
చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే ప్రాంతాల్లో టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతోన్నాయి. దళితులు టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే అపనమ్మకంతో రేపు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున ప్రత్యేక బస్సులను కూడా టీడీపీ నేతలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రేపు ఓటింగ్ ప్రారంభం కాకముందే గ్రామాల నుంచి దళితులను బలవంతంగా తరలించేందుకు టీడీపీ సన్నాహాలు మొదలు పెట్టింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రగిరిలో కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు