ఛత్తీస్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్ల మృతి | Two BSF jawans killed in gunfight in Kanker district | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్ల మృతి

Published Mon, Jul 16 2018 4:48 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Two BSF jawans killed in gunfight in Kanker district - Sakshi

గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లో తరలిస్తున్న దృశ్యం

పర్ణశాల(దుమ్ముగూడెం): ఛత్తీస్‌గఢ్‌లోని మావో యిస్టు ప్రభావిత కాంకేర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పర్తాపౌర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ముగించుకుని వస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు బర్కోట్‌ గ్రామ సమీపంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో లోకేందర్‌ సింగ్, ముఖ్తియార్‌ సింగ్‌ అనే కానిస్టేబుళ్లు మృతి చెందగా సందీప్‌ దేవ్‌ అనే జవాన్‌ గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించి, పరారైన మావోల కోసం గాలింపు చేపట్టారు. గాయపడిన సందీప్‌ దేవ్‌ను వెంటనే హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, మృతదేహాలను పఖన్‌జోర్‌లోని 114 బెటాలియన్‌ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement