నాంపల్లి (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు కోవిడ్‌తో మృతి చెందారని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల రూపాయల పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో పదవ తరగతి లోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు.
రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుందని వివరించారు. మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని కోరారు
Comments
Please login to add a commentAdd a comment