మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం | Macha Ramalinga Reddy 2 Days Hunger Strike From September 22 | Sakshi
Sakshi News home page

మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం

Published Sun, Sep 20 2020 8:43 PM | Last Updated on Sun, Oct 17 2021 12:53 PM

Macha Ramalinga Reddy 2 Days Hunger Strike From September 22 - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అనంతపురం : మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని, ఈనెల 22వ తేదీ నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదని ప్రశ్నించారు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం ఎక్కడిదన్నారు. హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందన్నారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలని, ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement