macha ramalingareddy
-
మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం
సాక్షి, అనంతపురం : మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని, ఈనెల 22వ తేదీ నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదని ప్రశ్నించారు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం ఎక్కడిదన్నారు. హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందన్నారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలని, ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత మూడు రోజులుగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలను అందజేశామన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత నిర్బంధ విద్య, హెల్త్ కార్డు కలిగిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అమలుపరచాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచచేసి రుణాలు అందించాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో మీడియా మార్చ్ చేపడతామన్నారు. నగరంలోని జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్మూర్తి, శివానంద తదితరులు పాల్గొన్నారు. -
‘జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’
హిందూపురం అర్బన్ : జర్నలిస్టుకు అన్యాయం జరిగితే çసహించేది లేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లావ్యాçప్తంగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల చైతన్య సదస్సు హిందూపురం నియోజకవర్గ కమిటీ గౌరవధ్యక్షుడు ప్రకాష్ అ«ధ్యక్షతన శుక్రవారం హిందూపురంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేను విచ్ఛిన్నం చేసి సభ్యులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం సాగుతోందన్నారు. దాన్ని ఎదుర్కొని ఐకమత్యం తీసుకురావడానికి చైతన్యసదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కలెక్టర్, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందేలా కృషి చేస్తామన్నారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌తో పాటు ఇంటి పట్టా ఇప్పిసామన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కేపీ కుమార్, అనంత నగర అధ్యక్షుడు ఎస్ఎస్ ఖాన్, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ కోశాధికారి రామ్మూర్తి, అడహక్ కమిటీ సభ్యులు ఈశ్వర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల జర్నలిస్టులు