
పులితో భీకరంగా తలపడుతున్న ఎలుగుబంటి
సాక్షి, న్యూఢిల్లీ : బెబ్బులి పేరు వింటనే వణికిపోతాం. సాధారణంగా పెద్ద పులి సింహానికి మాత్రమే భయపడుతుందని, సరిగ్గా ఎదురు తిరిగితే ఒక్కోసారి దాన్ని కూడా పడగొడుతుందని కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. అయితే, మృగరాజును సైతం హడలెత్తించే పెద్ద పులి కాస్త ఎలుగుబంటితో పోరాడలేక పారిపోయింది. పోరులో ఓడి తోకముడిచి వెనుకడుగు వేసింది. దాంతో రెచ్చిపోయిన ఆ ఎలుగుబంటి కాస్త తరిమితరిమి కొట్టింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.. వాటి మధ్య జరిగిన భీకరపోరును మీరు కూడా ఓసారి చూడండి.