరిగిపోయి పెదాల మీద చిరునవ్వు మొదలైంది.‘ఇదీ ఐటమ్ అంటే.. ధర్మారావు గాంధీనగర్‌లో పేదల బతుకులు అది ఇది అంటూ చెత్త ఐటమ్ తెచ్చాడయ్యా! దాంతో నా మూడంతా పాడైపోయింది. ఇదీ మసాలాఅంటే. అవును గానీ మనలో మాట, ఒక్క సజ్జలకే 140 కోట్లు అంటాడు ఏంటయ్యా? సలహాదారులకి 680 కోట్లా? అసలు అంత బడ్జెట్టే లేదు కదయ్యా!ఈ తెనాలి బుర్రేమైనా చెడిపోయిందా? లేదంటే లోకేష్‌కి పోటీగా తయారవుదాం అనుకుంటున్నాడా?’ అడిగాడు ఇన్చార్జి.‘‘అదేం కాదు సార్! తెనాలి నుంచి పోటీ చేయా లనుకుంటున్నాడు. తెనాలిలో తనకు టిక్కెట్ వస్తుందో రాదో అనేది ఒక టెన్షన్. తీరా టికెట్ దక్కించుకున్నా అసమ్మతి సెగతో మళ్ళీ ఓడిపోతానేమో అని భయం పట్టు కుంది. దాంతో పూర్తిగా ‘తెనాలి’ అయిపోయాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.’’ ‘నిజమేనయ్యా! కానీ ఐదేళ్లకి కోటీ నలభై లక్షలు కాబోలు. దాన్ని అర్థం చేసుకోలేక 140 కోట్లనేసినట్టున్నాడు. బడ్జెట్లో లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా సలహా దారులు ఉన్నది 46 మందేగా 89 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే... నువ్వే చెప్పావుగా? అతగాడు మైండ్చెడి తెనాలి అయిపోయాడని. సరే ఏదైతే అదవుతుంది? ఈరోజు మనకి చికెన్ 65 లాంటి మసాలా స్టోరీ దొరికింది. పాఠకులు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు? మన పత్రికకు ఇంగువ కట్టిన గుడ్డ లాంటి ఇమేజ్ ఉండనే ఉందిగా! బాస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. తిట్టుకుంటే జనాలు ‘తెనాలి’ని తిట్టుకుంటారు. సరే సరే నువ్వు మాత్రం ఈ మూడు నెలలు మూసీ నది మన పేపర్ని చూసి కుళ్లుకునేంత మురుగు స్టోరీలు ఇవ్వాలి సుమా!’ అంటూ స్టోరీకిరంగులు హంగులు అద్దే పనిలో పడ్డాడు ఇన్చార్జి. ‘తప్పకుండా సార్! ఇక నేను వస్తా’ అంటూ లోకనాథం క్యాబిన్ తలుపు తీసుకొని చిద్విలాసంగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఒక మూల దీనంగా కూర్చున్న సిసలైన జర్నలిస్టు ధర్మారావు వైపు జాలిచూపు విసిరేసి, ‘బాబుని చూసైనా నేర్చుకోడు జాబు నిలబెట్టుకోవాలని ఆలోచించడు’ అని తనలో తను సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు - పి. విజయ బాబు -
ప్రతి అక్షరంలోను విషం.. షర్మిల కొయ్య గుర్రం మీద సవారీ
-
జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి
న్యూఢిల్లీ: అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురైంది. 2008లో కూతురు చనిపోయిన తర్వాతి రోజు నుంచి ఆ తండ్రి దినచర్య పూర్తిగా మారిపోయింది. కూతురిని చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు ఆయన శ్రమించాడు. ఎక్కడా అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగాడు. చివరకు ఈ ఏడాది నవంబర్ చివరిలో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాడు. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం ఆ 82 ఏళ్ల తండ్రి కన్నుమూశాడు. ఢిల్లీలోని ఓ న్యూస్ ఛానల్లో విధులు ముగించుకుని సొంత కారులో ఆలస్యంగా ఇంటికి వస్తున్న టీవీ జర్నలిస్టు సౌమ్యను 2008 సెప్టెంబర్ 30న నలుగురు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.ఈ కేసు విచారణ 15 ఏళ్ల పాటు నడిచింది. రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది. నిందితులను దోషులుగా నిరూపించడం వెనుక సౌమ్య తండ్రి విశ్వనాథన్ తీవ్ర కృషి ఉంది. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్ చేయడమే ఆయన పని. అయితే అనుకున్నది సాధించి కూతురును చంపిన వారికి శిక్ష వేయించిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కన్ను మూయడం పలువురి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్ -
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబం మృతి, భోరున విలపించిన జర్నలిస్టు
గాజాపై ఇజ్రాయెల్(Israeil) జరిపిన వైమానిక దాడిలో గాజాలోని జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు మరణించారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె , కొడుకును కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపైదాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె మరణించారని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌహ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. “ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు , పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి. ఇజ్రాయెల్ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్ నుండి రిపోర్టు చేస్తున్నాను..అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది.మరికొంతమంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచార.ం తీవ్ర విషాదానికి ముందు మమ్మల్ని కాపాడండి అంటూ వేల్ దహదౌ కుమారుడు మహమూద్, తల్లి, సోదరితో కలిసి మొరపెట్టుకున్న కొద్దిరోజులకే వారంతా చనిపోయారు.గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి గురించి సోదరి ఖోలౌద్‌తో కలిసి ప్రపంచానికి ఒక వీడియో సందేశం పంపాడు. కాగా అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడిలో దాదాపు 1,400 మందిని చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకారణంగా గాజాలో 6,500 మందికి పైగా మరణించినట్టు అంచనా. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా దాదాపు 6,00,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఇలా ఉంటే పాలస్తీనా జర్నలిస్టుల యూనియన్ ప్రకారం గాజా బాధితుల్లో 22 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు. “This is the ‘safe’ area that the occupation army spoke of.” Al Jazeera's Wael Dahdouh lost his wife, son and daughter in an Israeli air raid in the southern Gaza Strip, where Israel told Palestinians to forcibly evacuate for their safety https://t.co/kaf1moxPRa pic.twitter.com/U12h7kWoFq — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 My colleague at @AJArabic Wael Al Dahdouh just lost his wife, daughter, and son in an Israeli strike “ that targeted his home “ in #Gaza. He reported on that strike earlier, without knowing that some family members were among the dead in that Israeli bombing.#Gazabombing pic.twitter.com/SObiuP5zer — Wajd Waqfi وجد وقفي (@WajdWaqfi) October 25, 2023 "Help us to stay alive" was their outcry to the world from Gaza. Mahmoud, Al Jazeera Arabic’s Wael Dahdouh son, joined by his sister Kholoud, sent a message to the world, days before Mahmoud, his mother, and younger sister Sham were killed in an Israeli airstrike in Gaza ⤵️ pic.twitter.com/HWJ8SjIpvx — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 -
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్‌ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్లె లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. దీంతో, ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. I am drafted as well to serve and defend my country Israel. 🇮🇱 I said goodbye to my wife India, who sent me with blessings and protection of God. From now on she will be managing and posting on my behalf so be nice to her. 😉🇮🇱😊 @indianaftali pic.twitter.com/K8O56kAQH7 — Hananya Naftali (@HananyaNaftali) October 9, 2023 ఇదిలా ఉండగా.. తాను పుట్టిన దేశంలో కోసం ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. దేశానికి సేవ చేసేందుకు తమంట తాముగా ముందుకు వస్తున్నారు. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెల్‌వాసులు కదనరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. దీంతో, కన్నబిడ్డలను, కుటుంబాలను వదిలి.. హమాస్‌పై పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ జర్నలిస్టు సైతం తాను సైన్యంలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. The reason we are deployed is not just to defend our borders, it’s literally to defend our homes and families. This is a war between good and evil. #IsraelUnderAttack pic.twitter.com/xNWmJmHhxX — Hananya Naftali (@HananyaNaftali) October 9, 2023 వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తన భార్యను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన గైర్హాజరీలో తన సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ‘నా దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నాను. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’ అని తెలిపారు. ఇదే సమయంలో ఇది మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. I rushed to the bomb shelter as rocket sirens sounded in Tel Aviv. My heart breaks for my neighbors. I see some of their kids crying and the elderly not making it down the stairs in time. pic.twitter.com/G6C3xgAVzM — India Naftali (@indianaftali) October 9, 2023 ఆ తర్వాత నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు. ఓ బాంబు షెల్టర్‌లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఇండియా నఫ్తాలీ కంటతడి పెడుతూ కనిపించారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ జర్నలిస్తు నఫ్తాలీని ప్రశంసిస్తున్నారు. దేశంలో తనకున్న అంకితభావంపై అభినందనలు కురిపిస్తున్నారు. నిజమైన దేశభక్తి ఇదీ అంటూ పొగుడుతున్నారు. "I promised him I’ll be back soon." This is only one father out of thousands of parents who have had to say goodbye to their children, as 300,000 Israelis report for reserve duty. The IDF and the people of Israel will stand strong and united in the face of any threat. pic.twitter.com/356qUyLtEW — Israel Defense Forces (@IDF) October 9, 2023 ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి -
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్‌మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
పలు డిమాండ్లతో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ధర్నా..
హైదరాబాద్: వివిధ డిమాండ్లతో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా గాంధీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని మొత్తం 122 కేంద్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహాత్మునికి నివాళి.. గాంధీ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని ఎంజి రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐజేయూ డిమాండ్ల వినతి పత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. గవర్నర్‌కు వినతిపత్రం.. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌కు వినతి పత్రాన్ని అందించింది. దేశంలో మీడియా మరియు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు జారీ చేయాలనే డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రతినిధి బృందానికి గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. అంబేద్కర్ సర్కిల్లో ధర్నా.. ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద టీయూడబ్ల్యూజే, హెచ్.యూ.జేల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ మీడియా సంస్థలు, జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య సాధింపు ధోరణిని మానుకోవాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాగే జర్నలిస్టుల సౌకర్యాలను రద్దు చేసే చర్యలకు స్వస్తి పలకాలని విరాహత్ సూచించారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్ లు మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. దాడులను అరికట్టేందుకు దేశంలో మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.మహిపాల్ రెడ్డి, ఏ.రాజేష్, షౌకత్ హమీద్, చారీ, శ్రీనివాస్ రెడ్డి, ప్రతిభ, గౌస్, అశోక్, వెంకటయ్యలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
అధికారమదంతోనే.. 'సాక్షి విలేకరి'పై దాడి!
సంగారెడ్డి: అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అండతోనే ఎంపీపీ అనిల్‌రెడ్డి దాడి చేశారన్నారు. పోలీసులు ఎంపీపీపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ చేస్తామని హెచ్చారించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రెస్‌క్లబ్ సభ్యులు శంభులింగం, సంతోష్, నగేష్, బాబు, భాస్కర్ గౌడ్, యాదగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టును అధికారమదంతో దాడికి పాల్పడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అందిన సమాచారాన్ని బట్టి వార్తలు రాస్తే దుర్భాషలాడుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ వార్తలో తప్పుంటే ఖండించాల్సిందిపోయి భౌతిక దాడులకు దిగడం సరైందికాదన్నారు. చంటి క్రాంతికిరణ్ జర్నలిస్టు నాయకుడిగా ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెదక్ ప్రెస్‌క్లబ్ నాయకులు రాజశేఖర్, బీవీకే రాజు,ప్రకాష్, చింతల రమేశ్, రహమత్, చంద్రశేఖర్ గౌడ్, మువ్వ నవీన్, శ్రీని వాస్చారి, లక్ష్మీనారాయణ, కార్తీక్, రఘు, దుర్గేష్, నర్సింలు, వంశీ ,శ్రీకాంత్, నవీన్‌రెడ్డి, ఊశ య్య, కృష్ణమూర్తి, సాయిలు, హమీద్ పాల్గొన్నారు. టేక్మాల్‌లో ర్యాలీ.. అల్లాదుర్గం విలేకరిపై దాడిని ఖండిస్తూ బుధవారం టేక్మాల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్లాబడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీపీ అనిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. అధికారమదంతో జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో టేక్మాల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బాగయ్య, సీనియర్ పాత్రికేయులు ఆనంద్, మహేదర్‌రెడ్డి, బీరప్ప, నర్సింలు, పులిరాజు, ధనుంజయ, రాజు, రమేష్, నాయికోటి రాజు, సాయిలు, ప్రేమ్‌కుమార్, నరేందర్, రాము, అశోక్, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో.. జర్నలిస్టులపై అధికార పార్టీ నాయకుల దాడులు సహించేది లేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, బీజేపీ జిల్లా నాయకుడు బ్రహ్మం హెచ్చరించారు. బుధవారం తహసీల్దార్ సతీశ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎంపీపీగా ఉన్న మీరు అల్లాదుర్గంకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గయ్య, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరేష్ నాయకులు సదానందం,, కేశనాయక్, వంకిడి రాములు, సాయిబాబా, వీరబోయిన సాయిలు, ముసిరిగారి శ్రీను, నితీశ్, లక్ష్మణ్, రాజు ఉన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు అలీం బుధవారం డిమా ండ్ చేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోని దాడులకు పాల్పడడం అప్రజాస్వామ్యమన్నారు. జర్నలిస్టుపై దాడులు చేయడం.. బెదిరించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌గా మారిందన్నారు. -
సంక్షేమంపై ఖర్చు.. భవిష్యత్తు నిర్మాణమే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : పరిచయం అక్కర్లేని విఖ్యాత జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్! గ్రామీణ అంశాలపై ఎన్నో విస్తృత కథనాలు రాసిన అనుభవం ఆయనది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం నిర్మాణం, పేదలకు మెరుగైన ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ, మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేశారు. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇక ఆయనకు లభించిన గౌరవ డాక్టరేట్లకు కొదవే లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన పాలగుమ్మి సాయినాథ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సంక్షేమాన్ని అపహాస్యం చేసే వాళ్లు చరిత్రంతా కనపడతారు.. సంక్షేమంపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను అనుకూలం. సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన రాగానే ఒక వర్గం ఎగతాళిగా చూడటం, మాట్లాడటాన్ని చరిత్రలో చాలాసార్లు చూశాం. మీకొక ఉదాహరణ చెబుతా.. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీడియా కూడా అపహాస్యం చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇంకా చాలా పత్రికలు ఎంతో అపహాస్యం చేస్తూ వార్తలు ప్రచురించడం నాకు గుర్తుంది. టీచర్లను వంట మనుషులుగా చిత్రీకరించి కార్టూన్లు వేశాయి. తర్వాత ఏమైంది? నాలుగేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి తమిళనాడు గ్లోబల్ రోల్ మోడల్ అని యూనిసెఫ్ ప్రశంసించింది. దశాబ్దం తిరగక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే మేం మెరుగ్గా అమలు చేస్తున్నామని చాలా రాష్ట్రాలు ప్రకటించుకోవటాన్ని చూశాం. మన పిల్లలే అనే భావన పాలకులకు ఉండాలి.. సమాజంలో అసమానతలను కోవిడ్ సంక్షోభం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ద్రవ్యోల్బణం నమ్మశక్యం కాని రీతిలో పెరిగిపోతోంది. దేశంలో పేదల ఆకలిని మరింత పెంచే ప్రమాద కారకాలు ఇవి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయత్నం జరగడం సంతోషం. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. భోజనం చేసే పిల్లలంతా మన పిల్లలనే భావన పాలకులకు ఉండాలి. రోజుకొక గుడ్డు ఇస్తే పిల్లలకు పోషకాహారం అందడంతో పాటు పౌల్ట్రీ రంగం కూడా బాగుపడుతుంది. స్కూళ్లలో ఉదయాన్నే రాగి జావ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు.. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంలో ఎలా అపహాస్యానికి గురైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాపోతున్న వారికి కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రం.. ‘హ్యూమన్ డెవలప్మెంట్’లో రోల్ మోడల్‌గా నిలిచాక అర్థమవుతుంది. ‘అభివృద్ధి’ని ఎలా అర్థం చేసుకున్నారనే అంశం మీద మనం చేస్తున్న ఖర్చును నిర్వచించాల్సి ఉంటుంది. జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన సమయంలో ప్రజలు ఆకలి బాధతో అల్లాడిపోతే దాన్ని అభివృద్ధి అందామా? అది సంపన్నుల అభివృద్ధి మాత్రమే అవుతుంది. మన దృష్టి అంతా ప్రజలకు ఏది మంచి అనే విషయం మీదే ఉండాలి. అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు అభివృద్ధికి అర్థం ఉండదు. వర్క్‌ఫోర్స్ ఆరోగ్యంగా, గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలిగినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం. ఆకలిని రూపుమాపి.. ఆరోగ్యకరమైన జనాభా ఆకలిని రూపుమాపి ఆరోగ్యకరమైన జనాభాను నిర్మించడమే అభివృద్ధి. అది మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్మెంట్). ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనతో ఉండాలని భావించలేం. అభివృద్ధిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దృష్టి కోణం ఉంటుంది. నేను మానవాభివృద్ధినే చూస్తా. హ్యూమన్ క్యాపిటల్ మీద దృష్టి లేకుండా ఏ సమాజమూ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రగతి కనపరుస్తుందో 5 సంవత్సరాల తర్వాత చూడాలి. ఏపీ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం స్పందించాలి.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నదాతలకు అనుకూలమైన చాలా కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పుల దుష్ప్రభావం. మనం తక్షణం స్పందించి వినూత్న విధానాలను రూపొందించి అమలు చేయడం అత్యావశ్యకం. ఆంధ్రప్రదేశ్ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే అంశంపై అధ్యయన బాధ్యతను యూనివర్సిటీలకు అప్పజెప్పాలి. ఆయా ఆగ్రో ఎకోలాజికల్ జోన్స్‌లో పరిశోధనలు చేయాలని స్థానిక యూనివర్సిటీలను ప్రభుత్వం అడగాలి. శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకొని ‘క్లైమేట్ యాక్షన్ ప్లాన్’కు ప్రభుత్వం రూపకల్పన చేయాలి. బ్యూరోక్రసీ కంటే యూనివర్సిటీలే అధ్యయనం చేయగలవని నా నమ్మకం. విద్య, వైద్యం, సాగు.. బాగున్నాయి ♦ ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది. గ్రామాల్లో అవసరం ఉన్న ప్రతి కుంటుంబాన్ని వైద్యుడు సందర్శించడం బేసిక్ హ్యూమన్ రైట్ (మానవ హక్కుల) పరిరక్షణ కిందకే వస్తుంది. ప్రతి మనిషికి వైద్యం అందించడం మానవ హక్కుల పరిరక్షణే. ఈ కార్యక్రమం అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ♦ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేదలకు నేరుగా ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయడం సాధ్యమవుతుంది. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడినట్లే. ♦ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రైతులకు ఉపయోగపడతాయి. వాటి నిర్వహణను బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) కాకుండా రైతులకు అప్పగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ♦ సామాన్యులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ కార్యక్రమాలు వినూత్నం.. ముందడుగు వేసిన సీఎం జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జయతి ఘోష్ కమిటీని నియమించారు. రైతన్నలను ఆదుకునేందుకు వినూత్న, విభిన్న కార్యాచరణకు డాక్టర్ వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ వారసత్వాన్ని అందుకొని ముందడుగు వేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయట పడేయటానికి చాలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఆర్బీకేల ఏర్పాటు మొదలు రైతు భరోసా వరకు అన్ని కార్యక్రమాలు, çపథకాలు రైతులకు అనుకూలమైనవే. వాటిని మరింత కన్సాలిడేట్ చేయడం ప్రభుత్వం ముందున్న సవాల్. -
దారుణం: ప్రముఖ జర్నలిస్టు హత్య..
పాట్నా: బిహార్‌లో దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టుని కిరాతకంగా హత్య చేశారు. రాణిగంజ్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు ఇంటి ప్రాంగణంలోనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. జర్నలిస్టు విమల్ యాదవ్ దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఆయన తలుపుతట్టారు. విమల్ గుమ్మం వద్దకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్టు విమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై ఆస్పత్రి వద్ధ భారీ సంఖ్యలో గుమికూడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోక్ జన్‌శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, పోలీసులకే రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దుండగులను పట్టుకునేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు.. కారణం ఏమై ఉంటుందంటారు? -
సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌కు జాతీయ అవార్డు
గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో అందిస్తున్న ఉత్తమ సేవలకు సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌ను ‘భారత్ కే అన్మోల్’ జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో పద్మశ్రీ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దేశంలో వివిధ రంగాలలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు డాక్టర్ మొహమ్మద్ నిజాముద్దీన్ మరికొంత మందితో కలిసి 'భారత్ కే అన్మోల్' అవార్డులను నెలకొల్పారు. అలాగే జీకేపీఆర్ మీడియా హౌస్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ వెంకట కె గంజాం ఇందులో కీలక పాత్ర పోషించారు. -
LoreKeepers: మా కథలు మా సొంతం
అవ్వలు, తాతలు గతించిపోతే వారికి తెలిసిన జానపద సంపద కూడా అంతరించిపోతుంది. మన పెద్దల నుంచి వినాల్సిన ఎన్నో కథలు, పాటలు, సామెతలు, ఉదంతాలు ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల అందకుండా పోయాయి. కేరళలో చిన్నారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదంటున్నారు. తల పండిన వృద్ధుల దగ్గర కూచుని వారికి తెలిసిన మౌఖిక జానపద కథలను రికార్డు చేస్తున్నారు. ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లలు ఇలా కథలు సేకరించేందుకు ఒక ఎన్.జి.ఓ. ప్రతి బడికి తిరిగి శిక్షణనిస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన కదూ. బహుశా ఇప్పుడున్న నానమ్మ, తాతయ్యల తరమే కొద్దోగొప్పో జానపద వారసత్వాన్ని కాపాడుకున్న తరం కావచ్చు. ఆ తర్వాతి తరమంతా సెల్ఫోన్ల తరం. టీవీల తరం. ఓటీటీల తరం. ఇప్పుడు పల్లెల్లో ఎవరూ గుంపుగా కూచుని కథలు చెప్పుకోవడం లేదు. తరం నుంచి తరానికి అందాల్సిన మాటలను చెప్పుకోవడం లేదు. పాటలను పంచుకోవడం లేదు. ఆటలను ఆడుకోవడం లేదు. ‘స్థానిక సంస్కృతి’, ‘జానపద వారసత్వం’ ప్రతి సమూహానికి ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి. జాగ్రత్తగా తరం నుంచి తరానికి అందించాలి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు వరకూ ప్రతి సమూహంలోని ఎందరో వృద్ధులకు– చదవడం, రాయడం రాకపోయినా కథలూ గాథలూ పురాణాల స్థానిక ప్రక్షిప్తాలు చారిత్రక ఘటనలు తెలిసి ఉంటాయి. వారు గతించితే అవి అంతరించిపోతాయి. ఇప్పటికే ఎన్నో తరాల వద్ద నుంచి స్వీకరించి నిక్షిప్తం చేయాల్సిన మౌఖిక జానపద సంపదను రికార్డు చేయడంలో చాలా నిర్లక్ష్యం పాటించి ఉన్నాం. ఇప్పటికీ అరకొరగా మాత్రమే ఆ పని జరుగుతూ ఉంది. ఈ తరం కూడా దాటిపోతే ఆ తర్వాత తెల్లముఖం వేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కేరళ మేల్కొంది. ఇప్పటి వృద్ధతరం వెళ్లిపోక ముందే వారి నుంచి జానపద సంపదను అందుకోవాలనుకుంది. ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ (ఏ.ఆర్.పి.ఓ) అనే స్వచ్ఛంద సంస్థ ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లల్నే సైనికులుగా రంగంలో దింపి జానపద కథలను రికార్డు చేయించి డిజిటల్ ఆర్కయివ్గా నిక్షిప్తం చేయనుంది. ► కరోనా సమయంలో ఆలోచన ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకడైన స్రుతిన్ లాల్ కేరళలో జర్నలిస్ట్. కరోనా సమయంలో లక్షలాదిగా ఇళ్లకు మళ్లిన వలస కార్మికుల వ్యధను రికార్డు చేయడానికి ఢిల్లీ నుంచి లక్నో వరకు వారితో పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. వారి దీనాలాపనను రికార్డు చేశాడు. ఆ సమయంలో వారి మాటలను రికార్డు చేయకపోతే ఆ తర్వాత ఆ సందర్భం, ఆ మాటలు రెండూ మిస్ అయిపోతాయి. భావితరాలకు ఆ వేదన అందదు. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధతరం దగ్గర ఉన్న జానపద సంపద అతనికి గుర్తుకొచ్చింది. ‘నా బాల్యంలో అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం లేదు. ఏవో కొద్దిమంది దగ్గరే అలాంటివి మిగిలి ఉన్నాయి... వాటిని కాపాడుకోవాలి’ అనుకున్నాడతడు. ఆ ఆలోచన ఎన్.జి.ఓ. స్థాపనకు కారణమై మార్జినలైజ్డ్ సెక్షన్స్ దగ్గర వున్న కళారూపాలను నిక్షిప్తం చేసే పనికి అతణ్ణి పురిగొల్పింది. ► పిల్లలే సైనికులు మౌఖిక జానపద కథకు వారసులు బాలలు. వారికే ఆ విలువైన జానపద సంపద అందాలి. అలా అందాలంటే వారే నేరుగా రంగంలోకి దిగాలి అనుకున్నాడు స్రుతిన్ పాల్. ‘ఇప్పుడు దాదాపు ప్రతి చిన్నారికి సెల్‌ఫోన్ అందుబాటులో ఉంది. వారు సెల్‌ఫోన్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అన్నీ టక్కున నేర్చుకుంటారు. వారికి రికార్డు చేసి ఎడిట్ చేయడం నేర్పిస్తే వారే పెద్దవాళ్ల దగ్గర కూచుని అన్నీ చెప్పించుకుంటారు. పైగా పిల్లలు అడిగితే చెప్పడానికి అవ్వలు, తాతలు ఇష్టపడతారు కూడా’ అంటాడు లాల్. అందుకోసం తన సంస్థ తరఫున కొందరు వాలంటీర్లను కేరళలోని వివిధ జిల్లాల స్కూళ్లకు పంపడం మొదలెట్టాడు. వారు స్కూల్లో పిల్లలకు మౌఖిక జానపద సంపద సేకరణ గురించి చెప్పి, సెల్‌ఫోన్‌తో పెద్దవాళ్లు చెప్పే కథలను ఎలా రికార్డు చేసి తమకు పంపాలో నేర్పుతారు. ఇక పిల్లలు ఊరుకుంటారా? రంగంలో దిగి వరదలా వీడియోలు పంపుతున్నారు. అవన్నీ నిక్షిప్తం అవుతున్నాయి. ► విన్నవీ కన్నవీ కాశీమజిలీ కథలో, కాటమరాజు కథలో, మర్యాద రామన్న కథలో, పూటకూళ్లమ్మ కథలో... అడవి కథలో, వేట కథలో, వ్యవసాయ కథలో, ప్రకృతి కథలో, గొడ్డుగోదా కథలో, రాజు పేదా కథలో... ఏవో కథలు ఒకప్పుడు చెప్పుకోని, వినని వారు ఉండరు. అయితే అందరూ గుర్తు పెట్టుకుని మళ్లీ చెప్పే స్టోరీ టెల్లర్లు కారు. కొందరు మాత్రమే ‘కథల పుట్ట’గా ఉంటారు. వీరు స్థానిక జ్ఞానాన్ని కథల్లో దాచి ఉంటారు. అవి రికార్డు కావాలి. కేరళలో ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నిజానికి ప్రతిచోటా ప్రభుత్వాలు పూనుకుని ఈ పని చేస్తే ప్రతి ప్రదేశంలోని విలువైన కథలు బయటికొస్తాయి. యూట్యూబ్‌లాంటి మాధ్యమాల వల్ల అందరికీ తెలుస్తాయి. కేరళ మేల్కొంది. అందరూ మేల్కొనాలి. -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
ప్రధాని మోదీ డిగ్రీ పట్టా వివాదం.. జర్నలిస్టు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ పట్టాపై రాజకీయ వివాదం గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. మోదీ ఎడ్యూకేషన్ వివరాలపై కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు తెరదించుతూ ప్రముఖ జర్నలిస్టు శీలా భట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోదీని 1981లో కలుకున్నట్లు శీలా భట్ చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా చదువులపై దృష్టి కేంద్రీకరించిన, క్రమశిక్షణ కలిగిన శిష్యుడిగా ఉండేవాడని తెలిపారు. అప్పుడు మోదీ ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఎన్ఐకి చెందిన ఎడిటర్ స్మితా ప్రకాశ్ నిర్వహించిన ఓ ఇంటర్వూలో ఆమె తెలిపారు. ప్రధాని మోదీకి మెంటర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రవీణ్ సేత్.. తనకూ కూడా మెంటర్‌గా పనిచేశారని జర్నలిస్టు శీలా భట్ తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చదువుకున్న ఓ అభ్యర్థి తనకు ఇంకా గుర్తున్నట్లు శీలా భట్ తెలిపారు. ప్రధానితో పాటు చదువుకున్న ఆయన క్లాస్‌మెట్.. లాయర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నిరక్షరాస్యుడని అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ.. నిజానిజాలను తెలపాలని ఆ లాయర్‌ను కోరినట్లు శీలా భట్ చెప్పారు. కానీ ఆ లాయర్ స్పందించలేదని తెలిపారు. “I met Modi in 1981 when he was doing his MA,” Veteran Journo Sheela Bhatt recalls PM’s student days#Modi #ANIPodcastWithSmitaPrakash #SheelaBhatt Watch the full episode here: https://t.co/IMz0tvhuNX pic.twitter.com/6icGf2O6yz — ANI (@ANI) July 13, 2023 ప్రధాని ఎడ్యూకేషన్ వివరాలపై గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వివరాలను రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేశారు. 2016లో ప్రధాని ఎంఏ డిగ్రీ వివరాలు సమర్పించాలని గుజరాత్ యూనివర్శిటీని ప్రధాన సమాచార కమిషనర్ కోరారు. ఈ అంశంలో గుజరాత్ హైకోర్టు.. కమిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ప్రజలకు చాలా ప్రశ్నలను మిగిల్చిందని అన్నారు. నవీన భారతంలో పారదర్శకతకు కూడా పరిమితులు ఉన్నాయని.. ఇదే పొలిటికల్ సైన్స్ బోధిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రధాని డిగ్రీ సమాచారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని గత నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ప్రధాని డిగ్రీ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్శిటీ పేర్కొంది. అలాంటిదేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
'అర్జున్‌రెడ్డి' సినిమాకు ముందే విజయ్ను నమ్మాను: నిర్మాత
'ఇండస్ట్రీలో జర్నలిస్ట్‌గా మొదలై, పీఆర్వో అయ్యాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. కెరీర్ చాలా సంతృప్తిగా ఉంది' అన్నారు ఎస్కేఎన్. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎన్‌కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నేడు (శుక్రవారం) ఎస్కేఎన్ బర్త్ డే. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ– 'ఆనంద్, విరాజ్, వైష్ణవిల మధ్య సాగే ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘బేబీ’. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఇంట్రవెల్‌కు ముందు పెద్ద షాక్ ఉంటుంది. మ్యూజిక్ పరంగా ఈ మధ్య వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ‘బేబీ’ ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతం అందించాడు. ఇక సోలో నిర్మాతగా నేను తొలిసారి విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ నిర్మించాను. అప్పుడు సాయి రాజేష్ నాకు ‘బేబీ’ కథ చెప్పాడు. కథ విన్నాక నిర్మాతగా నా తర్వాతి చిత్రం ఇదే చేయాలనుకున్నాను. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌ను అలాగే ఉంచితే మూవీకి ప్రమోషన్ వస్తుందని కొందరు అన్నారు. కానీ కంటెంట్ బాగుంటే పబ్లిసిటీ అదే వస్తుంది.. కాంట్రవర్సీల నుంచి కాదని నమ్మే వ్యక్తిని. ఇక మార్కెట్ అంటే.. ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ కాకముందే విజయ్ స్టార్ అవుతాడని నమ్మి ‘టాక్సీవాలా’ తీశా. అలా ‘బేబీ’ ఆనంద్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఏడాదికి రెండు సినిమాలు, వెబ్ ఫిల్మ్ నిర్మించాలనుకుంటున్నాను. సందీప్ రాజ్, సాయి రాజేష్, రాహుల్ సంకృత్యాన్, వీఐ ఆనంద్‌లతో సినిమాలు ఉన్నాయి' అన్నారు. -
‘మోదీకి ప్రశ్న.. సబ్రీనాపై వేధింపులు సరికాదు’
వాష్టింగ్టన్: అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీకి.. భారత్‌లో మైనారిటీల హక్కుల సంరక్షణపై ప్రశ్న గుప్పించిన మహిళా జర్నలిస్ట్ వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయం తమకూ తెలుసున్న అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్.. ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ అయిన సబ్రీనా ‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆన్ లైన్ లో వేధింపులు ఎదుర్కొంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించగా.. వైట్ హౌస్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ స్పందించారు. సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిర్బీ తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు. కిర్బీ ప్రకటన తర్వాత.. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్ పెర్రీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కిర్బీ ప్రకటనతో తానూ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. Prime Minister Modi completely destroyed the motivated question on steps being taken to ‘protect’ rights of Muslims and other minorities. In his response he didn’t mention Muslims or any other denomination, spoke about Constitution, access to Govt resources based on eligibility… pic.twitter.com/mPdXPMZaoI — Amit Malviya (@amitmalviya) June 22, 2023 సబ్రీనా సిద్ధిఖీ పాక్ మూలాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే అయినా.. తండ్రి మాత్రం భారత్‌లో జన్మించారు. సబ్రీనా మాత్రం అమెరికాలో జన్మించారు. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆమె.. భర్తతో కలిసి వాషింగ్టన్లో ఉంటున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె రిపోర్టింగ్ పనితీరు గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు గార్డియన్ కోసం పని చేసిన ఆమె.. ఆ తర్వాత వాల్ స్ట్రీట్జర్నల్కు పని చేస్తూ వస్తున్నారు. గతంలో హఫ్పింగ్టన్పోస్ట్, బ్లూమ్బర్గ్లోనూ ఆమె పని చేశారు. నాలుగేళ్ల కిందట ముహమ్మద్ అలీ సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. వీళ్లకు సోఫీ అనే పాప ఉంది. As President of SAJA, I want to add that @SabrinaSiddiqui asked a fair question, one PM Modi's team and anyone keeping track of news should have expected. His response and how Indian journalists haven't had the opp to ask him this in 9 years is what we should talk about more. https://t.co/SwTkfq95Sg — Mythili Sampathkumar (@MythiliSk) June 26, 2023 ఇదీ చదవండి: దేశంలో ఏం జరుగుతుందో తెలియాలా? -
జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో చికిత్స నిమిత్తం ఆయన ప్రైవేటు ఆసుత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అంబటి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ ప్రెస్‌క్లబ్, అమరావతి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు కూడా సంతాపం తెలిపారు. ఇక, విజయవాడ బావాజీపేటలోని ఆయన నివాసం నుంచి సోమవారం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబటి ఆంజనేయులు ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సలహాదారుడిగా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని జిల్లాల్లో యూనియన్ను విస్తరింపజేశారు. ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్థిక సాయం -
రాష్ట్రపతి ముర్ముకు మిస్డ్‌కాల్
న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌ను వాడే అలవాటు అంతగా లేని ద్రౌపదీ ముర్ము.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఫోన్‌కాల్‌ను మిస్సయ్యారు..! ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు అది. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఆమెను కోరేందుకు స్వయంగా ప్రధాని మోదీయే చేసిన కాల్ అది..! ‘ద్రౌపదీ ముర్ము: ఫ్రం ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టూ రైజినా హిల్’ పేరుతో జర్నలిస్ట్ కస్తూరి రే రాసిన తాజా పుస్తకంలో 2022 జూన్ 21న జరిగిన ఘటన సహా పలు వివరాలున్నాయి. పలు ఇంటర్వ్యూలు, విశ్లేషణల ఆధారంగా ముర్ము జీవితంలో ఘటనల క్రమాన్ని స్కూల్, కాలేజీ రోజులవరకు టీచర్ నుంచి సామాజిక కార్యకర్తగా, అటునుంచి కౌన్సిలర్..మంత్రి..గవర్నర్..దేశ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి వరకు సాగిన ఆమె ప్రస్థానాన్ని అందులో ప్రస్తావించారు. గతేడాది జూన్ 21న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 275 కిలోమీటర్ల దూరంలోని తన మారుమూల స్వగ్రామం ఉపర్‌బేడలో ముర్ము ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము అని తెలిసినా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీని కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయమది. అయితే, ముర్ము స్వగ్రామంలో కరెంటు కట్ అమలవుతోంది. బయట జరుగుతున్న ఇలాంటి విషయాలేవీ ఆమెకు తెలియవు. మొబైల్‌ను ఎక్కువగా వాడే అలవాటు లేని ముర్ము, దాన్ని ఎక్కడో ఉంచారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ సహా ప్రముఖ వ్యక్తుల నుంచి వచ్చిన అనేక ఫోన్‌కాల్స్‌ను ఆమె రిసీవ్ చేసుకోలేకపోయారు. చివరికి పీఎంఓ అధికారులు ముర్ము మాజీ ఓఎస్డీ, రాయ్రంగ్పూర్లో ఉంటున్న బికాశ్ చంద్ర మహంతకు ఫోన్ చేశారు. ఆయన ఆగమేఘాల మీద తన మెడికల్ షాపును మూసేసి ముర్ము ఇంటికి చేరుకున్నారు. ఫోన్ ఆమె చేతికందించారు. దీంతో ప్రధాని మోదీతో ఆమె నేరుగా మాట్లాడగలిగారు. ఆ తర్వాతే ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ
తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఒక అంతిమ భావనకు వచ్చేశారు. నిజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలను కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ఏ అంశం మీద ప్రశ్నలు అడగాలన్నదీ, ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి దేశ ప్రధాని సుముఖంగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన సంసిద్ధతను కనబరుస్తున్నారని ఇండియాలో మనం భావిస్తాం. ప్రధానికి నిజంగానే తన పాలనకు బాధ్యత వహించే ఉద్దేశం ఉందా, లేదా అనేదానికి అసలైన పరీక్ష... ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా చేయకపోవడం. పత్రికా సమావేశంలో వందలాది మంది పాత్రికేయులకు ముఖాముఖి బదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డొంక తిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అందుకే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఇప్పటికే ఒక అంతిమ భావనకు వచ్చేశారు. మార్గరెట్ థాచర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న బ్రియాన్ వాల్డెన్స్ వారి భావనతో ఒక్క క్షణమైనా నాకు నిమిత్తం లేనప్పటికీ, పత్రికా సమావేశాన్ని మోదీ దాటవేస్తూ రావడంపై నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్య దేశాలలో నిజమైన జవాబుదారీతనాన్ని భిన్న పాత్రికేయ ప్రక్రియల ద్వారా సాధిస్తారు. ఆ విషయానికి తర్వాత వస్తాను. మొదట, పత్రికా సమావేశాల మీద మనకుండే విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నదో నన్ను వివరించనివ్వండి. మొదటి విషయం. పత్రికా సమావేశంలో అనేక మీడియాల నుంచి వచ్చిన అనేకమంది ప్రతినిధులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రశ్న ఒకటి అడిగేందుకు ఆతురతతో ఉంటారు. చాలా వరకు అవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రశ్నలే అయి ఉంటాయి. గంటల పాటు పత్రికా సమావేశం జరుగుతున్నా ఈ వేర్వేరు ప్రశ్నల కారణంగా ప్రధానమంత్రి జవాబులు చెప్పడానికి ఎప్పుడో తప్ప ఒత్తిడికి లోనయే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రధాని ఎందుకు ఒత్తిడికి లోనవరో చెప్తాను చూడండి. ప్రధాని పత్రికా సమావేశాలలో ఒక జర్నలిస్టుకు ఒక ప్రశ్న వేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాక, ఆ తర్వాతి జర్నలిస్టు తిరిగి అదే ప్రశ్న అడిగేందుకు ఉండదు. అప్పుడు ఆ జర్నలిస్టు తన ప్రశ్నను, ఒక్కోసారి తన సబ్జెక్టును కూడా మార్చుకోవలసి వస్తుంది. అంటే ఒకటే ప్రశ్నపై పట్టుపట్టడానికి తక్కువ అవకాశం ఉండటంతో ప్రధానిపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆయన పొంతన లేని, లేదా సంపూర్ణం కాని సమాధానాలతో తప్పించుకోవచ్చు. ప్రధాని అజాగ్రత్తతో తొట్రుపడితేనో, లేదంటే ఏవైనా అవాస్తవాలు ఆయన నుంచి దొర్లితేనో తప్ప ఆయన పట్టుబడరు. అది నక్క తోకను తొక్కడమే కానీ, నాణ్యమైన జర్నలిజం కాదు. నిజానికి ప్రధాని పత్రికా సమావేశాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ అది భ్రమ. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతూ, ఆయన ఇచ్చే సమాధానాలను నిశితంగా పరిశీలించి వాటిలోని తప్పుల్ని, దాటవేతల్ని ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. అయితే ప్రధాని పత్రికా సమావేశాలలో ఇలా జరిగే అవకాశం ఉండనే ఉండదు. అందుకే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలకు కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రధాని–జర్నలిస్ట్ ఇద్దరే ఎదురెదురుగా ఆ ఇంటర్వ్యూలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆ ఏక పాత్రికేయుడే... ప్రధాని జవాబులు చెప్పవలసిన ప్రశ్నలను నిర్ణయిస్తారు. ఏ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తాలన్నదీ, అలాగే ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. అలాంటి జర్నలిస్టు విషయాలన్నీ బాగా తెలిసినవాడై, నిర్భీతి, దృఢచిత్తం గలవాడై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా అయితే అతడు ప్రధాని ముందు నీళ్లు నమలనివాడై ఉండాలి. జిహ్వకు చాపల్యాన్ని అంటించే రుచికరమైన బ్రిటిష్ రాజకీయ వర్గ అసంబద్ధ అంతర్గత కథనాలతో రాబ్ బర్లీ అనే బ్రిటిష్ టీవీ ప్రొడ్యూసర్ తాజాగా వండి వార్చిన ‘వై ఈజ్ దిస్ లైయింగ్ బాస్టర్డ్ లైయింగ్ టు మి?’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘‘రాజకీయ ఇంటర్వ్యూలు అనేవి అధికారంలో ఉన్నవారిని ప్రజలకు పూచీ పడేలా చేయడానికే తప్ప, నాయకులకు లబ్ధిని చేకూర్చడానికి కాదు. అవి ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం.’’ దేశ అత్యున్నత పదవికి అభ్యర్థులైన వారి యోగ్యతను రాజకీయ ఇంటర్వ్యూల ద్వారా ఎలా అంచనా వేయవచ్చో బర్లీ ఈ పుస్తకంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటికే అధికారం మాటున దాగి ఉన్నవారికి కూడా ఆయన మాట వర్తిస్తుంది. ‘‘అటువంటి ఇంటర్వ్యూలు మన రాజకీయ సంస్కృతి స్వభావం, సమర్థత, విశ్వసనీయతలను బహిర్గతం చేయడానికి తోడ్పడే ఉత్తమ సాధనాలు. వాటి గురించి మనం గట్టిగా అడగాలి.’’ మోదీ కూడా రాజకీయ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి చాలానే ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఎలాంటివారు? ఎలాంటి అంశాలను వాళ్లు ప్రధాని ముందు లేవనెత్తారు? ఎంత త్వరగా వాళ్ల ప్రశ్నల గేలం ప్రధానిని విడిచిపెట్టింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మునుపటి ఇంటర్వ్యూలను చూడండి. అవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూలు మోదీ తనేం చెప్పదలిచారో అవి చెప్పడానికీ, తరచూ ప్రతిపక్షాలను విమర్శించడానికీ కానుకగా అందివచ్చిన వేదికలు. బ్రిటిష్ బ్రాడ్క్యాస్టర్లు జెరెమి పాక్స్‌మ్యాన్, బ్రియాన్ వాల్డెన్స్ తమ రాజకీయ ఇంటర్వ్యూల కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయారు. వాల్డెన్ తన సంధింపులతో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను గుక్క తిప్పుకోకుండా చేశారు. పాక్స్‌మ్యాన్ అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ హోవర్డ్‌ను అడిగిన ప్రశ్ననే పన్నెండుసార్లు అడిగి ఆయన్ని గుటకలు వేయించారు. రెండు ఇంటర్వ్యూలలో అవి ముగిసే సమయానికి థాచర్, హోవర్డ్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం! ఆ చెప్పలేకపోవడమే ప్రజలకు వారిని జవాబుదారీగా చేసింది. మన ప్రధానులను కూడా ఇంత కఠినంగా, కనికరం లేకుండా ప్రశ్నించగల రోజు వస్తే, మన రాజకీయాలలో నాటకీయమైన మార్పును చూస్తాం. మన రాజకీయ నాయకులు మారతారు. మనతో అబద్ధాలు చెప్పడం మానేస్తారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు’
సాక్షి, అమరావతి: ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన - తీరు తెన్నులు అనే అంశంపై సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు, సీనియర్ జర్నలిస్టులతో ఈ సమావేశం కొనసాగింది. ఈ చర్చలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా కమిటీ చైర్మన్ విజయబాబు, ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.సి.దాస్, ఏఎన్ యూ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు చలపతిరావు, కృష్ణంరాజు, కె.బి.జి. తిలక్, సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఏఎన్ యూ జర్నలిజం హెచ్ఓడీ అనిత, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనపై ప్రముఖ రచయిత రామచంద్రారెడ్డి రాసిన సుపరిపాలన - సుజలాం, సుఫలాం పుస్తకాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార భాష కమిటీ చైర్మన్ విజయబాబు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఆటుపోట్ల మధ్య, ముష్కర మూకల దాడులను తట్టుకుని నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ అయితే ఎదో చేస్తారని ఇష్టం లేకపోయినా చంద్రబాబును 2014లో ఎన్నుకున్నారని చెప్పారు. ఈనాడు రాతలని ప్రజలు విశ్వసించరని, ఆంధ్రులు ఆవులు తోడేళ్ల గుంపును తరిమికొట్టి 23సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. కొమ్మినేని శ్రీనివాసరావు మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. "నా 45ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇన్ని మార్పులు చూడలేదు, పోర్టుల నిర్మాణం, పాలనా వికేంద్రీకరణలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది, జగన్ పాలనను నరకంతో పోల్చుతూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది, పేదలకు స్వర్గం, పెత్తందారులకు నరకంలా ఉందనేది నా అభిప్రాయం. జన్మభూమి కమిటీల వద్దకు కాళ్ళు తిరిగేలా తిరగడం నరకం. ఇంటికే వచ్చి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం స్వర్గం. జగన్ చేసే సంక్షేమం నరకం.. చంద్రబాబు చేస్తే స్వర్గమా..? అని ప్రశ్నించారు. రామచంద్రా రెడ్డి రచయిత రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న జీవ క్రాంతి అనేది గొప్ప పథకమని, రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరని కొనియాడారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసూయకు మందు లేదని, మంచిపని చేసేటపుడు ఆటంకపరిచేవారిని ఖండించాలన్నారు. కృష్ణంరాజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కప్పి పెడుతున్నాయని మండిపడ్డారు. 9ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 10లక్షల కోట్లు పథకాల రూపంలో ప్రజలకు నగదు బదిలీ చేస్తే.. రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్లలో 2.11లక్షల కోట్లు బదిలీ చేసిందని కొనియాడారు. జీడీపీలో దేశంలోనే ఏపీ నెంబర్.1 స్థానంలో ఉందని తెలిపారు. ఎంవీఎస్ నాగిరెడ్డి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సంక్షేమ పాలనకు ఆ రోజు పావురాలగుట్టలో ఇచ్చిన మాటతోనే పునాది పడింది, 2004లో వైఎస్సార్ సంక్షేమాన్ని అమలు చేసారు, అనంతరం వచ్చిన ఎన్నికల్లో కూటమితో వచ్చి చంద్రబాబు ఓటమి పాలయ్యారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే మళ్లీ ఎన్నికలకు రాను అని జగన్ అన్నారు. నాలెడ్జబుల్ గా ఏ సలహా ఇచ్చినా జగన్ స్వీకరిస్తారు, హార్టికల్చర్ హబ్ గా ఏపీ తయారైంది, డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. పేదవాళ్ల కోసం పనిచేసేవాడే కామ్రేడ్ అయితే నేనే పెద్ద కామ్రేడ్ అని వైఎస్సార్ అన్నారు. ఈ రోజు కమ్యూనిస్టులు ఎవరికోసం పని చేస్తున్నారు? మరోసారి అవకాశమిస్తే 2014 నుండి 2019 మాదిరిగా పాలిస్తానని చంద్రబాబు చెప్పగలరా.? మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చంద్రబాబు చెప్పగలరా.? భారతదేశంలో జరిగిన అతిపెద్ద మోసం 2019ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ. రైతులు ఇచ్చిన 12లక్షల గ్రీవెన్స్ ను పక్కన పడేసారని అన్నారు. ఎంసీ దాస్ ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లయోలా కళాశాల విద్యార్థి అని చెప్పారు. YSR కుమారుడిని నేను జగన్ ను పొగడను.. ఆశీర్వదిస్తాను, GDP గ్రోత్ విషయంలో దేశంలోనే AP మొదటిస్థానంలో ఉంది, సముద్ర తీరాన్ని, నదులను వినియోగించటంలో రెండోస్థానంలో ఉంది, వ్యవసాయ రంగంలో 13శాతం, పారిశ్రామిక రంగంలో 16శాతం వృద్ధిని ఏపీ సాధించింది, కోకో, మాంగో, పాపాయి, రెడ్ చిల్లి ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని గుర్తు చేశారు. చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే దేశంలోనే కాదు ఆసియాలోనే ఏపీ నెం.1 అవుతుందని, సీఎం జగన్ చేస్తున్న హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా ఉత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు. అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మరింత సంక్షేమాన్ని ఇస్తారని చెప్పారు. -
Monika Shergill: క్వీన్ ఆఫ్ కంటెంట్
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అంటే సాధారణ విషయం కాదు. ఏ నిమిషానికి ఏ ట్రెండ్ వస్తుందో తెలియదు. అక్కడి ట్రెండ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. సక్సెస్‌కు సవాలక్ష కారణాలు ఉంటాయి. అయితే అవేమీ చీకట్లో దాక్కున్నవి కావు. వెదుక్కుంటూ వెళితే ముందుకు వచ్చి పలకరిస్తాయి. మోనిక చేసిన పని అలా వెదుక్కుంటూ వెళ్లడమే! ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన మోనిక షేర్గిల్ ‘వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ స్థాయికి చేరుకోవడం అదృష్టం కాదు...తాను పడిన కష్టం. ఆ కష్టమే మోనిక షేర్గిల్ను ‘హై అండ్ మైటీ–50 పవర్పీపుల్’ జాబితాలో చేర్చింది.... నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్పీడ్ అందుకొని వ్యూ అవర్స్, రెవెన్యూ పెంచుకొని ప్రపంచస్థాయిలో సక్సెస్ సాధించింది. ‘దీనికి కారణం?’ అనే ప్రశ్నకు ఏకైక జవాబు నలభై తొమ్మిది సంవత్సరాల మోనిక షేర్గిల్. మోనిక చొరవ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి, ప్రతిభావంతులకు మధ్య ‘నెట్‌ఫ్లిక్స్’ను వారధిగా మలచడంలో మోనిక ఘన విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో మోనిక అనుసరించే ప్రమాణాల విషయానికి వస్తే...క్రైమ్ షోలలోని సంచలన ధోరణి కనిపించదు. సబ్జెక్ట్‌లో ఉండే బలమే ప్రధాన ప్రమాణం అవుతుంది. దీనికి ఉదాహరణ ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్... ది ఎలిఫెంట్ విష్పరర్స్. ‘‘ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో ఎప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిని కచ్చితంగా పసిగట్టడం కష్టమే. కరోనా కల్లోల సమయం ప్రేక్షకుల ఆలోచనధోరణిలో మార్పు తీసుకువచ్చింది. కంటెంట్ విషయంలో తమ భాష, ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఏది నిజం? ఏది కల్పన?’ అనే విషయంలో వారికి స్పష్టత ఉంది. వ్యాపార విజయం అనేది వారికి సంబంధం లేని విషయం. వారి దృష్టి మొత్తం కథ పైనే ఉంటుంది’’ అంటున్న మోనిక విజయాల గురించి ఆనందించడమే కాదు నిరాశపరిచిన కంటెంట్ విషయంలో సమీక్ష చేసుకోవడంలో ముందుంటుంది. రొమాంటిక్ హిందీ–కామెడీ ఫిల్మ్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ నిరాశపరిచింది. దీనికి కారణం సరిౖయెన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం. కథ సరిగ్గా ఉండగానే సరిపోదు కాస్టింగ్ కూడా సరిగ్గా ఉండాలని, ఎక్కడా రాజీపడకూదనే గుణపాఠాన్ని ఆ చిత్రం నుంచి నేర్చుకుంది మోనిక. పోస్ట్–పాండమిక్ ఆడియెన్స్ ఇంటర్నేషనల్ స్టోరీలను ఇష్టపడుతున్నారు. జర్మన్ షో ‘డార్క్’ మనదేశంలో హిట్ కావడం దీనికి నిదర్శనం. ఆ సమయంలో... ‘వేరే దేశం కథలు మన దగ్గర విజయం సాధించినప్పుడు, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన కథలు మరొక ప్రాంతంలో ఎందుకు విజయం సాధించవు’ అంటూ ఆలోచన చేసింది మోనిక. తాను నమ్మింది ‘కాంతార’ హిందీ వెర్షన్ విజయంతో నిజం అయింది. సక్సెస్ ముఖ్యమే కాని వేలం వెర్రి జోలికి వెళ్లదు మోనిక. ‘కొరియన్ భాషలో గ్లోబల్ బ్రేక్ఔట్ షోలు ఉన్నాయి. అలా మనం కూడా సాధించాలి అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదు. ఆ షోలో ఉన్న వినూత్నమైన ఐడియా, దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాలు గ్లోబల్ బ్రేక్‌ఔట్‌కు కారణం కావచ్చు. మనదైన ఆలోచన చేసి విజయం సాధించాలిగానీ ఫలాన షోలాగా ఉండాలి అని ప్రయత్నిస్తే విజయం మాట ఎలా ఉన్నా నిరాశ మాత్రమే మిగులుతుంది. ర్యాట్రేస్ ఇష్టపడను. ఆ రేసులో పడితే ఆయాసమే మిగులుతుంది తప్ప ఆలోచన మిగలదు’ అంటోంది మోనిక. కొంతకాలం క్రితం ట్రెండ్స్‌కు నిర్దిష్టమైన టైమ్ అంటూ ఉండేది. అర్థం చేసుకోవడానికైనా, అందిపుచ్చుకోవడానికైనా అది బాగా సరిపోయేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ఒక దేశంలో ట్రెండ్‌గా ఉన్నది ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు....ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది మోనిక షేర్గిల్. అందుకే ఆమె పేరు ముందు ‘క్వీన్ ఆఫ్ కంటెంట్’ అనే విజయధ్వజం రెపరెపలాడుతోంది. -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్‌లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
స్టార్ హీరోల ఇమేజ్ పెంచే అస్త్రంగా మారుతుందా..?
