TDP government
-
పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర
-
రూపాయి సంపాదన లేదు.. లక్ష కోట్ల అప్పు.. మాట్లాడితే కేసులు..
-
‘పది’పోయిన ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబరు వరకు సాగదీత.. అప్పర్ ప్రైమరీ (యూపీ) పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపు.. ఇలా పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. పదో తరగతి ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు.⇒ ఈ ఏడాది పరీక్షలకు 6,19,286 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,14,459 మంది హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది (81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో బాలికలు 2,53,278 మంది (84.09 శాతం), బాలురు 2,45,307 మంది (78.31 శాతం) ఉన్నారు. ⇒ ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు.⇒ ఇంగ్లిష్ మీడియంలో రాసిన 5,60,864 మందిలో 4,66,586 మంది (83.19 శాతం), తెలుగు మీడియంలో 49,519 మందికి గాను 29,012 మంది (58.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ⇒ మొత్తం విద్యార్థుల్లో 65.36 శాతం ప్రథమ, 10.69 శాతం ద్వితీయ, 5.09 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణి సాధించారు. టాప్‌లో మన్యం.. చివరిలో అల్లూరి జిల్లాలుపదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో టాప్‌లో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను అందుకుంది. ⇒ 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ మొత్తం 11,819 ఉన్నత పాఠశాలల (4,879 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యంలోనివి) నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. 19 ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. నేటి నుంచి రీ కౌంటింగ్‌కు అవకాశంపరీక్షలు తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో వారివారి స్కూల్ లాగిన్‌లో గురువారం నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. త్వరలోనే టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు గడువు ఇచ్చింది.కనిపించని మెరుపులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. రెండేళ్ల పాటు కోవిడ్–19తో సరిగా తరగతులు జరగక, పరీక్షలు నిర్వహించకపోయినా, 2022–23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు జీరో ఫలితాలు సాధించినవి 17కి తగ్గాయి.⇒ తాజాగా 2024–25 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 1,680కి తగ్గిపోగా, జీరో ఫలితాల స్కూళ్ల సంఖ్య 19కి పెరిగింది.సివిల్స్ సాధిస్తా పది ఫలితాల్లో 600 మార్కులు సాధించిన నేహాంజనిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదిలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి గంగాభవానీ గృహిణిగా ఉన్నారు. తమ విద్యార్థిని వై.నేహాంజని స్టేట్ టాపర్‌గా నిలిచిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు విడుదలఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 10,119 మంది (37.93 శాతం) ఉత్తీర్ణులవగా, ఇంటర్మీడియట్లో 63,668 మందికి గాను 33,819 మంది (53.12 శాతం) విజయం సాధించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ మే–2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు. -
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
సిట్ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు
-
సూపర్ సిక్స్ హామీలు గాలికి.. అవినీతిలో పైపైకి
-
లోకేశా మజాకా.. బాబును అడ్డంగా ఇరికించేశాడుగా
-
విశాఖలో భూములే కాదు.. ప్రజాస్వామ్యమూ గోవిందా
-
ఊరూపేరు లేని ఉర్సా.. బట్టబయలైన బాబు సర్కార్ భారీ భూకుంభకోణం
-
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
-
మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులకు కూటమి సర్కారు టోకరా
-
ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ
-
విశాఖలో ఎకరా స్థలం 99పైసలే.. రండి బాబు రండి!
-
KSR Comment: సూపర్ సిక్స్ డైవర్షన్ కోసం చంద్రబాబు కొత్త ప్రకటన
-
బీసీల వెన్ను విరిచిన ఘనుడు చంద్రబాబు
-
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోత
-
తప్పుడు కేసులకు భయపడం.. ధైర్యంగా ఎదుర్కుంటాం
-
కుట్రలు, కుతంత్రాలతో కూటమి మ్యాజిక్ ఫిగర్
-
అమరావతిలోనే లక్షల కోట్లు పెట్టడమంటే రాష్ట్రంపై అప్పుల భారం వేయడమే
-
విశాఖలో బీసీ మహిళను మేయర్ పదవి నుంచి దించేసిన కూటమి సర్కార్
-
అడ్డదారిలో GVMC మేయర్ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి సర్కార్
-
డబ్బు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను.. కూటమికి కార్పొరేటర్ శశికళ కౌంటర్
-
పవన్ సవాల్.. టీడీపీకి దిమ్మతిరిగింది!
-
భూములు కారు చౌకగా.. ఎలా కొట్టేయాలో తెలుసా?
-
నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు
-
మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కేసులు పై భూమన రియాక్షన్
-
కుట్రలు, కుతంత్రాలతో.. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
-
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి సర్కార్ నెరవేర్చడం లేదు
-
YSRCP నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు
-
పోలీసుల వైఖరిపై భూమన కరుణాకర్ రెడ్డి నిరసన
-
సచివాలయాల పేరుతో కమీషన్లకు స్కెచ్
-
బాబు పాలన చూసి నవ్వుతున్నారు!
-
పెన్షన్ల పంపిణీలో భారీ అవినీతి.. ప్రభుత్వ సర్వేలోనే తేలిన నిజం
-
గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటున్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాడు వైఎస్ జగన్ టారిఫ్ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్ పరిధిలో నివసించే ఎస్.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్ ఉన్నాయి. కరెంట్ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతుబట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. -
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన
-
ఫీజుల షెడ్యూల్‌కు బూజు!
ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్‌షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్, బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్, హెచ్.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఎంటీఎఫ్) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్ జగన్ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి షెడ్యూల్ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్‌గా ఫీజు రీయింబర్స్మెంట్ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇంజనీరింగ్ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్ ఇయర్ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్‌టికెట్ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్‌బుక్‌లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాకు మూడు టర్మ్‌లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్‌బుక్‌లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్ హుస్సేన్ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్ రిజ్వాన్ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా -
పెగాసస్ నిఘా నిజమే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చెప్పిందే నిజమైంది. 2018–19లో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. భారత్‌లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ బాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. స్పైవేర్ నిఘాలో రెండో స్థానంలో భారత్ నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్‌తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో, పెగాసస్‌ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.–2018–19లో భారత్‌లో వందమంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూ.58 కోట్లు ఎన్ఎస్వో గ్రూప్‌నకు చెల్లించాయి. –ఎన్ఎస్వో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1,223 మందిపై నిఘా పెట్టింది. వారిలో వందమంది భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచింది.పెగాసస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్యభారత్: 100, బ్రిటన్: 82, మొరాకో: 69, పాకిస్థాన్: 58, ఇండోనేసియా: 54, ఇజ్రాయెల్: 51, స్పెయిన్: 12, నెదర్లాండ్స్: 11, హంగేరీ: 8, ఫ్రాన్స్: 7, యూకే: 2.అప్పట్లోనే వెల్లడించిన వైఎస్సార్సీపీ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, నాడు వైఎస్సార్సీపీ చెప్పింది నిజమేనని.. మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.అసెంబ్లీలోనే బయటపెట్టిన మమత2018–19లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్‌ను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు కూడా మమతా తెలిపారు. బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలతో.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ ను ఉపయోగించినట్లు స్పష్టమైంది. -
అమరావతిలో మళ్లీ భూదందా.. ప్రైవేట్ చేతికి అంబేద్కర్ స్మృతివనం
-
అంబేడ్కర్ పైన చందబ్రాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం
-
చంద్రబాబు భూ దాహం.. మరో 44,676 ఎకరాలు
-
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
గతంలో బస్తా ఫీడ్ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయిపోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్ ఆక్వా జోన్ ప్రాంతం. యూనిట్ రూ.4 చొప్పున కరెంట్ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్ ఆక్వా జోన్ పరిధిలో యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్ వన్ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా కోసం ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్ సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్లో ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్ పెంపు వాయిదా పడ్డా కౌంట్ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు -
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా నెగోíÙయేటెడ్ సెటిల్మెంట్స్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు. -
కూటమి సర్కార్ పై YSRCP నేత వడ్డి రఘురాం మండిపాటు
-
చంద్రబాబు ఇంద్రజాలం.. మెల్లగా ఏపీని ముంచేస్తున్నారు
-
బాబు ది గ్రేట్.. 10 నెలల్లో లక్షన్నర కోట్లు అప్పు !
-
తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడింది: భూమన
-
పిల్లల చదువులకు అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు
-
గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది
-
తిరుమల ప్రతిష్టతను కూటమి సర్కార్ దెబ్బతీస్తోంది
-
బాబు అరాచకాలను బయట పెట్టారని సాక్షి ఎడిటర్ పై కేసు
-
కూటమి పాలనలో ఆక్వా రైతులకు ఎలాంటి మేలు జరగలేదు
-
భద్రతలో డొల్లతనం.. ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు!
-
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫైర్
-
Big Question: జగన్ భద్రతపై నిర్లక్ష్యమా? కూటమి ప్రభుత్వ కుట్రనా?
-
ఇసుక తోడేళ్లు!
చూడు నాగిరెడ్డి..! నేను ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేశా. మా ఊరి నుంచి ఇసుక నేనే తవ్వుకుంటా. ఎవరూ అడ్డు రావద్దు..! నేను ఎమ్మెల్యే (జయనాగేశ్వరరెడ్డి)కి చెప్పి ఇసుక తోలుతున్నా. సీఐకి రూ.50 వేలు ఇచ్చినా..! నా టిప్పర్‌తోనే ఇసుక తోలుతా. ఇసుక బండి ఆపేదెవడు? దమ్ముంటే రమ్మను!- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ నేతలు గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఫోన్ సంభాషణ ఇదీ!నాకు తెలియకుండా మట్టి తోలుతున్నావ్..! నాకు చెప్పాలి కదా..? బండ్లు మనయే ఉన్నాయ్..!రామలింగారెడ్డి (ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుడి భుజం)తో మాట్లాడా..! ఎమ్మెల్యే.. తహసీల్దార్‌కు కూడా చెప్పాడు. మట్టి శాంపిల్ కూడా తీశా. మనమే ఒకటిగా లేకుంటే ఎట్టా...? వచ్చే డబ్బులో రామలింగారెడ్డి వాటా ఆయనకు పోతాది. వైఎస్సార్సీపీ వాళ్లు బండ్లు ఆపుతున్నారు..ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్‌తోనే కొడతా..! రమ్మను..!- శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో టీడీపీ నేతలు క్రాంతి కుమార్, శ్రీనివాసులు ఫోన్ సంభాషణ ఇదీ!!మీ ఓనర్‌కు ఫోన్ చేసి రెండు నెలలైంది.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పినా కలవలేదు. మీ ఓనర్ వచ్చి మాట్లాడే దాకా లారీ స్టేషన్లోనే ఉంటుంది..-లారీ డ్రైవర్ లంకన్నకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పీఏ నాగరాజు గౌడ్ బెదిరింపులు!ఉచిత ఇసుక పేరుతో పచ్చ ముఠాలు ఏ స్థాయిలో బరి తెగించి సామాన్యులపై రౌడీయిజం చేస్తున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే! టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నదులు, వాగులు, వంకల్లో ఇసుకను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం అండతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాటాలు పంచుకు తింటున్నారు. ఆరు లారీలు.. మూడు ట్రాక్టర్లు అనే రీతిలో ఈ అక్రమాల పర్వం రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీలు లాంటి భారీ యంత్రాలతో నదీ గర్భాలను గుల్ల చేస్తున్నారు. పేరుకు ఫ్రీ అంటున్నా ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. 18 టన్నుల లారీ ఇసుకను రూ.30 వేల నుంచి 60 వేల వరకూ అమ్ముతున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీఎత్తున ఇసుక నిత్యం అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు కరకట్ట బంగ్లాకు ఠంచనుగా చేరిపోతున్నాయి. ముఖ్యనేతకు కప్పం కట్టి ఎక్కడికక్కడ నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.– సాక్షి, అమరావతి, నెట్వర్క్తెలంగాణకు అక్రమ రవాణాఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక దందాలో ఆరితేరిపోయారు. పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, శనగపాడు గ్రామాల నుంచి రాత్రిళ్లు తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆళ్లూరుపాడు ఇసుక క్వారీ నుంచి పొక్లెయిన్లు, జేసీబీలతో లోడు చేసి లారీ లోడు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరులు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా లారీకి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి ఎంత కావాలన్నా సై అంటున్నారు. మున్నేరు నుంచి ఇసుక అక్రమంగా వైరా, మధిర తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. నిషేధిత జాబితాలో ఉన్న యనమలకుదురు, హైకోర్టు స్టే పరిధిలో ఉన్న పెదపులిపాక, సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన చోడవరం క్వారీల్లో సైతం యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.అమరావతిలో యథేచ్చగా అక్రమాలుగుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని గొడవర్రులో పొక్లెయిన్లతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. గుండిమెడ, పాతూరు, చినరావూరులో అనుమతులు లేకపోయినా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. కొల్లిపర, తెనాలి, చెరుకుపల్లి మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మల్లాది గ్రామం, అచ్చంపేట మండలం చింతపల్లి నుంచి ఇసుక అక్రమంగా కూటమి నేతలు తరలిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో ఇసుక హైదరాబాద్‌కు తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో పెసర్లంక, గాజుల్లంక, వోలేరు ప్రాంతాల్లోని కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు రేయి పగలు తేడాలేకుండా యంత్రాలతో తోడేస్తున్నారు.నెల్లూరు.. అందరూ అందరే..నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోని సంగం, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం డీ సిల్టింగ్ పాయింట్లకు గడువు పూర్తయినా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సూరాయపాలెంలో ఓ అధికార పార్టీ నేత నేరుగా నదిలోకి రహదారి ఏర్పాటు చేసి హిటాచీతో 12 టైర్ల టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. పల్లిపాడులో ఓపెన్ రీచ్‌లో యంత్రాలు ఉపయోగించి లోడింగ్ జరుగుతోంది. ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో భారీ యంత్రాలతో పెన్నా నదిలోకి బాటలు వేసి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రోజుకు 200కు పైగా టిప్పర్లు చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. లోకేశ్ టీమ్ పేరుతో మన్నేరు నుంచి టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కరేడు అటవీ భూముల్లో టీడీపీ నాయకుడు పోలుబోయిన శ్రీనివాసులు ఇసుకను హేచరీలకు తరలించారు.ప్రకాశంలో ఇష్టారాజ్యం ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా చెప్పిందే వేదంగా నడుస్తోంది. అన్నిచోట్లా టన్నుకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతోంది. కొండపి నియోజకవర్గం నుంచి ఒంగోలుకు ఇసుక తరలించే విషయంలో దామచర్ల సోదరుల వర్గీయుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. దామచర్ల అనుచరుల ప్రైవేటు సైన్యం వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కనుసన్నల్లో మాఫియా చెలరేగుతోంది. మార్కాపురంలో కూటమి నాయకుల నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి.పశ్చిమలో ఎడాపెడా బాదుడుపశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూసివేసినందున ఇసుక దొరకడంలేదు. దీంతో తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, జొన్నాడ, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ర్యాంపు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. భీమవరానికి లారీ ఇసుక చేరవేసేందుకు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 500 నుంచి 600 ట్రిప్పుల వరకు ఇసుక రవాణా జరుగుతుండగా.. అదనపు వసూళ్ల రూపంలో జిల్లాలోని వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోంది.గోదావరి గుల్ల గుల్ల.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిని గుల్ల చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నాయి. కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు 50కి పైగా లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ (18 టన్నులు) ఇసుకను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై రోడ్ కమ్ రైల్వే వంతెన, గామన్ వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. బ్రిడ్జిలు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అక్కడ ఇసుక తవ్వకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయినా కూటమి నేతలు లెక్క చేయకుండా రెండు బోట్ల ద్వారా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్విన గోతుల్లో ఇటీవల కొత్తపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు దుర్గాప్రసాద్ స్నానానికి దిగి మునిగిపోయి మరణించాడు.సిక్కోలులో మంత్రులకు వాటాలు!శ్రీకాకుళం జిల్లాలో అంబళ్లవలస, బట్టేరు, అంగూరు, బూరవల్లి, గార, గోపాల పెంట, కాఖండ్యాంలోని రీచ్‌లను కూటమి నేతలు తమకు కావాల్సిన వారికి ఇప్పించుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో సైలెంట్‌గా ఓ సెంట్రల్ మినిస్టర్.. వయలెంట్‌గా మరో మినిస్టర్ వాటాలు వసూలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన బినామీలతో రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆమదాలవలసలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు బూర్జ మండలం నారాయణపురం, చిన అంకలాం వద్ద భారీ లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక రీచ్‌లను సొంత జాగీర్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక వ్యాపారాన్ని ఇష్టానుసారం సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇసుక తన సరిహద్దు దాటాలంటే లారీకో రేటు ఫిక్స్ చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఇసుక డంపింగ్ కేంద్రాలు పెట్టించి తన కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు ఇసుకలో వాటాలు ఇస్తున్నారు.చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది, అరుణానదిలోని ఇసుకను ఒక ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు భారీ యంత్రాలతో తోడి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక రూ.60 వేల చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులే కీలక పాత్రపోషిస్తున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లి, భీమవరంలో స్వర్ణముఖి నదినుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చిత్తూరు రూరల్ మండల పరిధిలో బీఎన్‌ఆర్‌పేట రీచ్‌ను టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు అనుచరులు అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెర తీశారు. పలమనేరు నియోజక వర్గ పరిధిలోని కౌండిన్య నది, జీడిమాకనపల్లి, పెద్దచెరువులో కేటిల్ఫాం నుంచి వైయస్సార్ జలాశయం దాకా ఇసుకను ట్రాక్టర్లలో తోడి నిల్వ చేస్తున్నారు.కర్నూలులో దర్జాగా దందాకర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. సుంకేసుల, మునగాలపాడు, నిడ్జూరు, పంచలింగాల తదితర గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి ఒకరిని నియమించుకుని దర్జాగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మునగాలపాడు సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమార్కులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు హైదరాబాద్‌కు తరలి వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. రీచ్‌ల వద్ద అదనంగా రూ.1,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. 15 వేలు ఇవ్వాల్సిందే. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు చేరుతోంది. వైఎస్సార్ జిల్లాలో పచ్చ నేతల చేతివాటంవైఎస్సార్ జిల్లాలో కొండాపురం మండలం బెడుదూరు నుంచి స్థానిక టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెండ్లిమర్రి, కమలాపురం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరులు అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. నాగావళిని చెరబట్టిన ఇసుకాసురులు విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో టీడీపీ నాయకులు నాగావళిని చెరబట్టారు. జావాం సమీపంలో రెండు పొక్లెయినర్లతో రాత్రీపగలు తవ్వుతున్నారు. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పెంట, అలజంగి, కారాడ గ్రామాల వద్ద వేగావతీ నదీతీరంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లేకపోయినా వేలం పాట నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నాగావళి నదీతీరం వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి.వేదవతిని ఊడ్చేస్తున్న తమ్ముళ్లు..అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో వేదావతి హగరి నది చుట్టూ కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉంది. టీడీపీ నాయకులు చీకటి పడగానే జేసీబీలతో టిప్పర్లలో ఇసుక లోడ్‌చేసి బళ్లారి, బెంగళూరు, తుమకూరు, చిత్రదుర్గం, సండూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులను జేసీబీలతో తోడేస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నాటకకు భారీగా ఇసుక తరలిస్తున్నారు. రొద్దం, చిలమత్తూరు, పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం నుంచి రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిపోతోంది. -
ఏపీలో భారీ స్కామ్.. 840 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్
-
వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
-
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం
-
అప్పులు, అవినీతి, అరాచకాలు చంద్రబాబు సరికొత్త రికార్డులు
-
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సోదరుడి అరెస్ట్ లో కక్షసాధింపు
-
ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు
-
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు
-
వారి దయ, జనం ప్రాప్తం.. అదే పీ-4!
