
పట్నా: బీహార్ రాష్ట్రంలోని మధుబనీ జిల్లాలో నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన యువ జర్నలిస్టు, సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కార్యకర్త బుద్ధినాథ్ ఝ అలియాస్ అవినాశ్ ఝ(22) శుక్రవారం సాయంత్రం శవమై కనిపించాడు.
బుద్ధినాథ్ ఝ స్థానిక న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. నకిలీ ఆస్పత్రుల పేర్లను ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అధికారులు సదరు అస్పత్రులను మూసివేశారు.కొన్నింటికీ జరిమాన విధించారు.
ఈ నేపథ్యంలో బుద్ధినాథ్ ఝను నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే శుక్రవారం సగం కాలినస్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment