
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల(జూన్) 12న సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశమవుతారని తెలిపారు. అంతేకాక జూన్ 13న జనరల్ బాడీ సమావేశం, జూన్ 8 నుంచి 15 వరకు వంచన వారం నిర్వహిస్తామని రఘువీరా పేర్కొన్నారు.
త్వరలోనే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉమెన్ చాందీని నియమించిన విషయం తెలిసిందే. ఇదోక చాలెంజింగ్ జాబ్ అని అన్నారు.. ఏపీ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఏసీసీసీ చీఫ్ చెప్పారు. పీవీ నరసింహారావు దేశానికి నాయకత్వం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రఘువీరా కోరారు. అంతేకాక దేశానికి లౌకిక ప్రజాస్వామ్య కూటమి అవసరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సూచించారు.