-
చంద్రబాబు ప్రభుత్వంపై రాచమల్లు శివప్రసాద రెడ్డి ఫైర్
-
ఏపీలో అప్పు తోనే ఆర్థిక ఏడాది మొదలు
-
ఇంటింటా మద్యం.. ఇదే బాబు విధానం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారని స్పష్టమవుతోంది. మద్యం షాపుల కోసం ఇతరులెవ్వరూ దరఖాస్తు చేసుకోనివ్వకుండా ఎక్కడికక్కడ బెదిరించారు. ఒకవేళ లాటరీలో ఇతరులెవరికైనా దక్కినా బలవంతంగా లాగేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ షాపులకు అనుబంధంగా సగటున ఒక్కో దుకాణానికి 10–15 బెల్ట్ షాపులను అనుచరులతో ఏర్పాటు చేయించారు. వాటి కోసం పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించారు. ఇలా ఒక్కో బెల్ట్ షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట 20 లక్షల వరకు దండుకున్నారు. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పి కంటే అదనంగా రూ.20 నుంచి 30 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.వెరసి వేళాపాళా లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పేదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిపోయింది. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా.. ‘తాగండి.. తూగండి’ అంటూ ఇంటింటా మద్యం వరద పారించడమే తమ విధానం అన్నట్లు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు.అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన చెందడంతో జనవరి 29న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన మహబూబ్ బాషా (32) మితిమీరి మద్యం తాగి.. స్పృహ కోల్పోయి గత అక్టోబర్ 17న మరణించాడు. ఇతడి మృతితో అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. ఇలాంటి దీన గాధలు ఊరూరా కనిపిస్తున్నాయి.పర్మిట్ రూమ్‌లతో పని లేకుండానే బార్లను తలపించేలా సిట్టింగ్, చికెన్ చీకులు, సోడాలు, ఆమ్లెట్లు, సిగిరెట్ల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా అడ్రస్ పెట్టి డబ్బులు ఆన్లైన్లో చెల్లిస్తే ప్రత్యేకంగా డోర్ డెలివరీ సౌకర్యం కూడా కల్పించారు.ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని మద్యం షాపుల్లో థాయ్‌లాండ్, శ్రీలంక, బ్యాంకాక్, మారిషస్ టూర్లు.. అంటూ లక్కీ డిప్ పెడుతుండటం శోచనీయం.ఇది నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో మద్యం దుకాణం. వైన్ షాపు పక్కనే కూల్‌డ్రింక్స్ షాపు పేరుతో బెల్టు దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడ ఎనీటైం మద్యం అందుబాటులో ఉంచారు. బెల్టు దుకాణంలో మాత్రం బాటిల్‌పై అదనంగా రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. కానీ.. అధికారులకు మాత్రం కన్పించదు.సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్వర్క్: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఊరూ.. వాడా.. మద్యం ఏరులై పారుతోంది. ఆదాయమే తప్ప సామాజిక బాధ్యతను పట్టించుకోని ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్ లిక్కర్ ఇస్తానని హామీలు గుప్పించారు. అ«ధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలతో ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పాటయ్యాయి. దుకాణాలకు దరఖాస్తు చేయడం మొదలు బెల్ట్ షాపుల ఏర్పాటు వరకు అడ్డగోలుగా అక్రమార్జనకు తెరతీశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకింత.. నా కింత అంటూ దండుకుంటున్నారు. ఇందులో భాగంగా దుకాణాల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్రలకు పాల్పడింది. అడిగిన మేరకు కమీషన్ లేదా ఉచిత వాటా ఇస్తారా.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు బరితెగించి బెదిరింపులకు దిగారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తే వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. దారికిరాని వారిపై దాడులు కూడా చేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. కొన్ని చోట్లయితే ఖర్చులు చెల్లించి బలవంతంగా దుకాణాలను చేజిక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకే సామాన్య వ్యాపారులు భయపడ్డారు. మొత్తం 3,396 మద్యం దుకాణాల్లో ఏకంగా 80 శాతం షాపులు టీడీపీ సిండికేట్లు దక్కించుకోగా, మరో 20 శాతం వేరే వాళ్లకు లైసెన్స్‌లు వచ్చినప్పటికీ వారిని బెదిరించి మరీ సిండికేట్‌లో విలీనం చేయించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్‌లు కట్టబెట్టడంలోనూ మరోస్కామ్‌కు పాల్పడ్డారు. టెండర్లలో శాతం మార్జిన్ పెట్టి, అవన్నీ ఖరారై ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 14 శాతం మార్జిన్ పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. రూ.99 చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా మద్యం షాపుల్లో విక్రయించే ప్రతి బాటిల్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు ప్రాంతాన్ని బట్టి ‘ముఖ్య’ నేతకు కమీషన్ ఇచ్చేలా వ్యవహారం సాగింది. ఇలా ప్రతి నెలా కమీషన్‌తోపాటు ధరల పెంపుతో ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్లు దక్కాయని సమాచారం. ఈ అక్రమ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వ కీలక నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడి, బడి.. ఎక్కడపడితే అక్కడ బెల్ట్షాపులుగత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి, బడి లేదు.. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటయ్యాయని ఇటీవల తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో టిఫిన్, జ్యూస్ సెంటర్లు, పాన్‌షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. అది కూడా ఒక్కో బెల్ట్ షాపునకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ప్రాంతాన్నిబట్టి రూ.20 లక్షల వరకు వేలం పాట ద్వారా రాబట్టుకున్నారు. దీంతో సమీపంలోని లైసెన్స్ మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల నిర్వాహకులు రోజువారీగా మద్యం తెచ్చుకుని క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 మేర అధిక ధరలకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.50 కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. లైసెన్స్ మద్యం దుకాణాలకు సమయాలు నిర్దేశించినప్పటికీ ఎక్కడా వేళాపాళా లేకుండా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ముందు గేటు మూసివేసి, వెనుక నుంచి.. కిటికీ లోంచి విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి వేళ మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇక బెల్ట్షాపులైతే 24 గంటలూ అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో యథేచ్చగా మద్యం మాఫియా రాజ్యమేలుతోందనడానికి ఇదే నిదర్శనం. కర్నూలు జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం పరిధిలోని బెల్టు దుకాణాల్లో కర్ణాటక మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు సమీపంలోని కర్ణాటక నుంచి మద్యం తెప్పించి బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో బెల్టుషాపులో మద్యం అమ్మకాల జోరు, తిరుపతి జిల్లా చిట్టమూరులో ఫోన్లో ఆర్డర్ తీసుకుని వాహనంలో డోర్ డెలివరీ చేస్తున్న మద్యం పెరిగిపోతున్న గొడవలు, అరాచకాలురాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుగ్రామంలో సైతం మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా మంది రోజూ తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తాగిన మైకంలో బాలికలు, మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పేద కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య గొడవలు పెరిగిపోయాయి. కొద్ది నెలలుగా నిత్యం పోలీస్స్టేషన్లకు పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం.వైఎస్ జగన్ అలా.. చంద్రబాబు ఇలా..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సారా డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. తొలి నుంచి మద్యం పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మద్య నిషేధాన్ని అటకెక్కించిన చంద్రబాబు.. తన పార్టీ నేతలు, బడాబాబుల నేతృత్వంలో మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మద్యంను తన వాళ్లకు ఆదాయ వనరుగా మార్చేశారు. చంద్రబాబు విధానాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, మహిళల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేశారు. మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరచడం, మద్యపానంపై నియంత్రణ పాటించడమే ప్రధాన లక్ష్యంగా పాలసీని రూపొందించారు. వేళపాళా లేకుండా అధిక ధరలకు అమ్మే సిండికేట్ వ్యవస్థకు చెక్ పెట్టారు. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించారు. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు జరిపించారు. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 33 శాతం షాపులను తీసేశారు. షాపులకు అనుబంధంగాఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. రాష్ట్రంలోని 43,000 బెల్టుషాపులను ఎత్తివేశారు. మద్యం విక్రయించే వేళలను కూడా పరిమితం చేశారు. ప్రతి ఊరికీ ఒక మహిళా పోలీసును పెట్టారు. ఎక్సైజ్‌కు సంబంధించి నేరాలకు పాల్పడితే అంగీకరించే ప్రశ్నే లేదని కఠినంగా వ్యవహరించిన విషయం విదితమే. లిక్కర్ టెస్టింగ్ కోసం కొత్త ల్యాబులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీల్లో 14 సంస్థలకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు ఇవ్వగా, మిగిలిన వాటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా మద్యం విక్రయాలు తగ్గాయి.జగన్ హయాంలో సెబ్ ద్వారా ఉక్కుపాదంమద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. సెబ్ సిబ్బంది ప్రత్యేక చెక్ పోస్టులుపెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. భారీ ఎత్తున దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు, మద్యం, సారా అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించి, క్షేత్ర స్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహించింది. సెబ్ దూకుడుగా వ్యవహరించినిందితులను పట్టుకుని వేలాది కేసులు నమోదు చేసింది. నవోదయం–పరివర్తన పేరిట సారా తయారీ కేంద్రాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్‌లు ఇచ్చి వారు ఆ వృత్తిని వదిలేసేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలేవీ కనిపించడంలేదు.మహిళలపై పెరుగుతున్న దాడులుగత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 4, 5 బెల్టు షాపులను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలకు తీరని నష్టం కలుగుతోంది. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. నూతన మద్యం పాలసీ అంటే ఇదేనా? – కంచర్ల పద్మావతి, పరిటాల, ఎన్టీఆర్ జిల్లాఇంతలో ఎంత తేడా?రాష్ట్రంలో 1990 దశకంలో మద్యానికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమం పెల్లుబికి 1995లో ఎన్టీఆర్ సీఎంగా మొదటి సంతకం మద్య నిషేధంపై చేశారు. రెండేళ్లు అమలులో ఉంది. ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన అల్లుడు చంద్రబాబు నిషేధం ఎత్తేశాడు. వైఎస్ జగన్ వచ్చాక మాత్రమే చిత్తశుద్ధితో కూడిన దశల వారీగా మద్య నియంత్రణ సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఇంతలో ఎంత తేడా? – ఈదర గోపీచంద్, సోషల్ యాక్టివిస్టు, నరసరావుపేటగిరిజనులు బానిసలు అవుతున్నారుజిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అనేక దుకాణాల్లో కూల్ డ్రింక్‌ల మాదిరిగా మద్యం బాటిళ్లను అమ్మడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగి, గిరిజనులు మద్యానికి బానిసలవుతున్నారు. గిరిజన కుటుంబాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోంది. – వి.వి.జయ, అరకులోయ, అల్లూరి జిల్లామద్యం షాపులను ప్రభుత్వమే నడపాలిరాష్ట్రంలో మద్యం ఏరులై పారించి ప్రభుత్వ ఖజానాకు దండిగా కాసులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీధివీధిలో బెల్టుషాపులు తెరిపించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. నాణ్యమైన మద్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే ఈ మద్యం ఎంత తాగినా ప్రమాదం కాదా? తాగి తాగి రోగాల పాలైతే ఎవరు జవాబుదారీ? కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించి అమ్మకాలు పరిమితం చేయాలి. – సావిత్రి, అనంతపురంపచ్చని పల్లెల్లో చిచ్చుపచ్చని పల్లె సీమల్లో మద్యం భూతం బెల్టు రూపంలో చిచ్చు పెడుతోంది. పేదలు సంపాదనను తాగుడుకు తగలేస్తున్నారు. దీని వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మద్యానికి బానిసలైతే పనులు చేయలేరు. అప్పుడు తినే తిండికి కూడా కష్టం అవుతుంది. వెంటనే మద్యం కట్టడి చేయాలి.– జ్యోతి, యానాది కాలనీ, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు కూటమి ప్రభుత్వం కుట్ర
-
వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం
-
జగన్ భవనాలు కట్టిస్తే తప్పు.. అమరావతికి వేలకోట్ల అప్పు కరెక్ట్.. బాబు గారూ మీరు సూపర్
-
APలో పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
-
ఈనెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
-
అమరావతి ఫర్ సేల్.. మొదలైన టీడీపీ రియల్ దందా!
-
పీ4 మోసం.. రెడ్ బుక్ గోల.. యువరాజు చెప్పిందే వేదం
-
చంద్రబాబు చేతకానితనమే..
-
పోలీసులపై రెడ్ బుక్ జులుం
-
Magazine Story: రెడ్ బుక్ రాజ్యాంగం కాదు.. ఏపీలో హంతక రాజ్యం
-
పోలీసుపై రెడ్ బుక్ రూల్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.వెయిటింగ్లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
కర్నూల్ లో రంజాన్ వేడుకలు.. నల్ల రిబ్బన్లతో నిరసన
-
పండగపూట సభలో బాబును ఛీ కొట్టిన జనం
-
పీ4..అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అఘాయిత్యాలు పెరిగాయి: జక్కంపూడి రాజా
-
సూపర్ సిక్స్ పై చంద్రబాబు పిల్లి మొగ్గలు
-
కాంట్రాక్ట్ లెక్చరర్ కు రెడ్ బుక్ వేధింపులు
-
ఎంపీటీసీ సత్యశ్రీ అరెస్టెపై YSRCP నాయకుల ఆగ్రహం
-
Big Question: హైందవ ధర్మానికి అడ్డంకులు.. వేసేది సనాతని వేషం.. చేసేది చిల్లర రాజకీయం
-
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/మంగళగిరి/మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ రవి పటాన్శెట్టిని వైద్యమిత్రలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్యసేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆరోగ్యమిత్రలు తరలివచ్చి ఆందోళన చేశారు. బీమా విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్లు..⇒ వైద్యమిత్రలకు కేడర్ కల్పించాలి.. బీమా విధానాన్ని అమలుచేయాలి.. ⇒ డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రతలేదు..⇒ 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి..⇒ ఉద్యోగి మృతిచెందితే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలి..⇒ అందరికీ సర్వీసు వెయిటేజీ కల్పించాలి..⇒ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి.ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి..ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకం. మా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు అందజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను అమలుచేసి ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి. – ఎం ప్రత్యూష, గుంటూరుఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి..ప్రభుత్వానికి, ఆస్పత్రులకు, రోగులకు అనుసంధానంగా వుండే ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం అమలుచేయాలి. ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి. ఇటీవల మృతిచెందిన ఆరోగ్యమిత్రల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. – జీ నాగరాజు, ఆసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాంఆరోగ్యమిత్రల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీసం వేతనాలు అమలుచేయాలి. మేం ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమలులో ఎంతో సేవచేస్తున్నాం. రోగులను ఆస్పత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాం. – సత్యలక్ష్మి, ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు -
నిన్ను సీఎంని చేసినందుకు మా చెప్పుతో కొట్టుకోవాలి..
-
కూటమి ప్రభుత్వ అసమర్థతను చెప్పకనే చెప్పిన యార్లగడ్డ
-
ఏపీ సర్కార్, పోలీసులపై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్!
-
బడుగు బలహీన వర్గాలపై కూటమికి ప్రేమ లేదు: బొత్స
-
గిట్టబాటు ధరల్లేక, ప్రభుత్వం పట్టించుకోక రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
Big Question: డీఎస్సీ నోటిఫికేషన్ పై బాబు మరో అబద్ధం?
-
KSR Live Show: హామీలు అమలు చేయం.. రెడ్ బుక్ అరాచకాలే ముఖ్యం
-
రాసిపెట్టుకోండి.. ఇది నా మాట.. అధికారంలోకి వస్తాం.. 50 వేలు ఇస్తాం
-
రెడ్ బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగపెడుతున్న కూటమి
-
‘రెడ్‌బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీలో బాబు సర్కార్ వచ్చాక మొక్కుబడి తతంగంగా మారిన విద్యాహక్కు చట్టం
-
శ్రీవారిని అరకు కాఫీతో పోలుస్తారా? బాబుపై భూమన ఫైర్
-
అబద్ధాల కూటమి.. మోసమే బాబు ఎజండా
-
అంతా కనికట్టు.. ఆధారం ఉంటే ఒట్టు!
-
ఏపీ ప్రజలపై పెట్రోల్ బాదుడు
-
బాబు జాబు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊస్ట్
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
-
చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరికాష్ట: భూమన కరుణాకర్ రెడ్డి
-
కూటమి తప్పుడు ప్రచారాలపై CBI సీరియస్
-
జగన్ నామ స్మరణతోనే ముగిసిన AP అసెంబ్లీ
-
విశాఖ క్రికెట్ స్టేడియానికి YSR పేరు తొలగించడం దారుణం: నారాయణస్వామి
-
ఏపీని అప్పుల్లో ముంచుతున్న బాబు
-
మీరు ట్రైలర్ చూపిస్తే.. మేం సినిమా చూపిస్తాం
-
ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం... ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేసిన కేంద్రం
-
క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడం అన్యాయం
-
ఫ్రీ బస్సేది బాబూ
-
50 ఏళ్లుగా 20 కుటుంబాలు నివసిస్తోన్న ఇళ్లను కూల్చివేశారు
-
ఎన్నికల ముందు ఎంత బిల్డప్పు.. తుస్సుమున్న సూపర్ లీడర్లు
-
విశాఖలో కూటమి నాయకుల ఉన్మాద చర్య
-
2 లక్షల కోట్లు.. కమింగ్ సూన్
-
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్‌ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్‌కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్‌చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
అవినీతి నిత్య ‘సత్యం’
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో..! లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య‘సత్యం’గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లపై కన్నేసిన ఆయన ముందే కొన్ని సంస్థలతో డీల్ కుదుర్చుకుని వాటికి పనులను కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలను ఆస్పత్రులకు, ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్ఐడీసీ కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు వందల వాహనాలతో.. మూడేళ్ల కాల పరిమితితో టెండర్లను పిలిచారు. కాంట్రాక్టు పరిమితి ముగిశాక మరో రెండేళ్లు పొడిగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఈ సేవలకు ప్రభుత్వం వెచ్చించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది!!అస్మదీయుడికి కట్టబెట్టేలా పక్కా ప్రణాళికగతంలోనూ అత్యవసర వైద్య సేవల్లో అక్రమాలకు తెర తీయగా.. ఆ ఆశలపై ప్రభుత్వ పెద్దలు నీళ్లు చల్లడంతో.. ప్రత్యామ్నాయంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై సదరు నేత దృష్టి సారించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులను పిలిచి బెంగళూరుకు చెందిన తన సన్నిహితుడి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మార్చితో ప్రస్తుత కాంట్రాక్ట్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారని అధికారులు నివేదించడంతో.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త కాంట్రాక్ట్‌నే తమవారికి కట్టబెట్టేలా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ నిబంధనలన్నీ అస్మదీయ సంస్థకు అనుగుణంగా రూపొందించేలా అమాత్యుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సదరు సంస్థకు సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో కన్షార్షియంలో ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థ అనుభవాన్ని వాడుకునేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. ఓ సంస్థకు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకుని, ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించే వెసులుబాటుతో అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. సాధారణంగా ఒకే బిడ్ దాఖలైన సందర్భాల్లో బిడ్‌ను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ టెండర్లకు వెళుతుంది. గత ప్రభుత్వంలో ఇదే నిబంధనతో ఇవే టెండర్లను నిర్వహించారు. అయితే తాజా టెండర్లలో మాత్రం ఒకే బిడ్ వచ్చినా ఆమోదించే అవకాశాన్ని సృష్టించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ముందే ఓ సంస్థను నిర్ణయించుకుని పేరుకు టెండర్ల తంతు నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది.కాంట్రాక్ట్ లేకుండానే..తిరుపతికి చెందిన జనరిక్ మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట అమాత్యుడు ఇప్పటికే అవినీతికి తెర తీశారు! తాను డీల్ కుదుర్చుకున్న సంస్థతోనే ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు ఎంవోయూ కుదుర్చుకుని మందులు కొనుగోలు చేసేలా వైద్య శాఖ అధికారులతో నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇప్పించారు. ప్రభుత్వ బోధనాస్పత్రులకు డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్లో సరఫరా కాని వాటితో పాటు అత్యవసర మందులు, సర్జికల్స్‌ను ఏటా రూ.50 కోట్లకుపైగా వెచ్చించి స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఒకే సంస్థకు మేలు జరిగేలా అమాత్యుడు చక్రం తిప్పారు. మంత్రి డీల్ చేసుకున్న సంస్థతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకునేలా గతేడాది ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఎంవోయూలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన రెండేళ్లలో రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.‘‘అత్యవసర’’ ఆశలపై నీళ్లు..!టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైద్య శాఖలో అత్యవసర సేవల నిర్వహణపై కన్నేసిన సదరు అమాత్యుడు ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థను టార్గెట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం అమాత్యుడిని శరణు కోరగా.. తాను చెప్పిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇందుకు సరేనన్న యాజమాన్యం అమాత్యుడు సిఫార్సు చేసిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ కోసం వైద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ దశలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని.. సబ్ కాంట్రాక్ట్‌లు కుదరవని, తమ అస్మదీయుడికి అత్యవసర వైద్య సేవల కాంట్రాక్ట్ కట్టబెడతామని చెప్పడంతో చేసేదేమీ లేక అమాత్యుడు సైలెంట్ అయిపోయారు. -
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలిచ్చి.. తమను నమ్మించి వంచించారని వలంటీర్లు మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, తొమ్మిది నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 వేలకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సత్తా ఏపాటిదో భవిష్యత్‌లో కూటమి నేతలకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం వారు విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడానికి, కూటమి ప్రభుత్వ పెద్దలు 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ మనుగుడలో లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు 2024 మే నెల వేతనాలను జూన్ ఒకటిన ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గత మార్చిలో హామీ ఇవ్వడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో ఆ వ్యవస్థ అమలులో లేకపోతే, దానిపై 2024 మార్చిలో ఎలా హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టి, 2014–19 మధ్య ఉన్న జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకొచ్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పుట్టని బిడ్డతో ఓట్లెలా వేయించుకున్నారు?వలంటీర్ల విషయంపై ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడం అన్యాయం అని వలంటీర్ల సంఘం ప్రతినిధులు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే మాట చెప్పారని, ఆ తర్వాత నెల రోజులకే మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటప్పుడు పుట్టని బిడ్డకు ఎలా మాయ మాటలు చెప్పారని, వారితో ఎలా ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలైన వలంటీర్లను తాము నెత్తిన పెట్టుకొని మోయాలా.. అని మంత్రి లోకేశ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారికి పార్టీలతో సంబంధం ఉండదని గుర్తు చేశారు. వలంటీర్లలో ఎక్కువ మంది ఆడపడుచులే ఉన్నందున, తాము వారికి అన్యాయం చేయమంటూ ఎన్నికల ముందు మాట్లాడిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. తమకిచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.సీఐటీయూ అనుబంధ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లంతా సంఘటితమై సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరావు మాట్లాడుతూ మొన్నటి విజయవాడ వరదల్లోనూ వలంటీర్ల సేవలు వినియోగించుకున్న ప్రభుత్వం, ఇపుడు ఆ వ్యవస్థ లేదని మాట్లాడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ ధర్నాకు వలంటీర్ల సంఘ ప్రతినిధులు పిజానీ, శ్యామలా ప్రసాద్ అధ్యక్షత వహించారు. -
నీకది.. నాకిది 'నాకింత.. నీకింత'!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతల లాలూ‘ఛీ’ పర్వం బట్టబయలైంది! టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయక ముందే అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలు జరిపి, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలను నిర్దేశించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు. ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) రూ.10,081.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులను ముఖ్యనేత అత్యంత సన్నిహితులకు చెందిన ఆరు కాంట్రాక్టు సంస్థలకు పంచి పెట్టడమే అందుకు నిదర్శనం. 2014–19 మధ్య ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకి పట్టుబడ్డ అధికారే నేడు రాజధాని నిర్మాణ టెండర్లలోనూ కాంట్రాక్టర్లతో బేరసారాలు సాగిస్తుండటం గమనార్హం. పనులు అప్పగించి కాంట్రాక్టర్లతో ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోగానే అంచనా వ్యయంలో 10 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పించేసి.. అందులో తిరిగి 8 శాతాన్ని ఆ అధికారి ద్వారా కమీషన్‌గా వసూలు చేసుకునే దిశగా ముఖ్యనేత వేగంగా అడుగులు వేస్తున్నారు. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూరుస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాయని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు రాజధాని టెండర్లలో ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెర తీసింది.రూ.31 వేల కోట్ల రుణ ఒప్పందాలు..రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్లు వెరసి ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో ఏడీసీఎల్, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది. ఏడీసీఎల్ రూ.10,714.57 కోట్లకు.. సీఆర్డీఏ రూ.20,358.83 కోట్లకు కలిపి మొత్తంగా రూ.31,073.4 కోట్లతో ఇప్పటివరకూ రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాయి. ఇందులో ఏడీసీఎల్ రూ.10,081.82 కోట్లతో పిలిచిన 35 పనుల టెండర్లను ఇటీవల ఖరారు చేశారు.ఇతరులు బిడ్ వేస్తే అనర్హత వేటే..ముఖ్యనేతలు ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు ఎవరైనా బిడ్ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి.. అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో రెండో ప్యాకేజీ (నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులే అందుకు నిదర్శనం. ఆ పనులకు హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. 3.98 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా(మంత్రి నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ ఎం.భరత్‌కు అత్యంత సన్నిహితుడైన ముప్పాన వెంకటరావుకు చెందిన సంస్థ)కు ఆ పనులను కట్టబెట్టారు. ఇక ఎన్–18 రహదారి (ప్యాకేజీ–5) నిర్మాణ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన హజూర్ మల్టీ ప్రాజెక్టŠస్ సంస్థపై అనర్హత వేటు వేసి... వాటిని బీఎస్సార్ ఇన్ఫ్రా (సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన సంస్థ) 3.18 శాతం అధిక ధరలకు కట్టబెట్టారు.అన్ని పనులూ అధిక ధరలకే..ఏడీసీఎల్ 35 పనులకు పిలిచిన టెండర్లలో ముఖ్యనేతలు ఎంపిక చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్(ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన సంస్థ), బీఎస్సార్.. ఎన్సీసీ (ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఏవీ రంగారాజు ఎండీగా ఉన్న సంస్థ).. బీఎస్పీసీఎల్ (సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన సంస్థ), మేఘా, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. ఆర్వీఆర్ ప్రాజెక్స్‌కు రూ.2,539.72 కోట్ల విలువైన 8 పనులు.. బీఎస్సార్ ఇన్ఫ్రాకు రూ.2,170.81 కోట్ల వ్యయంతో కూడిన 9 పనులు, ఎన్సీసీకి రూ.2,645.96 కోట్లు విలువైన 8 పనులు, బీఎస్సీసీఎల్‌కు రూ.748.75 కోట్లు వ్యయంతో చేపట్టిన 4 పనులు, మేఘాకు రూ.1,182.54 కోట్లు విలువైన 4 పనులు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు రూ.794.04 కోట్లు విలువ చేసే రెండు పనులను కట్టబెట్టారు.లాలూ‘ఛీ’కి ఇదిగో తార్కాణం..⇒ రాజధాని ముంపు నివారణ పనుల్లో ఒకటో ప్యాకేజీ (కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులకు రూ.462.25 కోట్లతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ఎల్–1గా నిలిస్తే... 4.35 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.69 శాతం అధిక ధరలకు కోట్ చేసిన మేఘా ఎల్–3లుగా నిలిచాయి. ⇒ రాజధాని ముంపు నివారణ రెండో ప్యాకేజీ పనులకు రూ.303.73 కోట్ల వ్యయంతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.84 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఎల్–1గా నిలిస్తే... 4.40 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.76 శాతం అధిక ధరకు కోట్ చేసిన మేఘా ఎల్–3గా నిలిచాయి. ⇒ ఈ రెండు ప్యాకేజీల టెండర్లలో దాఖలైన బిడ్లను గమనిస్తే కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతలు లాలూఛీ పడినట్లు స్పష్టమవుతోంది. ఇవే కాదు మిగతా 33 ప్యాకేజీల పనుల్లోనూ ఇదే కథ.అంచనాల్లోనే వంచన...⇒ రాజధాని ముంపు నివారణ పనుల అంచనాల్లోనే వంచనకు తెర తీశారు. అమరావతి ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు లాంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. ఒకటో ప్యాకేజీలో కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించాలి. కొత్తగా 7.843 కి.మీ పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వేందుకు ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, పది నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ లాంటి పన్నులతో కలిపి) మించదని జలవనరుల శాఖలో పలు ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు కలిపినా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్‌ఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద రాజధాని ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టుగా కాంట్రాక్టు వర్గాలే లెక్కలు వేస్తున్నాయి.మిగిలిపోయిన రోడ్డు పనులకు..దేశంలో ఒక కి.మీ. పొడవున ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిని సగటున రూ.20 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అది కూడా అన్ని రకాల పన్నులు జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన వాటికి కి.మీ.కి గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని చేయడం గమనార్హం. -
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్‌గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్‌కి మోడల్ స్కూల్‌గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
రూ.11 వేల కోట్ల అప్పు కోసం హడ్కోతో CRDA ఒప్పందం
-
కూటమి ప్రభుత్వ చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి
-
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు
-
సెకీ ఒప్పందం రద్దు కుదరదు
-
మెజిస్ట్రేట్ ఎదుట కన్నీరుపెట్టుకున్న పోసాని
-
9 నెలలుగా విధ్వంసం.. ఇంకా నాలుగేళ్ళు ఇంతేనా?
-
చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది : కళ్యాణి
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు
-
ఒరేయ్ పిచ్చోల్లారా.. ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం!
-
పోసాని కృష్ణ మురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు
-
మంగళవారం అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు
-
కూటమి ప్రభుత్వంపై ఇవాళ YSRCP యువత పోరు
-
బాబుంటే జాబు రాదంతే.. జాబ్ క్యాలెండర్ హామీ ఉందా?
-
ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్‌కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు
-
ఈ నెల 12న యువత పోరుతో రాష్ట్రవ్యాప్త ధర్నాలకు YSRCP నిర్ణయం
-
కూటమి ప్రభుత్వంలో కనిపించని కందిపప్పు పంపిణీ
-
దేవాలయాలు, ఆశ్రమాలపై కూటమి కన్ను
-
వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విష ప్రచారం చేస్తోంది
-
వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం
-
కూటమి సర్కార్ పాలనలో మహిళలకు రక్షణ లేదు
-
రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సెల్యూట్
-
ఏపీలో మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట భారీ కుంభకోణం
-
కుట్రలు.. కుతంత్రాలు, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్
-
కూటమి పాలనలో కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
-
అబద్ధాల సృష్టికర్తకు.. తుప్పు వదిలింది
-
ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు