భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మోదీ.. రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి నివాసాలకు వెళ్లి ప్రణబ్, అన్సారీలకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు ప్రముఖులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ సందర్శనకు సాధారణ ప్రజలను అనుమతించారు. ప్రజలు ప్రణబ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.