-
నిఘా ఆరోపణలతో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి అరెస్ట్
మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంతో బద్ధశత్రువులుగా తయారైన అమెరికా, రష్యాల సంబంధాలు మరింత క్షీణించే పరిణామం ఒకటి సంభవించింది. రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’కు చెందిన ఇవాన్ గెర్‡్షకోవిచ్ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ) అరెస్ట్‌చేసింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది. ‘అమెరికా ఆదేశాలతోనే నిషేధిత ప్రాంతంలోని తమ సైనిక పారిశ్రామికవాడలోని ఒక సంస్థకు చెందిన రహస్య పత్రాలను సేకరించడంలో ఇవాన్ బిజీగా ఉన్నాడు. అందుకే అరెస్ట్‌చేశాం’ అని ఎఫ్ఎస్బీ గురువారం ప్రకటించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా పనిచేసే ఇవాన్ ఉక్రెయిన్, రష్యా, ఇతర సోవియట్ యూనియన్ దేశాల్లో వార్తల కవరేజీ విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా మోపిన నేరం రుజువు అయితే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తమ విలేకరి అరెస్ట్‌ను వార్తాసంస్థ తీవ్రంగా ఖండించింది. కోల్డ్ వార్ తర్వాత అమెరికా రిపోర్టర్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇవాన్‌ను ఏ తేదీలో అరెస్ట్చేసిందీ ఎఫ్ఎస్బీ వెల్లడించలేదుగానీ ఉరాల్ పర్వతాల దగ్గర్లోని ఎకటిన్బర్గ్ నగరంలో అతడిని అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా జైళ్లలో ఉన్న రష్యా ఆయుధ మధ్యవర్తి విక్టర్ బౌట్‌ను, డబ్ల్యూఎన్బీఏ స్టార్ బ్రిట్నీ గ్రీనర్ను రష్యా, అమెరికాలు మార్చుకున్న విషయం విదితమే. -
మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత శనివారం తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ రాహుల్ విలేకరిపై నిగ్రహం కోల్పోయారు. ఈ మేరకు రాహుల్ మీడియా ప్రసంగంలో..ఒక జర్నలిస్ట్ రాహుల్ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో చేసిన దొంగలందరికీ మోదీ పేరే ఎందుకు ఉంటుంది అనే వ్యాఖ్య గురించి నేరుగా ప్రశ్నించాడు సదరు విలేకరి. దీంతో రాహుల్ ఒక్కసారిగా ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. మీరు నన్ను ఈ ప్రశ్నను పరోక్షంగా అడగాలి ఇలా కాదంటూ మండిపడ్డారు. "మీరు బీజేపీ కోసం పనిచేయాలనుకుంటే మీ ఛాతీపై బ్యాడ్జి పెట్టుకుంటే బావుండేది. అప్పుడూ నేను అందుకు తగ్గట్టుగా సమాధానం ఇస్తాను. నేను భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య వాణిని కాపాడుతూనే ఉంటానని, ఎవ్వరికీ భయపడేది లేదు. గౌతమ్ అదానీ షెల్ కంపెనీలకు రూ. 20 వేల కోట్లు ఎవరకీ వెళ్లాయి అనే సాధరణ ప్రశ్న కారణంగా ప్రధాని మోదీ తనను తాను రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న దాడులు ఇవి. అయినా నేను ఈ అనర్హతలు, జైలు శిక్ష వంటి వాటికి భయపడను. నేను మోదీ కళ్లల్లో భయం చూశాను. అదానీపై నా తదుపరి ప్రసంగానిక ప్రధాని భయపడుతున్నారు." అందువల్లే ఈ అనర్హత వేటు అని రాహుల్ తేల్చి చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో వెనుకబడిన ఓబీసీ కమ్యూనిటీలను అవమానించారంటూ పునురుద్ఘాటించారు. అయినా ఆయన ఒక్కరే కాదు బీజేపీకి చెందిన ఆరుగురి తోసహా దేశవ్యాప్తంగా 32 మంది నేతలపై అనర్హత వేటు పడిందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ అన్నారు. అంతేగాదు కర్ణాటక ఎన్నికల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రాహుల్‌ని ఏదో బలిపశువుగా చేసినట్లుగా యత్నిస్తోందంటూ విమర్శించారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన శరద్ పవార్) -
చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా బెదిరింపు అస్సలు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మళ్లీ చైనాను ఆక్రమించుకోమని ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లండన్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సంభాషణలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ ఎలాంటి వైఖరి తీసుకోలేదు కాబట్టి పాక్ లేక చైనాలు భారత్‌ని ఆక్రమించేందుకు యుద్ధానికి దిగితే ప్రపంచం విస్మరించే అవకాశం ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. దీనికి రాహుల్ స్పందిస్తూ.. మేము ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాం అన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేతిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లకు వరకు మా భూభాగం ఉందని చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం స్వయంగా ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం విశేషం. పైగా ఈ విషయం గురించి చర్చిస్తుంటే ఏమిటి రచ్చ అని ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం చైనా విషయంలో భారత్ కాస్త జాగ్రత్తాగా ఉండాల్సిందే కదా అని మరో ప్రశ్న సంధించగా.. చైనా నుంచి ముప్పు ఉందనే తాను పదేపదే ప్రభుత్వానికి చెబుతున్నానన్నారు రాహుల్. భారత భూభాగంలోకి ఎవర్నీ ప్రవేశించకుండా చేయడం కాంగ్రెస్ విధానమని నొక్కి చెప్పారు. చైనా విషయలో కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. భూభాగంలోకి ప్రవేశించి, చుట్టుముట్టడం, బెదిరించడం వంటి వాటికి కాంగ్రెస్ అస్సలు అంగీకరించదన్నారు. మిలటరీ బెదిరింపులు గురించి విలేకరులు అడిగనప్పుడూ..రాహుల్ మాట్లాడుతూ.. బెదిరింపులు గురించి అర్థం చేసుకోవాలి, రానున్న ముప్పు గురించి స్పందిచాలి. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా నుంచి ఉన్న అసలు ముప్పు ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా ప్రధాని ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం వల్ల ఆయనకు వాస్తవం ఏమిటో అర్థం కావటం లేదని రాహుల్ జర్నలిస్ట్‌ల సంభాషణలో చెప్పారు. కాగా, ఎస్ జైశంకర్ ఏఎన్ఏ మీడియా సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..సైన్యాన్ని వాస్తవ నియంత్రణ రేఖకు పంపింది కాంగ్రెస్ నాయకుడు కాదని, ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 1962లో ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలంటూ ధీటుగా కౌంటరిచ్చారు. అసలు ఆ భూభాగం చైనాలో కంట్రోల్లోకి 1962లో వెళ్లిపోతే 2023లోని మోదీ ప్రుభుత్వంపై నిందాలా? అని మండిపడ్డారు జైశంకర్ (చదవండి: మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం శుభపరిణామం'
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్నారని తెలిపింది. ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందించాలని విధాన నిర్ణయం తీసుకున్న సీఎంకు సభ్యులందరూ ధన్యవాదాలు తెలియచేస్తూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో అర్హులైన జర్నలిస్టులందరికి స్థలాలు కల్పించే దిశగా ప్రణాళిక చేయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆదేశించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జేఎన్జే సొసైటీతో పాటు హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేని మిగతా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రెస్ అకాడమి అధ్వర్యంలో కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని సొసైటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జేఎన్జే సొసైటీకి మిగిలిన 38 ఎకరాల స్థలం వీలైనంత తొందరగా సొసైటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్, అందోల్ శాసనసభ్యుడు సీహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. 'కోట్లాది రూపాయలు చెల్లించినా దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వాలు సొసైటీకి భూమి అప్పగించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంపేట్‌లోని 32 ఎకరాలు సొసైటీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత ఆగస్టులో సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ కీలకంగా నిలిచింది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సొసైటీ తరఫున కృతఙ్ఞతలు.' తెలిపారు. ప్రస్తుత కమిటీ నేతృత్వంలోనే పేట్ బషీరాబాద్ స్థలం సాధించాలని కోరుతూ సర్వసభ్య సమావేశం కమిటీ పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో సీఈఓ వంశీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్, జ్యోతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
నువ్వు సల్లగుండాలే.. చిన్న నవ్వు ఒకటి సరిపోదా! వైరల్ వీడియో
స్నేహం ఏం కోరుకుంటుంది? కోట్లు కోరుకోదు. చిన్న నవ్వు ఒకటి సరిపోదా!స్నేహం ‘మా దేశం అయితేనే’ అంటుందా?‘కానే కాదు’ అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ సరిపోదా! బ్రిటన్‌కు చెందిన జర్నలిస్ట్, టీవి ప్రెజెంటర్ తాను చేస్తున్న ‘టైమ్‌లెస్ తమిళనాడు’ టీవీ ప్రొగ్రామ్ కోసం తమిళనాడులోని మదురైలో అడుగుపెట్టింది. మదురై అద్భుత అందాల అనుభూతి నుంచి పూర్తిగా బయటికి రాకముందే మల్లెపూలు అమ్మే మహిళ రూపంలో ఆమెకు అపురూపమైన స్నేహం కలిసింది. ఈవిడ మదురై తమిళ యాస ఆమెకు అర్థం కాకపోవచ్చు.ఆవిడ బ్రిటీష్ ఇంగ్లీష్ ఈవిడకు అర్థం కాకపోవచ్చు... అయితే అదేమీ వారి స్నేహానికి అడ్డుగోడ కాలేదు. పూలమ్మ ఎలెక్స్కు జడ వేసి మల్లెపూలు పెట్టేది.ఆ జడ చూసుకుని ఎలెక్స్ మురిసిపోయేది!తన స్టైల్లో జోకులు చెప్పేది పూలమ్మ. అవి అర్థం కాక ఎలెక్స్ తెల్లముఖం వేసే లోపే దారిన పోయే దానయ్యలు తమకు తెలిసిన ఇంగ్లీష్‌లో ఎలెక్స్కు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మదురై నుంచి వెళ్లే క్రమంలో తన సెలబ్రిటీ పూలమ్మతో ఫొటోలు దిగింది ఎలెక్స్.కథ ఇదే అయితే అది మదురైలో మాత్రమే ఆగిపోయి ఉండేది. అయితే ఎలెక్స్ స్వదేశానికి చేరుకున్న తరువాత పూలమ్మతో తాను ఉన్న చిన్న వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తక్కువ సమయంలోనే ఈ క్లిప్‌కు 4.7 లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో క్లిప్‌లో పెద్ద పెద్ద మాటలేవీ లేకపోవచ్చు. అయితే వారి భావోద్వేగాన్ని, అనుబంధాన్ని నెటిజనులు తమదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘మల్లెపూలు అందమైనవి. మీ స్నేహం అంతకంటే అందమైంది’ అన్నారు.‘గ్రేట్ క్రాస్ కల్చరలిజం’ అంటూ వీరి స్నేహాన్ని ఆకాశానికెత్తారు! తమిళనాడులోని సముద్రపు అందాలు, కొండలు, కోవెలల సౌందర్యం, తేయాకు తోటల పచ్చదనం, చల్లని మనసున్న హిల్ స్టేషన్ల గురించి చెబుతూ ‘అద్భుతం’ అన్నది ఎలెక్స్. అయితే వీరి వీడియో క్లిప్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో మహా అద్భుతంగా మారింది! View this post on Instagram A post shared by Alex Outhwaite (@alexouthwaite) -
దళితుల ప్రాతినిధ్యంతోనే మీడియాలో సామాజిక మార్పు
సనత్‌నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్‌నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. -
Turlapati Kutumba Rao: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!
కలంతో, గళంతో సాహిత్య–సాంస్కృతిక సాఫల్యం సాధించిన తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. 4,000కు పైగా జీవిత చరిత్రలు, 16,000కు పైగా ప్రసంగాలు చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన తుర్లపాటి కీర్తికాయుడై నేటికి రెండు సంవత్సరాలు. ముక్కుసూటితనం, చొరవ మూర్తీభవించిన నిజాయితీతో తుర్లపాటి మొదటినుండీ ప్రత్యేకమైన, ప్రతిష్ఠాత్మకమైన సందర్భాలను సొంతం చేసు కున్నారు. స్వరాజ్యనిధికి 5 రూపాయలు ఇస్తేగానీ ఆటోగ్రాఫ్ ఇవ్వని మహాత్మాగాంధీ వద్ద నుండి ఉచితంగా ఆటోగ్రాఫ్ పొందారు. తన 19వ ఏటనే టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా చేరారు. నార్ల వెంకటేశ్వరరావుకు ఏకలవ్వ శిష్యునిగా తనను భావించుకునేవారు. పత్రికా రంగంలో ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన ‘వాహిని’తో మొదలై, ‘ప్రతిభ’ పత్రికకు మారి, తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కోరిక మేరకు ‘ప్రజా పత్రిక’కు తన సేవలందించారు. తదనంతరం ‘ఆంధ్రజ్యోతి’, ‘జ్యోతి చిత్ర’ పత్రికలలో పనిచేస్తూ, అలా 70 సంవత్సరాలకుపైగా వివిధ స్థాయిలలో విలువైన సేవలందించిన అతి కొద్దిమంది పాత్రికేయులలో ప్రముఖమైన స్థానం సంపాయించారు. తెలుగు పత్రికా రంగంలో కళా ప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి. ఆయనపై బీబీసీ వారు, జపాన్ మీడియా వారు తీసిన ప్రామాణికమైన డాక్యుమెంటరీలు ఆయన ప్రతిభను తేటతెల్లం చేశాయి. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా సేవలందించారు. పలు సభలలో జాతీయ స్థాయి నాయకుల, ప్రభుత్వాధినేతల అన్య భాషా ప్రసం గాలకు దీటైన అనువాదకులుగా అందరినీ మెప్పించారు. దశాబ్దాల క్రితమే ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేని కాలంలోనే ‘వార్తలలోని వ్యక్తి’ అనే శీర్షికతో దాదాపు 50 సంవత్సరాల పాటు ప్రముఖుల జీవిత రేఖా చిత్రాలు అందించారు. ఆ వివరాలను ఎక్కడెక్కడి నుండి ఆయన సేకరించారో అనే ఆశ్చర్యం చదువరుల వంతయ్యేది. బహుశా 5 దశాబ్దాల పాటు పత్రికలలో కొనసాగిన అరుదైన ఘనత శీర్షికా రచయితగా తుర్లపాటిది. ఆయన ఇతర రచనలు క్లుప్తతనూ, సరళతనూ నింపుకున్న సమాచార సముద్రాలు. 18 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఆయనకు గాఢమైన సత్సంబంధాలు ఉండేవి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుర్లపాటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేతుల మీదుగా సత్కారాలు పొందిన కళాకారులు అందరూ ‘గజా రోహణం – గండపెండేరాలు’ పొందినంత సంబరపడి పోయేవారు. ఆయన ద్వారా ‘నటసామ్రాట్’ అన్న బిరుదు పొందిన అక్కినేని కూడా, తాను పొందిన ఎన్నెన్నో బిరుదులన్నింటికన్నా ఆ బిరుదే అత్యంత ఇష్టమైనదని చెప్పేవారు. (క్లిక్ చేయండి: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు) ‘మనసున మల్లెల మాలలూగెనే – కన్నుల వెన్నెల డోలలూగెనే’ తుర్లపాటికి ప్రాణప్రదమైన పాట. ఎప్పుడూ ఆ పాటను ఎంతో ఆర్తితో పాడించుకునేవారు. తల్లి – బంధువులు మందలించినప్పటికీ, ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణకుమారిని ‘ఏమండీ’ అని సంబోధించే అలవాటు, ఆయనకు మహిళల పట్ల ఉన్న నిజమైన గౌరవానికి సూచిక. ఆమె పట్ల ప్రేమ–గౌరవాలతో ఆయన స్థాపించిన సాంస్కృతిక సంస్థ ‘కృష్ణ కళాభారతి’. పలు సంస్థలవారు చేసే కార్యక్రమాలలో తమ సహ నిర్వహణ సంస్థగా ఈనాటికీ అభిమానంగా పేరు వేస్తూ తమ నివాళి అర్పిస్తున్నారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో భార్య, కుమార్తెలను పోగొట్టుకున్నా, తనకి కేన్సర్ వ్యాధి వచ్చినా, స్థిత ప్రజ్ఞతతో, దృఢసంకల్పంతో కష్టాలను, అనారోగ్యాన్ని జయించిన విజేత తుర్లపాటి. – గోళ్ల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి.ఆర్.కె.– పోలవరపు సాంస్కృతిక సమితి (జనవరి 11 తుర్లపాటి కుటుంబరావు వర్ధంతి) -
మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది
పటాన్చెరు టౌన్: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా వినోద్ కోహ్లీ, ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ ఇస్మాయిల్(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్‌గా నతుముల్ శర్మ (ఛత్తీస్‌గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ(చండీగఢ్), భాస్కర్(తెలంగాణ) సిమిజాన్ (కేరళ), బాబు థోమస్, అనిల్ బిశ్వాస్, తారక్ నాథ్‌రాయ్(వెస్ట్‌బెంగాల్), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు. -
మిమ్మల్ని వద్దన్న వారందరి అకౌంట్లు బ్లాక్ చేయడం బావుండదేమో సార్!!
మిమ్మల్ని వద్దన్న వారందరి అకౌంట్లు బ్లాక్ చేయడం బావుండదేమో సార్!! -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్‌లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్‌టబ్‌లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్‌గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్‌లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్‌లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్‌గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్‌లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్‌స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్‌స్లా కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్‌నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్‌తో డానీ రూమ్‌ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్‌ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్‌లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్‌తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్‌లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్‌లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్‌స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్‌స్లా సంస్థ.. తన సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్‌వేర్‌ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
జర్నలిస్టులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్టు పెన్షన్ స్కీంను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని మహాజన సొషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖరాశారు. సమాజం కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్ స్కీం ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కులాలు, మతాల తారతమ్యం లేకుండా జర్నలిస్టుందరికీ జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలని విన్నవించారు. జీవో 239ను సవరించాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిన్న పత్రికల అప్‌గ్రేడ్ ప్రక్రియను వెంటనే చేపట్టి ఆయా పత్రికల మనుగడను ఆదుకోవాలని మందకృష్ణ విన్నవించారు. అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలతో పాటు సొసైటీల్లో లేని జర్నలిస్టులకు కూడా ఇళ్లు కేటాయించాలన్నారు. -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా, ఓ కారు వేగంగా దూసుకొచ్చి వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులు ఓ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులుగా తెలుస్తోంది. అయితే ఘటన జరిగి మూడు రోజులవుతున్నప్పటికీ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: (రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని) -
FIFA : రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు చెందిన ఒక జర్నలిస్ట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగానే ఒక దొంగ తన చేతివాటం చూపించాడు. దొంగ చేసిన పనికి విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఖతార్, ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. డొమినిక్ మెట్జెర్ అనే యువతి టోడో నోటియాస్ అనే టెలివిజన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంది. ఫిఫా వరల్డ్‌కప్ నేపథ్యంలో లైవ్ కవరేజ్ ఇవ్వడానికి డొమినిక్ మెట్జెర్ ఖతార్‌కు వెళ్లింది. సాకర్ ఆరంభోత్సవాలు ముగిశాక ఈక్వెడార్, ఖతార్‌లో మధ్య మ్యాచ్ జరిగింది. లైవ్ కవరేజ్ చేస్తుండగానే ఒక దొంగ ఆమె హ్యాండ్బాగ్లో విలువైన డాక్యుమెంట్లు, నగదు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయింది. మ్యూజిక్, జనాల అరుపులో నేను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లతో కలిసి గట్టిగా అరుస్తున్న సమయంలోనే ఎవడో వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి పర్సును దొంగలించాడు. వాటర్ తాగుతామని హ్యాండ్‌బ్యాగ్ చూస్తే అప్పటికే పర్సు దొంగతనం చేసినట్లు తెలిసింది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులను ఆశ్రయించగా.. దొంగ కచ్చితంగా దొరుకుతాడని.. అతనికి మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే అది విధించొచ్చు అని చెప్పడంతో షాక్ తిన్నా'' అంటూ డొమినిక్ మెట్జెర్ తెలిపింది. చదవండి: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జర్నలిస్ట్ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
అవిశ్రాంత పోరాటం
విశ్రాంత జీవనం అంటేనే ఎన్నో అనుభవాలతో కూడుకున్నది. పోరాటాల జీవనమైతే వాటి ఫలితాల గురించి నలుగురికి తెలియజేసి, సమస్యల పరిష్కార దిశగా సాగమని సూచనలు చేస్తారు. 79 ఏళ్ల రూప్ రేఖా వర్మ జీవనం పోరాటాల ప్రయాణమే. లక్నో వీధుల్లో నిలబడి అన్యాయాలను ప్రతిఘటించమని, న్యాయంగా జీవించమని వీధుల్లో కరపత్రాలను పంపిణీ చేసి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు.. కేరళ జర్నలిస్ట్ కప్పన్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లో బెయిల్ ఇచ్చేందుకు ఈ వయసులోనూ ధైర్యంగా ముందుకొచ్చి వార్తల్లో నిలిచారు. లేమి నుంచే పోరాటం.. తను చదువుకున్నప్పటి రోజుల గురించి వివరిస్తూ ‘యూనివర్శిటీలో ఎం.ఏ. చేస్తున్నప్పుడు టీచర్లతో, సీనియర్లతో మాట్లాడాలన్నా భయమేసేది. కానీ, అక్కడ అమ్మాయిల కోసం ఏమాత్రం సౌకర్యాలు ఉండేవి కావు. ముఖ్యంగా ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేవి కావు. చాలా కష్టంగా అనిపించేది. ఇలా భయపడితే లాభం లేదు. ఏదైనా తెగింపుతోనే సాధ్యం అనుకున్నాను. అలాగే, కాలేజీ సమస్యలపై గళమెత్తాను. దీంతో టాయ్‌లెట్స్ మాత్రమే కాదు ఉమెన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. ఇది అప్పటి రోజుల్లో పెద్ద విజయమే. ఆ తర్వాత అదే యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరాను. అధ్యాపకురాలిగా... ‘ఎక్కువగా సామాజిక సమస్యలపైనే విద్యార్థులకు బోధన ఉండేది’ అంటూ 40 ఏళ్లు యూనివర్శిటీ అనుభవాలను మన ముందుంచుతోంది ఈ అధ్యాపకురాలు. మూడేళ్ల పాటు జీతం లేకుండా ప్రత్యేకంగా ఉమెన్ రీసెర్చ్ సెంటర్‌ను సైతం నిర్వహించారు. అదే సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చ్ అకడమిక్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసింది. ‘సిలబస్‌కు మించి సమాజంపై అవగాహనకు పుస్తకాలే దోహదం చేశాయి. సాహిత్యంపై ఆసక్తి, తత్త్వశాస్త్ర అధ్యయనం వల్ల అభ్యుదయ భావాలు అభివృద్ధి చెందాయి’ అని తనకు కలిగిన ఆలోచనల గురించి నలుగురితో పంచుకుంటోంది. తన∙హయాంలో అప్లికేషన్ ఫారమ్‌లో అప్పటివరకు తండ్రి పేరు మాత్రమే ఉండేదని, ఆ తర్వాత కాలంలో తల్లిపేరు కూడా చేర్చేలా చేశామని వివరిస్తుంది. హత్యారోపణలు ‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి నా వయసు నాలుగేళ్లు. మా నాన్న డాక్టర్‌గా సేవలు అందజేసేవాడు. నాటì స్వాతంత్య్ర రోజుల్లో సమస్యలను చూస్తూ, కథలు వింటూ పెరిగాను. ఇంట్లోనూ దేశానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చర్చల్లో ఉండేవి. కాలేజీలోనూ ఏ కార్యక్రమమైనా చర్చావేదిక ఉంటే అక్కడ తప్పక నేనుండేదాన్ని. మతం పేరుతో, కులం పేరుతో అల్లర్లు సృష్టించేవారుండేవారు. ఏదో విధమైన గొడవలకు విద్యార్థులను ప్రేరేపించేవారు. ఆ అల్లర్లు ఎలా ఉండేవంటే.. నా మీద హత్యారోపణలు కూడా వచ్చాయి. నా పైన తప్పుడు కేసులు పెట్టారు. నాపైన దుష్ప్రచారాలతో కూడిన ఉత్తరాలు ఇంటింటికీ పంపించారు. యూనివర్శిటీలో ఉద్యోగానికి, బోధించడానికి అవన్నీ అడ్డు పడ్డాయి. ఏడాదిన్నరపాటు కోర్టులో పోరాటం చేసి నెగ్గాను. సమాజం, విద్యార్థులు నాకు తోడుగా నిలిచారు. దీంతో నా గురించి చాలా మందికి తెలిసింది..’ అంటూ తాను సమస్యలను ఎదుర్కొన్న విధం గురించి వివరిస్తారు. పెళ్లి వ్యాపారం కాదు.. వివాహ వ్యవస్థ గురించి తెలియజేస్తూ ‘మన సమాజంలో అమ్మాయిల పెళ్లికి సంబంధించి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలే ఉంటాయి. ఆడపిల్లకు వయసు వస్తే చాలు పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తుంటారు. ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అని చెబుతారు. ‘నో’ చెబితే ఎందుకు చేసుకోవు.. అని నిలదీస్తారు. పెళ్లి అంటే వ్యాపారం కాదు కదా! నేనెవరినీ ఇష్టపడలేదు. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదు’ అని ఇంట్లోవారికి గట్టిగానే చెప్పాను. దీంతో ఎవరూ నా ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు’ అని తన ఒంటరి జీవితం గురించి వివరించే రూప్ రేఖా వర్మ 1980లో ‘సాజీ దునియా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సమస్యలపై ఒంటరిగా పోరాడటం మొదలుపెట్టారు. ‘మొదట్లో ఆ సంస్థలో చాలా కొద్దిమంది మాత్రమే చేరారు. ఏం చేసైనా సమతా సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా కొనసాగుతాను’ అని చెబుతారు. వీధి వీధిలో అవగాహన.. ప్రభుత్వాలు, వారి అణచివేత, సమాజంలో వివక్ష విధానాలపై కాలేజీ రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్న రేఖా వర్మ ‘అధ్యాపకురాలిగా ఉన్నప్పటి నుంచే వీధుల్లో కరప్రతాలు పంచుతూనే ఉన్నాను’ అని తెలియజేస్తారు. ‘లక్నో వీధుల్లో నిలబడి స్వాతంత్య్రానికి ముందు భారతీయులు సమష్టి్టగా జరిపిన విప్లవాల గురించి కథనాలున్న కరపత్రాలను పంచుతున్నాను. సంఘటితంగా పోరాటం చేస్తేనే ఏదైనా మనకు చేరువ అవుతుంది అని చెప్పడమే నా లక్ష్యం. కులం, మతం అనే వివక్ష, ద్వేషం వదిలేసి మిగిలిన జీవిత సమస్యలపై దృష్టి పెట్టండి. వాటి పరిష్కారానికి చేయీ చేయీ కలపండి. దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉద్యమించండి. విభేదాలు విడిచిపెట్టి, ఒక్కతాటి పైకి వస్తేనే దేశం పురోగమిస్తుంది’ అని చాటుతోంది ఈ అధ్యాపకురాలు. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ కష్టపడ్డాం ఇక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేద్దాం అని చాలామంది అనుకుంటారు. కానీ, లక్నో యూనివర్శిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి రిటైర్ అయిన రూప్ రేఖా వర్మ మాత్రం మంచి పనికి అసలు రిటైర్మెంట్ లేదనుకుంది. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉన్న రూప్ రేఖ ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకుంది. అన్యాయాలపై పోరాటం చేయడానికి అవగాహనే లక్ష్యంగా సాగాలని వీధి వీధి తిరుగుతోంది. -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్‌కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్‌లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్‌ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్‌బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్‌బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్‌పేట్‌లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్‌ను ట్రయల్ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్ కావాలని షరతులు విధించింది. ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు. -
జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న నటి ఆదితి శంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు. ఎప్పుడైతే గట్టిగా సినీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈమె గురించి తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈమె తొలిసారిగా కార్తీతో విరువన్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో గ్రామీణ యువతిగా దుమ్మురేపిన ఆదితి శంకర్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా ఆ చిత్ర విడుదలకు ముందే మరో చిత్రం ఈ బ్యటీని వరించింది. శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న ‘మా వీరన్’ చిత్రం. డాక్టర్, డాన్ చిత్రాల తరువాత శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ఇది. చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ మండేలా చిత్రం ఫేమ్ మండేన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యల్ పూర్తి చేసుకుంది. తాజాగా చెన్నై పరిసర ప్రాంతాలలో షెడ్యూల్ జరుపుకుంటోంది. కారణం ఈయన తొలి చిత్రం మండేలా పలు అవార్డులను గెలుచుకోవడమే. కాగా ఈ చిత్రంలో నటి ఆదితి శంకర్ ఒక పత్రిక కార్యాలయంలో పని చేసే పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా నటింన తాను రెండవ చిత్రంలోనే దానికి పూర్తి కాంట్రాస్ట్ పాత్రలో నటించడం సంతోషంగా ఉందని ఆదితి శంకర్ పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలో నటించడానికి వెనుకాడనని ముందే స్పష్టం చేసింది ఈ అమ్మడు. చదవండి: పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’ -
ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు
పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పాకిస్తాన్లో వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు సాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్ట్ర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధిచి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్ డెడికేషన్ వర్క్‌కి హ్యాట్సాప్ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్ కోసైం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది) -
‘తోపుడు బండిపై ఆస్పత్రికి’.. వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద కేసు!
భోపాల్: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని లహర్ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్ కోసం ఎలాంటి ఫోన్‌కాల్ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్ రాజీవ్ కౌరవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్‌బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తాము ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఒకే ఇన్స్టాల్మెంట్ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్‌పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
ఈ దాడి అమానుషం
దాదాపు మూడున్నర దశాబ్దాలు గడిచినా ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కంఠాన్ని ఒక కత్తి క్రోధంతో, కోపంతో గురిచూస్తూనే ఉన్నదని, ఇన్నాళ్లుగా అది అనువైన సమయం కోసం నిరీక్షిం చిందని అమెరికాలోని న్యూజెర్సీలో ఆయనపై జరిగిన హంతక దాడి రుజువు చేసింది. ఈ దాడిలో సల్మాన్ రష్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని, కాలేయానికి కూడా తీవ్ర గాయమైందని, అయితే ఆయన ప్రాణానికొచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు ప్రకటించటం ఊరటనిస్తుంది. ‘శాటానిక్ వర్సెస్’ నవలలో పాత్రల చేత పలికించిన సంభాషణలు రష్దీ ప్రాణం మీదకు తెచ్చాయి. ఆ నవలలో ఇస్లాం మతాన్నీ, ఆ మత ప్రవక్తనూ కించపరిచారన్నది రష్దీపై ఉన్న ప్రధాన అభియోగం. అయితే మొత్తం ఇతివృత్తాన్ని చదవకుండానే ఆ నవలపై దురభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇరాన్‌లోని మతాచార్యుడొకరు ఫత్వా జారీ చేశారని, పాకిస్తాన్ మత గురువుల అభిప్రాయమే దానికి ప్రాతిపదికని అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌కి చెందిన రమితా నవాయ్ అనే మహిళ ఇటీవల ట్వీట్ చేసింది. ఆ ఫత్వాను వెనక్కు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారన్నది ఆ మహిళ కథనం. అందులో నిజానిజాల మాటెలా ఉన్నా ఒక సృజనాత్మక రచన రచయితకు ప్రాణాంతకం కావడం సభ్యసమాజం జీర్ణించుకోలేనిది. సమాజాన్ని ఉన్నతీకరిం చేందుకు కృషి చేసే కవులు, రచయితలు, కళాకారులు ప్రపంచ దేశాలన్నిటా ఈనాటికీ మృత్యు నీడలో, నిర్బంధాల్లో బతుకీడ్చే దుఃస్థితి ఉండటం దారుణాతి దారుణం. దక్షిణాసియాలోని భారత్ 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించిన సందర్భంలో జరిగిన దేశ విభజన హిందూ, ముస్లింల మధ్య ఎంతటి విద్వేషాగ్నులను రగిల్చిందో... లక్షలాదిమంది ప్రాణాలు తీసి, కోట్లాదిమందిని ఎలా నిరాశ్రయులను చేసిందో తన ‘మిడ్నైట్ చిల్డ్రన్’ నవల ద్వారా రష్దీ కళ్లకు కట్టారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా జరుపుకోవడానికి కొన్ని గంటల ముందు రష్దీపై దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా... దశాబ్దాలు గడిచేకొద్దీ మతోన్మాదం, విద్వేషం ఖండాంతరాలు దాటి కార్చిచ్చులా వ్యాపిస్తున్న వైనాన్ని ఈ ఉదంతం బయటపెట్టింది. 1988లో ‘శాటానిక్ వర్సెస్’ నవల బయటి కొచ్చాక రష్దీని హతమార్చినవారికి 30 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ఇరాన్ మతాచార్యుడు ప్రకటించాడు. దానికి ఆనాటి ఇరాన్ ప్రధాన మతాచార్యుడు ఆయతుల్లా ఖొమైనీ కూడా మద్దతు నిచ్చారు. దాంతో ఆయన అజ్ఞాతవాసంలోకి పోవాల్సివచ్చింది. తొమ్మిదేళ్ల అజ్ఞాతం రచయితగా రష్దీని కుంగదీసింది. ఆ తర్వాత బయట సంచరిస్తున్నా కట్టుదిట్టమైన భద్రత తప్పలేదు. ఎన్నో సందర్భాల్లో దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు మన దేశాన్ని కూడా సందర్శించారు. అయితే జైపూర్ సాహిత్యోత్సవానికి ఆయన్ను ఆహ్వానించిన నిర్వాహకులు అటు తర్వాత మతోన్మాదుల బెదిరింపుతో వెనక్కి తగ్గడం రష్దీని బాధించింది. ఇస్లాం మత రిపబ్లిక్ అయిన పాకిస్తాన్లో కూడా ఇంతటి అవమానం తనకు జరగలేదని ఆయనొక సందర్భంలో అన్నారు. ఈ ఫత్వా తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని గ్రహించిన ఇరాన్ ప్రభుత్వం ఇకపై ఫత్వాకు తమ మద్దతు ఉండబోదని ప్రకటించినా, నజరానా మొత్తాన్ని ఒక మత సంస్థ పెంచిందని ప్రభుత్వ అనుకూల మీడియా 2016లో ప్రకటించటం గమనించదగ్గది. సృజనాత్మక రచన లు సహా భిన్న కళారూపాలు దేశదేశాల్లో ఎలా దాడులకు గురవుతున్నాయో, వాటి రూపకర్తలను ఎంతగా వేధిస్తున్నారో నిత్యం తెలుస్తూనే ఉంది. రష్దీపై ఫత్వాకు ఎన్నో దశాబ్దాల ముందు నుంచీ ఈ రకమైన వేధింపులు ఉనికిలో ఉన్నాయి. అయితే ‘శాటానిక్ వర్సెస్’ వెలువడిన అనంతర కాలంలో వరుసగా ఇస్లాం మతానుకూల దేశాలపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడిన తీరు కారణంగా ఇస్లామిక్ దేశాల ప్రజానీకంలో రష్దీపై ద్వేషం మరింత పెరిగింది. రష్దీ రచన కూడా పాశ్చాత్య ప్రపంచం సాగిస్తున్న దాడుల్లో భాగమని వారు విశ్వసించారు. ముస్లింలు అధికంగా నివసించే బోస్నియా–హెర్జ్‌గోవినా రిపబ్లిక్లో క్రైస్తవులు, ముస్లింల మధ్య ఘర్షణలు, ‘నాటో’ జోక్యం, ఆ తర్వాత అమెరికా నాయకత్వాన సంకీర్ణ దళాలు ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ, అఫ్ఘానిస్తాన్ దురాక్రమణ వగైరాలు సరేసరి. మనోభావాలు దెబ్బతినడం, తమ విశ్వాసాలపై దాడి జరిగిందనుకోవడం వర్తమానంలో ఏ ఒక్క దేశానికో, మతానికో పరిమితమై లేదు. మన దేశంలో ఈ జాడ్యం కులాలకు కూడా అంటింది. ఏదో సాకుతో భిన్న కళారూపాలను నిషేధించాలంటూ ఆందోళనలకు పూనుకోవడం రివాజుగా మారింది. ‘జై భీమ్’ చిత్రంపై వన్నియర్ కులస్థులు అభ్యంతరం చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తలమానికమైనది. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ కలబుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంకేశ్, దాభోల్కర్లను ఉన్మాదులు కాల్చిచంపడం, ఏళ్లు గడిచినా కారకులైనవారికి ఇప్పటికీ శిక్షపడకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. మన దేశంలో భీమా–కోరెగావ్ కేసులో రెండున్నరేళ్లుగా అనేకమంది రచయితలు, మేధావులు జైళ్లలో మగ్గటం వర్తమాన విషాదం. సృజనాత్మక ప్రపంచంలో రూపొందే ఏ కళారూపం బాగోగులనైనా లోతుగా చర్చించటం, భిన్నాభిప్రాయాలను గౌరవించటం నాగరీక సమాజాల మౌలిక లక్షణంగా ఉండాలి. ప్రాణాలు తీయటం, నిర్బంధాలు, నిషేధాలు విధించటం అమానుషం, అనైతికం. -
జుబేర్‌కు అన్ని కేసుల్లో బెయిల్.. తక్షణమే విడుదల చేయాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ట్వీట్‌తో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్నీ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జుబేర్‌ను రూ.20వేల పూచీకత్తుతో సాయంత్రం 6గంటల్లోగా కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు అతనిపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీ స్పెషల్ సెల్‌కు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్తగా నమోదయ్యే కేసులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. 2018లో ఓ మతానికి వ్యతిరేకంగా జుబేర్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్యే దర్యాప్తు చేస్తోంది. విచారణ సందర్భంగా జుబేర్ అరెస్టుకు సంబంధించి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జుబైర్‌ను తరచూ కస్టడీకి తీసుకెళ్లడానికి సరైన కారణమేమి కన్పించడం లేదని చెప్పింది. పోలీసులు అరెస్టు చేసే అధికారాన్ని మితంగా ఉపయోగించుకోవాలని హితవు పలికింది. అలాగే జుబేర్‌ను ట్వీట్ చేయకుండా నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జర్నలిస్టును రాయొద్దని చెప్పడమంటే.. న్యాయవాదిని వాదించవద్దనడంతో సమానమని అభిప్రాయపడింది. ఆయన చేసే ట్వీట్లకు బాధ్యత కూడా ఆయనదే అని స్పష్టం చేసింది. వాటికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 2018 ట్వీట్‌కు సంబంధించి జుబేర్‌పై మొదట ఢిల్లీలో కేసు నమోదైంది. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో యూపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని జుబేర్ సుప్రీంను ఆశ్రయించారు. వాటన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. కేసులను కొట్టి వేసే విషయంపై ఢిల్లీ హైకోర్టునే సంప్రదించాలని సూచించింది. చదవండి: పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసు నిందితుడు హతం! -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
జర్నలిస్ట్ గోపాల్ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: వివిధ దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన చింతమాను గోపాలకృష్ణ (35) అదృశ్యమై ఐదేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2017, నవంబరు 11న గోపాలకృష్ణ కనిపించకుండా పోయాడని అతని తల్లి చింతమాను లక్ష్మమ్మ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు 97/2017 క్రైం నంబర్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోపాలకృష్ణ ఎక్కడున్నది గుర్తించలేకపోయారు. కుమారుడు బతికున్నాడో.. లేదో తెలియని స్థితిలో అతని తల్లి మంచం పట్టి చివరకు అనారోగ్యంతో మృతి చెందింది. చదవండి: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి.. అనంతరం గోపాల్ భార్య, పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. గోపాల్ సోదరి తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. అడిగేవారు లేకపోవడంతో గోపాల్ కేసును పోలీసులు అటకెక్కించేశారు. కాగా, గోపాలకృష్ణను హత్య చేశారన్న వదంతులూ హల్చల్ చేస్తున్నాయి. ఒక జర్నలిస్టు అదృశ్యమై ఐదేళ్లవుతున్నా పోలీసులు ఆచూకీ కనుగొనలేదంటే దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమించి గోపాల్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని పలువురు కోరుతున్నారు. -
అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు బుధవారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. సదరు జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టును తానెన్నడూ కలవడం గానీ, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు. నుస్రత్ మీర్జా అనే పాకిస్తాన్ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘2005–11 మధ్య అన్సారీ తనను కనీసం ఐదుసార్లు భారత్‌కు ఆహ్వానించినట్టు మీర్జా చెప్పాడు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కూడా మీర్జా ఆయన నుంచి రాబట్టి ఐఎస్ఐతో పంచుకున్నట్టుగా కన్పిస్తోంది. అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా కూడా దేశ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఇదంతా దేశద్రోహం కాక మరేమిటి? దేశ ప్రజలు ఆయన్ను ఎంతగానో గౌరవిస్తుంటే ఆయనేమో దేశానికే ద్రోహం తలపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ మొత్తం ఉదంతంలో అన్సారీతో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ బదులివ్వాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాళ్లు తక్షణం నిర్దోషిత్వం నిరూపించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. శత్రు గూఢచారులను భారత్‌కు అధికారికంగా ఆహ్వానించడమే ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరా అని ప్రశ్నించారు. అన్సారీని ఉద్దేశించి పాక్ జర్నలిస్టు బయటపెట్టిన విషయాలు చాలా తీవ్రమైనవని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా అన్నారు. ‘‘అన్సారీ వంటి వ్యక్తిని యూపీఏ రెండుసార్లు ఉపరాష్ట్రపతిని చేసింది. దీన్నిబట్టి యూపీఏ హయాంలో దేశ అత్యున్నత పదవుల్లో నియామకాల విషయంలో గోల్మాల్ జరిగిందా అన్న తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు. 2007లో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతి అయిన అన్సారీ 2017 దాకా పదవిలో కొనసాగారు. మోదీ అండ్ కో దిగజారుడుతనం: జైరాం బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అన్సారీ, సోనియా వ్యక్తిత్వాలను కించపరిచే నీచ ప్రయత్నమంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ దుయ్యబట్టారు. వ్యక్తిత్వ హననానికి ఇది పరాకాష్ట అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుయాయుల దిగజారుడుతనానికి అంతులేకుండా పోతోందని విమర్శించారు. వాళ్ల మనసులు ఎంత రోగగ్రస్తంగా మారాయో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. నాది మచ్చలేని పనితీరు: అన్సారీ బీజేపీ ఆరోపణలను ఖండిస్తూ అన్సారీ ప్రకటన విడుదల చేశారు. ‘‘2010 డిసెంబర్ 10న ఉగ్రవాదంపై సదస్సును నేను ప్రారంభించి ప్రసంగించాను. నిర్వాహకులు ఎవరిని ఆహ్వానించిందీ నాకు తెలియదు. నేనెవరినీ ఆహ్వానించలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ రాయబారిగా నేను చేసిన ప్రతి పనీ నాటి కేంద్ర ప్రభుత్వ ఎరుకలో ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయాలపై ఇంతకంటే ఏమీ వ్యాఖ్యానించలేను. ఇరాన్ విధుల అనంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడినయ్యా. నా పనితీరును భారత్‌తో పాటు ప్రపంచమంతా గుర్తించింది’’ అని చెప్పారు. అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఆయన ఓఎస్డీగా పని చేసిన గుర్‌ప్రీత్‌సింగ్ సప్పల్ కూడా బీజేపీ ఆరోపణలను ఖండించారు. ‘‘మీర్జా ఎక్కడా తనను అన్సారీ ఆహ్వానించారని చెప్పలేదు. ఆయన ప్రసంగించిన సెమినార్లో మిగతా జర్నలిస్టులతో పాటు మీర్జా కూడా ఉన్నాడంతే’’ అంటూ ట్వీట్ చేశారు. -
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
ఇది మా అంతర్గత వ్యవహారం: భారత్ ధీటైన బదులు
న్యూఢిల్లీ: జర్మనీ విమర్శలకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ప్రముఖ ఫ్యాక్ట్‌చెకర్ ముహమ్మద్ జుబేర్ అరెస్ట్ వ్యవహారంపై జర్మనీ విదేశాంగ శాఖ.. భారత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఈ తరుణంలో.. భారత్ గట్టిగానే బదులిచ్చింది. ఉచిత రిపోర్టింగ్ ఏ సమాజానికైనా ప్రయోజనకారిగా ఉంటుంది. వాళ్లపై పరిమితులు ఆందోళన కలిగిస్తాయి. జర్నలిస్టులు ఏం మాట్లాడినా.. రాసినా వారిపై వేధింపులకు పాల్పడడం, నిర్భంధించడం లాంటివి చేయకూడదు. ఈ నిర్దిష్ట కేసు(జుబైర్ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ..) గురించి మాకు నిజంగా తెలుసు. న్యూఢిల్లీలోని మా(జర్మనీ) రాయబార కార్యాలయం దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది అని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ రియాక్ట్ అయ్యింది. ‘‘ఇది మా అంతర్గత వ్యవహారం. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో ఉంది. మా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అలాంటి వ్యవస్థపై మీ కామెంట్లు సరికాదు. ప్రస్తుతానికి మీకనవసరం’’ అంటూ విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి, జర్మనీ కామెంట్లకు బదులిచ్చారు. ఇదిలా ఉంటే.. పత్రికా స్వేచ్ఛా, భావ స్వేచ్ఛ ప్రకటన అంశాల ఆధారంగా యూరోపియన్ యూనియన్ తరపున మానవ హక్కుల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రకటించుకుంటుంది. అలాంటప్పుడు.. ప్రజాస్వామ్య విలువలైన ప్రతికా స్వేచ్ఛ, భావ ప్రకటనలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జర్మనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ సహవ్యవస్థాపకుడైన జుబేర్‌ను.. జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో చేసిన ఓ ట్వీట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద పలు ఆరోపణలపై 14 రోజుల క్టసడీకి తీసుకున్నారు. ప్రాణ హాని ఉందని, బెయిల్ మంజూరు చేయాలంటూ జుబేర్ దాఖలు చేసిన పిటిషన్ మీద రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. చదవండి: చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు -
GS Varadachary: ఒక ‘డీఫ్యాక్టో ఎడిటర్’ ఆత్మకథ
వరదాచారిగారు తెలుగు పత్రికారంగానికీ, తెలుగు పత్రికారంగ చరిత్రకూ చేసిన ఉపకారం ఎనలేనిది. ఆయా రంగాలలో ఉత్తమస్థాయిని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మకథను రాసితీరాలని నా భావన. అవి కేవలం వారి సొంత కథలు కావు. ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన ఆయా రంగాల తాలూకు చరిత్రను, మొత్తంగా దేశ చరిత్రను చెబుతాయి. అనేకమైన పనుల ఒత్తిడుల మధ్య ‘జ్ఞాపకాల వరద’ చదవడం ప్రారంభించి ఆ వరదలో ఎక్కడా ఆగకుండా మునకలేస్తూ, 272 పేజీల పుస్తకాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయగలిగాను. వరదాచారి పండిత పత్రికా రచయిత, ఆపైన బహుముఖ కార్యదక్షులు, బహుళ వ్యాపకులు, తాను పనిచేస్తూనే, ఇతరులతో పని చేయిస్తూ, అందులోనే శిక్షణను మేళవిస్తూ, డెస్క్‌నే ఒక తరగతి గదిగా మలచుకుంటూ, ఒక నిష్కామబుద్ధితో మెరిక ల్లాంటి ఎందరో పత్రికారచయితలను తయారు చేసినవారు. ఈ దృష్ట్యా, పొత్తూరి వంటివారు ఆయనను ‘ప్రొఫెసర్’ అని పిల వడం ఎంతైనా అర్థవంతం. ఆ మాటను సార్థకం చేస్తూ, తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో అధిపతిగానూ, అధ్యా పకులు గానూ రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం, ప్రెస్ క్లబ్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఇటీవలి కాలంలో వయోధిక పాత్రికేయ సంఘం మొదలైన సంస్థలతో క్రియాశీల సంబంధం లేకుండా, ఆయన పండిత పత్రికా రచయిత గానే ఉండిపోయి ఉంటే, ఈ రంగంలో తిరుమల రామచంద్ర వంటి పండిత ప్రకాండులలో ఒకరయ్యేవారని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది. జర్నలిస్టులతోపాటు భవిష్య నిధి సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ లాభం చేకూర్చిన పింఛను పథకం మొదట వారి మెదడులోనే అంకురించి మొక్క అయిం దంటే– ఆయన వ్యక్తిత్వ, వ్యాపకాలకు చెందిన మరో పార్శ్వం ఎంత విలువైనదో, ఎంత స్ఫూర్తిదాయ కమో తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరుకు చెందిన ఒక వైష్ణవ కుటుంబానికి చెంది, దానిని అంటి పెట్టు కుని ఉండే సంప్ర దాయ గాఢతను, పరి భాషను, పాండిత్య స్పర్శను వరదాచారి బాల్యం నుంచే రంగ రించుకున్నారు. చిన్న ప్పుడు ఏర్పడిన కులమతవర్గాతీత స్నేహాలు ఆయనలో భావ వైశాల్యాన్ని, హృదయ వైశాల్యాన్ని పెంచి విస్తృత మానవ సంబంధాలవైపు నడిపించాయి. తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఉన్న వైష్ణవ కుటుంబాలు చాలావరకూ నేటి తమిళనాడు నుంచి వలస వచ్చాయన్న చారిత్రక సమాచారం మనం ఎరిగినదే. అలాంటి అనుభవాలు, మూలాలు ఆ తరహా కుటుంబాలలో ఒక విధమైన కార్యదక్షతను, క్రియా శీలాన్ని, ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పిల్లలను పెంచి పెద్దజేసే లక్షణాన్ని అలవరచడం సహజమే. తండ్రి కృష్ణమాచారిగారిలో ప్రస్ఫుటంగా కనిపించే ఈ లక్షణాలే మనకు తెలిసిన రూపంలోని వరదాచారిగారినే కాక, ఆయన సోదరులను కూడా ఉన్నతవిద్యాపరంగానూ, ఇతరత్రానూ ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్టు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఈ పుస్తకం నాలో కలిగించిన గొప్ప తెలివిడి ఏమిటంటే – అప్పటికి విద్య, ఉద్యోగాలపరంగా ముందుందనుకునే ఆంధ్రప్రాంతపు కుటుం బాల కన్నా కూడా వరదాచారి కుటుంబం అన్నివిధాలా ముందడు గులో ఉందన్న సంగతి! ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దిన కృష్ణ మాచారిగారే ఈ ఆత్మకథలో నాకు అసలు హీరోగా కనిపిస్తారు. వరదాచారిగారి ఆత్మకథ చదువుతుంటే, ఎంత నమ్మకం లేని వారికైనా ‘విధి’ని నమ్మక తప్పదేమోననిపిస్తుంది. మూడు, నాలుగు పత్రికలలో సంపాదకులయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి తప్పిపోవడానికి, అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పత్రికారంగంలో ఉన్నతమైన ఎడిటర్ స్థానాన్ని ఆయన అందుకోలేకపోవడానికి కేవలం విధి తప్ప మరో కారణం లేదని అనిపిస్తుంది. మరోవైపు, ‘ఆంధ్రభూమి’ దినపత్రికకు గోరాశాస్త్రి ఎడిటర్ కావడానికి పూర్వ రంగంలో ప్రముఖపాత్ర నిర్వహించినదీ ఆయనే. వరదాచారిగారి అమోఘ జ్ఞాపకశక్తికి అద్దంపట్టే ‘జ్ఞాపకాల వరద’ అనేక కోణాలలో విలువైనది. వారి స్వీయచరిత్రనే కాక, ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన తెలుగు పత్రికారంగ చరిత్రను, అందులో భాగంగా దేశ, రాష్ట్ర రాజకీయ, సామాజిక, సాంస్కతిక చరిత్రనూ చెబుతుంది. కల్లూరి భాస్కరం (జి.ఎస్. వరదాచారి జీవన సాఫల్య అభినందన సభ, ‘పరిణత పాత్రికేయం’ ఆవిష్కరణ సందర్భంగా..) -
ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతి మరే ఏ ఇతర నోబెల్ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. హెరిటేజ్ వేలం కంపెనీ ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది. అంతే పుతిన్ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. (చదవండి: ఎలన్ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు.. సారీ ‘కూతురు’!!) -
నాడు యాంకర్‌గా...నేడు రోడ్లపై తినుబండారాలు అమ్ముకుంటూ...
Photo Of Journalist Surviving In Afghanistan Viral: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్ హక్మల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్లు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్ అండ్ రిపోర్టర్‌గా పనిచేశాడని పేర్కొన్నాడు. ఐతే ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్తా నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను ఆ మాజీ జర్నలిస్ట్‌కు తన ఛానెల్లో ఉద్యోగం ఇస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు అతనికి తమ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్‌లో నియమించుకుంటామని హామీ ఇచ్చాడు. ఐతే మొహమ్మదీలానే చాలామంది జర్నలిస్టులు, మరీ ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్‌లు అఫ్గనిస్తాన్‌లో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదీగాక 2021లో చివరి నాలుగు నెలల్లో తలసరి ఆదాయం మూడింట ఒక వంతు పడిపోయినందున అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. Journalists life in #Afghanistan under the #Taliban. Musa Mohammadi worked for years as anchor & reporter in different TV channels, now has no income to fed his family. & sells street food to earn some money. #Afghans suffer unprecedented poverty after the fall of republic. pic.twitter.com/nCTTIbfZN3 — Kabir Haqmal (@Haqmal) June 15, 2022 (చదవండి: మాట మార్చిన రష్యా! సంబంధాలు యథావిధిగా మెరుగవుతాయి) -
చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ
ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపి ముక్కలుగా నరకడమే కాదు.. విడి భాగాలు దొరక్కుండా పూడ్చిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అమెజాన్ అడవుల్లో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలను బయటపెడతారనే భయంతోనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో తాజాగా ఘోరం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్, అక్రమ చేపల వేట, డ్రగ్స్ రవాణా నేరాలకు నెలవైన ప్రాంతంలో ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన వెంట ఉన్న ఆదిమ తెగకు చెందిన బ్రూనో పెరెయిరా(అమెజాన్ ఆదిమ తెగల హక్కుల పరిరక్షకుడు) హత్యకు గురయ్యారు. వీళ్లిద్దరినీ అక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు(చేపల వేట, డ్రగ్స్ మాఫియా) నడిపించే ఒలీవెరియా బ్రదర్స్ హతమార్చినట్లు తేలింది. తొలుత ఈ కేసులో.. అమరిల్డో ఒలీవెరియాను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా అమెజోనాస్లోని ఇటాక్యూవాయి నదీ తీరం వెంట పాతిపెట్టిన మృతదేహాల శకలాలను అతికష్టం మీద వెలికి తీశారు బ్రెజిల్ పోలీసులు. ఇందుకోసం నాలుగు రోజులపాటు గాలింపు చర్యలు సాగాయి. ఇక ఈ జంట హత్యల్లో ఒలీవెరియా సోదరుడు ఒసెనే ఒలీవెరియాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో జరుగుతున్న అక్రమ దందాలను బయటపెట్టే ఉద్దేశంతో.. ఫిలిప్స్,పెరెయిరా విచారణ కోసం వెళ్లారు. అయితే జూన్ 5వ తేదీ నుంచి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫిలిప్స్ భార్య అలెస్సాండ్రా సంపాయో న్యాయం కోసం పోరాటానికి దిగారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు పెరిగింది. మిస్టరీని త్వరగా చేధించాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే.. ఆ ప్రాంతంలో ఇల్లీగల్ వ్యవహారాలకు కారణమయ్యే అమరిల్దోను అరెస్ట్ చేశారు. ఆపై అతన్ని, అతని సోదరుడైన ఒసెనేను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఇద్దరూ కూడా మత్స్యకారులనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిలిప్స్(57) గార్డియన్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ పత్రికలకు పని చేశారు. ఇక పెరెయిరా(41) ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త, న్యాయవాది. బ్రెజిల్ ఆదిమ తెగల వ్యవహారాల సంస్థలో పని చేస్తున్న ఆయన.. సెలవులు తీసుకుని మరీ ఫిలిప్స్ వెంట అమెజాన్ అడువుల్లోకి వెళ్లారు. బోల్సోనారో బలుపు వ్యాఖ్యలు ఇదిలా ఉంటే.. ఈ జంట హత్యల మీద బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ఆయన(ఫిలిప్స్‌ను ఉద్దేశించి)కు వేరే పని లేదేమో. ఏం దొరకనట్లు.. పర్యావరణ సంబంధిత కథనాలు, ఇల్లీగల్ మాఫియాల మీద స్టోరీలు రాశారు. యూరప్వాడు కదా! బహుశా అందుకే అక్కడి వాళ్లకు నచ్చక.. ఆయన్ని చంపి ఉంటారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రభుత్వం పని అడవుల్ని పరిరక్షించడం.. అక్కడి క్రిమినల్స్‌ను నియంత్రించడం కాదు అంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘ఒకవేళ వాళ్లిద్దరినీ చంపి ఉంటే.. కచ్చితంగా నీళ్లలో పడేసి ఉంటారు. ఆ నీళ్లలో పిరానా(రాక్షస చేపలు)లు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు’’ అంటూ తిక్క తిక్క ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు బోల్సోనారో. అమెజాన్ మీద పుస్తకం రాస్తున్న తరుణంలోనే ఫిలిప్స్ ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. ఇక పరెయిరాకు గతంలోనూ ఇల్లీగల్ మాఫియాల నుంచి బెదిరింపులు వచ్చాయి. అమెజాన్ అడవుల్లో ఇల్లీగల్ దందాలు, కార్యకలాపాలు జరుగుతున్నా.. ఆయా దేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రెజిల్ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. -
‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన
సాక్షి, వరంగల్: మీకు పెన్ ఉంటే మాకు గన్ ఉంది.. ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.. అంటూ ఓ సీఐ కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన ఓ టీవీ చానల్ రిపోర్టర్ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్ ఉంటే.. మా దగ్గర గన్ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చెయ్ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు. చదవండి: మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్! అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని టీయూడబ్ల్యూజే(హెచ్143) రాష్ట్ర నాయకుడు తడక రాజ్నారాయణగౌడ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు సామంతుల శ్యాం, క్యాతం సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. చదవండి: రంజాన్ మాసంలో.. ఇది తప్పనిసరి! ఫుల్ డిమాండ్ -
పోలీసుల అరాచకం.. జర్నలిస్టును అర్ధనగ్నంగా..
భోపాల్: జర్నలిస్టు సహా మరికొంత మందిని పోలీసు స్టేషన్లో అర్ధ నగ్నంగా నిలుచోబెట్టిన ఫొటో వైరల్ మారింది. ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాడనే నెపంతో పోలీసులు వారిని చితకబాది, బట్టలు విప్పించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా, అతని కుమారుడు గురుదత్ శుక్లాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారనే నెపంతో నీరజ్ కుందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌కు నిరసనగా, బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిరసనలకు దిగారు. ఈ నిరసనను కవర్ చేసేందుకు స్థాసని జర్నలిస్టు, యూ ట్యూబర్ కనిష్క తివారీ తన కెమెరామెన్తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిరసనకారులతో సహా జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో వారిని కొట్టి, దుర్భాషలాడారని, అర్ధ నగ్నంగా నిలుచోబెట్టారని తివారీ చెప్పారు. పోలీసులు తమను ఏప్రిల్ 2న రాత్రి 8 గంటలకు అదుపులోకి తీసుకొని ఏప్రిల్ 3 సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని తివారీ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఎమ్మెల్యేపై ఎందుకు కథనాలు రాస్తున్నారని ప్రశ్నించారని తెలిపాడు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు ఇచా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. పోలీసు స్టేషన్ వ్యవహారం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కాస్తా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన సీఎం.. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. -
మీ బ్రెయిన్‌ను ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నారు.. రిపోర్టర్లపై విరుచుకుపడ్డ స్టార్ హీరో
John Abraham Calls Journalists As Dumb In Attack 1 Movie Press Meet: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో జాన్ అబ్రహం ఆగ్రహానికి లోనై రిపోర్టర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ జాన్‌ను మీ సినిమాల్లో యాక్షన్ ఓవర్ డోస్ ఉంటుంది. మీరు నలుగురైదుగురితో పోరాడుతుంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం బైక్‌లను విసిరేయడం, మీ చేతులతో ఛాపర్లను ఆపడం వంటివి కొన్ని చూస్తే కొంచెం అతిగా అనిపిస్తూ ఉంటుంది. అని అన్నాడు. చదవండి: ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్ దీనికి కోపగించుకున్న జాన్ 'మీరు దేని గురించి మాట్లాడుతున్నారు' అని ఆ జర్నలిస్ట్‌ను అడగ్గా.. 'సత్యమేవ జయతే' గురించి అని అతను బదులిచ్చాడు. అందుకు జాన్ అబ్రహం 'నేను ఎటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు దీంతో ఏమైనా సమస్య ఉంటే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నిజంగా బాధపెట్టాను.' అని వెటకారంగా సమాధానమిచ్చాడు జాన్. అనంతరం ఫిట్నెస్ గురించి అడిగిన ప్రశ్నకు 'శారీరకంగా ఫిట్‌గా ఉండటం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తుంటాను. క్షమించండి సార్. మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు. మరోసారి బాగా ప్రయత్నించండి.' అంటూ వ్యంగంగా మాట్లాడాడు జాన్ అబ్రహం. చదవండి: అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్ -
చదవడమే మొదలు...
ఒకరోజు ఆన్ మోర్గాన్ తన బుక్‌షెల్ఫ్ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్ అమెరికన్ పుస్తకాలే. ఈ లండన్ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల! ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్ సెల్లర్స్... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది. అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్ బిట్వీన్ టు కవర్స్: రీడింగ్ ద గ్లోబ్’ పుస్తకంగా ప్రచురించింది. గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్ లైన్ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకంగా రాసింది లీ. ఇరాకు చెందిన ప్రొఫెసర్ అజర్ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్ లోలిటా ఇన్ తెహ్రాన్ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్ గాట్స్బీ(ఫిట్జ్‌గెరాల్డ్), ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్, ద ట్రయల్ (కాఫ్కా), ద అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్ (మార్క్ ట్వెయిన్ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్ లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే! పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్ లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు. ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్ మందలపర్తి కిశోర్ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా! ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది? -
రష్యా బలగాల అరాచకం.. దాడుల్లో జర్నలిస్టు మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. రష్యన్ బలగాలు బాంబులు, మిస్సైల్ అటాక్స్ చేస్తూ ఉక్రెయిన్ పౌరులను బలి తీసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా.. రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన జర్నలిస్టు బ్రెంట్ రెనౌడ్ మృతి చెందాడు. రష్యా దాడులపై ఉక్రెయిన్‌లో గ్రౌండ్ లెవల్లో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో అతడు మరణించినట్టు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. కాగా, బ్రెంట్.. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన జర్నలిస్టుగా అధికారులు గుర్తించారు. వారి కాల్పుల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రిని తరలించినట్టు సమాచారం. జర్నలిస్ట్ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యన్ బలగాల దాడులు కొనసాగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. #russians killed a documentarist Brent Renaud, working for @nytimes in #Ukraine. Those bastards open fire on journalists, doctors, pregnant women, children, civilians. This is the war against the whole civilized world. #StopPutin #NoFlyZoneOverUkraine pic.twitter.com/ECagNoH9dj — Inna Sovsun (@InnaSovsun) March 13, 2022 -
బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు తనను బెదిరించినట్లు సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సాహానే స్వయంగా ట్విటర్లో స్క్రీన్షాట్ల రూపంలో బయటపెట్టాడు. సాహా ట్వీట్ అనంతరం మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్‌లు అతనికి మద్దతుగా నిలిచి.. ఆ జర్నలిస్ట్ పేరు బయటికి చెప్పాల్సిందన్నారు. చదవండి: Saha-Journalist Row: ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..! కాగా సాహా ట్వీట్‌ను బీసీసీఐ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ విషయంలో సాహాను బీసీసీఐ వివరణ కోరనున్నట్లు బోర్డు ట్రెజరర్ అరుణ్ దుమాల్ పీటీఐతో తెలిపారు. ''సాహా చేసిన ట్వీట్ గురించి అతన్నే అడుగుదామనుకుంటున్నాం. అసలు అది నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సాహాకు నిజంగానే సదరు జర్నలిస్ట్ నుంచి బెదిరింపులు వచ్చాయా.. ట్వీట్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ కాంటెస్ట్ ఏముందనేది తెలుసుకోవాలి. ఇంతకుమించి తాను ఏం చెప్పలేను. సాహాతో బీసీసీఐ సెక్రటరీ మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటారని'' చెప్పుకొచ్చాడు. కాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. భారత జట్టులోకి మున్ముందు ఎంపిక చేసే అవకాశం లేదని, రిటైర్మెంట్ గురించి ఆలోచించాలంటూ సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ తనకు ఈ సమాచారం ఇచ్చాడంటూ సాహా బహిరంగపర్చాడు. చదవండి: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్ ప్లేయర్..’ సాహా వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందించాడు. తాను చేసిన సూచనలో తప్పేమీ లేదని, సాహా దానిని బయటపెట్టడం పట్ల కూడా తాను బాధపడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్ తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని, సాహాకు బదులుగా మరో యువ ఆటగాడిని రెండో కీపర్‌గా తీర్చి దిద్దాలనే ఉద్దేశం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్కు ఉందని అతను వివరించాడు. After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 -
అందరికీ చెప్పే పోలీసులే హెల్మెట్ పెట్టుకోలేదు.. ఇదేంటని అడిగితే.. ఏకంగా
My only fault was that I questioned That Two Cops Assaulted: జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. పైగా అధికార ప్రభుత్వానికి లేదా రాజకీయనాయకులకు వ్యతిరేకంగా రాసే పత్రికా సంస్థలు, జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతుంటాయో తెలిసిందే. ఇటీవలకాలంలో ఆ దాడులు మరింత ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడొక జర్నలిస్ట్ పోలీసులను కేవలం ప్రశ్నించినందుకు అతని పై అత్యంత అమానుషంగా దాడిచేశారు. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలోని జయంత్ దేబ్నాథ్ ఇద్దరు కానిస్టేబుళ్లని హెల్మట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. ప్రజలకు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని అన్నారు. అంతే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు దేబ్‌నాథ్‌పై కోపంతో దాడికి చేయడమే కాక బలవంతంగా జీపులో కూర్చోబెట్టేందుకు మరింతమంది పోలీసులను పిలవడం వంటివి చేశారు. పైగా తాను జర్నలిస్ట్‌ని అని చెప్పినందుకే మరింత దారుణంగా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో జర్నలిస్ట్ దేబ్నాథ్ మాట్లాడుతూ..." సమాజంలో శాంతి భద్రతలను సంరక్షించే పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించడం తప్పా. ఈ విషయమే నేను అస్సాం ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. నాపై దాడి చేసినవారిపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలి అని అస్సాం ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లాబా క్ర దేకా ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: లే.. నాన్నా.. లే!) -
మహిళా జర్నలిస్ట్‌పై కంగనా అసహనం.. ఎందుకంటే ?
Kangana Ranaut Lashes Out A Journalist And Said Sit Down: బాలీవుడ్ బ్యూటీ, డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అభిప్రాయాలు, కామెంట్లతో వైరల్‌గా మారుతుంది. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా హీరోయిన్గా, కాంట్రవర్సీ క్వీన్‌గా అలరించిన కంగనా తాజాగా హోస్ట్‌గా వ్యవహరించనుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్న రియాల్టీ షో 'లాక్ అప్'కు వ్యాఖ్యతగా సందడి చేయనుంది కంగనా. ఈ షో మరికొన్ని రోజుల్లో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల వేదికగా ప్రసారం కానుంది. అయితే ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం (జనవరి 3) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగనా జర్నలిస్ట్‌ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్ 'మేడమ్, ఈ మధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి కామెంట్స్‌తో టార్గెట్ చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటీ ?' అని అడిగారు. దీంతో 'చూడండి, ఎవరైతే తమను రక్షించుకోలేరో వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు (దీపికా పదుకొణె) ఆ సామర్థ్యం ఉంది. అయితే ఆమె సినిమాను నేను ఇక్కడ ప్రమోట్ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి.' అంటూ అసహనంగా సమాధానం ఇచ్చింది కంగనా రనౌత్. -
రిపోర్టర్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెసు
నిజామాబాద్‌అర్బన్: ‘సాక్షి’దినపత్రిక మాక్లూర్ విలేకరి కమలాపురం పోశెట్టిపై జరిగిన దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వార్తల సేకరణ కోసం వెళ్తుండగా మాక్లూర్ మండల రిపోర్టర్ పోశెట్టిపై ఈ నెల 13న వల్లభాపూర్ వద్ద ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, పోలీసుల వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టులు వరుస ఆందోళనలు చేపట్టారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి విన్నవించడంతో పాటు చలో మాక్లూర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. రిపోర్టర్‌పై దాడి ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఇందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిపోర్టర్ పోశెట్టి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, బ్రిలియంట్ స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు వివరించారు. దాడికి పాల్పడిన కె.సురేశ్, మహమ్మద్మోసిన్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి ప్రేరేపించిన మహేందర్, రంజిత్లపైనా కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. -
వార్తల్లో అభిప్రాయాలను జొప్పించొద్దు: సీజేఐ
ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్‌లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు. -
రెడ్డినాడు శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, రెడ్డినాడు మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వై.శ్రీనివాసరెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత రెండు నెలలుగా పెద్దపేగు, ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1985లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన ఆయన ఈనాడు, డెక్కన్ క్రానికల్, సమయం, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో దీర్ఘకాలం పనిచేశారు. రెడ్డినాడు అనే పత్రికను నెలకొల్పి రెడ్డినాడు శ్రీనివాస్‌గా గుర్తింపు పొందారు. మాజీమంత్రి మైసూరారెడ్డి వద్ద ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేశారు. శ్రీనివాస్‌రెడ్డి కోలుకోవడం కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24 యూనిట్ల రక్తాన్ని ఆయనకు దానం చేసింది. శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల పలువురు పాత్రికేయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఉత్తమ పాత్రికేయులకు హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులు, ఇతర సిబ్బందికి వచ్చే సంవత్సరం జనవరి 29న అవార్డులను అందజేయాల ని హై బిజ్ టీవీ సంస్థ నిర్ణయించింది. గచ్చి బౌలిలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ‘హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పాత్రికేయ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30కి పైగా కేటగిరీల్లో హైబిజ్ టీవీ అవార్డులను అందజేస్తామని సంస్థ ఎండీ మాడిశెట్టి రాజగోపాల్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిజంలో ఇంగ్లిష్, తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో పని చేస్తున్న పాత్రికేయులు, సిబ్బందిని సత్కరిస్తామని తెలిపారు. ప్రింట్ అడ్వర్టైజ్ మెంట్ (ఇంగ్లిష్, తెలుగు, ఇతర భాషలు), ప్రింట్ సర్క్యులేషన్ కేటగిరీల్లో కూడా నూతన ఆవిష్కరణల దిశగా సాగిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు www.hybiz.tv/ awards లింక్ ద్వారా నామినేషన్లను సమర్పించవచ్చన్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐ.వెంకట్ (డైరెక్టర్ – ఈనాడ్ఢు), అనిల్ కుమార్ (ఎక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్, టైమ్స్ ఆఫ్ ఇండియా), రంగారెడ్డి (ఎక్స్ రీజినల్ జనరల్ మేనేజర్ – ది హిందూ), సోమశేఖర్ (ఎక్స్ అసోసియేట్ ఎడిటర్, చీఫ్ బ్యూరో – ది హిందూ బిజినెస్ లైన్), సత్యనారాయణ (ఎక్స్ బిజినెస్ డైరెక్టర – ఇన్షియేటివ్ మీడియా), రమణ కుమార్ (మాజీ జనరల్ మేనేజర్, అడ్వర్టైజ్ మెంట్ – సాక్షి), మాడిశెట్టి రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022కు సంబంధించి ఇతర వివరాల కోసం 9666796622 నంబర్లో సంప్రదించవచ్చు. -
పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) శనివారం కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన.. కొంత కాలంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వినోద్ దువా మృతి చెందారని ఆయన కూతురు మల్లికా దువా సోషల్ మీడియాలో తెలిపారు. వినోద్ దువా.. ప్రముఖ హింది జర్నలిస్ట్. ఆయన.. దూరదర్శన్, ఎన్డీటీవి తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేశారు. ఆయన 42 సంవత్సరాలు జర్నలిజం రంగానికి సేవలందించారు. ఆయన జర్నలిజం విలువలు పాటించి, తనదైన మార్క్ చూయించారు. జర్నలిజంలో ఆయన చేసిన కృషికి గాను 1996లో రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఆయనే కావడం విశేషం. అదే విధంగా.. 2008లో కేంద్ర ప్రభుత్వం వినోద్ దువాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ముంబై ప్రెస్ క్లబ్ నుంచి రెడ్ ఇంక్ అవార్డును... మహరాష్ట్ర మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా అందుకున్నారు. దూరదర్శన్‌లో ‘పరాక్’ అనే కరెంట్ అఫైర్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. అదే విధంగా ఎన్డీటీవిలో ‘ఖబర్దార్ ఇండియా’, ‘వినోద్ దువా లైవ్’ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా పనిచేశారు. కాగా, వినోద్ దువా అంతిమ సంస్కారాలు ఆదివారం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
సూత్రధారి వివేకా అల్లుడే!
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొనగా.. నాలుగు రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అయితే, వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఒక పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న భరత్‌యాదవ్ ఆదివారం స్థానిక అర్ అండ్ బీ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ వివరాలన్నింటితో కూడిన లేఖను ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. భరత్‌యాదవ్ తన లేఖలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ముద్దాయి అయిన దస్తగిరి స్టేట్మెంట్ చూసి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. అందులో నా పేరు మీడియాలో రావడంతో తీవ్ర అవమానంగా భావిస్తున్నాను. దీంతో ఈ కింది విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నాను. వివేకానందరెడ్డిని 2019 మార్చి 14 రాత్రి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన విషయాలను సీబీఐ దృష్టికి తెచ్చింది నేనే. ఆ తర్వాత వాచ్‌మన్ రంగన్న ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా, మా తాతగారైన గోర్ల చెంచురెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల మా తాత మరణించాక నేను వివేకానందరెడ్డితో అప్పుడప్పుడు కలిసేవాడిని. నా స్థల వివాదం విషయమై 2019 జనవరిలో ఆయన్ను పలుమార్లు కలిసి వివరించాను. అయితే, ఆయన చూద్దాం చూద్దాం అంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పీఏగా చెప్పుకుంటూ తిరుగుతున్న సునీల్‌యాదవ్‌ను కలిసి నా సమస్యను వివేకా దృష్టికి తీసుకెళ్లాలని కోరాను. కానీ, సునీల్‌యాదవ్ కొంత మొత్తాన్ని ఆశించగా.. పంచాయతీ అయిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చాక ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత మార్చిలో మళ్లీ సునీల్‌ను కలిసి నా స్థల వివాదం విషయాన్ని సార్ (వివేకా)కు చెప్పమని అడగ్గా కచ్చితంగా చెబుతానన్నాడు. కానీ, ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. మర్నాడు ఉదయం నాకు వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త తెలిసింది. హత్య తర్వాత సునీల్ అనంతపురానికి.. ఆ తర్వాత సునీల్‌యాదవ్ ఇంటికి వెళ్లాను. అప్పుడు.. నీ విషయాన్ని సార్‌తో మాట్లాడాను.. పంచాయితీకి సంబంధించిన ఒరిజనల్ పేపర్లు 11 గంటలకు వస్తాయి.. ఇస్తానన్నాడు. సరేనని నేను 11గంటలకు వెళ్తే సునీల్‌యాదవ్ లేడు, అనంతపురం వెళ్లాడు, సాయంత్రం వస్తాడని అతని తల్లి చెప్పింది. ఆ తర్వాత సునీల్‌ను పోలీసులు అరెస్టుచేసినట్లు అతని తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి మా ఇంటికొచ్చి చెప్పారు. అలాగే, రూ.60 వేలు నగదు, కొన్ని పేపర్లు ఉంచమని ఇచ్చారు. వారికి అవసరం ఉన్నప్పుడల్లా తీసుకువెళ్లేవారు. అయితే, వివేకా హత్య విషయంలో ఏం జరుగుతుంది.. మా మీదకు వస్తుందేమోనని అనుమానం వ్యక్తంచేసేది. మరోవైపు.. వివేకా హత్య కేసులో సునీల్‌యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, కృష్ణారెడ్డిలను అరెస్టుచేసినట్లు వార్తలు వచ్చాయి. సునీల్యాదవ్పై అనుమానం పెరిగింది 25రోజుల తరువాత సునీల్‌యాదవ్ ఇంటికి వచ్చాక అతనిని చూడటానికి వెళ్లాను. సునీల్‌యాదవ్ నడవలేని పరిస్థితిలో గాయాలతో ఉన్నాడు. పోలీసులకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వచ్చానన్నాడు. ఎందుకంటే.. డబ్బుకోసం ప్రాణాలకు తెగించి ఇదంతా చేశామని. మా దేవుడు కావల్సినన్ని డబ్బులు ఇచ్చాడన్నాడు. దేవుడు ఎవరంటే వైఎస్ వివేకానందరెడ్డి అని చెప్పాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ, నాకు అతనిపై అనుమానం ఎక్కువైంది. ఆ తర్వాత సునీల్‌యాదవ్‌ను పోలీసులు మళ్లీ మళ్లీ తీసుకెళ్లేవారు. దీంతో.. పోలీసులు రాకుండా ఉండేందుకు సునీల్‌యాదవ్ పెళ్లి దగ్గరుండి జరిపించాను. వివాహ ఖర్చులకు రూ.3.30 లక్షలు అప్పుగా ఇచ్చాను. ఈ మొత్తాన్ని నాలుగు నెలల్లో ఇస్తానని చెప్పినప్పటికీ ఇవ్వలేదు. పైగా ఎర్ర గంగిరెడ్డి మాకు ఇస్తాడు.. అవి రాగానే ఇస్తామంటూ మరో లక్ష తీసుకున్నారు. ఆ తర్వాత.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సునీల్‌యాదవ్‌ను మోసం చేశారంటూ మళ్లీ డబ్బు అడిగారు. దీంతో మీరు ఏదో తప్పుచేస్తున్నారని నేను గట్టిగా ప్రశ్నించాను. వివేకా హత్య కేసు తేలేవరకూ డబ్బులు ఇవ్వబోమని వారంటున్నారని సునీల్‌యాదవ్ చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నిన్ను, నన్ను చంపుతారేమోనన్నాడు. మొత్తం మీద నేను రూ.16.50 లక్షలు సునీల్‌కు ఇచ్చాను. వివేక హత్య వెనుక నర్రెడ్డి, గంగిరెడ్డి! ప్రతీసారి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పేర్లు వాడుతుండడంతో వివేకా హత్య వెనుక వీరున్నారని నాకు పూర్తిగా అర్ధమైంది. ఎందుకు ఈ పనిచేశారని సునీల్‌యాదవ్‌ను అడిగితే.. వివేకా మాకు చాలా అన్యాయం చేశారని.. బయటనుండి ఏదో డబ్బు వస్తే మా వాటా ఇవ్వనని అనడంతో ఈ పనిచేశామని చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పనిచేశామన్నాడు. నేను డబ్బులు అడుగుతున్న ప్రతిసారీ వివేకానే చంపాం.. నిన్ను కూడా క్షణంలో చంపుతామని హెచ్చరిస్తూ రెండుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివేకా హత్యకు ప్రధాన కారణం డబ్బులు, సెక్స్ అని కూడా సునీల్‌యాదవ్ చెప్పాడు. ప్రతి పనికీ మమ్మల్ని వాడుకుని డబ్బులు వచ్చిన తరువాత అందులో సగం పూర్తిగా తన సన్నిహితురాలైన షమీమ్‌కు ఇవ్వాలని వివేకా చెప్పేవారన్నాడు. వివేకా తన ఆస్తులను షమీమ్‌కు బదలాయిస్తున్నారనే విషయంపై నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వివేకా తరచూ గొడవ పడేవారని సునీల్‌యాదవ్ చెప్పేవాడు. ఇలా వివేకా హత్యకు కుటుంబ, ఆస్తి తగాదాలు కారణమని.. ఈ విషయం ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేక ఈ పనిచేసినట్లు సునీల్‌యాదవ్ చెప్పాడు. చివరికి.. నా డబ్బులు ఇవ్వకుండా నన్ను కూడా చంపుతామని చాలాసార్లు బెదిరించాడు. దస్తగిరి ఖాతాలో సీబీఐ డబ్బులు జమ నన్ను సీబీఐ వారు పిలిచినçప్పుడు.. ఈ విషయాలన్నీ వారికి చెప్పాను. ఈ మధ్య దస్తగిరిని కలువగా.. భరతన్న నీకు ఏమీ తెలీదు, నాకు సీబీఐ వారు కోటి రూపాయలు ఇస్తామన్నారు, నువ్వు సైలెంట్‌గా ఉండకపోతే నిన్ను కూడా వారు ఏమైనా చేస్తారు అన్నాడు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ తన అకౌంట్లో రూ.75వేలు జమచేసినట్లు కూడా దస్తగిరి తెలిపాడు. ఇదంతా చూస్తుంటే.. పైన పేర్కొన్న పెద్ద మనుషులే దస్తగిరితో కావాలని ఇవ్వన్ని చేయిస్తున్నారని మా పత్రికల వారంతా అంటున్నారు. నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన సీబీఐ వివేకా కుమార్తె సునీత చెప్పినట్లు నడవడం విడ్డూరంగా ఉందని కూడా వారు అంటున్నారు. అలాగే, మేమంతా ఒక్కటే.. నిన్ను ఏంచేస్తామో చూడు అని సీబీఐ డీఎస్పీ దీపక్ సారు సమక్షంలోనే సునీల్‌యాదవ్ నాతో అన్నాడు. సునీతమ్మకు ఇవన్నీ చెప్పాలని ప్రయత్నించినా నన్ను కలవడానికి అవకాశమివ్వలేదు. సునీల్‌యాదవ్ గురించి పూర్తిగా తెలుసుకుని సీబీఐ వారికి విన్నవించాను. ఇక సీబీఐ విచారణ తర్వాత నుంచి దస్తగిరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకు డబ్బులు ఎవరిస్తే వారికే అనుకూలంగా మాట్లాడతానని నాతో చెప్పేవాడు. దస్తగిరి, సునీల్‌లను సీబీఐ వారు ఢిల్లీకి పిలిపించినప్పుడు.. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని వారిద్దరూ చెప్పినట్లు నాతో దస్తగిరి అన్నాడు. దస్తగిరి భార్య కూడా ఇలాగే అనడం నాకు ఆశ్చర్యం కలిగించింది. వాస్తవ విషయాలన్నీ దస్తగిరికి, అతని భార్యకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా అసలైన వారిని గుర్తించి విచారణ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకూ చావు తప్పదని బెదిరించారు నాకు రావల్సిన డబ్బుల విషయాన్ని ఎర్ర గంగిరెడ్డిని అడిగాను. దీంతో.. సునీల్‌ను ఇబ్బంది పెట్టొద్దు.. మాకు ఓ సెటిల్మెంట్ డబ్బులు రావాలి, అవి రాగానే అన్నీ ఇస్తామన్నారు. మళ్లీ సునీల్‌యాదవ్ నా వద్దకు వచ్చి.. నన్ను డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టొద్దు.. నా వెనకాల చాలా పెద్దమనిషి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నాడని గట్టిగా చెప్పాడు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు నీకు కూడా చావు తప్పదని నన్ను బెదిరించసాగాడు. -
యువ జర్నలిస్టు దారుణ హత్య!
పట్నా: బీహార్ రాష్ట్రంలోని మధుబనీ జిల్లాలో నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన యువ జర్నలిస్టు, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కార్యకర్త బుద్ధినాథ్ ఝ అలియాస్ అవినాశ్ ఝ(22) శుక్రవారం సాయంత్రం శవమై కనిపించాడు. బుద్ధినాథ్ ఝ స్థానిక న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. నకిలీ ఆస్పత్రుల పేర్లను ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అధికారులు సదరు అస్పత్రులను మూసివేశారు.కొన్నింటికీ జరిమాన విధించారు. ఈ నేపథ్యంలో బుద్ధినాథ్ ఝను నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే శుక్రవారం సగం కాలినస్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. -
మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి..
కోల్‌కతా: రోడ్ల పై ఒంటరి మహిళలు కనపడితే కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని వేధిస్తుంటారు. ఈ తరహాలోనే ఓ మహిళా జర్నలిస్టును క్యాబ్ డ్రైవర్ వేధించడమే గాక తన స్నేహితురాలిపై దాడి చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బెహలాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ టీవీ న్యూస్ ఛానెల్లో పనిచేస్తున్న మహిళ, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని తన కార్యాలయం నుంచి స్కూటర్‌పై స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా సత్యన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందీ. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ గురువారం రాత్రి మహిళను రోడ్డుపైకి నెట్టడానికి తన స్కూటర్‌ను పలుమార్లు ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. చివరకు అతని ఆగడాలను భరించలేక ఆమె సత్యేన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద తన స్కూటర్‌ను ఆపి అతన్ని వారించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేసి వేధించడమే గాక ఆమె స్నేహితురాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతని వాహనాన్ని ఫోటో తీసుకుని బెహలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. చదవండి: పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు.. -
అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష
మయన్మార్: మయన్మార్ జుంటా కోర్టు అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్‌స్టర్‌కు చట్టవిరుద్ధమైన పనులు, మిలిటరీని రెచ్చగొట్టేల చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో 11 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మయన్మార్ మిలటరీ బలాగాలు తిరుగాబాటు ధోరణితో డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రెస్‌ని అణిచివేస్తుందన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే డానీ ఫెన్స్టర్ స్థానిక మయన్మార్‌లోని అవుట్లెట్ ఫ్రాంటియర్ పత్రికలో ఒక ఏడాది నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబాన్ని చూడటానికై దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మయన్మార్ మిలటరీ అతన్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఫ్రాంటియర్ పత్రిక తమ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసిన డానీ ఫెన్స్టర్ను ఇలా మూడు ఆరోపణలతో దోషిగా నిర్ధారించి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫెన్స్టర్ నిర్భందించినప్పటి నుంచి జీవితాంతం జైలు శిక్ష విధించేలా దేశద్రోహం, తీవ్రవాదం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడంటూ పేర్కొంది. అంతేకాదు తాము ఫెన్స్టర్ వీలైనంత త్వరగా విడుదలై తమ కుటుంబాన్ని చూడటానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఫ్రాంటియర్ మయన్మార్ తెలిపింది. ఈ మేరకు క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ హార్సీ మిలటరీ చేస్తున్న ఈ పనిని "దౌర్జన్యం"గా అభివర్ణించారు. ఈ సంఘటన వాస్తవిక పరిస్థితులు గురించి వివరిస్తే ఇలానే చాలా ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుందనేలా అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రమే కాక మయన్మార్ జర్నలిస్టులకు కూడా పరోక్షంగా సందేశాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ఫెన్స్టర్ని విడుదల చేసేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ పేర్కొన్నారు. ఈ సమస్య కచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతుందంటూ రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!) -
చావుబతుకుల్లో ఆమె.. చైనాపై ఒత్తిడి పెంచండి
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన చైనా సిటిజన్ జర్నలిస్ట్ జాంగ్ జాన్.. చావుబతుకుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. న్యాయవాదిగా పనిచేసిన 38 ఏళ్ల జాంగ్ జాన్.. గతేడాది ఫిబ్రవరిలో వుహాన్ వెళ్లారు. కరోనా వ్యాప్తి గురించి అక్కడి అధికారులను నిలదీశారు. తన స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిన ఈ వీడియోలు బయటకు రావడంతో గత సంవత్సరం మే నెలలో ఆమెను అరెస్ట్ చేశారు. ఘర్షణలు రేకెత్తించడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అసమ్మతి వాదులను అణచివేసేందుకు చైనాలో సాధారణంగా ఇలాంటి అభియోగాలు మోపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. జైల్లో నిరాహారదీక్ష కాగా, షాంఘై జైలులో జాంగ్ జాన్.. నిరాహారదీక్షకు దిగినట్టు ఆమె తరపు న్యాయబృందం ఈ సంవత్సరం ప్రారంభంలో వెల్లడించింది. నాసికా రంధ్రాల ద్వారా బలవంతంగా ఆమెకు ఆహారం అందిస్తున్నారని, జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని ‘ఏఎఫ్‌పీ’ వార్తా సంస్థకు న్యాయబృందం తెలిపింది. ఎక్కువ కాలం బతక్కపోవచ్చు ‘ఆమె ఇప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంది. ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. చలికాలంలో ఆమె జీవించడం కష్టం. తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని ఆమె రాసిన ఉత్తరాల్లో కోరాను. తాను నమ్మిన దేవుడు, విశ్వాసాలను తప్పా మిగతా వాటిని నా సోదరి లెక్కచేయద’ని ఆమె సోదరుడు జాంగ్ జు గత వారం ట్విటర్లో పేర్కొన్నారు. అవమానకర దాడి జాంగ్ జాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అవసరమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ గురువారం చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాంగ్ జాన్ అరెస్ట్‌ను ‘మానవ హక్కులపై అవమానకర దాడి’గా అమ్నెస్టీ ప్రచారకర్త గ్వెన్ లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. (చదవండి: చైనా దుశ్చర్య: అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్ల నిర్మాణం) సమాధానం లేదు షాంఘై మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జాంగ్‌ను కలిసేందుకు మూడు వారాల క్రితం కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అధికారుల నుంచి స్పందన రాలేదని పేరు వెల్లడించడానికి భయపడిన ఆమె సన్నిహితుడొకరు ‘ఏఎఫ్‌పీ’కి చెప్పారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జాంగ్ తల్లి నిరాకరించారని.. షాంఘై జైలు నుంచి కూడా సమాధానం రాలేదని ‘ఏఎఫ్‌పీ’తెలిపింది. చైనా వ్యతిరేక రాజకీయ కుట్ర జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే ఆమె విడుదల కోసం మానవ హక్కుల సంఘాలు చేస్తున్న ప్రయత్నాలను ‘చైనా వ్యతిరేక రాజకీయ కుట్రలు’గా వర్ణించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్షకు గురికాక తప్పదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. (చదవండి: మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) చైనాపై ఒత్తిడి తేవాలి జాంగ్ జాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మరొకరి సహాయం కూడా ఆమె నడవలేకపోతున్నారని, కనీసం తల కూడా కదపలేకపోతున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) వెల్లడించింది. పరిస్థితి మరింత విషమించక ముందే చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చి జాంగ్ జాన్‌ను విడుదలయ్యేలా చూడాలని ఆర్ఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది. కాగా, వుహాన్‌లో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన మరో ముగ్గురు పౌర పాత్రికేయులు చెన్ క్యుషి, ఫాంగ్ బిన్, లి జెహువా కూడా నిర్బంధానికి గురయ్యారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) -
సీనియర్ పాత్రికేయుడు పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన పిళ్లా వెంకటేశ్వరరావు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 1980లలో ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. విప్లవోద్యమంలో అధ్యాపకుడిగా, ఉద్యమ నిర్మాణ కర్తగా ఏళ్లపాటు పనిచేశారు. 2004 ఎన్నికల సమయంలో లొంగిపోయి సాధారణ జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత పత్రికారంగంలో చురుగ్గా పనిచేశారు. ‘సాక్షి’పత్రికలో పదేళ్లపాటు సేవలందించారు. ఈ దశాబ్ద కాలంలో పత్రికారచనలో తనదైన ముద్ర వేశారు. తర్వాత కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బందులు పడి పాత్రికేయ వృత్తికి కూడా దూరమయ్యారు. చదవండి: వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు -
ఐదున్నర గంటల పాటు తీన్మార్ మల్లన్న విచారణ
సాక్షి, చిలకలగూడ( హైదరాబాద్): క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురువారం చిలకలగూడ పోలీసుస్టేషన్లో హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లన్న ఠాణాకు వచ్చారు. పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కోణాల్లో ఆయనను విచారించారు. ఆదివారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తనను తీన్మార్ మల్లన్నబ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించాడని, డబ్బు డిమాండ్ చేశాడని సీతాఫల్‌మండికి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్‌శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణకు మల్లన్న గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. మహంకాళి ఏసీపీ రమేష్ నేతృత్వంలో చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ విచారించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ..న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అన్నారు. -
మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’
కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి. ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే. కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు. సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. – నాగవర్ధన్ రాయల జర్నలిస్ట్ -
చెత్తను పడేయకండి.. పచ్చగా వాడుకోండి
పొద్దున విజిల్ సౌండ్ వినిపించగానే ‘అదిగో బండొచ్చింది’ అని ఇంట్లోని వంటగది వ్యర్థాలను (కిచెన్వేస్ట్) తీసుకొని పరుగులు తీస్తాం. మున్సిపాలిటి బండిలో మన చెత్త పడగానే ‘హమ్మయ్య... ఇవ్వాటికో పని అయిపోయింది’ అనుకుంటాం. ‘కాస్త ఆగండి. ఎప్పుడైనా ఒకసారి మీ ఇంట్లోని చెత్తను పరిశీలనగా చూడండి. ఆ చెత్త ఏదో చెప్పబోతున్నట్లుగానే కనిపిస్తుంది కదా! నన్ను బండిలో పారేసి చేతులు దులుపుకోకండి. దయచేసి నన్ను వాడుకోండి. పచ్చగా జీవించండి..అని మనకు చెబుతుంది చెత్త’ అంటున్నారు సవిత హిర్మట్. బెంగళూరుకు చెందిన ఈ జర్నలిస్ట్ ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మెనేజ్మెంట్’ను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సవిత తల్లి క్యాన్సర్‌తో చనిపోయారు. తల్లి జ్ఞాపకాలు రోజూ ఆమెను పలకరిస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం....వంటగది వ్యర్థాలను ఆమె బయట పారేసేవారు కాదు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి పెద్దగా అవగాహనలేని ఆ రోజుల్లోనే ఆమె కంపోస్ట్ తయారు చేసేవారు. దీనితో మొక్కల పెంపకం, కూరగాయలు పండించడం చేసేవారు. తల్లి బాటలో నడవాలనుకున్నారు సవిత. ఇది తనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావించారు.‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్’ గురించి రెండు సంవత్సరాలు అధ్యయనం చేశారు. అయితే అంతర్జాల సమాచారం మనదేశ పరిస్థితులకు కుదరదు అనే విషయం అర్థమై ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు.తాను తెలుసుకున్న విషయాలను సమాజంతో పంచుకోవాలన్న నిర్ణయంలో భాగంగా ఇరుగుపొరుగు వారితో కలిసి జీరో–వేస్ట్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశారు. దేశ, విదేశ నిపుణులతో మాట్లాడి సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్లాగింగ్ చేస్తున్నారు. తన పరిశోధన సారాంశాన్ని ‘ఎండ్లెస్ గ్రీన్’ పేరుతో పుస్తకంగా రాశారు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన వ్యవహారంలా కాకుండా నైతిక ఉద్యమం స్థాయిలో చూస్తున్నారు సవిత.‘మన దేశంలో లక్షలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 70 నుంచి 80 శాతం మంది వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినా కాలుష్యాన్ని ఎంతో కొంత కట్టడి చేయవచ్చు. మన ఇంటి నుంచే మొదలవ్వాలి... అని ఎవరికి వారు అనుకుంటే అది ఉద్యమస్థాయికి చేరుతుంది’ అంటున్నారు సవిత. ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీ ఖరీదైన వ్యవహారమేమీ కాదు. పెద్దగా సమయం కూడా తీసుకోదు. మన ఇంట్లోనే ఏదో మూల వృథాగా పడి ఉన్న బకెట్ చాలు. కంపోస్ట్‌కు వాడే పదార్థాలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. పైగా ఇదొక రిలాక్సేషన్ ప్రక్రియ...’ ‘కొబ్బరి చిప్పలు కంపోస్ట్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది’‘పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 60 నుంచి 65 శాతం కిచెన్వేస్ట్ పోగవుతుంది’‘పదివేల సంవత్సరాల క్రితమే ఇరాన్లో, ఆరువేల సంవత్సరాల క్రితం చైనా,జపాన్లలో సేంద్రియ పద్ధతుల మూలాలు ఉన్నాయి’‘ఇప్పటికీ మన దేశంలో ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో ఆహారవ్యర్థాలను కంపోస్ట్ చేసే ప్రాచీన పద్దతులను అనుసరిస్తున్నారు. ఉదా: గొయ్యి తవ్వి వ్యర్థాలు పాతి పెట్టడం’... ఒక్కటా రెండా... సవిత గొంతు విప్పితే గలగమని ఎన్నో ఉపయోగకరమైన విషయాలు వరుస కడతాయి. ఒక మూల బిక్కముఖం వేసుకొని కనిపించే అన్వాంటెడ్ వేస్ట్, హైలీ న్యూట్రీషియన్ కంపోస్ట్‌గా మారే అద్భుతాన్ని ఆమె మాటల్లో దర్శించవచ్చు. -
ఇంట్లో శ్రీమతి.. ఓయోలో ఆయన.. మరి దొంగోడు??
వివాహేతర సంబంధాన్ని భార్యకు తెలియకుండా కప్పిపెట్టాలన్న ఆ భర్త ప్రయత్నం బెడిసికొట్టిందా?. మామూలుగా దొరికి ఉంటే భార్య ఒక్కదాని దగ్గరే బుక్ అయిపోయేవాడేమో. కానీ, దొంగతనం డ్రామా ఆడడం.. ఆపై పోలీసులను లాగిన కూపితో అసలు దొంగ బయటపడ్డాడు. దీంతో నిన్నంతా సోషల్ మీడియాలో ప్రముఖ హిందీ జర్నలిస్ట్ అతుల్ అగర్వాల్ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. న్యూఢిల్లీ: నొయిడా(యూపీ) కేంద్రంగా నడిచే హిందీ ఖబర్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అతుల్ అగర్వాల్.. వారం క్రితం(జూన్ 19 అర్ధరాత్రి) తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. ఆయుధాలతో వచ్చిన కొందరు తనను అడ్డగించి.. బెదిరించి ఐదు వేల రూపాయలు లాక్కున్నారని, చంపేస్తారనే భయంతో బతిమాలుకోగా వదిలేశారని, ఆ క్షణం బిడ్డను తల్చుకుని ఎంతో భయపడ్డానని.. ఇలా తన భావాలన్నింటిని కలగలిపి పెద్ద పోస్టుతో ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. అయితే ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కావడంతో ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటోగా నొయిడా పోలీసులు దారిదొపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురు ఆఫీసర్లు మొత్తం ఆయన తిరిగే రూట్లలో జల్లెడ పట్టి.. సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను,ఆధారాలను సంపాదించారు. ఇక్కడే అతుల్ అడ్డంగా దొరికిపోయాడు. Noida police claim journalist Atul Agarwal had make false allegation of loot in Greater Noida west. There were several contradictions in statement, which has been proven thru electronic records.@CP_Noida @noidapolice pic.twitter.com/nmFAXpff25 — priyanktripathi (@priyanktripathi) June 25, 2021 గర్ల్‌ఫ్రెండ్ ఇంటి నుంచి ఓయోకి.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొపిడీ జరిగిందని చెప్పిన రోజు సాయంత్రం స్టూడియో నుంచి సరాసరి ఏడు గంటలకు తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు అతుల్. సుమారు నాలుగు గంటల తర్వాత ఆయన భార్య(చిత్ర) నుంచి ఫోన్ కాల్ రావడంతో హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే నేరుగా ఆయన ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి.. ఓయో రూమ్ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. పనిలో పనిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓయో రూంకి డబ్బులు చెల్లించి.. ఆ రాత్రి అక్కడే గడిపాడు. ఆ హోటల్ సీసీ ఫుటేజీలో ఆయన వెళ్తున్న దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వ్యక్తిగత కారణాలతోనో, కుటుంబానికి భయపడో ఆయన అబద్ధం చెప్పి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నొయిడా పోలీసులు ఆయన ఫిర్యాదు ఉత్తదేనని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు. వహ్.. అతుల్‌జీ ఇక అతుల్ గుప్తా ఓయో వ్యవహారంపై సోషల్ మీడియాలో నిన్నంతా రచ్చ రచ్చ చర్చ నడిచింది. అతుల్ అల్లిన కథను ‘పతీ పత్నీ ఔర్ వో’ కథగా పోలుస్తూ జోకులు పేల్చారు. అతుల్ గుప్తా భార్య చిత్ర త్రిపాఠి కూడా జర్నలిస్ట్. ఆమె ఆజ్‌తక్ ఛానెల్లో యాంకర్. దీంతో ఈ యవ్వారం మధ్యలోకి ఆమెను కూడా లాగారు. సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులతో మొత్తానికి అతుల్‌ను ఒక ఆట ఆడుకున్నారు. Vichitra Madam - Chellam sir, Where is #AtulAgarwal ? Chellam sir - He is in OYO. 😍🥰 pic.twitter.com/jHbzLiDCSA — किडे गुरजी 🕉🤝☪️ (@MARATHIKUNAL) June 25, 2021 #AtulAgarwal is one of from Dalal lobby Of sold media..😏#ChitraTripathi Reaction After His Good Performance ..😜 pic.twitter.com/HS34NGg4us — Kunal (@TheNameIzzKunal) June 26, 2021 On this Love Story No Caption needed: #AtulAgarwal with #ChitraTripathi on #Chitra pic.twitter.com/6vjhFkgHAM — Jazon🇮🇳 (@Jkhr29) June 26, 2021 చదవండి: జీతాల్లివ్వట్లేదని యాంకర్ గోడు.. లైవ్ ద్వారా వైరల్ -
కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు
నాంపల్లి (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు కోవిడ్‌తో మృతి చెందారని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల రూపాయల పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో పదవ తరగతి లోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుందని వివరించారు. మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని కోరారు -
శ్రీకాంత్ ఫ్రమ్ సీఎం పేషీ.. బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?
సాక్షి, హైదరాబాద్: ‘నేను ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీకాంత్ రావును, బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?’ అంటూ ఎర వేసి, అందినకాడికి దండుకుని పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి బారినపడిన వారిలో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా, ఇందుర్తికి చెందిన బి.కమల్ కృష్ణ గౌడ్ బీకాం మధ్యలో ఆపేశాడు. ఆపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో రిపోర్టర్‌గా పని చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ముఖ్యమంత్రి పేషీ కార్యదర్శి అవతారం ఎత్తాడు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సంగ్రహించిన అతను బీసీ కమిషన్‌తో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఫోన్లు చేశాడు. పలువురి నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. ఇతగాడిపై గోపాలపురంతో పాటు జవహర్‌నగర్ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం సోమవారం అతడిని అరెస్టు చేసింది. పవర్ ప్లాంట్ పనుల నిలిపివేత దుండిగల్: దుండిగల్ తండా సమీపంలో చేపట్టిన రాంకీ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు నిలిపి వేశారు. పవర్ ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ దుండిగల్ కమిషనర్ భోగీశ్వర్లు నేతృత్వంలో సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బంది జేసీబీతో బేస్మెంట్, పిల్లర్లను కూల్చివేయించారు. -
జిల్లా జైలునుంచి జర్నలిస్టు రఘు విడుదల
సాక్షి, నల్లగొండ: ఇటీవల అరెస్ట్ అయిన జర్నలిస్టు రఘు మంగళవారం నల్లగొండ జిల్లా జైలునుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వేనంబర్‌లో గల భూమి విషయంలో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్రలో జరిగిన వివాదంలో అక్కడి పోలీసులు జర్నలిస్టు రఘును ఈ నెల 3న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతనికి సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదలకాగా, కాంగ్రెస్, బీజేపీ నాయకులు జైలు వద్ద స్వాగతం పలికారు. అక్రమంగా తనను అరెస్టు చేశారని, కనీసం నా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని రఘు ఆరోపించారు. చదవండి: నేడు నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన -
నిన్ననే ప్రాణభయం అన్నాడు.. గంటల వ్యవధిలో శవమై కనిపించాడు
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మాఫియాపై సంచలన కథనాలను అందించిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది.తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు సులాబ్ శ్రీవాస్తవ (42) పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24గంటల్లోనే ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అయితే పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంలోనే శ్రీవాస్తవ చనిపోయినట్టు భావిస్తున్నారు. శ్రీవాస్తవ ఆదివారం రాత్రి 11 గంటలకు విధులను ముగించుకుఒని బైక్‌పై ఇంటికివస్తుండగా, దుండగులు అతనిపై ఎటాక్ చేశారు. తీవ్రంగా కొట్టి, ఒంటిపై బట్టలను దాదాపు తీసేసి రోడ్డుపక్కన ఒదిలేసి పోయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. శ్రీవాస్తవ బైక్‌పై నుంచి కిందికి పడి, తలకు దెబ్బ తగిలడంతొ చనిపోయారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అపస్మారక స్థితిలో శ్రీవాస్తవను గుర్తించిన స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తరలించారనీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి సురేంద్ర ద్వివేది ప్రకటించారు. ఇతర కోణాలనుకూడా పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, యూపీ యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. అలీఆగర్‌నుంచి ప్రతాప్ఘర్వరకు మద్యం మాఫియా వేళ్లూనుకొందని విమర్శించారు. నిజాలను బయటపెడుతున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతోంటే.. ప్రభుత్వం నిద్రపోతోందంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. కాగా జిల్లాలోని మద్యం మాఫియాకు వ్యతిరేకంగా జూన్ 9న సంచలన కథనాన్ని ప్రసారం చేసినప్పటినుంచి తనకు బెదిరింపు లొస్తున్నాయని, తన ప్రాణభయం ఉందంటూ సీనియర్ పోలీసు అధికారికి లేఖ రాశారు. దీంతో తాను, తన కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోందని, రక్షణ కల్సించాలని శ్రీవాస్తవ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈలేఖను ధృవీకరించిన సీనియర్ పోలీసు అధికారి దీనిపై విచారణ నిమిత్తం స్థానిక అధికారులకు సూచించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీవాస్తవ మృతి భయాందోళన రేపింది. शराब माफिया अलीगढ़ से प्रतापगढ़ तक:पूरे प्रदेश में मौत का तांडव करें। उप्र सरकार चुप। पत्रकार सच्चाई उजागर करे, प्रशासन को खतरे के प्रति आगाह करे। सरकार सोई है। क्या जंगलराज को पालने-पोषने वाली उप्र सरकार के पास पत्रकार सुलभ श्रीवास्तव जी के परिजनों के आंसुओं का कोई जवाब है? — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 14, 2021 -
రఘుపై ఉన్న కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టు రఘుపై నమోదైన కేసుల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఈనెల 14లోగా ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో రఘుపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పేలా ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య గంజి లక్ష్మీ ప్రవీణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఒక కేసులో బెయిల్ తీసుకుంటే మరో కేసులో ఆయన అరెస్టును చూపించి ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసుల వివరాలను తెలియజేస్తే బెయిల్ కోసం ఆయా కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. కేసుల వివరాలివ్వాలని వినతిపత్రం సమర్పిస్తే ఇస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈనెల 14లోగా రఘుపై ఎక్కడెక్కడ కేసులు నమోదు చేసింది తెలియజేయాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 16కు వాయిదావేశారు. చదవండి: చేతబడి కలకలం: ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం! -
సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ
ముంబై: కెరీర్ ఆసాంతం ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని భార్య అంజలీ టెండూల్కర్ వెల్లడించింది. వీరి జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 26 వసంతాలు పూర్తైన సందర్బంగా ఆమె సచిన్ ను గూర్చిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఆన్ ఫీల్డ్ బౌలర్లను గడగడలాడించే సచిన్ .. మైదానం వెలుపల మాత్రం మహా సిగ్గరి అని, అతను చాలా సున్నిత మనస్కుడని, అనవసరంగా ఎవరితో మాట కలపడని పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె.. సచిన్ తో 26 ఏళ్ల బంధాన్ని నెమరేసుకుంది. తాము మొట్టమొదటిసారి ఎయిర్ పోర్టులో కలిసామని, తమ పరిచయం ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా బలపడిందని చెప్పుకొచ్చింది. అయితే, సచిన్.. తనను మొదటిసారి అతని తల్లిదండ్రులకు ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని, నన్ను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కసరత్తులే చేశాడని గుర్తు చేసుకుని నవ్వుకుంది. తమ పరిచయమైనా తొలినాళ్లలో ఇప్పటిలా ఇంటర్నెట్,. సోషల్ మీడియా సదుపాయాలు లేవని, ఫోన్లు ఉన్నప్పటికీ.. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవారిమని తెలిపింది. కాగా సచిన్, అంజలీల వివాహం 1995లో జరిగింది. వీరికి అర్జున్, సారా అనే ఇద్దరు సంతానం. కొడుకు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన కోహ్లి దంపతులు .. -
జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సమావేశాలను జూమ్‌లో, విద్యార్థులకు చదువులు ఆన్లైన్లో..ఇలా ప్రతీది ఆన్లైన్ బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు జరుపుతుండగా...జర్నలిస్టుల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను సీజేఐ జస్టీస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. యాప్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీం కోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ అన్నారు. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. ( చదవండి: కోవిడ్ మరణాల్లో మరో రికార్డు ) Breaking: Supreme Court to launch app that will provide links for virtual hearings to media persons#SupremeCourt #VirtualHearings #media https://t.co/xoFpobyCOo pic.twitter.com/I2CKKneZto — Bar & Bench (@barandbench) May 13, 2021 -
TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ మృతి పట్ల సినీ ఇండస్ర్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఇక పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్లో ప్రశ్నలడిగేవారు టీఎన్ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన. రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. అంతేకాదు టీఎన్ఆర్ షో ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అనేంతగా సాగుతోంది ఆయన షో. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన. ఇక లాక్డౌన్ సమయంలో స్టే హోం చాలెంజ్‌ను స్వీకరించిన కరోనా పట్ల భయపకుండా జాగ్రత్తలు పాటించాలని టీఎన్ఆర్ సూచించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'నా ప్రేమకే సెలవు..నా దారికే సెలవు' అంటూ పాడిన పాట నెట్టింట వైరలవుతోంది. 'ఈ శూన్యం నా గమ్యం..ఈ జన్మకే సెలవు'..అంటూ సాగే టీఎన్ఆర్ పాడిన ఈ పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విచారం వ్యక్తం చేశారు. చదవండి : TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది.. -
TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్
ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ప్రార్థించారు. ఇక కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(మే10)న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్' అనే షోతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టీఎన్ఆర్ ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వేదికగా రామ్ గోపాల్ వర్మ, తేజ సహా ఎంతోమంది సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఒక్కోసారి 4 గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. 1992లో దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న టీఎన్ఆర్ ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్’ చిత్రానికి సైతం స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత నటుడిగానూ తన ప్రస్థానం సాగించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే దర్శకుడిగా ఇండస్ర్టీలో తనదైన మార్క్ చూపించాలని టీఎన్ఆర్ కలలు కన్నారు. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలన్న కల తీరకుండానే తుదిశ్వాస విడాచారు. మానవ విలువలతో కూడిన మంచి కథతో ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టీఎన్ఆర్ అంటుండేవారని, అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ టీఎన్ఆర్ లాస్ట్ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు -
టీఎన్ఆర్ లాస్ట్ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు
ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి)) సోమవారం కరోనా కాటుకు బలైన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, టాలెంటెడ్ డైరెక్టర్ తేజ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన మరణ వార్త టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన విడుదల చేసిన చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కరోనా ఏం చేయదంటూ అందరికి ధైర్యం చెప్పిన తీరు భావోద్వేగానికి గురిచేస్తోంది. కరోనా గురించి టీఎన్ఆర్ ఏమన్నారంటే.. ‘మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోం చాలెంజ్‌ను నేను స్వీకరించి వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ మంచి పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తున్నాను. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని అంటారు కదా పెద్దలు. ఈ కష్టకాలం నాకు మంచి అలవాట్లను నేర్పింది. అవేంటంటే ప్రాణాయామం, యోగా. రోజూ చేస్తున్నాను. నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి. పిల్లలకు మంచి మంచి విషయాలు చెబుతూ ధైర్యం చెప్పండి. వారి పని వారు చేసుకునేలా తీర్చిదిద్దండి. భవిష్యత్తుపై ఓ నమ్మకం ఏర్పరచండి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఈ కరోనా ఏం చేయదు. దయచేసి రూమర్స్‌ను నమ్మకండి, నెగిటవ్ వీడియోలు ఎక్కువగా చూడకండి. పాజిటివ్‌గా ఉండండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీని పెంచుకోండి. రోగనిరోధక శక్తికి నేనిచ్చే బెస్ట్ సలహా ప్రాణాయామం. తప్పకుండా చేయండి. ఇక నేను ఫోన్ చేసిన వారిలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి పెద్దలే ప్యానిక్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజల క్షేమం దృష్ట్యా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ధైర్యం చెప్పి.. చివరికి ఆయనే మహమ్మారితో పోరాడి ఓడిపోవడం అందర్నీ కలచివేస్తోంది. మహమ్మారి ఏం చేయదు, మన దరికి కూడా రాదంటూ ఆయన చేప్పిన ఈ చివరి మాటలు నెటిజన్లను, ఫాలోవర్స్‌ను కన్నీరు పెట్టిస్తున్నాయి. చదవండి: కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ టీఎన్ఆర్ ఒక్క ఇంటర్య్వూ పారితోషికం ఎంతో తెలుసా! -
ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది..
ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) ఈ రోజు(మే 10) కరోనాతో కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన ఆయన పలు సినిమాల్లో కూడా నటించి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. టీఎన్ఆర్ అనగానే మొదట గుర్తొచ్చేది ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో’. ఈ షో ద్వారా తనదైన శైలిలో సెలబ్రేటిలను ఇంటర్వ్యూ చేసి పాపులరిటీ తెచ్చుకున్న ఆయన ఎంతోమంది యూత్ ఫాలోవర్స్‌ను కూడా సంపాదించుకున్నారు. గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో అంటే తెలియని వారులేరు అనేంతగా ఈ షోను పాపులర్ చేశారు ఆయన. అంతేకాదు ఎంతసేపు చూసిన ఈ షో అసలు బోర్ కొట్టదు అనే పేరును కూడా తెచ్చుకుంది. అలా ప్రస్తుత డిజిటల్ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఆయన కూడా ఒకరయ్యారు. రామ్ గోపాల్ వర్మ, తేజ వంటి స్టార్ డైరెక్టర్లను ఇంటర్య్వూ చేసి సెన్సేషనల్ అయ్యారు. అలాగే టాలెంట్ ఉన్నవారిని కూడా ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి టీఎన్ఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను చాటుకున్న టీఎన్ఆర్ ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో తెలుసా. షో నిడివిని బట్టి ఒక్కొక్క ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే పారితోషికం తీసుకునేవారని సమాచారం. కాగా పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన ఆయన ఆలీ నటించిన పిట్టల దొర సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్ వైపు వచ్చారు. మొదట్లో జర్నలిజం బ్యాగ్రౌండ్‌తో పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేసిన ఆయన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టి జార్జిరెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు వంటి సినిమాల్లో కూడా నటించారు. టీఎన్ఆర్ హఠాన్మరణంతో మీడియా రంగంలో, టాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ -
TNR : ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ కరోనా రక్కసికి బలయ్యారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్ఆర్ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్ఆర్కు యూత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. టిఎన్ఆర్కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక టీఎన్ఆర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోన తో కన్నుమూత Popular Youtube Host, Actor TNR Passed Away Due To COVID May His Soul Rest In Peace pic.twitter.com/u0BYEWbxLW — BARaju (@baraju_SuperHit) May 10, 2021 -
సీనియర్ జర్నలిస్ట్, గరం గరం ఆర్టిస్ట్ గోపి హఠాన్మరణం
-
మెరిసే కళ్లు.. ఆ చిరునవ్వు మాయం..రేణూ మిస్ యూ
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది ప్రింట్ హిందీ ఎడిటర్ , సీనియర్ మహిళా జర్నలిస్టు రేణు అగల్ ఇకలేరు. డిల్లీకి చెందిన రేణు అగల్ దాదాపు నెల రోజుల పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో పాత్రికేయ మితృలందరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకుని, మంచి మనిషిగా ఎపుడూ నవ్వుతూ, నలుగురికి సాయపడుతూ ఉండే రేణు అకాలమరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ నవ్వులిక మాయమంటూ రేణు సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీబీసీ ఆన్లైన్ ఎడిటర్ గీతా పాండే రేణు మృతిపై సంతాపం ప్రకటించారు. మార్చి 25 న రేణు అగల్ విధులను ముగించుకొని రిక్షాలో ఇంటికి వెళుతుండగా డీఆర్డీఓ అధికారి తప్పతాగి మద్యం మత్తులో అతివేగంగాకారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కానిస్టేబుల్ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన ఏడు రోజుల తరువాత రిక్షా డ్రైవర్ చాంద్ కూడా చనిపోయాడు. వాహనంపై నియంత్రణ కోల్పోయిన జిగ్ జాగ్గా ప్రయాణిస్తూ మొదట ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం సైకిల్-రిక్షాపైకి దూసుకెళ్లాడని కానిస్టేబుల్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో రిక్షాలో కూర్చున్న మహిళ కింద పడిపోయారనీ, స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతను పారిపోయాడని తెలిపారు. నిందిత డ్రైవర్‌ను కాళి బారి మార్గ్ నివాసి గౌరవ్ బాత్రాగా గుర్తించినట్లు డీసీపీ (ఉత్తర) అల్ఫోన్స్ తెలిపారు. అతనిపైకేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా రేణు అగల్ 1996 లో బీబీసీ లండన్‌లో పనిచేశారు. ప్రత్యేక కరస్పాండెంట్‌గా సుదీర్ఘకాలం15 ఏళ్లు పని చేశారు. 2011 లో పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కమిషనింగ్ ఎడిటర్‌గా చేరారు. ఆ తరువాత 2018 లో సీనియర్ ఎడిటర్‌గా ది ప్రింట్ హిందీ టీం చేరడానికి ముందు 2015 లో జగ్గర్నాట్ బుక్స్‌కు పనిచేశారు. So shocking. RIP. Deepest condolences to family, friends — Shantanu Nandan Sharma (@shantanunandan2) April 22, 2021 -
మరణించిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య :కేటీఆర్
ఖమ్మం సహకారనగర్: చనిపోయిన, అచేతనావస్థకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 8 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.8 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలలో పదోతరగతిలోపు చదివే పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని, రాబోయే మూడేళ్లలో అందరికీ స్థలాలు ఇచ్చి తీరుతామని అన్నారు. అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, టెంజూ అధ్యక్షుడు అడపాల నాగేందర్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, చండ్ర నరసింహారావు, వట్టికొండ రవి పాల్గొన్నారు. -
‘పోలీసుల దెబ్బలకు రైతుల కాళ్లు కమిలిపోయాయి’
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ఉద్యమంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు మన్దీప్ పునియా అనే జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేశారు. కోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన అనంతరం మన్దీప్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నా పట్ల దారుణంగా ప్రవర్తించారు. కానీ నేను భయపడను. అధికారంలో ఉన్న వారి చేతుల్లో అణచివేతకు గురయిన వారి గురించి రిపోర్ట్ చేయడానికి మరలా విధులకు వెళ్తాను’’ అన్నాడు. ఇక జైలులో తాను ఎందరో బాధితులను కలుసుకున్నానని.. వారి బాధలను తన శరీరంపై నోట్ చేసుకున్నానని.. దాని ఆధారంగా ఓ పుస్తకం తీసుకొస్తానని వెల్లడించాడు. 43 ఏళ్ల మన్దీప్ పునియా ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా కార్వాన్ మ్యాగ్జైన్ కోసం పని చేస్తున్నాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులు తనను ఎలా హింసించారో చెప్పుకొచ్చాడు మన్దీప్ పునియా. ఆ వివరాలు.. ‘‘సింఘులో రైతులు ఉద్యమం చేస్తోన్న చోట బ్యారికేడ్లకు ఆవతలి వైపున నేను ఉన్నాను. అక్కడ నెలకొన్న పరిస్థితులను వీడియో తీస్తున్నాను. కొందరు వలస కూలీలు అక్కడ నుంచి వెళ్లాలని చూశారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడమే కాక దూషిస్తూనే ఉన్నారు. నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. మా పని మేం చేసుకుంటూ ఉండగా.. పోలీసులు నా పక్కనే ఉన్న జర్నలిస్ట్‌ని పడేశారు. నేను అడ్డుకోవడంతో ఒక పోలీసు ‘‘ఇతడు మన్దీప్ పునియా.. ఇతడిని అదుపులోకి తీసుకొండి’’ అన్నాడు. దాంతో వారు నాపై కర్రలతో దాడి చేయడమే కాక దూషించారు. ఆ తర్వాత నన్ను టెంట్‌లోకి తీసుకెళ్లి కొట్టారు. నా మొబైల్, కెమరాను పగలకొట్టారు. ఐడీ కార్డ్ విసిరేశారు’’ అని చెప్పుకొచ్చాడు. రాత్రి మూడు గంటలకు లాకప్‌లో వేశారు ‘‘ఆ తర్వాత నన్ను వాహనంలో ఎక్కించి రెండు మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో నన్ను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. అదృష్టం ఏంటంటే ఆ వైద్యుడు నా శరీరంపై ఉన్న గాయాలన్నింటికి చికిత్స చేశాడు. గంట తర్వాత లాకప్‌లో ఉంచారు. వారికి నా పేరు ఎలా తెలిసింది అంటే.. అంతకు ముందే రోజే ఉద్యమం చేస్తోన్న రైతులపై రాళ్లు రువ్వారు. దాని కవరేజ్‌లో భాగంగా నేను పోలీసులతో చాలా సార్లు మాట్లాడాను. అలా తెలిసి ఉంటుంది. ఇక రైతులపై రాళ్లు రువ్విన వారికి.. బీజేపీతో సంబంధం ఉన్నట్లు నేను రిపోర్ట్ చేశాను’’ అన్నాడు. రైతులను దారుణంగా వారిని హింసించారు ‘‘ఇక జైలులో ఇతర ఖైదీలు నన్ను బాగా చూసుకున్నారు. పోలీసులు నన్ను కొట్టారని తెలుసుకున్నారు. ఇక వారి కష్టాలు నన్ను కదిలించాయి. సిస్టం వల్ల బాధింపబడిన ఓ వ్యక్తిగా జైలు లోపలికి వెళ్లిన నేను నా కన్నా దారుణంగా చిత్ర హింసలకు గురయిన వారిని అక్కడ చూశాను. పోలీసుల దెబ్బలకు వారి పాదాలు నీలం రంగులోకి మారాయి. వారి గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ముఖ్యమని అప్పుడే నిర్ణయించుకున్నాను. దాంతో ఓ పెన్ను తీసుకుని వారి వివరాలను నా శరీరంపై నోట్ చేసుకున్నాను. త్వరలోనే వీటన్నింటితో ఓ పుస్తకం తీసుకువస్తాను. అధికారంలో ఉన్న వారి వల్ల అణచివేతకు గురయిన వారి గురించి.. వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రపంచానికి వెల్లడించడానికి నేను మళ్లీ కెమరా పడతాను’’ అన్నారు మన్దీప్ పునియా. చదవండి: సయోధ్య సర్కారు విధి చదవండి: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
జర్నలిస్టుకు బెదిరింపులు: లా స్టూడెంట్ అరెస్ట్
జైపూర్: ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్ట్‌ను అత్యాచారం చేసి చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డ సదరు వ్యక్తిని రాజస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. రోహిని సింగ్ అనే పాత్రికేయురాలు వారి ఆందోళనను రిపోర్టింగ్ చేసింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న 26 ఏళ్ల కపిల్ సింగ్‌కు ఆమె రిపోర్టింగ్ నచ్చలేదు. దీంతో సదరు పాత్రికేయురాలిపై బెదిరింపులకు దిగాడు. అత్యాచారం చేసి ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. దీంతో రోహిని అతడి మీద చర్యలు తీసుకోమని కోరుతూ ఉదయ్‌పూర్ పోలీసులు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ట్యాగ్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉదయ్‌పూర్‌లోని సెమారీకి చెందిన కపిల్‌ను అరెస్ట్ చేశారు. (చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..) -
‘సాక్షి’కి అవార్డుల పంట
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘సాక్షి’ గ్రూప్ ప్రతినిధులకు అవార్డుల పంట పండింది. హైబిజ్ టీవీ శనివారం అందించిన మీడియా అవార్డులలో ‘సాక్షి’ ప్రతినిధులకు ఎక్కువ అవార్డులు లభించాయి. జర్నలిజం విభాగంలో పొలిటికల్ బెస్ట్ రిపోర్టర్‌గా పి.ఆంజనేయులు, బెస్ట్ బిజినెస్ రిపోర్టర్‌గా ఎన్.మహేందర్ కుమార్, బెస్ట్ క్రైం రిపోర్టర్‌గా శ్రీరంగం, సర్క్యులేషన్ విభాగంలో బెస్ట్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ శ్రీకాంత్, బెస్ట్ ఇన్నోవేషన్‌గా ప్రదీప్ బట్టు, ఏడీవీటీ విభాగంలో బెస్ట్ ఇన్నోవేషన్‌గా ఎం.మహేందర్ కుమార్, బెస్ట్ ఈవెంట్స్‌గా జి.నాగరాజుగౌడ్, మధుపాపరావు, బెస్ట్ గ్రోత్‌గా ఎం.వినోద్ కుమార్, ఎల్రక్టానిక్ మీడియా విభాగంలో బిజినెస్ బెస్ట్ రిపోర్టర్‌గా ఆర్.రాజ్ కుమార్, ఏడీవీటీ విభాగంలో బెస్ట్ ఇన్నోవేషన్‌గా జె.గోవర్దన్‌రావు, కోవిడ్ సమయంలో పనిచేసిన టీవీ రిపోర్టర్ విక్రమ్ స్పెషల్ అవార్డులను అందుకున్నారు. కోవిడ్‌తో మృతి చెందిన సాక్షి జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు, మరో జర్నలిస్ట్ మనోజ్ కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జర్నలిజం, అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్ విభాగంలో పనిచేసిన వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులకు ‘మీడియా అవార్డులు–2021’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హైబిజ్ టీవీ ఎండీ రాజ్‌గోపాల్, సాక్షి ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కోట్లు సంపాదించాలని జర్నలిజాన్ని ఎంచుకోరు’
‘గంగపుత్రులు’ చిత్రం ఫేమ్ రామ్కీ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘జర్నలిస్ట్’. కె. మహేష్ దర్శకత్వం వహించారు. తషు కౌశిక్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్ కుమార్ సమర్పణలో జి.ఆర్.కె ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్కీ మాట్లాడుతూ– ‘‘సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకెంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదట జర్నలిస్ట్‌లు ఉంటారు. అందుకే వారిపై ఈ సినిమా చేశాను. సమాజానికి, జనాలకి మంచి చేయాలనే ఉన్నతమైన అభిప్రాయంతో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంటారే కానీ, కోట్లు సంపాదించాలని కాదు. నిజమైన జర్నలిస్ట్ ఎంత బాధ్యతతో ఉంటాడో చూపించే ప్రయత్నమే మా సినిమా. కథ నచ్చడంతో ఎన్. శంకర్ నటించారు. సీనియర్ నటులు చలపతిరావు, సురేష్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను’’ అన్నారు. ‘‘సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంత గొప్పదో మా చిత్రంలో చూస్తారు’’ అన్నారు సమర్పకులు రాజ్‌కుమార్. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, డా. జోస్యభట్ల, కెమెరా: ముజీర్ మాలిక్. -
రైతుల వాదనకే మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు. -
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
సాక్షి, పటాన్చెరు టౌన్: జర్నలిస్ట్‌ను ఫోన్లో దూషించి, బెదిరించిన ఘటనలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీన్పూర్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రి కలో వచ్చిన కథనానికి సంబం ధించి జర్నలిస్ట్ సంతోశ్‌ను ఫోన్ చేసి ఎమ్మెల్యే దూషించిన విషయం వైరలైంది. ఎమ్మెల్యే తన ను దూషించాడని తోటి జర్నలిస్టులతో కలిసి సంతోశ్ మంగళవారం డీఎస్పీ భీంరెడ్డి కలిసి, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై మంగళవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా ఈ మేరకు పోలీసులు 331/2020 అండర్ సెక్షన్ 109, 448, 504, 506–ఐపీసీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా, తాను ఏనాడూ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడలేదని, అమర్యాదగా వ్యవహరించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే కనుక వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రటకనలో పేర్కొన్నారు. -
తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా
పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ జర్నలిస్ట్‌పై దూషణలకు దిగారు. ఓ దినపత్రికలో వ చ్చిన కథనం నేపథ్యంలో సదరు జర్నలి స్ట్‌కు ఫోన్‌చేసి ‘తమాషా చేస్తున్నావా.. నా పేరుతో కథనం రాస్తావా.. ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. ఈ ఆడియో కాస్తా మంగళవారం సోషల్ మీడియాలో వైరలైంది. అనంతరం తన ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫోన్లో దూ షించారని జర్నలిస్టు సంతోష్‌నాయక్ పో లీసులను ఆశ్రయించాడు. తాను రాసిన కథనానికి ఎమ్మెల్యే ఫోన్లో దూషించడం తో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని డీఎస్పీ భీంరెడ్డిని కలసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే తీరును టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఒక ప్రకటనలో ఖండించింది. -
సీనియర్ జర్నలిస్ట్‌ని పరామర్శించిన చిరు
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందే ఉంటారు . అలా ఎందరినో ఆదుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడికి ఆస్పత్రి చికిత్స అందించడమే గాక ఆదివారం రోజు ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సను అందించే ఏర్పాటు చేశారు. జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషించారు. ‘ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంది’అని ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓ వైపు ‘ఆచార్య’ షూటింగ్, మరోవైపు నిహారిక వివాహమహోత్సవం సందర్భంగా బిజీలో ఉన్నప్పటికి ఇలా పరామర్శకు వచ్చి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్. -
శానిటైజర్ పోసి నిప్పంటించి..
లక్నో(ఉత్తరప్రదేశ్) : జర్నలిస్టు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను బలరామ్‌పూర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 37 ఏళ్ల జర్నలిస్టు రాకేష్‌సింగ్ నిర్భిక్, మరో జర్నలిస్టు పింటు సాహు (34)తో కలిసి గ్రామసర్పంచ్ చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే కాల్వారి గ్రామ సర్పంచ్ కుమారుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అధిక ఆల్కహాల్ శాతం కలిగిన శానిటైజర్‌ను జర్నలిస్టులపై పారబోసి ఆ తర్వాత నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘనటలో సాహు అక్కడికక్కడే మరణించగా, మరో జర్నలిస్టు రాకేష్ సింగ్ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. శరీరం అప్పటికే 80 శాతానికి పైగా కాలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. సర్పంచి చేస్తోన్న అవినీతిపై వరుస కథనాలు ప్రచురించడం, సాహుతో డబ్బు చెల్లింపులు లాంటి వివాదాలు ఉండటంతో ఇద్దరినీ చంపేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. (కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు) ఈ కేసులో సర్పంచ్ కుమారుడు రికు మిశ్రాకు, ఇదివరకే పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న స్నేహితుడు అక్రమ్, లలిత్ మిశ్రా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జర్నలిస్ట్ రాకేష్ సింగ్ చనిపోవడానికి ముందే తనపై హత్యాయత్నం చేసింది సర్పంచి కుమారుడేనని పేర్కొంటూ రెండున్నర నిమిషాల వ్యవధి గల వీడియోను రూపొందించాడు. అక్రమాలపై వరుస కథనాలు రాస్తూ నిజాయితీ గల జర్నలిస్టుగా ఉన్నందుకు ఇదే నాకు లభించిన బహుమతి అంటూ వీడియోలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 17 మందిని విచారించారు. ఇరువురి మధ్య ఉన్న పాత తగాధాల కారణంగా పథకం ప్రకారం జర్నలిస్టులను హత్య చేయించినట్లు బలరామ్‌పూర్ పోలీసు చీఫ్ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని కూడా విచారిస్తున్నామని, అవసరమైతే వారిని సైతం అరెస్టు చేస్తామని వెల్లడించారు. (కూతురి నుంచి ప్రాణహాని.. సంచలన ఆరోపణలు) -
కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు
బీజింగ్ : కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన విలేకరికి ఐదేళ్ల జైలుశిక్షను బహుమానంగా ఇచ్చింది చైనా ప్రభుత్వం. ఝాంగ్ ఝాన్ అనే 37 ఏళ్ల మాజీ న్యాయవాది.. సిటిజన్ జర్నలిస్ట్. ఈ ఏడాది ఫిబ్రవరిలో వూహాన్‌కు వెళ్లి అక్కడి నుంచి వైరస్ కేసులకు సంబంధించి పలు కథనాలు రాసి, ప్రచురించింది. కరోనా వైరస్ మరణాలకు కారణమెవరని ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు వేధించారని, కొంతమంది స్వతంత్ర విలేకరులను కనిపించకుండా చేశారని ఝాన్ కథనాలు రాశారని చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్ఆర్డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ క్రమంలో కొట్లాటకు దిగుతున్నారని, సమస్యలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఝాన్‌ను మేలో అరెస్ట్ చేశారు. నెలలుగా అజ్ఞాతంలో.. ఝాంగ్ ఝాన్ మే 14 నుంచి కనిపించకుండా పోయిందని సీహెచ్ఆర్డీ తెలిపింది. ఒకరోజు తరువాత ఝాన్ తమ కస్టడీలో ఉన్నట్లు వూహాన్‌కు సుమారు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై పోలీసులు ప్రకటించారు. జూన్ 19న ఝాన్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించగా మూడు నెలల నిర్బంధం తరువాత ఝాన్‌ను కలిసేందుకు న్యాయవాదికి అనుమతి లభించింది. ఝాన్ తన అరెస్ట్‌ను నిరసిస్తూ జైల్లోనే నిరాహార దీక్షకు దిగారని, సెప్టెంబర్ 18న ఆమెను దోషిగా నిర్ధారించామని ఝాన్ న్యాయవాదికి ఓ ఫోన్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఝాన్ కేసులో వెలువడిన తీర్పు ప్రతిని పరిశీలించగా అందులో ‘‘వీ చాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని అక్షరాలు, వీడియోలు, ఇతర రూపాల్లో ప్రసారం చేశారు’’అన్న ఆరోపణలపై ఝాన్‌కు శిక్ష విధించినట్లు ఉంది. అంతేకాకుండా.. విదేశీ ప్రచురణ సంస్థల ఇంటర్వూ్యలకు అంగీకరించినందుకు, వూహాన్లో వైరస్‌కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు ఝాన్‌ను శిక్షిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, ఝాన్‌తోపాటు కనీసం ముగ్గురు జర్నలిస్టులు ఫిబ్రవరి నుంచి కనిపించకుండాపోయారు. వీరిలో లీ జెహూవా అనే విలేకరి ఏప్రిల్‌లో మళ్లీ ప్రత్యక్షమై.. అప్పటివరకు తాను క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పగా.. చెన్ కియుషీ తాను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకున్నారు. ఫాంగ్ బిన్ అనే ఇంకో విలేకరి ఇప్పటివరకు అయిపు అజా లేకపోవడ గమనార్హం. -
పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి
దిస్పూర్: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్‌పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జర్నలిస్టు మిలన్ మహంత్ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రముఖ జర్నలిస్ట్ మృతి; సీఎం సంతాపం
సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో ఆస్సత్రికి తరలించగా.. ఆయన చికిత్సకు స్పందించకపోవంతో అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కాగా.. చివరిసారిగా నివాళులు అర్పించడానికి అతని మృతదేహాన్ని ప్రార్థనా మందిరానికి తరలించారు. బెలగెరే మృతి పట్ల కర్ణాటక సీఎం యడ్యూరప్ప సంతాపం తెలియజేశారు. ఈ మేరు తన ట్విటర్ ఖాతాలో.. 'రవిగెరే కుటుంబానికి, ఆయన అభిమానులకు ఈ సమయంలో ఆయన లేరన్న బాధను తట్టుకునే దైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) మార్చి 15, 1958న బళ్లారిలో జన్మించిన ఆయన జర్నలిస్ట్‌గా, రచయితగా మంచి గుర్తింపు పొందాడు. బెలగెరే కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎంఏ చేశారు. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక మీడియా అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. బెలగెరే తన ప్రసిద్ధ కన్నడ టాబ్లాయిడ్ 'హాయ్ బెంగళూరు' నుంచి కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కల్పన, అనువాదం, కాలమ్, జీవిత చరిత్రలు సహా 70పైకి సాహిత్య రచనలు చేశారు. అతను నేర ప్రపంచంపై రాసిన ప్రసిద్ద కాలమ్ పాపిగళ లోకదల్లి బాగా ప్రాచుర్యం పొందింది. (ప్రీ వెడ్డింగ్ షూట్.. జంట మృత్యువాత) -
చెన్నై: యువ జర్నలిస్టు దారుణ హత్య
-
టీవీ రిపోర్టర్ దారుణ హత్య
చెన్నై: అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్ (26) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు గతంలో పలుమార్లు మోజెస్‌ను బెదిరించారు. తమ దారికి అడ్డు రావొద్దన్ని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మోజెస్‌ను ఇంటి నుంచి రప్పించిన దుండగులు అతన్ని కత్తులతో నరికి చంపేశారు. అతని శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. జర్నలిస్టు హత్య కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మోజెస్ స్థానికంగా ఓ తమిళ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి కూడా జర్నలిస్టు కావడం విశేషం. -
అల్లర్లకు కుట్ర
-
యూపీలో నలుగురు పీఎఫ్ఐ సభ్యులు అరెస్ట్
లక్నో: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయని ఒక కేరళ జర్నలిస్టు, ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గతంలో యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఎఫ్ఐని నిషేధించిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన దళిత బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి హాథ్రాస్‌కు కారులో వెళ్తున్న ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్,అతిక్ ఉర్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలంగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, లాప్టాప్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత సమయంలో యూపీలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చదవండి: (హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!) అదే విధంగా వారికి పీఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( సీఎఫ్) కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ హాథ్రస్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని కవర్ చేయడానికి ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన నిరసనలకు పీఎఫ్ఐకి సంబంధాలున్నాయని యూపీ ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధించిన విషయం తెలిసిందే. -
ప్రతి జర్నలిస్ట్ వెనుక ప్రెస్ అకాడెమీ ఉంటుంది..
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో శిక్షణ ఇస్తాం. గ్రామీణ, డెస్క్ విలేకరులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. జర్నలిస్టులు ఎన్నో విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో కష్టపడి పని చేసినా ఫలితం లేదనే భావన ఉంది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం.. త్వరలో మంచి జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారు. శిక్షణ కోసం అనేక ప్లాట్ ఫామ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అన్ని శాఖలను ఒక చోట చేర్చి సమాచారం అందించేలా చర్యలు చేపడుతున్నాం. కోవిడ్ సమయంలో మీటింగులు పెట్టే అవకాశం లేదు. అందుకే ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తొలుత విశాఖ నుంచి ప్రారంభిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా శిక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడెమీ కృషి చేస్తుంది. వారి శిక్షణ కోసం యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. జర్నలిస్టులందరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. (తీపి కబురు: త్వరలో డీఎస్సీ) ఫేక్ న్యూస్ నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. అటువంటి వార్తల పట్ల ఎలా అప్రమత్తత ఉండాలో కూడా శిక్షణలో భాగంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్లేలా కూడా బాధ్యత తీసుకుంటున్నాం. వర్కింగ్ జర్నలిస్టులు జర్నలిజంలో ఏదయినా కోర్స్ చేయాలి అనుకుంటే ప్రెస్ అకాడమీ సహకరిస్తుంది. ప్రతి జర్నలిస్ట్ వెనుక ప్రెస్ అకాడెమీ ఉంటుందని గుర్తుంచుకోండి' అని దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
జర్నలిస్టులు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్నారు
-
మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం
సాక్షి, అనంతపురం : మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని, ఈనెల 22వ తేదీ నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదని ప్రశ్నించారు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం ఎక్కడిదన్నారు. హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందన్నారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలని, ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. -
హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మీడియాపై ఆంక్షలు నిరసిస్తూ శనివారం అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మీడియాకు జడ్జిలు సంకెళ్లు వేయటమా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సోసైటీ అధ్యక్షుడు మచ్ఛా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి భూ కుంభకోణంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ సమాచారాన్ని మీడియాల్లో ఇవ్వకూడదని, ఏపీ హైకోర్టు ఆంక్షలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. సాక్షాత్తు హైకోర్టే పత్రికా స్వేచ్ఛకు తూట్లు పొడిస్తే ఎలా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలన్నారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.(చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు) భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలి.. ఏపీ హైకోర్టు తీర్పు అనేక అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులేనని, మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్లపై నమోదైన కేసును విచారణ చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై కేంద్రం, సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని గోపాల్‌రెడ్డి కోరారు. (చదవండి: బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?) -
‘ఫేక్ న్యూస్’ను ప్రశ్నించడం తప్పా!?
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వస్తోన్న నకిలీ (ఫేక్) వార్తలను ఎప్పటికప్పుడు ఎండకడుతూ వాటి వెనకనున్న వాస్తవాలను వెలికి తీస్తోన్న ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకులు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయింది. జుబేర్‌కు వ్యతిరేకంగా ఒకటి ఢిల్లీలో, మరోటి రాయ్‌పూర్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ రెండు కేసులను నమోదు చేశారు. జగదీశ్ సింగ్ అనే ట్విటర్ వినియోగదారుడు జుబేదర్‌కు వ్యతిరేకంగా ట్విటర్లో దుర్భాషలాడారు. సింగ్ తన ప్రొఫైల్ పిక్చర్ కింద చిన్న పాప చిత్రాన్ని పెట్టుకున్నారు. దానికి జర్నలిస్ట్ జుబేదర్ సమాధానమిస్తూ ‘సోషల్ మీడియా ద్వారా ప్రజలను దుర్భాషలాడడం నీ పార్ట్ టైమ్ జాబని అందమైన నీ చిట్టి మనమరాలికి తెలుసా? నీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకోమని సలహా ఇస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఎవరో ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ జుబేర్‌పై చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అందుకని పోలీసులు ఆయనపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ కింద, ఆన్లైన్లో మైనర్ బాలికను చిత్ర హింసలకు గురిచేస్తున్నారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగదీశ్ సింగ్ చిన్న పాప చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకోవడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ‘ఎన్సీపీసీఆర్’, మొహం కనిపించకుండా ఆ పాప ప్రొఫైల్ చిత్రాన్ని బ్లర్ చేసి పునర్వినియోగించిన జుబేర్‌పై కేసు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించడం పట్ల మీడియా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద జరిగిన ప్రజాందోళనలో మైనర్ బాల, బాలికలు పాల్గొనడం పట్ల కూడా జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పిల్లలను రోడ్లపైకి తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసులకు ఆదేశించింది. (ఏ పార్టీలో చేరను.. డాక్టర్‌గానే ఉంటా) ఆ విషయంలో మీడియా కూడా జాతీయ కమిషన్‌ను తప్పు పట్టలేదు. సమాజంలో పిల్లలకు వ్యతిరేకంగా జరగుతోన్న అత్యాచారాలు, విచారణ పేరిట పోలీసులే మైనర్లను నిర్బంధిస్తూ వేధిస్తున్న సంఘటనలపై జాతీయ కమిషన్ ఎందుకు సకాలంలో స్పందించదన్నది మాత్రమే మీడియా వర్గాల ప్రశ్న. సోషల్ మీడియాలో పుంఖానుపుంఖంగా తప్పుడు వార్తలు, వక్రీకరణలు, అసభ్య విమర్శలు, అర్థంలేని ఆరోపణలు, అసభ్య, అక్రమ వీడియోలు వస్తోన్న చలించని ప్రభుత్వ సంస్థలు, అధికార యంత్రాంగాలు పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు స్పందిస్తాయన్నది మీడియా వర్గాల ప్రశ్న. ఎప్పుడు తప్పుడు వార్తలను ప్రచారం చేసే బీజేపీ ఐటీ సెల్‌ను ఎండగట్టడమే బహుశా తాను చేసిన తప్పేమోనని జర్నలిస్ట్ జుబేర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుచ్చమైన కేసులకు తాను భయపడనని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. (నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి)